16, ఏప్రిల్ 2019, మంగళవారం

సమస్య - 2988 (చితిలోఁ బరమేశుఁ డిచ్చు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చితిలోఁ బరమేశుఁ డిచ్చుఁ జిరసౌఖ్యంబున్"
(లేదా...)
"చితిలోఁ జంద్రకళావతంసుఁ డిడు నిశ్శేషంబుగా సౌఖ్యమున్"

85 కామెంట్‌లు: 1. సతతము నేనెలుగెత్తుచు
  నతిగా రేయింబవలు సనాతనుడిని నే
  వెతుకుచు వేసారితి! మరి
  చితి, లోఁ బరమేశుఁ డిచ్చుఁ జిరసౌఖ్యంబున్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబి గారూ,
   చక్కని విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మరచితి' అనండి.

   తొలగించండి
 2. ప్రాతః కాలపు సరదా పూరణ:

  (స్వానుభవం)

  గతిలే కుండను ఖర్గపూరునను భల్ కంగారుతో చేరగా
  హితమౌ భుక్తికి దిక్కులేకనటనా హీనంపు హాస్టళ్లలో
  మతిబోవంగను బ్రహ్మచారులకు హా! మైకంపు ధూమమ్మిడున్
  చితిలోఁ జంద్రకళావతంసుఁ డిడు నిశ్శేషంబుగా సౌఖ్యమున్

  రిప్లయితొలగించండి
 3. డా.పిట్టా సత్యనారాయణ
  ఋతమెన్నుచు గతమెంచక
  సతతము రెక్కలను నమ్మి సాగిన శ్రమకున్
  బ్రతుకున గానని యుపకృతి
  చితిలో బరమేశుడిచ్చు చిర సౌఖ్యంబుల్

  రిప్లయితొలగించండి


 4. మతమేదైనను మానవత్వమొకటే! మత్తైన భావాలతో
  సతతంబీ భువిలోన మందమతులై సైతానులైబోవనే
  ల? తగాదాలిక లేల? కొట్టుకొని పాలార్చన్, విమర్దింపగాన్,
  చితిలోఁ జంద్రకళావతంసుఁ డిడు నిశ్శేషంబుగా సౌఖ్యమున్?


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తగాదాలిక యేల' అనండి.

   తొలగించండి
 5. అతులిత కరుణా సంద్రుడు
  సతతము సద్భక్తులఁ గాఁచు సర్వజ్ఞుండున్
  సితికంఠుడు పుణ్యపు సం
  చితిలోఁ బరమేశుఁ డిచ్చుఁ జిరసౌఖ్యంబున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాకుమార గారూ,
   పుణ్యపు సంచితితో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'శితికంఠుడు' అనండి. (సితికంఠుడు అని పద్యాయపద నిఘంటువులో ఉన్నా అది అసాధువు).

   తొలగించండి
 6. డా.పిట్టా సత్యనారాయణ
  బ్రతుకే కష్ట సుఖాల మేళనమనే భావంబు; వేకల్లలన్
  అతుకుల్ వేయుచు హింస జూపుచును నే హ్లాదంబటంచెంచితిన్
  జతనంబౌ సమతన్ గనంగ నచటే జాజ్జ్వల్యమానంబునౌ
  చితిలో జంద్రకళావతంసుడిడు నిశ్శేషంబుగా సౌఖ్యమున్
  ("యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమమ్ మమ" భగవద్గీత)

  రిప్లయితొలగించండి
 7. ( సత్కవి రసపోషణతోపాటు ఔచిత్యపాలనమూ సలపాలి )
  నతులను పొందును సత్కవి
  కృతమతి రసములు కురిసెడి కృతుల వెలార్పన్ ;
  సతతము తా నిలిపెడి యౌ
  చితిలో - బరమేశు డిచ్చు జిరసౌఖ్యంబుల్ .

