14, ఫిబ్రవరి 2019, గురువారం

సమస్య - 2930 (మ్రొక్కఁగ నొప్పు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మ్రొక్కఁగ నొప్పుఁ బ్రేమికుల రోజున నొజ్జల పాదపద్మముల్"

94 కామెంట్‌లు:



  1. రక్కసి ప్రేయసిన్ సయి ఘరాన జిలేబిని తీసుకొంచు నీ
    రెక్కల విప్పి గాలి వలె రివ్వున సాగి భళారె తప్పకన్
    మ్రొక్కఁగ నొప్పుఁ బ్రేమికుల రోజున నొజ్జల పాదపద్మముల్,
    మక్కువ మీరగాను చెలి మాధురి తోడుగ నిన్ను గావగా


    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. చక్కని చుక్కలెల్లరును చల్లగ మెల్లగ నిల్లు జారుచున్
    మక్కువ మీరగా ప్రియుని మాటల నందున మభ్యపెట్టుచున్
    గ్రక్కున కామసూత్రముల గ్రంథము దాచుచు రైక లందునన్
    మ్రొక్కఁగ నొప్పుఁ బ్రేమికుల రోజున నొజ్జల పాదపద్మముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చక్కని చుక్కలు' అన్నారు కనుక 'ప్రియుల' అనండి లేకుంటే వచనదోషం. "ప్రియుల మాటలతోడను.." అంటే బాగుంటుందని సూచన.

      తొలగించండి
    2. 'రైకలందునన్' బదులు 'కొంగుమాటునన్' అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
  3. మిక్కిలి ప్రేమ పూరితము మేలగు నంచును ప్రేయసిన్ గనన్
    మక్కువ చేయగన్ మనము మాధవు గొల్వగ మందిర మ్మునన్
    చక్కగ పోయిభక్తి గొని సంతస మందున వేంకటే శునిన్
    మ్రొక్కఁగ నొప్పుఁ బ్రేమికుల రోజున నొజ్జల పాదపద్మముల్

    రిప్లయితొలగించండి
  4. చక్కగ పాఠముల్ చదివి చక్కని భామను చూసి ప్రేమతో
    నెక్కడికెక్కడో తిరిగి యింపగు రీతిగ పెండ్లి జేసికొనన్
    మక్కువతో గురువులగు మాతకు తండ్రికి గౌరవంబునన్
    మ్రొక్కఁగ నొప్పుఁ బ్రేమికుల రోజున నొజ్జల పాదపద్మముల్"

    రిప్లయితొలగించండి
  5. మల్లేశ్వర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    రెండవ పాదం చివర గణదోషం. "పెండ్లియాడగన్" అనండి. మూడవ పాదంలో 'గురువులగు' అన్నచోట కూడ గణదోషం. "మక్కువతోడ పెద్దలగు మాతకు..." అనండి.

    రిప్లయితొలగించండి
  6. ( ఆదర్శభావాల యువతరం - అధ్యాపకుల ఆశీస్సులు )
    ఎక్కడ జూచినన్ నవస
    మీప్సితవాక్కుల పల్కరింపులే ;
    తక్కువ లెక్కువల్ గనని
    తన్మయభావపరీమళమ్ములే ;
    యక్కజమైన కట్నముల
    యాగడ ముండని నవ్యదంపతుల్
    మ్రొక్కగ నొప్పు బ్రేమికుల
    రోజున నొజ్జల పాదపద్మముల్ .

