23, ఏప్రిల్ 2019, మంగళవారం

సమస్య - 2995 (కుక్కకుఁ గొమ్ములు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కుక్కకుఁ గొమ్ములు గలవని కోవిదు లనిరే"
(లేదా...)
"కుక్కకు కొమ్ము లున్నవని కోవిదు లెల్లరుఁ జెప్పి రేకమై"

97 కామెంట్‌లు:

  1. తిక్క పలుకులు వలదు, యే
    కుక్కకుఁ గొమ్ములు గలవని కోవిదు లనిరే"
    కుక్కకు చెవులే యుండును,
    నిక్కమిది, వినుమనె నొకడు నిజసతి తోడన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వలదు + ఏ = వల దే' అవుతుంది. యడాగమం రాదు. "తిక్కగ పలుకం దగ దే। కుక్కకు..."అనండి.

      తొలగించండి


  2. అక్కా నన్జూడంగన్
    ఫక్కున నవ్వకు సుమా సభనికవులే! లా
    జిక్కేమి లేక యనరే !
    కుక్కకుఁ గొమ్ములు గలవని కోవిదు లనిరే!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. చక్కని జగతిని నిండుగ
    మిక్కిలి వింతలు గలవట మీరిన సొగసున్
    మక్కువ తీరగ పలికిరి
    కుక్కకు గొమ్ములు గలవని కోవిదు లనిరే

    రిప్లయితొలగించండి
  4. ప్రాతః కాలపు సరదా పూరణ:

    మెక్కుగ రాజకీయమున మేలగు రీతుల కోట్లు కోట్లనున్
    గ్రక్కున నైదు వత్సములు కండ్లను మూయగ చెల్లిపోవగా
    చక్కగ నెన్నికల్ కలిగి శాస్త్రుల నెల్లర సంప్రదించగా
    కుక్కకు కొమ్ము లున్నవని కోవిదు లెల్లరుఁ జెప్పి రేకమై :)

    రిప్లయితొలగించండి
  5. మైలవరపు వారి పూరణ

    *నక్కకు* వ్రాయనొక్కటియె , *నాగము* వ్రాయగ నొక్కటే , *కపిన్*
    జక్కగ వ్రాయ లేదసలు , *సామజమున్* రచియింపనొక్కటే !
    యొక్కటె *గోవు* వ్రాయ , గననొక్కటె *సింహము* వ్రాయ ., వ్రాయగా
    *కుక్కకు* కొమ్ము లున్నవని కోవిదు లెల్లరుఁ జెప్పి రేకమై"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. ఎక్కడ కౌరవుల్ , గనగ నెందరినైనను భీతి లేదు , నే...
      నొక్కడినే వధించెదను యుద్ధమునందనుచున్ ప్రగల్భముల్,
      చిక్కుల జిక్కునుత్తరుడు , సింహము కాదిది గ్రామసింహమీ
      కుక్కకు కొమ్ము లున్నవని కోవిదు లెల్లరుఁ జెప్పి రేకమై !

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. మైలవరపు వారి రెండుపూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి

    3. ఒక్కొకరొక్కశాస్త్రముననుజ్జ్వలధీమణులార్య ! మీకు నే...
      నిక్కడనిచ్చువాక్యమునకే *వ్యతిరేకము* తెల్పుమంచు *మా*
      *కుక్కకు లేవుకొమ్ములన* గొంతులనొక్కటిజేసి వేగ *మీ*
      *కుక్కకు కొమ్ము లున్నవని* కోవిదు లెల్లరుఁ జెప్పి రేకమై !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  6. కుక్కకు కొమ్మే లేదని
    యక్కయె వాదించు వేళ నాతడు చెప్పెన్
    కక్కయగు గాదె లేనిది
    కుక్కకు కొమ్ములు గలవని కోవిదు లనిరే.

