15, ఏప్రిల్ 2019, సోమవారం

సమస్య - 2987 (శ్రీనాథుండు రచించె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శ్రీనాథుఁడు భారతకృతిఁ జేసె ఘనుండై"
(లేదా...)
"శ్రీనాథుండు రచించె భారతము మా శ్రీనాథుఁ డౌరా యనన్"

55 కామెంట్‌లు:

 1. చూడ లేదెప్పుడున్ మన సూరి రుక్మి
  సోదరినిఁ, బెండ్లియాడెను సోదరుండు
  రుక్మిణిని వేడు కొనగ కరుణము తోడ
  నని బలికె బలరాముడు నాలి గాంచి
  (సూరి = కృష్ణుడు )
  గురువు గార్కి శుభోదయము నిన్నటి నా పూరణము ఒక్కసారి చూడండి

  రిప్లయితొలగించండి


 2. తందాన తానా :)


  తానా అంటే తందా
  నానా యను గురువులనగ! నాబత్తులికన్
  చానా గిట్టు జిలేబీ
  శ్రీనాథుఁడు భారతకృతిఁ జేసె ఘనుండై!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. ప్రాతః కాలపు సరదా:

  వీనుల్కింపగు చాటువుల్ విరివిగా వింతైన నాంధ్రమ్మునన్
  శ్రీనాథుండు రచించె;...భారతము మా శ్రీనాథుఁ డౌరా యననన్
  ఆనందమ్మును నిచ్చుగా ప్రజలకున్ హైరాన గావించకే
  కోనల్ కోనలు జొచ్చు నాటకముగా ఘోషించు టీవీలలో

  రిప్లయితొలగించండి
 4. ఈనాటి చదువు తీరిది
  ఏనోటికి రాదు తెలుగు యింగ్లీషుయునూ!
  నేనడుగ చెప్పె నొకడు
  "శ్రీనాథుఁడు భారతకృతిఁ జేసె ఘనుండై"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాకౌమార గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తెలుగు + ఇంగ్లీషు = తెలు గింగ్లీషు' అవుతుంది. యడాగమం రాదు. "ఏనాటికి రానివి తెలు గింగ్లీషు లికన్..' అనండి.

   తొలగించండి
 5. మైలవరపు వారి పూరణ

  శంకరాభరణం.. సమస్యాపూరణం..

  శ్రీనాథుండు రచించె భారతము మా శ్రీనాథుఁ డౌరా యనన్ !

  యన్నేహాస్తి నతత్ క్వచిత్

  నానాలౌకికధర్మమర్మముల సంధానించి నిర్మించితిన్
  నేనీ గ్రంధము, నిందు లేనిదిక నెందేన్ లేదు లేదంచు ని...
  త్యానందంబిడగా ,
  ద్విబాహుడగునా వ్యాసర్షి యన్ సద్యశ...
  శ్శ్రీనాథుండు రచించె భారతము *మా శ్రీనాథుఁ* డౌరా యనన్ !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారి పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. అచతుర్వదనో బ్రహ్మా
   ద్విబాహురపరో హరిః
   అఫాలలోచనశ్శంభుః
   భగవాన్ బాదరాయణః !!

   🙏🙏💐💐💐🙏🙏

   తానేకాస్యవిధియు , ఫా...
   లానలరహితాభవుండు వ్యాసాఖ్యుడు ప్ర.....
   జ్ఞానిధి ద్విబాహువిలసత్
   శ్రీనాథుడు భారతకృతి చేసె ఘనుండై !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
 6. వీనులవిందగు పదముల,
  నానందించగ ప్రజాళి వ్యాసుండను ధీ
  మౌని కురువంశపు యశ
  శ్శ్రీనాథుఁడు భారతకృతిఁ జేసె ఘనుండై

  రిప్లయితొలగించండి
 7. వ్యాసాయ విష్ణురూపాయ వింటే భారతమే వినాలి
  వీనులవిందగు తీరున
  నానార్ధంబులను గూర్చి నైగమమనగా
  తానే వ్యాసునిరూపున
  శ్రీనాథుడు భారతకృతి జేసె ఘనుండై

  రిప్లయితొలగించండి

 8. ఆ నరసింహుని వ్యాసుడు

  గాన మొనర్చుచును వేడె కావ్యరచనకున్!