    రిప్లయితొలగించండి


  7. అబ్బే కంద సమస్య లేకుండా యేదో లావుందండి‌ :)
    ఆ వృత్త పాదానికి ఓ కంద సమస్యా పాదం చేర్చరాదూ‌ :)



    చుక్కా! ప్రేమికులదినము!
    టక్కని రమ్మా జిలేబి టవరయు వలదే
    దక్కును నాశీర్వాదము!
    మ్రొక్కగ నొప్పు ప్రియురాల ముంగట గురువున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మొన్నటి నుండి ఒక్క సమస్యనే ఇస్తున్నాను. అందుకు రెండు కారణాలున్నాయి.
      1) ఏదో ఒక సమస్యను సృష్టించడం సులభమే. కాని దానిని భావం చెడకుండా వృత్తపాదంగా, జాత్యుపజాతుల పాదంగా మార్చడం ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతున్నది. అందువల్ల ఆ సమస్య ఎంత బాగున్నా వదలివేయడం జరుతుతున్నది.
      2) రెండు విధాలుగా సమస్యను ఇస్తే కవిమిత్రులు రెండు విధాల పూరణలు చేస్తున్నారు. కొందరు (మీరు, శంకర్జీ వంటి వారు) పుంఖానుపుంఖాలుగా వ్రాస్తుంటారు. ఎక్కువమంది ఎక్కువ పూరణలు వ్రాయడం నాకు సంతోషమే. కాని సగటున (బ్లాగు, వాట్సప్, ఫేసుబుక్కులలో) రెండు వందల వరకు పూరణలు వస్తున్నాయి. అన్నింటిని సమీక్షించడం నాకు కొంత ఇబ్బందిగా ఉంది. అందులోను ఈ వయస్సులోను జాబ్ వర్క్ చేస్తూ నెలకు ఎంతో కొంత సంపాదించుకొనవలసిన పరిస్థితి నాది. రోజంతా ఎడతెరపి లేకుండా వచ్చే పూరణలను సమీక్షిస్తూ ఉంటే జాబు వర్కుకు సమయం కేటాయించలేక పోతున్నాను. అందులోను అవధానాలకు, సాహిత్య సమావేశాలకు (పిలిచినా, పిలువకపోయినా) వెళ్ళే వ్యసనం ఒకటి ఉండనే ఉన్నది. ప్రయాణాలలో ఉన్నప్పుడు అసంఖ్యాకంగా వచ్చే పూరణలను సమీక్షించడం అసాధ్యమౌతున్నది.
      అందుకే ప్రస్తుతానికి ఒక్క సమస్యనే ఇస్తున్నాను.

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      మీకోసం.....
      "ప్రేమికుల రోజటంచు మ్రొక్కవలె గురుపాదాబ్జములకు" (ఛందోగోపనం)

      తొలగించండి
    3. సార్! మీ నిశ్చయం చాలా సమంజసంగానున్నది.

      ఒకే ఒక ప్రార్థన:

      వృత్త పాదం ఏదైనా ఇవ్వండి. కానీ జాత్యుపజాతులలో కంద పాదం మాత్రమే ఇవ్వండి ప్లీజ్! తేటగీతి, ఆటవెలది, సమస్యా పూరణలుగా బోరు. శతకాల మాట వేరు.

      తొలగించండి


    4. ఇదేదో మరీ గోప్యపు ఛందము గా వున్నది‌ :)

      ఇంకో మారడగను :)


      జిలేబి

      తొలగించండి
    5. ...................ప్రేమికుల రోజ
      టంచు మ్రొక్కవలె గురుపాదాబ్జములకు. (తేటగీతి)

      తొలగించండి
    6. కంది శంకరయ్య గారికి,

      నమస్కారం !

      మీరి జాబ్ వర్క్ చేస్తున్నానని చెపుతున్నారు. శంకరాభరణం నడపడం కూడా జాబ్ వర్క్ లాంటిదే ! బ్లాగుల్లో చాలామంది గూగుల్ యాడ్స్ పెడుతుంటారు అంటే గూగుల్ వారికి కొంత డబ్బు ఇస్తుంది/ఇవ్వవచ్చు. కానీ మీరు మీ అకౌంట్ నంబరు కుడి ప్రక్కన గానీ మీ ప్రొఫైల్ లో గానీ ఇస్తే మీరంటే అభిమానం ఉన్నవారు డైరెక్ట్ గా మీ అకౌంట్(గూగుల్ తో సంబంధంలేకుండా) లోకి డబ్బు వేస్తారు. మీకు నా అభిప్రాయం నచ్చితే మీ అకౌంట్ నంబరు మీ బ్లాగులో వ్రాయండి.

