డా. సీతా దేవి గారు క్షమించండి యాలస్యముగా స్పందించుచున్నందులకు. సవరణ బాగున్నదండి. భ్రామించు పద మనుమానము. భ్రామించకే కు బదులు “బంధించకే” ను పరిశీలించండి.
సందర్భము: అరేబియా సముద్ర తీరంలో ఇంద్రబోధి ఒక మహారాజు.. గొప్ప దానశీలుడు. బౌద్ధమతావలంబి. పిల్లలు లేరు. సర్వదానం చేయమన్నారు.చేశాడు. ఇంకా యాచకులు వచ్చేస్తూ వున్నారు. వారి నలా వుంచి ఆరాజు సముద్ర తీరానికి వెళ్లి పాతాళంలోని నాగరాజు కూతురైన చారుమతికి సంబంధించిన మంత్రజపం చేశాడు. ఆ దేవత ప్రత్యక్షమై తన కిరీటంలోని ఒక మణి నిచ్చింది. అది రోజూ ఎంతో బంగారాన్నిస్తూ వుండగా యాచకుల కోరికలన్నీ తీర్చి దేశాన్నీ సుభిక్షం చేశాడు. సంతానం కలుగలేదు. మంత్రులు దాన సరస్సు.. అనే ప్రాంతానికి వెళితే ఏదో పరిష్కారం దొరకవచ్చు నన్నారు. రాజు వెళ్ళాడు. విశాలమైన సరస్సు నడుమ అందమైన.. వికసించిన పద్మం. దాని మీద చిరునవ్వు చిందించే బాలుడు కనిపించారు. పసివాణ్ణి గుండెలకు హత్తుకొని రాజు "ఎవరి బిడ్డవయ్యా నీవు! నా నోముల పంటగా లభించినావు." అన్నా డంతే! వెంటనే ఉన్నట్టుండి ఆ పసివాడు మాట్లాడటం మొదలు పెట్టాడు. "నా తండ్రి సమంతభద్రుడు. నా తల్లి సమంతభద్రి. నేను పద్మ సంభవుణ్ణి." అన్నాడు. సమంతభద్రు డంటే బుద్ధుడు. బుద్ధుని అంశతో పుట్టిన ఆ పిల్లవాడు పద్మసంభవు డనే పేరుతోనే ప్రసిద్ధుడైనాడు. వజ్రవైరోచనీ మంత్రాన్ని సిద్ధింపజేసుకొన్నాడు. బౌద్ధ సంప్రదాయంలో అతని మించిన మంత్రవేత్త లే డంటారు.. ఆ పద్మ సంభవుని ముఖాన వెలిగే సరస్వతికి నమస్కరించు... అని.. *తుల్కు* అంటే బౌద్ధ సంప్రదాయంలో పూర్వ పర జన్మలు తెలిసిన వాడు. దివ్య జ్ఞానం కలవాడు. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ ప్రవిమల దానశీలుడు నృ పాలుడు శ్రీలుడు "నింద్రబోధి"కిన్ భవముఁ దరింపగా దొరికె బాలుడు "దానసరస్సు" పద్మమం దు వెలిగి.. తా నెవండొ యొక "తు"ల్కన బల్కిన యట్టి "పద్మ సం భవు"ని ముఖమ్మునన్ వెలుఁగు వాణికి వందన మాచరింపుమా!
✒~డా.వెలుదండ సత్యనారాయణ 19.4.19 -----------------------------------------------------------
రిప్లయితొలగించండిప్రాతః కాలపు సరదా పూరణ:
వివరములన్ని పట్టుబడి బింకము నిచ్చుచు నన్నపూర్ణకున్
చవిగొని హస్తి శీర్షమును చక్కగ కూర్చుచు ప్రాణమీయగా
నవనవ లాడు పుత్రునకు నవ్వులు రాగనె బుజ్జగించెడిన్
భవుని ముఖమ్మునన్ వెలుఁగు వాణికి వందన మాచరింపుమా
వాణి = పలుకు
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండివాణి శబ్దానికి ఉన్న అర్థాంతరంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
__/\__
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండికవికవితావనాంతరవికస్వరనవ్యసుమప్రకాశయై
నవరుచిరార్థభావగుణనందితదివ్యముఖారవిందయై
ప్రవిమలవేదవాఙ్మయశుభాకృతి భారతి నిత్యపద్మసం...
