9, ఏప్రిల్ 2019, మంగళవారం

సమస్య - 2981 (కాంతను బెండ్లాడి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కాంతను బెండ్లాడి నరుఁడు గాంచు నరకమున్"
(లేదా...)
"కాంతను బెండ్లియాడి నరకమ్మును గాంచును మానవుం డయో"

84 కామెంట్‌లు:

 1. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,

  గురుభ్యో నమః నిన్నటి పూరణ స్వీకరించ మనవి


  గ్రామ జనాళి > చండ నరఘాతకుడౌ యల
  " భీమసేన్ వసింగ్ "

  నామము విన్నచో , హడలి కంపన మొందును | కాని మొన్న యా

  గామిడి శత్రు వొక్కరుడు కక్షను దీర్చుకొనంగ , నాతనిన్

  గ్రామము బైట చంపుచు శిరంబును కోయుచు పాతిపెట్టగా

  చీమలు భీమసేను ఘనశీర్షమునున్ భుజియించె బ్రీతితో

  ------------------------------------------------------------------------

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ఉదయాన్నే సమస్యలో నరకాన్ని ప్రస్తావించాను. ఇక మొట్టమొదటి పూరణలో బీభత్సరసం! హతవిధీ! ఈరోజెలా గడుస్తుందో?

   తొలగించండి


 2. అంతా భ్రాంతి తెలుసుకొన
  నెంతయు మేలగు భ్రమరుడ ! నెమ్మియె లేదీ
  వింత జగత్తున విను పర
  కాంతను బెండ్లాడి నరుఁడు గాంచు నరకమున్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబి గారూ,
   పరకాంతా ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 3. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,

  గురుభ్యో నమః నిన్నటి పూరణ స్వీకరించ మనవి


  గ్రామ జనాళి > చండ నరఘాతకుడౌ యల భీమసేనసింగ్

  నామము విన్నచో , హడలి కంపన మొందును | కాని మొన్న యా

  గామిడి శత్రు వొక్కరుడు కక్షను దీర్చుకొనంగ , నాతనిన్

  గ్రామము బైట చంపుచు , శిరంబును కోయుచు , పాతిపెట్టగా

  చీమలు భీమసేను ఘనశీర్షమునున్ భుజియించె బ్రీతితో

  ------------------------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 4. రిప్లయిలు
  1. ప్రాతః కాల సరదా:

   చింతలు వమ్ము జేయుముర! సిగ్గును వీడి ధనమ్ము తెచ్చెడిన్
   కాంతను బెండ్లియాడి;...నరకమ్మును గాంచును మానవుం డయో
   పంతులు నౌకరిన్ కలిగి పాడుది కట్నము పుచ్చుకొన్క భల్
   సంతును దెచ్చెడిన్ ముసలి శాస్త్రుల కూతును పెండ్లియాడుచో

   తొలగించండి
  2. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి

 5. ये नशीली जीवन ये अनिश्चय जीवन इक सप्ना है !


  భ్రాంతియిదేను జీవితపు పాగడ కొన్నిదినమ్ములే గదా
  వింతయిదేను కౌతుకము వీగును కొన్నిదినమ్ములందు పో
  గంతయు రాకమానదు వికారపు పోకడ లేలనో యనై
  కాంతను బెండ్లియాడి నరకమ్మును గాంచును మానవుం డయో!


  जिलेबी

  రిప్లయితొలగించండి
 6. ఇంతయు జాలిని జూపక
  పంతముతో సతము పతిని బాధించుచు నే
  కాంతము నాశపరిచె డ
  క్కాంతను బెండ్లాడి నరుఁడు గాంచు నరకమున్"

  రిప్లయితొలగించండి
 7. మైలవరపు వారి పూరణ

  ఈరోజంతా.. ఇంతే.. ఏమవుతుందో ఏమో😊

  పంతము వీడబోదు , తన వారిని మెచ్చుచు, నత్తమామలన్
  సుంత గణింపబోదు , తనె సుందరినంచు భ్రమించు , చేరగా
  చెంతకు ప్రేమవాసన రుచింపదు , ధాత్రిని తృప్తిలేనిదౌ
  కాంతను బెండ్లియాడి నరకమ్మును గాంచును మానవుం డయో !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. చిన్న సవరణతో 🙏