      తొలగించండి
    7. నీహారిక గారూ,
      ధన్యవాదాలు.
      గూగుల్ ప్రకటనలు భారతీయ భాషల బ్లాగులకు ఇవ్వడం లేదు. కొద్దికాలం క్రితం హిందీకి ఆ అవకాశం ఇచ్చింది. తెలుగు ఇచ్చే ఆలోచన ఉన్నదట!
      ఇక బ్లాగులో మీ రివ్వమన్న వివరాలు ఇవ్వడం ఏమాత్రం బాగుండదు. అభిలషణీయం కాదు.
      అలా కాకుండా ఎవరైనా పుస్తకాలు ప్రచురించాలనుకునేవారు డి.టి.పి. చేయడానికి నాకు ఇస్తే సంతోషం! బయట డి.టి.పి. ఆపరేటర్లు తీసుకునే డబ్బుల్లో సగానికి నేను చేయడానికి సిద్ధం. ఇప్పుడు నేను చేస్తున్న జాబ్ వర్క్ అదే. ఇంత ఇవ్వాలని డిమాండ్ చేయను. వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను. అది నా వృత్తి కాదు కదా!

      తొలగించండి
    8. బ్లాగులో మీ రివ్వమన్న వివరాలు ఇవ్వడం ఏమాత్రం బాగుండదు. అభిలషణీయం కాదు.

      ఆధార్ నంబరు కంటే బ్యాంక్ అకౌంట్ నంబరు ఇవ్వడం అంత ప్రమాదమేమీ లేదు కదా ? అమెరికాలో ఉంటూ తమ బ్లాగుల్లో గూగుల్ ప్రకటనలు ఎందుకు ఇస్తున్నారో తెలుసా ? డబ్బు కోసమే కదా ? మీరు మొహమాటపడం ఏమిటండీ ?

      తొలగించండి
    9. మీరు డీటీపీ చేస్తున్నారని నాకు ఇపుడే తెలిసింది. ఇక మీదట మీకే ఇస్తాను.

      తొలగించండి

    10. శత సహస్ర కోటి కంద జిలేబీయాన్నేమైనా పబ్లిష్ చేయబోతున్నారేమో నీహారిక గారు :)


      జిలేబి

      తొలగించండి
    11. అవును...మీ కందపద్యాలు మాబోటివారికి అర్ధం కావు కదా ? శంకరయ్యగారైతే తప్పులు సరిచేసి డీటీపీ చేసి ఇస్తారు. తమరి అనుమతే ఇంకా దొరకలేదు.

      తొలగించండి
    12. //దురాక్రమణో?.....బహుద్దూరాక్రమణో..?//

      వలదు ప్రేమని గురువు చెప్ప వినక,కను
      గొంటి పార్కు పొదల కాముకులను,చూడ
      మిగుల హేయ మిదేమి ప్రేమికుల రోజ
      టంచు మ్రొక్కవలె గురుపాదాబ్జములకు!

      తొలగించండి
    13. శంకరయ్య గారు!
      మీరు చేస్తున్న *పద్య సేవ* అనవద్యమూ..అనితర సాధ్యమూను..
      మీకు శతసహస్రానేక ధన్యవాదాలు!

