28, ఏప్రిల్ 2019, ఆదివారం

సమస్య - 3000 (చాలు నింక...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చాలు నింక కంది శంకరయ్య"
(లేదా...)
"చాలును కంది శంకరయ! చాలిక నీ గుణదోష చర్చలున్"
(ఈనాటితో సమస్యల సంఖ్య 3000 అయిన సందర్భంగా...)

134 కామెంట్‌లు:



  1. జాలము లోన శ్రేష్టమగు శంకరు కొల్వున నేర్చినావుగా
    చాలును! కంది శంకరయ చాలిక, నీ గుణదోష చర్చలున్
    మేలును గూర్చె పద్యముల మేటిగ ధీటుగ వ్రాయ సౌమ్య! ఓ
    మాలిని! వందనమ్ములిడు మాస్టరుగారికి, వారి యోర్మికిన్!

    చాలిక - చాలిమి సామర్థ్యము

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. ప్రాతః కాలపు సరదా పూరణ:

    "చాలును కంది శంకరయ! చాలిక నీ గుణదోష చర్చలున్"
    మేలగు నిట్టి మాటలను మేమిక నొప్పము నెట్టివేళలన్
    బోలెడు కైపదమ్ములను భూరిగ నిచ్చుచు మమ్ముబ్రోవయా!
    వేలకు వేల శిష్యులము వేచుచు నుంటిమి నీలకంఠుడా!

    రిప్లయితొలగించండి
  3. జాలు వారె మూడు వేల సమస్యలుఁ
    గాన పూరణములు వేనవేలు
    హలము సాగ వలయు మొలకెత్తు పద్యాల
    చాలు నింక కంది శంకరయ్య

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాకుమార గారూ,
      పద్యాల చాలులో మొలకలు. చక్కని ఊహ. బాగుంది. అభినందనలు.

      తొలగించండి
    2. వేలుగ నిన్ని నాళ్ళుగను పేర్చి సమస్యల పద్య సేద్య మీ
      నేలన స్వర్ణమై మొలువ నిద్దుర మాని హలమ్ము బూనియున్
      చాలులఁ దీర్చి విత్తుచును సాగిరి తీయుడు నింక చాలు పై
      చాలును కంది శంకరయ, చాలిక నీ గుణదోష చర్చలున్

      తొలగించండి
    3. రాకుమార గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "నేలను" అనండి.

      తొలగించండి


  4. మూలముగా జిలేబులకు ముద్దుగ నిల్చెను స్థావరమ్ముగా
    వేలకు వేలు పద్యములు వేకువజామున విశ్వవేదికన్
    "చాలు"ను, కంది శంకరయ, "చాలిక", నీ గుణదోష చర్చలున్
    తాలిమి చేర్చె భారతికి తావియు చేర్చె తెనుంగు తల్లికిన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. మేలును గూర్చుశం కరుడ మేలగు సంపద మాకునీ యగన్
    కాలము కర్చుజేసి మము కావ్యము లల్లెడి కోవిదుల్ యనన్
    వేలకు వేలుగా పలికి వేయివి ధమ్ముల తీర్చి దిద్దగన్
    చాలును కంది శంకరయ చాలిక నీ గుణదోష చర్చలున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కోవిదుల్ + అనన్' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  6. అన్నము తిను వేళ ననుచుండెనీరీతి

    "చాలు నింక"కంది శంకరయ్య

    చాలు చాలు యనుట సద్ది వేళనెగాని

    పద్యమందు కాదు ప్రతిదినమున..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మల్లేశ్వర్ గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉన్నది. అభినందనలు.
      'చాలు + అనుట' అన్నపుడు యడాగమం రాదు. 'చాలు ననుట' అనండి.

      తొలగించండి
  7. పద్యమే తెలియని పామరుడగునాకు
    పద్య మల్లగలుగు పటిమ నిచ్చి
    మహిని కవిగ నిలుప మాజన్మ కదియేను
    చాలునింక కంది శంకరయ్య.

    రిప్లయితొలగించండి
  8. పద్య రచన జేయు భాగ్యం బు గల్పిo చి
    మూడు వేల కేల ముగియ వలయు ?
    సాగ వలయు బ్లాగు స్తవ నీ య ము గ నేల
    చాలు నింక కంది శంక ర య్య ?

