20, ఏప్రిల్ 2019, శనివారం

సమస్య - 2992 (రమ్ము జగమ్మున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రమ్ము జగమ్మునఁ గరము వరమ్మగును సుమా"
(లేదా...)
"రమ్ము జగమ్మునందునఁ గరమ్ము వరమ్ము నిజమ్ము నమ్ముమా"

72 కామెంట్‌లు:

 1. ఇమ్ముగ దేవుని కొలిచిన
  సమ్మోహము చెందు నంట సంతస మందున్
  నెమ్మిని మైత్రీ వనమున
  రమ్ము జగమ్మునఁ గరము వరమ్మ గును సుమా

  రిప్లయితొలగించండి
 2. నమ్ముము శక్తికిఁ దగిన వి
  ధమ్మున పాత్రులకుఁ జేయు దానమ్మదియే
  తమ్శుడ!సతతమ్ము శుభక
  రమ్ము జగమ్మునఁ గరము వరమ్మగును సుమా!!

  రిప్లయితొలగించండి


 3. పోదారీ పై లోకాలకు రా రా రా :)


  అమ్మణ్ణీ! రా ! పోదా
  మమ్మా! మన ప్రేమ యజర మయినది! లెమ్మా!
  బొమ్మాళి! త్రాగెదము! రా
  రమ్ము! జగమ్మునఁ గరము వరమ్మగును సుమా!


  జిలేబి
  పరార్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పరార్' అన్నారు. అంటే ఈరోజు ఇక మీనుండి పూరణలు రావన్నట్టా?

   తొలగించండి
  2. ఎవరైనా రాళ్ళు రువ్వే ముందు కాసేపు దాక్కుమందామని పరార్!

   తొలగించండి
 4. ప్రాతః కాలపు సరదా పూరణ:

  వమ్మవ నాంధ్ర నాయకుల బాసలు మెండుగ భాగ్యనగ్రినిన్
  గమ్మున పీఠమెక్కగనె గారడి జేసెడి యాగమొల్లుచున్
  కమ్మగ చంద్రశేఖరుడు గర్వము మీరగ నిచ్చినట్టి నీ
  రమ్ము జగమ్మునందునఁ గరమ్ము వరమ్ము నిజమ్ము నమ్ముమా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కాగా అనే అర్థంలో 'అవ' అనడం సాధువు కాదు. అక్కడ "వమ్మగు" అనండి.

   తొలగించండి
 5. *దేవదాసు రౙ్జు*

  వమ్మాయెను ప్రేమలు భా
  రమ్మాయెను జీవితంబు రజ్జిది కాదే
  రమ్ము శునకమా! గనుమా
  "రమ్ము జగమ్మునఁ గరము వరమ్మగును సుమా"

  రిప్లయితొలగించండి


 6. తెమ్మర తోడు నల్లన పతేరము గానెగురన్ వెసన్ శరీ
  రమ్ము జగమ్మునందునఁ గరమ్ము! వరమ్ము నిజమ్ము నమ్ముమా
  నమ్మగ బెల్టు షాపుల హయారె! జిలేబుల వేను కైపుతో
  నిమ్మది గాన! రమ్మిదియె నేవము మాధవి చేయిగానరే!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 7. మైలవరపు వారి పూరణ

  శకుంతల.. దుష్యంతునితో...

  ఇమ్మహి సత్యమే గెలుచు , నెంచగ సత్యమునందు దైవమే
  యిమ్ముగ నిల్చు , సత్యముననే లభియించును రక్ష జాతికిన్ !
  నమ్ముము సత్యవాక్యము., జనాధిప ! దీనికి సాటిలేదు! సా...
  రమ్ము జగమ్మునందునఁ గరమ్ము వరమ్ము *నిజమ్ము* నమ్ముమా !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. వాహ్ ! వాహ్! తాజుబ్ ! కమాల్ కర్దియే మైలవరపు సాబ్ !   జిలేబి

   తొలగించండి
  2. అద్భుతమైన పూరణ అవధానిగారూ!నమస్సులు!

