22, ఏప్రిల్ 2019, సోమవారం

సమస్య - 2994 (కందమునందు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కందమ్మునఁ బ్రాస వలదు గద యప్పకవీ"
(లేదా...)
"కందమునందుఁ బ్రాస నిడఁగన్ వల దప్పకవీ యెఱుంగుమా"

79 కామెంట్‌లు:

 1. రిప్లయిలు
  1. అందము తోడనెగ్గగల మయ్యది నిల్వదు పెక్కునాళ్ళు పో!
   డెందము నందు భావములు తీయగ నూరియు మాటలందునన్
   చిందిన నిల్చు పేరు,నొక చెంతను మాటల‌తోడి పోరు మా
   కందము,నందుఁ బ్రాస నిడఁగన్ వల దప్పకవీ యెఱుంగుమా

   ప్రాస=ఈటె

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణ మొదటి, మూడవ పాదాలలో ప్రాస తప్పింది. సవరించండి.

   తొలగించండి
  3. అందము పద్యపు నాదము
   డెందము నుప్పొంగుఁ బ్రాసఁ దీర్చిన వినగన్
   విందగు,రుచియించెడి మా
   కందమ్మునఁ, బ్రాస వలదు గద యప్పకవీ?

   తొలగించండి
 2. శ్రీ గురుభ్యోన్నమః🙏🙏🙏

  ఛందమ్మునకందమనగ
  కందమ్మే, తేటగీతి గలదనుకొనుమా
  బంధమ్ము లేల మరికవి
  కందమ్మునఁ బ్రాస వలదు గద యప్పకవీ!

  రిప్లయితొలగించండి
 3. అందము లేదట పద్యము
  కందమ్మునఁ బ్రాస వలదు గద , యప్పకవీ
  బందీలు భాష సొగసులు
  ఛందస్సున ప్రాస యతులు చక్కగ పలుకన్

  రిప్లయితొలగించండి
 4. మైలవరపు వారి పూరణ

  సుందరశబ్దభావగుణశోభితకందమునల్లి పాడగా
  డెందముదోచు ప్రాసను ఘటించి , యతిన్ దగ మేళవించుచో
  నందము , కాని కొందరికి నడ్డము లక్షణమట్టివారికిన్
  కందమునందుఁ బ్రాస నిడఁగన్ వల దప్పకవీ యెఱుంగుమా !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. కందము వ్రాయకున్న కవి కాడని డెందమునందునెంతయో
   కుందుచు నాల్గు వర్ణములు కూర్చుచు వ్రాయనొకండు నడ్డమౌ
   ఛాందసరీతి ప్రాసగని చచ్చితి నేనని పల్కెనిట్టులీ
   కందమునందుఁ బ్రాస నిడఁగన్ వల దప్పకవీ యెఱుంగుమా !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
 5. ప్రాతః కాలపు సరదా పూరణ:

  ఛందము నేర్వ శంకరుని చల్లని చూపులు మెండు కావలెన్!
  పొందిక మీర ప్రాసమున ముందటి పాదము నందు కందమున్
  బిందువు ముందునుండగను బిందువు కూర్చకనన్ని పాదముల్
  కందమునందుఁ బ్రాస నిడఁగన్ వల దప్పకవీ యెఱుంగుమా

  రిప్లయితొలగించండి


 6. అందము మాండలికమయా!
  చందము వచనకవితలు పసందైనవి! మా
  డెందంబందాడెడు మా
  కందమ్మునఁ బ్రాస వలదు గద యప్పకవీ!


  నారాయణ!

  జిలేబి

  రిప్లయితొలగించండి


 7. ఎందుల కీ యతుల్! సుజన! యెందుల కయ్యరొ ప్రాసగీసలున్
  చందము లెందుకయ్యరొ ప్రజాళికి కొంతయు బుద్ధికెక్కదే!
  డెందము చక్క గాన గనుడీ వచనమ్ములు మేలు సూవె! మా
  కందమునందుఁ బ్రాస నిడఁగన్ వల దప్పకవీ యెఱుంగుమా!