   ఈరోజంతా.. ఇంతే.. ఏమవుతుందో ఏమో😊

   పంతము వీడబోదు , తన వారిని మెచ్చుచు, నత్తమామలన్
   సుంత గణింపబోదు , గుణ సుందరినంచు భ్రమించు , చేరగా
   చెంతకు ప్రేమవాసన రుచింపదు , ధాత్రిని తృప్తిలేనిదౌ
   కాంతను బెండ్లియాడి నరకమ్మును గాంచును మానవుం డయో !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
 8. వంతకు దూరమౌ నరుడు
  భవ్యగుణాంచిత ; మంజుభాషియౌ
  కాంతను బెండ్లియాడ ; నర
  కమ్మును గాంచును మానవుండయో !
  శాంతవిహీనయున్ ; మిగుల
  చంచలచిత్తయు ; పాదమస్తకా
  సాంతము సూర్యకాంతమును
  జక్కగ బోలెడి భార్య యైనచో .

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జంధ్యాల వారూ,
   విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి

 9. ఉ.మా.

  ఇంతయు జాలి జూపదయొ యెంతగ నేడ్చిన లాభమేమయా!

  పంతముతోడ తా మగని ప్రాణము దీయును బాట్లు బంచుచున్

  చింతలె మెండుగౌ కడకు జేకొన బెండిలి ;గాన నిక్కలిన్

  కాంతను బెండ్లియాడి నరకమ్మును గాంచును మానవుం డయో

  🌿 ఆకుల శాంతి భూషణ్ 🌿
  🌷 వనపర్తి 🌷

  రిప్లయితొలగించండి
 10. సుంత యు లోకము తెలి య క
  పంతము తో తనదు మాట పాటింపు డ నున్
  వింత గ దూషణ చేసెడి
  కాంతను బెండ్లాడి నరుడు కాంచు నరక మున్

  రిప్లయితొలగించండి

 11. Pity the boys who prey into jilebis :)  తంతుగ వెర్రి గాంచు భవతారిణి తానెయటంచు నమ్ముచున్
  పంతము వీడడాతడు గభాల్మని ప్రేయసి!దేవి! యంచు ని
  శ్చింతగ నమ్మి లాహిరిని చెంగట గాంచుచు వేగిరమ్ముగా
  కాంతను బెండ్లియాడి నరకమ్మును గాంచును మానవుం డయో!


  जिलेबी

  రిప్లయితొలగించండి
 12. కందము
  కాంతయె సృష్టికి మూలము
  గాంతయె ఘనకీర్తి దెచ్చె కమలేశునకున్
  జింతించ నయోగ్యంబౌ
  కాంతను బెండ్లాడి నరుడు గాంచునరకమున్
  ఆకుల శివరాజలింగం వనపర్తి

  రిప్లయితొలగించండి

 13. నారదా!


  తంతానొరేయ్ మనుజుడా
  గంతకు తగ్గట్టి బొంత గదపెన్మిటిగా
  చెంతకు వచ్చునెటులరా
  కాంతను బెండ్లాడి నరుఁడు గాంచు నరకమున్?


