14, ఏప్రిల్ 2019, ఆదివారం

సమస్య - 2986 (సోదరినిఁ బెండ్లియాడెను...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.... 
"సోదరినిఁ బెండ్లియాడెను సోదరుండు" 
(లేదా...)
"సోదరిఁ బెండ్లియాడె నిజసోదరుఁ డాగమ శాస్త్ర పద్ధతిన్" 

41 కామెంట్‌లు:


  1. మైలవరపు వారి పూరణ

    సోదరుడైన క్రీడి , గుణసుందరియైన సుభద్ర జంటగా
    నాదరమొప్ప ధర్మజపదాంబుజసీమ నమస్కరింపగా,
    మోదమునంది యన్న తలపోసె నిటుల్ గన కృష్ణమూర్తికిన్
    సోదరిఁ బెండ్లియాడె నిజసోదరుఁ డాగమ శాస్త్ర పద్ధతిన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మాన్యులు శ్రీ సూరం వారికి వందనములతో...

      చిరుసవరణ 🙏

      సోదరుడైన క్రీడి , గుణసుందరియైన సుభద్ర జంటగా
      నాదరమొప్ప ధర్మజపదాంబుజసీమ నమస్కరింపగా,
      మోదమునందెనగ్రజుడు , ముచ్చటయే మరి ., కృష్ణమూర్తికిన్
      సోదరిఁ బెండ్లియాడె నిజసోదరుఁ డాగమ శాస్త్ర పద్ధతిన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  2. చివరి పాదమున సమస్య చేర్చుటకును
    వేరు మార్గము తోచక విట్టుబాబు
    మిమ్ము ప్రశ్నించె, చెప్పగ మీకు తగున
    *"సోదరినిఁ బెండ్లియాడెను సోదరుండు"*

    రిప్లయితొలగించండి

  3. యన సోదరుడి గురించి చెల్లి జిలేబి పల్కు :)

    తిరిగె దార్లెంబడియతడె తిప్పకాయ!
    ఔర! అనుకొంటి పనిలేని అన్న యనుచు
    చెవల వాజమ్మ! ప్రేమించి చెలిమికాడి
    సోదరినిఁ బెండ్లియాడెను సోదరుండు!


    జిలేబి

    రిప్లయితొలగించండి

  4. ప్రాతః కాలపు సరదా:

    సోదరు బెండ్లికిన్ తరలి షోకుగ దీటుగ త్రిప్పి మీసమున్
    కాదుర కూడదన్ వినక కమ్మగ గమ్మున ప్రేమలో పడన్
    వాదన జేయకే వదిన వందన లొందుచు నామెగారిదౌ
    సోదరిఁ బెండ్లియాడె నిజసోదరుఁ డాగమ శాస్త్ర పద్ధతిన్

    రిప్లయితొలగించండి
  5. తమ్ముని వివాహ విషయమై తా నిటులనె,
    "అమ్మ నాన్నల నెదిరించ నాత డెంచ
    లేదు, పెద్ద లొప్పు కొనగ నాదు భార్య
    సోదరిని బెండ్లి యాడెను, సోదరుండు!"

    గురువర్యులకు నమస్సులు, నిన్నటి నా పూరణ ను కూడా పరిశీలించ ప్రార్థన.

    బాసల పర్వముల్ ముగియ పల్లెల పట్టణ వాసులందరున్
    వేసిన ఓటు నేతలకు భీతి కలుంగగ జేయు నంతలో
    ఊసులు మానసమ్ములను ఊయల లూపుచు మేళవించగన్
    వేసవి కాలమందు చలి వేయుచు నున్నదదేమి చిత్రమో!

    రిప్లయితొలగించండి


  6. హైదరబాదుపట్నమున హైటెకు లోకము నందు చేరె! నా
    సోదరుడచ్చటన్ వలచె సుందరి నొక్కతె సంగడీడికిన్
    సోదరిఁ,! బెండ్లియాడె నిజసోదరుఁ డాగమ శాస్త్ర పద్ధతిన్!
    సాదరమై విదేశముల చక్కగ చూడ విమాన మెక్కెనే!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. సుందరాంగిని నందాల చుక్క జూచి
    అన్న గారింటికిని తన యక్క కొరకు
    వచ్చి పోవుచు నుండ, సంబరపు వదిన
    సోదరిని, బెండ్లియాడెను సోదరుండు.

