డా.పిట్టానుండి ఆర్యా. లబ్బ (చివరకు ఉబ్బిన)ముక్కు గల వారు ధనవంతులు.వీరే కరిముఖులంటే.ఇక మీరూహించుకోవాలి ,మనుజుల గత జాతకమును ఇప్పటి ఉన్నత స్థితిని గమనించాలి.ఇది లోకులు అనుకునే విషయం.)
డా.పిట్టా సత్యనారాయణ సరియిది గొప్ప నానుడియె సర్వులు వాడుకొనంగ వింటి ని ప్పరి గణనాయకుం దలచి బారిన పాదము వావి వర్సలున్ మరి యెటులౌనొ నే నెరుగ మాన్యతనందె"తలాయె(తల॥అయె) తమ్ముడున్ బరితెగ తోకగా జెలగె బావ మరింది" యటన్న నీమమై "కరిముఖు డబ్దినందనకు కన్న కుమారుడనుంగు డన్నయున్" (తలకాయ తమ్ముడు;తోక బామ్మర్ది తెలంగాణా నానుడి,జాతీయము ఈ సమస్యకు సరిపోలినది.ఆనాడు దేవతల బాంధవ్యాల నుండియే ఈ తెలుగు సామెత వచ్చినదేమో!)
రిప్లయితొలగించండివిఘ్నములను బాపు వేడగాను జిలేబి
కరిముఖుండు; లక్ష్మి కన్నకొడుకు
నొసటి రాత తీర్చు నొప్పురీతి మనకు
విశ్వదాభిరమణి వినవె భామ !
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"విశ్వదాభిరమణి విను జిలేబి" మకుటంతో ఒక శతకం రాసేయండి!
తొలగించండికంది వారి పల్కు కాదన కమ్మరో
శతక మునిక వ్రాయి సకల జనులు
పారి పోవ నీదు పద్యముల చదివి
విశ్వదాభిరమణి విను జిలేబి :)
జిలేబి
అలాగేమీ లేదండి జిలేబిగారూ,యెవరి ఫాన్స్ వారికుంటారు.నిర్భయంగా వ్రాసేయండి.విషయం క్యాచీగా ఉంటేచాలు!
తొలగించండిప్రాతఃకాల ప్రార్థన:
రిప్లయితొలగించండిపరువులు బెట్టి పోయితిని వంగల భూమికి చిన్ననాడు నే
నరయక మాతృభాషనిట హైరన చెందుచు నర్ధసున్నలన్
కరుణను పాసు జేయుమయ! కైపద మిట్టిది కంపమిచ్చెనే :( 👇
"కరిముఖుఁ డబ్ధినందనకు కన్నకుమారుఁ డనంగుఁ డన్నయున్"
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిపాస్ మార్కులే కాదు... కొంతకాలం మాతృభాషకు దూరమైన బాధను వ్యక్తపరచినందున పది గ్రేస్ మార్కులు పొందారు.
నమో నమః
తొలగించండిపాసు చేసి గ్రేసు మార్కులివ్వడమే కాకుండా నా ప్రార్థనను సమూహములో ప్రచురించినందుకు మీకు ఐదు వరహాలు; మాకు పప్పుబెల్లాలు
🙏
విఘ్నములను బాపు వినాయకుడె గదా
రిప్లయితొలగించండికరిముఖుండు, లక్ష్మి కన్న కొడుకు
చిలుక రౌతు చెరుకు విలుకాడు రుద్రారి
మనసిశయుడు వాడె మధుసఖుండు.
విరించి గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వినాయకుడు' అన్నచోట గణదోషం. సవరించండి.
రిప్లయితొలగించండిమరువగ నేల సంస్కృతిని మాలిని రాగిణి శోభలొల్కగా
నరె! రమణీ! కళింగ! లలనా! మన పూర్వపు గాధ రీతిగా
కరిముఖుఁ డబ్ధినందనకు కన్న, కుమారుఁ డనంగుఁ డన్నయున్,
శరజుడు కాగ పుత్రునిగ శాంకరి కమ్మరొ సాదరమ్ముగాన్ !