    రిప్లయితొలగించండి


  9. వేళయు తప్పకన్ సొబగు విద్యగ వచ్చెను మాకు చాలదే
    చాలును! కంది శంకరయ! చాలిక, నీ గుణదోష చర్చలున్,
    మూలమగున్ తెలుంగునకు,ముందుతరమ్మునకున్ నిఘంటువై
    కాలము దాటి నిల్చునయ కైపద బైసికి జోతలివ్వియే!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. కేలును బట్టి దిద్దెదవు ;
    కేకలు పెట్టవు ; నీదు పల్కులే
    చాలును కంది శంకరయ! -
    చాలిక నీ గుణదోషచర్చలున్
    మేలుగ మారకుండ మిడి
    మేలములాడెడి వారి కైతకున్ ;
    వేలకొలంది మల్లెలను
    విద్యలతల్లికి గాన్క సల్పితే !!

    రిప్లయితొలగించండి
  11. మూలకుఁ ద్రోసి, ప్రాక్తనపు ముద్రను వేసి, చరిత్రలోన నా
    మేలగు వారసత్వమును మేలములాడగ పద్యసంపదన్
    జాలుగఁ దిద్దితీవు కొనసాగుమిదేలనొ?, చర్చ లిత్తరిన్
    జాలును కంది శంకరయ! చాలిక, నీ గుణదోష చర్చలున్

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  12. మూడు వేలు నిండి పోయినప్పటికిని
    చాలు నింక కంది శంకరయ్య
    యనగ నాదు చిత్త మంగీకరించదు
    ఈసమస్యలింక నీయుమయ్య

    రిప్లయితొలగించండి
  13. కేలు సాచి మీరు కిన్ క బూనక పద్య
    మాలకించి నడిపి నట్టివారు
    శూలి దయను కోటి శుభముల పొందగా
    చాలు;నింక కంది శంకరయ్య!!

    రిప్లయితొలగించండి
  14. మేలును గూర్చుశం కరుడ మేలగు సంపద మాకునీ యగన్
    కాలము కర్చుజేసి మము కావ్యము లల్లెడి కోవిదుల్లనన్
    వేలకు వేలుగా పలికి వేయివి ధమ్ముల తీర్చి దిద్దగన్
    చాలును కంది శంకరయ చాలిక నీ గుణదోష చర్చలున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కోవిదుల్ అనన్' అన్నపుడు ద్విత్వలకారం రాదు.

      తొలగించండి
  15. పట్టు బట్టి మాకు పాండిత్య మునునేర్పి
    వేన వేలు దినము విడువ కుండ
    నిపుడు చాల నంగ నెలవేది మాకింక
    భాలు నింక కంది శంక రయ్య

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. గురువులకు , సీతాదేవి గారికీ ధన్య వాదములు
      " చివరి పాదంలో మొదటి అక్షరం " చాలు " అనిఉండ వలెను .

      తొలగించండి

  16. మైలవరపు వారి వృత్తమింకా రాలేదేమిటి చెప్మా ?


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ

      శ్రీ కంది శంకరయ్య గారికి శుభాభినందనలు 🙏💐💐💐🙏

      చాలును కంది శంకరయ! చాలిక నీ గుణదోష చర్చలున్
      చాలును , వార్ధకమ్మునను శక్తినశించుచునుండె , వేలప..
      ద్యాల సమీక్షజేసితివి , యందరి మెప్పును పొందినావు , నీ..
      కేలనొ తృప్తి గల్గదని యెంతయొ మొత్తుకొనంగనాత్మ ., "నీ...
      కేల? సమస్యనీయగ కవీశ్వరులెందరొ భిన్నభిన్నభా...
      వాల మరందమాధురుల పద్యములన్ రచియింప , వాటి యం....
      దాలను గ్రోలు షట్పదమునై చరియించుటె తృప్తి నాకు , వే...
      వేల సమస్యలంబడి తపించెడి చిత్తము శాంతినందగా
      మేలగు శంకరాభరణమే శరణమ్మని నమ్మువాడనై
      లీల సమస్యలిచ్చెదను , లెమ్మిక నే విన నీదు పల్కులన్ ,
      చాలును చాలునంచు" మనసారగ పల్కి తిరస్కరించు మీ
      లాలితవాక్సుధల్ విననిలన్ పదివేలవరాలు మాకికన్ !!