భవుని ముఖమ్మునన్ వెలుఁగు వాణికి వందన మాచరింపుమా !.
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అత్యద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిచిరుసవరణతో 🙏
తొలగించండికవికవితావనాంతరవికస్వరనవ్యసుమప్రకాశయై
నవరుచిరార్థభావగుణనందితదివ్యముఖారవిందయై
ప్రవిమలవేదవాఙ్మయశుభాకృతి పల్కుల రాణి పద్మసం...
భవుని ముఖమ్మునన్ వెలుఁగు వాణికి వందన మాచరింపుమా !.
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
ధవళశరీర ! పర్వతసుతానన నవ్య సరోజభాస్కరా !
తొలగించండిప్రవిమల *విద్యలన్* *యశము* *భాగ్యము* నిమ్మని నేను కోరి సం...
స్తవమును జేసినంతనె *తథాస్తు* *తథాస్తు* *తథాస్తు* నీకనన్
భవుని ముఖమ్మునన్ వెలుఁగు వాణికి వందన మాచరింపుమా !.
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
రిప్లయితొలగించండిశివుని,చలిమలకుమార్తెను,
సువర్ణవర్ణుని, సిరిని వసుంధరను, జిలే
బి! వృకోదరుని, భళి కమల
భవుని ముఖమ్మునను వెలుఁగు వాణిఁ గొలువుమా!
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చిన్న పద్యంలో మొత్తం దేవతల లిస్టే ఇచ్చారు!
రిప్లయితొలగించండికవులను, శంకరాభరణ కందివరార్యుల బ్లాగువీరులన్
కవచము గాను గాచి సభ గట్టిగ ముందుకు సాగ సర్వదా
శివుని, జిలేబి! పార్వతిని, శ్రీకరుడిన్ సిరి,యా వసుంధరన్
భవుని, ముఖమ్మునన్ వెలుఁగు వాణికి వందన మాచరింపుమా
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో శివుని ప్రస్తావించారు. మరి నాలుగవ పాదంలోని భవుని' అనడం పునరుక్తి అవుతుందేమో?
తొలగించండిభవుడంటే బ్రహ్మ అన్న అర్థముందని ఆంధ్రభారతి ఉవాచ :)
జిలేబి
అవనిని బ్రోచు జనని హం
రిప్లయితొలగించండిసవాహిని చదువుల పడతి శారద శ్రీ మే
దావిని వాగ్భామ వనజ
భవుని ముఖమ్మునను వెలుఁగు వాణిఁ గొలువుమా.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదం గురువుతో ప్రారంభమయింది.
రిప్లయితొలగించండిఅవదోహాస్థిత నమ్మా
ధవునాత్మ భవుఁ కమలజుని, తామర చూలిన్
కవులకు మేలగు శారద
భవుని ముఖమ్మునను వెలుగు వాణి గొలువుమా!
అవదోహము- సముద్రము
యజ్ఞేశ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వారిజ భవుని...' అంటే బాగుంటుందేమో?
ధన్యవాదములు🙏
తొలగించండి( బమ్మెర గ్రామంలోని మహాకవి పోతన స్మారక చిహ్నం వద్దకు తమ్ముని తీసుకువచ్చిన అన్న అంటున్నాడు )
రిప్లయితొలగించండినవవిధభక్తులన్ బొదిగి
నందకుమారుని లీల దెల్పు భా
గవతమునందు పాఠకుల
కన్నుల కద్దెను పోతనార్యు ; డిం
కెవనికి లేని భాగ్యమిది ;
కేసనకున్ సతి లక్కమాంబకున్
భవుని ముఖమ్మునన్ వెలుగు
వాణికి వందన మాచరింపుమా !
