4, జులై 2021, ఆదివారం

సమస్య - 3772

5-7-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మతి సెడినవారి దైవముమాధవుండు”
(లేదా...)
“మతి సెడినట్టి వారలకుమాధవుఁడే నిజమైన దేవుఁడౌ”

59 కామెంట్‌లు:

  1. అతుల మహానురక్తిని మహాశివుఁ గొల్చెడి శైవులందురే
    "మతి సెడినట్టి వారలకు మాధవుఁడే నిజమైన దేవుఁడౌ"
    నతులయి వైష్ణవుల్ హరిని నమ్ముచుఁ గొల్చుచు నిట్టులందురే
    "మతి సెడినట్టి వారల కుమాధవుఁడే నిజమైన దేవుఁడౌ"

    రిప్లయితొలగించండి
  2. క్రొవ్విడి వెంకట రాజారావు:

    దైవ మెక్కడ ననియెడి తర్కమెంచి
    బుధుల జ్ఞాన బోధలతోడ బుద్ధి గలిగి
    ఆస్తికత్వము తోడను నాస్తికమగు
    మతి సెడిన వారి దైవము మాధవుండు.

    రిప్లయితొలగించండి
  3. అతులితపారవశ్యమునయాదవువెంటనుగోపికల్వడిన్
    పతనముగాగబాహ్యములుభాసురసంగతికూడియాడగా
    గతియికమోక్షమాయెనుగకాంతలగోప్యమువెల్గుచూచెనే
    మతిసెడినట్టివారలకుమాధవుడేనిజమైనదేవుడౌ

    రిప్లయితొలగించండి
  4. అన్యమైనట్టిభావననాశపడక
    చిత్తమీశునియందునచిందులేయ
    లౌక్యభ్రాంతినివీడుచులోనగనుచు
    మతిసెడినవారిదైవముమాధవుండు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూడవపాదంసవరణ
      లౌక్యభ్రాంతినివీడియలౌక్యమందు

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'లౌక్యపున్ భ్రాంతినే వీడి లక్ష్యమెంచి' అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
  5. హితమిడు నాత్మబంధువు, స
    హేతుక చింతన నింపువారిలో
    ధృతినిడు సర్వపాలకుడ,
    నేకత నేకత జూపు తత్వమౌ,
    స్థితి గనలేక యోచన ర
    చింపగ లేని వ్యధార్త జీవులై
    మతి సెడినట్టి వారలకు,
    మాధవుఁడే నిజమైన దేవుఁడౌ!

    రిప్లయితొలగించండి
  6. అర్జునుడు యుద్ధమున శ్రీకృష్ణుని సైన్యపు సాయము వలదని, ఆయుధము ధరింపననిననూ గోవిందునొక్కని కోరుకున్న సందర్భములో దుర్యోధనుని మానసం...

    తేటగీతి
    జూదమందున గెల్వఁగఁ జూడబోక
    పాసెనే యరణ్యాజ్ఞాత వాసములవి?
    సాదిగ నిరాయుధుఁడొకండు సాయపడునె?
    మతి సెడినవారి దైవముమాధవుండు!

    చంపకమాల
    గతమున జూదమున్ గెలువఁ గాచెనె నమ్మఁగ పాండవేయులున్?
    హితమొనరించెనే వనమునేగెడు బాధలు తప్పగా?, ననిన్
    జతపడ సాదిగా నొకఁడు చాలునె నెగ్గ నిరాయుధుండుగన్?
    మతి సెడినట్టి వారలకుమాధవుఁడే నిజమైన దేవుఁడౌ!

    రిప్లయితొలగించండి

  7. (శిశుపాలుడు కృష్ణునకగ్రతాంబూలమిచ్చుచున్న పాండవులను కృష్ణుని కలిపి దూరిన సందర్భము)


    మగటిమగల వాడెవ్వడు మగువనిట్లు
    పంచుకొందురె భార్యగా వసుధ యందు
    నిట్టి యప్రయోజకులగు హీనులైన
    మతి సెడినవారి దైవము మాధవుండు.