  నారద!
  జిలేబి

  రిప్లయితొలగించండి
 8. ఛందోనియమములే క
  న్విందగునీ పద్యములకు! వేడెద నిన్నే
  యందమనుచు దుష్కరముగ
  *"కందమ్మునఁ బ్రాస వలదు గద యప్పకవీ"*

  రిప్లయితొలగించండి
 9. అందముగ నొదిగి పోవదె
  కందమ్మునఁ బ్రాస, వలదు గద యప్ప కవీ
  చంధో నియమమ్ములు పద
  బంధముఁ గూర్చినను చాలు వచన కవితకున్.

  రిప్లయితొలగించండి
 10. ఎందు ల కీ నీ మమ్ము లు
  చంద మ్ముల వేల యనుచు సాధ్య ము గాకన్
  కొంద రు పలు కుట వి న మే
  కంద మ్మున ప్రాస వలదు గద యప్పకవీ !

  రిప్లయితొలగించండి
 11. అందము నిడును గద సతము
  కందమ్మునఁ బ్రాస, వలదు గద యప్పకవీ
  పొందికగ సీస పద్యము
  లందు మరియు తేట గీత లందున్ వినుమా

  రిప్లయితొలగించండి
 12. అందమ్ము నిచ్చును గదర
  కందమ్మునఁ బ్రాస, వలదు గద యప్పకవీ
  ఎందులకని ప్రశ్నించగ
  ఛందస్సూత్రములవి, గన చందన పూతల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'చందన పూత' దుష్టసమాసం. సవరించండి.

   తొలగించండి


 13. డెందంబాక్రోశింపగ
  చందము గిందముల చేర్చి చంపుదరకొ ? మా
  కెందులకయ్య జిలేబులు?
  కందమ్మునఁ బ్రాస వలదు గద యప్పకవీ!


  జిలేబి

  రిప్లయితొలగించండి


 14. అందంబైనది కందము!
  మందిరము యరు వది నాల్గు మాత్రలకదియే!
  సందియములేక చెప్పెద,
  కందమ్మునఁ బ్రాస, "వలదు గద" యప్పకవీ!


  వలదు గద - ఆధిక్యమైన గద - బడిత

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మందిరము + అరువది' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "మందిర మరువదియు నాల్గు..." అనండి.

   తొలగించండి
 15. అందమ్మగు కందమ్మున
  డెండమ్మలరంగ జేయు ఠీవిని గూర్చున్
  మందుడవా నిటుబల్కగ
  కందమ్మున ప్రాసవరదు గద యప్పకవీ?

  రిప్లయితొలగించండి


 16. వందనమిదియే కవివరు
  లందరికి నమో! నమో! యెలమితోడుగ నా
  చందములనేర్పిరే! మా
  కందమ్మునఁ బ్రాస వలదు గద యప్ప! కవీ!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 17. ఈ నాటి శంకరా భరణము వారి సమస్య

  కందమ్మునఁ బ్రాస వలదు గద యప్పకవీ"

  ఇచ్చిన పాదము కందమే నా పూరణం సీసమే

  ఉత్పల మాలకు నున్నది గా ప్రాస, చంపక మాలకు సరస గతిని
  కలదు గదా ప్రాస. కలదు ప్రాస సతము శార్దూలమునకు, నుంచవలె నన్ని
  పాదములకు ప్రాస మత్తేభమునకును, డెందము నలరించు నంద మైన
  ప్రాస కందమ్మునఁ, బ్రాస వలదు గద యప్పకవీ జూడ నాట వెలదు

  లందు, సీస పద్యములకు లక్షణముగ
  లేదు గా ప్రాస, గీతలో రాదు ప్రాస,
  శంక రార్య! వలదు పరీక్ష , కవి కాలి
  గోటి కైన తూగగ లేము, గొడవ లేల

