8, ఏప్రిల్ 2019, సోమవారం

సమస్య - 2980 (చీమలు భక్షించె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చీమలు భక్షించె భీము శిరమున్ బ్రీతిన్"
(లేదా...)
"చీమలు భీమసేను ఘనశీర్షమునున్ భుజియించెఁ బ్రీతితోన్"

67 కామెంట్‌లు:



  1. రామాయణము చదివినా
    రీ మా పిలకాయలేను రేమద్దుల వా
    రే! మంచిగ చెప్పిరిటుల
    చీమలు భక్షించె భీము శిరమున్ బ్రీతిన్!


    రావణుడెట్లా వానరుల‌ చేతిలో ఓడె అంటే రేమద్దుల‌ విద్యాార్థుల సమాధానం :(


    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. ప్రాతఃస్మరణ:

    1962

    గోముగ శాంతి కోరుచును గొప్పగ కూర్చుచు పంచశీలనున్
    ప్రేమను పంచుచున్ వెడల ప్రీతిని జవ్హరు మారుమూలలన్
    నీమములన్నియున్ విడిచి నీచులు చీనులు కూలద్రోసిరే!
    "చీమలు భీమసేను ఘనశీర్షమునున్ భుజియించెఁ బ్రీతితోన్"

    రిప్లయితొలగించండి
  3. మైలవరపు వారి పూరణ

    ప్రేమగ ముంచుచున్ కలము బెల్లపు పాకమునందు బొమ్మలన్
    రాముని, భీమసేను , సురరాజును గీచిన బాలకుండు ని...
    ద్రామతి యయ్యె , పాపము త్వరన్ మరి లేచి కనంగ బాపురే !
    చీమలు భీమసేను ఘనశీర్షమునున్ భుజియించెఁ బ్రీతితోన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఏమిది దైవమా ! కనగ నేవురముంటిమి , మమ్ము గెల్చువా...
      రీ మహి లేనె లేరు , మఱి యేలనొ యగ్రజులిట్లు "వద్దు సం...
      గ్రామమటంచు" బల్కెదరొ ? కష్టములేలనొ ? యన్న చింతలన్
      చీమలు భీమసేను ఘనశీర్షమునున్ భుజియించెఁ బ్రీతితోన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. మైలవరపు వారి రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  4. నేమము తో పని నేర్వగ
    భామిని యే పంచదార ప్రతిమలు జేయన్
    నేమని చెప్పుదు నంతట
    చీమలు భక్షించె భీము శిరమున్ బ్రీతిన్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జేయన్ ఏమని/ జేయ న్నేమని' అనండి.

      తొలగించండి
  5. ఏమని జెప్పుదు క్రొత్తగ
    లేమల సుకుమార సొగసు లీలలు గాంచన్
    కోమలి చీరల ప్రింటులు
    చీమలు భక్షించె భీము శిరమున్ బ్రీతిన్

    రిప్లయితొలగించండి
  6. ఏమిటివిశేషమనగా?
    చీమలు భక్షించె భీము శిరమున్ బ్రీతిన్
    కామితమగు నైక్యతగా
    ఆమాత్రముజేయలేవ?నదిమామూలే
    (భీము=చెరుకుగడ)

    రిప్లయితొలగించండి
  7. భీముడనుకాముకుని ప్రజ
    భామనువేధించిజంప బంధించి గుడం
    బామైబూసినవడి చలి
    *"చీమలు భక్షించె భీము శిరమున్ బ్రీతిన్"*

    రిప్లయితొలగించండి
  8. ఏమీ?బెల్లంబేమయె?
    ధీమతి సౌగంధికంబు తెమ్మనె నెవరిన్?
    రాము కిరీటం బెక్కెను?
    చీమలు భక్షించె;భీము;శిరమున్ బ్రీతిన్.

    రిప్లయితొలగించండి
  9. ( కీచకవధ - ద్రౌపది ఆనందం )
    కామపు కీచకు శిరమును
    చీమలు భక్షించె ; భీము శిరమున్ బ్రీతిన్
    కోమలి ద్రౌపది నిమిరెను ;
    ప్రేమను ముద్దిడె ముదమున ప్రియునకు నంతన్ .

    రిప్లయితొలగించండి
  10. డా. పిట్టా సత్యనారాయణ
    గోముగ కేంద్రము నిధులిడు
    నీమమునే క్రుంగదీయు నియతిని ప్రాంతాల్
    క్షేమమె ఫెడరల్ తీరన
    చీమలు భక్షించె భీము శిరమున్ బ్రీతిన్

    రిప్లయితొలగించండి
  11. డా.పిట్టా సత్యనారాయణ
    క్షేమము కోసమై ధనము కించిదవజ్ఞన గూర్చ నింట నా
    రామమె బ్యాంకియౌ నని విరామము నిచ్చెను పాత నోట్లకున్
    గోముగ నల్లి జంపుటకగుల్లగ మంచము గొట్టె"మోది"యే
    భీమ బలుండ నేననుచు బీరము బల్కగ నెన్నికాళినిన్
    చీమలు భీమసేను ఘనశీర్శమునున్ భుజియించె బ్రీతితోన్

    రిప్లయితొలగించండి
  12. డా.పిట్టా నుండి
    నల్లి జంపుటకు..3వ పాదములో సవరించి చదువ గలరు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అవజ్ఞను' అనండి.

