11, ఏప్రిల్ 2019, గురువారం

సమస్య - 2983 (రంభా శివ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రంభా శివ సంగమమున రక్కసి పుట్టెన్"
(లేదా...)
"రంభయు శంభుఁడున్ గలియ రక్కసి పుట్టె సురల్ వడంకఁగన్"

54 కామెంట్‌లు:



  1. అంభస్సారము పుట్టెను
    రంభా! శివ సంగమమున; రక్కసి పుట్టెన్
    శంభళి చేరగ మనుజుని
    హంభము సాయంసమయము హావడి చేయన్ !



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      విరుపుతోను, సంబోధనతోను మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. మైలవరపు వారి పూరణ

    స్తంభితనిద్రుడై హరికథన్ దినసప్తకమున్ వచించుచున్
    జృంభితవక్త్రుడై పరవశించిన దాసు వచించెనెంతొ సం..
    రంభమునన్ కథావళిని మాటల గల్పుచునిట్లు "కాంచుడీ
    రంభయు శంభుఁడున్ గలియ రక్కసి పుట్టె సురల్ వడంకఁగన్" !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి


  3. కంభము లాంటి పుత్రుడు సఖాకలిగెన్ వెనకయ్య గా సుమా
    రంభయు శంభుఁడున్ గలియ; రక్కసి పుట్టె సురల్ వడంకఁగన్
    శంభళి చేరగా విటుని సాయపు వేళని కర్మ పక్వమై;
    లంభనమై‌న వాక్యము భళావిరుపయ్యె జిలేబి ముక్కగాన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. ప్రాతఃకాల సరదా:

    దంభము మీర పల్కితిని దండిగ జేయుచు పూరణమ్ములన్
    శంభుని కైపదమ్ములిక చంపవు నన్నని త్రిప్పి మీసమున్
    కుంభము చిట్లి పోయినది కుందుచు చూడగ నీసమస్యనున్:👇
    "రంభయు శంభుఁడున్ గలియ రక్కసి పుట్టె సురల్ వడంకఁగన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ యీ పూరణ నిజంగానే సరదాగా ఉంది. అంతేకాదు ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి

    2. సరదా టు ది పవర్ ఆఫ్ సరదా : మీరట్లా బెంబేలు పడి పోతే యెలా :)


      దంభము తోడు పల్కెదను దండిగ చేసితి పూరణల్ సదా
      శంభుని కైపదమ్ములిక చంపవు నన్ను హిడింబి రూపుగాన్
      కుంభపు దివ్వె గాను వెలు గొందుచు భేషుగ పూర్తి చేసితిన్👇
      "రంభయు శంభుఁడున్ గలియ రక్కసి పుట్టె సురల్ వడంకఁగన్"!


      జోష్ :)

      జిలేబి

      తొలగించండి
    3. 'శంభుని కైపదమ్ములు' అద్భుతం 🙏🙏🙏

      తొలగించండి
    4. ఇరువురకూ నమస్కారములు!

      సత్యం వధ! ధర్మం చెఱ!

      తొలగించండి
    5. జిలేబి గారూ,
      మీ సమాధాన రూప పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. దంభము కాదిది నిజముగ
    నం భోరు హ నేత్రి గౌరి య ర్ఢా o గిగదా
    సంభవ మగు నెక్కడ నే
    రంభా శివ సంగమ మున రక్కసి పుట్టె న్?

    రిప్లయితొలగించండి
  6. స్తంభన మందెను మతియే ;
    దంభము నిండిన సమస్య ;దారుణమయ్యెన్ ;
    కుంభిని నెక్కడ నెప్పుడు
    రంభాశివసంగమమున రక్కసి పుట్టెన్ ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జంధ్యాల వారూ,
      మీ అధిక్షేపాత్మకమైన పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. సీతా దేవి గారి పూరణ:

    దంభము జచ్చును నిక్కము
    రంభా! శివసంగమమున; రక్కసి బుట్టెన్
    గంభీరాకృతి ముని వి
    జృంభిత క్రోధమునను మసి జేయగరాజున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. 'విజృంభిత' అన్నపుడు 'వి' లఘువే. "మౌని విజృంభిత..." అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా!సవరిస్తాను!

      తొలగించండి
  8. డా.పిట్టా సత్యనారాయణ
    (మసూర్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించమని భారతదేశంప్రతిపాదిస్తే ఐ.రా.స లోని అమెరికా,రష్యా,బ్రిటన్,ఫ్రాన్సులు అంగీకరించినా చైనా ,తనకున్న వీటో(తిరస్కార హక్కు)నుపయోగించి అడ్డుకుంటున్నది.)
    స్తంభాలనుకొన బిగ్ఫైవ్1
    దంభంబుగ న(అ)జరు పొడిచి తట్టెను హింసన్2
    గుంభనమేదిక చైనా!
    రంభా శివ సంగమమున రక్కసి(ఆతంకవాదము) పుట్టెన్!