      తొలగించండి

    2. అద్గదీ :) మూడువేలకు జస్టిఫై చేసేలా మైలురాయి వృత్తము కలికితురాయి కంది వారికి, సదనపు సభ్యులకు !



      చీర్సు సహిత

      జిలేబి

      తొలగించండి
    3. నాకు కర్తవ్యబోధ చేసిన మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  17. మహభ్యో గురుభ్యోన్నమః🙏🙏🙏

    బుడిబుడి నుడువుల పద్యము
    వెడవెడ నేర్చుచు పదములు వెదుకుచు వ్రాయన్
    తడిపొడి మాటలు తపనతొ
    గడగడ వల్లించుటెట్లు ఘనగురు లేకన్?

    పద్య రచన యందు పదమెట్ట, నెలలోనె
    చాలునింక కంది శంకరయ్య?
    ఇంటి పట్టు నుంటు యీతడే గురువంటి
    పిడుగు లాంటి వార్త పిల్ల కేల?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యజ్ఞేశ్ గారూ,
      మీ పద్యం, పూరణ ... రెండూ బాగున్నవి. అభినందనలు.
      పద్యంలో 'తపనతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. అక్కడను "తపనను" అనవచ్చు. అలాగే 'గురువు' అన్నదాన్ని వు ప్రత్యయం లేకుండా ప్రయోగించారు. అక్కడ "ఘన గురువు చనన్" అన్నా సరిపోతుంది.
      పూరణలో 'పదమెట్ట, ఉంటు' అన్నవి వ్యావహారికాలు. అక్కడ "పదముంచ, పట్టునుండి" అనండి.

      తొలగించండి
  18. స్వార్థ పూరిత మగు సంసార భారము
    చాలు నింక, కంది శంకరయ్య
    గారి పాఠశాలఁ జేరి పద్య రచన
    సలుపుచుంటి నిచ్చ సదమలముగ

    రిప్లయితొలగించండి
  19. మూడు వేలు ముగిసె మురిపాలు చాలని
    చాలు నింక కంది శంకరయ్య
    యనుట పాడిగాదు యారంభమేనాకు
    పద్యమల్లనేర్పుబడయగాను!!

    రిప్లయితొలగించండి
  20. ఎంత కాల మైన నెన్నేళ్ళు గడచిన
    "చాలు నింక కంది శంకరయ్య"
    యనెడి వార లెవ్వ రవనిలో జూడగ
    సాగ వలె సమీక్ష శాశ్వతముగ!

    రిప్లయితొలగించండి


  21. గోల గోల బ్లాగు గోలల నడుమ తా
    పద్యపు మధురిమల పరిఢవిల్ల
    జేసె నితడు పలుకుఁజెలికి బంగారపు
    చాలు నింక, కంది శంకరయ్య!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  22. పద్యవిద్య నేర్పి ప్రాఙ్ఞుల జేసితే!
    చాలునింక కంది శంకరయ్య
    కైపద మనువారు కానరారిచ్చట
    కలుగవలయు శుభము కందివర్య!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జాలమునందునన్ కవుల జక్కగ కూర్మిని దిద్దుచుంటివే
      వేలకువేలుగా,మదిని వేసటలేకయె రేబవంబులన్!
      చాలును కందిశంకరయ!చాలిక నీగుణదోష చర్చలున్
      మేలములాడగా దగునె మిత్రులనిచ్చట మూగవోవగా
      సాలులవెన్నియో గడచి సాగుచునుండగ శంభుభూషణమ్

      తొలగించండి
    2. గురువర్యులకు మూడువేల మైలురాయిని అందుకొన్నందుకు శుభాభినందనలతో నమస్సులు!

      తొలగించండి
    3. సీతాదేవి గారూ,
      ధన్యవాదాలు!
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'రేబవంబులన్' అన్న ప్రయోగం సాధువు కాదు. "రేయియున్ బవల్" అనండి.

      తొలగించండి
    4. వృత్తం మొదటిపాదములో దిద్దుచుంటిరే గా చదువ ప్రార్ధన!

      తొలగించండి
    5. ధన్యవాదములు గురుదేవా,సవరించెదను!

