10, ఏప్రిల్ 2019, బుధవారం

సమస్య - 2982 (మోహన రాగమ్ము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మోహన రాగమ్ము ఖేదమును గూర్చుఁ గదా"
(లేదా...)
"మోహన రాగ గానమది మోదముఁ ద్రోసియుఁ గూర్చు ఖేదమున్"

38 కామెంట్‌లు:


 1. ప్రేయసి తో ప్రియుడు ;)  బాహాటమ్ముగ నా యొడి
  లో హాహాకారముల్ పొలోమని విలపిం
  చే హొనరులు చూడంగన్
  మోహన! రాగమ్ము ఖేదమును గూర్చుఁ గదా!  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. ప్రాతః కాల సరదా:

  దోహదమిచ్చి హృత్తునకు దూరము చేయును బాధలన్నిటిన్
  మోహన రాగ గానమది;...మోదముఁ ద్రోసియుఁ గూర్చు ఖేదమున్
  దాహము నిచ్చి కంఠమున దంభము కూల్చుచు మానవాళికిన్
  కోహము నంచు జీవునకు క్రోధము త్రెంచు ముఖారి రాగమే :)

  రిప్లయితొలగించండి
 3. మైలవరపు వారి పూరణ

  గోపకాంత...

  మోహమొ భక్తియో యెరుగ , మోమును జూచుచు వాలి సోలి నీ...
  బాహుయుగమ్ము మధ్య తనువర్పణ జేయగ కోర్కె కల్గెడిన్ !
  రాహసికప్రియా ! యదువరా ! నిను గానక శ్రోత్రపర్వమౌ
  మోహన రాగ గానమది మోదముఁ ద్రోసియుఁ గూర్చు ఖేదమున్ !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 4. లోహము మెత్తన జేయును
  మోహన రాగమ్ము;ఖేదమును గూర్చు గదా
  ఊహల చెరుపుచు సతతము
  దాహము జనియింప జేయు తడబడు జతులున్.

  రిప్లయితొలగించండి


 5. కె యెల్ సైగల్ - కుందన్ లాల్ సైగల్ - 11 April అతని జన్మదినం


  ఆ హొయలున్ సరాగముల హాకము "సైగలు" నాదమయ్యదే
  మోహన రాగ గానమది! మోదముఁ ద్రోసియుఁ గూర్చు ఖేదమున్
  వాహక మైన కంఠమును వారుణి సేవల నింపి స్వర్గతిన్
  స్నేహిగ కౌగలించుకొని నేవళికమ్ముగ సాగిపోవగాన్!  "Jine Ka Dhang Sikhaaye Ja"

  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. డా.పిట్టా సత్యనారాయణ
  వాహన యోగము లాభమె?
  సాహస మోదాల దేల్చి చల్లంగా నా
  వాహనమిడు మృతికి నహో !
  మోహనరాగమ్ము ఖేదమును గూర్చుగదా!!

  రిప్లయితొలగించండి
 7. డా.పిట్టాసత్యనారాయణ
  మోహన!నవ్వగూడదిట ముర్పెము నీదన నెల్లవేళలన్
  వాహన మౌదువీవు యెటువైపుకు ద్రిప్పునొ రౌతు గుర్రమున్
  దేహమునందు మార్పులును దిక్కు, దిశల్ పరమాత్ము సొంతమౌ
  మోహనరాగగానమది మోదము ద్రోసియు గూర్చు ఖేదమున్

  రిప్లయితొలగించండి

 8. ఓ మిత్రుడి యేడ్పు అతని హితునితో :)


  దేహమ్మును మరిపించును
  మోహన రాగమ్ము ! ఖేదమును గూర్చుఁ గదా
  స్నేహితుడా పెడబొబ్బలు
  వాహిని గాయేడ్పులున్ను వనితలదౌరా:)


  జిలేబి

  రిప్లయితొలగించండి
 9. రిప్లయిలు
  1. వరూధిని ప్రవరాఖ్యునితో

   మోహితురాలనైతి వరముగ్ధమనోహరభవ్యరూపసం
   దోహవిలాసహాసములఁ, దొయ్యలి కోరి వరించె, స్త్రీలస
   ద్దేహమె స్వర్గసీమ గద, తీర్చుము కోరిక, యీ విపంచికా
   మోహనగరాగానమది మోదముఁ ద్రోసియుఁ గూర్చు ఖేదమున్.

   కంజర్ల రామాచార్య.

   తొలగించండి
 10. ( " మోహనరాగమహా మూర్తిమంతమాయే " అనీ "ఊహలు గుసగుసలాడె నాహృదయము ఊగిసలాడె "
  అనీ మన మనసులను పరవశింపజేసిన ఘంటసాల )
  శ్రీహరి పాదపీఠమును
  జేరిన గాయకసార్వభౌమునిన్ ;
  మోహము నింపు గీతముల
  ముగ్ధుల జేసెడి ఘంటసాలనే
  యూహల నిల్పుకొన్న హృది
  యూయలలూగును ; తల్చుకొన్నచో
  మోహనరాగ గానమది
  మోదము ద్రోసియు గూర్చు ఖేదమున్ .