  దీనుని మది దీవించగ

  శ్రీనాథుడు...భారతకృతి జేసె ఘనుండై

  🌿 ఆకుల శాంతి భూషణ్ 🌿
  🌷 వనపర్తి 🌷

  రిప్లయితొలగించండి


 9. మీనాక్షీ! వినుమమ్మ వ్యాసుడగుచున్ మించారు రీతిన్ భళా
  యేనాడైనను నిల్చు కావ్యముగ సాయింపన్ సఖీ దీటుగా
  శ్రీనాథుండు రచించె భారతము; మా శ్రీనాథుఁ డౌరా యనన్
  పానారమ్మును నోటబట్టి పలుకుల్ పారించి కట్టెన్ కథల్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 10. నానా విధ ధర్మమ్ముల
  నే నాటికి మంచి వ గుచు నేర్పడు పగిది న్
  దానే వ్యాసుని రూప
  శ్రీ నాథుడు భారత కృతి చేసె ఘనుo డై

  రిప్లయితొలగించండి
 11. డా.పిట్టా సత్యనారాయణ
  దీనాతి దీనులై నాం
  గ్లానన్ చరితంబు గూర్చ, గ్లానియె మిగిలెన్
  గానీ నమ్మిరె యీ నుడి:
  "శ్రీనాథుడు భారతకృతి జేసె ఘనుండై"

  రిప్లయితొలగించండి


 12. గురువర్యులకు నమస్సులు, నిన్నటి, మొన్నటి నా పూరణలను పరిశీలించ ప్రార్థన.

  బాసల పర్వముల్ ముగియ పల్లెల పట్టణ వాసులందరున్
  వేసిన ఓటు నేతలకు భీతి కలుంగగ జేయు నంతలో
  ఊసులు మానసమ్ములను ఊయల లూపుచు మేళవించగన్
  వేసవి కాలమందు చలి వేయుచు నున్నదదేమి చిత్రమో!

  తమ్ముని వివాహ విషయమై తా నిటులనె,
  "అమ్మ నాన్నల నెదిరించ నాత డెంచ
  లేదు, పెద్ద లొప్పు కొనగ నాదు భార్య
  సోదరిని బెండ్లి యాడెను, సోదరుండు!"

  రిప్లయితొలగించండి
 13. ఏనాటికైనను సుకవి
  శ్రీనాథుడు, భారతకృతిఁ జేసె ఘనుండై
  యానాడే వ్యాసుడు శ్రీ
  వాణీ బ్రహ్మాణి హంస వాహిని కృపతో

  రిప్లయితొలగించండి
 14. డా.పిట్టా సత్యనారాయణ
  కానల్ గానని మంచు భూమి కెటులీ గానంబు(భారతగాత కథా గానము) సాధ్యంబగున్
  గానీ పేర్లను మార్చి గాథల నిలన్ గర్వంబుగా నల్లగా
  పోనీ వ్యాసుని పాదమంటి నవలల్ బుట్టించు నాంగ్లేయపున్
  శ్రీనాథుండు రచించె భా ర త ము(దీర్ఘ గాథల సంపుటము), మా శ్రీనాథు"డౌరా!"యనన్
  (షేక్స్పియర్ ఎవరో కాదురా మన "శంకరయ్య"యే అనేవారు 1950 దశకపు నా గురువులు-ఆనాడు భారత దేశ భక్తిని యిలా చాటే వారు.)