      తొలగించండి


  23. కోట వారిది బకాయి :)

    కోట వారూ మూడు వేలప్పుడు మీ సందర్భ సహిత వృత్తము మీ గళము తో బాటు రావాలె !


    విన్నపాలు వినవలె



    జిలేబి

    జిలేబి

    రిప్లయితొలగించండి
  24. కలుగ జేసి తీవు కవితానలము* పెక్కు
    హృదుల లోన చాల మృదువు గానె
    యనల★ మనెద నేనె యలమను+పల్కులు
    చాలు నింక కంది శంకరయ్య !
    **)(**
    * కవితాగ్ని
    ★అనలము = చాలదు
    +అలము = చాలు
    ***)()(***
    శ్లో. సమలం కరోతి కావ్యం సుకవిః
    కుకవిశ్చ తదుభయం కావ్యం ౹
    అనలం తనోతి చిత్తే సహృదయ
    హృదయం ప్రవిష్ట మాత్రం చేత్ ౹౹
    *****)()(*****

    రిప్లయితొలగించండి
  25. ఆటవెలది
    పలుకులమ్మ నోట బలికించెను సమస్య
    లరయ మూడు వేలు పరమపూజ్య!
    పదును బెట్టె కవుల మెదడుకు మేతయై
    చాలునింక కంది శంక రయ్య.
    ఆకుల శివరాజలింగం వనపర్తి

    రిప్లయితొలగించండి
  26. జాలమొకింతలేకపదజాలముకూరిచి పద్యపూరణల్
    చాలరచింపగాదలచి చక్కని మీదగుసౌత్యమందునన్
    కేలునుమోడ్చిచేరితిని గేలితనంబుననైననందునా
    "చాలునుకందిశంకరయ!చాలికనీగుణదోషచర్చలున్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణీంద్ర గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సౌత్యము' అన్న క్రొత్త పదం తెలిసింది. ధన్యవాదాలు.

      తొలగించండి
  27. కాలము మారెనంచు గద గాజులుఁ గుంకుమ మానివేసిరే
    చేలము లందుమార్పులును చీరను గట్టక వేణిఁ ముడ్వరే
    స్త్రీలకు సంస్కృతీ విలువఁ జెప్పన నేమిఫలమ్ము విందురా
    చాలును కందిశంకరయ! చాలిక గుణదోష చర్చలున్.

    రిప్లయితొలగించండి


  28. నా పూరణ. ఉ.మా
    ** *** *** ****

    వేలకు వేలు పద్యములు వీక్షణ జేయుచు భుక్తి నిద్రలన్

    వేళకు జేయలేక కడు వేదన జెందుటె చాలు!త్యాగముల్

    చాలును కంది శంకరయ! చాలిక నీ గుణదోష చర్చలున్!

    చాలదె మీ సమస్యలిక స్వాస్థ్యము పైనను శ్రద్ధ జూపగన్?


    🌿 ఆకుల శాంతి భూషణ్ 🌿
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
  29. ఆటవెలది
    చాలు వింత మాట జాలును శంకర
    పలుకులును చదువుల పడతి దయన
    వలదన వినరీ గవులు వ్రాయక నిచట
    చాలునింక కంది శంక రయ్య

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వరలక్ష్మి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దయను... వ్రాయక యిచట' అనండి.

      తొలగించండి
  30. అందమైన ప్రశ్న లనువుగా సంధించి
    పద్య విద్య మాకు వరము నొసగి
    ఇంతతోనె మీకు చెల్లు యనగ నెట్లు
    చాలునయ్య కంది శంకరయ్య 🙏

    రిప్లయితొలగించండి
  31. భూలోక సంచారానికి వచ్చిన శివుడు, ఆ వివరాలు భారతికి చెప్పి శంకరాభరణం కానుక తీసుకుని పోయి ఇచ్చాడు. ఇంక శంకరాభరణ గుణదోషాల చర్చ అవసరం లేదని.