  జిలేబి

  రిప్లయితొలగించండి
 14. శాంతుడు దాంతుడు చింతా
  కంతయు దా చింత సేయక సుశీలాఖ్యన్
  ధ్వాంతాంతరంగ తగవుల
  *"కాంతను బెండ్లాడి నరుఁడు గాంచు నరకమున్"*

  రిప్లయితొలగించండి
 15. వింతల జూడ వెళ్ళుదము విత్తము గూర్చుము తీర్థయాత్రలన్
  చింతలు చిక్కులున్ సమయు చేసిన బాసల వమ్ముసేయకీ
  కాంతకు కాంతువీవు పరకాంతల వైభవమంచు దెప్పెడా
  *"కాంతను బెండ్లియాడి నరకమ్మును గాంచును మానవుం డయో"*

  రిప్లయితొలగించండి
 16. ఇంతలు కన్నులుండ యెదురింటి వయారిని జూడనేల నీ
  చెంతకు చేరవచ్చితని సేమము జూడవు వారకాంతలన్
  వింతగ చూచుచుందువని ప్రేలనుమానపిశాచరూపమౌ
  *"కాంతను బెండ్లియాడి నరకమ్మును గాంచును మానవుం డయో"*

  రిప్లయితొలగించండి
 17. శాంతినొసగు నతివ యనగ
  భ్ర్రాంతియె గాదే! కఠోర బాసల తోడన్
  చెంతకు చేరిన రక్కస
  కాంతను బెండ్లాడి నరుడు గాంచు నరకమున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతారామయ్య గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'రాక్షస కాంతను' అనండి.

   తొలగించండి


 18. శాంతియు సౌఖ్యము గాంచును
  కాంతను బెండ్లాడి, నరుఁడు, గాంచు నరకమున్
  దొంతిగ తనపలుకులనే
  సుంతయు మీరంగ నౌర చువ్వన రాజా!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 19. సమస్య :-
  "కాంతను బెండ్లాడి నరుఁడు గాంచు నరకమున్"

  *కందం**

  కొంతయు జాలిని జూపక
  పంతము తోడుగను పట్టు పట్టి విడవకన్
  వింతగు కోర్కెలు కోరెడు
  కాంతను బెండ్లాడి నరుఁడు గాంచు నరకమున్
  .......................✍చక్రి

  రిప్లయితొలగించండి
 20. రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  'వాదులాట స్వాభావికమౌ' అనండి బాగుంటుంది.

  రిప్లయితొలగించండి
 21. కాంతల యందున రాక్షస
  కాంత యెవరన నటి సూర్యకాంతమె తోచున్
  వంతుగ నామెకు సరియగు
  కాంతను బెండ్లాడి నరుడు గాంచు నరకమున్

  వంతు=పోటీ

  రిప్లయితొలగించండి
 22. సంతానముచే స్వర్గము
  కాంతను బెండ్లాడి నరుడుగాంచు,నరకమున్ ,
  వంతల బెట్టగ సాధ్విని
  సుంతయు దయలేక,బొందు చోద్యమదేలా?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హన్నా!దొరికింది కదా ఛాన్స్ అని అంతా ఆడవారిని ఆడిపోసుకుంటారా???

   తొలగించండి
  2. ఉమాకాంత శర్మ:

   పంతము తోడ పూజలిడి ధ్వంసము జేసెను బ్రహ్మచర్యమున్
   కంతును చంపు పాపమును కంటిని విప్పగ నంటగట్టెనే
   వంతుకు వచ్చి కాయమున వామపు భాగము నాక్రమించెనే
   కాంతను బెండ్లియాడి నరకమ్మును గాంచును మానవుం డయో

   తొలగించండి
  3. పద్యం చాలబాగుంది! కాని చివరి పాదం యిలా సవరిస్తే యింకా బాగుంటుంది!

   కాంతను బెండ్లియాడి స్థిరఖ్యాతిని బొందెను శంకరుండహో!

   తొలగించండి

 23. మైలవరపు వారి , ఇంతే ఏమవుతుందో కు సమాధానము :)  చింతాక్రాంతుడ ! కృష్ణా!
  పంతమునకు బోవరాదు! వనజాక్షియె , తా
  నింతే! యేమవుతుందో
  కాంతను బెండ్లాడి? నరుఁడు గాంచు నరకమున్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 24. చెంతగ నుండ సుకాంతయె
  చింతలు లేకయె బ్రదుకున సిరులే నిండున్
  చింతింప జగతి యందె కు
  కాంతను బెండ్లాడి నరుఁడు గాంచు నరకమున్ !