  రిప్లయితొలగించండి

 8. మైలవరపు వారి పూరణ

  బ్రతుకే భారము , సర్వదుఃఖమయదౌర్భాగ్యంపు కూపమ్మనన్
  మతి చింతింపగనేల? గుండె గుడిలో మా రాజుగా శ్రీ ఉమా..
  పతి దీపించుచునుండె , సర్వజనతాభద్రంకరుండన్న ని...
  శ్చితిలోఁ జంద్రకళావతంసుఁ డిడు నిశ్శేషంబుగా సౌఖ్యమున్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి


 9. స్థితియతడే! లయకారకు
  డతడే! ఈశుడతడే! వడకుమల జడధా
  రి, త్రిధాముడతండేను! వి
  చితిలో బరమేశు డిచ్చు జిరసౌఖ్యంబుల్!


  విచితి - అన్వేషణ

  జిలేబి

  రిప్లయితొలగించండి
 10. సతతము ధ్యానసమాధుల
  మతిమగ్నము జేసినాత్మ మంగళకరమౌ
  మితిలేని మోదమందగ
  చితిలో పరమేశుడిచ్చు చిరసౌఖ్యంబుల్

  చితిః = చిచ్ఛక్తి
  చితిస్తత్పదలక్షార్ధా చిదేకరసరూపిణీ!

  రిప్లయితొలగించండి
 11. 🙏శ్రీ గురుభ్యోన్నమః!
  ఆత్మా త్వం గిరిజా పతిః ప్రాణః.....
  అన్నట్లు..

  మతిc బార్వతిగా, నాశివు
  నతని గృహమ్ముగ శరీర నాములు పనులున్
  సతతము లీలలనుచు నౌ
  చితిలో బరమేశు డిచ్చు జిర సౌఖ్యంబుల్


  రిప్లయితొలగించండి
 12. బ్రతుకంతయు నిష్ఫలమై
  వెతలెన్నియొ క్రమ్ముకొనగ వేసారితిగా
  చితికిన జీవితముననా
  చితిలోఁ బరమేశుఁ డిచ్చుఁ జిరసౌఖ్యంబున్
  **)()(**
  (వెతలతో, నైరాశ్యముతో నంత్యదశలో విసిగి,వేసారిన ఒకరి ఆవేదన )

  రిప్లయితొలగించండి
 13. వ్రతములు పూజలు నోములు
  సతతము నొ న రించు పుణ్య చరితు ల గు ధీ
  మతులకు కలి గెడి దౌ పరి
  చితి లో బర మేశు డిచ్చు జి ర సౌఖ్యం బుల్

  రిప్లయితొలగించండి
 14. బ్రతుకంతయు నిష్ఫలమై
  వెతలెన్నియొ క్రమ్ముకొనగ వేసారితిగా
  చితికిన జీవితముననా
  చితిలోఁ బరమేశుఁ డిచ్చుఁ జిరసౌఖ్యంబున్
  **)()(**
  (వెతలతో, నైరాశ్యముతో నంత్యదశలో విసిగి,వేసారిన ఒకరి ఆవేదన )

  రిప్లయితొలగించండి


 15. జీపీయెస్ వారికి :)


  గతిలేక ఖర్గపూరున
  హితమగు భుక్తికి వెతుకుచు హేరాలముగా
  మెతకుల కై రగిలింపగ
  చితి లోఁ బరమేశుఁ డిచ్చుఁ జిరసౌఖ్యంబున్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 16. అతిగా దాచిన సొమ్ములు
  సతి సుతులును బంధు మిత్ర సహవాసములున్
  గతిగా కాలును చివరకు
  చితిలో, బరమేశు డిచ్చు జిరసౌఖ్యంబున్

  రిప్లయితొలగించండి
 17. స్తుతినిన్ జేయుచు పార్వతీపతిని సంతుష్టుండు గావించి తా
  మదిలో నాతని దివ్యలీలలను సమ్మానించుచున్ సోలుచున్
  ధృతితో నాతనిజేరగా సతము స్వాధీనాత్ముడై ఙ్ఞాన సం
  చితిలో జంద్రకళావతంసుడిడు నిశ్శేషంబుగా సౌఖ్యముల్

  రిప్లయితొలగించండి
 18. సతతము బిల్వ కుఠారపు
  పతనములు పరచుచు పాన వట్టము పైనన్
  కతమును పోసి తనరు నప
  చితిలోఁ బరమేశుఁ డిచ్చుఁ జిర సౌఖ్యంబున్"