    మేలిమి శంకరాభరణ మేరువు భారతి కంధరాగ్రమున్
    మాలగ చేరె శంకరుడె మాతకు భక్తినొసంగె దానినిన్
    మూలపుటమ్మతో తెలిపె ముచ్చట మానవలోకచిత్రముల్
    చాలును కంది శంకరయ! చాలిక నీ గుణదోష చర్చలున్


    రిప్లయితొలగించండి
  32. తడబడి బుడిబుడి నడకలు నడచుచు నడుగిడి తినిగ ఘను డగు శివుని
    సదనమునకు,నను ముదముగ నెడదన నిడుకొని కవుగిలి నిడుచు యెలమి
    గ పొడగని తెలిపె, కలతను విడువుము బుడుతడ, డొగరులు పొరలును తొలు
    త,కుతిలము వలదు తరుగును కలనములు కుదురుగ, తలకులును విడువుము
    సుముఖుల కవితలు సుముఖత కలుగగ విచితిని పొడగన విజితి కలుగు
    నని భుజము చరచి ననునయము నిడెను, దొసగులు సతతము విసుగు నెసగ
    క, కన బరచుచు చకచక కవితలను సకలము చెరుపుచు సరస గతిని

    చదువు నిడెడు నిన్ను స్వప్నము లో నైన
    చాలు నింక కంది శంకరయ్య
    వలదు నిగరపు ననుగలము నని పలుక,
    కోరు చుంటి ని సహ కార మెపుడు



    రిప్లయితొలగించండి
  33. చలువ జేయ మాకు చక్కగా ఉడికించి,
    పెట్టలేవ కాస్త పెసర పప్పు,
    చాలు చాలు మార్చు సాంబారు సాపాటు,
    చాలునింక కంది, శంకరయ్య..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామ్ గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  34. కొడిమికట్టుతెలుగుగూరిమితోడను
    పద్యరూపమిచ్చిబ్రదుకునీయ
    చాలునింకకందిశంకరయ్యయనగ
    భావ్యమగునెమీకుభవ్యులార,

    రిప్లయితొలగించండి
  35. కవిగణార్చితుండు కవిశేఖరుం డయ్య
    కదలి కైత లనెడు కలహ మందు
    నుంచు నదుపున సుగుణోత్తముం డడరి వా
    చాలు నింక కంది శంకరయ్య


    మే లగు పూరణామృతము మేదిని వెక్కస మౌనె త్రాగగం
    గ్రోలినఁ జాలునే యసుర కోట్యరి నామ సుధా రసమ్మునుం
    గాల విషాభ వాఙ్నిచయ కారణ మేమగు నయ్య దీనికిం
    జాలును కంది శంకరయ! చాలిక నీ గుణదోష చర్చలున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. అద్భుతమైన పూరణలార్యా,అభినందనలు,నమస్సులు!

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
      డా. సీతా దేవి గారు నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  36. కూరిమి శంకరాభరణ కూడలిలో మము తీర్చి దిద్దుచున్
    మేలిమి ప్రశ్నలన్ ముదము మీరగ మాకిడు పూరణార్ధమై
    చాలును కంది శంకరయ! చాలిక నీ గుణదోష చర్చలున్
    మేలుగు మాకు పద్యముల మీదను పట్టును పెంపు సేయగన్ _/\_

    రిప్లయితొలగించండి
  37. రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  38. తాలి మి తోడ దిద్దు చు ను దారిని జూపు చు నుండ నెందుకు న్
    జాలును కంది శంక ర య ?చాలిక నీ గుణ దోష చర్చ లున్
    మేలగు మాకు పద్య ములు మేలిమి బంగరు రీతి శోభిలన్
    జాలి ని జూపి మా యెడల చక్కని బ్లాగు ను మాన బోకుడీ !

    రిప్లయితొలగించండి
  39. చాలును కందిశంకరయచాలునునీగుణదోషచర్చలు
    జాలముమేముసామియిటచాలనిబల్కగనీదుసత్కృతి
    న్వేలకువేలుగా,బడీనివీడకపద్యసుమాలజల్లుమా
    మాలగజేసిమేమపుడుమంచిగనర్పణజేతుమీకుసూ

    రిప్లయితొలగించండి
  40. వేల కొలఁది కవుల విజ్ఞామును బెంచి
    పద్య విద్య యందు ప్రగతి జూప
    కారణంబు,మాకు నేరీతి,మీ దయ
    చాలు నింక కంది శంకరయ్య

