కాదన లేక లోకులను కానల కంపెను రామ మూర్తియే సీతను గాని యా సుగుణ శీల నొకింతయు శంక లేకనే; యాతని ధర్మ రక్షణ దయా గుణమున్ హృదయాంతరంగమున్ లోఁతు నెఱుంగ సాధ్యమొకొ లోకులకున్ బలుగాకి మూఁకకున్ _/\_
చేత ము లుల్ల సిల్లు ఘన శేముషి యైన ను పల్క డెయ్యే డన్ ధీతము లందు గొప్ప యని తేకువ గా మహి లోన నేల నన్ ఆ తత విద్య లన్ గ రచి యాఢ్య త నొంది యు జ్ఞాన సంద్రపున్ లోతు నెఱుంగసాధ్య మొకొ లోకుల కున్ బలు గాకి మూక కున్
వాదు లేయ గలరు బాధించ పరులను
రిప్లయితొలగించండిమంచి చెడుల మాట యెంచ కుండ
కాకి గోల జేసి కలతలు రేపంగ
లోఁతుఁ దెలియ లేరు లోకు లెపుడు
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వాదులాడగలరు..." అనండి.
వాదు లాడ గలరు బాధించ పరులను
తొలగించండిమంచి చెడుల మాట యెంచ కుండ
కాకి గోల జేసి కలతలు రేపంగ
లోఁ తుఁ దెలియ లేరు లోకు లెపుడు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిప్రాతః కాలపు సరదా పూరణ:
రిప్లయితొలగించండితాతల కాలమందునను తప్పులు గానక నాంగ్లపాలనున్
జీతము భత్యమున్ గొనుచు జీవితమంతయు కాళ్ళుబట్టుచున్
మూతులు నాకి నాయకుల పూజలు జేయగ దేశభక్తినిన్
లోఁతు నెఱుంగ సాధ్యమొకొ లోకులకున్ బలుగాకి మూఁకకున్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
'...గానక యాంగ్లపాలనన్...' అనండి.
__/\__
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిపాతకకృత్యసంచితమొ భాసురపుణ్యసమార్జితమ్మొ ప్ర...
ఖ్యాతిని పొంద మానవునిగా జనియించితివీవు , కొల్చి ని...
ర్భీతిని యత్నమున్ సలిపి విష్ణుని జేరు , భవాబ్ధి దాటగా
లోఁతు నెఱుంగ సాధ్యమొకొ లోకులకున్ బలుగాకి మూఁకకున్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ మనోజ్ఞంగా, ప్రశస్తంగా ఉన్నది.
తొలగించండిసవరణతో,
రిప్లయితొలగించండిశ్రీ శంకరకవిగారికి ధన్యవాదములు.
కాళవిషప్రభావగతి కర్కశజంతువు నిట్లు బోనులో
తాళము వేయగా వలెను, దవ్వుల బోవ బిగించి తల్పులన్
తాళము వేయగా వలెను, తద్గతబుధ్ధి ప్రమోదకారిగాన్
తాళము వేయగా వలెను ధర్మము నిల్పగ బుద్ధి జీవికిన్.
కంజర్ల రామాచార్య
వనస్థలిపురం.
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
జ్ఞాన తృష్ణఁ గలిగి మానవుండిలలోన
రిప్లయితొలగించండినెంత చదువ నేమి కొంత మిగులు
నవధులంచు లేని యంబుధి జ్ఞానమ్ము
లోఁతుఁ దెలియలేరు లోకు లెపుడు.
విరించి గారూ,
తొలగించండిఅద్భుతమైన పూరణ. అభినందనలు.
తాతలు నాచరించునవి తండ్రుల మేలొనరించు మాటలన్,
తొలగించండిగోతులుఁ దీసి చాటుగను కోవిదు డంచు కరమ్ము మెచ్చగన్,
శ్రౌతపురాణశాస్త్రగతసత్యవచస్సుల మర్మమేమిటో,
లోఁతు నెఱుంగ సాధ్యమొకొ లోకులకున్ బలుగాకి మూఁకకున్.