      తొలగించండి

    14. @నీహారిక
      తమరి అనుమతే ఇంకా దొరకలేదు :)

      Instead of wasting effort on that if you are serious Shankaraiah garu has one ambitious project to publish 500 or 1000 puranas book. See if you can fund it fully that will be worthwhile :)


      జిలేబి

      తొలగించండి
  8. చక్కని విద్యనేర్పుటయు చల్లని మాటల తీరుతెల్పుటన్
    తక్కువ కాము మేమనెడు ధైర్యము బోసిరి వారి బాకియున్
    లెక్కన తేల్చి తీర్చగను లేమెటు, ప్రేమికులన్న వారలే
    మ్రొక్కఁగ నొప్పుఁ బ్రేమికుల రోజున నొజ్జల పాదపద్మముల్

    రిప్లయితొలగించండి
  9. చక్కని తారల చెంతన
    మక్కువగా జేరె నంట మారుడు నభమున్
    మిక్కిలి ప్రేమగ సతినే
    మ్రొక్కగ గారము తోన మోహము నందున్

    రిప్లయితొలగించండి
  10. మైలవరపు వారి పూరణ

    ఎక్కడ యుండినన్ గురువులే తమ దైవములంచునెంచువా..
    రిక్కడ యక్కడంచు మదినించుక భేదములేక మ్రొక్కువా..
    రక్కజమైన భక్తి ,కడు హాయిని పొందెడి వేళ మ్రొక్కరే ?
    మ్రొక్కఁగ నొప్పుఁ బ్రేమికుల రోజున నొజ్జల పాదపద్మముల్ !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  11. [2/14, 05:43] Shankarji Dabbikar: చక్కని చిక్కనైన మనసంత మరుండును కొల్లగొట్టగన్
    ప్రక్కన నున్నఫోను పరువాల మెసేజుల పారబోయగా
    ఎక్కడి చావువార్త మనసెవ్విధి యూరడిలున్? వచింపగన్
    *"మ్రొక్కఁగ నొప్పుఁ బ్రేమికుల రోజున నొజ్జల పాదపద్మముల్"*
    [2/14, 06:02] Shankarji Dabbikar: మక్కువ మీర ప్రేమికులు మన్మథనామము పాడుకోవలెన్
    చక్కని చుక్కలందరు విశాలవనంబున నాడుకోవలెన్
    ఎక్కడివింత యిట్టులన నీసుకదే చిగురొత్తునూసులన్
    *"మ్రొక్కఁగ నొప్పుఁ బ్రేమికుల రోజున నొజ్జల పాదపద్మముల్"*

    రిప్లయితొలగించండి
  12. మిక్కిలి యాశలన్ మునిగి మేఘపు తేరుల తేలుచున్నవా
    రక్కజ మందుపొంగి కడు రాజస మొప్పగ హావభావముల్
    మక్కువ జూపుచున్ మిగుల మాయల మార్గము నెంచుకొంచునే
    మ్రొక్కఁగ నొప్పుఁ బ్రేమికుల రోజున నొజ్జల పాదపద్మముల్

    రిప్లయితొలగించండి
  13. చక్కని చుక్క యైన నొక చంద్ర ముఖి న్ మన సార గోరు చున్
    మక్కువ తోడ దెల్పు చు ను మాన్యుల దీవన బొంద గోరు చున్
    మ్రొక్కగ నొప్పు ప్రేమికుల రోజున నొజ్జల పాద పద్మ ముల్
    దక్కగ సౌఖ్య జీవన ము ధారుణి యందున శిష్య కోటి కి న్

    రిప్లయితొలగించండి
  14. చక్కని చుక్కనొక్కతిని లాలన చేయగ తప్పకుండగన్
    మ్రొక్కగ నొప్పు బ్రేమికుల రోజున, నొజ్జల పాదపద్మముల్
    నొక్కగ తప్పుకా దెపుడు నొప్పిని తక్కువ చేయగోరుచున్
    అక్కఱబట్టి యేపనిని యెప్పుడుచేసిన తప్పుకాదుగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతారామయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చుక్క నొక్కతెను... చేయగోరి తా మక్కఱ బట్టి యే పనిని నెప్పుడు...' అనండి.

