21, ఫిబ్రవరి 2019, గురువారం

సమస్య - 2937 (హిమగిరి మండెను...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమద్య ఇది....
"హిమగిరి మండెను భగభగ హేమంతమునన్"
(లేదా...)
"భగభగ మండుచుండె హిమపర్వతమే చలికాలమం దయో"
(ఈ సమస్యను పంపిన డా. రాంబాబు గారికి ధన్యవాదాలు)

85 కామెంట్‌లు:



  1. అమరులయిరే జవానులు
    విమతపు బుద్ధుల మనుజుల వికటాట్టహసం
    బు! మరణ మృదంగమదిగో
    హిమగిరి మండెను భగభగ హేమంతమునన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      సమకాలీనాంశంతో చక్కని పూరణ నందించారు. అభినందనలు.

      తొలగించండి
  2. సమరము జేయగ వనిలో
    నుమతా పొందగ గిరీశు నుత్సుకమునతో
    కొమరిత తపమును గాంచుచు
    హిమగిరి మండెను భగభగ హేమంతమునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మంచి పూరణ. అభినందనలు.
      మొదటి పాదాన్ని "అమలిన తపమును జేయగ" అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
    2. సారు చేసిన బహు సవరణలతో: 👇

      అమలిన తప మొనరింపగ
      నుమ తా పొందగ త్రినేత్రు నుత్సుకమున నా
      కొమరిత కుందుట గాంచుచు
      హిమగిరి మండెను భగభగ హేమంతమునన్

      తొలగించండి
  3. సమరస భావము లేకను
    మమతలు లేనట్టి జనులు మాత్సర్యము నన్
    సమితము నందున మునుగగ
    హింగిరి మండెను భగభగ హేమంత మునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఎక్కడ పట్టారు ఈ 'సమిత' శబ్దాన్ని?

      తొలగించండి
    2. చివరి పాదం "హిమగిరి " అని ఉండవలెను
      ఇక " సమితము =యుద్ధము [తెలుగు నిఘంటువు ]

      తొలగించండి
  4. అమరులు బంపగ కంతు డు
    సుమ బాణము వేయ శివుడు జూడగ జిమ్మె న్
    నయన పు మంట ల కపు డా
    హిమ గిరి మండెను భగభగ హేమం త ము నన్

    రిప్లయితొలగించండి
  5. మైలవరపు వారి పూరణ

    తెగబడి క్రూరులై యుసురు తీయగ నల్బదినాల్గుమందికిన్ !
    వగచెను దేశమాత ., తన వారిని కోల్పడి భారతీయులున్
    రగులుచునుండ , చిత్తములు గ్రక్కుచునుండగ పౌరుషాగ్నులన్
    భగభగ మండుచుండె హిమపర్వతమే చలికాలమం దయో !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  6. రమణీయంబగు కాశ్మీ
    రమందు ఖలు ముష్కరాళి రాక్షస క్రియతో
    నమరులయిన వీరుల గని
    హిమగిరి మండెను భగభగ హేమంతమునన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కాశ్మీరమునన్...' అంటే పద్యం నడక ఇంకా బాగుంటుంది.

      తొలగించండి
  7. తెగబడి ముష్కర మూకలు
    పగతో భారత జవాన్ల ప్రాణము తీయన్
    వగచెను భారత దేశము
    హిమగిరి మండెను భగభగ హేమంతమునన్

    రిప్లయితొలగించండి
  8. విమ తులు కుట్రలు బన్ని యు
    సమరస భావం బు వీడి సైనిక చ య మున్
    యమ భటుల వలె ను గాల్చ న్
    హిమగిరి మండెను భగభగ హేమం త ము నన్

    రిప్లయితొలగించండి
  9. ( శివతపోభంగము - మన్మథదహనము )
    ధగధగలాడ భూషలవి ,
    తన్వియె మానసభక్తిపుష్పముల్
    నిగనిగలాడ , శంభునకు
    నిండుగ మ్రొక్క , రతీశు నమ్ములే
    యెగుచుచు దాక వక్షము , మ
    హేశ్వరు మూడవకంటి మంటలో
    భగభగ మండుచుండె హిమ
    పర్వతమే చలికాల మందయో !
    (ఎగుచుచు - తరుముచు ; భూషలు - ఆభరణములు )

    రిప్లయితొలగించండి


  10. రగులుచు తీవ్ర వాదమున రాష్ట్రము సీ! తను కస్మలంబయెన్
    పగిలెను గుండె లెల్లెడ ! జవానుల చంపిరి! యుగ్ర వాదమే
    నెగడుచు దేశధర్మమును నెమ్మిని ద్రోయుచు భాస్వరంబవన్
    భగభగ మండుచుండె హిమపర్వతమే చలికాలమం దయో!