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గౌరి పెద్దకొడుకు భారతమ్ము లిఖించె
రిప్లయితొలగించండికరిముఖుండు ; లక్ష్మి కన్నకొడుకు
విరుల శరము వేసి పురుషుల లలనల
మదుల నొకటి జేసె మన్మథుండు .
జంధ్యాల వారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ !
తొలగించండివిఘ్న ము లను బాపు వేలు ప దె వ్వరో ?
రిప్లయితొలగించండిపాల సంద్ర మందు ప్రభ వ మం దె
తెలుపు కృష్ణు డే మి దేవకీ దేవికి ?
క రి ముఖుండు ;లక్ష్మి ; కన్న కొడుకు
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండికరిముఖుఁ డ , బ్ధినందనకు కన్నకుమారుఁ డనంగుఁ , డన్నయున్
గిరిజకు విష్ణుమూర్తి చిరకీర్తి గడించిరి విఘ్నహారిగా ,
నిరవుగ సౌఖ్యహారిగ , మహిన్ గన దుర్మదదైత్యహారిగా !
వరదుల వారి మ్రొక్కుడు శుభమ్ముల పొందుడు శాశ్వతమ్ముగన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిడా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిముక్కు మూడ్రకాలు మేదిని జనులకు
కోట,గరుడ,లబ్బ గురుతు లవియ
గజపు తొండమాయె గమనించగా"లబ్బ"
కరిముఖుండు లక్ష్మి కన్నకొడుకు!
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ భావం బోధపడలేదు. వివరించండి.
డా.పిట్టానుండి
తొలగించండిఆర్యా. లబ్బ (చివరకు ఉబ్బిన)ముక్కు గల వారు ధనవంతులు.వీరే కరిముఖులంటే.ఇక మీరూహించుకోవాలి ,మనుజుల గత జాతకమును ఇప్పటి ఉన్నత స్థితిని గమనించాలి.ఇది లోకులు అనుకునే విషయం.)
క్షీర సాగర తనయ లక్ష్మికిని గంగ
రిప్లయితొలగించండితల్లి,యందువల్ల శివుడు తండ్రి వరుస
తండ్రి నన్నగ పిలుతురు ధరన, కాన
కరిముఖుండు లక్ష్మి కన్నకొడుకు
"కరిముఖుండు లక్ష్మి కన్న కొడుకు"
తొలగించండిగా ఉండాలి.
రాకుమార గారూ,
తొలగించండిలాజిక్కుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ధరను' అనండి.
ఆఖు వాహనుండు అచలాత్మ జసుతుఁడు
రిప్లయితొలగించండికరి ముఖుండు; లక్ష్మి కన్న కొడుకు
మకరికేతనుండు మరులు గొల్పుచునుండు
వొకనిc దల్పు మెప్డు వొకని నిల్పు
యజ్ఞేశ్ గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వొక' అనడం సాధువు కాదు. "గొల్పుచునుండు । నొకనిఁ... మెప్పు డొడని నిల్పు" అనండి.
కార్తికేయ,గౌరి,కంసారి,నరసిం హ,
రిప్లయితొలగించండికరి ముఖుండు,లక్ష్మి,కన్నకొడుకు,
హనుమ,శంకరాది అసురారులెల్లరు
ప్రేమతోడ మమ్ము నోముగాక!
కన్నకొడుకు=విష్ణుమూర్థి గన్న కొడుకు(బ్రహ్మ)
ప్రసాద రావు గారూ,
తొలగించండిపెద్ద పట్టికతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు
తొలగించండిసమస్య :-
రిప్లయితొలగించండి"కరిముఖుండు లక్ష్మి కన్నకొడుకు"
*ఆ.వె**
గౌరి నాయువిచ్చి కాపలా యుంచిన
గౌరి పుత్రుడౌను కరిముఖుండు
వావి వరుస జూడ యే విధముగయౌను
కరిముఖుండు లక్ష్మి కన్నకొడుకు?
.........................✍చక్రి
చక్రపాణి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'గౌరి యాయువిచ్చి... జూడ నే విధముగ నౌను' అనండి.