కంజర్ల రామాచార్య
వనస్థలిపురము.
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
అన్ని తెలిసి నట్టి యాఢ్యు డ నేనని
రిప్లయితొలగించండిపలు క లేరు జగతి ప్రా జ్నులి ల ను
సాధ్య మగు నె జ్ఞాన సాగ ర మ్మున దిగి
లోతు తెలియ లేరు లోకులెపు డు
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండినా పూరణ. ఉ.మా
** *** *** ****
ఖ్యాతిని గాంచగన్ శశముదౌ కడు వాడిమి కొమ్ము గడించవచ్చు; ని
ర్భీతిగ నీదవచ్చు మరి పేరును బొందగ సాగరంబు లే
రీతి ప్రయత్నమున్ సలుప లేమల సౌమ్యపు
మానసంపు లో
లోతు నెఱుంగ సాధ్యమొకొ లోకులకున్ బలుగాకి మూఁకకున్
🌿 ఆకుల శాంతి భూషణ్ 🌿
🌷 వనపర్తి 🌷
శాంతిభూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కబురులెన్నొ చెప్పి, కష్టకాలమందు,
రిప్లయితొలగించండివెంటరారు నిన్ను అంటబోరు,
ఊసుపోక యిత్తురుచితంపు సలహాలు
లోఁతుఁ దెలియలేరు లోకులెపుడు..
రామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదం చివర గణదోషం. "కష్టకాలమునందు" అనండి.
జ్ఞాన ముద్ర వైచి సంతుష్టుడై యున్న
రిప్లయితొలగించండిమూలనున్నవాని మూగవాని
చూచి యతని *లోని* చూపును గనరారు
లోతు దెలీలేరు లోకులెపుడు.
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు
తొలగించండిఆ: ఎవరి బాధవారె యెదిరింప వలెగాని
రిప్లయితొలగించండిపరులు తీర్చలేరు ధరణి పైన
సంసృతి యొక పెద్ద సాగర మెపుడైన
లోఁతుఁ దెలియలేరు లోకు లెపుడు
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
( ఆజాద్ హింద్ ఫౌజు స్థాపించి ,జైహింద్ నినాదం మన
రిప్లయితొలగించండికందించిన నేతాజీని కొందరు నాయకులే గుర్తించలేదు )
నేతల కెందరెందరికొ
నేతయెయౌను సుభాసుచంద్రుడే ;
యాతని కార్యదీక్షయును
నా జయహిందు నినాదదీప్తియున్
గేతనమంత జేసినవి ;
కేవలమానవుగా దలంతురే ?
లోతు నెరుంగ సాధ్యమొకొ
లోకులకున్ బలుగాకి మూకకున్ ?
జంధ్యాల వారూ,
తొలగించండిప్రశస్తమైన పూరణ. అభినందనలు.
ధన్యవాదాలండీ!
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగాడిదైనఁ బెట్టు గార్దభభాండమ్ము
రిప్లయితొలగించండివేపచెట్టుకేమొ వెలగ గాచు
మాయలోన మునిగి మహిని సంసారపున్
"లోఁతుఁ దెలియలేరు లోకు లెపుడు"
గమనిక: నిజానికి భాండము అంటే గుడ్డు అనే అర్థం కనిపించలేదు. అయినా అసహజమైనదే కదా అని మరలా అలాగే ఉంచేశా...
😁🙏🏻
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదాలు గురువుగారు
తొలగించండి🙏🏻
పుట్టినట్టి ప్రాణి గిట్టుట నిజమని
రిప్లయితొలగించండిదెలిసికూడ దాను మెలగుచుండు
దార సుతులు ధనము దనవెంట రావను
లోతు దెలియలేరు లోకులెపుడు
విద్యలెన్నొ నేర్చి విఙ్ఞాన ఖనియైన
తొలగించండిపరమ భక్తవరుడు ప్రాఙ్ఞుడైన
దాటలేడు భువిని దారుణ మాయను
లోతు దెలియలేరు లోకులెపుడు
సీతాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!