    రిప్లయితొలగించండి
  8. అక్కబావలు ప్రీతిగ నాదరించి
    రనుచు, నింటిలో వసియించునాడపడుచు
    నవ్వుచు చరించ కనుగొని నాదు భర్త
    సోదరినిఁ బెండ్లియాడెను సోదరుండు

    రిప్లయితొలగించండి
  9. నిన్నటి పూరణ
    వేసవి కాలమందు చలి వేయుచు నున్న దిదేమి చిత్రమో?
    మోసముచేసి పేదలను ముల్లె గడించితి వడ్డగోలుగా
    చేసితి వెన్నొ కార్యముల చేరి దురాత్ముల సంగడమ్మునన్
    త్రోసిరి నిన్ను యెన్నికల దుష్టుడవంచు నెరింగి చెచ్చెరన్

    రిప్లయితొలగించండి
  10. డా. పిట్టా సత్యనారాయణ
    అగ్రజునివివాహంబున హాయి గొలుపు
    పుట్టముల గట్ట సొగసు సంపూర్ణమైన
    వదిన చెల్లెలి నెంచి తా వరుడు నయ్యె
    సోదరిని బెండ్లియాడెను సోదరుండు

    రిప్లయితొలగించండి
  11. అత్తమామలు కాగోరి రక్క-బావ,
    మేలు మేలని సేయంగ మేనరికము,
    పిల్ల నిమ్మని యడిగెను ప్రేమ మీర
    సోదరినిఁ, బెండ్లియాడెను సోదరుండు..

    రిప్లయితొలగించండి
  12. అక్క చెల్లెళ్ళు గౌరియు హంసవేణి
    యరయ శేఖరు భాస్కరుం డన్నదమ్ము
    లన్న బెండ్లాడ యక్కనె యాదినమునె
    సోదరినిఁ బెండ్లియాడెను సోదరుండు

    రిప్లయితొలగించండి
  13. డా.పిట్టా సత్యనారాయణ
    లేదిక మన్వు వేరనుచు లీలగ ‌వోటరు లెన్న నాం.ప్ర(A.P)నే
    వేదిక జేసి యేలుకొనె వింతగ నిప్పుడుచంద్రబాబు;
    సమ్మోదమె చంద్ర శేఖరుడు ముద్దుల యీ తెలగాణ నేల త
    త్సోదరి బెండ్లియాడె నిజ సోదరు డాగమ శాస్త్ర(constitution of India) పద్ధతిన్!

    రిప్లయితొలగించండి
  14. తండ్రి వసుదేవునకు చెప్పె తాడి తాల్పు
    డవని సురునితో సందేశ మంపినంత
    కదలి వెళ్ళి తాఁ గొనితెచ్చి కలికి రుక్మి
    సోదరినిఁ బెండ్లియాడెను సోదరుండు.

    రిప్లయితొలగించండి
  15. తండ్రి!నీ చిన్న కొడుకు మోదమలరగను
    నా మరదలిని ప్రేమించె;నామె లేక
    లేననెను వాడు; నా ప్రియమైన భార్య
    సోదరిని బెండ్లియాడెను సోదరుండు

    రిప్లయితొలగించండి
  16. కపటమౌని రూపమునను కన్యగెలిచి
    బంధువర్గము మెచ్చ సుభద్ర కృష్ణ
    సోదరిని బెండ్లియాడెను సోదరుండు
    ధన్వి యనుచును మురిసెను ధర్మజుండు

    రిప్లయితొలగించండి
  17. చూడ లేదెప్పుడున్ మన సూరి రుక్మి
    సోదరినిఁ, బెండ్లియాడెను సోదరుండు
    రుక్మిణిని వేడు కొనగ కరుణము తోడ
    నని బలికె బలరాముడు నాలి గాంచి
    (సూరి = కృష్ణుడు )

    రిప్లయితొలగించండి
  18. కమలనయనుడు పెండ్లాడె కమలను శశి
    సోదరిని ; బెండ్లియాడెను సోదరుండు
    శీతకిరణుడు చంద్రుండు ప్రీతితోడ
    రోహిణీత్యాది తారల రూపవతుల .

