30, డిసెంబర్ 2020, బుధవారం

సమస్య - 3590

31-12-2020 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“సంతోషమొ నిన్నుఁ బంప సంతాపమ్మో”

(లేదా…)

“సంతోషమ్మున నిన్నుఁ బంపవలెనో సంతప్తచిత్తుండనై”

89 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    పంతంబెచ్చగ హస్తినాపురమునన్ పంజాబు సర్దార్లతో
    చింతన్ గూర్చెడి వైఖరిన్ గనగ నే శ్రీ మోడి నోదార్చగన్
    గంతుల్ వేయుచు రైతుసమ్మె చెరచన్ గారాబునన్ నారదా!
    సంతోషమ్మున నిన్నుఁ బంపవలెనో సంతప్తచిత్తుండనై...

    రిప్లయితొలగించండి
  2. సంతులతతపసిధర్మము
    అంతరద్రుష్టినికనుగోనెనామెభవితయున్
    వంతనుకూతునకనియెను
    సంతోషమోనిన్నుఁబంపసంతాపమ్మో
    కణ్వుడుశకుంతలతో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...ధర్మం। బాంతరదృష్టిని..." అనండి.

      తొలగించండి
  3. పంతము తో పనులన్నిటి
    సుంతయు కష్టంబు ననక చొరవగ జేయన్
    పొంతన తో నొన రించిన
    సంతోషమొ నిన్ను బంప సంతాప మ్మో !

    రిప్లయితొలగించండి
  4. అంతములేని కథలివే
    ఇంతీ! కల్యాణవేళ నింపుగ వరునిన్
    చెంతను నత్తారింటికి,
    సంతోషమొ, నిన్నుబంప సంతాపమ్మో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఒక తండ్రి ఆవేదన

      ఎంతో ప్రేమను బెంచితీను తరుణీ!
      యేనాటికైనన్ సుధీ
      మంతున్ చేగొని మెట్టినింటికిని శ్రీమంతంబుగా పోవలెన్
      వింతేమున్నది సాంప్రదాయ మిదియై వీడ్కొల్పెడిన్ వేళలో
      సంతోషమ్మున నిన్నుబంప వలెనో
      సంతప్త చిత్తుండనై

      తొలగించండి

    2. సుంతేనిన్ నెడబాయలేని సతియౌ
      సుశ్లోక భూజాతనున్
      బంతంబట్టుచు దానవాధముడు పెన్
      పాషాణ చిత్తంబునన్
      వంతల్ బెట్టగ దొంగలించె వనిలో
      వాతాత్మజా! జాడగొన్
      సంతోషమ్మున నిన్నుబంప వలెనో సంతప్త చిత్తుండనై
      చింతింపన్ బహుబుద్ధిశాలి వగునీ
      చేతన్ సుసాధ్యంబగున్

      తొలగించండి
    3. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    4. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు! 🙏🙏🙏

      తొలగించండి

  5. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    వింతౌ తీరున హైద్రబాదు విడగన్ వెన్వెంటనే పట్టుచున్
    వంతల్ చేర్చి కరోన వ్యాధి యొసగన్ వైరాగ్య భావమ్మునున్
    చింతన్ దీర్చగ కంది శంకరులకున్ శ్రీశాస్త్రి వృద్ధుండయో!
    సంతోషమ్మున నిన్నుఁ బంపవలెనో సంతప్తచిత్తుండనై......

    రిప్లయితొలగించండి
  6. చెంతన కౌరవసంతతి
    వింతగు తమ తీరుజూపవిస్మయమాయెన్
    అంతా నీదయకృష్ణా
    సంతోషమొ,నిన్నుబంప సంతాపమ్మౌ
    ++******++++*++++++++
    రావెక పురుషోత్తనరావు

    రిప్లయితొలగించండి
  7. సమస్య :
    సంతోషమొ నిన్ను బంప సంతాపమ్మో

    ( పద్మవ్యూహ విచ్ఛేదన కోసం వెళ్లుతానంటున్న అభిమన్యునితో ధర్మరాజు )

    ఎంతగ నెదిగితివయ్యా !
    సుంతైనను నిను విడువగ స్రుక్కుచునుంటిన్
    జెంతను దండ్రియు లేడే !
    సంతోషమొ ! నిన్ను బంప సంతాపమ్మో !!

