28, డిసెంబర్ 2020, సోమవారం

సమస్య - 3588

29-12-2020 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కలము ధరించి చనె సతి సుఖంబిడఁ బతికిన్”

(లేదా…)

“కలము ధరించి శోభనసుఖంబిడఁగాఁ జనె నాతి భర్తకున్”

90 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    కులమును గోత్రమున్ గనక కూరిమి మీరగ పెండ్లియాడుచున్
    తిలకము దిద్ది మోమునను తీరిచి దిద్దుచు పైటకొంగునున్
    విలవిల లాడగా కవియె వేడుక గానక పద్యమల్లుటన్
    కలము ధరించి శోభనసుఖంబిడఁగాఁ జనె నాతి భర్తకున్..

    రిప్లయితొలగించండి
  2. కులసతికష్టముఁదీర్పగ
    విలవిలలాడెడిబ్రతుకులవెలుగులునింపన్
    లలనలుకలమునుఁబట్టిరి
    కలముధరించిచనెసతిసుఖంబిడఁబతికిన్

    రిప్లయితొలగించండి
  3. శ్రీనాథుని శృంగారనైషధంలో నలదమయంతుల సరససల్లాపఘట్టమును గూర్చి నా పూరణ..

    చం||
    కలయిక వేచియున్ నలుని గాంచుచునైషధమందు జూడగన్
    అలక దలంపులందునమరంగ విలాసములస్తియస్తియం
    చులయల సాగ ప్రీతి వలచున్ దమయంతియు స్వర్ణహారసం
    కలము ధరించి శోభనసుఖంబిడగాజనె నాతి భర్తకున్

    రోహిత్ 🙏🏻

    రిప్లయితొలగించండి
  4. మలయజ శీత మారుతము మైమఱపించఁగ, పేరటాండ్ర మా
    టలు విని సిగ్గునందుచు, నటన్ తొలిరాతిరినిన్ దలంచుచున్,
    చెలియ లలంకరింపఁగ, విశేషముగాఁ గనిపించు మేటి వ
    ల్కలము ధరించి శోభనసుఖంబిడఁగాఁ జనె నాతి భర్తకున్.

    రిప్లయితొలగించండి
  5. వలపులు మదిలో పొంగగ
    తలచుచు హర్షం బొస గ గ తా వెడలియు కా
    వలసిన నలంక రణపు స
    కలము ధరించి చనె సతి సుఖంబిడ పతికిన్

    రిప్లయితొలగించండి

  6. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    నిలువను జాలకే మురిసి నీరజ నేత్రయె ముత్తుకూరునన్
    కలమును పట్టి చేతినిక కావ్యము వ్రాయగ భర్తపై వడిన్
    మిలమిల లాడగా కనులు మీరిన ప్రీతిని చేతినందు కా
    కలము ధరించి శోభనసుఖంబిడఁగాఁ జనె నాతి భర్తకున్...

    రిప్లయితొలగించండి
  7. ఇల ఘన రచయిత్రినిగ , స

    కల రచనలననుచు, వ్రాయగను శోభన రీ

    తులు, వివరము తెలుసుకొనగ

    కలము ధరించి చనె సతి సుఖంబిడఁ బతికిన్”

    ....భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  8. కలగనురాకుమారుడునుకన్నునుగానకరాక్షసుండునై
    లలనలమానసంబులనులాతిగఁజేయగబాధనందుచున్
    కులసతిపట్టెగంటమునుగూబలుగుయ్యనిపించవారికిన్
    కలముధరించిశోభనసుఖంబిడఁదాఁజనెనాతిభర్తకున్

    రిప్లయితొలగించండి
  9. సమస్య :-
    “కలము ధరించి చనె సతి సుఖంబిడఁ బతికిన్”

    *కందం**

    ఇల కాలము మారెనులే
    కలువ కనుల తోడ సిగ్గు కనిపించకనే
    కులుకుచు బంగారమ్ము స
    కలము ధరించి చనె సతి సుఖంబిడఁ బతికిన్
    .....................✍️చక్రీ

    రిప్లయితొలగించండి
  10. సమస్య :
    కలము ధరించి శోభన సు
    ఖం బిడగా జనె నాతి భర్తకున్

