19, జులై 2021, సోమవారం

సమస్య - 3787

20-7-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వద్దన్నను వచ్చువాఁడె వంద్యుండు గదా”
(లేదా...)
“వద్దని యెంత వేడినను వచ్చెడివాఁడె స్తుతింప నర్హుఁడౌ”

75 కామెంట్‌లు:

 1. పెద్దగతానైయూరున
  అద్దముగాగనుమనసునుహర్షితుడగుచున్
  సుద్దులుచెప్పగఁజూచును
  వద్దన్ననువచ్చువాడెవంద్యుండుగదా

  రిప్లయితొలగించండి
 2. సమస్య:

  వద్దని యెంత వేడినను
  వచ్చెడివాడె స్తుతింప నర్హుడౌ

  ( " తరంగము " లనే సంస్కృతగీతాలతో బాలకృష్ణుని అర్చించిన ఆనంద తీర్థుల వారు తనతో ఆటలాడుతున్న కన్నయ్యతో అంటున్నారు )

  ఉత్పలమాల
  ------------

  " ముద్దుల స్వామి ! వచ్చితివ
  మోహనమూర్తివి నీవు నేడిటుల్
  హద్దులు లేని వత్సలత
  నాటల నాడ ; క్షమింపవయ్య ! నే
  బెద్దగ నైతి ; బాదముల
  బెట్టిన గుండె భరింపలేదు ; రా
  వ " ద్దని యెంత వేడినను
  వచ్చెడివాడె స్తుతింప నర్హుడౌ .

  (తీర్థులవారి గ్రంథం కృష్ణలీలాతరంగిణి )

  రిప్లయితొలగించండి

 3. సుద్దులు చెప్ప విననిచో
  గద్దించెడువాడు హితము కాంక్షించుచు తా
  ముద్దియె చేరిన తరి రా
  వద్దన్నను వచ్చువాఁడె వంద్యుండు గదా.

  రిప్లయితొలగించండి
 4. "సుద్దులు జెప్పకే ఫలము
  జూడక మెప్పును బొందగోరకన్
  హద్దులు దాటకన్ తనదు
  యానము నాపక మేలు గోరుచున్
  పెద్దరికంబుగాక మన
  బిందము దీర్చు నిధానమౌచు" రా
  వద్దని యెంత వేడినను-
  "వచ్చెడివాఁడె స్తుతింప నర్హుఁడౌ"!


  బిందము=ఆపద

  రిప్లయితొలగించండి

 5. పెద్దలు చెప్పుచుందురు భవిష్యము గోరెడు వారలెప్పుడున్
  సుద్దులు చెప్పిమానరని, సుస్థత గూర్చు నెపమ్ముతో సదా
  ముద్దియె చుట్టుముట్టు తరి ప్రోచగ బింకము చూపకుండ రా
  వద్దని యెంత వేడినను వచ్చెడి వాఁడెనుతింప నర్హుఁడౌ

  రిప్లయితొలగించండి
 6. చద్దినియారగించుటకుసద్దునుసేయకక్రుష్ణుడంతటన్
  ఓద్దికమీరగోపకులనోడుచునాడుచుపర్వులెత్తుచున్
  అద్దిరగోపికారమణినద్భుతరీతినిమాయఁజేయుచున్
  వద్దనియెంతవేడిననువచ్చెడివాడెస్తుతింపనర్హుడౌ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "చద్దిని నారగించుటకు సద్దును జేయక కృష్ణుడంత తా నొద్దిక.. పర్వులెత్తగా నద్దిర..." అనండి.

   తొలగించండి
  2. అవునండిసరిదిద్దుకుంటాను
   చద్దినినారగించుటకుసద్దునుఁజేయకక్రుష్ణుడంతతా
   నోద్దికమీరగోపకులనోడుచునాడుచుపర్వులెత్తగా
   నద్దిరగోపికారమణినద్భుతరీతినిమాయఁజేయుచున్
   వద్దనియెంతవేడిననువచ్చెడివాడెస్తుతింపనర్హుడౌ
   సవరణతో

   తొలగించండి
 7. శుద్ధ మనస్కుడగుచు దా
  దద్దయు నార్త జనులందు దైవము గనుచున్
  బద్ధుడయి సేవ జేయగ
  వద్దన్నను వచ్చుఁ వాడె వంద్యుo డు గదా !

