5, ఏప్రిల్ 2019, శుక్రవారం

సమస్య - 2978 (తల్లికిం దిండి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తల్లికిం దిండి నిడుట వ్యర్థమ్ము సుమ్ము"
(లేదా...)
"తల్లికిఁ దిండి పెట్టుట వృథా యని చెప్పును ధర్మశాస్త్రముల్"

86 కామెంట్‌లు:

 1. సేద దీర్చును సతియని మోద మలర
  బ్రమను మునిగిన పతియట వలను చిక్కి
  క్రొత్త లోకము నందున మత్తు గాను
  తల్లికిం దిండి నిడుట వ్యర్ధమ్ము సుమ్ము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "క్రొత్తలోకమ్ములో మున్గి గొణుగుచుంద్రు" అంటే ఇంకా బాగుంటుందేమో?

   తొలగించండి
 2. ప్రాతఃకాల సరదా పూరణ:

  అల్లము వోలె పుత్రునిట హైరన జేయుచు కొంటె మాటలన్
  పిల్లల జీన్సు టాపులను పెట్టుచు పోరున కట్టనీక భల్
  బెల్లము వోలు భార్యకిట వేదన నిచ్చుచు త్రాడు త్రెంచెడిన్
  తల్లికిఁ దిండిపెట్టుట వృథా యని చెప్పును ధర్మశాస్త్రముల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదాన్ని "బెల్లము వోలు భార్య గని ప్రేమను చూపుచు చెప్పు నిట్టులన్..." అంటే ఇంకా బాగుంటుందేమో?

   తొలగించండి

  2. ఎక్కడ ఎక్కడ ఆ తల్లి అత్తయ్య :)   జిలేబి

   తొలగించండి
  3. శాస్త్రి గారూ,
   మీ పాఠమే సరియైనది. నా అవగాహనలో లోపముంది. మన్నించండి.

   తొలగించండి
  4. బెంగాలులో ముప్ఫై రూపాయలు చేతిలో పెట్టి మధుర-బృందావనానికి పంపుతారు...హేమా మాలినిని అడగండి:

   "Actor-politician Hema Malini on Thursday sought to defend her remarks that widows from West Bengal and Bihar > should not crowd Vrindavan in Uttar Pradesh, saying she said this in the context of how they were being ignored in their home states and government not doing enough for them."

   https://www.google.co.in/amp/s/www.thehindu.com/news/national/other-states/hema-malini-defends-her-remarks-on-vrindavan-widows/article6422898.ece/amp/

   తొలగించండి
  5. అంత పెద్ద మాట అనకండి సార్! ఏదో సరదాకి వ్రాసేను...కిరొసిన్ పోసి అగ్గి పెట్టెనిచ్చే తల్లుల గురించి...

   తొలగించండి
 3. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,


  గు రు భ్యో న మః నిన్నటి పూరణ స్వీకరింప ప్రార్థన


  1) అరయగ విఘ్నశైలముల నన్నిటి గూల్చు నగారి యెవ్వరో ?

  2) పురుషునిపై లతాంగిపయి పుష్పశరమ్ముల వేసి , వారిలో

  మరులను గూర్చు మారుడు కుమారుడగున్ గన నేరకిన్ ?

  3) హరక దృగానల జ్వలితుడౌ యల దర్పకు నామ మెద్దియో ?

  4) సరసిజజుండు పుత్రుడగు శౌరికి , నగ్రజు డౌ విలాసికిన్ ;

  స్మరుడు జగత్ప్రసిధ్ధుడు ; ‌ ప్రజాపతి వానికి చెప్పు మే మగున్ ?


  .....................................................................................
  |కరిముఖు|డబ్దినందనకుకన్నకుమారు |డనంగు| డన్నయౌ |
  ------------------------------------------------------------------------------


  మారుడు = విలాసి = స్మరుడు =దర్పకుడు ‌‌ ; ‌‌‌‌‌‌‌‌

  హరక + దృక్ + అనల‌ + జ్వలితుడు = శివుని దృష్టి

  మంటలకు కాలినవాడు


  ------------------------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 4. తల్లి దండ్రులె ప్రత్యక్ష దైవమంచు
  ధర్మ శాస్త్రముల్ దెలిపెనీ ధరణియందు
  తల్లికిం దిండి నిడుట వ్యర్థంబు సుమ్మ
  నుచును మనుజుడనెడువాడు నుడువ బోడు.

