17, ఏప్రిల్ 2019, బుధవారం

సమస్య - 2989 (ప్రాఙ్నగమున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ప్రాఙ్నగమున నస్తమించె భాస్కరుఁ డంతన్"
(లేదా...)
"ప్రాఙ్నగమందుఁ జూడఁగ విభాకరుఁడౌ రవి యస్తమించెరా"

64 కామెంట్‌లు:

 1. ప్రాతః కాల సరదా పూరణ:

  ఈ"ఙ్నగ" ప్రాసజూడగను నెక్కస మౌచును బొజ్జనొవ్వగా
  వాఙ్నియమమ్ భళా గొనుచు వంకర టింకర మాటలొల్లకే
  ప్రాఙ్నగ దిక్కు మ్రొక్కుచును వందన లిచ్చి ప్రదక్షిణమ్ములన్
  ప్రాఙ్నగమందుఁ జూడఁగ విభాకరుఁడౌ రవి యస్తమించెరా!

  విభాకరుడౌ రవి = జి. ప్రభాకర శాస్త్రి

  దుష్కర ప్రాస గనుక దుష్ట సమాసములను మన్నించగోరెదను

  రిప్లయితొలగించండి
 2. మైలవరపు వారి పూరణ

  దిఙ్నగకాననాభ్రజగతీతలవిస్తృతకాంతిపుంజస..
  మ్యఙ్నవశోభలన్ వెలిగి., యల్లదె శారదసంధ్య కౌముదీ
  దృఙ్నినివహమ్ము పంచుటకు తెల్లని చంద్రుడు వచ్చుచుండగా
  ప్రాఙ్నగమందుఁ , జూడఁగ విభాకరుఁడౌ రవి యస్తమించెరా !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి


 3. ప్రాఙ్నగమన తొలిదెస మల!
  ప్రాఙ్నగమున నస్తమించె భాస్కరుఁ డంతన్
  వాఙ్నియమముకాదు సుమీ,
  ప్రాఙ్నగ మున దాగినట్టి బ్లాగు జిలేబీ !


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మీ 'వరూధిని' బ్లాగును ప్రాఙ్నగంలో దాచిపెట్టారా ఏమిటి?

   తొలగించండి
 4. వాఙ్నియ మంబుల దలచుచు
  పాఙ్నయగారంబులకును భారత వీరుల్
  ధిఙ్నుత రీతిని మడియగ
  ప్రాఙ్నగమున నస్తమించె భాస్కరుడంతన్.

  రిప్లయితొలగించండి
 5. అజ్ఞానపు లోకములో
  ప్రాజ్ఞగమున నస్తమించె భాస్కరుఁ డంతన్
  సుజ్ఞానాంబర వీధుల
  ప్రాజ్ఞగమునె యవతరించు భాస్కరుడెపుడున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సూర్య గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి, మూడవ పాదాలలో ప్రాస తప్పింది. సవరించండి.

   తొలగించండి
  2. ప్రాఙ్నగమెరుగక యందురు
   ప్రాఙ్నగమున నస్తమించె భాస్కరుఁ డంతన్
   ప్రాఙ్నగమేమన తెలియగ
   ప్రాఙ్నగమునె యవతరించు భాస్కరుఁ డెపుడున్

   పై విధంగా సవరించగలిగాను. పరిశీలించి మీ అమూల్యమైన అభిప్రాయం తెలియ జేయ గలరని ఆశిస్తున్నాను 🙏

   తొలగించండి
 6. ప్రాఙ్నగమనగ వెతుకగా
  ప్రాఙ్నగమనగ కనమాంధ్ర భారతి యందున్
  ప్రాఙ్నగము పశ్చిమమునా ?
  ప్రాఙ్నగమున నస్తమించె భాస్కరుఁ డంతన్

  రిప్లయితొలగించండి
 7. రిప్లయిలు
  1. కృష్ణారెడ్డి గారూ,
   మూడు పాదాలలోను ప్రాస తప్పింది. అది 'ఙ్న'. జ్ఞ కాదు.