    రిప్లయితొలగించండి
  19. ధనువు నలవోక గా ద్రుంచ దాశరథి కి
    సీత య ర్ఢా o గి య య్యెను చిత్త మల ర
    భరతు డ య్యెడ గాంచి యు వలచ సీత
    సోదరి ని బెండ్లియాడె సోద రుండు

    రిప్లయితొలగించండి
  20. ఇద్దరన్నలు మెచ్చినముద్దుగుమ్మ
    చిన్నరాముని భార్యకుచిన్నదైన
    సోదరిని బెండ్లియాడెను సోదరుండు
    మల్లికార్జున!"చామంతి మనసుబడగ!

    రిప్లయితొలగించండి
  21. అర్జున సుభద్రల వివాహ మచ్చటఁ గని
    పల్కె నొక్క కవివరుండు పన్నుగ నిటు
    తార్క్ష్యువాహను గ్రమమున ధర్మరాజు
    సోదరినిఁ బెండ్లియాడెను సోదరుండు


    సోదరి యొండు పల్కె నిటు చూపుచు నచ్చట క్రొత్త జంటనున్
    మోదము బాధయుం గలుగ ముంగటి చేడియ తోడ నాన్నకుం
    జేదగుఁ గుండమార్పనఁగఁ జెల్లు ననం దన పెద్ద బావకున్
    సోదరిఁ బెండ్లియాడె నిజసోదరుఁ డాగమ శాస్త్ర పద్ధతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇన వంశార్ణవ పూర్ణచంద్ర నిభ మత్తేభేంద్ర సంచార మో
      హన నీలద్యుతి భాసి తావయువ సత్యద్యోత దుర్విక్రమా
      వన కార్యైక సునిశ్చయాత్మక లసద్బాణాసన స్కంధ సా
      వనిసంజాత సలక్ష్మణ స్థిత దశాస్యాదిఘ్న రామా నుతుల్


      మందాక్రాంతము.
      ఇక్ష్వాక్వంభోనిధి సిత నిశీథేశ సంకాశ మూర్తిన్
      సుక్ష్వింకానీక ధవ రవి సత్సూన సంభావ్య ధీరున్
      భిక్ష్వామ్నాయప్రముఖ శివ సంప్రీత ధానుష్క వీరున్
      స్విక్ష్వత్యుగ్రాస్త్ర ధర నిభు నే నింపుగం గొల్తు రామున్

      తొలగించండి
    2. అద్భుతమైన రామచంద్రమూర్తి వర్ణనలార్యా,నమస్సులు!మందాక్రాంత వృత్తమునకు కొంత వివరణ మాబోంట్లకు అవసరమని తోచుచున్నది.దయచేసి వివరింప ప్రార్ధన!భిక్క్ష్వా,స్విక్ష్వ పదాలకు అర్ధం తెలియలేదు.

      తొలగించండి
    3. ధన్యవాదములండి డా. సీతా దేవి గారు.
      భిక్షు ఆమ్నాయ: భిక్షువుల సమూహము
      సు ఇక్షు అత్యుగ్ర అస్త్ర ధర : మన్మథుఁడు

      మందాక్రాంతము (శ్రీధరా)
      ప్రాస నియమం కలదు
      11 వ అక్షరము యతి
      మ , భ , న , త , త , గగ

      తొలగించండి
    4. చిన్న సవరణతో:
      ఇన వంశార్ణవ పూర్ణచంద్ర నిభ మత్తేభేంద్ర సంచార మో
      హన నీలద్యుతి భాసి తావయువ సత్యద్యోత దుర్విక్రమా
      వన కార్యైక సునిశ్చయాత్మక లసద్బాణాసన స్కంధ సా
      వనిసంజాత సలక్ష్మణ స్థిత సుదుర్వైరిఘ్న రామా నుతుల్

      తొలగించండి
    5. వివరణకు ధన్యవాదములార్యా!పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం!!

      తొలగించండి
    6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
  22. నాదుమిత్రుడుసయ్యదు నమ్మకముగ
    జెప్పవింటినినిజమనిజెప్పలేను
    దనదుబంధుగణపునొకతనుముదమున
    సోదరినిబెండ్లియాడెనుసోదరుండు

    రిప్లయితొలగించండి
  23. సోదరుని మరణము గని శోకమొంది
    నిలిచిన యసుర కన్య గని పవన సుతు
    గొంతి ధర్మజుల యానతి గొని హిడింబు
    సోదరినిఁ బెండ్లియాడెను సోదరుండు

    తన అన్న మరణము చూసి శోకంతో తన ముందు నిలిచిన రాక్షస కన్య అయిన హిడింబు చూసి వాయు సుతుడైన భీముడు తన తల్లి కుంతీదేవి, అన్న ధర్మరాజు అనుమతితో హిడింబాసురుడి సోదరిని ధర్మరాజు సోదరుడు వివాహమాడాడు.
    కుంతిని గొంతి అని తిక్కన కవీంద్రుడు వ్రాసినట్టు గరికిపాటి నరసింహారావు గారు తన మహాభారతం ప్రవచనంలో చెప్పారు.