  రిప్లయితొలగించండి
 25. హంతకుడౌదు చేసినిను హత్య ననున్ వలదన్ననంచు తా
  నింతయునుచ్ఛనీచములనేమి గణింపక ప్రేమ పేరుతో
  పంతముతోడ రెచ్చి బలవంతము పెట్టుచు ఛీత్కరించునా
  *"కాంతను బెండ్లియాడి నరకమ్మును గాంచును మానవుం డయో"*

  రిప్లయితొలగించండి
 26. శంకరాభరణం.. సమస్యాపూరణం.

  కాంతను బెండ్లియాడి నరకమ్మును గాంచును మానవుం డయో !!

  నా పూరణ.

  ఎంతటి పాపచింతన! క్షమించఁగరాని దురంత దుష్టుఁ డొ
  క్కింతయు జాలిలేక దురపిల్లఁగఁ జేయుచు దుర్మదాంధతన్
  సాంతము బాధలన్ గొలిపు సద్గుణ హీనతఁజేసి, సౌమ్యయో
  కాంతను బెండ్లియాడి, నరకమ్మును గాంచును మానవుం డయో.
  మీ
  చింతా రామకృష్ణారావు.🙏🏼

  రిప్లయితొలగించండి
 27. పంతములాడుచునిరతము
  సుంతైననునోర్పులేక చురచురతోడన్
  వింతగ వాదముజేసెడు
  కాంతనుబెండ్లాడినరుడు గాంచునరకమున్

  రిప్లయితొలగించండి
 28. భ్రాంతుడు సత్యమొదలిపర
  కాంతలc బాలవ సతిమెడ కాంచన మొడిసెన్
  శాంతము నారోగ్యము జెడc
  కాంతను బెండ్లాడి నరుఁడు గాంచు నరకమున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. యజ్ఞేశ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వదలి'ని 'ఒదలి' అనరాదు. "సత్యము విడి పర..." అనండి.

   తొలగించండి
 29. ఎంతయు బుజ్జగించఁ దనదేడ్పు మొగమ్మును వీడదెయ్యెడన్,
  బంతము నెగ్గు పట్టుదల, స్వాంతమునందు సదా విచారమున్,
  జెంతకుఁ జేరిన న్గసరుఁ, జింతిల నీదృశపద్మజాగ్రజా
  కాంతనుఁ బెండ్లియాడి నరకమ్మును గాంచును మానవుండయో!.

  కంజర్ల రామాచార్య
  హైదరాబాద్,వనస్థలిపురం.

  రిప్లయితొలగించండి
 30. ఎంతగనందముండినను నింటిలపాదినినేడిపించునా
  కాంతనుబెండ్లియాడినరకమ్మునుగాంచును మానవుండయో
  పంతమునెఱుంగకయునుభర్తయునాదిగబంధుకోటినిన్
  వంతలుబెట్టకెప్పుడునుబాగుగజూచుచునుండమేలగున్

  రిప్లయితొలగించండి
 31. స్వాంతము మంచిదయిన ని
  చ్చింతగ జీవించ వచ్చు శ్రీమతితోడన్
  సుంతయు నర్మిలి యెరుగని
  కాంతను బెండ్లాడి నరుఁడు గాంచు నరకమున్

  రిప్లయితొలగించండి
 32. seethadevi gurramఏప్రిల్ 09, 2019 8:06 AM
  సంతానముచే స్వర్గము
  కాంతను బెండ్లాడి నరుడుగాంచు,నరకమున్ ,
  వంతల బెట్టగ సాధ్విని
  సుంతయు దయలేక,బొందు చోద్యమదేలా?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సంతత సంశయమ్మునను సారసలోచన సాన్నిహిత్యమున్
   సుంతయు నాస్వదించకను శూలపువాక్కుల హింసజేయుచున్
   వింతగు శీలమున్ గలిగి వేదనబెట్టగ సుందరాంగియౌ
   కాంతను బెండ్లియాడి నరకమ్మును గాంచును మానవుండహో!