   తొలగించండి
 8. హనుమంతుడు విద్యలు నేర్చుకొనుటకు తన శరీరమును పెంచి ఉదయాద్రి అస్తమాద్రి పైన రెండు పాదములు పెట్టి రవికి ఎదురుగా నిలబడి ఉన్నప్పుడు ఉదయము న తూరుపు దిక్కున చీకట్లు కొంచెము సేపు కనబడుతాయి . అంజని తన భర్తను ఏమి ఈ వైపరీత్యము అని అడుగగా కేసరి ఆవిడ సందేహము తీర్చు సందర్భము

  ఇచ్చిన సమస్య కందములో నా పూరణము సీసములో

  “ప్రాఙ్నగమున నస్తమించె భాస్కరుఁ డంతన్”

  కనుమిది నభమున కాంతులు తగ్గెను తూరుపు దిక్కున, కారు చీక
  టులు భువిపై నేల తలమీరె, నుదయమున కపిల వర్ణముగ కనబడెను
  ముదముగా ప్రాఙ్నగమున, నస్తమించె భాస్కరుఁ డంతనిప్పుడు ,శంబరంబు
  నైన కనబడదు నభమున, ననుచునం జనిదెల్పె పతితోడ సందియమును ,

  శాలిని వినుము , ఘనుడు కేసరి తనయుడు
  నాంజనేయుడు నేర్చుకొ నంగ విద్దె
  పెంచె కాయమును, నిలిచె పీదు నెదుట,
  శంక వలదని కేసరి సతికి తెలిపె

  రిప్లయితొలగించండి
 9. దిఙ్నీమమునను సోముడు
  ప్రాఙ్నగమున యస్తమించె,భాస్కరుడంతన్
  ప్రాఙ్నగమున బొడచూపెను
  దృఙ్నిర్భరుడై జనులకు తీక్షణప్రభలన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   'నీమము' వికృతి. దానిని దిక్ తో సమాసం చేయరాదు. అక్కడ "దిఙ్నియమమునను సోముడు" అనవచ్చు.

   తొలగించండి
  2. ధన్యవాదములు గురుదేవా,సవరించెదను!
   దిఙ్నియమమునను సోముడు
   ప్రాఙ్నగమున యస్తమించె,భాస్కరుడంతన్
   ప్రాఙ్నగమున బొడచూపెను
   దృఙ్నిర్భరుడై జనులకు తీక్షణప్రభలన్

   తొలగించండి
  3. త్తరం

   SeethaDevi Gurramసెప్టెంబర్ 01, 2018 7:45 AM
   దిజ్నియమమ్ముల బొడమెను
   ప్రాజ్నగ శృంగమ్మున నదె భానుడు; గ్రుంకెన్
   రిజ్నిజపతి పశ్చిమము స
   మ్యజ్నిర్మగ్నుండయి కడ యామమునందున్!

   తొలగించండి
 10. దృఙ్నియతిని మించుచు స
  మ్యఙ్నభ మున విస్తరించ నంధము నపుడే
  ప్రాఙ్నిషగ నడుగుఁ బెట్టెను
  ప్రాఙ్నగమున, నస్తమించె భాస్కరుఁ డంతన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. దిఙ్నగ మత్త నాగములు దీర్ఘములైనటు దోచె నత్తరిన్
   దృఙ్నియమమ్ము దప్పగను దృష్టికి నందక లోకమందు స
   మ్యఙ్నివహమ్ముగాన్ దిమిర మక్రమ నాక్రమణమ్ము సేయగన్
   ప్రాఙ్నగమందుఁ జూడఁగ విభాకరుఁడౌ రవి యస్తమించెరా

   తొలగించండి
  2. రాకుమార గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
   '...దిమిర మక్రమమై క్రమణమ్ము సేయగన్' అంటే బాగుంటుందేమో?

   తొలగించండి
  3. రాకుమారగారూ,మీ రెండు పూరణలూ ప్రశస్తంగా ఉన్నవి.అభినందనలు!నిశావతరణాన్ని చక్కగా వర్ణించారు!

   తొలగించండి
  4. గురువర్యులకు ధన్యవాదాలు!
   గుఱ్ఱం సీతాదేవి గారికీ 🙏

   తొలగించండి
 11. "ఇలాంటి క్లిష్ట, దుష్కర ప్రాస వచ్చినపుడు తగినంత భాషాపాండిత్యం లేకుండా ఎట్లా పూరించడం?" అని ఒక మిత్రు డడిగితే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు తప్పించుకొని వెక్కిరించే పద్ధతి ఒకటుంది. నాలుగు పాదాలను 'ప్రాఙ్నగ' అని మొదలు పెట్టడమే" అని చెప్పి ఉదాహరణకు ఒక సరదా పూరణ చేసి చూపాను.....

