జంధ్యాల వారూ, అవును! నాకు గుర్తు... లవకుశ సినిమా చూడడానికి పల్లెల నుండి బండ్లు కట్టుకొని వచ్చేవారు. అంజలి, రామారావుల పోస్టరు ముందు కొబ్బరికాయలు కొట్టి దండాలు పెట్టేవారు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యోస్మి!ధన్యవాదములు కవివర్యులు కామేశ్వరరావుగారూ!నేఃను లెక్కపెట్టలేదండీ.అలా గణాలకోసం,బంధుత్వాలకోసం వ్రాస్తూపోయాను.ఏకాదశ విశేషణాలను ఆశ్రీహరియే పలికించాడని నా ప్రగాఢ విశ్వాసం!కాని పద్యం వ్రాసిన తర్వాత ఒక ఉద్విగ్నతకు గురయ్యాను.గురువుగారి పుణ్యాన రోజూ యేదో ఒక విధంగా భగవత్స్మరణ జరుగుతోంది కదా!ఈ పుణ్యమంతా వారికే చెందుతుందని నా మనసు వారిపట్ల కృతఙ్ఞతతో నిండిపోయింది!ఇది నిజం!ఈ బ్లాగులో పద్యాలు వ్రాసేవారందరికీ కృతఙ్ఞతలు!నమస్సులు!
రిప్లయితొలగించుకనకా! అనుష్క! ప్రియమణి!
మనల జనులు కొల్వ బ్రహ్మ మహిలో పుట్టిం
చెను సినిమా తారలుగా !
సినిమా దేవతఁ గొలువగ చేకూరు సిరుల్!
జిలేబి
జిలేబి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సూరం శ్రీనివాసులు గారి పూరణ......
రిప్లయితొలగించుఅనిదంపూర్వకృపాప్రకారగరిమాహ్లాదైకసంవర్ధనిన్
ధ్వనితానంతయశఃప్రకాశపరమన్ వాచోవిధేయన్ మనో
జ్ఞనితాంతప్రియదర్శనిన్ గురుగుణాకారన్ సదా వింధ్యవా
సిని మా దేవత ప్రేమమూర్తిఁ గొలువన్ జేకూరు సత్సంపదల్.
అనఘయె మా కులదైవ
రిప్లయితొలగించుమ్మనునిత్యము భక్తితోడ నామెను కొలువన్
నినువీడు కష్టము, సుహా
సిని, మా దేవతఁ గొల్చిన చేకూరు సిరుల్.
విరించి గారూ,
తొలగించుమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
రిప్లయితొలగించుఅనుకోమాకిక బేల యంచు రమణీ ! యత్యద్భుతంబైనదీ
సినిమా లోకము రావె రావె లలనా! చెందామరల్కాంతిగా
కనకా! రాశి! అనూష్క! ప్రీతి! అమలా! కాజల్! సమంతా! త్రిషా!
సినిమా దేవత ప్రేమమూర్తిఁ ! గొలువన్ జేకూరు సత్సంపదల్!
జిలేబి
జిలేబి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అనుకోమాకిక' అనడం వ్యావహారికం. "అనగా వద్దిక" అందామా?
రిప్లయితొలగించుఅనుకోమాకిక బేలగ
పనిలేదనుచు నరుడ! భగవతి భార్గవి! భీ
మ! నగజ! జయంతి! వింధ్యా
సిని, మా దేవతఁ గొలువగ చేకూరు సిరుల్!
జిలేబి
జిలేబి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అనగా వద్దిక' అనండి. 'వింధ్యాసిని' అర్థం కాలేదు.
ప్రాతః కాలపు సరదా:
రిప్లయితొలగించుచనుచున్ వాడల వాడలందు వడిగా సంభావనల్ జేయుచున్
కొనుచున్ చేతను చిత్ర పత్రములనున్ కొండాడుచున్ ప్రీతిగా
ననుమానమ్మును వీడి భక్తుడిలలో నార్భాట హంగామతో
సినిమా దేవత ప్రేమమూర్తిఁ గొలువన్ జేకూరు సత్సంపదల్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించుమీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
'ఆర్భాట హంగామ' దుష్టసమాస మౌతుంది. అక్కడ "ఆర్భాటమ్ముతో గోలతో" అందామా?