    మేలగుసత్కవీశ్వరుల మించిన భావ మరంద మాధురిన్
    లీలగ గ్రోలుచుండి యలరించఁచుచు దోషము దిద్దివేయఁగా
    చాలును కంది శంకరయ! చాలిక నీ గుణదోష చర్చలున్
    ప్రేలుచు నున్న వారి యెడ విజ్ఞత శూన్యుల యొద్ద నెంచగా!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  41. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    భవిష్య పురాణం:

    నాలుగు వేల పూరణలు నమ్ముము జేసితి నట్టులిట్టులన్
    చాలును కంది శంకరయ! చాలిక నీ గుణదోష చర్చలున్
    గోలగ జేసిరే కవులు కొల్లలు కొల్లలు వ్హాటుసప్పునన్
    వీలుగ తోకముడ్చెదను విందును జేయగ నాదు బ్లాగునన్ :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. తోక ముడుచుటేలనయ ప్ర
      భాకర శాస్త్రి జి! మన దరి భారంబగునో
      శ్రీకందివరార్యులకు? మ
      జాకా మీ నాల్గు వేల జర్ని అరుదయా!



      జిలేబి

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      బాగుంది. కానీ ప్రస్తుతానికి నేను తోడ ముడవడం లేదు. మీరూ నాతోనే!
      అలరింప జేయు పూరణ
      లెలమిని లిఖియించి నవ్వులే పూయింపన్
      వలతివి, నాతో నడువుము,
      వలదయ్యా బ్లాగు విడ ప్రభాకర శాస్త్రీ!

      తొలగించండి
  42. బాలల బాగుకోరుచును భావితరాలకు మార్గదర్శిగా
    మేలగు సేవ జేయుదువు మేటివి మాయెడ జూపు ప్రేమయే
    చాలును కంది శంకరయ! చాలిక నీ గుణదోష చర్చలున్
    వీలుగుచో శతాబ్ది కడ వీక్షణజేతుము కన్నులారగన్

    రిప్లయితొలగించండి
  43. సమస్యాపూరణలు మూడువేలకు చేరిన శుభతరుణంలో పూజ్య గురుదేవులకు, కవిమిత్రులెల్లరకు నా శుభాకాంక్షలు, వందనములు..

    శారదాంబ నెలవు శంకరాభరణము
    సాగవలయు సతము చక్కగాను
    తలచవలదు తమరు కలనైన యీమాట
    చాలునింక, కందిశంకరయ్య!!!

    రిప్లయితొలగించండి
  44. ఏల ప్రయాణముల్ దహన మింత బయంకరమైన వేళలో
    చాలును కంది శంకరయ! చాలిక, నీ గుణదోష చర్చలున్
    కూళుల తోడ నెప్పుడును కూడదు, వారిని దూరముంచుడీ
    మేలగు కైత వ్రాయు కవిమిత్రులకానిక మీ సహాయముల్
    ఆనిక: ఊతము

    రిప్లయితొలగించండి
  45. చాలునింక కందిశంకరయ్య ననకు
    పద్యవర్షధార పడకయున్న?
    మొలక పిలకలేక విలువలు దగ్గగ!
    భావగంధమెట్లు పరిమళించు?

    రిప్లయితొలగించండి
  46. పద్యములను వ్రాయ హృద్యమౌ నట్టుల
    వంక గనక మాదు శంక దీర్చు,
    పాలు నీరు దెలుపు పగిదిని కలహంస
    ౘాలు! నింక, కంది శంకరయ్య!

    ౘాలున్=పోలికను
    ఇంక=వెంటనే

    రిప్లయితొలగించండి
  47. చదువు చెప్పగలరు ఛందస్సు మెలకువల్
    నెరపి పద్యరచన నేర్ప గలరు
    వేది నెక్కి వాణి విన్పింప భీతమా
    చాలు నింక కంది శంకరయ్య.

    రిప్లయితొలగించండి
  48. తూలవు సుంతయైన నిను ధూర్తులు మూర్ఖు డవంచు వాగినన్
    ప్రేలవు నీకు సాటి కవి లేరని వేదిక లెక్కి యెన్నడున్
    వ్రాలవు కాని తావులను వాదము లాడగ మెప్పు కోసమై
    చాలును కంది శంకరయ! చాలిక నీ గుణదోష చర్చలున్.