తొలగించండిఆటవెలది
రిప్లయితొలగించండివలపు లొలుక బోసి యొయ్యారమును జూపి
పరపురుషుల మోహ భ్రాంతి గొల్పి
పైకమంత లాగు వారాంగనల మది
లోతుదెలియ లేరు లోకు లెపుడు
ఆకుల శివరాజలింగం వనపర్తి.
శివరాజలింగం గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అంతరిక్ష మేగి యంతు చూడ గలరు
రిప్లయితొలగించండికడలి దాట గలరు పడవ లోన
చేదు నిజమిది మఱి చిత్రమైన మనసు
లోఁతుఁ దెలియలేరు లోకు లెపుడు
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆటవెలది
రిప్లయితొలగించండివలపు లొలుక బోసి వయ్యారమును జూపి
పరపురుషుల మోహ భ్రాంతి గొల్పి
పైకమంత లాగు వారాంగనల మది
లోతుదెలియ లేరు లోకు లెపుడు
ఆకుల శివరాజలింగం వనపర్తి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశంకరాభరణం
రిప్లయితొలగించండి30/04/2019 మంగళవారం
సమస్య
లోతు నెఱుంగ సాధ్యమొకొ లోకులకున్ బలుగాకి మూఁకకున్
నా పూరణ. ఉ.మా
** *** *** ****
ఖ్యాతిని బొందుచున్ శశము దయ్యెడు కొమ్ము గడించవచ్చు; ని
ర్భీతిగ నీదవచ్చు మరి పేరును బొందగ సాగరంబు లే
రీతి ప్రయత్నమున్ సలుప లేమల సౌమ్యపు
మానసంపు లో
లోతు నెఱుంగ సాధ్యమొకొ లోకులకున్ బలుగాకి మూఁకకున్
🌿 ఆకుల శాంతి భూషణ్ 🌿
🌷 వనపర్తి 🌷
శాంతిభూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఓ ప్రభు! పరలోకమున గల నా తండ్రి!
కలని నిజము చేయ గలవు నీవు
నిజము కల్ల యగును నీ తెలివిడిలేక
లోఁతుఁ దెలియలేరు లోకు లెపుడు!
Amen
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో యతి తప్పింది. సవరించండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినేత్రి తీరమందు నిలువకుండగ లోన
రిప్లయితొలగించండిదిగిన గాని లోతు తెలియ నటుల
కార్యమేదయినను కడగుకుండనె దాని
లోఁతుఁ దెలియలేరు లోకు లెపుడు
సీతారామయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కడగకుండనె' టైపాటు.
🙏🏽
తొలగించండిఆటవెలది:
రిప్లయితొలగించండివిశ్వ మందు నున్న విషయమేదైనను
తెలివి గలిగి యున్న తెలుప వచ్చు
కోరుకున్న మనిషి గుప్పెడంత మనుసు
"లోఁతుఁ దెలియలేరు లోకు లెపుడు"
గొర్రె రాజేందర్
సిద్ధిపేట
రాజేందర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పద్యవిద్యకిలను పట్టముంగట్టగా
రిప్లయితొలగించండిశంకరార్యు తపన సాటి లేదు
శాస్త్రమెఱుగలేక శంకరాభరణపు
"లోఁతుఁ దెలియలేరు లోకు లెపుడు"
మాయలోఁతు నెఱుగు మర్మమదియు లోఁతు
నాతి మనసు లోఁతు నీతి లోఁతు
విశ్వమంత నిండు విభునియాంతర్యపు
"లోఁతుఁ దెలియలేరు లోకు లెపుడు"
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
విట్టుబాబుగారూ,మీ రెండవ పూరణ చక్కగానున్నది! అభినందనలు!