    రిప్లయితొలగించండి
  9. డా.పిట్టా సత్యనారాయణ
    (రంభవంటి అందకత్తెను శివుడనే వాడు పెళ్ళిజేసుకోగా అరాచక చర్యల పుత్రుడు జన్మించాడు.ఉగ్రవాదునకు జన్మ నిచ్చిన దంపతులు అసాధారణ కోవకు చెందక పోవచ్చు)
    రంభయె సంగమంబున నరాచక పుత్రుడు బుట్ట చిత్రమౌ
    దంభ విహీన పూరుషుడు తాను"శివుండ"దె పెళ్ళియాడ సం
    రంభమె? విష్ణునాజ్ఞ దనరంగ సుపుత్రుని గోరినా,హరీ!
    రంభయు శంభుడున్ గలియ రక్కసి పుట్టె సురల్ వడంకగన్1
    (1.దెబ్బకు దేవుడైనా భయపడతాడు ..పల్లె సామెత.)

    రిప్లయితొలగించండి
  10. శంభునిగూరిచినిట్లుగ
    రంభాశివసంగమమునరక్కసిపుట్టెన్
    దంభపుబలుకులుబలికిన
    నంభోరుహనేత్రిగిరిజహర్షించునొకో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...గూరిచి యిట్లుగ' అనండి.

      తొలగించండి

  11. కుంభిని లోనెట విననిది
    రంభా శివ సంగమమున రక్కసి పుట్టెన్
    దంభపు వార్తలు నమ్మకు
    శంభుని సంతన నమరులె చక్కగ వినుమా


    శంభుడు నటరాజయ్యెను
    రంభా శివ సంగమమున, రక్కసి పుట్టెన్
    డింభకు నకు మారుగనట
    దంభముతో వేడినట్టి దైతేయునకున్.

    రిప్లయితొలగించండి
  12. శంభుజుడు పుట్టెనందురు
    రంభా శివ సంగమమున, రక్కసి పుట్టెన్
    జృంభించుచు దేవతలను
    సంబోధము జేయ దలచు సంకల్పముతో.

    రంభ= పార్వతి
    సంబోధము= నాశము

    రిప్లయితొలగించండి
  13. రంభయుశంభుడున్గలియరక్కసిపుట్టెసురల్ వడంకగన్
    రంభయనంగబార్వతియరంభనుగూడుటతప్పుకాదుగా
    దంభపుబల్కులేయివియ,దైత్యకి పుట్టుటసంభవించునా?
    జృంభణమౌనదీపలుకుచెప్పుటన్యాయమె?భూసురోత్తమా!

    రిప్లయితొలగించండి
  14. శుంభద్వీర వరేణ్యుఁడు
    దంభుండు హిరణ్య నేత్ర దైత్యుం డకటా
    రంభోరు దితీ కశ్యప
    రంభా! శివ సంగమమున రక్కసి పుట్టెన్

    [శివ సంగమము = సుఖ సంగమము]


    దంభము మీఱ రావణుఁడు దౌష్ట్యుఁడు దా ముని రాజి ఖండ నా
    రంభుఁడు భక్తి వేడఁగ వరమ్ములు భంజిత దైత్య కోటి సం
    రంభున కీయ నండ నపరాజిత భర్తృ బృహద్వపుః పరీ
    రంభయు శంభుఁడున్ గలియ రక్కసి పుట్టె సురల్ వడంకఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు వైవిధ్యంగా, ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  15. శంభుని మాయా జగతిని
    రంభా శివ సంగమమున రక్కసి పుట్టె
    న్నంభోరుహ మిత్రుడు యుడుపతి
    సంభవ మటసంక రములు జాలము జేయన్

    ఈ మధ్య అత్తారింటికి [దవాఖానాకి ] వెళ్ళీ , మళ్ళీ.... మళ్ళీ... తిరిగి వస్తున్నాను అదన్నమాట అసల్ సంగతి ]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      ఇప్పుడెలా ఉంది ఆరోగ్యం?
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. "..న్నంభోరుహ సఖు డుడుపతి" అనండి.