   తొలగించండి
  3. శ్రీమతి జిలేబీ గారికి వందనములు 🙏
   ఏదో ప్రశంస.. ధన్యవాదాలు.. (భావం బోధపడలేదు.. నాకు ఉర్దూ రాదు.) అయినా చప్పట్లకు భాషలేదు. 😊🙏🙏

   మరొక పూరణ..

   వనేచరుడు సుయోధనుని పరిపాలన ను యుధిష్ఠిరునకు నివేదించు సందర్భము...

   మిమ్మును మీ యశస్సు గని మిక్కిలి యీర్ష్యను పొంది , గెల్వ భా...
   వమ్మున ప్రేమనింపి పరిపాలన జేయుచునుండె చక్కగా !
   నిమ్మహి కీడొనర్చు గుణహీనుల మైత్రి ., హితమ్ము సాధువై...
   రమ్ము జగమ్మునందునఁ గరమ్ము వరమ్ము నిజమ్ము నమ్ముమా !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
 8. ( డిండిమభట్టు గర్వనిర్వాపణం కోసం విజయనగరానికి
  ప్రయాణమైన శ్రీనాథుడు ప్రభువు పెదకోమటి వేమునితో )
  క్రమ్మెడి గౌడడిండిముని
  గర్వము సర్వము ఖర్వమందగా
  గుమ్మము నందె నిల్పి , ఘన
  గూఢపు చర్చల నోడగొట్టెదన్ ;
  దిమ్మదిరుంగ ఢక్క నిక
  దిగ్గున బ్రద్దలు జేసివైతు ; వీ
  రమ్ము జగమ్మునందున గ
  రమ్ము వరమ్ము నిజమ్ము నమ్ముమా !&

  రిప్లయితొలగించండి
 9. శ్రీ గురుభ్యోన్నమః🙏
  ప్రాతః కాలమున ఆ లక్ష్మీనృసింహుడిని తలచుచూ ఈ అల్పుడి పూరణ.

  మిమ్మున్నమ్మిన వారల
  హమ్మును బాపుటకు మీరిహమ్మున వెలయన్
  అమ్మహలక్ష్మి యుతముగా
  రమ్ము జగమ్మునఁ గరము వరమ్మగును సుమా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మహాలక్ష్మిని మహలక్ష్మి అన్నారు.

   తొలగించండి
 10. డా.పిట్టా సత్యనారాయణ
  దొమ్ముల దెచ్చును మద్యము
  కమ్మని శాకముల గూర్చి గడపగ విందుల్
  సమ్మతి కొరవడె నోడితి
  రమ్ము జగమ్మున గరము వరమ్మగును సుమా!

  రిప్లయితొలగించండి
 11. డా.పి సత్యనారాయణ
  అమ్మయె భద్రకాళి కొలువల్లన జేసెడి ఋత్వికుండు వే
  దమ్ముల బట్టు రమ్మునను తథ్యము నెన్నియు చండి యాగము
  న్నిమ్ముగ జేయ బిల్చె నొకడింగిత మెన్నిన పెద్ద ;బాపురే!
  రమ్ము జగమ్మునందున గరమ్ము వరమ్ము నిజమ్ము నమ్ముమా!!

  రిప్లయితొలగించండి
 12. క్రమ్మిన చీకటి తొలగగ
  *నమ్ముము దైవంబు* నంచు నాతియె పలుకన్
  పిమ్మట వేమన గనె తీ
  రమ్ము,జగమ్మున గరము వరమ్మగును సుమా!

  రిప్లయితొలగించండి
 13. డా.పిట్టా నుండి
  ఆర్యా.2వ పాదములో "తథ్యము నెర్గియు"గా చదువ ప్రార్థన.