__/\__
తొలగించుకనుమా మిత్రమ ! " లవకుశ "
రిప్లయితొలగించుసినిమా ; అంజలి ముఖకళ సీతగ వెలిగెన్ ;
మనములు మురియగ నభినవ
సినిమా దేవత ; గొలువగ చేకూరు సిరుల్ .
జంధ్యాల వారూ,
తొలగించుఅవును! నాకు గుర్తు... లవకుశ సినిమా చూడడానికి పల్లెల నుండి బండ్లు కట్టుకొని వచ్చేవారు. అంజలి, రామారావుల పోస్టరు ముందు కొబ్బరికాయలు కొట్టి దండాలు పెట్టేవారు.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ !
తొలగించుఘనమగు జననుల జననిని ,
రిప్లయితొలగించుకనగనె కామిత మొసగెడి కాంచనదుర్గన్
మనమున నిలుపుడు ; గిరివా
సిని ; మా దేవత ; గొలువగ చేకూరు సిరుల్ .
జంధ్యాల వారూ,
తొలగించుమీ రెండవ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ !
తొలగించు
రిప్లయితొలగించుఅనుకొందురయ మలయవా
సిని, మా దేవతఁ గొలువగ చేకూరు సిరుల్!
మనసున మాటను చెప్పెద
మన కర్మఫలితము లే సుమా సౌభగముల్!
జిలేబి
వింధ్యావాసిని - దుర్గ ఆంధ్ర భారతి ఉవాచ
జిలేబి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మనసా,వచసా,శిరసా,
రిప్లయితొలగించుతనివారగ పూజ సేయ దనుజ విదారిన్
వినుత ద్వీపపు శుభ వా
సిని మా దేవత గొల్చిన చేకూరు సిరుల్.
ప్రసాద రావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు
తొలగించుఅనయము నామ జపం బును
రిప్లయితొలగించుతని వారగ సల్పి భక్తి తత్పరు డ గుచున్
మునుకొని సతతం బు సుహా
సిని మా దేవత గొలువ గ చేకూరు సిరుల్
రాజేశ్వర రావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించుసినిమా యన ఘన ఛాయయె
జనమును మోహింపజేయు జాగ్రత నెరపన్
ఇను సతియౌ పూజింపగ
సినిమా దేవత గొలిచిన చేకూరు సిరుల్
డా. పిట్టా వారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించువినుమా యైటి(I.T)ని గొన్న దేశములలో విప్పారెనే యార్జనల్
కనగావచ్చెను దూర దృశ్యములనే కన్దోయి ముందున్నటుల్
జనసామాన్యపు సెల్లు, ఫోను లెగసెన్ జాజ్జ్వల్యమానంబుగన్
సినిమా దేవత ప్రేమమూర్తి గొలువన్ జేకూరు సత్సంపదల్
డా. పిట్టా వారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆర్యా, ధన్యవాదాలు,
తొలగించుడా.పిట్టా నుండి
రిప్లయితొలగించుసని! సతి! సత్య! సినీ వా
లి! నగజ! శ్యామల! ధిషణ! చలిమలకొమిరె! కా
ళి!నికుంభిలా! శిఖరవా
సిని! మా దేవతఁ గొలువగ చేకూరు సిరుల్!
జిలేబి
జిలేబి గారూ,
తొలగించుసంబోధనలతో మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
ఘనమే దైనను గలదే
రిప్లయితొలగించువినువీ ధినివిహ రించు విహంగముల్
మనమున ప్రేమను చేకొని
సినిమా దేవతఁ గొల్చిన చేకూరు సిరుల్
అక్కయ్యా,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం. సవరించండి.
సవరించిన పూరణ
తొలగించు-----------------
ఘనమే దైనను గలదే
వినువీ ధినివిహ రించు విహగము వోలెన్
మనమున ప్రేమను చేకొని
సినిమా దేవతఁ గొల్చిన చేకూరు సిరుల్
రిప్లయితొలగించుసవరణ తో
అనుకోమాకిక బేలగ
పనిలేదనుచు నరుడ! భగవతి భార్గవి! భీ
మ! నగజ! సని!వింధ్యా వా
సిని, మా దేవతఁ గొలువగ చేకూరు సిరుల్!