  రిప్లయితొలగించండి


 5. జల్లెడ లాంటి బుద్ధియది! సత్యము నెప్పుడు దాల్చదయ్య తా
  నుల్లము లోపలన్, జవురి నొప్పెడు రీతిని గోలుదిప్పుచున్
  తల్లికిఁ దిండి పెట్టుట వృథా యని చెప్పును !ధర్మశాస్త్రముల్
  కల్లయు నెప్డు చెప్పదయ కాన సవిత్రిని నెట్టమాకుమా!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నెట్టబోకుమా' అనండి.

   తొలగించండి
 6. మైలవరపు వారి పూరణ

  పల్లవితానురాగ , పతిపాదసమర్చనశీల , జీవితం...
  బెల్ల సుతాళి వృద్ధి మదినెంచి త్యజించిన త్యాగమూర్తి నీ...
  కల్లము గాగ దోచ , సతమామెను దిట్టుచు ., లోకభీతితోఁ
  దల్లికిఁ దిండి పెట్టుట వృథా యని చెప్పును ధర్మశాస్త్రముల్ !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి


 7. అరరె! తెలగాణ బిడ్డ చంద్రా! వినవలె
  మంచి మాట నెల్లరికిని మనవి! మేలు
  తల్లికిం దిండి నిడుట! వ్యర్థమ్ము సుమ్ము
  దీనిపైన చర్చలిక సుదీర్ఘముగను!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 8. మల్లియ వంటి యుల్లమున
  మంచిగ బెట్టును గోరుముద్దలన్ ;
  చెల్లనిబిడ్డ యైన నొడి
  జేరిచి తట్టును బుజ్జగింపుతో ;
  కల్లలమాటలాడి తన
  కంటిని గిల్లిన నొచ్చుకోని యే
  తల్లికి దిండిపెట్టుట వృ
  థా యని చెప్పును ధర్మశాస్త్రముల్ ?

  రిప్లయితొలగించండి
 9. తేటగీతి
  ఆమె నవమాసములు మోయ నవతరించి
  తనయునిగ నిన్ను లాలించి స్తన్యమొసఁగ
  నింతవాడైతె యింగితమ్మేది? యెటుల
  తల్లికిం దిండి నిడుట వ్యర్థంబు సుమ్ము?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   అధిక్షేపాత్మకమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 10. దేవుడే లేడనగలడే దేశమందు?
  దల్లి లేదనె ధైర్యమే ధరణి యందు?
  తల్లికిం దిండి నిడుట వ్యర్థంబు సుమ్ము
  యన్న నెఱుఁగడే దేవుండె యమ్మ రూపు?

  రిప్లయితొలగించండి
 11. మరల జన్మము నొందెడి మనుజులకును
  సకల జీవులకును చెరసాల యగును
  దేహ గేహములాది; గతించినట్టి
  తల్లికిం దిండినిడుట వ్యర్థమ్ము సుమ్ము.

  రిప్లయితొలగించండి
 12. . ఆటవెలది
  తల్లి దండ్రియు ప్రత్యక్ష దైవములును
  ప్రథమ దైవంబు దల్లియే వసుధయందు
  తల్లకిం దిండి నిడుట వ్యర్థం బు సుమ్మ
  నెడి నరుడు నరుడౌనె మూర్ఖుడును గాక.
  ఆకుల శివరాజలింగం వనపర్తి

  రిప్లయితొలగించండి
 13. సేవ జేయుట కష్ట మై చిందు లేసి
  భర్త తో బల్కె నొక్కతె పరుష ముగను
  తల్లి కి o దిండి నిడు ట వ్యర్థమ్ముసుమ్ము
  వృద్ద సదనముజేర్పింప పీడ తొలగు

  రిప్లయితొలగించండి


 14. పనికి మాలిన కొడుకని వాని జూచి
  తల్లి, కిం, దిండి నిడుట వ్యర్థమ్ము సుమ్ము
  తలచు? తనదు ప్రేమ యలవి ధాత్రియు‌ ధరి
  యించు భారము రీతి పయికొనుకాద!

  కిం - ఎవతె?


  జిలేబి

  రిప్లయితొలగించండి
 15. తల్లిదండ్రుల ప్రేమతో తలచువాడు
  స్వర్గ సౌఖ్యముల్ తప్పక బడయు చుండు
  తల్లికిం దిండి నిడుట వ్యర్థమ్ము సుమ్ము
  యనుచు చనువానికి కలుగును నరకమ్ము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సుమ్ము + అనుచు' అన్నపుడు యడాగమం రాదు. "సుమ్మ।టంచు" అనండి.