    రిప్లయితొలగించండి


  7. టక్కుటమారి విద్యల తటాల్మని బాపనకుక్క నచ్చటన్
    కొక్కుగ మార్చి కొమ్ములను కూర్చి వినోదము గావెసన్ భళా
    కుక్కగ మార్చి మాంత్రికుడు కుర్రన, నోటిని వెళ్ళబెట్టుచున్
    కుక్కకు కొమ్ము లున్నవని కోవిదు లెల్లరుఁ జెప్పి రేకమై!



    జిలేబి
    హమ్మయ్య!

    రిప్లయితొలగించండి
  8. నిక్కచ్చిగ కవి గాంచును
    ఎక్కడ రవిగాంచనట్టి విషయము లన్నిన్
    చక్కగ వ్రాతను జూడగ
    కుక్కకుఁ గొమ్ములు గలవని కోవిదు లనిరే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యజ్ఞేశ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...గాంచును + ఎక్కడ = గాంచు నెక్కడ' అవుతుంది. విసంధిగా వ్రాయరాదు. "నిక్కచ్చిగ గాంచును కవి । యెక్కడ..." అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు🙏🙏🙏
      సారి జేసుకొందును.

      తొలగించండి
  9. చక్కగ నవినీతి పరుల
    చుక్కలు చూపించి వారి టెక్కును తీయున్
    నిక్కము సిబిఐ కావలి
    కుక్క కు గొమ్ములు గల వని కోవిదులని రే

    అవినీతి పరులకు చుక్కలు చూపించి, వారి టెక్కు తగ్గిస్తున్న సిబిఐ అనే చట్టం యొక్క కాపలా కుక్క(watch dog) కు కొమ్ములు ఉన్నాయని అందరూ ఒప్పుకుంటాను.

    రిప్లయితొలగించండి
  10. తిక్కన తిమ్మరా జొకడు తీర్చిన కూటమి నందు సభ్యులన్
    చక్కగఁ జెప్పఁగోరెఁ దను సాకిన చుక్కల కుక్క గొప్పలన్
    దుక్కగ నున్న దానిగని దుష్టుని తీరుకు భీతి నొందుచున్
    కుక్కకు కొమ్ము లున్నవని కోవిదు లెల్లరుఁ జెప్పి రేకమై"

    రిప్లయితొలగించండి
  11. రిప్లయిలు
    1. అక్కజ మేమి లేదు, తగ నంతగ నాత్రుతఁ జెంద బోకు, తా
      నిక్కమె చెప్పె కందికవి నేర్పు వహించి, కనన్ సమస్యలో
      నొక్కటె కాదు కొమ్మునకు నొప్పెను రెండు తెఱంగు లర్థమై
      కుక్కకు కొమ్ము లున్నవని కోవిదు లెల్లరుఁ జెప్పి రేకమై

      కంజర్ల రామాచార్య.

      తొలగించండి
    2. రామాచార్య గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  12. చక్కని న్యాయము,ధర్మము
    లెక్కించ కలియుగమందు రిక్తమగు తఱిన్
    మిక్కిలి వింతలు గనెదము
    కుక్కకుఁ గొమ్ములు గలవని కోవిదు లనిరే

    రిప్లయితొలగించండి
  13. కుక్కని తక్కువజూడకు
    మక్కువబెంచుచు విడువగ మాన్యంబుగ దా
    మిక్కిలియాస్తి నమెరికా
    కుక్కకు కొమ్ములు గలవని కోవిదులనరే!

    రిప్లయితొలగించండి
  14. సమస్య :-
    "కుక్కకుఁ గొమ్ములు గలవని కోవిదు లనిరే"

    *కందం**

    పెక్కురు మందిని డ్రైవరు
    కుక్కకు; కొమ్ములు గలవని కోవిదులనిరే
    ఇక్కడ పొట్టేలెక్కగ
    ప్రక్కల కూర్చొనగ దాని భయము కలగదా!
    .....................✍చక్రి

    రిప్లయితొలగించండి
  15. లెక్కకు యొక్కటి జూడగ,
    నిక్కము యువరాజుకు గమనింపగ రెండున్,
    పక్కున నవ్వ గలదు, నా
    కుక్కకుఁ గొమ్ములు గలవని కోవిదు లనిరే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలకృష్ణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'లెక్కకు నొక్కటి...' అనండి.

      తొలగించండి


  16. చక్కని మేక నొక్కడును సంతని దా కొని యేగుచుండగా

    కుక్కకు కొమ్ము లున్నవని కోవిదు లెల్లరు జెప్పి రేకమై

    తిక్కగ నా యమాయకుడు దెచ్చిన మేకను వీడి తారగన్

    చక్కగ మేక గైకొనుచు సాగిరి నవ్వుచు
    శాస్త్రులందరున్

    🌿 ఆకుల శాంతి భూషణ్ 🌿
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాంతిభూషణ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      అయినా మేకను శాస్త్రు లేం చేసుకుంటారు? "దొంగ లందరున్" అనండి.

      తొలగించండి
  17. మిక్కిలి దుష్టుడు రాజే
    చక్కని భార్యను కలిగియు సాధ్వుల చెరచన్
    అక్కట యీ ఛండాలపు
    కుక్కకుఁ గొమ్ములు గలవని కోవిదు లనిరే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చక్కగ విద్య నేర్పు మన శాస్త్రము దెల్పిన పద్ధతేమనన్
      గ్రక్కున కొమ్ము నుంచిన కకారము మారు కుకార శబ్దమై
      కుక్కను మాట వ్రాయుటకు కొమ్మిడ దప్పదు నెవ్వరైననూ
      కుక్కకు కొమ్ము లున్నవని కోవిదు లెల్లరుఁ జెప్పి రేకమై

      తొలగించండి
    2. సూర్య గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'ఐననూ' అనడం సాధువు కాదు. "..నెవ్వరైన నా । కుక్కకు" అనండి.

      తొలగించండి
  18. మిత్రులందఱకు నమస్సులు!

    [ఎన్నో దౌష్ట్యములు, చేయరాని పనులు చేసి, దైత్యేంద్రుడినని నిక్కినట్టి రావణుడనే కుక్కకు "శివ వర బలాఢ్యుడ"ననే కొమ్ములున్నాయని కోవిదులు వితర్కించే సందర్భము]

    "దిక్కుల చీరఁ దాల్చు శివు దీవెన లంది, దిశాధినాథులున్
    జిక్కిన బంధనమ్ము లిడి, చెల్లెలి కోర్కిని సీతఁ దెచ్చియున్,
    మిక్కిలి పాపియయ్యు, మఱి నిక్కియు నీల్గిన ’రావణాఖ్యుఁ’డన్
    గుక్కకుఁ గొమ్ము లున్న" వని కోవిదు లెల్లరుఁ జెప్పి రేకమై!

    రిప్లయితొలగించండి
  19. చక్కగ చదువుకొనక తా
    తిక్కగ పలు హితుల తొడ తిరిగెడి రౌడీ
    నిక్కచు నీల్గుచు బలికెను
    కుక్కకుఁ గొమ్ములు గలవని కోవిదు లనిరే !

    రిప్లయితొలగించండి
  20. (కాశీక్షేత్రంలో కాలభైరవాలయ సమీపసన్నివేశం)

    అక్కజ మయ్యె; భైరవుని
    యాలయ సన్నిధి నిట్టునట్టులన్
    మిక్కుట మైన రీతిని స
    మీక్షణ సేయుచు గర్జితమ్ములన్
    నిక్కుచు సారమేయములు
    నిండగు దున్నలయట్లు దూకగా
    కుక్కకు కొమ్ములున్నవని
    కోవిదు లెల్లరు జెప్పిరేకమై .

    రిప్లయితొలగించండి
  21. 🙏 మహాభ్యోన్నమః 🙏

    ఎక్కువయె మండుటెండలు
    బిక్కటిలగ వేడిమంటc బిరుదులు వాయన్
    ప్రక్కల బొడిచెడి వేడిమి
    కుక్కకుఁ గొమ్ములు గలవని కోవిదు లనిరే!

    వేడిమికి+ఉక్కకు= వేడిమికుక్కకు

    రిప్లయితొలగించండి
  22. అక్కరపై వచ్చువిదుల
    దక్కువగ కనడని యతని దాపుకు బోవన్
    ఇక్క కడ వెళ్ళనీయని
    కుక్కకుఁ గొమ్ములు గలవని కోవిదు లనిరే
    ఇక్క=ఇల్లు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతారామయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఇక్క కడ కేగనీయని' అంటే బాగుంటుందేమో? 'వెళ్ళనీయని' వ్యావహారికం కదా!

      తొలగించండి
  23. అక్కజమందగా విననార్యుడు బొంకగ ధర్మజుండని
    న్నక్కట!పుత్రశోకమున హా!యని మూర్ఛిల ద్రోణుడంతటన్
    గ్రక్కున ద్రుంచగా తలను కారణమాత్రుడు బావమర్దియే
    కుక్కకు కొమ్ములున్నవని కోవిదులెల్లరు జెప్పిరేకమై!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'విన నార్యుడు' అన్నచోట గణదోషం. "వినగ/వినిన నార్యుడు" అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా,సవరిస్తాను!

      తొలగించండి
  24. చెక్కిన శిల్పమె బతుకని
    నిక్కము తెలియంగలేడు నిశ్చల మతియై
    నిక్కిన గర్విత మతియౌ
    "కుక్కకుఁ గొమ్ములు గలవని కోవిదు లనిరే"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణతేజ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'బ్రతుకని' అనండి.

      తొలగించండి
  25. చక్కగ దీర్ఘము నుంచక
    రక్కసు గూల్చిన మనుజుడు రమయగును గదా
    అక్కఱతో నేర్వు తెలుఁగు
    కుక్కకుఁ గొమ్ములు గలవని కోవిదు లనిరే

    రిప్లయితొలగించండి


  26. కుక్కగొడుగులన్ చూసిరి
    మక్కువ గా తీసుకొ‌నిరి! మవ్వంపనుచున్
    చెక్కుచు కందంబొక్కటి
    కుక్కకుఁ గొమ్ములు గలవని కోవిదు లనిరే!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  27. రిప్లయిలు
    1. దిక్కులు పిక్కటిలంగను
      నక్కి విజృంభించు ఘోర నర మృగమునకున్
      మిక్కుటపు టుక్కున నడతఁ
      గుక్కకుఁ గొమ్ములు గలవని కోవిదు లనిరే


      ఎక్కడి వాఁడ వీ వట మదీరిత వాక్యము లోఁ గొనంగ లే
      వక్కట తక్కు పట్టుదల నందఱికిన్ బ్రతు కన్నఁ దీపియే
      చిక్కిన నొక్క పెట్టునను జీరు నినున్ వృషభేంద్రు దాపు రా
      కుక్కకు కొమ్ము లున్న వని కోవిదు లెల్లరుఁ జెప్పి రేకమై

      [రాకు +ఉక్కకు; ఉక్క = బలవంతుఁడు]

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  28. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    తిక్కది శబ్దశాసనము తీరును తెన్నును లేనిదంచుచున్
    మిక్కిలి సూత్రముల్ కలిగి మ్రింగుట కష్టము నాకికంచుచున్
    మ్రొక్కగ ఫేకు పండితుల మూర్ఖుడ నేనుర నేర్పరోయనన్:
    కుక్కకు కొమ్ము లున్నవని కోవిదు లెల్లరుఁ జెప్పి రేకమై

    తెలుగు వ్యాకరణ కర్తల పరస్పర విస్తర పోట్లాటల కోసం ఇది చూడండి:

    http://eemaata.com/em/issues/201207/1973.html?allinonepage=1

    ఉదా:

    "తన వాదనను సమర్థించుకోవడానికి ఆయన పధ్నాలుగు అంశాలను ఎత్తిచూపుతూ, చివరకు ‘పరవస్తు చిన్నయసూరి’ అన్న పేరును పర+వస్తు+చిత్+నయ+సూరి అని విడదీసి పరుల వస్తువులను, జ్ఞానాన్ని(=చిత్) నయం చేయడంలో (=తస్కరించడంలో) నేర్పరి (=సూరి) అంటూ అర్థం చెబుతూ ఎద్దేవా చేశాడు. "

    రిప్లయితొలగించండి
  29. కుక్కకు విశ్వాసంబే
    "కుక్కిన పేనట్లు గున్న గుణవంతుడనిని్
    మక్కువతో గెలిపించన్?
    కుక్కకు గొమ్ములు గలవని కోవిదులనిరే"!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదాన్ని "కుక్కిన పేనట్టు లుండు గుణనిధి యనుచున్" అనండి. 'అనిన్' అన్న ప్రయోగం సాధువు కాదు.

      తొలగించండి
  30. అక్కయనుపదములో లే
    వెక్కడ కొమ్ములును జూడ వింతగుగాదే
    ముక్కుకు మూడును మరి యీ
    కుక్కకుఁ గొమ్ములు గలవని కోవిదు లనిరే

    రిప్లయితొలగించండి
  31. అక్కటయేమనియంటిరి
    కుక్కకుగొమ్ములుగలవనిగోవిదులనిరే
    నిక్కముకలియుగమహిమలు
    కుక్కకునికమొలచునేమొకొమ్ములుభావిన్

    రిప్లయితొలగించండి
  32. రావణుని తో మంత్రులు....

    ఉత్పలమాల
    దక్కఁగ భార్య రాఘవు నుదారత కూల్చఁగ వాలినంతటన్
    నిక్కము సూర్యపుత్రునకు నీలుడు, మారుతి జాంబవంతులున్
    బెక్కురు యోధులుండ రఘువీరున కండగ నిల్చె నమ్ము మా
    కుక్కకు కొమ్ము లున్నవని కోవిదు లెల్లరుఁ జెప్పి రేకమై


    రిప్లయితొలగించండి
  33. నహుషుడు మఖశతము జేసీ ఇంద్రుని త్రోసి ఇంద్రపదవి జేబట్టినాడు. ఒకనా డింద్రుని యిల్లాలగు శచీదేవి పొందు గోరగా ఋషులు వారించారు.
    అన్న నేపథ్యం తీసుకొని నా పూరణ...

    చక్కని హోతగు నహుషుడు
    టక్కున శచి పొందడగగ ఠక్కున మునులున్
    వెక్కిలి చేష్టల నేడీ
    కుక్కకుఁ గొమ్ములు గలవని కోవిదు లనిరే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యజ్ఞేశ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'హోత + అగు'అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.

      తొలగించండి
    2. 🙏🙏🙏
      సరి జేసితి

      చక్కని హోతయగు నహుషుc
      టక్కున శచి పొందడగగ ఠక్కున మునులున్
      వెక్కిలి చేష్టల నేడీ
      కుక్కకుఁ గొమ్ములు గలవని కోవిదు లనిరే

      తొలగించండి
  34. అక్క కు రిక్కకు నక్క కు
    నిక్క ము గా కొమ్ము లేదు నిశిత ము గాగ న్
    చక్క గ వ్రాయగ నెంచి న
    కుక్క కు గొమ్ములు గలవని కోవిదులని రే

    రిప్లయితొలగించండి
  35. అక్కకు బావకు గిరికి హంసకు గేదెకు ముద్దుబిడ్డకున్
    నక్కకు పిల్లికిన్ నెమలి, నల్లికి కానగ లేముకొమ్ములన్
    ముక్కుకు ముగ్గుపిండికిని మువ్వకు నెద్దుకు చుక్కలావుకున్
    కుక్కకు కొమ్ములున్నవని కోవిదులెల్లరు చెప్పిరేకమై.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'బావకున్' అనండి. లేకుంటే గణదోషం.