జిలేబి
తొలగించు* అనుకొనవలదిక బేలగ
జిలేబి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఫణి శయనుని పాదమ్ముల
రిప్లయితొలగించుననయము సేవించుచుండు నానందముతో
వినయముగా నాయంబు నివా
సిని, మాదేవతఁ గొల్చిన చేకూరు సిరుల్
అన్నపరెడ్డి వారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. "వినయముగా నంబు నివా..." అనండి.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించుఘన సౌవర్ణ ఘటద్వయాంబు పరిషిక్తాంగిన్ , మహాలక్ష్మిఁ , గాం....
చనచేలాంచిత , రత్ననూపురలసత్సౌందర్యరాశిన్ , జనా...
వనదీక్షారతి , వార్ధిజాతను , దయావారాశినంభోజవా...
సిని మా దేవత ప్రేమమూర్తిఁ గొలువన్ జేకూరు సత్సంపదల్!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించుఅద్భుతమైన మహాలక్ష్మీ వర్ణన!నమోనమః!
తొలగించుధనవంతు లాదినంబుల
రిప్లయితొలగించుసినిమా దేవత గొలిచిన చేకూరు సిరుల్
యనుతలపు తోడ తీసిరి
తనివోవునటుల వలపు కథా చిత్రములన్
సీతారామయ్య గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఘనతర రమ సకలజగ
రిప్లయితొలగించుజ్జనని క్షీరాబ్ది తనయ సారస నిలయన్
వనమాలి సుప్రియ విలా
సిని మా దేవతఁ గొల్చిన చేకూరు సిరుల్
రాకుమార గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కనకాంగి పీతవసనను
రిప్లయితొలగించుసనకాది వినుత మనోఙ్ఞ సారసనేత్రన్
వనమాలీప్రియ పద్మా
సిని మాదేవత గొలువగ చేకూరుసిరుల్
సీతాదేవి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!
తొలగించువనజేక్షణు సహోదరి,
రిప్లయితొలగించుజనులను కాపాడు దేవి,జంభాంతకుడౌ
ఘన శంభు పత్ని,గిరివా
సిని మా దేవత గొలువగ చేకూరుసిరుల్
కృష్ణ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. "వనజేక్షణుని సహోదరి" అనండి.
తనపతిని హిమాద్రి గనగ
రిప్లయితొలగించుఘనయత్నము జేసి పొందు కాంతగ జగతిన్
దనరెడు సతియె మలయవా
సిని , మా దేవతఁ ; గొలిచినఁ జేకూరు సిరుల్
కృష్ణారావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అనయమ్మా జగదాంబ శ్రీరమను సర్వాభీష్ట సంపత్కరన్
రిప్లయితొలగించుఘనుడా క్షీర సముద్ర రాజ తనయన్ గంభీర దాక్షాయణిన్
వనమాలీ ప్రియ దేవతన్ జనని సౌవర్ణాంగనన్ పద్మవా
సినిమా దేవత ప్రేమమూర్తిఁ గొలువన్ జేకూరు సత్సంపదల్
శంభో!నవ వలలుండా
తొలగించురంభించుచు వృత్తిఁ దొలుత త్రాగగ సుధగా
కుంభముఁ జూపుచు వండగ
రంభా శివ సంగమమున రక్కసి పుట్టెన్
రంభ=అరటి,శివ=ఉసిరిక..
రెండూ కలిపి వండగా అదో రాక్షసమైన పాకమై కూర్చుంది
శంభుడుఁ దానుఁ దాపసిగ
తొలగించుసాత్త్విక మూర్తిగ బ్రహ్మచర్యమా
రంభణ సేయ, బెండ్లికి తి
రస్కృతిఁ జూపిన నేమిసేయుటో?