   తొలగించండి
  2. చింతలు దీర్చి కౌగిలిని చేర్చుచు ముద్దుల నప్పగించునే
   సంతును నిచ్చుచున్ మురిసి సంతస మొందుచు జోలపాడునే
   వింతగ పల్కిశంకరులు వేసిరి నవ్వుచు కైపదమ్మిటుల్:
   "కాంతను బెండ్లియాడి నరకమ్మును గాంచును మానవుం డయో"

   తొలగించండి
 33. వింతగఁ బుట్టిన బిడ్డల
  నింతయుఁ గరుణ యది లేక యింతియె చంపెన్
  శంతనుఁ డఁట యమర నదీ
  కాంతను బెండ్లాడి నరుఁడు గాంచు నరకమున్

  [..గాంచును + అరకమున్; అరకము = నాఁచు; గంగా దేవి దేవత, శంతనుఁడు నరుఁడు]


  ఇంతికి నెంతొ వంత నిడి యింత సుఖమ్మును బొందకుండ దుః
  ఖాంతముఁ గాన లేక సువికార విచార మనో వికల్పుఁడై
  స్వాంతము తల్లడిల్లఁగ నశాంతిని సంతత సంశయమ్ము నాఁ
  గాంతను బెండ్లియాడి నరకమ్మును గాంచును మానవుం డయో

  రిప్లయితొలగించండి
 34. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  వింతది జంద్యమూనగను వీపున మండగ గ్రీష్మమందునన్
  సుంతయు జాలిలేకనిట సుష్మస్వరాజ్యమ సుత్తికొట్టగా
  పొంతము మీర రోమునకు పోవుట చెల్లక రాజకీయమన్
  కాంతను బెండ్లియాడి నరకమ్మును గాంచును మానవుం డయో

  రిప్లయితొలగించండి
 35. స్వాంతము నందునన్ సతము చక్కని సంగడి గల్గి యిచ్చతో
  కాంతుని తోడ పత్ని చన కాపురమున్ కడు శాంతి కల్గు తా
  సుంతయు ప్రేమ భర్తపయి చూపక, నిందలు మోపు నట్టిదౌ
  కాంతను బెండ్లియాడి నరకమ్మును గాంచును మానవుం డయో

  రిప్లయితొలగించండి
 36. క్రొవ్విడి వెంకట రాజారావు:

  వింతగు వర్తన మెంచుచు
  సంతత మింటను గడుసగు చరితము తోడన్
  సంతుని నాథుని రోసెడి
  కాంతను బెండ్లాడిన మగడు గాంచు నరకమున్.

  రిప్లయితొలగించండి

 37. ఎంతయొ సుఖమును పొందెను
  కాంతను పెండ్లాడి నరుడు ,గాంచు నరకమ
  క్కాంతయె పసిడిని కోరుచు
  పంతం పట్టుచు సతతము బాధించంగన్

  రిప్లయితొలగించండి
 38. సంతసమున గేస్తుడవగ
  కాంతను బెండ్లాడి నరుఁడు గాంచు నరకమున్
  వింతేమున్నది కాంచగ
  నంతరమున ప్రేమలేని యర్థాంగైనన్

  రిప్లయితొలగించండి
 39. క్రొవ్విడి వెంకట రాజారావు:

  మంతు కలిగి వెలుగును సరి
  కాంతను బెండ్లాడి నరుడు; గాంచు నరకమున్
  పొంతన లేని నడవడిని
  సంతత మడరెడి లలనయె సతియై యుండన్.

  రిప్లయితొలగించండి
 40. ఇంతియె లేనినాడదియె యిల్లన రాదని వల్లకాడటం
  చెంతయొ జెప్పిపెద్దలట యింపగు కన్యను తెచ్చి కట్టగన్
  సంతసమున్ హరించెనట జవ్వని వావిని పెంచి పోరగన్
  కాంతను బెండ్లియాడి నరకమ్మును గాంచును మానవుండయో!