    రిప్లయితొలగించండి
  8. కుంతి కనిష్టుని సుతుడవు
    పంతముతో కదనమాడి పగతురనట నీ
    వంతము జేయ కదలితివి
    సంతోషమొ నిన్నుఁ బంప సంతాపమ్మో

    రిప్లయితొలగించండి
  9. పంతముబట్టకు సీతా!!
    నంతయుమననొసటలిఖితమంతయు మేలౌ
    కొంతగనోరిమి గలిగిన
    సంతోషమొ,నిన్నుబంప సంతాపమ్మౌ
    ++******++++*++++++++
    రావెక పురుషోత్తనరావు

    రిప్లయితొలగించండి
  10. ఎంత మురిపముగ పెంచితి

    సుంతయువెట్టకను సేగి సుత సుకృతిన ధీ

    మంతుడు హరియల్లుడనగ

    సంతోషమొ నిన్నుఁ బంప సంతాపమ్మో


    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  11. కౌంతేయుండగు క్రీడి లేనితరి చక్రవ్యూహమున్ బన్నె తా
    పంతంబందున విప్ర ద్రోణుడని నన్ బంధింపగానెంచి, నం
    దంతా! నీవనికేగనెంచితివి నీధైర్యంబునే గాంచుచున్
    సంతోషమ్మున నిన్నుఁ బంపవలెనో సంతప్తచిత్తుండనై

    రిప్లయితొలగించండి
  12. ధర్మరాజు అభిమన్యుని తో...

    కందం
    అంతటి పద్మవ్యూహపు
    టంతెరిగిన వాడవంచు 'నభిమన్యా! గ
    త్యంతరము లేదన సుతా!
    సంతోషమొ? నిన్నుఁ బంప సంతాపమ్మో?

    శార్దూలవిక్రీడితము
    మంతవ్యుల్ గురు కుంభసంభవులు పద్మవ్యూహమున్ బన్నిరే!
    చింతన్దీర్పఁగ తండ్రి లేరు కనుకన్ ఛేదించు వీరా! యభీ!
    కొంతైనన్ వెనువెంట సాయమిడగన్ గూడేము వత్సా! మరే
    సంతోషమ్మున నిన్నుఁ బంపవలెనో? సంతప్తచిత్తుండనై!

    రిప్లయితొలగించండి
  13. అందరికీ నమస్సులు🙏

    పంతమ్మేల సమాదరించగ హితుల్ బాంధవ్య మోహంబునన్
    అంతా బ్రాంతిగ నమ్మి కూతునిడగన్ నౌదార్యముంజూపుచున్
    చింతల్దీరగనిట్లు బెంగపడకన్ చిత్తంబు శాంతించునా!
    *సంతోషమ్మున నిన్ను బంప వలెనో సంతప్త చిత్తుండనై*


    *వాణిశ్రీ నైనాల, విజయవాడ*

    రిప్లయితొలగించండి
  14. 2020 కి వీడ్కోలు గా ఈ నా ప్రయత్నము:

    శా:

    ఎంతోదూరము లేదు నిశ్చయము నీ యేడాది మారంగ నై
    చింతేలేదను రీతినిన్ నిరుడు విశ్లేషింప తీర్మానమున్
    పంతంబెంచి కరోన వ్యాప్తి గలుగన్ పాటింప జాగ్రత్తలున్
    సంతోషమ్మున నిన్ను బంప వలెనో సంతప్త చిత్తున్డనై

    నిరుడు: 2019 , అప్పుడింకా కరోనా భయం లేకుండె.