తల్లి వాకిట తన తండ్రి నాపెనెవరు
రిప్లయితొలగించండిభర్త యురము నుండు భార్య యెవరు
వరము తాను నిలుపు వంశమ్మునెవరన్న
కరిముఖుండు లక్ష్మి కన్నకొడుకు
సూర్య గారూ,
తొలగించండిమీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
🙏
తొలగించండిధన్యవాదములు సర్
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిపార్వతి says to లక్ష్మి :)
నాదు భర్త నైన నాయాన గా ద్వార
మందు నిలిపి వేసె మాట దాట
డమ్మ విఘ్నముల నెడపునితడేనమ్మ
కరిముఖుండు, లక్ష్మి! కన్నకొడుకు!
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిలక్ష్మి శబ్దాన్ని సంబోధనగా చేసి పూరించిన మీ పద్యం ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
విఘ్నరాశినూడ్వ వేలుపు నెవ్వండు?
రిప్లయితొలగించండిధర్మబద్ధమైన దంపతులకు
కామవాంఛనొసగు కామదేవుడెవడు?
*"కరిముఖుండు ;లక్ష్మి కన్నకొడుకు"*
గిరిజ కుమారుడెవ్వడగు?గృత్సుడు నేసతికిన్ జనించెనో?
రిప్లయితొలగించండినరుడు బసిండిబొజ్జదొర యా రమ కేమగు?మాధవాత్మజుల్
మరుడును,దమ్మిచూలియు గ్రమంబున బేరును బెంపునెట్టులో?
*"కరిముఖుఁ ;డబ్ధినందనకు; కన్నకుమారుఁ ;డనంగుఁ డన్నయున్"*
శంకర్ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
శంభుపత్నిగాగ జక్రికిజెల్లెలు
రిప్లయితొలగించండిలక్ష్మియౌను గాదె లక్షణముగ
ననుజ హరుకు వరుస,కనుక సందియమేల?
కరిముఖుండు లక్ష్మి కన్నకొడుకు!
లక్ష్మికి అన్నకొడుకు
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'హరునకు' అనడం సాధువు.
ధన్యవాదముల గురుదేవా!
తొలగించండిసవరించిన పూరణ
శంభుపత్నిగాగ జక్రికిజెల్లెలు
లక్ష్మియౌనుగాదె లక్షణముగ
ననుజ శివుని కరయ నార్య!ముద్దులొలుకు
కరిముఖుండు లక్ష్మి కన్నకొడుకు!
విఘ్న నాథుగభువి బేరువడసెనుగ
రిప్లయితొలగించండిగరిముఖుండు,లక్ష్మికన్నకొడుకు
చెఱకువిల్లుదాల్చి శివునిమూర్కొనినయా
మకరకేతనుండుమన్మధుండు
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఅడ్డముల నదుమును అంబకుమారుడు
కరిముఖుండు; లక్ష్మి కన్న కొడుకు
తన శరములతో నితరులలో మోహమ్ము
పుట్టు నట్లు జేసి పొలయు వాడు
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిసరియిది గొప్ప నానుడియె సర్వులు వాడుకొనంగ వింటి ని
ప్పరి గణనాయకుం దలచి బారిన పాదము వావి వర్సలున్
మరి యెటులౌనొ నే నెరుగ మాన్యతనందె"తలాయె(తల॥అయె) తమ్ముడున్
బరితెగ తోకగా జెలగె బావ మరింది" యటన్న నీమమై
"కరిముఖు డబ్దినందనకు కన్న కుమారుడనుంగు డన్నయున్"
(తలకాయ తమ్ముడు;తోక బామ్మర్ది తెలంగాణా నానుడి,జాతీయము ఈ సమస్యకు సరిపోలినది.ఆనాడు దేవతల బాంధవ్యాల నుండియే ఈ తెలుగు సామెత వచ్చినదేమో!)
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా నుండి
తొలగించండిఆర్యా,ధన్యవాదాలు
డా. బల్లూరి ఉమాదేవి
రిప్లయితొలగించండివిఘ్నములనుబాపు విఘ్నేశ్వరుడె గను
"కరిముఖుండు; లక్ష్మి కన్నకొడుకు"
పంచబాణుడనగ వసుధలో ఖ్యాతి
నందినట్టి వాడనంగు డతడు.