      తొలగించండి
  15. ఉత్పలమాల
    మక్కువ మీర విద్య పరమాత్ముని రూపున బోధఁ జేయఁగన్
    జక్కఁగ సాంప్రదాయములఁ జాలఁగ నేర్చిన పూజ్యభావనన్
    బ్రక్కన శ్రీమతిన్ గొని వివాహదినంబని యంద దీవెనల్
    మ్రొక్కఁగ నొప్పుఁ బ్రేమికుల రోజున నొజ్జల పాదపద్మముల్

    రిప్లయితొలగించండి
  16. ఈరోజు మా ఇరవై తొమ్మిదవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఇలా పూరించాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు, ఆశీస్సులు!

      తొలగించండి
    2. మీ వివాహము శతవార్షికోత్సవాలను జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ,శుభాకాంక్షలు తమ్ముడుగారూ!

      తొలగించండి
    3. గురుదేవులకు కవిపండితులు శ్రీ పోచిరాజు కామేశ్వరరావుగారికి మరియు సాహితీ సరస్వతిశ్రీమతి సీతాదేవిగారి ఆశీర్వచనములకు ధన్యవాదములు

      తొలగించండి


  17. చక్కగ తెల్లవారగను చక్కటి బొట్టును దాల్చి సేలలో
    మిక్కిలి గౌరవమ్ము గ మమేకము గా నిడిమట్టు ధోరణిన్
    మ్రొక్కగ నొప్పు ప్రేమికుల రోజున నొజ్జల పాద పద్మముల్
    దక్కును దక్కునమ్మ వసుధన్ మన కన్నియు మేలుగా చెలీ!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  18. నిక్కము రాధలో మరియు నిర్మల ప్రేమ విభుండు కృష్ణులో
    చొక్కపు రాగ బంధనము సుందరమై విలసిల్లుగాదె!పెం
    పెక్కగ,జీవ,దైవ,మహనీయ గుణంబులు పొంగి పొర్లగా--
    మ్రొక్కగనొప్పు,ప్రేమికుల రోజున నొజ్జల పాద పద్మముల్.

    రిప్లయితొలగించండి
  19. మక్కువ తోడుతన్ మనకు మాన్యత గూర్చిన వారలే కదా!
    చక్కగ పాఠముల్ మిగుల శ్రద్ధగ జెప్పిన మాన్యులే కదా!
    తక్కువ చేయబోరు తలిదండ్రుల కంటెను బంధులై సదా!
    మ్రొక్కఁగ నొప్పుఁ బ్రేమికుల రోజున నొజ్జల పాదపద్మముల్

    రిప్లయితొలగించండి
  20. జనార్దన రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. మ్రొక్కగ నొప్పు బ్రేమికులరోజుననొజ్జలపాదపద్మముల్
    మ్రొక్కగ నొప్పునెప్పుడును మోదముతోడనుగార్యసిధ్ధికై
    యిక్కడ యక్కడన్ ననక యెక్కడయైననుగుర్వులన్ భువిన్
    నక్కున జేర్చుకొందురుగ నాదరమొప్పగ శిష్యకోటినిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'యక్కడం చననక యెక్కడనైనను.. కొందురుగ యాదరమొప్పగ' అనండి. గురువును గుర్వు అనరాదు. గుర్వు అంటే అధికమని అర్థం.

      తొలగించండి
  22. ఎక్కడి రోజు లక్కట యహీనము లందురు ప్రేమ పాశమే
    దక్కిన భాగ్యవంతులు ముదమ్ముగ దీవన లొందఁ గోరుచుం
    దక్కిన రోజు లెవ్వియును దప్పక మ్రొక్కఁగఁ గూడ దంటినే
    మ్రొక్కఁగ నొప్పుఁ బ్రేమికుల రోజున నొజ్జల పాదపద్మముల్

    [రోజునను = రోజు కూడా ]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      ఈ సమస్యను సిద్ధం చేసినప్పుడు ఎటువంటి పూరణను కోరుకున్నానో అది మీ నుండి వచ్చింది. సంతోషం!
      మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి ధన్యవా దాభివందనములు. చాలా సంతోషమండి.