  కతము నీరు అపచితి పూజ

  రిప్లయితొలగించండి
 19. హితమును కోరుచు శ్రద్ధగ
  సితకర హారతులతోడ జేసెడి పూజన్
  సతతము నందుకొనెడి పరి
  చితిలో బరమేశు డిచ్చు జిరసౌఖ్యంబున్

  రిప్లయితొలగించండి
 20. మతిలేనిరమణదూకెను
  చితిలో,బరమేశుడిచ్చుజిరసౌఖ్యంబున్
  సతతము భక్తినిబూజలు
  సతితోడనుజేయునెడల సానందితుడై

  రిప్లయితొలగించండి
 21. గతమున్జెందినవారలన్బొసగనాకారంబుబోగాల్తురే
  చితిలో,జంద్రకళావతంసుడిడునిశ్శేషంబుగాసౌఖ్యమున్
  మతినెవ్వండిలసాదరంబుగనునమ్మాహాత్ముబూజించునో
  సతతంబాతనిమెచ్చుచున్దయనుదాసంతోషమున్బొందుచున్


  రిప్లయితొలగించండి
 22. మతి నెంచు నిత్యము భవం
  బతి దుఃఖ మయంబు సుమ్మి యారయఁ బృధ్విన్
  మృతియే ముక్తి నొసంగును
  జితిలోఁ బరమేశుఁ డిచ్చుఁ జిరసౌఖ్యంబున్


  సతి భాసిల్లఁగ నర్థ దేహమున వే సంతోషియై నిల్చి భూ
  త తతీశుండు నుమా ధవుండు సతముం దా నుండ సన్నిష్ఠతో
  వితతంబై చను భక్తి తత్పరత సంప్రీతిం దపోధ్యాన సం
  చితిలోఁ జంద్రకళావతంసుఁ డిడు నిశ్శేషంబుగా సౌఖ్యమున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 23. పతితోద్ధారకు డా మహా శివుడు స
  ద్భక్తాళిఁ గావంగఁ వి
  స్తృతుడై సర్వము నిండియుండె, కనహృ
  ద్దీపమ్ముగావెల్గునా
  శితికంఠుండు సదా మహాంధతతి వి
  చ్ఛిన్నంబుగా జేసి శో
  చితిలోఁ జంద్రకళావతంసుఁ డిడు ని
  శ్శేషంబుగా సౌఖ్యమున్

  రిప్లయితొలగించండి
 24. మతినిఁ బవిత్రముగ నునిచి
  గతినీవేయని తలచుచు, కఱకంఠునకున్
  సతము గుడిలోసలుపు నప
  చితిలోఁ బరమేశుఁ డిచ్చుఁ జిరసౌఖ్యంబున్
  అపచితి: పూజ

  రిప్లయితొలగించండి
 25. సతతము దేశజనుల భ
  ద్రత లక్ష్యముగా తలంచి ధైర్యము చూపన్
  యతులిత వీర జవానుకి
  చితిలోఁ బరమేశుఁ డిచ్చుఁ జిరసౌఖ్యంబున్

  రిప్లయితొలగించండి
 26. మిత్రులందఱకు నమస్సులు!

  "క్షితియే నా యిలు; లోకమందుఁ బ్రజ యేఁ జేకొన్న కౌటుంబకుల్;
  ప్రతిచోటున్ ఘనమైనచోటె; కన, సర్వంబున్ మదీయార్థమే;
  మతిఁ జింతింపఁగ దైవసృష్టి యిదె సుమ్మా!" యంచు నెంచన్, సదౌ
  చితిలోఁ జంద్రకళావతంసుఁ డిడు నిశ్శేషంబుగా సౌఖ్యమున్!