వ్యాసభారతమును వాసిగా వ్రాసెను
కరిముఖుండు; లక్ష్మి కన్నకొడుకు
త్ర్యక్షుని తపమాప తాపత్రయము చెంది
భవుని క్రోధమునకు భస్మమయ్యె.
డా, ఉమాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ మూడవ పాదం చివర గణదోషం. "వసుధలో ప్రఖ్యాతి" అనండి.
గణములకధినాయకత్వము పొందెను
రిప్లయితొలగించండికరిముఖుండు,లక్ష్మి కన్నకొడుకు
మకరకేతుడయ్యె మానస హరుడుగ
కార్యసిద్ధుడొకరు,కాముడొకరు
(తొలి ప్రయత్నం, తప్పులున్న తెలుప ప్రార్థన)
ఆచార్యులు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మకరకేతనుండు' అనండి.
ధన్యవాదాలు గురుదేవా
తొలగించండిగౌరి మనము దోచు గారాల పుత్రుడు
రిప్లయితొలగించండివిష్ణుదేవుని మది వెలయు వనిత
వాసు దేవుడు గన వసుదేవు మురిపాల
కరిముఖుండు ; లక్ష్మి ; కన్నకొడుకు
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
విఘ్నములను బాపి విజయము నొనరించు
రిప్లయితొలగించండికరి ముఖుండు; లక్ష్మి కన్నకొడుకు
మరుడు శివగిరిజల మధ్య రక్తి
నొనర్చె
ఆదిదంపతులగ నడరిరపుడు
సీతారామయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వరుఁడు సుందరుండు ప్రద్యుమ్నుఁ డయ్యెను
రిప్లయితొలగించండివర యదు కులజాతుఁ డరయ నతఁడు
రమణి రుక్మిణీ లలామకు దనయుఁ డు
క్కరి ముఖుండు లక్ష్మి కన్నకొడుకు
[తనయుఁడు +ఉక్కరి; ఉక్కరి=శౌర్యవంతుఁడు; శౌర్యవంతమైన ముఖము కలవాఁడు]
సురుచిర భాషణుండు శ్రుతిసూరి వధూమణి బృంద చిత్త మం
దిర గత మన్మథుండు ఘన దీర్ఘ భుజుండు సునీల మేఘ సుం
దరతర దేహుఁ గాంచు మువిదా సుమనో విల సత్సరోవ రా
కరి ముఖుఁ డబ్ధినందనకు కన్నకుమారుఁ డనంగుఁడన్నయున్
[సరోవర +ఆకరి ; ఆకరి = ఖనిజము; సరోవరమను ఖని నుండి పుట్టినది: పద్మము.
అనంగుఁడన్న ( రామన్న వలె) = మన్మథుడు,]
కామేశ్వరార్యుని పద శైలి పద్య శైలివేరు నమస్కారము కవివరా అధ్బుతమైన పూరణ
తొలగించండినమస్కారమండి కుమార్ గారు. నా పూరణము మీకు నచ్చినందులకు ధన్యవాదములండి.
తొలగించండికామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిహరి యగు నన్న పార్వతికి! నట్టులె కావలె నందనుండుగాఁ
గరిముఖుఁ! డబ్ధినందనకుఁ గన్నకుమారుఁ డనంగుఁ! డన్నయున్
సిరికిని శంకరుండు కనఁ, జెన్నుగ గంగకుఁ బెన్మిటౌ! నిటుల్
వరుసల నెంచుచో హరుఁడు, పంకజనాభున కల్లుఁడే యగున్!!
మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ శంకరయ్య గారూ!
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికరుముఖుడ!బ్ధినందనకుకన్నకుమారుడనంగుడన్నయు
రిప్లయితొలగించండిన్బరగునుగాదెజూడగనుబంధముగాసరివోవునెప్పుడున్
నరయననంగుడేగద యయాచితబాణమువేయగానటన్
నిరవుగభస్మమాయెనటయీశునిగంటికితాళజాలకే
కరి ముఖుడ
తొలగించండిగా చదువప్రార్ధన
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అన్నయ్య కరి ముఖుఁడ యన్న భావములో "కరి ముఖుఁడ యబ్ధినందనకు" ననవలసి వచ్చును.