( భవుడు - జన్మించినవాడు )
జంధ్యాల వారూ,
తొలగించండిఅద్భుతమైన పూరణ. మనోహరంగా ఉంది. అభినందనలు.
కవుల కు విద్యార్థు ల కును
తొలగించండిసువిధ పు మార్గ మును జూపుసుందర మాతన్
దివిజు ల వంద్యను పంకజ
భవు ని ముఖ మ్మున ను వెలుగు వాణి గొలువు మా !
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ!
తొలగించండిమనోహరమైన పూరణండీ,అభినందనలు!
తొలగించండికవితాలంకృత కావ్యము
రిప్లయితొలగించండిచెవికింపగు గీతవాద్య శ్రేణులరీతిన్
భువిని దనరారెడు కమల
భవుని ముఖమ్మున వెలుగు వాణిగొలువుమా
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!
తొలగించండిరవికుల సోమునిన్,మహిత రమ్య గుణాఢ్యుని, రామచంద్రునిన్,
రిప్లయితొలగించండిఅవిరళ శాంత శోభితు,నవారిత శౌర్య పరాక్రమోన్నతున్,
ప్రవిమల భక్త రక్షణ శుభప్రతిపాద్యు,విశేష పూజ్య,వై
భవుని,ముఖమ్మునన్ వెలుగు వాణికి వందన మాచరింపుమా!
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ వైవిధ్యంగా, మనోహరంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదములు
తొలగించండిడా.పి సత్యనారాయణ
రిప్లయితొలగించండిశివునికి నర్ధాంగియె యుమ
నవవిధి నిర్మాణమైన నాణ్యత గలుగన్
ఎవరికి సాధ్యము వినగా?!
భవుని ముఖమ్మునను వెలుగు వాణి గొలువుమా
(అర్ధ నారీశ్వరుని నోటినుడి ఆడ,మగ వాణి అవిరళంగా ఉంటుంది,వినుటకు.ఆవాణిని కొలిచిన పుణ్యమబ్బునని;)
డా పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిఠవఠవలేక కాశినట ఠావును దప్పగ లేని వారలా
రవమువినంగలేరు తల-రాసిన రాతకు గ్రుంగనేల? నీ
భవమున(జీవనమున)రామ నామమును భద్రముగా వినిపించు నిక్కడే
భవుని ముఖమ్మునన్ వెలుగు వాణి(voice) కి వందన మాచరింపుమా!
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
డా.పిట్టా సత్యనారాయణ
తొలగించండిఆర్యా,ధన్యవాదాలు. నిన్న మీకై ప్రతీక్షించితిని.ఆ.సభ బాగుగా జరిగింది. ఇక ప్రబంధ విజేతలెవరోకాని Short list లో ని పేర్లైనా తెలిసినవా?
భవబంధ విమోచని! స
రిప్లయితొలగించండిర్వ విజయ దాయని! సురవర వందిత దేవీ!
ధవళాంగిని! తోయజసం
భవుని ముఖమ్మునను వెలుగు వాణి గొలువుమా
శాంతి భూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శివములు సతతము కమలో
రిప్లయితొలగించండిద్భవుఁని ముఖమ్మునను వెలుఁగు, వాణిఁ గొలువుమా"
ధవుడా, పొందు మన మనో
జవసులు విద్దెలని బల్కె సతి పతితోడన్
పూసపాటి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కవుల మనమ్మున కొలువై
రిప్లయితొలగించండిభవముగ విద్యల నొసగుచు వారలకెపుడున్
భువన విధాత కమల సం
భవుని ముఖమ్మునను వెలుఁగు వాణిఁ గొలువుమా 🙏
సూర్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భవుడన నర్ధము బ్రహ్మయ
రిప్లయితొలగించండిభవుని ముఖమ్ముననువెలుగువాణిగొలువుమా
పవలునుఱేయియునాకను
సవినయముగగొలుచునెడలసత్కవిజేయున్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'భవుడు' అన్న పేరు బ్రహ్మకు కూడా ఉందా?