    క్రతువున యాదవాన్వయుడు గారవమందుట గాంచినట్టి దు
    ర్మతి శిశుపాలుడా సభను మంథరమందుచు వాగెనిట్లుగా
    ప్రతిఘలు భామనొక్కతికి భర్తలుగా గల నీచులీ భువిన్
    మతిసెడినట్టి వారలకు మాధవుఁడే నిజమైన దేవుడౌ.

    రిప్లయితొలగించండి
  8. మరులుగొన్న గోపికలకు మనసు చెడెను

    మధుర నాదము విని రాధ మనసు చెడెను

    వాని గని ముని జగతిని వలదుయనును

    మతి సెడినవారి దైవముమాధవుండు

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వలదు+అనుచు' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. "వలదటంచు" అనండి.

      తొలగించండి
  9. హరి హరులకు భేదము లేద నందురు గద
    యట్టి యెడ శైవు లొకచోట నాగ్ర హమున
    మతి సెడిన వారి దైవము మాధవుండ
    నుట ను ఖండించు టొప్పగు నుర్వి యందు

    రిప్లయితొలగించండి
  10. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వితమునుగాని వాదనలు పెంపుగజేసి చిదాత్మనుదెల్వ గోరుచున్
    మతిగతిలేని వ్యర్థమగు మౌఢ్య వితర్కములెంచు లోచనుల్
    కృతమతులైన జ్ఞానులెఱిగించు పరిజ్ఞను నాస్తికమ్మునౌ
    మతి సెడినట్టి వారల కుమాధవుఁడే నిజమైన దేవుఁడౌ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వితమునుగాని వాదనలు పెంపుగజేసి చిదాత్మ నెంచగన్
      మతిగతిలేని వ్యర్థమగు మౌఢ్య వితర్కములెంచు లోచనుల్
      కృతమతులైన జ్ఞానులెఱిగించు పరిజ్ఞను నాస్తికమ్మునౌ
      మతి సెడినట్టి వారల కుమాధవుఁడే నిజమైన దేవుఁడౌ.

      తొలగించండి
  11. కుచేలోపాఖ్యానము

    సతతము భక్తిమార్గమున శౌరినిగొల్చుచు నాత్మచింతన
    న్నితరము నేమిగోరకయె యింతిని సంతును విస్మరించగా
    హితమును గోరిభార్యయనె "హీనముగాదుగ కోర సాయ మా
    మతి సెడినట్టివారలకు మాధవుడే నిజమైన దేవుడౌ"

    ఆమతి = ఆదాయము (ఆం.భా.)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శిశుపాలుడు
      సతుల కోకల హరియించు జారుడితడు
      నితరుల కయిన కన్యక నేలుకొనెను
      స్తుతమతీతడే కొలువగా తోషమంది?
      మతి చెడినవారి దైవము మాధవుండు

      తొలగించండి
    2. అతులిత గానమాధురిని హాయిగ బంచగ వేణువూదుచున్
      పతులను సంతునంతటిని పల్లెను వీడుచు బర్వులెత్తుచున్
      బ్రతుకున కర్ధమియ్యదని రాసముసేయగ రాత్రివేళలో
      మతి సెడినట్టివారలకు మాధవుడే నిజమైన దేవుడౌ

      తొలగించండి
  12. ~~~~~~~~~~~~~~~~~

    సతతము దేవుడొక్కడను సత్య

    ము నెర్గని మూర్ఖ మానవుల్

    యతులిత చంద్ర శేఖరుడె యద్భు

    త దైవమటంచు గొల్చుచు

    న్నితరుల సేవజేయు జను లెల్లర

    దూరుచు నందురిట్టులన్

    మతి సెడినట్టి వారలకు మాధవు

    డే నిజమైన దేవుడౌ

    ~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "సత్య మెఱుంగని" అనండి. 'మానవుల్+అతులిత' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె.వి.యస్. లక్ష్మి:
      గాంగుడా! కుటిలాత్ముడౌ కంబుధరుడు
      అగ్రపూజ నొందుట కిట నర్హు డగునె
      యనుచు శిశుపాలు డీవిధి నాలపించె
      మతి సెడినవారి దైవముమాధవుండు!