   తొలగించండి
  2. గురువర్యులకు నమస్సులు. సవరణకు ధన్యవాదములు.
   తల్లిదండ్రుల ప్రేమతో తలచువాడు
   స్వర్గ సౌఖ్యముల్ తప్పక బడయు చుండు
   తల్లికిం దిండి నిడుట వ్యర్థమ్ము సుమ్మ
   టంచు చనువానికి కలుగు యమసదనము

   తొలగించండి
 16. జన్మనిడి యింతవానిగ చక్కదిద్ద
  సాధ్యమైనంత వరకు నీబాధ్యతగద
  తల్లికిం దిండి నిడుట; వ్యర్థమ్ము సుమ్ము
  యెంత చదువుచదువ దీనినెరుగ కున్న

  రిప్లయితొలగించండి
 17. మాతృదేవోభవయటన్న మాన్యవాక్కు
  తల్లి పరమాత్మ ప్రతినిధి దాంతులైన
  నతులొనర్పదగు,నెటుల నరులు నేడు
  *తల్లికిం దిండి నిడుట వ్యర్థమ్ము సుమ్ము*

  రిప్లయితొలగించండి
 18. కంటి కగుపడు దైవము కన్నతల్లి
  సంతు వంతుగ భక్తిని సంతసమున
  తల్లికిం దిండినిడుట;వ్యర్ధము సుమ్ము
  తల్లిదండ్రుల విడునట్టి తనయు బ్రతుకు

  తల్లిదండ్రులమీద దయలేని పుత్రుండు వేమన

  రిప్లయితొలగించండి
 19. కూటి కొరకై నలమటించు చంటిబిడ్డ
  కిడక మెతుకు నెంగిలి సేయ నిష్టపడని
  చల్లగాఁ జూచు లోకాల తల్లికిని!మ
  తల్లికిం!దిండి నిడుట వ్యర్థమ్ము సుమ్ము

  రిప్లయితొలగించండి
 20. అరుణ రుధిరమ్ము పాయిగా నార్తి బాప,
  పెద్ద గయినాక బెళ్ళామె బెద్ద దలచి
  తల్లికిం దిండి నిడుట వ్యర్థంబు సుమ్ము
  నన్న దైవ దూషణకన్న నఘము సుమ్ము!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. యజ్ఞేశ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అయినాక' అన్నది వ్యావహారికం. "పెద్దవాడయి పెండ్లామె" అనండి.

   తొలగించండి
 21. తేటగీతి పద్యమును పొరపాటున ఆటవెలది గా ప్రచురించడమైనది గమనించప్రార్థన. ఆకులశివరాజలింగం వనపర్తి

  రిప్లయితొలగించండి
 22. తిన్న వెంటనే వాంతులు, నన్న మునిడి
  తల్లికిం దిండి నిడుట వ్యర్థమ్ము సుమ్ము,
  జావ గాచి యిచ్చుట మేలు, జఠర మందు
  శక్తి లేదని డాక్టర్లు సంశ యించె
  నని పలికె భర్త బాధతో నాలితోడ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కుమార్ గారూ,
   మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.
   "సంశయించి। రని పలికె..." అనండి.

   తొలగించండి
 23. తోటకూర నాడు కొడుకు తోడు నిలిచి
  తప్పు దెలియగ జెప్పక తాను జేరి
  తప్పు దారిని బట్టించు తామసంపు
  తల్లికిం దిండి నిడుట వ్యర్థమ్ము సుమ్ము

  రిప్లయితొలగించండి
 24. "తల్లికిం దిండి నిడుట వ్యర్థమ్ము సుమ్ము"
  తల్లిదండ్రులు గురువులు దనరుమనకు
  దైవ సములార్య!వారిని దగువి ధముగ
  సత్క రించగ వలయును సాదరమున
  తిండి వెట్టుట మనవిధితెలిసి కొనుము

  రిప్లయితొలగించండి
 25. యోగ్యతనునది పూర్తిగ మృగ్య మయ్యి
  బాధ్యతయె లేక నిత్యము బ్రదుకు చుండి
  భ్రష్ట మైనట్టి ధూర్తుని దృష్టి లోన
  "దల్లికిం దిండి నిడుట వ్యర్థమ్ము సుమ్ము"

  రిప్లయితొలగించండి
 26. తల్లి దైవంబు సమముగా దలపకుండ
  తల్లికిం దిండి నిడుట వ్యర్థంబు సుమ్ము
  యనుచు భావించు టెంతయో యఘము గాదె
  తల్లి దండ్రుల కృప జూడ ధైర్యమిచ్చి
  మేడిపురవాస నరసింహ మేలు మమ్ము!