స్తంభపు రీతియున్న శివు
శక్తిని గూర్పగ నెంచె కాలమున్
రంభయు శంభుఁడున్ గలియ,
రక్కసి పుట్టె సురల్ వడంకఁగన్
రక్కసి = తారకాసురుడు
రాకుమార గారూ,
తొలగించుమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
అనుపమ,జూచితె?దేవత
రిప్లయితొలగించుసినిమా,దేవతగొలిచినచేకూరుసిరుల్
వినయము భక్తియుశ్రద్ధను
ననునయమున్గలిగియుండి హర్షముతోడన్
సుబ్బారావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వనజాక్షిన్, శశిసోదరీమణికనద్వైకుంఠధామేశ్వరిన్,
రిప్లయితొలగించువనధీశాప్తసుతన్, నితాంతనుతసర్వారాధ్యనున్, శ్రీరమన్,
ఘనశోభాస్పదహర్యురస్స్థిరవసత్కాంతాలసత్కీర్తిభా
సిని, మాదేవత, ప్రేమమూర్తిఁ గొలువన్ జేకూరు సత్సంపదల్.
కంజర్ల రామాచార్య.
రామాచార్య గారూ,
తొలగించుమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
ఘనమగు నాయిక రూపము
రిప్లయితొలగించుగని ప్రేక్షకుడు ముఱియంగ కాసులు కుఱియున్
కనగా నిర్మాతలకున్
సినిమా దేవత గొలిచిన చేకూరు సిరుల్ !
శ్రీధర రావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించుఅనిరుద్ధోగ్రపరాక్రమున్, సతత సర్వారాధ్యుఁడౌ శ్రీనివా
సుని, విశ్వాత్ముని, శార్ఙ్గపాణిని, హరిన్, సుశ్రీదు, తార్క్ష్యధ్వజున్,
దనుజారిన్, వనమాలిఁ, జక్రధరుఁ, బీతస్రజ్వు, క్షీరాబ్ధివా
సిని, మా దేవత ప్రేమమూర్తిఁ గొలువన్ జేకూరు సత్సంపదల్!
[పీతస్రజ్వుని = పీతాంబరుని; మా దేవత ప్రేమమూర్తిని = లక్ష్మీదేవికిఁ బ్రేమస్వరూపుఁడైనవానిని]
మధుసూదన్ గారూ,
తొలగించుమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!
తొలగించుబహుచక్కని పూరణ మధురకవిగారూ!ఏంటా అంతా విష్ణువర్ణన అనుకుంటూ చదివితే చివర చక్కని మెలికపెట్టి అలరించారు!చాల బాగుంది!నమస్సులు!
రిప్లయితొలగించుధన్యవాదాలండీ సీతాదేవిగారూ!
తొలగించుకనుమాతప్పకయొక్కసారయిననాకాంతాలలామంబుదౌ
రిప్లయితొలగించుసినిమాదేవత,ప్రేమమూర్తిగొలువన్జేకూరుసత్సంపదల్
వినుమాశంకర,భక్తితోనిలనువేవేమార్గనిర్దేశమై
వినయంబొప్పగమంత్రయుక్తముగనునాపెద్దమ్మతల్లిన్సదా
నాల్గవపాదంలో నగణంతర్వాత
తొలగించును
పొరపాటుగా ప్రింటుఅయినది
క్షంతవ్యుడను
సుబ్బారావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మన గోగులమ్మ మున్కని
రిప్లయితొలగించువిని యెఱుగని మహిమ లలర వెలసెన్ భక్తా
వనమస్మద్గ్రామ నివా
సిని మా దేవతఁ గొలిచిన చేకూరు సిరుల్
మును బుట్టెన్ ధవలాంబురాశి విమలాంభోజాక్షి గాంగేయ మం
డన షండద్యుతి వెల్గఁ గంబు నిభ కంఠంబంత విద్యోతమై
వనితా రత్నము శుద్ధ పద్మకరయున్ వైకుంఠ సద్ధామ వా
సిని, మాదేవత ప్రేమమూర్తిఁ గొలువం జేకూరు సత్సంపదల్
[మా = లక్ష్మి]
కామేశ్వర రావు గారూ,
తొలగించుమీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించుఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించు(జిలేబి గారికి అంకితం)
వినుడీ మధ్యను తీయుచుండిరి గదా వింతౌ బయోపిక్కులన్
పనిలేన్ మంగలి రీతిగా పొలిటికల్ భండన్నలన్ జొచ్చుచున్
కనుడీ యెన్నికలందు మోడి చరితన్ గారాబుగా కూర్చనా
సినిమా దేవత ప్రేమమూర్తిఁ గొలువన్ జేకూరు సత్సంపదల్
దేవత = వేలుపు, దేవుడు
తొలగించుఅదురహో !