    ( చిన్నప్పటినుంచే నవలలు , కథలు వ్రాసే నవలా “ రాణి "వివాహానంతరం శోభనసమయంలో సైతం రచనావ్యాసంగం వాడకుండా వీడకుండా చేసిన పని )

    కలకలమొప్పగా నవలి
    కల్ , కథలున్ దన బాల్యమాదిగన్
    వెలవెలబోవ పూరుషులు
    బెక్కులు వ్రాసిన కోమలాంగియే
    జలజల పారు యోచనల
    జక్కని సాహితి సృష్టిజేయగన్
    గలము ధరించి శోభనసు
    ఖం బిడగా జనె నాతి భర్తకున్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      ఆవిడ కోడూరి కౌసల్యాదేవి లేదా యద్దనపూడి సులోచనారాణి అయి ఉంటుంది.

      తొలగించండి
    2. యద్దనపూడిసులోచనారాణిగారిరచనావ్యాసంగమునుప్రశంసించిగదా, నమస్కారములుగురువుగారు

      తొలగించండి
  11. సమస్య :-
    “కలము ధరించి చనె సతి సుఖంబిడఁ బతికిన్”

    *కందం**

    ఇల దొంగల భయము పెరిగె
    నిలువగ జేసిన కనకము నిద్రయు కరువౌ
    తలయుచు బంగారమ్ము స
    కలము ధరించి చనె సతి, సుఖంబిడఁ బతికిన్
    .....................✍️చక్రి

    కాన్పుకై పుట్టింటికి వెళుతూ...

    రిప్లయితొలగించండి
  12. పట్టు చీరను వలదని పలుచనైన

    కురచ లంగాను తానెంచు కొని చను యుగ


    ళము కనబడు కంచుక శక. లము ధరించి

    చనె సతి సుఖం బిడ పతికిన్ సంత సముగ

    రిప్లయితొలగించండి
  13. అలిగిన పతి సరసకు కులు
    కులనీనుచు కదిలె తెల్ల కోకయు మల్లెల్
    విలువైన నగలు తాఁ బు
    ష్కలము ధరించి చనె సతి సుఖంబిడఁ బతికిన్

    రిప్లయితొలగించండి
  14. వలపుల రాచజోదు విరి బాణపు తాకిడి తాళలేక తొ
    ట్రిలుచు ముఖానితిన్ విడిచి రేదొర వెన్నెల నీను చుండగా
    నలిగిన భర్త సన్నిధికి యందెలు బంగరు సొమ్ములెన్నొ పు
    ష్కలము ధరించి శోభనసుఖంబిడఁగాఁ జనె నాతి భర్తకున్

    రిప్లయితొలగించండి


  15. వలచె ప్రియసఖుని తనివా
    ర! లెస్స కల్యాణమయ్యె! రాధన మిదియే
    తలనిండ పువ్వులను పు
    ష్కలము ధరించి చనె సతి సుఖంబిడఁ బతికిన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  16. తొలి రేయి వలపు జూపుచు
    వలువలకత్తరు పులిమిన పరివా సముతో
    తలలో మల్లెలు బోలు స
    కలము ధరించి చనె సతి సుఖంబిడఁ బతికిన్

    రిప్లయితొలగించండి
  17. తలపులనిండ నాథుని, సుత్రాముని
    మారుని వంటిరూపమే
    మిలమిలలాడు కన్నులను మీరినసిగ్గున నేలవాల్చుచున్
    కిలకిలలాడు చేడియల క్రీడను క్షీరపు
    పాత్ర కేలపు
    ప్కలము ధరించి శోభన సుఖంబిడగా
    జనె నాతి భర్తకున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విలువగు బహుమతి గెలువగ
      లలనల పక్షంబున కథ వ్రాయగ
      స్పర్ధన్
      వెలుపలి గదికిన్ పత్రము
      కలమును ధరించిజనె సతి, సుఖంబిడ పతికిన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'సుత్రాముని' అన్నపుడు 'సు' గురువై గణభంగం.