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  15. ఈనాటి శంకరాభరణం వారిచ్చిన

    సమస్య

    *“సంతోషమొ నిన్నుఁ బంప సంతాపమ్మో”*
    (లేదా…)
    *“సంతోషమ్మున నిన్నుఁ బంపవలెనో సంతప్తచిత్తుండనై”*

    కందము

    ఎంతో కాలము పెంచితి
    చెంతకు మీవారు వచ్చె చేకొని పోవన్
    చింతలు విడువుము బిడ్డా
    సంతోషమ్మొ నినుఁ బంప సంతాపమ్మో

    శార్దూలము

    ఎంతో కాలము ప్రేమఁజూపుచును న న్నిన్నాళ్ళు సేవించితౌ
    సంతానమ్ము సదాప్రమోద మొసగున్ సంప్రాప్తమోదమ్మునై
    కాంతానీవికఁ బోయిరమ్ము ముదమున్ గారాల పుట్టింటికిన్,
    సంతోషమ్మున నిన్నుఁబంప వలెనో సంతప్తచిత్తుండనై

    ఆదిభట్ల సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  16. తండ్రి బిడ్డను అత్తవారింటికి పంపుతూ:

    ఎంతో ప్రేమగ బెంచినాడ నిను నీ
    యింటన్ సదా లక్ష్మిగన్
    సుంతైనన్ మది కష్టమీయ మనసున్ జొప్పిల్లకన్ నాదరిన్
    చింతాక్రాంతవు గాకుమా తనయ నీ శ్రేయంబునే కోరెదన్
    సంతోషమ్మున నిన్నుఁ బంపవలెనో- సంతప్తచిత్తుండనై!

    రిప్లయితొలగించండి


  17. అంతయు మాయయె! పుట్టుక
    వింతయె జీవి మరణమ్ము వింతయె నడుమన్
    సొంతము కొనియాడితినే!
    సంతోషమొ నిన్నుఁ బంప సంతాపమ్మో!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  18. పంతము బట్టుచు నడిగిన
    దంతను గారవము తోడ నల్లునికిడితిన్
    తంతును జరిపించితినిక
    సంతోషమొ నిన్నుఁ బంప సంతాపమ్మో

    రిప్లయితొలగించండి
  19. శ్రీ గురుభ్యోనమః

    అంశము: దశరధుడు శ్రీరాముని విశ్వామిత్రుని తో పంపించు సమయాన వ్యగ్రతతో

    శా.
    ఎంతో ముద్దుగ బెంచినారము గదా యెట్లోర్తునీ బాధనే
    సంతానమ్మది పెంచి తుంచునహహా సంతోష సంతాపముల్
    వింతేమున్నది క్షాత్రధర్మము సదా విశ్వాసరక్షార్ధమే
    సంతోషమ్మున నిన్నుఁ బంపవలెనో సంతప్తచిత్తుండనై

    దుర్భ కృష్ణశాస్త్రి

    రిప్లయితొలగించండి
  20. అంతము చేయగ వచ్చె ను
    వింత కరోనా జగతియు విలవిల లాడెన్
    సుంతయు మేలొన రింపని
    సంతోష మొ నిన్ను బంప సంతాప మ్మో

    రిప్లయితొలగించండి
  21. చింతాస్వాంత నదీ మతల్లి వధువై శ్రీశాబ్ధి ధౌరేయుడై
    యెంతోవింతగ సాగి సాగి తుదకా యీశున్ బ్రశాంతాంకమున్
    బంతంబూడగ జేరె గారవముతో బాధోపశాంత్యర్థమై
    *“సంతోషమ్మున నిన్నుఁ బంపవలెనో సంతప్తచిత్తుండనై”*

    రిప్లయితొలగించండి
  22. వింతానందము స్వాంత శాంతము మహావీరుండు రాధేయుడే
    పంతంబెచ్చగ మత్స్య యంత్రమును సప్తద్వీప మందేయుచో
    సొంతంబౌ వధువీ సుయోధను కనన్సూచించె బాంచాలుడే
    *“సంతోషమ్మున నిన్నుఁ బంపవలెనో సంతప్తచిత్తుండనై”*

    రిప్లయితొలగించండి
  23. అంతయు బాగుగ నుండని,
    ప్రాంతము దూరము నయినను బంపితి చదువుల్
    వాంతులతోవచ్చినసుత
    సంతోషమొ నిన్ను బంప సంతాప మ్మో !