  పసి దనమున నా యాకలిc బాల దీర్చె,
  జిన్న వయసు దలపకళ్ళు జెమ్మగిల్లె,
  జననిని దలువ పద్యాలు జాలువారె
  అమ్మ లేని నాకన్నియు యీవ గావె
  మేడిపురవాస నరసింహ మేలు బ్రోవు!

  శ్రీ గురుభ్యోన్నమః
  దుందుభీ నది తీరమున మేడిపూర్ నందు
  మత్ పితృదేవులు ప్రతిష్ఠితంబగు శ్రీ లక్ష్మీనృసింహ దేవునకు
  శతకము నిమిత్త మొక మకుటంబు సూచించ ప్రార్థన.
  🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. యజ్ఞేశ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సుమ్ము + అనుచు' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "సుమ్మ।టంచు..." అనండి.
   "నతులు మేడిపురావాస నారసింహ!"

   తొలగించండి
 27. తల్లికిం దిండి నిడుట వ్యర్థంబు సుమ్ము
  టంచు పల్కువాడతి నీచుడవని యందు
  పాలు త్రాగిన రొమ్ము ని బలముగాను
  గుద్ది నట్టి నికృష్టపు కూళు డతడు

  ఎల్ల జ గంబులం దుగన నెత్తగు స్థానము నందు నుంచుమం
  చెల్లెరు పల్కుచుందురిల నెంతయొ నుత్తమ రీతిలో న దా
  తల్లికి తిండి పెట్టుట, వృథాయని చెప్పును ధర్మశాస్త్రముల్
  చల్లని తల్లికిన్ సతము చక్కగ చూడని వాని జన్మమున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. ఉమాదేవి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'సుమ్మటంచు'టైపాటు.

   తొలగించండి
 28. ఎల్లరు దాదలంచవలెనిద్ధరబాధ్యతయెప్పుడైనను
  న్దల్లికిదిండిపెట్టుట,వృధాయనిచెప్పును ధర్మశాస్త్రముల్
  తల్లికిదిండిలేకయునుదద్దయుబాధకులోనుజేయుచో
  నల్లదెవానిజీవనమునల్పునిగంటెనుహీనమౌసుమా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఎల్లరు' అని 'తా' అనడం అన్వయదోషం. "ఎల్లరు నెంచగావలయు నిద్ధర..." అనండి.

   తొలగించండి
 29. కోరి చేసిన పాపమ్ము కూల్చు జనులఁ
  గీర్తి కాముకత్వమునకు మూర్తు లగుచుఁ
  బమ్మి చేసిన యట్టి దానమ్ము, మాని
  తల్లికిం దిండి నిడుట, వ్యర్థమ్ము సుమ్ము


  చల్లని నీ రొసంగినను జాలదె చక్కగ వృద్ధి సెందగం
  బెల్లుగ భూరుహమ్ములకు వెఱ్ఱివె తిండి నొసంగ నివ్విధిం
  గల్లరి మాట లేల వినగం దమిఁ దల్లికి మాని తిండి పో
  తల్లికిఁ దిండి పెట్టుట వృథా యని చెప్పును ధర్మశాస్త్రముల్

  [తిండి పోతు + అల్లి; అల్లి = వృక్ష విశేషము]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 30. డా.పిట్టా సత్యనారాయణ
  "చూపుల"గు దేవతలకెల్ల "మేపు" మనది
  కాపు గాచిన పోచమ్మ కరుగదినునె?
  నీదు యౌదార్యమును జూడ నిలిచె నట్టి
  తల్లికిందిండి నిడుట వ్యర్థమ్ము సుమ్మి!
  (దేవతలకు నివేదన చేస్తాము కాని తల్లి మానవ మాత్రురాలుకాదు.కొండంత దేవునికి కొండంత పత్రినిడలేము కదా!అది తిండి పెట్టుటకాదని భావము.ఆ తల్లి,మన భక్తిని మాత్రమే కోరుకొనును)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నీదు + ఔదార్య' మన్నపుడు యడాగమం రాదు.