గనుడయ్య బయోపిక్కుగ
పనిలేకయు దర్శకులు గబగబాల్మనగా
మనమోడీదయ్య భళా
సినిమా దేవత గొలువగ చేకూరు సిరుల్ !
జిలేబి
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
***********
జిలేబి గారూ,
__/\__
అనయమ్మున్ తగుమంచి మార్గమున తానార్జించుచున్ విత్తమున్
రిప్లయితొలగించుఘనమౌ రీతిని పేదవారలను సంఘంమందు సేవించుచున్
వినయమ్మైన విధానమందు సతమున్ ప్రేమమ్ముతో నంభు వా
సిని, మాదేవత ప్రేమమూర్తిఁ గొలువన్ జేకూరు సత్సంపదల్
అన్నపరెడ్డి వారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సంఘమ్మందు/సంఘంబందు... నంబువాసిని...' అనండి.
మనసే కోవెల గానుజేసి మదిఁ సమ్మానించుచున్ భక్తితో
రిప్లయితొలగించుఘనమౌరూపము నందు నిల్పుకొని సత్కార్యమ్ము గా దల్చుచున్
సని శుంభుప్రియ మేనకాత్మజను పశ్వత్పాలు దేహార్థ వా
సిని, మా దేవత ప్రేమమూర్తి గొలువన్ జేకూరు సత్సంపదల్.
విరించి గారూ,
తొలగించుమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
మధురకవిగారి బాటలో
రిప్లయితొలగించుఘనుడౌ శ్రీహరి, శంఖచక్రధరు, నాకర్ణాంతనేత్రున్, సుదా
మునకున్ మిత్రుడు,పాండవాప్తుడు,యశోమూర్తిన్ ,యశోదాసుతున్ ,
వినతాసూనురథున్ ,గజేంద్రవరదున్ ,విశ్వంభరున్ ,పద్మవా
సిని మాదేవత ప్రేమమూర్తి గొలువన్ జేకూరు సత్సంపదల్ !
వారికన్న మరికొన్ని చుట్టరికాలను ప్రస్తావించాను!
సీతాదేవిగారూ! చాలా బాగున్నదండీ మీ పూరణము! అభినందనలు! రెండోపాదంలో మిత్రుని, పాండవాప్తుని...అనండి. అన్నీ ద్వితీయాంతాలయి అన్వయం సరిపోతుంది.
తొలగించుధన్యవాదాలండీ!తప్పక మీ సూచనలను పాటిస్తాను!నా కవిత్వమంతా ఈబ్లాగులో మీవంటి పెద్దలనుండి నేర్చుకున్నదే!నమస్సులు!
తొలగించుపాకాన పడిందండి మీ కవిత్వము డా.సీతా దేవి గారు.
తొలగించుఘనునిన్ శ్రీహరి ...
ఏకాదశ విశేషణాలు శ్రీహరికి.
ధన్యోస్మి!ధన్యవాదములు కవివర్యులు కామేశ్వరరావుగారూ!నేఃను లెక్కపెట్టలేదండీ.అలా గణాలకోసం,బంధుత్వాలకోసం వ్రాస్తూపోయాను.ఏకాదశ విశేషణాలను ఆశ్రీహరియే పలికించాడని నా ప్రగాఢ విశ్వాసం!కాని పద్యం వ్రాసిన తర్వాత ఒక ఉద్విగ్నతకు గురయ్యాను.గురువుగారి పుణ్యాన రోజూ యేదో ఒక విధంగా భగవత్స్మరణ జరుగుతోంది కదా!ఈ పుణ్యమంతా వారికే చెందుతుందని నా మనసు వారిపట్ల కృతఙ్ఞతతో నిండిపోయింది!ఇది నిజం!ఈ బ్లాగులో పద్యాలు వ్రాసేవారందరికీ కృతఙ్ఞతలు!నమస్సులు!
