1, ఏప్రిల్ 2019, సోమవారం

సమస్య - 2974 (నగములు దలలూఁచి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నగములు దలలూఁచి మెచ్చె నాదక్రియలన్"
(లేదా...)
"నగముల్ శీర్షము లూఁచి మెచ్చుకొనియెన్ నాదక్రియా మాధురిన్"

67 కామెంట్‌లు:

  1. గగనము నంటిన గానము
    భగవం తునిపదము సోకి పావన మయ్యెన్
    నగజాత గళము విప్పగ
    నగములు దలలూఁచి మెచ్చె నాదక్రియలన్

    రిప్లయితొలగించండి


  2. ధగధగమెరిసెడు మోమా
    యె! గళము సొబగులలరారె! యేమనెదనయా
    జగణపు జిలేబి పాడగ
    నగములు దలలూఁచి మెచ్చె నాదక్రియలన్!

    నగములు - చెట్లు తలలూపె



    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. వగపడుటేలా సోదర
    యగపడకను నున్న 'పన'ను నక్షరములనున్
    దగిలించిన చాలును - ప
    "న్నగములు దలలూఁచి మెచ్చె నాదక్రియలన్"


    పన్ + అను = పనను

    ఛందోగోపనం లాగ అక్షరగోపనమనమాట.
    😀🙏🏻🙏🏻

    - విట్టుబాబు

    రిప్లయితొలగించండి
  4. నగవును శిశువులు పాటకు
    మెగములు పాటకు పరవశ మిడినర్తించున్
    జగతిని సత్యము గదప
    న్నగములు దలలూఁచి మెచ్చె నాదక్రియలన్

    రిప్లయితొలగించండి
  5. గగనపు వేదిక యమరెను,
    నగజాపతి యాడిపాడె, నందియు, ప్రమథుల్,
    సిగజాబిలి, గంగయు, ప
    న్నగములు దలలూఁచి మెచ్చె నాదక్రియలన్..

    రిప్లయితొలగించండి
  6. రిప్లయిలు
    1. ప్రాతఃస్మరణ:

      వగలాడే జని దుందుభుల్ మురియుచున్ వాయించి బెంగాలులో
      వగకత్తెన్ గని రూపు మాపెదనుచున్ భంగ్రాను నర్తించగా
      తగవుల్ జూచుచు రాజకీయమున భల్ తండోప తండాలుగా
      నగముల్ శీర్షము లూఁచి మెచ్చుకొనియెన్ నాదక్రియా మాధురిన్

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  7. జగదానందము ! కోడెరౌతు గిరిజన్ సావాసిగా చేర్చుకొం
    చు గణమ్ముల్ తన వెంట రాగ నృతితో చూరాడి కైలాసమున్
    సగపాలై సతి తోడు గానమున విశ్రాంతిన్ గొనన్ శాంతమై
    నగముల్ శీర్షము లూఁచి మెచ్చుకొనియెన్ నాదక్రియా మాధురిన్!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. జగతిన వింతే మున్నది
    నగరపు కూడలిఁ నిలబడి నాదస్వరమున్
    మగటిమతో నూదగ ప
    న్నగములు దలలూఁచి మెచ్చె నాదక్రియలన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జగతిని' అనండి.

      తొలగించండి


  9. తూపరాణి అన్న పదాని వ్యుత్పత్తి చెప్పగలరు



    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. అగణితసంగీతస్వర
    మగమగనగనగధరాద్య మరపశుశిశ్వా
    దిగమిమొగమునగవులొలుక
    *"నగములు దలలూఁచి మెచ్చె నాదక్రియలన్"*

    రిప్లయితొలగించండి
  11. నగజా పతి నటరాజుయె
    గగనంబున నాట్యమాడ గని రవి శశి ప
    న్నగములు,పశుపక్షాదులు,

    నగములు దలలూఁచి మెచ్చె నాదక్రియలన్

    రిప్లయితొలగించండి
  12. నగ జాత పాడి యాడగ
    తగు రీతిగశివుడు కూడ తాళము వేయన్
    సి గ లో ని జాబిలి యు ప
    న్న గ ము లు దల లూచి మెచ్చె నాద క్రియ లన్

    రిప్లయితొలగించండి
  13. మైలవరపు వారి పూరణ

    నగవుల్ చిందెడు మోవిపై మురళితో నాట్యక్రియాలోలుడై
    జగదానందకరుండు కన్పడగ నాశల్ పల్లవింపంగనా
    ఖగముల్ ధేనువులున్ వ్రజాంగనలు ప్రక్కంజేర బృందావనిన్
    నగముల్ శీర్షము లూఁచి మెచ్చుకొనియెన్ నాదక్రియా మాధురిన్!