  రిప్లయితొలగించండి
 14. నమ్ము చు హరి పాదమ్ముల
  నిమ్ము గ సేవల కు గడ గి యెo త యు బ్రీతి న్
  కమ్మని వర్తన తో ధీ
  రమ్ము జగమ్మున కరము వర మ్మగునుసుమా !

  రిప్లయితొలగించండి
 15. ఇమ్మహి నసురుల ద్రుంచగ
  దమ్మునితో గూడివేడ్క ధానుష్కుడవై
  యమ్ముని మానసచోరుడ!
  రమ్ము!జగమ్మునకు గరము వరమ్మగును సుమా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కమ్యూనిస్ట్ ఉవాచ

   ఇమ్మహి కార్యపుసిద్ధికి
   సొమ్మగు పనిముట్టనంగ చోద్యమ్మగునే?
   నమ్మానము జేయదగును
   రమ్ము!జగమ్మున "గరము"వరమ్మగును సుమా!

   తొలగించండి
  2. తమ్ముడ!యిమ్ముగన్ మిగులదమ్మున దున్నగ పంటభూములన్
   చెమ్మటజిందగా గనులజెక్కగ బంగరు బొగ్గురాశులన్
   సొమ్ముల నీయగాదగిన సొంపగుయంత్రపు సాఫ్టువేరు సా
   రమ్ము జగమ్మునందున "గరమ్ము"వరమ్ము నిజమ్ము నమ్ముమా!

   తొలగించండి
  3. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
  4. ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!

   తొలగించండి
  5. అంతే మరి.. వారికదే వరమైనది🙏👏

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
 16. నమ్ముము నరుడా! వీడకు

  దమ్మము,న్యాయమును,సత్పథంబు నెపుడు!మో

  క్షమ్ము నిడు నవియె!ఘన సా

  రమ్ము జగమ్మునఁ గరము వరమ్మగును సుమా"

  రిప్లయితొలగించండి
 17. ఇమ్మగు సతిమాటలపై
  నమ్మను వృద్ధాశ్రమమున విడు సుతులుండన్
  గమ్మున చావే క్షేమక
  రమ్ము జగమ్మునఁ , గరము వరమ్మగును సుమా

  రిప్లయితొలగించండి
 18. రాజీవ్ గాంధీ యెన్నికల ప్రచారము

  ఇమ్ముగ పాలింతును నా
  నమ్మ వలెను, పెద్దలార నన్నే ముదమున్
  నమ్ముచు నాకోటేయగ
  రమ్ము, జగమ్మునఁ గరము వరమ్మగును సుమా.

  రిప్లయితొలగించండి
 19. రిప్లయిలు
  1. వమ్ము భవమ్ము, సొమ్ము పరువమ్ము చరమ్ము వినశ్వరప్రభా
   వమ్ము, సతీసుతాదిపరివారగణమ్ము త్వదార్జనాశ్రయా
   ర్థమ్ము,, సదైకరక్షకుడు దక్షుడు శ్రీహరియందె న్యస్తభా
   రమ్ము, జగమ్మునందునఁ గరమ్ము వరమ్ము నిజమ్ము నమ్ముమా!.

   కంజర్ల రామాచార్య.

   తొలగించండి
  2. లోగడ మరో విధంగా శ్రీశంకరకవి గారు ఇచ్చిన ఇదే సమస్యకు అప్పటి నాపూరణ,

   వమ్ము భవమ్మునందు పరువమ్మును నమ్ముచు సొమ్ముఁ గూర్చ, వ్య
   ర్థమ్మగు జీవనమ్ము, దరిదాపున నుండవు శాశ్వతమ్ము, ఘో
   రమ్మగు జీవనమ్ము, మధురమ్మగు మాధవపాదభక్తిపూ
   రమ్ము సుధీజనాళికి శరణ్యము మోక్షపథానుగుణ్యమౌ

   కంజర్ల రామాచార్య
   కోరుట్ల.

