27, ఏప్రిల్ 2019, శనివారం

సమస్య - 2999 (కాంక్షలె యుండవు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కాంక్షలె యుండవు జనులకుఁ గలియుగమందున్"
(లేదా...)
"కాంక్షలె యుండవీ కలియుగంబున మానవజాతికిన్ గనన్"

98 కామెంట్‌లు:

 1. ప్రాతః కాలపు సరదా పూరణ:

  కాంక్షలు చెడ్డవంచిటను కాంతల జోలికి పోవనీకయో!
  కాంక్షలు ధూమమున్ వదలు! కాన్సరు వచ్చును నీకటంచు ప
  ల్యాంక్షలు బెట్టుచున్ విరివి హైరన జేయగ ప్రాభవమ్మిటన్
  కాంక్షలె యుండవీ కలియుగంబున మానవజాతికిన్ గనన్

  ప్రాభవము = ప్రభుత్వము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పల్యాంక్షలు'....? అక్కడ "వే లాంక్షలు..." అంటే ఎలా ఉంటుంది?

   తొలగించండి
 2. మైలవరపు వారి పూరణ

  ఆంక్షలు లేని జీవనవిహాయసవీథిని స్వేచ్ఛగా జనన్
  ధ్వాంక్షమువోలె బంధములు బాధ్యతలేమియులేక హాయిగా,
  కాంక్షలు దీరు , కాని శుభకార్యములుండవు , పల్కగా శుభా...
  కాంక్షలె యుండవీ కలియుగంబున మానవజాతికిన్ గనన్

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 3. సంక్షుభిత చిత్త తత్త్వము,
  సంక్షయ సద్గుణ వితతి, యసంతృప్త ధనా
  కాంక్షలు మిగుల నలౌకిక
  కాంక్షలె యుండవు జనులకు గలియుగ మందున్

  రిప్లయితొలగించండి
 4. కాంక్షలు వీడిన జగతిని
  ఆంక్షలు లేకుండ మనిన యానం దమెగా
  కాంక్షల మోహమె ముప్పట
  కాంక్షలె యుండవు జనులకుఁ గలియుగ మందున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మనిన నానందమెగా' అనండి.

   తొలగించండి
 5. సంక్షేమము గోరుచు నా
  కాంక్షింతురు భోగమెల్ల కాలము నందున్
  నాంక్షలె నచ్చవు మోక్షపు
  కాంక్షలె యుండవు జనులకు గలియుగ మందున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కాలమ్మున నే। యాంక్షలు...' అంటే బాగుంటుందేమో?

   తొలగించండి
  2. మీ సూచన శిరోధార్యం గురువుగారు.

   తొలగించండి
 6. సమస్య :-
  "కాంక్షలె యుండవు జనులకుఁ గలియుగమందున్"

  *కందం**

  ఆంక్షలధికమైనంతనె
  కాంక్షలె యుండవు జనులకుఁ గలియుగమందున్
  సంక్షుభిత మనస్సున తమ
  సంక్షేమము వదిలివేసి చచ్చెదరేలన్
  .....................✍చక్రి

  రిప్లయితొలగించండి
 7. కందము
  కాంక్షలు చెడ్డవి మానవు
  డాంక్షలు బెట్టంగలేక నధముండౌరా!
  దీక్ష వహించియు మోక్షా
  కాంక్షలెయుండవు జనులకు గలియుగమందున్
  ఆకుల శివరాజలింగం వనపర్తి

  రిప్లయితొలగించండి


 8. ఆంక్షలు లేక సుఖమ్ముల
  మంక్షువుగా పొందగాన్ తమ యభీష్టములా
  కాంక్షలు కాని, విభునిపై
  కాంక్షలె యుండవు జనులకుఁ గలియుగమందున్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 9. **శ్రీం**,**క్షౌం**, బీజాక్షరములు
  **హాం**క్షాళన తోడపాప మడయును తెలియన్
  **క్లీం**క్షుద్ర పూజ సేయగ
  కాంక్షలె యుండవు జనులకు కలియుగమందున్.

  రిప్లయితొలగించండి
 10. అంక్షల నెదిరి బ్రతుకు యా
  కాంక్షయె మదిలోన సతము కదలుచు నుండన్
  సంక్షుభిత మదిని నిహపర
  కాంక్షలె యుండవు జనులకుఁ గలియుగమందున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అసనారె గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'బ్రతుకు + ఆకాంక్ష' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. సవరించండి.