  రిప్లయితొలగించండి
 8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 9. ముద్దుగ మాటలన్ బలికి మోదమునొందుచు యింటచేరి తా

  నిద్దుర లోకి జార, కడు నేర్పుగ‌‌ వెన్నను దొంగిలించెగా,

  వద్దని‌యెంత వేడినను వచ్చెడి వాడె,స్తుతింప‌నర్హుడౌ

  ముద్దుల‌ బాలుడంచు ఘన మున్‌‌ తన యక్కున జేర్చి ముద్దిడున్

  గద్దరి యౌ యశోద కడు గారవ‌ మున్ వ్రజ నాధు‌ నెప్పుడున్

  సుద్దులు‌ నేర్పకున్న పర సొత్తును నిత్యము దొంగిలించు‌గా

  పెద్ద‌‌ మనమ్ముతో‌ వినుము , బిడ్డకు నేర్పుము నంద‌భూపతీ

  బుధ్దులు శీఘ్రతన్ యనుచు భోరున‌ యేడ్చెను కాంత యొక్కతెన్

  రిప్లయితొలగించండి
 10. హద్దులు లేకయె వ్రజమున
  ముద్దులుమూట యగు కృష్ణమూర్తి చెలగుచున్
  గద్దరితనమున వనితలు
  వద్దన్నను వచ్చు, వాడె వంద్యుడు గదా!

  గోపికల విరహము

  ముద్దుల మూటగట్టు తన మోహనరూపము నిల్వనీయదే
  సుద్దుల నెంతజెప్పినను జూపులు నాతని వీడనొల్లవే
  బద్ధులమైతిమే తనకు, పద్మదళాక్షుని చిత్తమందు రా
  వద్దని యెంతవేడినను, వచ్చెడివాడె స్తుతింప నర్హుడౌ

  రిప్లయితొలగించండి
 11. రిప్లయిలు
  1. కందం
   అద్దరి గోవిందునిఁ గని
   ముద్దియ రుక్మిణి మనమును బొలయించుమయా!
   నిద్దుర నైనను విప్రా!
   వద్దన్నను వచ్చువాఁడె వంద్యుండు గదా!

   ఉత్పలమాల
   అద్దరి కృష్ణమూర్తిఁ గని యార్తిని దెల్పుమ బ్రాహ్మణోత్తమా!
   ముద్దియ రుక్మిణీలలన మోహన రూపుని పేర్మి నచ్చుటల్
   నిద్దురనైన వారె మహనీయులు మానస మందిరమ్మునన్
   వద్దని యెంత వేడినను వచ్చెడివాఁడె స్తుతింప నర్హుఁడౌ

   తొలగించండి
 12. ఉత్పలమాల:
  అద్దమరేతిరేల తన హద్దులు దాటి సుతారమైన నా
  నిద్దర వేళలోన కల నిండుగ కన్పడి యూసులాడి నా
  వద్దకు జేరి ముద్దులను పంచెడి మాయడు నా మగాడు రా
  “వద్దని యెంత వేడినను వచ్చెడివాఁడె స్తుతింప నర్హుఁడౌ”
  --కటకం వేంకటరామశర్మ.

  రిప్లయితొలగించండి
 13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 14. ఇంట్లో పెద్దల మాట వినక విదేశము వెళ్లి వద్దన్నా తిరిగి వస్తాడనే సందర్బంగా నా ప్రయత్నము :

  ఉ:

  పెద్దల మాట నెంచకయె వేగమె యేగ విదేశ యానమున్
  హద్దులు లేని రొక్కమును హక్కున బొంది స్వదేశ మేగనై
  సిద్ధ మటంచు దెల్ప విని శీఘ్రమె బంధు జనంబు లిట్లనన్
  వద్దని యెంత వేడినను వచ్చెడి వాడె స్తుతింప నర్హుడౌ

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 15. ఇద్దరము కలిసెద మనగ
  కొద్దిగ వ్యాధితుడ నైతి కోవిడువలనన్
  రద్దయ్యె మనకలయిక , రా
  వద్దన్నను వచ్చువాఁడె వంద్యుండు గదా