  ప్రాఙ్నగ మన తూరుపుమల
  ప్రాఙ్నగమున నుదయమందు భాస్కరుఁ డెపుడున్,
  ప్రాఙ్నగ మన నెఱుఁగవె? యెటు
  ప్రాఙ్నగమున నస్తమించె భాస్కరుఁ డంతన్?

  రిప్లయితొలగించండి
 12. త్వఙ్నయ నోద్వేగమ్మును
  రుఙ్నిచ యోద్భాసితమ్ము రోగక్షయ మీ
  దృఙ్నవ విధ ముదయించుచుఁ
  బ్రాఙ్నగమున నస్తమించె భాస్కరుఁ డంతన్

  [నవము = స్తోత్రము]


  దృఙ్నిర తాద్భుతమ్ము నగు దివ్య విలాసము నా నభః పయో
  ముఙ్నినదవ్ర జావృతము భూతలవాస మనోహరమ్ము నౌ
  ప్రాఙ్నగ సంభవుండు నయి ప్రస్ఫుట మౌయరుణాంశు సంయు తా
  ప్రాఙ్నగమందుఁ జూడఁగ విభాకరుఁడౌ రవి యస్తమించెరా

  [సంయుత + అప్రాఙ్నగము; పశ్చిమాద్రి]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 1-9-2018 నాటి సాదృశ్య పూరణములు:

   మగ్నుండై పని యందు న
   భగ్నపు రీతి నిరతమ్ముఁ బన్నుగఁ దా ప్ర
   త్యఙ్నగము సేరి కదలుచుఁ
   బ్రాఙ్నగ శృంగమ్మున నదె భానుఁడు గ్రుంకెన్


   రుఙ్నయ నారవింద సఖ రోష విలుప్త ముఖుండు నా పయో
   ముఙ్నిచయ చ్యుతానన విముక్త నిదాఘ సువిగ్రహుండు ఋ
   త్విఙ్నర నిత్య పూజితుఁడు వేగఁ జలించి రయోద్ధృతిన్ మహా
   ప్రాఙ్నగ శృంగభాగమున భానుఁడు గ్రుంకె నదేమి చిత్రమో

   తొలగించండి
  2. కామేశ్వర రావు గారూ,
   మీ పూరణలన్నీ అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 13. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  News Item: "Bangladesh actor asked to leave India after TMC poll show"

  ప్రాఙ్నగరమ్మునన్ తరలి బంగ్లపు దేశపు వేషధారి భల్
  వాఙ్నియమమ్ములన్ వదలి వాగగ పోలిసు పారద్రోలగా
  వాఙ్నియమమ్ములన్ మరచి వంగల రాణియె పల్కెనిట్టులన్:
  "ప్రాఙ్నగమందుఁ జూడఁగ విభాకరుఁడౌ రవి యస్తమించెరా"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 14. కానుపించ రాహువు ప్రాఙ్నగమున, నస్త
  మించె భాస్కరు డంతన్ తిమిరము క్రమ్మె
  పక్షులన్ని చేరు కొనియె పాదపమ్ము
  ల పయికి పలుదిశల నుండి రయముగాను

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   చందో వైవిధ్యంతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు. అసనారె

   తొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
 15. ది జ్ని య మము న జని o చి యు
  ప్రాజ్నగ ము న ;నస్తమించె భాస్కరు డంతన్
  ప్రా జ్న గ ము న జాబిలి యును
  ది జ్ని య మ ముగ జని యించె దీప్తులు మెఱయన్

  రిప్లయితొలగించండి
 16. ప్రాఙ్నభమందు సంజనిత వారిజ వైరి యభిఖ్య శోభలన్
  ప్రాఙ్నగమందు జూడగ విభాకరుడౌ రవి యస్తమించెరా
  ప్రాఙ్నగమందు బుట్టిన గవాంపతి పశ్చిమ కొండలందునన్
  దిఙ్నయమమ్ము మార్చగల ధీరుడెవండును లేడు ధాత్రిలో.

  రిప్లయితొలగించండి
 17. దిఙ్నియమమనుస రించుచు
  ప్రాఙ్నభముంజీకటిముసురన్ గని శశియే
  ప్రాఙ్నభమందుదయించెను
  ప్రాఙ్నగమున, నస్తమించె భాస్కరు డంతన్.

  చీకటి ముసిరిన వేళ తూర్పునింగిలో ప్రాగ్దిశాద్రులలో చంద్రుడుదయించాడని.....