      తొలగించండి
  16. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    రంభను దెచ్చి రోముకడ రంగులు పూయుచు తీర్చిదిద్దగా
    శంభుని రూపు సుందరుడు శాస్త్రపు రీతిని పెండ్లియాడగా
    దంభము వీడి పల్కుముర! దారుణ మెట్టిది సంభవించెరా?
    "రంభయు శంభుఁడున్ గలియ రక్కసి పుట్టె సురల్ వడంకఁగన్"

    రక్కసి = రాక్షసుడు


    గమనిక:

    నా సరదా పూరణలతో మనస్తాపము పొందిన వారికి క్షమార్పణలు...కౌంటరుగా వారి గంభీర పూరణలతో నన్ను చీల్చి చెండాడగోరెదను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీ పూరణల వల్ల ఎవరికీ మనస్తాపం కలుగదు. ఒకే ఒక్కసారి మీరు మన్ మోహన్ సింగును ప్రస్తావిస్తే ఆయనకు వీరాభిమాని అయిన మిత్రులు (సూరం శ్రీనివాసులు గారనుకుంటాను) బాధ పడ్డారు. అంతే!

      తొలగించండి

  17. సీతా దేవి గారి పూరణ:

    సంభవమేగ తారకుని జంపగ బుట్టెను కార్తికేయుడే
    రంభయు శంభుడున్ గలియ; రక్కసిబుట్టె సురల్ వడంకగన్
    దంభము జూపగా ముని వితండపు వాదన జేయుచున్నహో
    యంభము ద్రాగగా నృపుడు నాతని
    నంతము జేయబూనుచున్

    రంభ = పార్వతి
    కిట్టింపు!

    (ఈ సమస్యకు గురువుగారు పూరణ చూడాలని ఉంది)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సమయాభావం వల్ల నేను పూరించడం లేదు. ఈరోజు ప్రయత్నిస్తాను.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా!నమస్సులు! కష్టమైన సమస్య కనుక మీరెలా పూరిస్తారో యని కుతూ హలం కొద్దీ అడిగాను.

      తొలగించండి
  18. కంభంబందున బడిలో
    శంభుని గురువడుగ ప్రశ్న?చాదస్తముగా
    డంభమ్మున నిలబడియనె
    రంభాశివ సంగమమున రక్కసిపుట్టెన్!

    రిప్లయితొలగించండి
  19. దంభము లేలర? మూర్ఖా!
    గంభీరముగ మనలేక కల్లలవేలా?
    డింభక! యెపుడెచ్చోటను
    రంభా శివ సంగమమున రక్కసి పుట్టెన్ ?

    రిప్లయితొలగించండి
  20. శంభో!నవ వలలుండా
    రంభించుచు వృత్తిఁ దొలుత త్రాగగ సుధగా
    కుంభముఁ జూపుచు వండగ
    రంభా శివ సంగమమున రక్కసి పుట్టెన్

    రంభ=అరటి,శివ=ఉసిరిక..
    రెండూ కలిపి వండగా అదో రాక్షసమైన పాకమై కూర్చుంది

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంభుడుఁ దానుఁ దాపసిగ
      సాత్త్విక మూర్తిగ బ్రహ్మచర్యమా
      రంభణ సేయ, బెండ్లికి తి
      రస్కృతిఁ జూపిన నేమిసేయుటో?
      స్తంభపు రీతియున్న శివు
      శక్తిని గూర్పగ నెంచె కాలమున్
      రంభయు శంభుఁడున్ గలియ,
      రక్కసి పుట్టె సురల్ వడంకఁగన్

      రక్కసి = తారకాసురుడు

      తొలగించండి
  21. సాంబడు గ్రోలిమద్యమును సన్నిహితుండ్రకు చెప్పెనిట్లుగా
    నంబర చుంబితమ్మగు హిమాచల మందున కౌశికుండు తా
    గుంభిని యందు మేనకను గూడగ పుట్టిన బిడ్డయట్లుగా
    రంభయు శంభుఁడున్ గలియ రక్కసి పుట్టెసురల్ వడంకఁగన్.

    రిప్లయితొలగించండి
  22. శంకరుడు పార్వతితో
    కుంభిని పై ప్రేమ యడర
    అంభోధిసుత మగడైన హరి చేపట్టన్
    కుంభిని కమలాక్షులకును
    రంభా! శివ! సంగమమున రక్కసి పుట్టెన్

    రిప్లయితొలగించండి
  23. శంభుని మాయా జగతిని
    రంభా శివ సంగమమున రక్కసి పుట్టె
    న్నంభోరుహ సఖు డుడుపతి
    సంభవ మటసంక రములు జాలము జేయన్
    " ఇప్పుడు ఫర్వాలేదు " లగ్స్ లో నీరు జేరిందంటున్నారు."

    రిప్లయితొలగించండి
  24. 70లు దాటాయికదా ! ఇంకా ఎనాళ్ళు ? ఐనా ప్రేమగా మీఅందరిపిలుపు " అక్కయ్యా " అనగానే ఎంతో ఆనందం అదృష్టం ఉండగా ఇంకేం కావలి ? ధన్య వాదములు .

    రిప్లయితొలగించండి