   తొలగించండి
 11. ఆంక్షలు పెట్టక వేరుగ
  కాంక్షలె యుండవు జనులకుఁ గలియుగమందున్ ;
  కాంక్ష విడు హరికడ యనెడి
  యాంక్షయె భక్తులు వలచిన యక్షర మిచ్చున్

  రిప్లయితొలగించండి
 12. ( జీవితం పరిమితం ; సమాజసేవ సంతోషప్రదం )
  ఆంక్షలు లేని మార్గవిధి
  నందరకున్ దయచేసె బుద్ధుడే ;
  సంక్షుభితంబు మీబ్రతుకు
  జ్ఞానమె దిక్కనె శంకరార్యుడే ;
  సంక్షయమందు కాలమున
  సంఘపుసేవల జేయునట్టి యా
  కాంక్షలె యుండవీ కలియు
  గంబున మానవజాతికిన్ గనన్ .

  రిప్లయితొలగించండి
 13. సంక్షయధర్మకార్యరతి, స్వైరవిహారవిలాసవేషమా
  కాంక్షలు లేని జీవితము,
  గర్హితనిస్సహనాంతరంగమీ
  సంక్షుభితవ్యసంగతవిచారమె, ధార్మికకృత్యమందునన్
  కాంక్షలె యుండవీ కలియుగంబున మానవజాతికిన్ గనన్.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 14. శంకరాభరణం
  27/04/2019 గురువారం
  సమస్య

  "కాంక్షలె యుండవీ కలియుగంబున మానవజాతికిన్ గనన్"

  నా పూరణ. ఉ.మా
  ** *** *** ****

  కాంక్షలె మిక్కుటంబయిన కాసులపైనను హీనబుద్ధిచే

  ధ్వాంక్షము వోలె యుండకను స్వార్థము తోడుత మెల్గుచున్ శుభా

  కాంక్షలె కోరకన్ బరుల..కష్టము బెట్టరె? సర్వమంగళా

  "కాంక్షలె యుండవీ కలియుగంబున మానవజాతికిన్ గనన్"


  🌿 ఆకుల శాంతి భూషణ్ 🌿
  🌷 వనపర్తి 🌷

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శాంతిభూషణ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '..వోలె నుండకయె.. కోర కన్యులను కష్టము...' అనండి.

   తొలగించండి
 15. ఆంక్షలు వలదని పల్కెద
  రాంక్షలె వారల తలపున నాటంకమ్ముల్
  యాంక్షలె మటుమాయమయిన
  "కాంక్షలె యుండవు జనులకుఁ గలియుగమందున్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '..నాటంకములౌ। నాంక్షలె...' అనండి.

   తొలగించండి
 16. భంగ్యంతర పూరణ :

  ఆంక్షలు వలదని పల్కెద
  రాంక్షలె వారల తలపున నాటంకమ్ముల్
  యాంక్షలె పోవగ; తీరని
  "కాంక్షలె యుండవు జనులకుఁ గలియుగమందున్"
  **)()(***
  {This is one of the trends of political ideological doctrines}

  రిప్లయితొలగించండి


 17. ఆంక్షలు లేని కోరికల నత్తరి భోగము వెన్క బోయి నా
  కాంక్షలు తీర్చుకొందురు వికారము లన్నియు చేర్చుకొంచు తా
  మంక్షువుగా జిలేబులెడ మత్తున తేలుదురంతె! జియ్యకై
  కాంక్షలె యుండవీ కలియుగంబున మానవజాతికిన్ గనన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 18. మిత్రులందఱకు నమస్సులు!

  [తమ కాలంలో నందఱు మోక్ష కాములై సకల కార్యములు నిర్వర్తించినట్లు, ఈ కాలం కుఱ్ఱవాళ్ళు నిర్వర్తించడం లేదంటూ, కలియుగాన్ని గూర్చి వర్ణిస్తూ... ఇద్దఱు వృద్ధులు చర్చించుకుంటున్న సందర్భము]

  ఆంక్షలఁ జిక్కఁబోని స్వధనాశయ సిద్ధియె కల్గునట్టి స
  త్సంక్షయ మెల్లవేళలను సాఁగఁగఁజేసెడి ’దుర్జనాళి’ యన్
  ధ్వాంక్ష తతుల్ సఖిత్వ మిడ, వారణ సేయని, మోక్ష మందు సత్
  కాంక్షలె యుండ, వీ కలియుగంబున మానవజాతికిన్ గనన్!