    జిలేబి

    రిప్లయితొలగించండి

  11. నిన్నటి సమస్యకు నా పూరణము.

    కంసవధప్రధానపటుకారణభూతవిధానమేదొ?, వి
    ధ్వంసనదుష్టశీలిశిశుపాలగళాంచితఖండనాదివి
    స్రంసమతోగ్రవాదిశఠశాఠ్యవిధాయకనీతియేదొ?,యా
    హింసయె కల్గఁ జేయును మహీతలమందు హితార్థసిద్ధులన్.

    " శఠే శాఠ్యం సమాచరేత్" నీతి.

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల.

    రిప్లయితొలగించండి
  12. సమస్య :-
    "హిమగిరి మండెను భగభగ హేమంతమునన్"

    *కందం**

    దమయంతను లడ్డు దుకా
    ణమందు మంట చెలరేగి నలుదిక్కులకున్
    క్రమముగ జేరి తిరుమల,మ
    హిమగిరి మండెను భగభగ హేమంతమునన్". ‌
    .................✍చక్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చక్రపాణి గారూ,
      చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
  13. నిగనిగలాడు దేహ రుచి;నిర్మల శాంత ప్రశాంత భావనల్;
    మగువ పతివ్రతాత్వము;క్షమాగుణ సంపద గల్గు సీత,నొ
    వ్వగ,గనె రావణాసురుని,వంచనశీలుని,భీతచిత్తయై--
    భగభగ మండుచుండె హిమ పర్వతమే చలికాలమందయో!!

    రిప్లయితొలగించండి


  14. సొమసిల్లని నటరాజుని
    గమకంబున నర్ధనారి కాలంజరితో
    డమలిన శృంగారంబున
    హిమగిరి మండెను భగభగ హేమంతమునన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  15. విమతుల నడ్డెడు సైన్యము
    కుమతుల క్రూరత జరిపిన కుట్రకు బలియై
    అమరత్వము నొందె నయ్యో!
    హిమగిరి మండెను భగభగ హేమంతమునన్

    రిప్లయితొలగించండి
  16. యమకింకరులై వైరుల
    సమూహములు క్రమముతప్పి సైన్యము నడుచన్
    అమర జవానుల కనుగొని
    హిమగిరి మండెను భగభగ హేమంతమునన్

    రిప్లయితొలగించండి
  17. సుమదేహ హైమవతి తా
    బ్రమధాధిపు శివునిగోరి శ్రమమును జేయన్
    నుమయని దల్లియె జీరగ
    హిమగారి మండెను భగభగ హేమంతమునన్

    రిప్లయితొలగించండి
  18. కందమం. విమతులు దండెత్తగ గని
    సమరమున కుపక్రమింప. సాగెను పోరున్
    సమసిరి జవాను లెందరొ
    హిమగిరి మండెను భగభగ హేమంతమునన్

    రిప్లయితొలగించండి


  19. సుమనాస్త్రునిశర ధాటికి
    నమితోగ్రుండైపురహరు డావేశముతో
    శమమును వీడుచు కాల్చగ
    హిమగిరి మండెను భగభగ హేమంతమునన్.

    రిప్లయితొలగించండి
  20. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,


    హంసను బోలె నీ విక శ్ర మాచరణంబొనరింప నేల | వి

    ధ్వంస మొనర్చు మోయి రిపువర్గములన్ మది యందు | నిత్య ని

    ర్హింసయె కల్గజేయును మహీతల మందు హితార్థ సిధ్ధులన్ |

    శంసనముం బొనర్చు మిక సంతత మీవు పరోపకారమున్


    { శంసనము = స్తుతించుట , వాంఛించుట ; శ్రమము

    = తపస్సు }


    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
  21. సుమనోహర భూతల స్వ
    ర్గము కాశ్మీరును రగిల్చె కటకట! యా క
    ర్దమ మానసుల నడంచగ
    "హిమగిరి మండెను భగభగ హేమంతమునన్"