    రిప్లయితొలగించండి

  24. ఆటవిడుపు సరదా పూరణ
    (జిలేబి గారికి అంకితం)

    ఫాదరు సిస్టరున్ మదరు పండుగ జేయగ నత్తగారికిన్
    ఖాదరు వల్లి పీటరులు కమ్మగ మ్రొక్కగ సోనియమ్మకున్
    బీదలు వృద్ధులున్ సతులు పిచ్చిగ జూడగ కాంగ్రెసాత్మజున్
    సోదరిఁ బెండ్లియాడె నిజసోదరుఁ డాగమ శాస్త్ర పద్ధతిన్

    సోదరుడు = Christian "Brother"

    రిప్లయితొలగించండి
  25. సాదరమొప్పగారమణశర్మకుదగ్గరచుట్టమౌయుమా
    సోదరిబెండ్లియాడె,నిజసోదరుడాగమశాస్త్రపధ్ధతిన్
    ఖాదరువల్లికిన్దనయఖాదరుబీబినిబెండ్లియాడెదా
    మోదముతోడనేవలచిముగ్ధమనోహరరూపిగావుతన్

    రిప్లయితొలగించండి
  26. సీత రాముని సతి, నామె చెల్లె లాలి
    యయ్యె నట లక్ష్మణున కంత, నపుడు భరతు
    భార్య వారి చెల్లెలు కాగ,వారి మరొక
    సోదరినిఁ బెండ్లియాడెను సోదరుండు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మోదము మోమునన్ విరియ ముగ్ధగ రాముని దయ్యె సీతయే!
      సోదరి నూర్మిళన్ నతని సోదరు లక్ష్మణు భార్య,ప్రాణమౌ
      సోదరు దయ్యె మాండవియు,శోభగ రాముని సీతకున్
      సోదరిఁ బెండ్లియాడె నిజసోదరుఁ డాగమ శాస్త్ర పద్ధతిన్

      తొలగించండి
  27. ఆ దరి కృష్ణ కాయనది యాదరమొప్ప గ్రహించు డన్న తా
    నీ దరి లంక నున్నను లభించె సనాతన వంశజాత య
    న్నాదరణ న్వివాహమున కౌననె చేయగ తానె బ్రహ్మయై,
    సోదరిఁ బెండ్లియాడె, నిజసోదరుఁ డాగమ శాస్త్ర పద్ధతిన్.

    రిప్లయితొలగించండి
  28. వేదన తోలతాంగి యొక విప్రుని పంపెను కృష్ణుఁ జెంతకున్
    నాదరమందు బ్రాహ్మణుని హక్కున గైకొని వెన్నుడప్పుడున్
    మోదము తోడ చేరెనటకు ముగ్దను చేగొన నెంచి రుక్మికిన్
    సోదరిఁ బెండ్లియాడెనిజ సోదరు డాగమ శాస్త్ర పద్ధతిన్

    రిప్లయితొలగించండి
  29. యతిగ వచ్చిన కవ్వడి యచట కృష్ణు
    సోదరినిఁ బెండ్లియాడెను, సోదరుండు
    భీముడు హిడింబను వనిని పెండ్లియాడి
    ముదము కూర్చెనెల్లరకును భూరి గాను

    రిప్లయితొలగించండి
  30. ఇలజను పరిణయమ్మాడె నినకులజుడు
    విల్లువిరిచి నా సీతకు ప్రియ మైన
    సోదరినిఁ బెండ్లియాడెను, సోదరుండు
    లక్ష్మణుడు ముదమున శుభ లగ్నమందు.

    రిప్లయితొలగించండి
  31. మోజుపడిన యాపడతిని పొందగోరి
    నరుడు యతివేషధారియై నల్లనయ్య
    సోదరిని బెండ్లియాడెను, సోదరుండు
    తనకొలువుకు పంపగ కొంటె తనము తోడ

    రిప్లయితొలగించండి