    నగములు.. చెట్లు

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నగజాపతి నర్తింప భు..
      జగములు నురగములు నహి భుజంగమములు స..
      ర్పగణాలంకృతులట ప...
      న్నగములు తలలూచి మెచ్చె నాదక్రియలన్ !!


      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  14. సగభాగంబుననంబసంబరమునన్ శంభుండునర్తించగా
    నగరాజంబులుపంచభూతములు ప్రాణాపానయోగంబనన్
    నగజానాధునినందిభృంగిగణమజ్ఞానాంతమౌనంచు ప
    *"న్నగముల్ శీర్షము లూఁచి మెచ్చుకొనియెన్ నాదక్రియా మాధురిన్"*

    రిప్లయితొలగించండి
  15. ( కొండలరాయడు వేంకటేశ్వరుడు - పాటలరాయడు
    వేంకటేశ్వరుడు )
    జగముల పతి వేంకన పద
    యుగళి మన ఘంటసాల యుజ్జ్వలరీతిన్
    సగమగు కన్నుల బాడగ
    నగములు దలలూచి మెచ్చె నాదక్రియలన్ .

    రిప్లయితొలగించండి
  16. కందము
    నిగమోద్యాన విహారుడు
    నగజాతాత్మజ జయంతి నాట్యము సేయన్
    సిగజాబిలి ప్రమథులు ప
    న్నగములు దలలూచి మెచ్చె నాదక్రియలన్.
    ఆకుల శివరాజలింగం వనపర్తి

    రిప్లయితొలగించండి
  17. సిగలో జాబిలి ముదమొం
    దగ పరమేశ్వరుడు సల్ప తాండవ కేళిన్
    గగనము నంటి మెరయు హిమ
    నగములు దలలూచి మెచ్చె నాదక్రియలన్

    రిప్లయితొలగించండి
  18. జగములనేలెడి ప్రభువగు
    నగజాతపతియె చెలంగి నాట్యము సలుపన్
    నగలై మెరసెడి సురప
    న్నగములు దలలూచి మెచ్చె నాదక్రియలన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అగణిత రసమాధురి గ్రో
      లగ తహతహలాడు గోకులంబున పశు,ప
      న్నగముల్, స్త్రీ పురుషులు మరి
      నగముల్ దలలూచిమెచ్చె నాదక్రియలన్
      నగములు = చెట్లు

      తొలగించండి
  19. గగనమును ముద్దులాడెడి
    నగముల పైకె క్కిభోరున యరచుచుండన్
    నిగదముకు మారు మోగుచు
    నగములు తలలూచి మెచ్చె నాదక్రియలన్

    రిప్లయితొలగించండి
  20. ధగధగ మెరయు హిమగిరిన
    నగజ శివుని గొలచి పాడ నానా రీతుల్
    అగములు, నగములు, నెల, ప
    న్నగములు దలలూచి మెచ్చె నాదక్రియలన్

    అగములు-చెట్లు, నెల-చంద్రుడు

    రిప్లయితొలగించండి


  21. మొగసాలలోన భళి ము
    ద్దుగుమ్మ తనరారు కైపు దూయుముడిని తీ
    సి గళము సర్దుకొనగ నా
    నగములు దలలూఁచి మెచ్చె నాదక్రియలన్ :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  22. అగజానన షణ్ముఖులును
    నగజయు మైమరువహరుడు నాట్యముసలుపన్
    శిగజాబిలి ప్రమథ ప
    న్నగములు దలలూచి మెచ్చె నాదక్రియలన్

    రిప్లయితొలగించండి
  23. నగజాత శివుడు హిమవ
    న్నగము¹న గల నగముల²న్ని నాట్యము జేయన్
    నగచాపు నృత్యమున మై
    నగములు³ దలలూఁచి మెచ్చె నాదక్రియలన్

    1.పర్వతం2.చెట్లు3.పాములు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జగముల్ సంభ్రమమందగా హిమగిరిన్ శర్వుండుమాదేవితో
      సిగలో జాబిలి వెన్నెలన్ గురియగా చిందాడ భాగీరథీ
      నగవుల్ పూయుచు దాండవించె శుభగతిన్ నందీశు తాళార్భటిన్,
      నగముల్ శీర్షము లూఁచి మెచ్చుకొనియెన్ నాదక్రియా మాధురిన్

      తొలగించండి
  24. 🙏🏼జైశ్రీమన్నారాయణ🙏🏼
    శుభోదయమ్.

