13, ఏప్రిల్ 2019, శనివారం

సమస్య - 2985 (వేసవి కాలమందు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వేసవిని మిక్కిలిగఁ జలి వేయుటేల"
(లేదా...)
"వేసవి కాలమందు చలి వేయుచు నున్న దిదేమి చిత్రమో"

57 కామెంట్‌లు:

  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    స్వానుభవం చేదు నిజం 😊

    మాసిన గడ్డమున్ సిగయు మాసిక మందున తీసివేయగా
    నేసిని కారునన్ కొడుకు నెత్తిని టోపియు నీయకుండనే
    బోసిగ పండ్లులేని నను బొచ్చెడు ప్రీతిని కూర్చొబెట్టగా
    వేసవి కాలమందు చలి వేయుచు నున్న దిదేమి చిత్రమో!

    అయ్యో అఖండ యతి :(

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
      'నే(ఏ)సిని కారునన్' అర్థం కాలేదు. 'కూర్చొబెట్టగా' అన్నది వ్యావహారికం.

      తొలగించండి
  2. నా ప్రయత్నం

    తేటగీతి
    మీసమున్ ద్రిప్పి గెల్పు సమృద్ధిగ మన
    పక్షమేనని తొడగొట్టి పల్కినాను
    యోట్ల లెక్కింపు తర్వాత నోటమనఁగ
    వేసవిని మిక్కిలిగఁ జలి వేయుటేల?

    ఉత్పలమాల
    ఆసకు హద్దులేదొ? పడు యర్హత నాకది లేనె లేదొ? మున్
    మీసము దువ్వి గెల్చుటలు మీరవు నన్నని జబ్బ జర్చితే
    యూసుల లెక్క వైచి మనకోటమి వార్తల మాధ్యమమ్ములన్
    వేసవి కాలమందు చలి వేయుచు నున్న దిదేమి చిత్రమో?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'పల్కినాను + ఓట్ల' అన్నపుడు యడాగమం రాదు. "పల్కినాడ । నోట్ల లెక్కింపు..." అనండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :

      నా ప్రయత్నం

      తేటగీతి
      మీసమున్ ద్రిప్పి గెల్పు సమృద్ధిగ మన
      పక్షమేనని తొడగొట్టి పల్కినాడ
      నోట్ల లెక్కింపు తర్వాత నోటమనఁగ
      వేసవిని మిక్కిలిగఁ జలి వేయుటేల?

      ఉత్పలమాల
      ఆసకు హద్దులేదొ? పడు యర్హత నాకది లేనె లేదొ? మున్
      మీసము దువ్వి గెల్చుటలు మీరవు నన్నని జబ్బ జర్చితే
      యూసుల లెక్క వైచి మనకోటమి వార్తల మాధ్యమమ్ములన్
      వేసవి కాలమందు చలి వేయుచు నున్న దిదేమి చిత్రమో?

      తొలగించండి
  3. కలియు గమునందు మారెను కాల గతులు
    శుక పికమ్ములు సభదీరి శోష పడగ
    వేసవిని మిక్కిలిగఁ జలి వేయు టేల
    హరిత వృక్షము లేకయా హార కొఱత

    రిప్లయితొలగించండి
  4. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,


    గురుభ్యో నమః నిన్నటి పూరణ స్వీకరించ మనవి


    " అ ష్ట ల క్ష్మి "


    ధనమున్ - ధాన్యము - విద్యయున్ - ధృతియు - సంతానమ్ము - సంపత్తియున్ -

    ఘనమౌభాగ్యము - మోక్షసంపదఁ గటాక్షాభన్ బ్రసాదించు నా

    జననిన్ క్షీరసముద్రరాజతనయన్ శౌరిప్రియన్ బద్మవా

    సిని మాదేవతఁ బ్రేమమూర్తిఁ గొలువన్ జేకూర్చు సత్సంపదల్

    { సంపత్తి = విజయము ; భాగ్యము = అదృష్టము ;

    కటాక్ష + ఆభన్ = కృపా కాంతిచే ; మాదేవత =

    లక్ష్మీదేవి }


    ---------------------------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  5. వేడి గాలులు వీచుచు వెతలు పెంచు
    వేసవి ని ; మిక్కిలి గ జలి వేయు టేల
    శీత మందున హిమ ధార పాత మగుచు
    వణ కు పుట్టించి జీవుల వంత గూర్ప ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. కాలమె నియతి తప్పెనో ! కాక , మాన
    వుండె కారణమాయెనో ! పొందు చున్న
    వేసవిని మిక్కిలిగ జలివేయుటేల ?
    తెలియరాకున్నది మదికి తెలుగు వాడ

    రిప్లయితొలగించండి
  7. మైలవరపు వారి పూరణ

    *ఆంధ్రా రాజకీయనాయకులు* ..