      ఈతి బాధల తేలుచు నిహము నందు
      దైవ చింతనే లేకను తనరు చుండి
      కష్టకాలము నందున గతిని గనని
      మతి సెడినవారి దైవముమాధవుండు.

      తొలగించండి
  14. చం:

    సుతి చని మాటలాడుచును చూచిన వారల దుమ్ము రేపుచున్
    సతి యను సక్తి లేక మరి జాలి దయెంచక నింద లేయగా
    పతియగు టెంచి కోపమున బల్కెను బుద్ధి నొసంగ వేగమై
    మతి సెడి నట్టి వారలకు ; మాధవుడే నిజమైన దేవుడౌ

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  15. అడదడిన బరువపు నిర్ణయాధిపతియె
    యుచిత వృద్ధాప్య భరణము నొసగు యను
    మతి సెడినవారి దైవము ; మాధవుండు
    ధన్యులకు కలకాలము దైవమెగద

    అడదడి = ప్రభుత్వము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "అడదడిని.. నొసగు ననుచు" అనండి.

      తొలగించండి
  16. విశ్వమోహన రూపమ్ము వివశపరచ
    మాటి మాటికి దర్శింప మనసు బుట్ట
    వేణు గానమ్ము దరిజేరి వేఱడించ
    మతి సెడినవారి దైవముమాధవుండు

    రిప్లయితొలగించండి
  17. సతతము దేవుడొక్కడను సత్య
    మెరుంగని మూర్ఖ మానవు
    ల్లతులిత చంద్ర శేఖరుడె యద్భు
    త దైవమటంచు గొల్చుచు
    న్నితరుల సేవజేయు జను లెల్లర
    దూరుచు నందురిట్టులన్
    మతి సెడినట్టి వారలకు మాధవు
    డే నిజమైన దేవుడౌ

    నమస్కారం గురువుగారు సవరించాను

    రిప్లయితొలగించండి
  18. హితజన బాంధవుండుహరియించునఘంబులు కేశవుండిలన్
    సతతము భక్తులెల్లరకు సౌఖ్యమొసంగునటంద్రు వైష్ణవుల్
    వితతముగా దలంచెదరు పెక్కురు శైవులదేమి వింతయో
    మతి సెడినట్టి వారలకుమాధవుఁడే నిజమైన దేవుఁడౌ

    రిప్లయితొలగించండి
  19. శైవులిట్లని తలతురు సంతతమ్ము
    దైవమన శితికంఠుడే తరచిచూడ
    వేరుదైవముంగొలుచుట వెర్రితనము
    మతి సెడినవారి దైవముమాధవుండు

    రిప్లయితొలగించండి
  20. కలియు గమునందు ధర్మముఁగానరాక
    ప్రతిభ నెంచక వారినిఁ బ్రతిఘటించ
    వక్ర మార్గము ననుదేలు వారిజూచి
    మతి సెడినవారి దైవముమాధవుండు

    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  21. సతతము గొల్ల గుబ్బెతల సంగడి తోటల సంచరించు వా
    డతులిత చోర కర్మముల నాయతనమ్ముల తైరు వెన్నలన్
    చతురత తోడ దొంగిలుచు సాగెడు వాడు, గణించి చూడగా
    మతి సెడినట్టి వారలకు మాధవుఁడే నిజమైన దేవుఁడౌ

    రిప్లయితొలగించండి
  22. సతతము సాధు పుంగవుల సంకటపెట్టెడి వారె దేవతల్
    మతి సెడినట్టి వారలకు; మాధవుఁడే నిజమైన దేవుఁడౌ
    ప్రతిఫలకాంక్ష లేక జనులందరకున్ సహకారులై ప్రజా
    హితము సమాజ సేవ వరమీశ్వర సేవగ నమ్ము వారికిన్

    రిప్లయితొలగించండి
  23. అతులిత భక్తి తోడుతను నందరి యందున నల్ల నయ్యనున్
    హితముగ గాంచుచున్ సతము నీప్సితమై దన సేవ జేయుచు
    న్నతి గతి యాతడే యనుచు నా పరమాత్ముని పారవశ్యమున్
    మతి సెడినట్టి వారలకుమాధవుఁడే నిజమైన దేవుఁడౌ