      తొలగించండి

  13. ఉ.మా.

    భామలు విఘ్న రాజు ఘన పర్వ దినంబున సంతసమ్మునన్

    భీముని రూప పుండ్రములు పెక్కుగ వేయుచు పాయసమ్ములన్

    ధామము లందు జేసియును దైవపు సన్నిధి నుంచ భక్తిగన్

    చీమలు భీమసేను ఘనశీర్షమునున్ భుజియించె బ్రీతితోన్"


    🌿 ఆకుల శాంతి భూషణ్ 🌿
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి


  14. ఆ మగనాలు ద్రౌపదియె నాశపడంగ భళారె జోరుగా
    తామరకంటి కై వెడలి త్ర్యంబకమిత్రుడి కొల్ను గాంచి చెం
    దామరలన్ వరాంగమున తానిడి దారిని కూర్కుపాటుగాన్,
    చీమలు భీమసేను ఘనశీర్షమునున్ భుజియించెఁ బ్రీతితోన్!



    జిలేబి
    :) దేనికైన భారతమే రాయాలె :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ద్రౌపదియె యాశపడంగ' అనండి. 'కొల్ను' టైపాటనుకుంటాను.

      తొలగించండి
  15. నోములకని కొని తెచ్చితి
    యేమాయెను పంచదార యింతలొ చెపుమా ;
    కోమలి హిడింబ తాకెను
    చీమలు భక్షించె ; భీము శిరమున్ బ్రీతిన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  16. ఉ.మా.

    భామలు విఘ్న రాజు ఘన పర్వ దినంబున సంతసమ్మునన్

    భీముని రూప పుండ్రములు వేయుచు జేయుచు పాయసమ్ములన్

    ధామము లందు భక్తిగను దైవపు సన్నిధి నుంచ నత్తఱిన్

    చీమలు భీమసేను ఘనశీర్షమునున్ భుజియించె బ్రీతితోన్"


    🌿 ఆకుల శాంతి భూషణ్ 🌿
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
  17. సమస్య :-
    "చీమలు భక్షించె భీము శిరమున్ బ్రీతిన్"

    *కందం**

    పాముకు గాయమవగ చిరు
    చీమలు భక్షించె; భీము శిరమున్ బ్రీతిన్
    ప్రేమగ నిమిరెను ద్రౌపది
    కాముక కీచకుని త్రుంచగ ముదము తోడన్
    ......‌.‌........‌........✍చక్రి

    రిప్లయితొలగించండి
  18. కోమలి చేసిన ప్రతిమను
    చీమలు భక్షించె ; భీము శిరము న్ బ్రీతి న్
    భామిని శుభ్ర ము జేసి యు
    కామితము గ నిలిపె దాని ఘనముగ నిం టన్

    రిప్లయితొలగించండి
  19. రాముడు నిదురింపగ నడి
    జామున వచ్చిన కల కెద ఝల్లన
    భయమున్
    సోముకు దెలిపెను కలలో
    చీమలు భక్షించె భీము శిరమున్ బ్రీతిన్

    రిప్లయితొలగించండి
  20. నీమమున బెట్టగొలువును
    రామాది ప్రతిమలదీయ రంగడునటక
    న్నేమారుటచే దెల్లని
    జీమలు భక్షించె భీముశిరమును బ్రీతిన్
    తెల్లచీమలు = చెదలు

    రిప్లయితొలగించండి
  21. కందము
    రాముడను బాలు డొక్కడు
    ప్రేమ మధువున కలమద్ది పేపరు మీదన్
    భీముని బొమ్మను గీయగ
    చీమలు భక్షించె భీముశిరమున్ బ్రీతిన్
    ఆకుల శివరాజలింగం వనపర్తి

    రిప్లయితొలగించండి
  22. క్షేమము గోరువారలకు శ్రీనగరంబదె యాటపట్టునై
    భూమి దివంబునై ప్రజలు మోదముతో సుఖ శాంతులంద గా
    చీమలబోలు మ్లేచ్ఛపరిసేనలు సీమ జయింపబూనగా
    *"చీమలు భీమసేను ఘనశీర్షమునున్ భుజియించెఁ బ్రీతితోన్"*