తొలగించండిగురువుగారూ
తొలగించండిసీతాదేవిగారూ
ధన్యవాదాలు
🙏🏻🙏🏻💐💐
కాదన లేక లోకులను కానల కంపెను రామ మూర్తియే
రిప్లయితొలగించండిసీతను గాని యా సుగుణ శీల నొకింతయు శంక లేకనే;
యాతని ధర్మ రక్షణ దయా గుణమున్ హృదయాంతరంగమున్
లోఁతు నెఱుంగ సాధ్యమొకొ లోకులకున్ బలుగాకి మూఁకకున్ _/\_
సూర్య గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
"హృదయాంతరంగపున్ లోతు..." అంటే బాగుంటుందేమో?
మొదటిపాదంలో ప్రాస?
తొలగించండిఆ తిమిరంబుకావల మహాప్రభయున్నదనుంచు వారలన్
రిప్లయితొలగించండినూతన శోధనాపరులు నూరక యుండక తీవ్ర రీతులన్
ఊతములభ్యమౌనని సిరుల్ బహు పోయ కణంబునందునా
లోఁతు నెఱుంగ సాధ్యమొకొ లోకులకున్ బలుగాకి మూఁకకున్
బాలకృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
మూడవ పాదంలో యతి తప్పింది. సవరించండి.
మనిషి మనిషి తీరు మారు చుండు మహిని
రిప్లయితొలగించండిబాహ్య వర్తనమ్ము బాగుగాను
నరయ గలరు గాని నంతరంగములోని
లోతు తెలియలేరు లోకులెపుడు
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నిండుమనసుతోడనెలవంకధారిని
రిప్లయితొలగించండిబూజజేసిననిలపురహరుమది
లోతుదెలియలేరులోకులెపుడుసుమ్ము
భవునకిడుదునతులువందలాది
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
చూతమటంచుఁ దా మొదటఁ జూరఁ గొనన్, దదవార్యదాసుగా
రిప్లయితొలగించండిబ్రాతిగఁ జేయు నా మదిరపాత్ర, మునుంగు గృహమ్ము సొమ్ము లం
దాతతకీర్తసంపదలు నాలి సుతాదుల డుంగు ముట్టగన్
లోఁతు నెఱుంగ సాధ్యమొకొ, లోకులకున్ బలుగాకి మూఁకకున్.
కంజర్ల రామాచార్య
వనస్థలిపురము.
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
లోగడ నేను రచించిన మాధవశతకపద్యానికి, నేటి సమస్యకు అనుగుణముగా పూరణ.
రిప్లయితొలగించండిసన్యసించి జ్ఞాన సముపార్జనంజేసి
రిప్లయితొలగించండివడియగట్టి తుదకు బ్రతుకు సార
మంత నెరిగె గాని యాడుదాని మనసు
లోఁతుఁ దెలియలేరు లోకు లెపుడు ౹౹
సుందర రఘురామ్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
'సముపార్జనము జేసి' అనండి.