    రిప్లయితొలగించండి
  24. 31.12.2020
    అందరికీ నమస్సులు🙏

    నా పూరణ ప్రయత్నం..

    *కం||*

    అంతము గావచ్చుననుచు
    వింతగు నీ రోగమొకటి విశ్వము నందున్
    ఎంతయొ కొంతయు దప్పక
    *“సంతోషమొ నిన్నుఁ బంప సంతాపమ్మో”*

    *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
    🙏

    రిప్లయితొలగించండి
  25. మైలవరపు వారి పూరణ

    స్వాంతంబందు కలుక్కుమంచునెదొ భావంబయ్యె నీనాడు మ...
    చ్చింతారత్న శకుంతలాఖ్య చనునన్., చేష్టావిహీనుండనై
    చింతన్ బొందితి మౌనినయ్యు., నకటా!సేమంబులన్ బొందుమా!
    సంతోషమ్మున నిన్నుబంప వలెనో సంతప్త చిత్తుండనై!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  26. చింతిన్చన్ సమభావనల్గలుగరంజిల్లున్ గదా భాగ్యమై
    వింతేమున్నది బేధభావనలదీవించన్ చిరంజీవులన్,
    చింతాక్రాంతుడుఁదండ్రితానుగదల‌ంచెన్గూతురున్జూచుచున్
    "సంతోషమ్మున నిన్నుఁ బంపవలెనో సంతప్తచిత్తుండనై"

    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  27. సంతాపమ్మునుదెచ్చె కీటకములాశా పాశ బంధమ్ములిం

    తింతై జీవుల ముంచె నంతయునునిత్తీరున్ జనెన్నేడు, నే

    సంతోషమ్మున నిన్నుఁ బంపవలెనో సంతప్తచిత్తుండనై

    చింతల్గాంచనొ, వచ్చు వర్షమున పేచీలెన్ని రానున్నవో

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  28. కొంత ధనంబు తరుగగా
    కొంతైనా మేలొరిగె కుటుంబము గలువన్!
    వింతైన వత్సరంబా
    సంతోషమొ నిన్ను బంప , సంతాపమ్మో ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
  29. అంతమ్మాయెగ వత్సము
    సంతోషమె, నిన్నుబంప సంతాపమ్మో
    సుంతైనలేదు పొమ్మిక
    వింతగ కోవిడును గూడి వెతలను గూర్చెన్

    రిప్లయితొలగించండి
  30. అంతం జేయగ రాక్షసాళి జనగా
    నాచార్యునిన్ వెంటనున్
    పంతంబట్టగ గాథిసూనుడకటా!
    బాలుండవే రామ! నే
    క్షంతవ్యుండను సత్యవాక్కు నిలుపన్
    క్షాంత్రంపు ధర్మంబునై
    సంతోషమ్మున నిన్నుబంప వలెనో సంతప్త చిత్తుండనై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అంతం' అన్నది వ్యావహారికం.

      తొలగించండి
    2. సవరించిన పూరణ!

      అంతున్ జూడగ రాక్షసాళి జనగా
      నాచార్యునిన్ వెంటనున్
      పంతంబట్టగ గాథిసూనుడకటా!
      బాలుండవే రామ! నే
      క్షంతవ్యుండను సత్యవాక్కు నిలుపన్
      క్షాంత్రంపు ధర్మంబునై
      సంతోషమ్మున నిన్నుబంప వలెనో సంతప్త చిత్తుండనై