తొలగించుసీతాదేవి గారూ,
తొలగించుమీ పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
మధుసూదన్ గారి సూచనలను గమనించండి.
ధన్యోస్మి గురుదేవా!సవరిస్తాను.ధన్యవాదములు,నమస్సులు!
తొలగించుసవరించిన పూరణ:
తొలగించుఘనునిన్ శ్రీహరి శంఖచక్రధరు,నాకర్ణాంతనేత్రున్ ,సుదా
మునకున్ మిత్రుని,పాండవాప్తుని,యశోమూర్తిన్ ,యశోదాసుతున్
వినతాసూనురథున్ ,గజేంద్రవరదున్ ,విశ్వంభరున్ ,పద్మవా
సిని మాదేవత ప్రేమమూర్తి గొలువన్ జేకూరు సత్సంపదల్
చని రామునితో జానకి
రిప్లయితొలగించువనిc కా పథమును వదలక వనితా మదినన్
కని మెలగు దుష్ట విధ్వం
సిని; మా దేవత గొలిచిన జేకూరు సిరుల్
యజ్ఞేశ్ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వని' తరువాత అరసున్న అవసరం లేదు. "వనిత తన మదిన్" అనండి.
ఘనమౌ శ్రీశైలం బున
రిప్లయితొలగించుఅనవరతము భక్తిచేత నాజగదాంబన్
మనసునదలచ!గిరినివా
సిని!మాదేవత గొలచిన జేకూరుసిరుల్
ఈశ్వరప్ప గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'జగదంబ' అనడం సాధువు.
సవరించిన పూరణ
రిప్లయితొలగించు-----------------
ఘనమే దైనను గలదే
వినువీ ధినివిహ రించు విహగము వోలెన్
మనమున ప్రేమను చేకొని
సినిమా దేవతఁ గొల్చిన చేకూరు సిరుల్
అక్కయ్యా,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం. సవరించండి.
మనమున భక్తిని దేవుని
రిప్లయితొలగించుగొనియాడుచు గొలిచినంత గోరిక దీరున్
వినుమా మిత్రమ! యెట్టుల
సినిమా దేవతఁ గొలిచినఁ జేకూరు సిరుల్ ?
జనార్దన రావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కందం
రిప్లయితొలగించుఘన యశము 'మహానటి' గన్
జనమున సావిత్రి గలుఁగ సత్యము తెరపై
గన రూపొందించుచు నా
సినిమా దేవతఁ గొలిచిన చేకూరు సిరుల్
మత్తేభవిక్రీడితము
ఘనమౌ తల్లిగ చెల్లిగన్ సతిగ సాక్షాత్కారమున్ ప్రేక్షకుల్
కనగా నామె చరిత్రయే తెరకు భాగ్యమ్మంచు సావిత్రి నిన్
వినువీధిన్ నిలుపన్ 'మహానటి' గ జూపించంగ దృశ్యమ్ములన్
సినిమా దేవత ప్రేమమూర్తిఁ గొలువన్ చేకూరు సత్సంపదల్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుసమస్యా పూరణం లోని సమస్య
రిప్లయితొలగించు*సినిమా దేవత గొలిచిన చేకూరు సిరుల్*
నా పూరణ 👇
వనమాలి హృదయేశ్వరి
వనజాక్షికి నేనిడుదును వందనశతముల్
ఘనమగు కొల్హాపుర వా
సిని! మాదేవత గొలచిన జేకూరు సిరుల్
అనవరతమా మలయవా
రిప్లయితొలగించుసిని మా దేవతఁ గొలిచిన చేకూరు సిరుల్
అనుమాన మదేల వినుము
తనియించును మనలనెల్ల దాక్షిణ్యముతో
వినుమా నిత్యము నింటి లోపలను వేవేగన్
దండాలనిడన్
తనియించున్ మననెల్లను సతతమాదాక్షాయణిదేవియున్
ననయమ్మామెయె దండిగ దయను పంచానందమిచ్చాసువా
సినిమా దేవత ప్రేమమూర్తిఁ గొలువన్ జేకూరు సత్సంపదల్