  రిప్లయితొలగించండి


 18. జాల్రా జిలేబి


  అందము గాంచు చక్కని ప్రయాసల కోర్చుచు నేర్పుతోడుగాన్
  కందమునందుఁ బ్రాస నిడఁగన్; వల దప్పకవీ యెఱుంగుమా
  సందియ మేల నయ్య నుప జాతుల ప్రాసలు! నేర్పుగాన ప్ర
  స్కందము! నేర్వు చందమును కందివరార్యుల చెంత చేరుచున్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 19. పొందగు భావము మధురపు
  స్యందనమై సాగుచుండ,చక్కని పదముల్
  వందన మందుకొనంగను
  కందమునన్ ప్రాస వలదు గద అప్పకవీ.

  రిప్లయితొలగించండి
 20. సుందరశబ్దజాలపరిశోభితభవ్యమనోజ్ఞభావసు
  స్పందితపద్మమల్లుటయె శంకరసత్కవివర్గమందు మా
  కందరకున్ సమమ్ము , తగునట్లుగ నెల్లరు లొప్పు వ్రాత మా
  కందమనందుఁ, బ్రాస నిడఁగన్ వల దప్పకవీ యెఱుంగుమా!
  పొందిక నొప్పు నాధునికపున్ వచనంపు కవిత్వమందునన్.

  కంజర్ల రామాచార్య
  కోరుట్ల.

  రిప్లయితొలగించండి
 21. అందము జూడగ చక్కని
  కందమ్మునఁ బ్రాస, వలదు గద యప్పకవీ
  ఛందము లేని కవిత్వము
  నెందుకు వ్రాయ దలచితివి నీకిది తగునే

  రిప్లయితొలగించండి


 22. జీపీయెస్ వారి మెదడుకు మేత :)
  పూరింపుడీ సమస్య


  చదువుల తల్లి శంకరుని సన్నిధి చేరె విభాతవేళలో


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వదలక శంకరాభరణ భండన లెల్ల ప్రభాకరుండిటన్
   మొదటిని నుండి నాఖరికి మొండిగ తిండియు త్రిప్ప జూడకే
   కదలక కూర్పు జేయగను కైపద పూరణ భాగ్యనగ్రినిన్
   చదువుల తల్లి శంకరుని సన్నిధి చేరె విభాతవేళలో :)

   తొలగించండి
  2. ___/\__

   జిలేబిగారు ఆశించిన పూరణయే సార్!

   తొలగించండి


  3. ఆహా!/ సరదావధానము :)

   మంచి పేరే పెట్టేరు.

   వెంఠనే అరంగేట్రం‌ చేసేయండి :)

   అప్రస్తుతానికి జిలేబి రెడీ :)


   జిలేబి

   తొలగించండి
 23. ( అప్పకవికి అంజలి ఘటించి కొందరు కవుల విన్నపం )
  అందము చింద వ్రాయుటకు
  నాటవెలందికి దేటగీతికిన్
  బందము కల్గకుండుటకు
  ప్రాసము నుంచగలేదు పెద్దలే !
  ఛందపు దీరుతెన్నులకు
  సంపదయౌ యతి ; యద్ది చాలుగా ;
  కందమునందు బ్రాస నిడ
  గన్ వలదప్పకవీ ! యెరుంగుమా !

  రిప్లయితొలగించండి
 24. విందున కూరగ వండెడు
  కందమ్మునఁ బ్రాస వలదు గద ; యప్పకవీ
  ఛందస్సు వీడకుండగ
  కందమ్మును బ్రాసతోడ కదియించు సుమీ

  రిప్లయితొలగించండి
 25. అందములౌ పద్యమ్ముల
  విందుమె లఘ్వలఘు రేఫ విహితమ్ముల నీ
  చందమ్మున నెన్నండును
  గందమ్మునఁ బ్రాస వలదు గద యప్పకవీ


  సుందరుఁ డెంతయున్ సుతుఁడు చోద్యమ బుద్ధియె మంద మయ్యె నే
  మందును వింత లిట్టివియ యర్భకు విద్యలు నిత్య మెంచ మా
  కందము నందుఁ బ్రాస మిడఁగన్ వల దంచన వ్రాసె నిట్లు మా
  కందము నందుఁ బ్రాస నిడఁగన్ వల దప్పకవీ యెఱుంగుమా

  [ప్రాసము = ఈటె]

  రిప్లయితొలగించండి
 26. కందపుబ్రాసనునడుగుట
  కందమ్మునబ్రాసవలదుగదయప్పకవీ!
  ఛందోబద్ధమయగుటకు
  కందమునకుబ్రాసమొగముకవివర!వినుమా!