    చేసితిమెన్నొ బాసలు రుచింప జనాళికి ., పెక్కుమంది వేం...
    చేసిరి వోటువేసిరి నిశీథినినెంచక , అట్టి వోట్లు నా...
    కోసమొ ? వైరిపక్షమునకో యనుచున్ వడకంగ వెన్నులో
    వేసవి కాలమందు చలి వేయుచు నున్న దిదేమి చిత్రమో !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి


  8. ఏల చెమటలు గ్రక్కున దేల మండు
    వేసవిని? మిక్కిలిగఁ జలి వేయుటేల
    శీతకాలములో "బిలేజీ"యనంగ
    ప్రకృతి మాయనరయ మన వల్ల కాదు!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. డా.పిట్టా సత్యనారాయణ
    తె.రా.మందుబాబు మనోగతము:
    "రెండె లక్షనులను మందు రిత్తయయ్యె
    మూసివేసి రమృతశాల, మితమదేల?
    కాళ్ళుజేతులు కదలవే కలియుగాన
    వేసవిని మిక్కిలిగ జలి వేయుటేల?"

    రిప్లయితొలగించండి
  10. ( కోట్లు ఖర్చు చేసి సినిమా తీసి గొల్లుమంటున్న నిర్మాత )
    కాసుల కెంతమాత్రమును
    కాతర మందక కోట్లు పెట్టితిన్ ;
    తీసిన చిత్రరాజమది
    తీరుగ నాడదు వారమైన ; నా
    కాసలు తీరిపోయినవి ;
    క్రమ్మెను స్వేదము దేహమంతటన్ ;
    వేసవికాలమందు చలి
    వేయుచునున్న దిదేమి చిత్రమో !

    రిప్లయితొలగించండి
  11. డా.పిట్టా సత్యనారాయణ
    మోసము జేసి బొక్కసము మూలమునంటగ, ద్రవ్య భారమున్
    వీసము గానకే ప్రజలవేవెవొ పొందెదరంచు బ్రేలగా
    గ్రాస, భృతుల్,విలాస గుణ గౌరవ మబ్బెను వోటరన్నకున్
    వేసవి కాలమందు చలి వేయుచు నున్నదిదేమి చిత్రమో!

    రిప్లయితొలగించండి


  12. వేసవిని మిక్కిలిగఁ జలి వేయుటేల?
    నని కలిగెను గదా శంక మనసు లోన,
    శివుని ధనువును విరిచెగా చిన్న వాడు,
    శూరుడుగదా శిశువు, నాకు మారకుండు
    కాడు గద నితడని నీవు కలత చెంది
    తివి గద దశకంఠా యని తెలిపె ముఖ్య
    సచివు డొక్కడా రావణు సదన మందు

    శివుని ధనస్సు రాముడు విరచిన పిదప రాజులందరు దిగ్భ్రాంతికి గురి అయినారు. (రాముని కళ్యాణము వేసవి కాలములో వచ్చును) అందరితో బాటు రావణాసురుడు కుడా కించిత్తు కలత చెందగా అతని మంత్రి పై విధముగా పలికినాడు అని భావన

    రిప్లయితొలగించండి
  13. ఉన్ని కోటునంపుమొకటి యూటి నందు
    చలికి తాళగ లేనంచు చంటి చెప్పె
    ననుచు భార్య పలుక విని యడిగె నతడు
    వేసవిని మిక్కిలిగఁ జలి వేయుటేల

    రిప్లయితొలగించండి


  14. వేసవి కాలమందు చలి వేయుచు నున్న దిదేమిచిత్రమో?
    మా సిరి కందివర్యులు,సమాశ్రిత సజ్జనులెల్ల పద్యముల్
    కోసుల కొద్ది వ్రాయుచు ప్రకోపపు లాహిరి లోన సాగుచున్
    దోసిలిపట్టి ధారగను తోయముతో చలిగాడ్పు చేర్చగాన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  15. గురువుగారికీ,కవిమిత్రులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు!

    ఆటపాటల గడుపగ హాయిగాను
    వత్సరమునంత విద్యార్ధి పాటులేక
    శిక్షణ ముగిసి చివరి పరీక్షలనగ
    వేసవిని మిక్కిలి చలివేయుటేల?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామాయని ప్రీతిని
      నోరారగ బిల్చినంత నూరగుమార్లున్
      పారాయణ జేసినటుల
      ఘోరాఘము దొలగజేసి గూర్చును శుభముల్

      తొలగించండి
  16. చేసిన బాసలన్నియును చేరగ నిత్యము చెత్తబుట్టకున్
    వేసరి పోవగా విసిగి వేగమె కోపము మిన్నుముట్టగన్
    గాసిల యుగ్రులై జనులు కర్కశ పాలకులే వడంకగాన్
    వేసవి కాలమందు చలి వేయుచు నున్న దిదేమి చిత్రమో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...గాసిల నుగ్రులై" అనండి.