    రిప్లయితొలగించండి
  49. పద్య పాదమొసగి వ్రాయించు పద్యముల్
    చాలు నింక కంది శంకరయ్య
    యనుట భావ్యమౌనె? యందరి నలరించు
    నట్టి వింక చాలు ననుట తగునె


    వేలకొలందిగా కవులు వేగమె పద్యము లొప్పుగా నిటన్
    తేలిక గాను వ్రాసిరియ తేట తెలుంగున మాకు నియ్యదే
    చాలును:కందిశంకరయ చాలిక నీగుణ దోష చర్చలున్
    చాలును మానసంబునకు సంతస మెంతయొ కల్గె నిప్పుడే


    రిప్లయితొలగించండి
  50. రిప్లయిలు
    1. ధన్యవాదాలు మిస్సన్న గారూ, ఏడవ తేదీన అమలాపురం వస్తున్నారు కదా?

      తొలగించండి

  51. నా ప్రయత్నం :

    ఆటవెలది
    పద్య విద్య నేర్పి పరమోన్నతులౌచు
    కవుల సృష్టి జేయు భవుఁడు మీరు
    భక్తి నిచ్చు పత్ర ఫలపుష్ప తోయము
    చాలునింక కంది శంకరయ్య

    ఉత్పలమాల
    వాలిన భక్తి మ్రొక్కెద చివాలున జిక్కిన దేశికుండనన్
    వేళకు పద్యకూర్పునను వేదన బాపు విరించి తాననన్
    మేలుగ వీలుగా తము సమీక్షల పెంచెడు పాటవమ్ములున్
    చాలును కంది శంకరయ! చాలిక నీ గుణదోష చర్చలున్



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణ మొదటి పాదం చివర గణదోషం. "పరమోన్నతులు నౌచు" అనవచ్చు.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:


      నా ప్రయత్నం :

      ఆటవెలది
      పద్య విద్య నేర్పి పరమోన్నతులునౌచు
      కవుల సృష్టి జేయు భవుఁడు మీరు
      భక్తి నిచ్చు పత్ర ఫలపుష్ప తోయము
      చాలునింక కంది శంకరయ్య

      ఉత్పలమాల
      వాలిన భక్తి మ్రొక్కెద చివాలున జిక్కిన దేశికుండనన్
      వేళకు పద్యకూర్పునను వేదన బాపు విరించి తాననన్
      మేలుగ వీలుగా తము సమీక్షల పెంచెడు పాటవమ్ములున్
      చాలును కంది శంకరయ! చాలిక నీ గుణదోష చర్చలున్



      తొలగించండి


  52. కోటవారి వృత్తమింకా రాలేదేమిటి చెప్మా ?


    జిలేబి

    రిప్లయితొలగించండి
  53. డా.పిట్టా సత్యనారాయణ
    ఇన్ని యబద్ధాల(మూడు వేలఉక్తుల సమస్యలు)నేకధాటిగ మల్చి
    సన్న జేసి సరిగ సర్దు గురువ
    జొన్నరవ్వ దినగ(చేదును మ్రింగగా) జూడమె వెతలనిన్
    చాలునింక కంది శంకరయ్య!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అబద్ధాల' అన్నచోట గణభంగం. సరి చేయండి.

      తొలగించండి
  54. కోట రాజశేఖర్ గారి పూరణ.... (ఉ. 6.44 కే వాట్సప్ లో పెట్టారు)

    వేల కొలందిగా తమరు వింత సమస్యల నిచ్చినారుగా,
    వేల కొలంది శిష్యులుగ ప్రీతిగ పద్యము నేర్చి, రింక నీ
    వేల శ్రమింప, దీని పదివేలని యెంతుము విశ్రమింపుమా!
    చాలును కంది శంకరయ! చాలును నీ గుణ దోష చర్చలున్.

    రిప్లయితొలగించండి
  55. డా.పిట్టా సత్యనారాయణ
    బాలుడవేమొ నిత్యము నబాండములైన సమస్యలివ్వగా
    వీలు గలుంగునే యుదయ వేళనె హా హరి!వేలసంఖ్యలన్
    కీలు లెరింగి వాతలిడ కిమ్మనకుండగ నోర్చి పద్యపుం
    చాలుల ద్రిప్ప నాగలిని సంధిల జేసితి వెట్టులందుమే
    "చాలును కంది శంకరయ చాలిక నీ గుణదోష చర్చలున్!"

    రిప్లయితొలగించండి