సవరించిన పద్యము.....
రిప్లయితొలగించండిఅవనిని బ్రోచు జనని హం
సవాహిని చదువుల పడతి శారద శాబ్దిన్
ధవళాంగిఁ భారతి, వనజ
భవుని ముఖమ్మునను వెలుఁగు వాణిఁ గొలువుమా.
విరించి గారూ,
తొలగించండిసవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అవిరతమౌ జ్ఞానవిదుడు
రిప్లయితొలగించండిభవితకు నుపయుక్తమైన భాష్యంబులిడన్
జవిగొని, వేదవిద్యాసం
భవుని ముఖమ్మునను వెలుఁగు వాణిఁ గొలువుమా
సీతారామయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. సవరించండి.
🙏🏽
తొలగించండిసువిశాల చతుర్దశ భువ
రిప్లయితొలగించండిన విరచ నాత్మక సురాద్యు నలినజు వేదాం
గ విదుని సిత చతురాస్య వి
భవుని ముఖమ్మునను వెలుఁగు వాణిఁ గొలువుమా
నవ కుము దాభ లోచన సనాతన భవ్య వికుంఠ లోక స
న్నివసన భక్త పాప హర నిర్జర రక్షక నిష్ఠురోగ్ర దా
నవ హర పద్మనాభ వర నాభి బిలోద్భవ దివ్య పద్మ సం
భవుని ముఖమ్మునన్ వెలుఁగు వాణికి వందన మాచరింపుమా
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
ఆర్యా!నిన్నటి నా సవరించిన పూరణ సరిజూడ ప్రార్ధన
తొలగించండిఅరయన్ జీవుడు కర్మబద్ధుడగు మాయామోహ జాలంబుచే
నరిషడ్వర్గ మొసంగ, శ్రీహరిని నిత్యంబీవు ప్రార్ధించుమా
కరుణన్ గావగ జన్మమృత్యువుల చక్రంబందు భ్రామించకే
పరమౌధామము జేరగా తుదకు సంభావించి సాన్నిధ్యమున్
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు
తొలగించండిడా. సీతా దేవి గారు క్షమించండి యాలస్యముగా స్పందించుచున్నందులకు.
సవరణ బాగున్నదండి.
భ్రామించు పద మనుమానము. భ్రామించకే కు బదులు “బంధించకే” ను పరిశీలించండి.
ధన్యవాదములండీ,సవరిస్తాను!నమస్సులు!
తొలగించండికవితల వ్రాయుచు నిత్యము
రిప్లయితొలగించండిభువిపై వెలుగగ సతమ్ము, పూనిక తోడన్
ప్రవిమల భక్తిని సరసిజ
భవుని ముఖమ్మునను వెలుఁగు వాణిఁ గొలువుమా
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అవిరళప్రేమదేవతకునార్షవిభాగపునగ్రదేవతా
రిప్లయితొలగించండిభవునిముఖమ్మునన్వెలుగువాణికివందనమాచరింపుమా
పవలునురేయియున్దనరుభక్తినిబూజనుజేయుచోనిల
న్గవనమునందుజేయునినుగాకలుదీరినమేటివానిగా
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆటబిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
అసెంబ్లీ ఎన్నికలు 2018:
క్షవరము జేతు నీకనుచు కాచుకు కూర్చొని భాగ్యనగ్రికిన్
కవనము తోడ కాష్ఠలిడి కంపము మీరగ మైకులందునన్
భవుభవుమంచు బాబుకిట భగ్గున మండెడి రట్టులిచ్చు నా
భవుని ముఖమ్మునన్ వెలుఁగు వాణికి వందన మాచరింపుమా
భవుడు = చంద్ర శేఖరుడు
వాణి = పలుకు
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ ఆటవిడుపు పూరణ బాగుంది. అభినందనలు.