      తొలగించండి
  17. శంకరాభరణం
    10/04/2019 బుధవారం
    సమస్య



    వేసవి కాలమందు చలి వేయుచు నున్న దిదేమి చిత్రమో

    నా పూరణ. కం!!
    **** **** *
    కాసుల గోరి నొక్కడును కర్కశ బుద్ధిని మారె దొంగగన్!

    దోసము నెంచ కాతడును దోచెను నిర్దయతో జనాళి;పో

    లీసులు వెంబడించగను లేడి వలెన్ పరిగెత్తి వణ్కగన్

    వేసవి కాలమందు చలి వేయుచు నున్న దిదేమి చిత్రమో

    🌿 ఆకుల శాంతి భూషణ్ 🌿
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాంతిభూషణ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "..గోరి యొక్కడును" అనండి.

      తొలగించండి
  18. గొర్ల కాపరి దన వంద గొర్ల తోడ
    గొంగళి ధరించి మేపుచుc గొండ చెట్ల
    కరగిc దడిసిచెమ్మటలార గాలి వలన
    వేసవిని మిక్కిలిగc జలి వేయుటేల

    రిప్లయితొలగించండి


  19. seethadevi gurramఏప్రిల్ 13, 2019 7:52 AM
    గురువుగారికీ,కవిమిత్రులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు!

    ఆటపాటల గడుపగ హాయిగాను
    వత్సరమునంత విద్యార్ధి పాటులేక
    శిక్షణ ముగిసి చివరి పరీక్షలనగ
    వేసవిని మిక్కిలి చలివేయుటేల?

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు

    seethadevi gurramఏప్రిల్ 13, 2019 8:29 AM
    శ్రీరామాయని ప్రీతిని
    నోరారగ బిల్చినంత నూరగుమార్లున్
    పారాయణ జేసినటుల
    ఘోరాఘము దొలగజేసి గూర్చును శుభముల్

    తొలగించు
    ప్రత్యుత్తరం

    రిప్లయితొలగించండి
  20. ఆ సినిమాను జూదమని యాతడు నెంచక యున్న సొమ్ములన్
    దోసిలి నింపి దర్శకుని దోసిటఁ బోసెను మాయమాటలౌ
    బాసల నమ్మి, యందరది ఫ్లాపన వెన్నున వణ్కుఁ బుట్టగా
    *"వేసవి కాలమందు చలి వేయుచు నున్న దిదేమి చిత్రమో"*

    రిప్లయితొలగించండి
  21. బాసల పర్వముల్ ముగియ పల్లెల పట్టణ వాసులందరున్
    వేసిన ఓటు నేతలకు భీతి కలుంగగ జేసినంతటన్
    ఊసులు మానసమ్ములను ఊయల లూపుచు మేళవించగన్
    వేసవి కాలమందు చలి వేయుచు నున్నదదేమి చిత్రమో!

    రిప్లయితొలగించండి
  22. వేసవినిమిక్కిలిగజలివేయుటేల
    యెందుకనగనుజల్లగనీయుకొఱకు
    చలువయంత్రములుండుటవలన,చలి
    వేయునుగదార్య! మిన్నగవేసవినిల

    రిప్లయితొలగించండి
  23. వేడి భరియింప లేక నే వీడి యూర
    '' నరకు వ్యాలీ '' న గడుపగ నరిగినంత
    పడి మలేరియా బారిన బలికె నొకడు
    వేసవిని మిక్కిలిగఁ జలి వేయుటేల ?

    రిప్లయితొలగించండి
  24. వేసవికాలమందుచలివేయుచునున్నదిదేమిచిత్రమో
    కాసులఖర్చుకున్మిగులకాతరమొందకయెల్లవేళలన్
    నేసినివేయుచుండగనునిచ్చునుజల్లదనంబునేసదా
    యాసమయంబునందుచలియత్యధికంబుగనుంటగావుతన్

    రిప్లయితొలగించండి
  25. కాల విపరీతములు గాక కారుమబ్బు
    లెల్లఁ గమ్మి తెఱపి లేక తల్లడిల్లఁ
    గుండపోత వర్షము లేల ఘోర మైన
    వేసవిని మిక్కిలిగఁ జలి వేయుటేల


    వేసితి నోట నీ విడిన వింత గుడేరము శంక లేకయే
    నీ సము లెందు లేరనుచు నేఁ దమి చింతిలి పల్కె భీతి నా
    కేసరె నయ్య మిక్కుటమ యెంచఁగ శీత దినమ్ము లయ్యొ కా
    వే సవి కాల మందు! చలి వేయుచు నున్న దిదేమి చిత్రమో

    [గుడేరము =మాత్ర; సవి =అని చెప్పి; కాల మందు = (నీ) మందు కాల!]