  రిప్లయితొలగించండి
 16. హద్దెరుగనియల్లరితో
  ప్రొద్దంతయు గడుపువాడు మోహనుడతడే
  ముద్దులొలుకు కృష్ణుండే
  వద్దన్నను వచ్చువాఁడె వంద్యుండు గదా

  రిప్లయితొలగించండి

 17. ఉద్దీడులతో దధిజపు
  ముద్దల నాశించి కాదె మ్రుచ్చుని వోలెన్
  నిద్దుర పోయెడు వేళను
  వద్దన్నను వచ్చువాఁడె వంద్యుండుగదా.

  రిప్లయితొలగించండి
 18. విరించి


  ఉద్దీడులతో దధిజపు
  ముద్దల నాశించి కాదె మ్రుచ్చుని వోలెన్
  నిద్దుర పోయెడు వేళను
  వద్దన్నను వచ్చువాఁడె వంద్యుండుగదా.

  రిప్లయితొలగించండి
 19. ఇద్దర మిప్పుడే కలియ నెంచితి మే మరి , యీదినంబునన్
  కొద్దిగ నొచ్చుచుండెగద కోవిడు వచ్చినదేమొ ! నేడికన్
  రద్దయి పోయెనయ్య మన లక్ష్యము
  నీవిక నన్నుజూడ , రా
  వద్దని యెంత వేడినను వచ్చెడివాఁడె స్తుతింప నర్హుఁడౌ

  రిప్లయితొలగించండి
 20. తద్దయు భక్తి తోడుత నదత్తలు మున్గ నదిన్ వివస్త్రలై,
  బుద్ధులు సెప్ప వస్త్రముల బోడులు చూడగ దొంగిలింపగా
  నద్దిఱ యంచు గోపికలు హస్తము లడ్డుచు జెంతజేర రా
  వద్దని యెంత వేడినను వచ్చెడివాఁడె స్తుతింప నర్హుఁడౌ.

  రిప్లయితొలగించండి
 21. శ్రధ్ధ పతిని పిలవరెవరు

  వద్దన్నను వచ్చు వాఁడె , వంద్యుండు గదా”

  సిధ్ధులకైనను పిన్నలు

  పెద్దలకైనను మరణము ప్రీతిన్ తెచ్చున్

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  పెద్దగు దున్న పోతు మరి పేరున ధర్మము తోడు నీడలై

  శ్రద్ధగ వేచి యుండునట శంభుడు యానతినిచ్చు వేళకై

  ముద్దుగ వేళ మించగను ముద్దుల పాశము తోడు సిధ్ధమై

  వద్దని యెంత వేడినను వచ్చెడివాఁడె స్తుతింప నర్హుఁడౌ”

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'శంభుడు+ఆనతి' అన్నపుడు యడాగమం రాదు. "శంభుడె యానతి..." అనండి.

   తొలగించండి
  2. ధన్యనాదములండీ
   సవరణకు కృతజ్ఞుడిని

   తొలగించండి
 22. పెద్దన్నవోలె హితమును
  బుద్ధులు గరపుచుననిశము పోరాములలో
  తద్దయు కాపాడగ రా
  వద్దన్నను వచ్చువాఁడె వంద్యుండు గదా

  రిప్లయితొలగించండి
 23. దద్దమ్మ గదా యిటు రా
  వద్దన్నను వచ్చువాఁడె; వంద్యుండు గదా
  వద్దనగనె మర్యాదగ
  హద్దును మీరక చరించునతడెన్నటికిన్

  రిప్లయితొలగించండి
 24. ఒద్దిక తోడుతన్ దిరిగి యోటుకు నోటుల గుమ్మరించుచున్
  ముద్దుగ మాటలం బలికి మూర్ఖుడు రాజయె నెన్నికందునన్
  బుద్ధిని దెచ్చుకున్న ప్రజ భోరున యేడ్చుచు పల్లె జేర...రా
  వద్దని యెంత వేడినను వచ్చెడివాఁడె స్తుతింప నర్హుఁడౌ.