  రిప్లయితొలగించండి
 11. సాహస వీరుడు వైరుల
  నాహవ మునజంప బూని యలు క ను వేయన్
  దోహద కారిగ శర స
  మ్మోహ న రాగ మ్ము ఖేదమును గూర్చు గదా !

  రిప్లయితొలగించండి
 12. ఆహా!కృష్ణా!యేమి మ
  నోహర రూపమయ నీది!నువు లేని తలం
  బే హర్ష మిడదు.ఘనమౌ
  మోహన రాగమ్ము ఖేదమును గూర్చుఁ గదా

  రిప్లయితొలగించండి
 13. కోహటకుc షికోహమునన్
  కోహలితో కోహనూరు కోటనిడుకొనన్
  కోహల మత్తున కోల్పడ
  మోహన రాగమ్ము ఖేదమును గూర్చుఁ గదా!

  కోహటకుడు- ద్రిమ్మరి; శికోహము-డాంబికము
  కోహలి-మోసపూరిత కన్య;
  కోహనూరు- వజ్రం
  కోహల- మద్యం

  రిప్లయితొలగించండి
 14. దేహము పరవశమగు నా
  శ్రీహరి బృందావనమున చేయు నటనతో
  నాహా! మఱుఁగగు మురళీ
  మోహన రాగమ్ము ఖేదమును గూర్చుఁ గదా

  రిప్లయితొలగించండి
 15. ఊహలలో నిను నిలుపుచు
  మోహముతో జేరినాము మురళీ కృష్ణా
  శ్రీహరి నిగాన కున్నను
  మోహనరాగమ్ము ఖేదమును గూర్చుఁ గదా!

  రిప్లయితొలగించండి
 16. కందము
  మోహన రాగము విని స
  మ్మోహితయై ప్రకృతికాంత మురిపెము మీరన్
  ఓహోరే !యన నెట్టుల
  మోహనరాగమ్ము ఖేదమును గూర్చు గదా!
  ఆకుల శివరాజలింగం వనపర్తి

  రిప్లయితొలగించండి
 17. ఆహాయనిపించునుగద
  మోహనరాగమ్ము,ఖేదమునుగూర్చుగదా
  కోహలమదిదానిరతము
  మోహితునిగజేసిమనుజుమోదములేకన్

  రిప్లయితొలగించండి
 18. మోహము తోడ వేగు తరి మోదము నిచ్చుచు హాయి గూర్చుగా
  దాహము దీర్చు నీటివలె దైన్యత బాపుగ యెల్ల వారికిన్
  మోహన రాగ గానమది ; మోదముఁ ద్రోసియుఁ గూర్చు ఖేదమున్
  స్నేహము దూరమైనపుడు స్నేహితు లిద్దరు వీడిపోయినన్!

  రిప్లయితొలగించండి
 19. ఓహో యని పొగడగ మరి
  ఆహాయని పాడ గార్ధభగళ మహిమచే
  హాహాకారములు సలుప
  మోహన రాగమ్ము ఖేదమును గూర్చు గదా!

  అందరూ ఓహో అని పొగిడితే ఆహా అని గాయకుడు పాట మొదలు పెడితే ఆ గాడిద గొంతు భరించలేక శ్రోతలు హాహాకారములు చేస్తే మోహన రాగం అందరికీ బాధ కలిగించింది.

  రిప్లయితొలగించండి
 20. దేహము శాశ్వత మనగా
  మహిలో సుఖ సాధనమ్ము మత్రయ మనగా
  హిహిహీ యను జనతా వ్యా
  మోహన రాగమ్ము ఖేదమును గూర్చుఁ గదా"
  (మత్రయం మందు, మగువ, మద్యం)

  రిప్లయితొలగించండి
 21. గేహమ్మున సంతృప్తిగ
  నాహారము గొని సువర్ణ హారము కొఱకై
  యాహా యారును నొక్కటి
  మోహన! రాగమ్ము ఖేదమును గూర్చుఁ గదా


  ఐహిక వాంఛ లందు నిడి యాశలు పెల్లుగ వాటిఁ గోరు నే
  దేహికి సమ్మతం బగును దీర్థ గమమ్ములు వారిఁ ద్రాగకే
  దాహము తీరునే భువి సదా విరహాగ్ని నిమగ్న జీవికిన్
  మోహన రాగ గానమది మోదముఁ ద్రోసియుఁ గూర్చు ఖేదమున్

  రిప్లయితొలగించండి
 22. సాహస మొనరించి వెడల
  స్నేహితుని వెనుక సుకన్య చీకటివేళ
  న్నూహలు భగ్నంబైనను
  మోహన రాగమ్ము ఖేదమును గూర్చుగదా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. స్నేహము నెంచుచున్ మది కుచేలుని ప్రేమను నాదరించగా
   మోహనరాగ గానమది,మోదము ద్రోసియు గూర్చుఖేదమున్
   మోహమునెంతయో దనదు ముద్దులబాలుని బెంచగానట
   న్నూహల ద్రుంచివేయుచును నూరినిబాయగ ధర్మరక్షకై!