      తొలగించండి
    2. పద్యం బాగుందండి. ముద్దుబిడ్డ లో కొమ్ముంది. గమనించగలరు

      తొలగించండి
  36. కుక్కకుకొమ్ములున్నవనికోవిదులెల్లరుజెప్పిరేకమై
    యక్కటవింటిమిట్టివియయబ్బురమొందితిమొక్కసారిగా
    నిక్కలికాలమందునికనెన్నివిధంబులుసూతుమోగదా
    యక్కలిపూరుషుండికనునద్భుతప్రక్రియలేమిజేయునో

    రిప్లయితొలగించండి
  37. రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  38. కందం
    ఒక్క డధికారి గదికిన్
    బ్రక్కన, బంట్రోతు నతఁడు, పనిపై కలువన్
    చిక్కులిడు చిల్లర కొరకుఁ
    గుక్కకుఁ గొమ్ములు గలవని కోవిదు లనిరే!

    రిప్లయితొలగించండి
  39. ఎక్కడి దేశము నైనను
    చక్కగ రక్షించి కాచు సైన్యమె చూడన్
    పక్కన పాకిస్తానునె
    కుక్క కు గొమ్ములు గలవని కోవిదులని రే!

    (రక్షణ బాధ్యతగల సైన్యమనే కుక్క దేశాన్నేలాలనే కొమ్ములను కలిగి ఉండడం పాకిస్తాన్ లో సహజం)

    రిప్లయితొలగించండి
  40. [23/04, 6:53 PM] కంది శంకరయ్య గారు: అమ్మయ్య! ఇప్పటికి దాదాపు 73 పూరణలు లెక్కకు వచ్చాయి!

    [23/04, 7:12 PM] విట్టుబాబు: లెక్కలఁ దేల్చిచూచెనిట లీలగ శంకరు, డీ సమస్యనే
    చిక్కని యెంచఁబోక కడు చిత్రపు భావనలన్ జెలంగిరే
    మిక్కిలి సంతసమ్మనుచు మీరిన లెక్కను గాంచి యిట్లనెన్
    "కుక్కకు కొమ్ము లున్నవని కోవిదు లెల్లరుఁ జెప్పి రేకమై"

    😁🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి
  41. మొదట వ్రాసిన పద్యంలో చిన్న పొరపాటు దానిని సరిచేసి

    అక్కకు బావకున్ గిరికి హంసకు గేదెకు గార్ధభానికిన్
    నక్కకు పిల్లికిన్ నెమలి నల్లికి కానగ లేము కొమ్ములన్
    ముక్కుకు ముగ్గుపిండికిని మువ్వకు నెద్దుకు చుక్కలావుకున్
    కుక్కకు కొమ్ములున్నవని కోవిదులెల్లరు చెప్పిరేకమై.

    రిప్లయితొలగించండి
  42. డా.పిట్టా సత్యనారాయణ
    "అక్కకు" రెండే కొమ్ములు
    చక్కని "గుర్రము"నరెండు సరిగా రాయన్
    మిక్కిలి విశ్వాసము గల
    "కుక్కకు" కొమ్ములు గలవని కోవిదు లనరే!

    రిప్లయితొలగించండి
  43. డా.పిట్టా సత్యనారాయణ
    పెక్కురు పేద సాదలకు పిడ్కెడు ముష్టి నొసంగ నొల్లకే
    దక్కిన ఆల్సిసేషియను దండిది తిండికి నోచుకొన్నదే!
    బుక్కెడు చిక్కనీయదది పుణ్యము జేసిన"చౌకిదారు"నౌ
    కుక్కకు కొమ్ములున్నవని కోవిదు లెల్లరు జెప్పి రేకమై

    రిప్లయితొలగించండి