   తొలగించండి
 31. ఉల్లములోన ప్రేమము మహోన్నత మౌ గతి చెంగలించగా
  కల్లలెరుంగనట్టి యమ కాంచును నిత్యము బిడ్డ క్షేమమున్
  చల్లని తల్లినెప్పుడును సాకవలెన్ కడుఁ బ్రేమ, నెవ్విధిన్
  తల్లికిఁ దిండి పెట్టుట వృథా యని చెప్పును ధర్మశాస్త్రముల్?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   అధిక్షేపాత్మకమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 32. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  కొల్లలు కూడబెట్టుచును కూర్చొని యింటిని మోదమందునన్
  తెల్లని కోడలిన్ వడిగ తెమ్మని చెప్పక సంతసించుచున్
  పిల్లడి కెప్పుడున్ విరివి ప్రీతిని చేయుట కప్పులిచ్చెడిన్
  తల్లికిఁ దిండిపెట్టుట వృథా యని చెప్పును ధర్మశాస్త్రముల్


  "He has taken a personal loan of Rs 5 lakh from his mother"

  రిప్లయితొలగించండి
 33. ఎల్లజగంబు చెప్పుగద యిమ్మహి దేవత తల్లి యంచు తా
  నుల్లముఁ నిల్పి కొల్చెడు మహోన్నత మూర్తికి ధ్యేయమొక్కటే
  తల్లికి దిండి పెట్టుట, వృధా యనిచెప్పును ధర్మశాస్త్రముల్
  లల్లము తల్లి బెల్లమది యాలి యటంచు దలంచు వారలే.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'శాస్త్రముల్ + అల్లము = శాస్త్రము లల్లము అవుతుంది. ద్విత్వలకారం రాదు.

   తొలగించండి
 34. ముద్దు సతి వెంట నొక గానుగెద్దు గనయి
  బంటు వలె సదా తిరిగెడి భర్త పలికె
  తల్లికిం దిండి నిడుట వ్యర్థమ్ము సుమ్ము
  తనదు దారకు దాసుడై తనరదగును

  నిన్నటి సమస్యకు నా పూరణ

  విఘ్నములను బాపు విఘ్నేశ్వరుండన
  కరిముఖుండు లక్ష్మి కన్నకొడుకు
  భవుని తపము నాప భగ్నమయ్యెను గాదె
  కామ బాధ నాప గలరె ? జెపుమ ?

  రిప్లయితొలగించండి
 35. డా.పిట్టా సత్యనారాయణ
  వల్లియ రాణి1 మోహమున వత్సుని గోరిన పిన్న తల్లియై2(1॥ చిత్రాంగి,2.సారంగధరుని పినతల్లి)
  ఎల్ల జగంబు విస్తు పడ నెన్నె గుమారుని"మారుడం"చన
  (మారుడు॥ మన్మథుడు)
  నల్లన బంపగా దగును జారిణి చిత్ర విచిత్ర దేహియై3 (3.చిత్రాంగి)
  ఇల్లును గుల్ల చేయునని యీ కథ4 జెప్పుదు రింట నింట నా (4సారంగధర-చిత్రాంగి లకథ)
  తల్లికి దిండి బెట్టుట వృథా యని చెప్పును ధర్మ శాస్త్రముల్ !(ఇటువంటి కృత్యములకు లొంగి పోగూడ దని భావము)

  రిప్లయితొలగించండి
 36. యెనిశెట్టి గంగా ప్రసాద్శుక్రవారం, ఏప్రిల్ 05, 2019 2:35:00 PM

  ముద్దు మురిపాలబెంచిన ముదిత యామె
  అష్ట కష్టాలు భరియించి అమిత మైన
  ప్రేమతో పెంచినట్టి యా లేమకేల?
  తల్లికిం దిండి నిడుట వ్యర్థంబుసుమ్ము!!

  రిప్లయితొలగించండి
 37. తల్లిని మాతృ భారతినిఁ దన్నుచు రెక్కలు వచ్చి వేగమే
  పిల్ల లమేరికా చదువు పేరిట సంపద బెంపు కోసమై
  వెల్లువ వోలె బోవుటయు వెర్రియె,తల్లికిఁ బెట్టకన్ పరున్
  దల్లికిఁ దిండి పెట్టుట వృథా యని చెప్పును ధర్మశాస్త్రముల్

  రిప్లయితొలగించండి
 38. పాలుపెరుగును మెక్కిసవాలుగాను
  గోడదూకెడి నాయకుల్ జాడలాగ!
  నేర్పుకూర్పులుగల గమనించ పిల్లి
  తల్లికిం దిండి నిడుట వ్యర్ధమ్ముసుమ్ము!

  రిప్లయితొలగించండి
 39. కరుణయు మమకారములు లేక జనని యెడ,
  వయసుడిగి పలు విధములవస్థలు పడు
  మాతృమూర్తిని వృద్దాశ్రమమున నుంచి
  తల్లికిం దిండి నిడుట వ్యర్ధమ్ముసుమ్ము!

  రిప్లయితొలగించండి