    రిప్లయితొలగించండి
  22. పగతురు సల్పు దాడులను బాధ్యతతో నెదురించి నిల్వగా
    పగలునురేయి సైనికులు భారతమాత సుపుత్రులై కడున్
    మగటిమి తోడ గాచుదుర మానుషు డొక్కడు దెబ్బగొట్టగా
    భగభగ మండుచుండె హిమపర్వతమే చలికాలమం దయో

    రిప్లయితొలగించండి
  23. విమతులు దాడులు చేయగ
    దుమకిరి మన సైనకులట దుర్భేద్య గతిన్
    సమరము నను కాల్పులతో
    "హిమగిరి మండెను భగభగ హేమంతమునన్

    రిప్లయితొలగించండి
  24. అమితముగ విరహ మందిరి
    తమకముతో,దూరమేగ తమ పతిదేవుల్
    రమణుల విరహాగ్నులతో
    హిమగిరి మండెను భగభగ హేమంతమునన్

    రిప్లయితొలగించండి
  25. విమతులుపాకిస్తానులు
    కుమతులులైదాడిజేయగూలగ పౌజున్
    నమరుల జూచుచు నపుడా
    హిమగిరి మండెనుభగభగహేమంతమునన్

    రిప్లయితొలగించండి
  26. అమరులు సైనికులై జన
    హిమగిరి మండెను భగభగ హేమంతమునన్
    మమతయు మానవతలుడుగ
    సమభావము రాజ్యములకు సంభవ మగునా ?

    నిన్నటి సమస్యకు నా పూరణ

    మానవుండు భువిని దానవడగునటు
    హింస గల్గఁ జేయు; హితము భువికి
    కలుగ జేయు కొఱకు కావలె నిరతము
    ప్రేమ , త్యాగ, నిరతి, నీమ నిష్ఠ

    రిప్లయితొలగించండి
  27. నిగనిగలాడుమొక్కలవినేస్తమ!జూడుమ!యెట్లువేడికిన్
    భగభగమండుచుండె,హిమపర్వతమేచలికాలమందయో
    పగలునుఱేయినాకనునవారితమంచునుగల్గియుండుచున్
    నగబడకుండయాయెనుమహాద్భుతరీతినిజూడగోరుదున్

    రిప్లయితొలగించండి
  28. కం విమతులు దండెత్తగ గని
    సమరమున కుపక్రమింప సాగెను పోరున్
    సమసిరి జవానం లెందరొ
    హిమగిరి మండెను భగభగ హేమంతమునన్
    ఆకుల శివరాజలింగం వనపర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అమితమ్మో దౌష్ట్యముతో
      రమణీ యంబగు హిమాద్రి రక్తము చిందన్
      ఢమరుక మెత్తంగ శివుడు
      హిమగిరి మండెను భగభగ హేమంతమునన్!

      తొలగించండి
  29. చంపకమాల
    తగిన విధమ్ముగా నమర ధామపు వృద్ధికి సాయమీయ స
    ప్తగరి నివాసుఁడే వినగ బల్కిన మోదియె మాటతప్పగా
    నెగయుచు క్రుద్ధుడైన యమరేశ్వరుఁ జిచ్చఱ కంటి జ్వాలలన్
    భగభగ మండుచుండె హిమపర్వతమే చలికాలమం దయో! !

    రిప్లయితొలగించండి
  30. ఉమ యెంతగ వారించిన
    సుమశరము విడిచె మదనుడు సురవందితుపై
    ప్రమధాధిపు ఫాలాగ్నుల
    హిమగిరి మండెను భగభగ హేమంతమునన్

    రిప్లయితొలగించండి
  31. రిప్లయిలు
    1. అగహిమవిస్ఫులింగకరణాన్యమతోన్మదజన్యకీలలీ
      యగణితకీర్తిసైనికుల నంతముఁ జేసె, తదాప్తశౌర్యమే
      నగజఝరీవరమ్మయి వినాశకమగ్నకరమ్ము దగ్రమై
      భగభగ మండుచుండె హిమపర్వతమే చలికాలమందునన్.

      కంజర్ల రామాచార్య
      కోరుట్ల.