  [సత్ + ఔచితి లోన్ = సత్పురుషుల ఔచిత్యవంతమైన భావనను మనస్సులో (స్వీకరించి/మెచ్చి)]

  రిప్లయితొలగించండి
 27. మతినుంచుచు సత్యమునున్
  బ్రతుకంతయు భగవదంశ ప్రార్థనలన్ దు
  ర్గతులకు సాయముఁ జేసిన
  *"చితిలోఁ బరమేశుఁ డిచ్చుఁ జిరసౌఖ్యంబున్"*

  చిరసౌఖ్యమంటే.... మరు జన్మలేని పరమపదమే కదా

  రిప్లయితొలగించండి
 28. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  పితరున్ జేర్చెడి నెన్నికల్ చితులహో! భీభత్సమున్ జేసెనే
  స్తుతమౌ ఫెడ్రలు ఫ్రంటు జేరుచును భల్ స్త్రోత్రమ్ముజేయండహో!
  గతుకుల్ దాటుచు మోడివర్యునినటన్ కాల్పించి మోదమ్మిడున్
  చితిలోఁ జంద్రకళావతంసుఁ డిడు నిశ్శేషంబుగా సౌఖ్యమున్

  చంద్రకళావతంసుడు = kcr

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి


  2. విడువను నే చంద్రుని నే
   విడువను వాడి కొమరుని "కవితలల్లెద" నే
   విడువక ననుదినము జిలే
   బి డమ డమా వృత్తముల సభికులు ముదముగాన్!


   జిలేబి

   తొలగించండి
 29. బ్రతుకున భక్తియునమ్మియు
  హితములు సమకూర్చు శక్తి హీనతమాన్పన్!
  "ప్రతిదినమున మంచియుబం
  చితి" లో బరమేశుడిచ్చు జిరసౌఖ్యంబున్!

  రిప్లయితొలగించండి
 30. మితుల, దశదోషముల, జన
  హితములను మదిని గణించి యేమరక తగన్
  కృతులను వ్రాయుచు జన నౌ
  చితిలో, బరమేశు డిచ్చు జిర సౌఖ్యంబున్!

  (మూడవ పాదంలో జన = చనుచుండ)

  రిప్లయితొలగించండి
 31. బ్రతుకది ముగిసిన పిదపను
  మృతాంగ మది చేరుచోటు మేదిని యందున్
  పితరుల పుడమియె యెవ్విధి
  చితిలోఁ బరమేశుడిచ్చుఁ జిరసౌఖ్యంబున్.

  రిప్లయితొలగించండి
 32. మతిలోఁ ప్రేమము పల్లవించ కడు సమ్మానించుచున్ పేదలన్
  ధృతితో శంకరునిన్ స్తుతించుచు సదుద్దేశమ్ముతోనిత్యమున్
  గతినీవేయని దేవళమ్మున, సమగ్రమ్మౌ విధానంపు నౌ
  చితిలోఁ జంద్రకళావతంసుఁ డిడు నిశ్శేషంబుగా సౌఖ్యమున్

  రిప్లయితొలగించండి
 33. కందం
  పితరుండు పిలువ కున్నను
  సతి చేరగ యజ్ఞవాటి సాంబశివు ననౌ
  చితి దూఱినంత యజ్ఞమె
  చితి! లోఁ బరమేశుఁ డిచ్చుఁ జిరసౌఖ్యంబున్! !

  రిప్లయితొలగించండి
 34. మతి చెడి, గతులును మారెను
  వెతలెన్నియొ కృంగదీయ వివశుడనైతిన్
  నతులన్ వేలుగ నిడి,పే
  ర్చితి,లో,పరమేశుడిచ్చు జిర సౌఖ్యంబున్.

  లో=మనసులో

  రిప్లయితొలగించండి
 35. మత్తేభవిక్రీడితము
  వెతలన్ ద్రుంచి మనంబు చింతలను నిర్వీర్యమ్ము జేయంగ ని
  శ్చితమై ధ్యాన సుధాంబుధిన్ బరగి సాక్షీభూత యోగాంచితా
  తతులన్ దేలుచు దివ్యలోకగతి సంధానించు భావార్థ సం
  చితిలోఁ జంద్రకళావతంసుఁ డిడు నిశ్శేషంబుగా సౌఖ్యమున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'యోగాంచిత తతులు' అనడం సాధువు.

   తొలగించండి