తొలగించండిగౌరికి ప్రియ సుతుడు గణముల కధిపతి
రిప్లయితొలగించండికరిముఖుండు, లక్ష్మి కన్నకొడుకు
మరులుకొలుపు నట్టి మన్మథుండు, శివుని
కంటి మంట తోడ కాలిపోయె
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
అరయగ రామభద్రునికి హాయిగ తీయగ పిల్లలెందరో!
బరువుగ పుత్రులెన్మిదిర పండుగ జేయుచు నాల్గు పుత్రికల్
సరిసరి వారి పిల్లలుర చక్కగ జేతురు పూరణమ్మిటన్:
"కరిముఖుఁ డబ్ధినందనకు కన్నకుమారుఁ డనంగుఁ డన్నయున్"
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగౌరి
రిప్లయితొలగించండిగౌరి
రిప్లయితొలగించండిగౌరిప్రియసుతుండుగాద?కరిముఖుండు
రిప్లయితొలగించండిలక్ష్మి కన్నకొడుకు"లౌఖ్యమందు
మన్మదుండుయనిరి!మంగళకరమగు
వంశవృద్దికొరకె!సంశయంబ!
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'లౌక్యమందు మన్మథుం డటంద్రు..' అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఓటరు లిస్టు లో ఓట్లు గల్లంతయినట్లు బ్లాగులో మన పోటోలు గల్లంతా తెలియటము లేదు గురువుగారు కొత్త ఆశ్రమమునకు వెళ్లిన తర్వాత???ఏమన్నా ???
రిప్లయితొలగించండిబ్లాగర్ ఇక గూగుల్ అకౌంటును సపోర్ట్ చేయదని కొన్ని రోజులుగా సందేశం వస్తున్నది. దాని ప్రభావమేమో?
తొలగించండిఆటవెలది
రిప్లయితొలగించండిపశుపతి ప్రియరాణి పార్వతమ్మ సుతుడు
కరిముఖుండు. లక్ష్మి కన్న కొడుకు
మీనకేత నుండు.మినుసిగ వేల్పుని
తపము జెరచి తాను దగ్ధ మయ్యె.
ఆకుల శివరాజలింగం వనపర్తి
శివరాజలింగం గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిచంద్ర దృష్టి సోక చఛ్చిన దెవ్వరో,
చంద్రు డెవరొ తెల్పు సరస గతిని,
చంద్రు డేమి యగును జలధి తలచినంత,
కరి ముఖుడు,లక్ష్మి కన్న,కొడుకు
కుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
Sir
రిప్లయితొలగించండిగిరిజను పెండ్లియాడినది క్ష్వేళగళుండు సదా శివుండెగా,
రిప్లయితొలగించండిహరిహయుడా యుమా తనయుడాదిగ పూజల నందువాడయెన్
కరిముఖు, డబ్ది నందనకు కన్నకుమారుఁడనంగు, డన్నయున్
హరుడట! శారదాంబ పతి యంబుజ గర్భుడు కంజుడే గదా!
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
బల్లూరి ఉమాదేవి
రిప్లయితొలగించండిపార్వతీ శివులకు పరమ ప్రీతి కరుడు
కరి ముఖుండు లక్ష్మి కన్నకొడుకు
కూడా యౌను వినుము కూరిమి తో జూచు
హరికి మేనయల్లు డతడు నిజము.
డా. ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కూడా' గణదోషం. 'కూడ' అనండి.
రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆటవెలది //
రిప్లయితొలగించండినలుగు పిండి జేయ నగజసుతుండాయె
కరిముఖుండు, లక్ష్మి కన్నకొడుకు
రుక్మిణీసుతుండు రుద్రారి ప్రద్యుమ్న
సుముఖ కామదేవ సొత్తు సిద్ధి. ..
ఆటవెలది
రిప్లయితొలగించండిశ్రీహరి సతియైన క్షీరాబ్ధి కన్యకు
శైలజపతియైన శూలియన్న
పార్వతి సుతుడౌచు పరమేశు దయగొన్న
కరిముఖుండు లక్ష్మికన్న కొడుకు