      తొలగించండి
  32. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    సొగసరి వోట్లు గోరుచును స్రుక్కుచు వెక్కుచు యాత్రజేయగా
    నిగనిగలాడు పాదములు నివ్వెర వోవుచు నేడ్చుచుండగా
    దిగులున డింపులయ్యదట త్రిప్పట గాంచిన తాలకమ్ముతో
    భగభగ మండుచుండె హిమపర్వతమే చలికాలమం దయో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. డింపులయ్యను వదిలేటట్లు లేరు జీపీయెస్ వారు :)

      డింపులయ్యతో బాటు డింపులమ్మి మా ప్రియాంక నీరజ నేత్రను కూడా కొంత కన్సిడర్ చేయవలసినదిగా విన్నపాలు :)



      జిలేబి

      తొలగించండి
    2. G P Sastry (gps1943@yahoo.com)అక్టోబర్ 07, 2018 10:24 AM

      పాత కాలం అమ్మలక్కల కబుర్లు:

      సంచుల్ నిండుగ బ్లౌసు పావడలతో సారీలు కుక్కించుచున్
      కొంచెమ్ రోజులు పుట్టినింటికని నే కోడూరు పొయ్ రావగా
      దంచే టెండలలో హిటాచి ఫ్రిజి మూతన్ దీసి చూడంగ హా
      మంచుంగొండలు మండుచున్న వవిగో మాహేంద్రనీలద్యుతిన్!

      తొలగించండి
  33. పగలవి మిన్నునంట హిమపర్వత మందున రాజకీయమై
    మగతనుముంచి పిల్లలను మారణకాండకు ప్రోత్సహింపగన్
    నగణిత దుష్టచేష్టల దురాత్ములు సైన్యము మట్టుబెట్టగన్
    భగభగ మండుచుండె హిమపర్వతమే చలికాలమందయో!

    రిప్లయితొలగించండి
  34. కందం
    అమరావతి యభివృద్ధికి
    సమకూర్చరు నిధులటంచు చాముండియె కో
    పముఁ జెంద మోది చేష్టకు
    హిమగిరి మండెను భగభగ హేమంతమునన్

    రిప్లయితొలగించండి
  35. 'హిమ'యను నామము గల్గిన
    రమణిని జేకొనెను 'గిరి' సరాగముదోడన్
    బొరపొచ్చెములేర్పడగా
    "హిమగిరి మండెను భగభగ హేమంతమునన్"
    మిరియాల ప్రసాదరావు కాకినాడ

    రిప్లయితొలగించండి
  36. 'హిమ'యను నామము గల్గిన
    రమణిని జేకొనెను 'గిరి' సరాగముదోడన్
    బొరపొచ్చెములేర్పడగా
    "హిమ,గిరి మండెను భగభగ హేమంతమునన్"
    మిరియాల ప్రసాదరావు కాకినాడ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. మూడవ పాదము
      పిరియము మిరియంబవగా అంటే బాగుంటుందేమో నండీ :)

      బాగుంది పొరపొచ్చాలు :)


      జిలేబి

      తొలగించండి
    2. నిజమేనండీ. మీ జిలేబి లాగ నా మిరియం కూడా ప్రసిద్ధి చెందాలని ఆశీస్సులు అందించండి.

      తొలగించండి

    3. మనకు మనమే ప్రచారము చేయించుకోవడమే :)

      యూట్యూబ్ వాడి స్లోగన్ లా బ్రాడ్ కాస్ట్ యువర్ సెల్ఫ్ :)

      మిరియము లెఫ్టు సెంటరు రైటు కందాల్లో విరివిగా వేసేయండీ ఆ తరువాయి తడాఖా చూడండీ ఇక :)

      నెనరులు

      జిలేబి

      తొలగించండి
    4. మూడో పాదంలో ప్రాస లేదండీ. పొరపాటు జరిగింది.
      "గమనీయత గరువాయెను" అంటే సరిపోతుంది కదా సార్

      తొలగించండి
  37. విమ లాంబర మరణుం బయి
    ప్రమాద సంజనిత మపుడు జ్వలి తానల ధా
    మ మనంగ శిలా ద్రవపు మ
    హిమ గిరి మండెను భగభగ హేమంతమునన్


    విగత సతీ సముద్భవ సుభీమ విచారుఁడు రక్తవర్ణ దృ
    గ్రు గధిక చండ శంకరుఁడు రోష హృదుగ్రుఁడు నాట్య మాడగన్
    ధగధగ మండఁ గన్నులు పదమ్ముల పీడన మోర్వ లేక తా
    భగభగ మండుచుండె హిమపర్వతమే చలికాలమం దయో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 4 జూన్ 2016 నాటి సాదృశ పూరణములు:

      ముంచన్ శుద్ధ విశాలమౌ ప్రకృతినిన్ మూఢాత్ములున్ ముష్కరుల్
      పంచం జేరి దురాశఁ జిక్కియు సదా భంజింప వృక్షంబులం
      గాంచన్ నిక్కము దైవ కల్పితములే కల్పాంతమున్ వేగ ర
      మ్మంచుం గొండలు మండుచున్న వవిగో మాహేంద్రనీలద్యుతిన్


      ఘన ఘనావృత మైన గగనముఁ దాఁకు
      కొండ శిఖరమ్ముల మెఱయ మెండు గాను
      జారు శంపా లతిక లంత జ్వాల లనఁగ
      మంచు మల యింద్రనీలమై మండుచుండె

      తొలగించండి
    2. అద్భుతమైన పూరణలార్యా! నమోనమః!!🙏🙏🙏🙏

      తొలగించండి
  38. గమథులు చేసిన పనులకు
    హిమగిరి మండెను భగభగ, హేమంతమున
    సమవస్థను తప్పించ చ
    లిమంటల వ్యర్థమువిడుచు రీతిని గనినన్

    రిప్లయితొలగించండి
  39. హిమ'యను నామము గల్గిన
    రమణిని జేకొనెను 'గిరి' సరాగముదోడన్
    గమనీయత గరువాయెను
    "హిమ,గిరి మండెను భగభగ హేమంతమునన్"
    మిరియాల ప్రసాదరావు కాకినాడ

    రిప్లయితొలగించండి
  40. రమణీ! యేమని చెప్పను?
    రమణీయమ్మగు గిరులవి రమ్యతగొల్పన్
    క్రమమునె దప్పిన వేసవి
    *"హిమగిరి మండెను భగభగ హేమంతమునన్"*!!

    రిప్లయితొలగించండి
  41. జగతిని భారతావనియె శాంతికపోతమటంచు వాసిలన్
    బగతుర కన్నుకుట్టి బలవంతము గానిట నుగ్రవాదులే
    తెగబడి కాశ్మిరమ్మున సుధీరులె యైన భటాళిఁ జంపగా
    భగభగ మండుచుండె హిమ పర్వతమే చలికాలమందయో

    రిప్లయితొలగించండి
  42. తమ దేశ భాగ్యమె తమ హి
    తమని తలచి పోరి నేల తాకిన ధీరుల్
    అమర జవానుల బలిచే
    హిమగిరి మండెను భగభగ హేమంతమునన్

    రిప్లయితొలగించండి
  43. డా.పిట్టా సత్యనారాయణ
    మమతను బంచక నింటను
    సమమును విషమంబు జేసి సాధువు ననుచున్
    భ్రమలను గ్రుంగిన నరుగని
    హిమగిరి మండెను భగభగ హేమంతమునన్

    రిప్లయితొలగించండి
  44. సగటున బుణ్య భూమియని సాధువులైన యసాధు పుంగవుల్
    సిగరెటు దమ్ము బీల్చుచును చేయిని జాచెడు నేరగాళ్ళ నే
    ఖగ, మృగ,జంతు జాలములు కాలిన దన్నని నీతి నెంచియున్
    భగ భగ మండుచుండె హిమ పర్వతమే చలికాల మందయో

    రిప్లయితొలగించండి
  45. డా.పిట్టా సత్యనారాయణ
    ధ్వంసమెంతయైన దా నొక్కడే జేసి
    మొక్కు దీరెననుచు మురియు వాని
    శాంతి యనుచు నెట్టి సవరణ నోపని
    హింస గల్గ జేయు హితము భువికి

    రిప్లయితొలగించండి
  46. డా.పిట్టా సత్యనారాయణ
    హంసల వంటివారమని, హా! ఋజువేదను పాకు సాకులే
    ధ్వంసము గావలెన్ మతవివాదము లేలకొ గోత్ర మెర్గి యా
    శంసన మాని వేగమె పిశాచములన్ వడి జంపు నట్టి యా
    హింసయె గల్గ జేయును మహీతలమందు హితార్థ సిద్ధులన్

    రిప్లయితొలగించండి
  47. పగలను నిత్యమున్ చెలగు వైరిసమూహము దుష్టశీలులై
    జగతివినాశనమ్మునకు సంతత కారణ భూతులై కడున్
    వగపునొనర్చు చుండగను భారత జాతికి, కాంచి వారలన్
    భగభగ మండుచుండె హిమపర్వతమే చలికాలమందయో

    రిప్లయితొలగించండి