      🙏🙏🙏

      తొలగించండి
  31. చింతాక్రాంతము జేసితే నరులనే చేజారె నుద్యోగముల్,
    యింతింతై చెలరేగి కాలగతిలో నీవింక నేగన్భయ
    భ్రాంతుల్ గాగను లోకమంత; బిలువన్ రమ్మంచు నూత్నాబ్ది నే
    సంతోషమ్మున నిన్నుఁ బంపవలెనో సంతప్తచిత్తుండనై.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఉద్యోగముల్+ఇంతింతై' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  32. గొంతుక నిండుగ ద్రాగుచు
    గంతులుదావేయుచుండ్రు గర్హ్యులు గానన్
    నంతర్వేదికిరమ్యా!
    సంతోషమొ నిన్నుబంప సంతాపమ్మో

    రిప్లయితొలగించండి
  33. భార్యను పురిటికి పుట్టినింటికి పంపుతూ:

    సంతానముకలుగుననెడు
    సంతోషపుసమయమందు సఖినీ విరహం
    బెంతోకష్టంబరయగ
    సంతోషమొ నిన్నుఁ బంప సంతాపమ్మో

    రిప్లయితొలగించండి
  34. స్వాంతమ్ము పిక్కటిల్లును
    భ్రాంత మతిని సంత తానురాగం బడరన్
    వింతగఁ బతితో నిత్తరి
    సంతోషమొ నిన్నుఁ బంప సంతాపమ్మో


    ద్వాంతారాతియె నిష్ప్రభా యుతముగాఁ దా నుండునే యట్టులం
    జింతాక్రాంతత నుండఁ జాల నిట నీ చేదోడుగా నుండఁగాఁ
    గాంతారమ్మున కేను వచ్చు టది నిక్కంబే చుమీ యగ్రజా
    సంతోషమ్మున నిన్నుఁ బంపవలెనో సంతప్తచిత్తుండనై

    రిప్లయితొలగించండి
  35. ఎంతో ప్రేమగ గాంచి పెంచితిఁ గడున్నింపైన యాపేక్షతో
    చెంతన్ చేరక యున్న,నిన్ను కనగా చేతమ్మువాంఛించెడిన్
    స్వాంతమ్మందున బాధ కల్గినను కళ్యాణమ్ముతో భర్తతో
    సంతోషమ్మున నిన్నుఁ బంపవలెనో సంతప్తచిత్తుండనై

    రిప్లయితొలగించండి
  36. చింతన్జెందకుమమ్మ!యిప్పుడదగన్ శేషుండువచ్చున్గదా
    సంతోషంబుననిన్ను బంపవలెనోసంతప్తచిత్తుండనై
    యెంతంగాదన నింతులందఱునుదామేగంగ గానొప్పుగా
    సంతోషంబుననేగభర్తకుదరిన్ సాధ్వీమణౌనాతికిన్

    రిప్లయితొలగించండి
  37. సంతోషంబుల నీరుగార్చితివి యేసందర్భ మందేనియున్
    చింతాక్రాంతతనే మిగిల్చితివిగా జీవచ్ఛవాలట్లు వి
    భ్రాంతిన్జెందగజేసినావుగదనో రాకాసి సంవత్సమా!
    సంతోషమ్మున నిన్నుఁ బంపవలెనో సంతప్తచిత్తుండనై

    రిప్లయితొలగించండి
  38. ఎంతో మమతను చూపుచు
    చింతయు నొందకను పెండ్లిచేసితినమ్మా
    వింతగు వేదన తోడను
    సంతోషమొ నిన్నుబంపసంతాపమ్మౌ

    రిప్లయితొలగించండి
  39. ఎంతో ప్రేమగ బెంచి గాచితివి నేడిట్లేల నీవీ విధిన్
    చింతాక్రాంతుని జేసి బోతివకటా జెప్పంగనే లేదయో
    సంతృప్తంబగు పూర్ణ జీవనము నాస్వాదించి నీవేగినన్
    సంతోషమ్మున నిన్నుఁ బంపవలెనో సంతప్తచిత్తుండనై

    రిప్లయితొలగించండి