  రిప్లయితొలగించండి
 15. ఈనాటికి చాటు ఘనుడు
  శ్రీనాథుడు; భారత కృతి జేసె ఘనుండై
  తానా వ్యాసుడు గదరా
  ఏనాటికి తెలుపు నీతి జెగమంతటికిన్

  రిప్లయితొలగించండి
 16. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే
  నమో వైబ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః

  శ్రీనాథుండన విష్ణువు
  శ్రీనాథుఁడె వ్యాసమూర్తి చింతింపంగన్
  బూనుచు సూక్ష్మములు దెలుప
  *"శ్రీనాథుఁడు భారతకృతిఁ జేసె ఘనుండై"*

  రిప్లయితొలగించండి
 17. ( " అక్షరరమ్యతాశ్రీనాథుడు " నన్నయభట్టు భారతం ఆంధ్రీ
  కరిస్తుంటే శ్రీదేవీనాథునికి సంతోషమే. అదే రాజమహేంద్ర
  వరంలోని మార్కండేయేశ్వరుడు పార్వతితో అంటున్నాడు )
  ఓ నాదేవి ! హిమాద్రినందన ! యదే
  యుత్సాహసంరూఢితో
  నానాసూక్తివిశారదుండయిన యా
  నన్నయ్య లోకజ్ఞుడై
  తా నా రాజనరేంద్రు సమ్మతిన శ
  బ్దార్థాకృతిన్ రమ్యతా
  శ్రీనాథుండు రచించె భారతము ; మా
  శ్రీనాథు డౌరా ! యనన్ .


  రిప్లయితొలగించండి
 18. ఆ నలగాము చరితమున్
  ఆ నాగమ్మ కుటిల ప్రతినాయక రీతిన్
  తానా పల్నాటి కధను
  శ్రీనాథుఁడు భారతకృతిఁ జేసె ఘనుండై

  రిప్లయితొలగించండి
 19. కాణాచియసీసములకు
  శ్రీనాథుడు,భారతకృతిజేసెఘనుండై
  వీనులవిందుగనన్నయ
  పూనికతోదనదుశైలిమురిపెముగలుగన్

  రిప్లయితొలగించండి


 20. ఆ నలునికథను వ్రాసెను
  శ్రీనాథుఁడు, భారతకృతిఁ జేసె ఘనుండై
  యానన్నయ యాదికవిగ
  తేనెలొలుకు నట్లుగానుతేట తెనుగులో

  మరొక పూరణ

  శ్రీనాథుండన హరియే
  శ్రీనాథుఁడె వ్యాసుడంచు చెప్పుదురిలలో
  యానారాయణుడే యీ
  శ్రీనాథుఁడు, భారతకృతిఁ జేసె ఘనుండై

  రిప్లయితొలగించండి
 21. మానముగ గాథను నడిపె
  శ్రీనాథుడు ; భారతకృతి జేసె ఘనుండై
  తానేర్చిన సంతతిపై
  వానప్రస్థము ననున్న వ్యాసతపసియే

  రిప్లయితొలగించండి
 22. ఏనాడు తెలుగు నేర్పక
  నానాటికి తీసికట్టుననున్న బడిలో
  ఓనాడొకండు బలికెన్
  శ్రీనాథుఁడు భారతకృతిఁ జేసె ఘనుండై

  ఏరోజు కూడా తెలుగు భాష సరిగా బోధించకుండా ప్రమాణాలు నానాటికీ తీసికట్టు అవుతున్న ఒక పాఠశాలలో ఒక విద్యార్థి ఒకరోజు శ్రీనాధుడు భారత రచన చేశాడని చెప్పాడు.

  రిప్లయితొలగించండి
 23. మే నలరంగఁ దెనుగు సం
  ధానము శృంగార నైషధము నింపారం
  దాను గవిసార్వభౌముఁడు
  శ్రీనాథుఁడు భారతకృతిఁ జేసె ఘనుండై

  [భారత కృతి = భారతదేశపు ప్రబంధము]


  నానా క్షత్రియ వంశ గాథలను విన్నాణమ్ముగం దెల్ప స
  త్యానందమ్మును బంచ లోకమున విశ్వాత్మాహ్వయ స్త్యేన చి
  త్పానీయమ్మన సంయమీంద్ర వరుఁ డా వ్యాసుండు భాస్వత్తప
  శ్శ్రీ నాథుండు రచించె భారతము మా శ్రీనాథుఁ డౌరా యనన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సమ దా ళ్యావలి పాఱెఁ గాంచి లలనా శ్యామాలక శ్రేణులం
   గమనీ యాబ్జము లప్పు దూఱె నరయం గాంతా ముఖాంభోజముం
   దిమి వేశ్మమ్మున దాగె శంఖములు దొంతిం గాంచి తద్గ్రీవముం
   దమి యేపారఁగఁ గాంచి లే ళ్ళుఱికె సీతాదేవి కందోయినే