    సమస్య.
    నగముల్ శీర్షములూఁచి మెచ్చుకొనియెన్ నాదక్రియామాధురిన్.

    నా పూరణాయత్నము.

    సుగుణోద్భాస ప్రశస్త నాగఫణి ధీశుండార్తితో పాడగా
    నిగమోద్భాసుఁడె నిత్యమున్ వినఁ గనున్ నేర్పున్ బ్రశంసించుచున్.
    జగతిన్ సంతసమందు ముంచఁదగు సత్ సంస్కారయుక్తంబు. ప
    న్నగముల్ శీర్షములూఁచి మెచ్చుకొనియెన్ నాదక్రియా మాధురిన్.
    స్వస్తి.
    సద్విధేయుఁడు
    మీ
    చింతా రామకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  25. భగవంతుని కీర్తనమును
    సుగళముతో నాలపించు సుతునిన్ దీవిం
    చగ నా సంగీత కనక
    నగములు దలలూఁచి మెచ్చె నాదక్రియలన్ ౹౹

    రిప్లయితొలగించండి
  26. జగముల నేలెడి శివుడే
    సగమున పార్వతిని నిలిపి సంభ్రమముగ తా
    బగటున తాండవ మాడగ
    నగములు దలలూఁచి మెచ్చె నాదక్రియలన్

    రిప్లయితొలగించండి
  27. నగములు కరఁగవె సంగీ
    త గానముల నక్కజముగ ధరణిని షడ్జ
    మ్ము గమకములు పడ వీనుల
    నగములు దలలూఁచి మెచ్చె నాదక్రియలన్

    [వీనులన్ + అగము; అగములు = పాములు]


    పగలున్ ద్వేషము లందు సంతతము కంపం బొందు దుష్టాత్ములున్
    విగతానందులు నుందు రక్కట మహోద్వేగమ్ముతో నార్తులై
    గగనం బందున ద్యోత మైన నచలత్కాఠిన్య భాస్వన్మనో
    నగముల్ శీర్షము లూఁచి మెచ్చుకొనియెన్ నాదక్రియా మాధురిన్

    రిప్లయితొలగించండి
  28. నగధరుడూదగ శంఖము
    నగములుదలలూచిమెచ్చెనాదక్రియలన్
    నగములు బ్రాణుల దోడుగ
    నగజయుదాసంతసించె నారసఝరికిన్

    రిప్లయితొలగించండి
  29. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    సొగసుల్ మీర ప్రభాకరుండిచట భల్ సొంపైన మత్తేభముల్
    పగలున్ రాత్రి రచించి ఛందములనున్ భంజించి రంజిల్లగా
    నగుచున్ భాగ్యపునగ్రినిన్ వనములన్ నందమ్ము చోద్యమ్ముతో
    నగముల్ శీర్షము లూఁచి మెచ్చుకొనియెన్ నాదక్రియా మాధురిన్ :)

    రిప్లయితొలగించండి
  30. నగమన్నన్ ధరణీధరమ్ము, నగమన్నన్ పాదపమ్మౌను, నా
    నగమన్నన్ విధుమౌళిశీర్షఫణవిన్న్యాసప్రభాదివ్యప
    న్నగమౌ, నివ్విధి మువ్విధమ్ములుగ శబ్దార్థమ్ములుం దోచ నే
    నగముల్ శీర్షములూచి మెచ్చుకొనియెన్ నాదక్రియామాధురిన్?.

    కంజర్ల రామాచార్య
    వనస్థలిపురం హైదరాబాదు.

    రిప్లయితొలగించండి
  31. జగపతి క్రోవిని బట్టుకు
    నిగరంబుగ నాలపించ నిజముగ నటకున్
    సొగపుచు నఱుదెంచెను ప
    న్నగములు, దలలూచి మెచ్చె నాదక్రియలన్!!!