ఇంద్రు నేలఁ గాంచె నిందుముఖి యహల్య
రిప్లయితొలగించండిలేమ యేలఁ దడసె రేణుకయును
గర మరసిన నేమి కలకంఠి హృదయంపు
లోఁతుఁ దెలియ లేరు లోకు లెపుడు
రాతిని దేవుఁ డుండుటయు రవ్వ యటంచును గేలి సేయుచుం
జూతు మనంగ విష్ణువును జొప్పడ నెల్లెడ లందు నవ్వుచున్
గోతినిఁ ద్రవ్వఁ ద్రవ్వ ననుకూలముగా మఱి నేల తల్లి దౌ
లోఁతు నెఱుంగ సాధ్య మొకొ లోకులకుం బలు గాకి మూఁకకున్
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండి
రిప్లయితొలగించండిచిత్తశుద్ధి లేని శివపూజలు సలిపి
భక్తి భావ మసలు బడయ లేక
పుణ్య మడుగు వారు పుణ్యాత్ము మార్గపు
లోఁతుఁ దెలియలేరు లోకు లెపుడు
కృష్ణారెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
జ్ఞాన సాగరంపు గాఢ తెరుంగగ
రిప్లయితొలగించండిభయము నంది నంత పరుగు లెత్తి
గుట్ట మీద చేరి కూరుచుండగ నెంచ
లోతు తెలియ లేరు లోకులెపుడు!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
కోతలు కోసితే విరివి గొప్పక కాశిని మోడివర్యునున్
భీతును జేతునంతునని;...వీడుచు పారితె డింపులమ్మ! నా
చేతుల నెత్తి దండమిడి జేజెలు కొట్టెద నీ మనమ్మునన్
లోఁతు నెఱుంగ సాధ్యమొకొ లోకులకున్ బలుగాకి మూఁకకున్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
చేత ము లుల్ల సిల్లు ఘన శేముషి యైన ను పల్క డెయ్యే డన్
రిప్లయితొలగించండిధీతము లందు గొప్ప యని తేకువ గా మహి లోన నేల నన్
ఆ తత విద్య లన్ గ రచి యాఢ్య త నొంది యు జ్ఞాన సంద్రపున్
లోతు నెఱుంగసాధ్య మొకొ లోకుల కున్ బలు గాకి మూక కున్
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రోతలుగా మునుల్ వినిన సూక్తులు ఋక్కుల వేదవాఙ్మయం
రిప్లయితొలగించండిప్రాతదిగాక నెప్పటికి ప్రాఙ్ఞుల నాల్కల నాట్యమాడగా
మ్రోతలుగా దలంచి దమ మోముల ద్రిప్పగ ధర్మసారపుం
లోతు నెరుంగ సాధ్యమొకొ లోౌకులకున్ బలుగాకులకున్
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!
తొలగించండిమనసులోననొకటి మాటలోవేరొండు
రిప్లయితొలగించండిమోసకారిమర్మ భాషణమ్ము
నోరునవ్వు చుండ నొసలుతచ్చనసేయు
లోతుదెలియలేరు లోకులెపుడు
ఫణీంద్ర గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'స-ష ప్రాస' వంటి విశేష ప్రాసల జోలికి వెళ్ళకుంటే మంచిది.
ధన్యవాదములు. మీ సలహా పాటిస్తాను.
తొలగించండిమాతయెశారదాంబనుచుమాతనుగొల్చిననాకృపామతిన్
రిప్లయితొలగించండిలోతునెఱుంగసాధ్యమొకొలోకులకున్బలుకాకి మూకకున్
నీతసరంబుతోడుతను నీరజనాభునిగొల్వుచోనిడున్
చేతమునొందగాముదముచేటలనిండుగగాంచనంబులన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అంబ + అనుచు' అన్నపుడు సంధి లేదు."శారదాంబ యని..." అనండి.
సీతమ్మను కానలలో దింపిరమ్మని పురమాయించిన శ్రీరాముని తో లక్ష్మణుడు...
రిప్లయితొలగించండిఉత్పలమాల
మాతను తప్పుబట్ట నొక మార్జుడు కానల కంప జూసెదో?
భ్రాత! గుణాభిరామ! కన పావని యగ్నిపునీత కాదొకో?
కూతలుఁ గూసినంతటనె గూళుల నెంచఁగ నేల? ధర్మపున్
లోఁతు నెఱుంగ సాధ్యమొకొ లోకులకున్ బలుగాకి మూఁకకున్
సహదేవుడు గారూ,
తొలగించండిఅద్భుతమైన పూరణ. అభినందనలు.
ప్రశస్తమైన పూరణ సహదేవుడీగారూ,అభినందనలు!