   తొలగించండి
 24. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  తిరుపతిలో (నా కలలో)

  దీనుండౌచును రాహులుండు తెలుగున్ త్రిప్పించి మళ్ళించుచున్
  నానాటిన్కిని తీసి కట్టు సరళిన్ నాగంపు భొట్లౌచుచున్
  పోనీలేయని నూరకుండగనునా పోట్గాడు పల్కెన్నిటుల్:
  "శ్రీనాథుండు రచించె భారతము మా శ్రీనాథుఁ డౌరా యనన్"

  రిప్లయితొలగించండి
 25. ఆ నరు తోడుత గీతా
  పానీయము నీ యవనిని పంచ దలంచన్
  తానే పారాశరుడై
  శ్రీనాథుడు భారత కృతి జేసె ఘనుండై !

  రిప్లయితొలగించండి
 26. నానార్ధంబుల గూర్చుచున్ సుజనులానందింప వ్యాసాఖ్యుడౌ
  శ్రీనాథుండు రచించె భారతము;మా శ్రీనాథు డౌరాయనన్
  నానాదేశములన్ భ్రమించి కవితల్ నాణ్యంబుగాగూర్చె బల్
  మేనాలెక్కుచు సార్వభౌముడనగన్ మించారు ప్రౌఢత్వమున్

  రిప్లయితొలగించండి
 27. మీనా! సత్కవులెల్ల వ్రాసిరి గదా మేలైన కావ్యాలనే
  వీణాపాణి కృపాకటాక్షములతో విస్తార గ్రంథాలనే
  శ్రీనాథుండు రచించె, భారతము మా శ్రీనాథుఁ డౌరా యనన్
  జ్ఞానాంభోధియె యైన వ్యాసుడను ప్రజ్ఞాశాలియే వ్రాసెనే

  రిప్లయితొలగించండి
 28. కందం
  మీ నాలుక వేగమ్మున
  కానెడు విధి వ్రాతుననుచు గణపతి పలుకన్
  దా నట వ్యాసుండనియెడు
  శ్రీనాథుఁడు భారతకృతిఁ జేసె ఘనుండై

  రిప్లయితొలగించండి
 29. మిత్రులందఱకు నమస్సులు!

  [వ్యాసుఁడు భారత రచనమును శ్రీమహావిష్ణు ’వౌరా’ యనునట్లుగా రచించినాఁడని శివుఁ డుమాదేవికిం జెప్పు సందర్భము]

  "జ్ఞానోత్కృష్ట విశిష్టయోజితకళాశ్వాసుండు వ్యాసుండు స
  న్మానోదంచిత జన్మసాత్కృత పురాణాష్టాదశోల్లేఖకుం
  డానందంబున బాదరాయణుఁడు వేదాఢ్యుండు ద్వైపాయన
  శ్రీనాథుండు రచించె భారత ముమా! శ్రీనాథుఁ ’డౌరా!’ యనన్!"
  (ద్వైపాయనశ్రీనాథుఁడు = కృష్ణద్వైపాయనుఁ డయిన వ్యాసుఁడు)

  రిప్లయితొలగించండి
 30. నానా వేద పురాణ శాస్త్ర ఘన గ్రంథాలన్ వినిర్మించి తాఁ
  జ్ఞానాంభోధిగ నిల్వ వ్యాస ముని, విజ్ఞానామృతమ్మున్ గొనన్
  పానాసక్తుల కోర్కె దీర్చ కథగా వ్యాసాత్మ లోజేరి యా
  శ్రీనాథుండు రచించె భారతము మా శ్రీనాథుఁ డౌరా యనన్!
  మా శ్రీనాథుడు = మా శ్రీనాథకవి

  రిప్లయితొలగించండి