    రిప్లయితొలగించండి
  23. పామరులకు తెల్పుటకై
    చామలు పాండవులబొమ్మ చక్కెర తోడన్
    గోముగ జేయగ, వచ్చిన
    చీమలు భక్షించె భీము శిరమున్ బ్రీతిన్

    రిప్లయితొలగించండి
  24. ఏమని జెప్పగ నోపుదు
    నీమాత్రమెయుండెనింకనేమయెజెపుమా
    చీమలబారును జూడగ
    చీమలుభక్షించె భీముశిరమును బ్రీతిన్

    రిప్లయితొలగించండి
  25. ఏమఱ నీయక వానిని
    వేమరు ప్రశ్న లవిరళము వేయుచు మఱి గా
    రాము సెలఁగ వాచాలురు
    చీమలు భక్షించె భీము శిరముం బ్రీతిన్


    భీముఁడు మృత్యు వాతఁ బడఁ బెద్దలు వైద్యుల చేతిలోమహో
    ద్దామ రుజా నిరోధ పరతంత్ర చికిత్స యొనర్చఁ జీమలే
    రోమ విహీనమౌ శిరములోఁ గనిపించగ నా ప్రచండ సూ
    చీమలు భీమసేను ఘనశీర్షమునున్ భుజియించెఁ బ్రీతితోన్

    [సూచీ + ఈమలు; సూచి = సూది, ఈమలు = పుండ్లు; భీమసేనుఁడు = భయంకరుఁడు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      సూచి + ఈమలు అన్న పదవిభాగం ప్రశంసనీయం.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  26. ఏమనియంటిరయ్యెడలనేకమయౌచునుజట్టుగానునై
    చీమలుభీమసేనుఘనశీర్షమున్ భుజియించెబ్రీతియున్
    మామలుదగ్గరుండియునుమాన్చగజాలకమిన్నకుండిరై
    భీమునిగట్టెనున్ దహనపేటినిబెట్టుచుగాల్చిరయ్యెడన్

    రిప్లయితొలగించండి
  27. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    చీమదె రాఫెలే హృదిని చింపుచు చీరి భుజించుచుండగా
    చీమదె బాలకోట్ మెడను చింపుచు చీరి భుజించుచుండగా
    చీమలు ప్రాకుచున్ బలిసి చింపుచు చీరుచు నెత్తిజేరగా
    చీమలు భీమసేను ఘనశీర్షమునున్ భుజియించెఁ బ్రీతితోన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
      మరి ఇక్కడ 'భీమసేనుడు' ఎవరు?

      తొలగించండి
  28. శ్యామల సంతలోన పలు చక్కెర బొమ్మల విక్రయింపగన్
    రాముడు భీముడర్జునుడు రావణుడాదిగ మూర్తులెన్నియో
    కామిని చేయువేళ మహికర్ణము నుండియె వచ్చి చేరి యా
    చీమలు భీమసేను ఘన శీర్షము నున్ భుజి యించెఁ బ్రీతితోన్.

    రిప్లయితొలగించండి


  29. భామలు చేసిన బొమ్మలు
    చీమలు భక్షించె, భీము శిరమున్ ప్రీతిన్
    తామూర్కొని ధర్మ జుడట
    భీమ పరాక్రమ మునుగని విపరీతముగా

    రిప్లయితొలగించండి
  30. డా. బల్లూరి ఉమాదేవి

    భామలు ఇంట చేసిరట బాగుగ బొమ్మలు పంచదారతో
    భీముని శ్యామ సుం దరుని వెంకట నాథుని రాముడాదిగా
    ప్రేమగ చేయుచుండగను వేగమె గాంచుచు వచ్చిచేరుచున్
    చీమలు భీమసేను ఘనశీర్షమునున్ భుజియించెఁ బ్రీతితోన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి అభినందనలు.
      మొదటి పూరణలో మార్కొని అని అసమాపక క్రియను ప్రయోగించారు. అక్కడ "మార్కొనె" అనండి.

      తొలగించండి
  31. రాముని భీముని ప్రతిమల
    దామమునన్ జేయ పంచ దార కలుపగన్
    యామినిలో బొమ్మలఁ గని
    చీమలు భక్షించె భీము శిరమున్ బ్రీతిన్

    రిప్లయితొలగించండి
  32. కోమలి సాలభంజికల గూర్చగ పాండుకుమార్ల బొమ్మలన్
    కామక పంచదార నుపకారిగ జేయుచు పూర్తిచేయగన్
    గోమున వేగిరంబుగనె గుంపులు గుంపులు వచ్చి చేరి యా
    చీమలు భీమసేను ఘనశీర్షమునున్ భుజియించె
    బ్రీతితోన్

    రిప్లయితొలగించండి
  33. Thank you - Just shared this post with a colleague who would benefit from reading this, really enjoyed it. Read Vastu tips by vastu expert

    రిప్లయితొలగించండి