   తొలగించండి
  3. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 20. కమ్మగ పానము చేసిన
  రమ్ము, జగమ్మునఁ గరము వరమ్మగును సుమా
  సొమ్ములు కలుఁగు ప్రభుతకున్
  నెమ్మిక బీదలు బతుకును నెంజిలి లేకన్

  రిప్లయితొలగించండి
 21. కమ్మని పిలుపుల ప్రేమగ
  రమ్మను తన వారు లేక రక్కసముగ ఛీ
  పొమ్మనగను బతుకే భా
  రమ్ము జగమ్మునఁ గరము వరమ్మగును సుమా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కమ్మని రామ నామమను గాన మరందము గ్రోలుచున్ మదిన్
   నమ్మిన వారికిన్ దలప నారములైన సుధామయంబగున్
   నమ్మక దైవమున్ నిరత నాస్తిక భావ రసాస్వదమ్ము భా
   రమ్ము జగమ్మునందునఁ గరమ్ము వరమ్ము నిజమ్ము నమ్ముమా

   తొలగించండి
 22. రాజీవ్ గాంధీ యెన్నికల ప్రచారము

  చెమ్మను కన్నలందునిక జేరగ నీయను దేశపాలనన్
  నిమ్ముగ నిందిరమ్మ వలె నింపుగ జేసెద నంచు చెప్పెదన్
  నమ్ముము నాదు మాటలను నన్ను ప్రధానిని జేయ యోటిడన్
  రమ్ము! జగమ్ము నందునఁ గరమ్ము వరమ్ము నిజమ్ము నమ్ముమా!

  రిప్లయితొలగించండి
 23. ఉమ్మడి కుటుంభ మందున
  నిమ్ముగ సేవలను చేయ నెవ్వరికైనన్
  సొమ్ములు కూడును, గృహపు భ
  రమ్ము జగమ్మునఁ గరము వరమ్మగును సుమా

  రిప్లయితొలగించండి
 24. నమ్ము స్థిరమ్ముఁ గానిది మ
  నమ్ము సతమ్మును చంచలమ్మదే,
  వమ్మగు నశ్వరమ్ము నశు
  భమ్మగు సొమ్మది వెంటరాదురా!
  తమ్ముడ!యీశు పద్మపుఁ ప
  దమ్ము పథమ్మును ముక్తినిచ్చు ద్వా
  రమ్ము జగమ్మునందునఁ గ
  రమ్ము వరమ్ము నిజమ్ము నమ్ముమా!

  రిప్లయితొలగించండి
 25. అమ్మకచెల్ల నిజము సర
  సమ్మగునే యెంచఁ బౌర సంపాదన మం
  దిమ్మగు నాఱవ భాగము
  రమ్ము జగమ్మునఁ గరము వరమ్మగును సుమా

  [కరము = కప్పము]


  నమ్మక ముంచుమా వితర ణమ్ముల నుమ్మలికమ్ము లింక పా
  పమ్ములు పమ్మ వమ్మ మఱి వమ్మన కివ్వచనమ్ము లిమ్ములే
  సుమ్ము దయా గుణమ్ము లను సొమ్ములు నెమ్మన మందు నుంట తో
  రమ్ము జగమ్ము నందునఁ గరమ్ము వరమ్ము నిజమ్ము నమ్ముమా

  రిప్లయితొలగించండి
 26. కొమ్మలు వేరు కాపురము కోరుచు నుండగ మారె పద్ధతుల్
  సొమ్ముల కాంక్షతో ప్రజలు సొక్కుచు నుండిరి నేడు పృథ్విపై
  కమ్మని జీవితమ్ము భువిఁ కాంచగ ప్రాత విధానమే యజ
  స్రమ్ముజగమ్మునందునఁ గరమ్ము వరమ్ము నిజమ్ము నమ్ముమా

  రిప్లయితొలగించండి
 27. ఇమ్మహికీయగశోభను
  రమ్ము,జగమ్మునగరమువరమ్మగునుసుమా
  యమ్మయునీవునువచ్చి,క
  రమ్ముగమాచేయుపూజత్ర్యంబక!గొనుమా

  రిప్లయితొలగించండి
 28. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  కమ్మగ జేరగా విడిచి కాంతను సంతును సైన్యమందునన్
  గమ్మున పంపగా వణకు గంపెడు నిచ్చు హిమాలయమ్ములన్
  కుమ్ముట కోసమై నిడిన కుర్మకు తోడుత రెండు పెగ్గులన్
  రమ్ము జగమ్మునందునఁ గరమ్ము వరమ్ము నిజమ్ము నమ్ముమా!