    రిప్లయితొలగించండి
  32. జగతిన్బాలకుడైనయాప్రభువు వంశాగ్రంబునూదన్దగన్
    నగముల్శీర్షములూచిమెచ్చుకొనియెన్ నాదక్రియామాధురిన్
    నగజామాతయుసంతసంబగుచు నాహ్లాదంబుతోడన్ శివున్
    సగభాగంబును జేరెనత్తఱిని నాశాజ్యోతివెల్గొందెనాన్

    రిప్లయితొలగించండి
  33. నిగమారాధ్యునినీలమేఘతనువేణీవేణుసంకాశు బ
    న్నగభూషాభరణార్చితాచ్యుతునితన్నాగంబుపైగేళిస
    ల్పగనానందమునందెనందపశుపక్ష్వాద్యాగసంఘంబులు
    *"న్నగముల్ శీర్షము లూఁచి మెచ్చుకొనియెన్ నాదక్రియా మాధురిన్"*

    రిప్లయితొలగించండి
  34. నగమున్ మోసిన గోపి బాలు గని యానం దమ్ము తోడన్ సదా
    సగమే నిచ్చిన యాసదా శివుని పై చక్కంగ యాసీనులై
    నగరాట్పుత్రికి శోభకూర్చుచును తానందంబు పొందగాను ప
    న్నగముల్ శీర్షము లూఁచి మెచ్చుకొనియెన్ నాదక్రియా మాధురిన్



    ఖగపతి వాహనుడచ్చో
    సొగసుగ మ్రోయింప మురళి సుదతీమణులున్
    తగురీతి నాడి నటప
    న్నగములు దలలూఁచి మెచ్చె నాదక్రియలన్"*


    రిప్లయితొలగించండి
  35. అగజాతా పతి దర్శనమ్ము నకు తానారాటమే జూపగా
    సిగలో చంద్రుని దాల్చినట్టి విభునిన్ సీరాయుధుండన్ గనన్
    గగనంబవ్వగ నద్రినెత్తు తరి సూక్ష్మాత్ముండ నేగాంచగన్
    నగముల్ శీర్షము లూఁచి మెచ్చుకొనియెన్ నాదక్రియా మాధురిన్

    రిప్లయితొలగించండి
  36. మగటిమతోడ చెలంగెడి
    నగధరుఁడట మురళినూది నాట్యము చేయన్
    జగములు కదలుచు నుండగ
    నగములు దలలూఁచి మెచ్చె నాదక్రియలన్

    రిప్లయితొలగించండి
  37. కందం
    అగణిత సేవా ఫలమున
    నగజాతకు వరుఁడునౌచు నటరాజెలమిన్
    దిగిరాగ నలరి హిమవ
    న్నగములు దలలూఁచి మెచ్చె నాదక్రియలన్

    మత్తేభవిక్రీడితము
    పగలన్ బెంచెడు నుగ్రవాదములతో 'పాక్ 'దాడులన్ జేయగన్
    పొగిలెన్ భారతమంతయున్ వగచి తన్మూల్యమ్ముఁ జెల్లింపఁ జే
    యగ సాగించఁగ సర్జికల్ స్ట్రయికులల్లాడించ కాశ్మీరపు
    న్నగముల్ శీర్షము లూఁచి మెచ్చుకొనియెన్ నాదక్రియా మాధురిన్

    రిప్లయితొలగించండి
  38. జగతీనాథుని బొగడుచు
    నగణితముగ బాటలెన్నొ యాలాపింపన్
    దగువిధముగ నారదుడే
    నగములు దలలూఁచి మెచ్చె నాదక్రియలన్ !

    రిప్లయితొలగించండి
  39. మగువల్ జేరిరి సూర్యపుత్రి తటికిన్ మన్మోహనా కారుడౌ
    జగతిన్ బ్రోచెడు నల్లనయ్య గనియా శంపాంగులే మోహమో
    పగలేమంచును నాట్యమాడగ నితంబమ్మంటెడిన్ వేణి ప
    న్నగముల్ శీర్షములూఁచి మెచ్చుకొనియెన్ నాదక్రియా మాధురిన్

    రిప్లయితొలగించండి
  40. డా. పిట్టా సత్యనారాయ
    తగదది రాక్షస కీర్తన
    వగవక బహు హస్త వాద్య వాసిని గనియెన్
    జగమున రావణ కళగాన్
    నగములు దలలూచి మెచ్చె నాద క్రియలన్!
    ("రావణ హస్త వీణాస్త్రక్రియాలంక్రియాలంతానేక విధ వాద్య ప్రియుడు" ఏడు కొండల వాడు వేంకటేశ్వరుడు)

    రిప్లయితొలగించండి
  41. డా.పిట్టా సత్యనారాయణ
    వగలే యేలనొ ఛంవిద్య పయి నీ పాండిత్యమే గద్యమా?
    తగదీ గోల ప్రశాంత చిత్తులకు వేదాలన్ గనన్ పద్యమున్
    జగమే నాదమయంబటంచు చెవులన్ జారంగ నాదంబు ప
    న్నగముల్ శీర్శములూన్చి మెచ్చుకొనియెన్ నాదక్రియా మాధురిన్

    రిప్లయితొలగించండి