      తొలగించండి
  23. అక్కర లేని ప్రేమయది యంగన పైనను గల్గినట్టిదౌ
    నిక్కమమైన ప్రేమయది నీ తలిదండ్రుల పట్లదే యనిన్
    జక్కగ భారతీయ ఘన సంస్కృతి మాకిల తెల్పినందుకే
    మ్రొక్కఁగ నోప్పుఁ బ్రేమికుల రోజున నొజ్జల పాదపద్మముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అనిన్' అన్న ప్రయోగం సాధువు కాదు.

      తొలగించండి
  24. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    Extract from Saamana:

    స్రుక్కక పార్కులందునను శోధన జేయుచు "సేన" సైనికుల్
    మొక్కల చాటునన్ దవిలి ముద్దుల జంటల వీడదీయుచున్
    గ్రక్కున వీధివీధులను గాడిద వీపున త్రిప్పి త్రుళ్ళుచున్
    మ్రొక్కఁగ నొప్పుఁ బ్రేమికుల రోజున నొజ్జల పాదపద్మముల్

    రిప్లయితొలగించండి
  25. ప్రభాకర శాస్త్రి గారూ,
    మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
    ఇంతకీ గురువుకు మ్రొక్కవలసింది సేనసైనికులా? ప్రేమికులా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇక్కడ ఇచ్చిన Instructions సైనికులకే వర్తిల్లును సార్! వారే "గురూజీ" బాలటక్కరు గారి పాదపద్మములకు మ్రొక్కవలెను గదా!

      "Shiv Sena leader Bal Thackeray has said that people not wanting violence on the day should not celebrate it."

      https://en.m.wikipedia.org/wiki/Valentine%27s_Day_in_India

      తొలగించండి
    2. "Saamana is a Marathi-language newspaper published in Maharashtra, India. Founder Editor:Bal Thackeray"

      https://mobile.twitter.com/saamanaonline?lang=en

      తొలగించండి
  26. మ్రొక్కెద తల్లిదండ్రులకు,మ్రొక్కెదమూఢులమార్పుజేయగా
    మ్రొక్కెద నీతినిష్టలకు, మ్రొక్కెద ప్రేమను బెంచిమంచిగా
    దక్కగ?జీవితాంతమును దర్పణమట్లుగనిల్పువారికిన్
    మ్రొక్కగనొప్పు బ్రేమికులరోజున నొజ్జలపాదపద్మముల్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నిష్ఠలకు' టైపాటు!

      తొలగించండి
  27. చక్కని ప్రేయసిన్ గలసి జంటగ జిత్తజు నుల్లమందునన్
    మ్రొక్కగనొప్పు ప్రేమికులరోజున;నొజ్జల పాదపద్మముల్
    గ్రక్కున మ్రొక్కగానగును కాలమునెంచక నెప్పుడైననున్
    చక్కని విద్యలంగరపి సంస్కృతినీయగ శిష్యకోటికిన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '..నెప్పుడైనా నా। చక్కని...' అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువుగారూ,సవరిస్తాను!

      తొలగించండి
  28. డా.పిట్టొ సత్యనారాయణ
    ఎక్కడి ప్రేమ పెళ్ళులవి యెవ్వరు ప్రేమను బంచి మించిరీ
    చక్కని బంధమున్ విరువ సాగిన వారలె తల్లి, దండ్రి నా
    డక్కజమైన త్యాగమున నందరె మన్నన లైల,మజ్నుకున్
    మ్రొక్కగ నొప్పు బ్రేమికుల రోజున నొజ్జల పాద పద్మముల్

    రిప్లయితొలగించండి
  29. డా.పిట్టానుండి
    ఆర్యా,
    ప్రేమ పెళ్ళిలవి(టై.పా. సవరించి)