  రిప్లయితొలగించండి 41. శాంతము తోడ కా పురము చక్కగ చేసిన మానసం బుకున్
  శాంతియు చిక్కు,న ట్లవక .శంకను చూపుచు నిత్యమున్ పతిన్
  చింతల పాలు చేయగను చింతన చేయుచు నింద మోపు దు
  ష్కాంతను పెండ్లియాడి నరకమ్మును గాంచును మానవుండయో.

  రిప్లయితొలగించండి
 42. పంతంబున దమయంతను
  కాంతను బెండ్లాడి నరుడు గాంచునరకమున్!
  వింతగు బ్రేమకు కీర్తియు
  నంతంబే లేకబెరిగె! నలచరితములోన్!

  రిప్లయితొలగించండి
 43. కందం
  పంతానికి చస్తానన
  వింతేమిటి నీదు మాట విన్నదె యనగన్
  గుంతను దూకెడు పెడసరి
  కాంతను బెండ్లాడి నరుఁడు గాంచు నరకమున్

  రిప్లయితొలగించండి
 44. డా.పిట్టా సత్యనారాయణ
  సొంతము "నాదే"ననుకొను
  సాంతముగా జేయిదాట సాగవు శాంతుల్
  వంతల వీడగ మనసను
  కాంతను బెండ్లాడి నరుడు గాంచు నరకమున్

  రిప్లయితొలగించండి
 45. శాంతియు సౌఖ్యము నీయక
  యంతెరగని మూఢతన్ దనపతి మనమునన్
  కాంతి రహితమొనరించెడి
  కాంతను బెండ్లాడి నరుఁడు గాంచు నరకమున్

  భర్తకు శాంతి, సౌఖ్యం లేకుండా మూఢ మతితో తన భర్త మనసంతా కాంతి రహితం చేసే స్త్రీని పెండ్లాడిన వాడు నరకం అనుభవిస్తాడు.

  రిప్లయితొలగించండి
 46. ఈ గ్రూపులో నిత్యం తమ పూరణలు అందించే శ్రీమతి గుర్రం సీతాదేవి గారికి నెల్లూరు జిల్లాకు చెందిన పెన్నా రచయితల సంఘం వారు 2019 సంవత్సరానికి గాను సాహిత్య పురస్కారం అందజేశారు.
  ఫోటో పోస్ట్ చేయడానికి వీలు కావడం లేదని గురువు గారికి మనవి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వార్తను ప్రచురించినందుకు ధన్యవాదములు కృష్ణారెడ్డిగారూ!కాని అది అంత విశేషమైనదిగా నేను భావించడము లేదు.ఈ సదస్సులో అందరూ లబ్ధ ప్రతిష్ఠులే!చాల మందికి అవార్డులు,బిరుదులూ కూడ ఉన్నాయనుకుంటాను!
   గురువుగారికి ఈవార్త తెలుసు.ఫోటోలను కూడ నేను పంపాను.వారి ఆశీస్సులు తీసుకోకుండా ఏ పనీ చేయను(సాహిత్యానికి సంబంధించి నంతవరకూ).మీ అభిమానానికి కృతఙ్ఞతలు!

   తొలగించండి
  2. మీరు చెప్పుకోరని తెలుసు మేడమ్ అందుకే మీ అనుమతి లేకుండా ఇక్కడ పోస్ట్ చేశాను క్షమించగలరు

   తొలగించండి
 47. ఉత్పలమాల
  వింతగ రాత్రి రాత్రికిని పెంచిన రాము నరణ్యమంపగన్
  బంతముఁ బూని పుత్రునకు పట్టము గట్టగ పోరువెట్టుచున్
  సుంతయు జాలిలేక పతి స్రుక్కఁగ జేసిన కైకఁ బోలెడున్
  కాంతను బెండ్లియాడి నరకమ్మును గాంచును మానవుం డయో!

  రిప్లయితొలగించండి