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 18. ప్రాఙ్నగమందునుండి తమ ప్రాభవమొప్పగ పశ్చిమంబుకున్
  దిఙ్నియమంబులన్నెదిరి ధీటుగజేయగ రాజ్యపాలనన్
  వాఙ్నియమమ్ముతో నడచి వారలద్రోలగ భభారతావనిన్
  ప్రాఙ్నగమందు జూడగ విభాకరుడౌ రవి యస్తమించెరా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   ఒకటి రెండు టైపు దోషాలున్నవి.

   తొలగించండి
  2. ప్రాఙ్నగరమ్మునన్ మసలి భారతదేశపు శాంతిదూతయై
   ప్రాఙ్నగమందునన్ బొడము పంకజబంధుని దీప్తి విశ్వమున్
   వాఙ్నిజభర్తయై వరలి వాసమునెంచగ స్వర్గభూమినిన్
   ప్రాఙ్నగమందు జూడగ విభాకరుడౌ రవి యస్తమించెరా!

   విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్

   తొలగించండి
  3. ధన్యోస్మి గురుదేవా!అవును భభారత అనిపడింది.
   రెండవ పూరణకూడ పరిశీలింప ప్రార్ధన!
   పైరెండు పద్యాలకూ స్ఫూర్తి మా అన్నయ్యగారి రెండవ సరదా పూరణయే! వారికి ధన్యవాదములు!

   తొలగించండి
  4. సీతాదేవి గారూ,
   మీ రెండవ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  5. ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!

   తొలగించండి
 19. నిన్నటి సమస్యకు నా పూరణ.

  సతతధ్యానపరైకచింతనమనస్స్వాధీనపంచేంద్రియుం
  డతులప్రాణిదయాస్వభావమహితుం డర్థిప్రదానాగ్రుడై
  తతధర్మంబులనాచరించ, నఘ ప్రధ్వంసాత్తతత్పుణ్యసం
  చితిలో, జంద్రకళావతంసు డిడు నిశ్శేషంబుగా సౌఖ్యమున్.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 20. మిత్రులందఱకు నమస్సులు!

  వాఙ్నిపుణత్వ యుక్తుఁడయి పల్కెడునట్టి వివేకి యొక్కఁడున్
  దృఙ్నయమార్గమందునను ప్రేమనుఁ బంచుచు సాఁగుచుండఁగా
  ధిఙ్నిశి క్రమ్మసాఁగెఁ; గుముదేశుఁడు నెమ్మది శీర్ష మెత్తియున్
  బ్రాఙ్నగమందుఁ జూడఁగ, విభాకరుఁడౌ రవి యస్తమించెరా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. దిఙ్నగబౌద్ధజైనమతదీవ్యదవైదికులన్ జయించగన్,
   ధిఙ్నుతకీర్తులై తలలు దించిరి, యట్లుగజేసినట్టి స
   మ్యఙ్నయశంకరార్యు డసదాయువునన్ దివికేగె, నక్కటా!
   ప్రాఙ్నగమందుఁ జూడఁగ విభాకరుఁడౌ రవి యస్తమించెరా.

   కంజర్ల రామాచార్య.

   తొలగించండి
  2. మధుసూదన్ గారూ,
   విరుపుతో మీ పూరణ మనోహరంగా, అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
   ***************
   రామాచార్య గారూ,
   ఆది శంకరుల ప్రస్తావనతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 21. వాఙ్నారీ వరసుతుడగు
  దిజ్నాగుడు కుందమాల దీక్షగ వ్రాయన్
  వాఙ్నియమశశియె కవితా
  ప్రాఙ్నగమున; నస్తమించె భాస్కరు డంతన్ .

  రిప్లయితొలగించండి

 22. వాజ్నిపుణత నేర్చె హనుమ
  ప్రాఙ్నగమున,. నస్తమించె భాస్కరుఁ డంతన్
  ప్రాఙ్నగమునువిడి పశ్చిమ
  దిజ్ఞ్నగమున, సరసిజములు దిగులొందంగన్

  రిప్లయితొలగించండి
 23. ప్రజ్ఞయె రూపెత్తిన గురు
  ప్రాజ్ఞుడగు సుబాసు బోసు పరమపదింపన్
  ప్రాజ్ఞులు కొనియాడిరిటుల:
  "ప్రాఙ్నగమున నస్తమించె భాస్కరుఁ డంతన్"
  **)(**
  (నేతాజీ విమాన ప్రమాదంలో తూర్పు కొండల్లో మరణించినాడని నమ్మిక!)

  రిప్లయితొలగించండి