  రిప్లయితొలగించండి
 27. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  ఛందము కష్టమంచు విని జంకుచు వ్రాయగ కందపద్యముల్
  పొందుగ కూర్చి ప్రాసలను ముచ్చట మీరగ గోర్లు కొర్కుచున్
  కుందుచు నేడు జూచితిని క్రుద్ధుడ నౌచును నిట్టి మాటలన్:👇
  "కందమునందుఁ బ్రాస నిడఁగన్ వల దప్పకవీ యెఱుంగుమా"

  రిప్లయితొలగించండి
 28. కందమునందుబ్రాసనీడగన్ వలదప్పకవీ,యెఱుంగుమా
  యందముగొల్పుచున్మదికిహాయినిగూర్చగనుండగోరుచో
  డెందముసంతసించువినుడీయదిమీరలుశంకదీరగన్
  కందమునందుబ్రాసనిడిగానముజేయుడుగనద్భుతంబుగా

  రిప్లయితొలగించండి
 29. తొలిపాదములో
  బ్రాసనిడగన్
  గాచదువప్రార్ధన

  రిప్లయితొలగించండి
 30. డా.పిట్టా సత్యనారాయణ
  అందెనుదూకుడీ నవత యారడి గాంచగ దిమ్మదిర్గు మా
  కందము కందమన్న తరి గాత్రమునన్ గల సంప్రదాయమే
  చిందరవందరై మెలగె శీలము నెన్నని వారి రాజ్య మీ
  కందము నందు బ్రాస నిడగన్ వలదప్ప! కవీ,యెరుంగుమా!

  రిప్లయితొలగించండి
 31. డా.పిట్టా సత్యనారాయణ
  అందము నీతి, రీతుల ననంతముగా వెలయించు నీమమే
  చిందరవందరై చనెను "చీకటినే వెలుగ"న్న నమ్ముమీ
  కొందరు గొప్పనైన కవివికూనలు బల్కిన బీర మెంచవే?!
  కందమునందు బ్రాస నిడగన్ వలదప్ప! కవీ, యెరుంగుమా!!

  రిప్లయితొలగించండి
 32. మందుడు పానశాలఁ జని మద్యము గ్రోలుచు వాగె నిట్టులన్
  ఛాందస వాదులెల్లరులు ఛందము ఛందమటంచు జెప్పినన్
  నందము నుండబోవవియు నర్థము గావిల పామరాళికిన్
  గందము నందు బ్రాసనిడగన్ వలదప్పకవీ యెఱుంగుమా!

  రిప్లయితొలగించండి
 33. పొందిక గాను వ్రాసినను మోదము నందదె తెల్గు పద్యముల్
  సుందర శబ్దజాల ఘన శోభిత మై వికసింపదే సదా
  కందమునందు బ్రాసనిడగన్, వలదప్పకవీ యెఱుంగుమా
  మందుని బుద్ధిహీనులను మన్నన జేయుట, మానుకొమ్మికన్

  రిప్లయితొలగించండి
 34. డా.పిట్టా సత్యనారాయణ
  అందము వచన కవితలని
  స్యందన మెక్కించ లేదె సమవిషమములన్
  బృందపు రీతియె ఛందము
  కందమ్మున బ్రాస వలదుగద యప్ప!కవీ!