   తొలగించండి
 23. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  గానవిరోధి ఆక్రోశము:

  దేహము కాలెనే వలపు తీగలు మాడ్చుచు నిన్ను చూడగా
  దాహము తీర్చుమమ్మ నను దగ్గర జేర్చుచు కౌగిలించుచున్
  కాహెకొ నన్ను కూల్చెదవు? కంపము నిచ్చును నీదు కంఠమున్
  మోహన రాగ గానమది మోదముఁ ద్రోసియుఁ గూర్చు ఖేదమున్

  రిప్లయితొలగించండి
 24. శ్రీహరి నాట్యమాడ కడు చెన్నుగ, వ్రేతలు మత్త చిత్తులై
  దేహము లందు కోరికలు దీకొన, వారికి నల్లనయ్య స
  మ్మోహన రాగ గానమది మోదముఁ ద్రోసియుఁ గూర్చు ఖేదమున్
  ఆహరి కౌగిలిన్ గొనుటకై తపియించ మనస్సు లిచ్చతో


  రిప్లయితొలగించండి
 25. ఆహయనంగజేయునికహాయినిగూర్చును విన్నవారికిన్
  మోహనరాగగానమది,మోదముద్రోసియుగూర్చుఖేదమున్
  కోహలసేవనంబరయగ్రోధముబెంచునుదైన్యమీయుసూ
  గేహముశాంతిశూన్యమయికేకలతోడనుదద్దరిల్లుగా

  రిప్లయితొలగించండి
 26. క్రొవ్విడి వెంకట రాజారావు:

  ఆహా! యేమందమని కు
  తూహలబడుచు నొడబడని తొయ్యలి వెంట
  న్నీహన్నాడుచు పాడెడి
  మోహన రాగమ్ము ఖేదమును గూర్చు గదా!

  రిప్లయితొలగించండి
 27. మోహన మురళీ గానము
  మోహానలమై దహించె ముదిత మనంబున్
  ఆహా యేమిది చిత్రము
  మోహన రాగమ్ము ఖేదమును గూర్చుఁ గదా

  రిప్లయితొలగించండి
 28. మోహనరూపసి తోవ్యా
  మోహమునందురిక?పెళ్లిమోజగ జరుగన్!
  స్నేహితు లెక్కగనే స
  మ్మోహనరాగమ్ము ఖేదమును గూర్చుగదా!

  రిప్లయితొలగించండి
 29. మోహము గ్రమ్మివేయు తరి మోదము నిచ్చుచు హాయి గూర్చుగా
  దాహము దీర్చు నీటివలె దైన్యత బారగ ద్రోలునే కదా
  మోహన రాగ గానమది ; మోదముఁ ద్రోసియుఁ గూర్చు ఖేదమున్
  స్నేహము దూరమైనపుడు స్నేహితు లిద్దరు వీడిపోవగన్!

  రిప్లయితొలగించండి
 30. ఊహల కందలేనివి మహోన్నత లీలల జూపినట్టి యా
  సాహస బాలునిన్ గనగ జవ్వను లెల్లరు జేరిరచ్చటన్
  మోహము తోడ, గోపికలు ముద్దుల కృష్ణుని గాంచకుండినన్
  మోహన రాగగానమది మోదముఁ ద్రోసియుఁ గూర్చుఖేదమున్.

  రిప్లయితొలగించండి
 31. దేహము శాశ్వత మనగా
  మహిలో సుఖ సాధనమ్ము మత్రయ మనగా
  హిహిహీ యను జనతా వ్యా
  మోహన రాగమ్ము ఖేదమును గూర్చుఁ గదా"
  (మత్రయం మందు, మగువ, మద్యం)

  రిప్లయితొలగించండి


 32. ఆహా యనిపించును గా
  మోహన రాగమ్ము ఖేదము కూర్చు గదా
  నూహలలో బ్రతుకు గడుపు
  చాహవమును చేయనెంచు నల్పుల కిలలో
  రెండవ పూరణ

  స్నేహపు వార్ధిలో మునిగి స్నిగ్ధ మనస్కులుగా వినంగ నా
  మోహము నందు మైమరచి ముందుగ హాయిని కూర్చుచుండగా
  మోహన రాగ గానమది మోదముఁ ద్రోసియుఁ గూర్చు ఖేదమున్
  ద్రోహము చేయినెంచగను దుఃఖము హెచ్చగు నట్లు చేయు గా

  రిప్లయితొలగించండి
 33. ఊహల పథమెన్నికలన్
  తాహతు విడజేయఁగ ఫలితమ్మోటమి! యు
  త్సాహము నిండిన వైరుల
  మోహన రాగమ్ము ఖేదమును గూర్చుఁ గదా?

  ఉత్పలమాల
  సాహస మెంచి యెన్నికల స్పర్ధకు సంపద ధారఁ బోసి తా
  నూహల దేలగన్ ఫలిత మోటమి జూపఁగ వైరి వర్గ పు
  త్సాహము పర్వమై పురము సందడి నిండఁగ మేళమందునన్
  మోహన రాగ గానమది మోదముఁ ద్రోసియుఁ గూర్చు ఖేదమున్

  రిప్లయితొలగించండి