    రిప్లయితొలగించండి
  24. ఆర్జిత మిసుమంతయులేక యవని యందు
    పొట్ట జేతబట్టి తిరిగి పొందలేక
    గుప్పె డన్నమ్ము నెచటను ,గుండెపగిలి
    మతిసెడిన వారి దైవము మాధవుండు

    రిప్లయితొలగించండి
  25. కుచేలుని విచికిత్స

    స్తుతమతి బాల్యమిత్రుడట దొల్తగ గుర్తునుపట్టునో
    యథో
    చితముగ సన్మతిన్ దనను చేరగవచ్చునొ పేదవిప్రుని
    న్నతిథిగ నాదరించదగు నార్ద్రత జూపునొ బేలనైతిగా
    మతి సెడినట్టివారలకు మాధవుడే నిజమైన దేవుడౌ

    రిప్లయితొలగించండి
  26. కొలిచినఁ గొలువ కున్ననుఁ గూర్మి మీఱ
    నగపడక యేరి కిద్ధర నంచితముగఁ
    గాచుఁ గంటికి ఱెప్పగఁ గరుణ తోడ
    మతి సెడిన వారి దైవము మాధవుండు

    [సెడిన వారి (న్) దైవము మాధవుండు]


    పతి యగు భూ నభో వితతి బద్ధ చరాచర జీవరాశికిన్
    సతతము పద్మనాభుఁడు విచారము నెమ్మదిఁ జేసి చూచినన్
    మతి గల వారి కెల్లరకు మాన్యుఁడు సన్మతి నందఁ గోరినన్
    మతి సెడి నట్టి వారలకు మాధవుఁడే నిజమైన దేవుఁడౌ

    రిప్లయితొలగించండి
  27. బంధు జనములు మృతి నొంద వ్యాధితోడ
    చింత బాపెడి వారలు చెంత లేక
    మదియు క్షోభించుచుండంగ మ్లానులగుచు
    మతి చెడిన వారి దైవము మాధవుండు

    మరొక పూరణ

    వెతలనుపెట్టి భార్యనిలవేదనకున్ గురి చేయుచుం డగన్
    కుతకుతలాడుమానసముకోపభరమ్మునచిందులేయుచున్
    సతతముబాధపెట్టగనుసంతసమన్నదిశూన్యమైతుదన్
    మతిసెడినట్టివారలకుమాధవుడేనిజమైన దేవుడౌ

    రిప్లయితొలగించండి
  28. వితరణ బుద్ధితోడనిల వేలకువేలుగ దానమీయగా
    బ్రతిదిన మట్లు జేయగను బాడియు పంటలు సొమ్ము లన్నియున్
    నితరుల బాలికింజనగ నించుక లేమికి భీతు డై దగన్
    మతిసెడినట్టి వారలకు మాధవుడేనిజమైన దేవుడౌ

    రిప్లయితొలగించండి
  29. మరొక పూరణము:

    అతి బలశాలికిన్, వ్యధల
    యానము జేసెడి కొంచెకానికిన్,
    నుతులిడి పూజసేయు బహు
    జ్ఞానికి, వేసరమందువానికిన్,
    ప్రతిహత మందభాగ్యునకు,
    భారముగా బ్రతుకీడ్చు బాధలన్
    మతి సెడినట్టి వారలకు,
    మాధవుఁడే నిజమైన దేవుఁడౌ!


    కొంచెకాడు=సామాన్యుడు

    రిప్లయితొలగించండి
  30. కేదారేశ్వర్ నాథ్ వద్ద అతి పెద్ద విపత్తు ను వివరించే ఈ నా ప్రయత్నము :

    చం:

    పతనపు నంచు కున్నడుచ, పారెడు నీటికి యడ్డు చిక్కగా
    నతి బరువైన రాయి, గుడి నష్టము బొందక రెండు పాయలై
    చితుకగ సేయ, నీశ్వరుడె చెర్చె నటంచును బల్కు చుండ నా
    మతి సెడి నట్టి వారల కుమాధవుడే నిజమైన దేవుడౌ

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి