7, ఏప్రిల్ 2019, ఆదివారం

సమస్య - 2979 (సన్మానము సేయ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సన్మానము సేయఁ దగదు సత్కవి కెపుడున్"
(లేదా...)
"సన్మానం బొనరింపరాదు కవికిన్ సౌజన్యముం జూపుచున్"

51 కామెంట్‌లు:

  1. ప్రాతఃకాల సరదా పూరణ:

    ఉన్మత్తుండయి గర్వమొంది భువిలో హుంకారమున్ జేయుచున్
    జన్మంబిచ్చుచు నారికేళ సరళిన్ జంజాటమౌ కైతలన్
    హన్మంతున్ వలె కుప్పి గంతులిడుచో హారమ్ము పూదండతో
    సన్మానం బొనరింపరాదు కవికిన్ సౌజన్యముం జూపుచున్

    రిప్లయితొలగించండి
  2. మన్మధ రూపము గాంచిన
    యున్మాదము పెరిగె నంట యువిదల కెల్లన్
    సన్మార్గము లేని కుకవికి
    సన్మానము సేయఁ దగదు , సత్కవి కెపుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. సవరించండి

      తొలగించండి
    2. మన్మధ రూపము గాంచిన
      యున్మాదము పెరిగె నంట యువిదల కెల్లన్
      సన్మార్గము లేని కవికి
      సన్మానము సేయఁ దగదు , సత్కవి కెపుడున్

      తొలగించండి


  3. తన్మాత్రల తత్వము, విడి
    యన్ముని పద్యముల వీడి యావగ భళిరా
    సిన్మా పాటల రాయగ
    సన్మానము సేయఁ దగదు సత్కవి కెపుడున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. తన్మయుడై కావ్యమ్ముల
    మన్మోహనకరముఁ వ్రాయు మాన్యుల కిలలో
    చిన్మయి, దనమాశించుచు
    సన్మానము సేయ దగదు సత్కవి కెపుడున్.

    రిప్లయితొలగించండి
  5. ఉన్మాదికి జగతెప్పుడు
    *సన్మానము సేయఁ దగదు సత్కవి కెపుడున్*
    సన్మానంబొసగిన తాఁ
    ధన్యాత్ముండై సుఫలము ధరణికిఁ బంచున్

    రిప్లయితొలగించండి
  6. సవరణతో
    ===============
    ఉన్మాదికి జగతి యెపుడు
    *సన్మానము సేయఁ దగదు సత్కవి కెపుడున్*
    సన్మానంబొసగిన తాఁ
    జన్మంబంత సుకవితల సారము బంచున్

    రిప్లయితొలగించండి
  7. చిన్మయ రూపుని దలచుచు
    తన్మయమౌ కవితలల్లి ధారుణి లోనన్
    సన్మార్గము జూప నెటుల
    సన్మానము సేయఁ దగదు సత్కవి కెపుడున్ ?

    రిప్లయితొలగించండి
  8. ఉన్మాది యైన కుకవికిల
    సన్మానము సేయఁ దగదు, సత్కవి, కెపుడున్
    సన్మిత్రులు పుస్తకములు,
    జన్మము నంకిత మొసంగు శతధృతి సతికిన్

    రిప్లయితొలగించండి
  9. ఉన్మాదికి నే వేళయు
    సన్మానము సేయఁ దగదు, సత్కవి కెపుడున్
    తన్మయము గూర్చు మధురపు
    సిన్మా పాటలకు నైన చేరుగ బిరుదుల్

    రిప్లయితొలగించండి
  10. డా.పిట్టా సత్యనారాయణ
    జన్మాలంకృత దీప్తి యీ నరులకున్ సంధిల్లకుండంగ నీ
    సన్మానంబులు నడ్డువచ్చు, బ్రకృతిన్ సాగంగనీ వీభువిన్
    తన్మాత్రాళికి లొంగి దారి మరచున్ తారాడు జ్ఞానోర్వి నీ
    షన్మాత్రంబుగ జొచ్చియైన మనడే సాజంపు మార్గంబునన్
    సన్మానం బొనరింపరాదు కవికిన్ సౌజన్యముం జూపుచున్
    (Manis moulded in the hands of people and he changes himself as weather does.We
    are not what we are.)

    రిప్లయితొలగించండి

  11. హమ్మయ్య !


    సిన్మాకై తను పాటలన్ ధనమునే చెంగల్వ పూదండగా
    సన్మార్గమ్మగు పద్యసంపదను భాషాలక్ష్మినే త్రోయుచున్
    తన్మాత్రల్, విడి, పారనొత్తి పదముల్ తాళమ్ముకై వ్రాయగా
    సన్మానం బొనరింపరాదు కవికిన్ సౌజన్యముం జూపుచున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. మైలవరపు వారి పూరణ


    నన్మీవానిగ నెంచుడీ ! కవితలన్ చప్పట్లతో మెచ్చుడీ !
    పెన్మాయన్ రచియింపుడీ మన కులంబే ధన్యమైనట్లుగాన్ !
    కన్మైకంబగునంత పైకమిడుదున్ కానిండనన్, నమ్ముచున్
    సన్మానం బొనరింపరాదు కవికిన్ సౌజన్యముం జూపుచున్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  13. ఉన్మాదుండెటుకావ్యకుండగు మహాహుంకారముంజేయుచున్
    సిన్మాయందలి బొమ్మవోలె నెగురున్ జిత్తంబు స్రుక్కంగనే
    మన్మోహంబునవాగు దూరు కుకవుల్ మాయాభ్రచిత్రంబు లే
    "సన్మానం బొనరింపరాదు కవికిన్ సౌజన్యముం జూపుచున్

    రిప్లయితొలగించండి
  14. డా.పిట్టా సత్యనారాయణ
    సన్మానంబులు! చదువరు
    జన్మానికి వదిలి యతని సాహితినంతన్
    తన్మాత్రలతో గెల్చును
    సన్మానము సేయదగదు సత్కవి కెపుడున్

    రిప్లయితొలగించండి
  15. పెన్మోసకారి కెపుడును
    సన్మానము సేయ దగదు; సత్కవి కెపుడున్
    సన్మార్గ గామి యనుచును
    సన్మానము సేయ నొప్పు సంతస మొప్పన్.

    రిప్లయితొలగించండి
  16. తన్మయపు పద్య రచనలు
    చిన్మయు ని కృప యు కలిగిన శేముషి పరుడౌ
    మన్మోహన ఘనుని యెట్టుల
    సన్మాన ము సేయ తగదు సత్కవి నె పుడున్

    రిప్లయితొలగించండి
  17. సన్మార్గంబును వృత్తవిత్తమును సౌజన్యంబు సద్భావమున్
    సన్మాన్యత్వము సత్యశౌచ నిజ విశ్వాసోద్ధతిన్ ధర్మమున్
    జన్మాంతాచరణార్యవైభవవిభా స్రష్టల్ గవుల్ యెందుచే
    *"సన్మానం బొనరింపరాదు కవికిన్ సౌజన్యముం జూపుచున్"*?

    రిప్లయితొలగించండి
  18. దుర్మార్గంబున దేశసంస్కృతి నతిన్ ద్రోహాత్ములైదూరుచున్
    కన్మోహంబున నవ్య ప్రాచ్యమునకే కైవారమున్జేయుచున్
    సన్మార్గంబును దేశభక్తిహిత సద్ధర్మ్యాంతకావేశికిన్
    *"సన్మానం బొనరింపరాదు కవికిన్ సౌజన్యముం జూపుచున్"*

    రిప్లయితొలగించండి
  19. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  20. కవి రేవ ప్రజాపతిః''- అని
    బ్రహ్మ లాగే కావ్యనిర్మాత - ప్రజాపతి

    ఉన్మాదులు తలబోతురు
    సన్మానము సేయఁ దగదు సత్కవి కెపుడున్
    తన్మార్గ మీడి ఋజువుగ
    కన్మా! లేమి గలిములన కవికొకటేగా!