అవిరళమౌ కవిత్వమది యద్భుతరీతిని చెప్ప నెంచినన్
రిప్లయితొలగించండిప్రవిమల దీక్ష పుస్తకములన్ పఠియించుచు నిచ్చతోడ, మా
ధవుని స్మరించుచున్ మదిని తద్దయు భక్తి ఘటించి, పద్మసం
భవుని ముఖమ్మునన్ వెలుఁగు వాణికి వందన మాచరింపుమా
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఅవునవునటంచును కమల
భవుని ముఖమ్మునను వెలుఁగు వాణిఁ గొలువుమా
జవరాలా పద్యంబులు
జవాదులద్దుకొని నడచు చకచకయనుచున్
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఉవిదల భాగ్యమేయనగ నున్నతమార్గము జూపజాలితో
రిప్లయితొలగించండిప్రవిమల భక్తిభావమున పార్వతి కోరికమేర ప్రీతితో
సవివరమైన రీతిని ప్రశస్తపు నోములనెన్నొ చెప్పెడిన్
భవుని ముఖమ్మునన్ వెలుగు వాణికి వందన మాచరింపుమా
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!
తొలగించండినవయువకాళి చూడఁగఁ వి
రిప్లయితొలగించండినాశన మార్గము సాగెఁ దమ్ముడా!
పవనపు జోరులోనఁ బెను
పాట్లనుఁ బొందగ, వీడు వేదపున్
స్తవనములన్ బఠించెఁదన
తండ్రిని మెచ్చగనంత,నత్తనూ
భవుని ముఖమ్మునన్ వెలుఁగు
వాణికి వందన మాచరింపుమా!
రాకుమార గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. సవరించండి.
స్తవన/ములన్ బ/ఠించె,ద/న తండ్రి/ని మెచ్చ/గ నంత/నత్తనూ
తొలగించండిగురువుగారు! పొరపాటేమిటో తెలియడం లేదు నాకు.తెలుప ప్రార్థన
శ్రవణానందపు రాగము
రిప్లయితొలగించండికవివరులందించు భావకల్పనలందే
వివరణబంచెడి విజ్ఞత
భవుని ముఖమ్మునను!వెలుగు!వాణిగొలువుమా
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నా ప్రయత్నం :
రిప్లయితొలగించండికందం
సువిశాల భావవీధుల
గవిత్వ ధార కురిపించు కౌముది నందున్
భవితవ్యమరంగ వనజ
భవుని ముఖమ్మునను వెలుఁగు వాణిఁ గొలువుమా
చంపకమాల
రవి శశి నేత్రపర్వముగ రాజిలు కన్నుల జాలిఁ జూపగన్
బ్రవిమల వాక్కులన్ జెలఁగు భావపుటర్చన జేయునార్తిఁ బా
టవమున చిత్తమా! తనరి డంబమెరుంగని రీతిఁ బద్మసం
భవుని ముఖమ్మునన్ వెలుఁగు వాణికి వందన మాచరింపుమా!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
అవిరళభక్తిభావసముదాహృతవిశ్రుతవర్ణనీయ, స
రిప్లయితొలగించండిత్కవనకళాప్రదాత్రి, కరకంజవిరాజితపుస్తకన్, ద్రయీ
ప్రవిమలవాగ్విలాసిని, విపంచిసమంచితహస్త, నాభిసం
భవుని ముఖమ్మునన్ వెలుగు వాణికి, వందనమాచరింపుమా!.
కంజర్ల రామాచార్య.