    రిప్లయితొలగించండి
  26. పౌరుషమ్మున నెన్నిక పోరు నందు
    కోట్ల రూపాయి కట్టలు కోయనేల
    లెక్క పెట్టు వ్యవధిలోన లెక్క తప్పి
    వేసవిని మిక్కిలిగఁ జలి వేయుటేల

    రిప్లయితొలగించండి
  27. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    శివలింగం:

    మోసము మీర దాంభికుడు మ్రొక్కుచు క్రొత్తది జంద్యమూనుచున్
    వీసపు బుద్ధియున్ విడిచి ప్రీతిని వచ్చిట వోట్లకోసమై
    బోసిగ నున్న నా తలను పుచ్చిన కొబ్బరి నీరుపోయగా
    వేసవి కాలమందు చలి వేయుచు నున్న దిదేమి చిత్రమో!

    రిప్లయితొలగించండి
  28. భేషగు విద్యనిత్తురని పేరును పొందిన పాఠశాలలో
    వేసెద నంచు బాలుడిని వెంటను తీసుకు పోయిచూడగా
    కాసులు లక్షలే యచట కట్టమటంచును కోరినంతనే
    వేసవి కాలమందు చలి వేయుచు నున్న దిదేమి చిత్రమో

    రిప్లయితొలగించండి
  29. వేసవిని మిక్కిలిగ జలివేయుటేల?
    డెంగు,యేమలేరియరాగ పొంగునందు
    భయము నందగ జంకున‌.బాధలున్న
    దోమకాటున జ్వరమున్న దోషమొసగ!

    రిప్లయితొలగించండి
  30. వేసవిని మిక్కిలిగఁ జలి వేయుటేల?
    చైత్రమునబెండ్లియాడగ చైత్ర సఖుడు
    తన్మయానంద బాష్పాల దడప జంట
    మల్లె మైసూరు వీడుచు మగువ నరగ


    చైత్రసఖుడు-మన్మధుడు

    రిప్లయితొలగించండి
  31. తే: వేసవిని మిక్కిలిగఁ జలి వేయుటేల?
    ఎన్నికలలోన ప్రజలంద రెదురు తిరిగి
    యేలికల యాశ లన్నియు కూలిపోవ
    భయముతోడ తనువు చల్లబడియె నేమొ ?

    రిప్లయితొలగించండి
  32. శీతలమగు యంత్రములను శీఘ్రముగను
    తెచ్చి జలమును పోయుచు తీరుబడిగ
    మీట నొక్కంగ తిరుగగ మేటిగాను
    వేసవిని మిక్కిలిగఁ జలి వేయుటేల

    రిప్లయితొలగించండి
  33. ఆహ!నాచూపు నీరూపు కద్దమయ్యె
    నిన్ను గాంచిన క్షణమందె నన్ను నేను
    మరచు టేల?నా మనసిట్లు మారుటేల?
    వేసవిని మిక్కిలిగఁ జలి వేయుటేల?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దోసిట మల్లెలున్ మరుని తూపుల బోలిన వాలు చూపులున్
      ఆసల బెంచు నవ్వు లవి యాత్మకు దగ్గరి చుట్టమై ననున్
      వేసట మొంద జేసె చెలి, వేగిర బెట్టెడు నామె ప్రేమకున్
      వేసవి కాలమందు చలి వేయుచు నున్న దిదేమి చిత్రమో?

      తొలగించండి
  34. వేసవిని మిక్కిలిగఁ జలి వేయుటేల
    వానలను తడవక చేలు వాడుటేల
    శీత కాలము చెమటలు చిందుటేల
    తలప కలి కాలమిది చాలు తగవులేల

    రిప్లయితొలగించండి
  35. వేసవి కాలమందు చలి వేయుచు నున్న దిదేమి చిత్రమో?
    మోసముచేసి పేదలను ముల్లె గడించితి వడ్డగోలుగా
    చేసితి వెన్నొ కార్యముల చేరి దురాత్ముల సంగడమ్మునన్
    త్రోసిరి నిన్ను యెన్నికల దుష్టుడవంచు నెరింగి చెచ్చెరన్

    రిప్లయితొలగించండి