తొలగించండిగురుదేవులకు మరియు శ్రీమతి సీతాదేవి గారికి ధన్యవాదములు
తొలగించండిఅందమైనభార్య నాంతర్య మెరుగుట
రిప్లయితొలగించండిపిల్లచేష్టలందు కల్లలణిగి
యుండునట్లు కాంతయూహలందు
లోతు దెలియులేరు! లోకులెపుడు!
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదం చివర గణదోషం. సవరించండి.
నమః
రిప్లయితొలగించండినమః
రిప్లయితొలగించండిఇంతి మనసు దెలియ నీశ్వరు జాలఁడు
రిప్లయితొలగించండికొంత జెప్ప ఘనత కొరత గాదె
అంతరంగ మరయ, యందని యూహయె
లోఁతుఁ దెలియలేరు లోకు లెపుడు
వరలక్ష్మి గారూ,క్
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'... నీశుడు జాలఁడు' అనండి.
ఆటవెలది
రిప్లయితొలగించండితండ్రిమాట వినక తట్టాల పాలైన
హరిని మఱువ కుండె నక్కొమరుఁడు
ముక్తి కొరకు మునుగు భక్తి మహాంబుధి
లోఁతుఁ దెలియలేరు లోకు లెపుడు
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రజల మర్మమెరిగి ప్రణతులిడెదరులే
రిప్లయితొలగించండిబ్రతుకు సారమెరిగి భవ్యముగను
ఎన్ని కలలలోనయెరిగిమసలుకొన్న
లోఁతుఁ దెలియలేరు లోకు లెపుడు!!
గంగాప్రసాద్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆతత భావజాలమున నద్భుత మైన ప్రధానియై ధృతిన్
రిప్లయితొలగించండిభీతిలు ద్రవ్యరాశి గని వే పలు సంస్కరణల్ ఘటించి తా
జాతికొసంగె పాలనము సౌమ్య నృసింహుడు వాని యాత్మకున్
లోఁతు నెఱుంగ సాధ్యమొకొ, లోకులకున్ బలుగాకి మూఁకకున్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చేతులు మోడ్చి మ్రొక్కితిని శ్రీహరి రమ్మిక వేగ ధాత్రికిన్
రిప్లయితొలగించండిబాతక సంచితమ్ములను ధ్వంసము జేయుచు బ్రోవుమా యనన్
నాతృత తోడ నీదరికి యాతడు వచ్చునె? భక్తి సంద్రమౌ
లోతునెఱుంగ సాధ్యమెకొ లోకులకున్ బలు గాకి మూకకున్.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'దరికి నాతడు...' అనండి.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిచేయు తప్పు కిచట చెందనగును శిక్ష
నాటి జన్మఫల మనాది యుక్తి
కర్మ ఫలితమెల్ల గనగ నీ పుడమియే
లోతు దెలియలేరు లోకు లెపుడు
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిమోతలకొద్ది పత్రి నిడి "మోమును జూపు శివా!"యటన్న నీ
చేతలజూచు శంభునికి చెల్లును వర్తన లోని శీలమే
కోతల గోయగా దగదు గొప్పల కోసమె పూజ?,భక్తికౌ
లోతు నెరుంగ సాధ్యమొకొ లోకులకున్ పలుగాకి మూకకున్
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
Dfhjllhvxzsstuopbb
రిప్లయితొలగించండి:ఆడదాని చిత్త మవని నగాధము
రిప్లయితొలగించండివంటిదనుచు నుంద్రు వాసి గాను
నంతరంగ మెప్పు డరయం గ లేకనే
లోతు తెలియలేరు లోకులె పుడు
వలపు చూపి నంత వాస్తవ మనియెంచి
నున్నదెల్ల యొసగి నుర్వి యందు
పాపరు లయి రయ్య వారకాంతల మది
లోతు తెలియలేరు లోకులె పుడు