    రిప్లయితొలగించండి
  21. గురువర్యులకు బ్లాగులోని కవిమిత్రులందరికి శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
    నిన్నటినా పూరణను పరిశీలింప ప్రార్థన.
    ఆ.వె. శ్రీవికారి బల్కె దీవెన లంచును
    "విరివిగా తరువుల బెంచినంత
    కాతు నెల్లజనుల, కారు నాకెవ్వరు
    రిపులు 'కాన లరయ' రేపుమాపు!"

    రిప్లయితొలగించండి
  22. కందము
    ఉన్మాదుల కేవేళను
    సన్మానము సేయదగదు.సత్కవికెపుడున్
    సన్మానము సేయ జగతి
    నున్మీలత నొంది యశమునొప్పారు గదే!
    ఆకులశివరాదలింగం వనపర్తి

    రిప్లయితొలగించండి
  23. ( సమాజానికి సందేశాన్ని , సంతోషాన్ని అందించే కవులను
    ధనంతో ఘనంగా సత్కరించాలి కాని మాటలతో కాదు )
    సన్మార్గరచనల జనుల
    దన్మయపరచెడి కవులకు ధనమున ఘనమౌ
    సన్మానము మాని ; నుడుల
    సన్మానము సేయదగదు సత్కవి కెపుడున్ .

    రిప్లయితొలగించండి
  24. ఉన్మత్తుండైన కవికి
    సన్మానము సేయదగదు;సత్కవికెపుడున్
    సన్మార్గము జూపునెడల
    సన్మానము సేయదగును సముచితరీతిన్

    రిప్లయితొలగించండి
  25. సన్మానమ్ములు బిరుదులు
    సన్మోహన విద్యయయ్యె సంపాదనకై
    తన్మయునిగ జేసి యెపుడు
    సన్మానము సేయఁ దగదు సత్కవి కెపుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సన్మార్గమ్మును వీడి పేరు నెటులో సాధింపగా నెంచి యే
      యున్మేషమ్మును లేక తానెటులనో యుత్తుత్తి బింకాలచే
      నున్మార్గుండుగ చౌర్య పద్య కవితల్ నుద్ఘోష గాఁ దెల్పగా
      సన్మానం బొనరింపరాదు కవికిన్ సౌజన్యముం జూపుచున్

      తొలగించండి
  26. ఉన్మాదియైనవారికి
    సన్మానముసేయదగదు,సత్కవికెపుడున్
    దన్మయమానసుడగుచును
    సన్మానముసేయదగునుసర్వులుమెచ్చన్

    రిప్లయితొలగించండి
  27. పెన్మాన్యంబులు ధనములు
    మున్ముందుగఁ బంచఁ దగును మూరిన భక్తిన్
    విన్మా వ్యర్థపు మాటల
    సన్మానము సేయఁ దగదు సత్కవి కెపుడున్


    విన్మా నాదు సుభాషణమ్ములు గతోద్వేగమ్మునన్ మిత్రమా
    కన్మా యర్హుఁడు గాదె యిప్పుడమి వక్కాణించు మేలం దమిన్
    సన్మౌనీంద్ర సమాన మానసునకుం జంద్రార్క ధిక్కాంతికిన్
    సన్మానం బొనరింపరాదు కవికిన్ సౌజన్యముం జూపుచున్

    రిప్లయితొలగించండి
  28. ఉన్మత్తుడౌ కవి కిలను
    సన్మానము సేయ తగదు! సత్కవి కెపుడున్
    సన్మార్గమె భూషణమై
    తన్మయమిడగ నదె చాలు తరియింపంగా!

    రిప్లయితొలగించండి
  29. ఉన్మత్తుండయి మాటకారితనము న్నూరించి కవ్వించుచున్
    పెన్మోదంబనుచు న్నసభ్యపథమున్ పెట్రేగి వ్రాయంగ నా
    సిన్మాపాటలు గీతకారుడనుచున్ శీలంబు వర్జింపగా
    సన్మానం బొనరింపరాదు కవికిన్ సౌజన్యమున్ జూపుచున్

    రిప్లయితొలగించండి
  30. నాల్గవ పాదంలో చిన్న మార్పుతో:

    ఉన్మత్తుడౌ కవి కిలను
    సన్మానము సేయ తగదు! సత్కవి కెపుడున్
    సన్మార్గమె భూషణమై
    తన్మయమిడ వేఱదేల తరియింపంగా!