  రిప్లయితొలగించండి
 19. సంక్షుభిత లోక మందున
  నాంక్షలు భరియించి సుఖము లాస్వా దింపన్
  సంక్షేమ ము తో పరము న
  కాం క్షలు యుండ వు జనులకు గలియుగ మందున్

  రిప్లయితొలగించండి
 20. రిప్లయిలు
  1. మూడో పాదంలో బిందుపూర్వక క్షకార ప్రాస భంగమేర్పడినది. సరిచేయగలరు.

   తొలగించండి
  2. ధన్యవాదములు. సరిజేయ ప్రయత్నిస్తాను.

   తొలగించండి
  3. మధుసూదన్ గారు పద్యం సవరించి ప్రచురించాను. ఒకసారి చూడగలరు.

   తొలగించండి
 21. కాంక్షలు రేపెడి సినిమా
  కాంక్షలె యుండవు, జనులకుఁ గలియుగమందున్
  కాంక్షలు దీరక నవె యా
  కాంక్షగ జూతురు మరి మరి కలవరమేగా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సూర్య గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '...దీరక యవె..' అనండి.

   తొలగించండి
 22. సంక్షయమగు దేహమునా
  కాంక్షిచు సంక్షుభిత జీవికా పరులు గనన్
  సంక్షేపించ హరిదలఁచు
  కాంక్షలె యుండవు జనులకుఁ గలియుగమందున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాలకృష్ణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఆకాంక్షిచు' ? 'ఆకాంక్షించు' అనడం సాధువు.

   తొలగించండి
 23. జంక్షన్ రోడ్డుకు ప్రక్కన
  సాంక్షన్ జేయగ ప్రభుత్వ సారా కొట్టున్
  ఫంక్షను'లో'మతు లుడుగగ
  కాంక్షలె యుండవు జనులకు గలియుగ మందున్!

  పంక్షనులో మతులు, లోలోపలి మతులు😋😇

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. యజ్ఞేశ్ గారూ,
   అన్యదేశ్యాలున్నా మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి

 24. వచ్చేవారానికి ఆకాశవాణి సమస్య

  హృదయము లేని మానవులె యీ మహనీయ మహీ ప్రకాశముల్!  సదనము లోన నేర్వగ ప్రసన్నత తోడుగ కొత్తవారలన్
  కుదురుగ తీర్చి, వ్రాతలను కూర్మియు తోడుగ నాదరించుచున్,
  పదిలము గాన వారలు సెబాసను వారలె, పోకపొచ్చమై
  హృదయము లేని మానవులె, యీ మహనీయ మహీ ప్రకాశముల్!  చీర్స్
  జిలేబి

  రిప్లయితొలగించండి
 25. ఈ రోజు శంకరా భరణము వారి సమస్య

  కాంక్షలె యుండవు జనులకుఁ గలియుగమందున్

  ఇచ్చిన సమస్య కంద పాదము నా పూరణము
  సీసములో


  రైతు తన సుతుని రయముగ చదివించి
  పంపున మెరికాకు పణము కోరి,
  విప్రుడు తనయుని వేదముల్ వలదని
  కెనడాకు పంపును ఘనత కోరి,
  మంగలి కొమరుని మంచిగ చదివించి
  మారిషస్ పంపగ మదిని తలచు,
  నెల్లరు తమ వృత్తు లెల్లయు వీడగన్
  కలిగెడి ముప్పును కాంచ లేరు,
  పొలము పని చేయు జనులు లేక భువిపైన
  పంటలు పండక పప్పు బువ్వ
  తిండికి కాంక్షలె యుండవు జనులకుఁ
  గలియుగ మందున్, నిగమములు చది
  విన విబుధులు లేక వికట మనస్కులై
  పూజలనువదలి మోక్ష గతిని .
  పండించు కాంక్షలె యుండవు జనులకుఁ
  గలియుగ మందున్, కురులు విరివిగ


  పెరుగు చుండ ఖండనమును జరుపు వారు
  లేక మునులగుదురు ప్రజ లెల్ల, జనులు
  స్వంత వృత్తిలోన గలదు సంతసంబు
  ననుచు తలపోసి మారినన్ ఘనత కలుగు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూసపాటి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పొలము పని చేయు' అన్నచోట గణభంగం.