      తొలగించండి
    3. ధన్యవాదములు గురుదేవా! సవరిస్తాను! 🙏🙏🙏

      తొలగించండి
    4. సవరించిన పూరణ

      తలపులనిండ నాథుని సుతారపు
      మన్మథ చేష్టలేదగన్
      మిలమిలలాడు కన్నులను మీరినసిగ్గున నేలవాల్చుచున్
      కిలకిలలాడు చేడియల క్రీడను క్షీరపు
      పాత్ర కేలపు
      ప్కలము ధరించి శోభన సుఖంబిడగా
      జనె నాతి భర్తకున్

      తొలగించండి
  18. కె.వి.యస్. లక్ష్మి:

    తలపులు తన్మయ మొందగ
    వలపుల రాగము బలికెడి వదనము తోడన్
    ఎలమిని గూడుచు తానె స
    కలము ధరించి చనె సతి సుఖంబిడఁ బతికిన్.

    రిప్లయితొలగించండి
  19. పలుకావ్యంబుల రచనను
    సలిపిన రమణుని కరములు సడలిన వేళన్
    పిలిచిన వెంటనె శయమున
    కలము ధరించి చనె సతి ,సుఖంబిడఁ బతికిన్

    రిప్లయితొలగించండి


  20. అనఘా! వ్రాసెను బింబా
    నన కలము ధరించి, శోభన సుఖంబిడఁగాఁ
    జనె నాతి భర్తకున్ తొలు
    త నమోవాకమ్ములిడి, కథను సాగించెన్ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  21. కలలోనైనను కవితల
    కలకలమునురేపుచుండు కాంతామణికిన్
    కలిగెను కోరిక పతిగన
    కలము ధరించి చనె సతి సుఖంబిడఁ బతికిన్

    రిప్లయితొలగించండి
  22. కలికి కవిత్వమన్న కడు కాంక్ష పెనంగగ నెల్ల వేళలన్
    కలవర పెట్టుచుండు తన కాంతుని శాంతిని కోలుపోవగన్
    కలుగగ కోర్కె భర్త తన కాంతను రమ్మనె కామ కేళికిన్
    కలము ధరించి శోభనసుఖంబిడఁగాఁ జనె నాతి భర్తకున్

    రిప్లయితొలగించండి
  23. కలువలబోలుకళ్ళుచురుకైనమనంబునుమొల్కనవ్వులున్
    కలకలలాడుమోముచిలుకన్ దలపించెడుబల్కులున్ దలన్
    బలువిధపుష్పముల్ దనువు బంగరువన్నెరతీమతల్లియో
    మిలమిలమేనకాంగనయొమేలగుపద్మినిలక్షణాలువ
    *“ల్కలము ధరించి శోభనసుఖంబిడఁగాఁ జనె నాతి భర్తకున్”*

    రిప్లయితొలగించండి
  24. ఫలములు పూలు తిండులును పాలును యవ్వన పొంగు హంగులున్

    తలపుల తట్టు నాట్యముల తాకిడినోపగలేక పొర్లు బా

    ధల పతి వేచియుండగను ధారగ శోభన గాథ వ్రాయగన్

    కలము ధరించి శోభనసుఖంబిడఁగాఁ జనె నాతి భర్తకున్”

    .....భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  25. కందం
    తలపుల కవిత్వ భావము
    లొలికిన వెంటనె లిఖించు నూతముఁ గకర
    మ్ముల చరవాణి! నదియె కా
    కలము! ధరించి చనె సతి సుఖంబిడఁ బతికిన్!!

    చంపకమాల
    తలపులనూరు భావములఁ దత్క్షణమున్ చరవాణి పేటి పై
    యెలమిని వ్రాయఁజూడఁ గవయిత్రికి నుండఁగఁ మేనిభాగమై
    వలపులఁ బాలలో గలిపి, వాడని మల్లెలు, నామెదైన కా
    కలము ధరించి శోభనసుఖంబిడఁగాఁ

    రిప్లయితొలగించండి
  26. నిన్నటి పూరణ

    కవుల కలమ్ము మంథరము, కాగితమయ్యె పయోధి, త్రాడు నా
    యవధులు దాటు మంజులరసార్ద్రలసన్మధురోహలై దగన్
    కవనసుధోక్తిధారలవి కమ్రసుహృద్వరరంజితమ్ములౌ, నిటుల్
    కవుల మనోజ్ఞకల్పనయె కాక పయోనిధిఁ ద్రచ్చ సాధ్యమే.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  27. వలచిన వాడై నవరుని
    తలచిన శుభలగ్న మందు తాఁబెండ్లాడన్
    తొలిరాత్రికి మురిసి, పయో
    కలము ధరించి చనె సతి సుఖంబిడఁ బతికిన్.

