శ్రీ హరి ప్రార్ధన 
శ్రీకరా!  రఘురామ!  శ్రీపతీ! పుష్కరాక్షా!  మధుసూధనా!   సోమగర్భ!
నరహరీ!నారాయణ!భరిమ!యతి!మేదినీ పతి!పురుజిత్తు!
మాపతి!వన
మాలి!సిరి వరుణ!మధుజిత్తు! రవినేత్ర!  వట పత్ర శాయి!పావన! రమేశ!
అనిరుద్ధ! కేశవా! ఆది వరాహ! పీతాంబరా!
ముక్తి దాత!   పరమేశ! 
కపిల!పురుహూతి!శ్రీనాధ!కమల నయన!
చక్రి!
పద్మనాభ! మనోజ జనక! శేషి!
నీరజోదర !నందకీ!నేత!నాకు
సరస మౌ మేధ 
నొసగుచు  సాక వలెను 
పద్యము
చదువు విధానము.    (శ్రీ )తో  మొదలు పెట్టి క్రింది గడిలో (కరా) అనుచు
ఎడమనుంచి కుడికి కుడి నుంచి ఎడమకు చదువుచు క్రింద చక్రములలో  ఉన్న అక్షరములు  (క  
వలెను)అని ముగించాలి .   ఈ  పద్యములో పసుపు పచ్చ గడిలో (శ్రీ రామ రామ రామేతి  రమే రామే మనోరమే ) అన్నవాక్యము బంధించ బడినది   అది 
విశేషము 
                                                        
పూసపాటి
కృష్ణ సూర్య కుమార్