  "... Rum is issued after the roll call. The menu tonite is Meat, usually a spicy curried meat with lots of gravy..."

  https://defenceforumindia.com/forum/threads/indian-army-food-guide.41185/

  రిప్లయితొలగించండి
 29. అమ్మయునీవునున్గలసిహాయినిగూర్చగ శంకరా!దయన్
  రమ్ము,జగమ్మునందునగరమ్మువరమ్మునిజమ్మునమ్ముమా
  వమ్మగుమాటగాదలచవద్దుర!బార్వతియర్ధభాగుడా,
  యిమ్మగునీదురాకకునునెంతయొవేడ్కనునుంటిమీసుమా

  రిప్లయితొలగించండి
 30. మిత్రులందఱకు నమస్సులు!

  [ఒక రాజకీయ నాయకుఁడు తన స్నేహితునకు ’రాజకీయములలోని కడుగుఁబెట్టు’మని సలహా నిచ్చు సందర్భము]

  "నమ్మిన ’రాజకీయ’ మది నన్నును నిన్నును గొప్ప సేయు! నీ
  విమ్మెయి దీని నమ్మి నడిపించిన, నిద్దియె నిన్నుఁ జేర్చు ల
  క్ష్యమ్మొనఁగూడునట్టి దెస! కద్దె శరణ్యము! రాజకీయ తం
  త్రమ్ము జగమ్మునందునఁ గరమ్ము వరమ్ము నిజమ్ము నమ్ముమా!"

  రిప్లయితొలగించండి
 31. 🙏🙏🙏 పితృవందనం.

  అమ్మహితాత్ముడు మత్పిత
  సమ్మానిత గురువునాకు సంపత్ప్ర దుడౌ
  నమ్మితి నామదిని శుభక
  రమ్ము జగమ్మునఁ గరము వరమ్మగును సుమా!

  రిప్లయితొలగించండి
 32. ఉత్పలమాల
  ఇమ్మహి జీవులెల్లరికి నీశ్వరుఁ డొక్కఁడుఁ దోడు లేక తా
  నమ్మను సృష్టిజేసె మహి నాదరణమ్మును జూపనెంచగన్
  గమ్మని మాటలాడి నొడి గాచుచు విద్యల నేర్ప జూపు గా
  రమ్ము జగమ్మునందునఁ గరమ్ము వరమ్ము నిజమ్ము నమ్ముమా!

  రిప్లయితొలగించండి
 33. కందం
  ఇమ్మహి జీవుల నెల్లర
  నిమ్ముగఁదానుంచలేక నీశ్వరుఁడొకడై
  యమ్మల గూర్చెను మమకా
  రమ్ము జగమ్మునఁ గరము వరమ్మగును సుమా!

  రిప్లయితొలగించండి
 34. ఇమ్మహి జూడగ జనులకు
  కమ్మని పరిమళ భరితపు కల్హారముగన్
  రమ్మని పిలిచెడు మమకా
  రమ్ము జగమ్మున గరము వరమ్మగునుసుమా!!!

  రిప్లయితొలగించండి
 35. అనయము పేదల సేవయె
  తనలక్ష్యమటంచు చెప్పి తద్దయు దృతితో
  గొని పదవిఁ బ్రజాళిని దో
  చినవాఁ డొనరించెనా యిసీ దుష్కృతముల్

  రిప్లయితొలగించండి