    రిప్లయితొలగించండి
  28. ఈనాటి శంకరాభరణం వారిచ్చిన

    సమస్య

    *“కలము ధరించి చనె సతి సుఖంబిడఁ బతికిన్”*
    (లేదా…)
    *“కలము ధరించి శోభనసుఖంబిడఁగాఁ జనె నాతి భర్తకున్”*

    కందము

    వలపుల చెలికాని యెదుట
    చెలువపు శృంగారమొలుక చిరునగవులతో
    కలహంస నడకలమర స
    కలము ధరించి చనె సతి సుఖంబిడఁ బతికిన్

    చంపకమాల

    పలుకులఁ దేనియల్ జిలుకు భాషణ మాడినఁ గావ్య కంఠియే
    చెలియలి కావ్యముల్ దలచ చేతన శోభిత రాజసంబులౌ
    లలనయు భర్తకున్ దనదు లాస్యవిశోభిత సుందరంబునౌ
    కలము ధరించి శోభన సుఖంబిడగాఁ జనె నాతి భర్తకున్

    ఆదిభట్ల సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  29. కలవరమొందకేవగలుగన్పడనీయకమేలిపూలుపు
    ష్కలముధరించియౌవనముగాన్కనొసంగగసిగ్గుమొగ్గలన్
    వలపునదాచిమన్మధునిభాషలుగన్పడనీకకామశా
    *“కలము ధరించి శోభనసుఖంబిడఁగాఁ జనె నాతి భర్తకున్”*

    రిప్లయితొలగించండి
  30. మైలవరపు వారి పూరణ

    పొలతుక న్యాయవాది., తలపోసెను కోరినకోర్కెలన్ని కా...
    కలమున వ్రాసియుంచుకొనగా తొలిరేయిని.,కాంచనాది సం...
    కలితశుభాంగి క్షీరచషకమ్మొకచేత., మరొక్క చేతిలో
    కలము ధరించి, శోభనసుఖంబిడగా జనె నాతి భర్తకున్!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  31. కలిమిని గోరక కులమును
    దలపక నెలతకును మేలు చదువని దెల్పన్
    వలపుల పుల్కలు పెరిమిగ
    కలము ధరించి చనె సతి సుఖంబిడఁ బతికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురువర్యా 🙏

      సవరించిన రెండవ పాదం:

      దలపక నెలతకు చదువులు నప్పని దెల్పన్

      తొలగించండి
  32. అలకాపురియందుండుచు
    విలసిత యవ్వనముతోడ వెఱగుంజెందన్
    వలపుల ఱేనిని గలువస
    కలముధరించిచనెసతిసుఖంబిడబతికిన్

    రిప్లయితొలగించండి
  33. సలలిత రాగాలాపము
    చెలరేఁగ చిలుకలకొలికి శీఘ్రంబుగఁ దా
    నలవోకగ గాజులు పు
    ష్కలము ధరించి చనె సతి సుఖం బిడఁ బతికిన్


    కలువల ఱేని మించిన ముఖమ్ము వెలుంగ నతోత్తమాంగియై
    లలితపు లజ్జితానన ధరాసుత మెల్లఁగఁ జేత నూనుచున్
    ఫలములు పాలు మూలముల పళ్లెము పంచవటిన్ విశుద్ధ వ
    ల్కలము ధరించి శోభన సుఖం బిడఁగాఁ జనె నాతి భర్తకున్

    రిప్లయితొలగించండి
  34. చం:

    తెలిపిన గాని మున్నె కడు తెర్పియె లేక రచించు నంచనన్
    కలవర మొందకుండగను గైకొనె కన్నియ సంభ్రమమ్మునన్
    వెలవెల బోయె మోము గనిపించగ నింతయు జంకు లేకయున్
    కలము ధరించి శోభన సుఖంబిడగా జనె నాతి భర్తకున్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  35. వలపులభర్తనున్ గలువబాఱెడుసంతసమొప్పమేటివ
    ల్కలముధరించిశోభనసుఖంబిడగా జనెనాతిభర్తకున్
    లలనలబొందుగోరుదురు లాస్యపురీతినిభర్తలత్తఱిన్
    దలపునవచ్చుటన్సతులుతద్దయునాపగరానిమోహమున్

    రిప్లయితొలగించండి
  36. ఎలమిని వలచిన ప్రియుడే
    వలపుల పూమాలవైచి పరిణయ మాడన్
    చిలిపిగ నిక విడియపు శా
    కలము ధరించి చనె సతి సుఖంబిడఁ బతికిన్!