   తొలగించండి
 26. రిప్లయిలు
  1. వరలక్ష్మి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సంపాదనకై । యాంక్షల...' అనండి.

   తొలగించండి
  2. కాంక్షల దూరగ నేగిరి
   సంక్షిప్తపు మోక్ష మార్గ సంపాదనకై
   యాంక్షల జీవన ముక్తిన
   కాంక్షలె యుండవు జనులకు గలియుగ మందున్

   తొలగించండి
 27. ఆంక్షలె లేనటుల ధనా
  కాంక్షయె పెరిగెను నరునికి కాష్టము దనుకన్
  సంక్షిప్త నిజముగ యితర
  కాంక్షలె యుండవు జనులకుఁ గలియుగమందున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నిజముగ నితర..' అనండి.

   తొలగించండి
 28. కాంక్షలఁ గలుగు నిరంతర
  సంక్షయమే కలుగ దింక సన్ముక్తి ధ నా
  కాంక్షయె ముదిరిన మో క్షా
  కాంక్షలె యుండవు జనులకుఁ గలియుగ మందున్


  ఆంక్షలు మెండు భృత్యులకు నానతి మీఱిన నుండు శిక్షలే
  సంక్షయ మైనఁ బో జనము క్ష్మాతల విత్త సువర్ణ సంచ యా
  కాంక్షలె కాని భాస్వ దనుకంపన ధర్మ గుణైక చింతనా
  కాంక్షలె యుండవీ కలియుగంబున మానవ జాతికిం గనన్

  రిప్లయితొలగించండి
 29. ఆంక్షలుబెరిగినగొలదిని
  గాంక్షలెయుండవుజనులకు,గలియుగమందున్
  నాంక్షలుబెట్టకవెంకన
  కాంక్షలనేదీర్చుచుండుగరుణనునెపుడున్

  రిప్లయితొలగించండి
 30. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  కాంక్షలు వీడుమా ఘనపు కారులు మేడలు పర్యటన్లకై
  కాంక్షలు వీడుమా ధనము కల్లును బిర్యని పంచ వోట్లకై
  యాంక్షలు బెట్టగా విరివి హైయ్యరు కోర్టులు, రాజకీయమౌ
  కాంక్షలె యుండవీ కలియుగంబున మానవజాతికిన్ గనన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 31. ఆంక్షల లెక్కజేయక విహంగములట్లుగ పూర్తి స్వేచ్ఛ కా
  కాంక్షితులౌచు నిత్యమును కాసుల కాంతల బొంద గోరుచున్
  సంక్షయ మౌచునుండెడు ప్రజాళియె సద్గతి నిచ్చెడు మోక్షపా
  కాంక్షలె యుండవీ కలియుగంబున మానవజాతికిన్ గనన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణదోషం. "సద్గతి నిచ్చు మోక్షపున్" అనండి.

   తొలగించండి
 32. ఆంక్షలువెట్టుచున్మదినినారడివెట్టినమానసంబున
  న్గాంక్షలెయుండవీకలియుగంబునమానవజాతికీన్గన
  న్గాంక్షలులేకయుండగనుగారవమొప్పగగృష్ణువేడుచో
  గాంక్షలుదీర్చునాప్రభువుకాంక్షలుదీర్చెడుదైవమౌటయున్

  రిప్లయితొలగించండి
 33. ఆంక్షలు లేని నడవడియు
  సంక్షుభిత మనములుఁ గలిసి ముల్లోకములన్
  సంక్షేమము గాచు నతని
  కాంక్షలె యుండవు జనులకు గలియుగ మందున్

  అదుపులేని జీవితం, సంక్షోభంలో ఉండే మనసు కలిసి కలియుగంలో జనానికి మూడు లోకాల యొక్క సంక్షేమం చూసే భగవంతుడి పట్ల కోరిక లేకుండా చేస్తున్నాయి.

  రిప్లయితొలగించండి
 34. ఆంక్షలు బెట్టగ తిండికి
  కాంక్షలె యుండవు జనులకుఁ గలియుగమందున్
  సంక్షోభనివారణమున
  సంక్షేమ మరయగ దేహ సంపద గోరన్!!