    రిప్లయితొలగించండి
  30. మ్రొక్కగనొప్పు మాన్యుల నమోఘ తపఃఫల దేశికార్యులన్
    మ్రొక్కుదమాత్మబోధనిడి పూ ర్ణమొసంగిన పుణ్యపూరుషున్
    మ్రొక్కుదమాముకుందు తలపు న్తనువున్బలుకున్నొకండునై
    *"మ్రొక్కఁగ నొప్పుఁ బ్రేమికుల రోజున నొజ్జల పాదపద్మముల్"*

    రిప్లయితొలగించండి
  31. అక్కజమాగురూత్తముడయాచితపుణ్యము, భోగజీవమున్
    జక్కనియోగమార్గమున సాగ నపూర్వమనంతప్రేమతో
    చిక్కులుజీల్చిలాహిరినిచేర్చెసదాగతిపూర్ణధామమున్
    *"మ్రొక్కఁగ నొప్పుఁ బ్రేమికుల రోజున నొజ్జల పాదపద్మముల్"*

    రిప్లయితొలగించండి
  32. ఎక్కడ ప్రేమికుండ్రు పరమేశుని లీలలటంచునెంతురో
    ఎక్కడనిర్మలాత్ములు ననేక రహస్యములారబోతురో
    ఎక్కడమోసులెత్తు నెద వీణియపాడును నట్టిశెట్టికిన్
    *"మ్రొక్కఁగ నొప్పుఁ బ్రేమికుల రోజున నొజ్జల పాదపద్మముల్"*

    రిప్లయితొలగించండి
  33. చక్కగ తల్లిదండ్రులిడ సంతసమొందుచు స్వస్తి వాక్కులన్
    మిక్కిలి ప్రేమతో సతము మేదిని వర్తిల దేవదేవునిన్
    మ్రొక్కఁగ నొప్పుఁ బ్రేమికుల రోజున, నొజ్జల పాదపద్మముల్
    మక్కువ తోడ పెండ్లియగు మందిరమందు స్పృశించ మేలగున్

    రిప్లయితొలగించండి
  34. చక్కగపాఠముల్ జదివి ఛాందసభావము నొందనేలనో
    మిక్కిలిప్రేమబంచి,మరిమిక్కుటమేలనొబెంచగన్ సదా
    పెక్కుగ ప్రేమబంధమున విస్తృత భావపు సత్యశీలతన్
    *"మ్రొక్కఁగ నొప్పుఁ బ్రేమికుల రోజున నొజ్జల పాదపద్మముల్"*!!

    రిప్లయితొలగించండి
  35. జక్కగ పెద్దలెల్లరును స్వాంతము నందున మెచ్చగాసతం
    బెక్కుడు ప్రీతిచూపుచును నిమ్ముగ పెండిలి యాడగన్ మదిన్
    నిక్కపు విద్యలెల్లనిట నేర్పుచు మార్గము చూపువారికిన్
    మ్రొక్కగ నొప్పు బ్రేమికుల రోజున నొజ్జల పాదపద్మముల్.

    రిప్లయితొలగించండి
  36. వెక్కస మైన ప్రేమలవి వీధిన బడ్డవి సిగ్గుసిగ్గు కై
    పెక్కిన చేష్టలున్ గనగ హేయము గొల్పెడి కామలీలున్
    మిక్కుటమై ధరన్ యువత మీరెను హద్దులు! తీర్చిదిద్దగా
    మ్రొక్కఁగ నొప్పుఁ బ్రేమికుల రోజున నొజ్జల పాదపద్మముల్

    రిప్లయితొలగించండి
  37. పెక్కగు నోర్పుతో సతము విద్యల నేర్పుచుఁ బిల్లవాండ్రకున్
    జక్కని బోధనన్ గరపి సాంతము జీవితమెల్ల సేవలన్
    మిక్కిలి ధారవోయుచును మేలిమి ప్రేమను బంచుచుండెగా
    మ్రొక్కఁగ నొప్పుఁ బ్రేమికుల రోజున నొజ్జల పాదపద్మముల్

    రిప్లయితొలగించండి