    రిప్లయితొలగించండి
  37. ఎలమిని వలచిన ప్రియుడే
    వలపుల పూమాలవైచి పరిణయ మాడన్
    చిలిపిగ నిక విడియపు శా
    కలము ధరించి చనె సతి సుఖంబిడఁ బతికిన్!


    రిప్లయితొలగించండి
  38. చెలి కడుప్రేమతోడుతను చిక్కె కళత్రముగా గృహమ్మునన్
    కలలను కాంచగా పగటి కాలము నంతయు భర్త యామెకై
    గలగలమంచు మ్రోవగను గజ్జలసవ్వడి ప్రీతి స్నిగ్ద వ
    ల్కలము ధరించి శోభనసుఖంబిడఁగాఁ జనె నాతి భర్తకున్

    రిప్లయితొలగించండి
  39. గు రు మూ ర్తి ఆ చా రి , వెలుగోడు
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    గురువర్యునికి పాదనమస్కృతులు • నిన్నటి పూరణ
    స్వీకరింప మనవి •

    -----------------------------------------------------
    [ పోను పోను చివరకు వివాహాదిశుభకార్యములలో కూడా
    స్త్రీలు అసహ్యమైన పాశ్చాత్య వేషధారణ ధరింతు రేమో ! ]
    ---------------------------------------------------------

    తొలి నిసి c బట్టువస్త్రముల దొడ్గి - తళుక్కని పొల్చు హేమభూ

    షల సవరించి - యత్తరువు జల్లి - ముఖంబు నలంకరించి - పు

    వ్వుల సిగ యందునం దురిమి - పుత్తడిబొమ్మగ బెండ్లికూతురున్

    మలచిరి , చారులోచనలు | మానె న వన్ని భరించలేక , కో

    మల సుషమాంగయౌ వధువు | " మన్మథకౌతుక మెప్పుడున్ మదిన్

    గలుగును > పొంగునంగముల గాంచిన వేళ " నటంచు రొమ్ము క

    ప్పుల - నతి పల్చనైన నొక మూరెడు జంపు గ లట్టి వస్త్ర శా

    కలము ధరించి శోభనసుఖం బిడగా జనె నాతి భర్తకున్ |

    గలిసెను సంప్రదాయ గమనమ్ములు పంకిలకూప మందు | కాం

    తలు పరదేశనాగరికతన్ విడనాడుట. శ్రేయమౌ గదా !

    { తొలి నిసి = తొలి రాత్రి : తొడ్గి = తొడిగి : సవరించి =
    అలంకరించి : అత్తరువు = అత్తరు : మానెను =
    విడిచి వేసెను , త్యజించెను : సుషమ = సుకుమార
    మైన ‌, సుందరమైన : రొమ్ము కప్పులు = స్త్రీలు రొమ్ముపై
    ధరించు బ్రాసియర్సు : శాకలము = శకలము = ముక్క :
    వస్త్ర శాకలము = గుడ్డ ముక్క : పంకిలకూపము =
    బురద గుంట }

    *****************************************

    రిప్లయితొలగించండి
  40. వలువలు పట్టుని బరువని
    నెలతయు మదిలో ననెంచి నిజపతి తోడన్
    కలవగ తలచుచు తెలివ
    *ల్కలము ధరించి చనెసతి సుఖంబిడ పతికిన్*


    బిలబిలలాడుచున్ సఖులువేయచుపూలజడన్నటన్ వడిన్
    కిలకిలనవ్వుచున్నతివకేలునుపట్టుచులేవనెత్తుచున్
    కలకలలాడుమోమునటగాంచుచునుండగనాతి పట్టువ
    ల్కలము ధరించి శోభనసుఖంబిడఁగాఁ జనె నాతి భర్తకున్”*

    రిప్లయితొలగించండి