    రిప్లయితొలగించండి
  31. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    సన్మార్గమ్మును వీడి నోట్లకొరకై శ్రావ్యంపు గీతమ్ములన్
    తున్మింపించుచు కాపి పేస్టు కటులన్ దుర్మార్గమౌ రీతులన్
    సిన్మాలందున ధూము ధాముల సరిన్ జింగిల్సు చిందించుచో
    సన్మానం బొనరింపరాదు కవికిన్ సౌజన్యముం జూపుచున్

    రిప్లయితొలగించండి

  32. ఉన్మత్తరచన చేసిన
    సన్మానము జేయదగదు సత్కవికెపుడున్
    సన్మానము చేయవలెను
    మన్మందిరముననిలుపుచు మానుగ భువిలో.

    రిప్లయితొలగించండి
  33. ఉన్మాదుల గమనించుచు
    సన్మానము సేయ తగదు, సత్కవి కెపుడున్
    సన్మార్గులంత కూడుచు
    మన్మోహనమౌ విధమున మన్నింప వలెన్

    రిప్లయితొలగించండి
  34. సన్మార్గమ్మును వీడినట్టి ఖలులన్ స్వార్థమ్ము నే జూపుచున్
    నున్మాదమ్మును గల్గినట్టి జనులన్నుర్వీ తలమ్మందునన్
    సన్మానంబొనరింపరాదు, కవికిన్ సౌజన్యమున్ జూపుచున్
    సన్మానమ్మును జేసినంత యది ప్రోత్సాహమ్ము గా నుండదే.

    రిప్లయితొలగించండి
  35. ఉన్నాదుల యూహలలో
    సన్మానముసేయతగదు!"సత్కవికెపుడున్
    మన్మోహన్సింగైనను
    తన్మయమున బహుమతినిడు!తలచిననాడే!

    రిప్లయితొలగించండి
  36. ఉన్మాదమ్మున భాషఁ దూట్లు పొడుచున్ ఉత్సాహియై యాంగ్లమున్
    జన్మంబెత్తిన రీతి తెన్గు పదముల్ చండాలమౌ పధ్ధతిన్
    ఉన్మూలంబును చేయు డాబు ఘనులన్ ఓర్పున్ సహించేయుచూ
    సన్మానం బొనరింపరాదు కవికిన్ సౌజన్యముం జూపుచున్ ౹౹

    రిప్లయితొలగించండి
  37. కందం
    చిన్మయ కవిత్వ ధారల
    మృన్మయ ప్రతిమలకు సైతమేర్పడ తపనల్
    తన్మయమొందించగ నే
    సన్మానము సేయఁ దగదు సత్కవి కెపుడున్?

    రిప్లయితొలగించండి
  38. "సన్మానం బొనరింపరాదు కవికిన్ సౌజన్యముం జూపుచున్
    సన్మానార్హత నెంచకుండ సభలన్ జాటించె స్వోత్కర్షకున్
    మన్మాయాభ్రమమోఘమేఘమునహర్మ్యాళిన్ సదాగాంచుచున్
    తన్మాహాత్మ్యము బావికప్పవలె నద్వైతంబుగానెంచుచో

    రిప్లయితొలగించండి
  39. చిన్మయ భావము తోడన్
    తన్మయ మొందగ వెలువడు తాదాత్మ్యం బే
    సన్మానంబౌ, మరి యే
    సన్మానము సేయఁ దగదు సత్కవి కెపుడున్?

    పెద్దలకు నమస్సులు.
    తొలి ప్రయత్నం పెద్దలు మార్గదర్శనం చేయగలరని ఆశ.

    రిప్లయితొలగించండి