  రిప్లయితొలగించండి
 35. సంక్షేమ మెంచకుంటివ?
  ఆంక్షల కవధులనులేక నారోగ్యంబే
  సంక్షయమందున జావగ!
  కాంక్షలె యుండవు జనులకు కలియుగమందున్!

  రిప్లయితొలగించండి
 36. ఆంక్షలజీవితమందున
  కాంక్షితములగూర్చియింతకలవరమేలా
  సంక్షోభబడకయున్నను
  కాంక్షలె యుండవు జనులకుఁ గలియుగమందున్

  రిప్లయితొలగించండి
 37. రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 38. కాంక్షితులైన మాత్రమున కాంచన కాంతము లందుకోరు యా
  కాంక్షన యోర్పు గల్గియును కారణ కార్యము జక్కజేయుమా
  ఆంక్షలు యుండునన్నిటికి యాశలు తీరవు కోరినా శుబా
  కాంక్షలె యుండవీ కలియుగంబున మానవ జాతికిన్ గనన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రామమోహన్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కాంతములు' అంటే? 'అందుకోరు + ఆకాంక్షను + ఓర్పు... ఆంక్షలు + ఉండు నన్నిటికి + ఆశలు' అన్న చోట్లలో యడాగమాలు రావు. సవరించండి.

   తొలగించండి
  2. నమస్కారములు. అలాగే చేస్తాను. కాంతము ఆంటే యిష్టమైనవి, మనోహరములైనవి అనే ఉద్దేశ్యము.

   తొలగించండి
 39. ఉత్పలమాల
  ధ్వాంక్షము కూసె బంధువులు వత్తురు కానుక లెన్నొ దెత్తురన్
  గాంక్షల జేయు వారు తమ గారము బంధువు లింట నెంచు యా
  కాంక్షల జేతురే నొసఁగ కానుక లేమియు నివ్వ నొప్ప నా
  కాంక్షలె యుండవీ కలియుగంబున మానవజాతికిన్ గనన్

  (మా యింటికి వస్తే ఏం తెస్తారు? మీ యింటికి వస్తే ఏంపెడతారు? అనే బుద్ధిగలిగిన కొందరిగురించి మాత్రమే సుమా)

  రిప్లయితొలగించండి
 40. కాంక్షల జడిలో మోక్షపు
  గాంక్షలె యుండవు జనులకు గలియుగమందున్
  సంక్షోభమ్మున మునుగుచు
  సంక్షేమంబును దెలియరు చాపల్యమునన్

  రిప్లయితొలగించండి
 41. డా.పిట్టా సత్యనారాయణ
  ఆంక్షల నీ.సీ(Election Commission) యివ్వదు
  కాంక్షల నాయకులె తీర్చ కలవరపడగా
  నాంక్షల గౌరవ మెచ్చట?
  కాంక్షలె యుండవు జనులకు కలియుగమందున్(సాంక్షనులు తమదాకా అందవని తెలిసి)

  రిప్లయితొలగించండి
 42. డా.పిట్టా సత్యనారాయణ
  సాంక్షనులందు దోపిడులు ,సాంతము ముంచిరి ; పాలకాళియే
  ఆంక్షలు వెట్ట వోట్ల తరి నన్నివిధంబుల గూల్చగోర దు
  ష్టాంక్షలు,నాంక్షలుండవను స్వైర విహారపు కర్మచారులే!
  కాంక్షలు యుండవీ కలియుగంబున మానవ జొతికిన్ గనన్

  రిప్లయితొలగించండి
 43. ఆంక్షలు పెచ్చుమీర నిట నందరుఁ జెప్పగ రాని తీవ్రమౌ
  రాక్షస పీడనన్ బడిరి రాగల కాలము మేలు కూరు నా
  కాంక్షలు రాలి పోయినవి ఘర్షణ హెచ్చును తప్ప సమ్యగా
  కాంక్షలె యుండవీ కలియుగంబున మానవజాతికిన్ గనన్

  రిప్లయితొలగించండి


 44. కాంక్షలె కారణమౌకద
  ఆంక్షల నందగ నిరతము నవనీ స్థలిలో
  కాంక్షలె హెచ్చగ పరహిత
  కాంక్షలె యుండవు జనులకు గలియుగమందున్

  రిప్లయితొలగించండి