  రిప్లయితొలగించండి
 35. "అందము నాప్యాయతలౌ
  కందమ్మున ప్రాస"!" వలదుగదయప్పకవీ
  డెందము మంచిదిగాకను
  కందెడికందమ్ముగాంచ?కన్నడ యందున్!

  రిప్లయితొలగించండి
 36. డా.పిట్టా సత్యనారాయణ
  అందెనె సంస్కృత శ్లోకము
  చిందులు ద్రొక్కంగ యతిని జేర్చినవారే?
  ఛంధము బహు విధముల గన
  కందమ్మున బ్రాస వలదుగద యప్ప కవీ!

  రిప్లయితొలగించండి
 37. నా ప్రయత్నం :

  కందం
  చిందులు వేయును కులుకుల
  కందమ్మునఁ బ్రాస, వలదు గద యప్పకవీ!
  పొందించ హ్రస్వమున్ వెన
  కందున సరి పాదములకు నందము చెడగన్

  ఉత్పలమాల
  అందెలు బాలకృష్ణునకు నందము దెచ్చెడు రీతి గాంచుమా
  కందమునందుఁ బ్రాస, నిడగన్ వల దప్పకవీ! యొరుంగుమా
  పొందగ హ్రస్వమున్ చివర ముచ్చటగా సరి పాదమందునన్
  చిందులు వేయగన్ వలదిసీ! జగణమ్మది బేసినందునన్

  రిప్లయితొలగించండి
 38. అందము కూర్చును సతతము
  కందమ్మున ప్రాస వలదు గద యప్పకవీ
  ఛంధో బంధము నువిడిచి
  సుందరముగ వ్రాయుటన్న చోద్యము కాదా

  రిప్లయితొలగించండి
 39. బందుగులంద రొక్కపరివచ్చిరి తెచ్చితి కందమూలముల్
  తొందరలోన వాటిపయి తొక్కలు తీయక వండిరయ్యయో
  కందమునందుఁ బ్రాస నిడఁగన్ వల దప్పకవీ యెఱుంగుమా !
  కందము చెప్పుడీ ! యెరుకకై చెవులన్నియు విందుజేయగన్

  రిప్లయితొలగించండి
 40. ఒక ఛందోబాధితుని వ్యధ
  కుందును నెంతయో మదియె కూర్చగ సుందర పద్యరాజమౌ
  కందము,నందు ప్రాస వలదప్ప!కవీ!యెరుంగుమా
  గందరగోళమౌ రచన కందము గంపెడు నీమమంబులన్
  ముందటివారికే దగును భూరిగవ్రాయగ ఛాందసంబుగన్
  విందగు నెంతయో కవిత వేసటలేకయె గద్యమందునన్

  రిప్లయితొలగించండి
 41. మిత్రులందఱకు నమస్సులు!

  [శ్రీకృష్ణదేవరాయలు శత్రువులపై దండెత్తినప్పుడు... ప్రక్కనే వున్న అరణపుకవి తిమ్మన, అతణ్ణి ఈఁటె(=ప్రాస)తో పోరాడమని, ఈటెను అందించబోగా, రాయలు నిరాకరించి, తాను ఈ ముట్టడి(=అభ్యవస్కందము)లో ఖడ్గముతోనే పోరాడతాననీ, అదే తన రాజసానికి తార్కాణమనీ సమాధాన మిచ్చిన సందర్భం]

  "వందన తృప్తుఁ జేసి హరి వాజసనున్ వటపత్రశాయినిన్,
  సైంధవ మెక్కి శాత్రవులఁ జంపఁగ నెంచితిఁ దిమ్మనార్య నా
  డెందము పొంగఁగా, నసియె ఠీవియు రాజస మిచ్చు! నభ్యవ
  స్కందమునందుఁ బ్రాస నిడఁగన్ వలదప్ప! కవీ! యెఱుంగుమా!"

  [అసి = ఖడ్గము; అభ్యవస్కందము = ముట్టడి; ప్రాస(ము) = ఈఁటె; అప్ప = ఆశ్చర్యార్థక సంబోధన;]

  రిప్లయితొలగించండి