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
కవిహృదయమ్ములో నిలిచి కావ్య పటుత్వము బెంచుమాతయే
రిప్లయితొలగించండియవనిని బ్రోచునట్టి ధవళాంబరి, భారతి జ్ఞానదాయినిన్
భవభయ హారియై సుజన బాధలు తుర్చెడు బాణ, పద్మసం
భవుని ముఖమ్మునన్ వెలుఁగు వాణికిఁ వందన మాచరింపుమా.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శివుని కరమేన సతి,శ్రీ
రిప్లయితొలగించండిధవుండు హౄదయమున దాల్చె ధరణిని లక్ష్మిన్
శివమును గూర్చె డి తోయజ
భవుని ముఖమ్మునను వెలుగు వాణి గొలువుమా
కవితల నల్లగ నెంచిన
కువలయ మందున విడువక కూరిమి తోడన్
జవమున మరవక సరసిజ
భవుని ముఖమ్ము నను వెలుగు వాణి గొలువుమా:
డా. ఉమాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
భువిపతి వక్షమ్మున వై
రిప్లయితొలగించండిభవముగ కొలువైన రమను,భవులోఁ సగమై
నివసించు యుమను,నీరజ
భవుని ముఖమ్మునను వెలుఁగు వాణిఁ గొలువుమా
రాకుమార గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
భవుని ముఖమ్మునన్ వెలుఁగు వాణికి
వందన మాచరింపుమా
సందర్భము: అరేబియా సముద్ర తీరంలో ఇంద్రబోధి ఒక మహారాజు.. గొప్ప దానశీలుడు. బౌద్ధమతావలంబి. పిల్లలు లేరు. సర్వదానం చేయమన్నారు.చేశాడు. ఇంకా యాచకులు వచ్చేస్తూ వున్నారు.
వారి నలా వుంచి ఆరాజు సముద్ర తీరానికి వెళ్లి పాతాళంలోని నాగరాజు కూతురైన చారుమతికి సంబంధించిన మంత్రజపం చేశాడు. ఆ దేవత ప్రత్యక్షమై తన కిరీటంలోని ఒక మణి నిచ్చింది. అది రోజూ ఎంతో బంగారాన్నిస్తూ వుండగా యాచకుల కోరికలన్నీ తీర్చి దేశాన్నీ సుభిక్షం చేశాడు. సంతానం కలుగలేదు.
మంత్రులు దాన సరస్సు.. అనే ప్రాంతానికి వెళితే ఏదో పరిష్కారం దొరకవచ్చు నన్నారు. రాజు వెళ్ళాడు. విశాలమైన సరస్సు నడుమ అందమైన.. వికసించిన పద్మం. దాని మీద చిరునవ్వు చిందించే బాలుడు కనిపించారు.
పసివాణ్ణి గుండెలకు హత్తుకొని రాజు "ఎవరి బిడ్డవయ్యా నీవు! నా నోముల పంటగా లభించినావు." అన్నా డంతే!
వెంటనే ఉన్నట్టుండి ఆ పసివాడు మాట్లాడటం మొదలు పెట్టాడు. "నా తండ్రి సమంతభద్రుడు. నా తల్లి సమంతభద్రి. నేను పద్మ సంభవుణ్ణి." అన్నాడు.
సమంతభద్రు డంటే బుద్ధుడు. బుద్ధుని అంశతో పుట్టిన ఆ పిల్లవాడు పద్మసంభవు డనే పేరుతోనే ప్రసిద్ధుడైనాడు. వజ్రవైరోచనీ మంత్రాన్ని సిద్ధింపజేసుకొన్నాడు. బౌద్ధ సంప్రదాయంలో అతని మించిన మంత్రవేత్త లే డంటారు.. ఆ పద్మ సంభవుని ముఖాన వెలిగే సరస్వతికి నమస్కరించు... అని..
*తుల్కు* అంటే బౌద్ధ సంప్రదాయంలో పూర్వ పర జన్మలు తెలిసిన వాడు. దివ్య జ్ఞానం కలవాడు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
ప్రవిమల దానశీలుడు నృ
పాలుడు శ్రీలుడు "నింద్రబోధి"కిన్
భవముఁ దరింపగా దొరికె
బాలుడు "దానసరస్సు" పద్మమం
దు వెలిగి.. తా నెవండొ యొక
"తు"ల్కన బల్కిన యట్టి "పద్మ సం
భవు"ని ముఖమ్మునన్ వెలుఁగు
వాణికి వందన మాచరింపుమా!
✒~డా.వెలుదండ సత్యనారాయణ
19.4.19
-----------------------------------------------------------