  రిప్లయితొలగించండి
 25. ఇద్దరము రోగయుతులము
  వద్దుర జోగయ్య యిచటపని లేకుండన్
  చద్దుల మూటను బట్టుకు
  వద్దన్నను వచ్చువాడె వంద్యుండుగదా

  రిప్లయితొలగించండి
 26. వద్దుర లక్ష్మణార్య! వనవాసము శీలవతిన్ నవోఢనున్
  హద్దులు మీరి వీడకు, సదాచరణమ్మని వెంట రాకుమా!,
  తద్దయు సేవఁ జేయుమిట తల్లుల కంచు వచించ నన్నయున్
  వద్దని యెంత వేడినను వచ్చెడివాఁడె స్తుతింప నర్హుఁడౌ.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 27. పెద్ద ప్రమాదమున్ గడచి వేగమె సాయము వేడనాతడే
  పెద్దలమంచు జెప్పుకొను వెంబరవిత్తులు వైద్యునాపుచున్
  వద్దటు బోవగావలదు వాడొక నిమ్నకులుండు తాకనే
  వద్దని యెంత వేడినను వచ్చెడివాఁడె స్తుతింప నర్హుఁడౌ

  రిప్లయితొలగించండి
 28. 'హద్దులు దాటి పేదలకు
  నార్థిక సేవొనరించ బోకుమీ'
  ముద్దుల భార్య సెప్పినను బూ
  నిక వీడక నెల్లవేళల
  న్నొద్దికతో నతండరుగు నొప్పుగ
  వారల బాధనెర్గి పో
  వద్దని యెంత జెప్పినను వచ్చెడి
  వాడె స్తుతించగా దగున్.

  రిప్లయితొలగించండి
 29. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 30. వద్దుర వద్దురాభరత! పండుగ జేయగలేనుగావునన్
  వద్దని యెంతవేడినను వచ్చెడివాడెస్తుతింపనర్హుడౌ
  పెద్దలయందునన్ మిగుల పేర్మియు గారవముండు గావుతన్
  ముద్దులుమూటగట్టునటు మోదము తోడనువచ్చెనేసుమా

  రిప్లయితొలగించండి
 31. వద్దకురాకు నాకడకు వచ్చినచో నినుమట్టుపెట్టు నా
  పెద్ద కరోనభూతమని వెజ్జుకు నెంతయు చెప్పి చూచినన్
  సిద్ధమయెన్గదా యతడు సేవలు సల్పగ నంటురోగికిన్
  వద్దని యెంత వేడినను వచ్చెడివాఁడె స్తుతింప నర్హుఁడౌ

  రిప్లయితొలగించండి
 32. వద్దుర కన్నయ్యా యి
  ప్పొద్దున నిలు వదలి నీవు పో వద్దనినం
  దద్దయు దిట్టఁదనమ్మున
  వద్దన్నను వచ్చువాఁడె వంద్యుండు గదా


  ఎద్దుల బండి పంతమున నెక్కఁగ, బల్లిదు లందు నెంచఁగాఁ
  బెద్దయె తల్లి పంపునను భీముఁడు పట్టణ రక్ష ణార్థమై
  తద్దయు భీతితో ద్విజుఁడు దైత్యుని వద్దకుఁ బంప లేను పో
  వద్దని యెంత వేడినను, వచ్చెడి వాఁడె స్తుతింప నర్హుఁడౌ

  రిప్లయితొలగించండి
 33. అద్దమరాత్రి వేళలను హాయిగ స్వప్నమునందు తేలుచున్
  నిద్దురపోవ దొంగవలె నేర్పుగ నిక్కకు వచ్చిబుగ్గపై
  ముద్దుల వర్షమున్ గురియు మోహన రూపుడు , కిన్కతోడ రా
  వద్దని యెంత వేడినను వచ్చెడివాడె స్తుతింపనర్హుడౌ

  రిప్లయితొలగించండి
 34. ప్రొద్దున రాత్రినిన్ గనక భోరున సంతత మేకధారగా
  ముద్దగ జేయుచున్ జనుల ముంబయి నంతను ముంచివేయుచున్
  మద్దెల మ్రోతవోలె కడు మర్దన జేయగ వానదేవుడా
  వద్దని యెంతవేడినను, వచ్చెడివాడె స్తుతింప నర్హుడౌ

  రిప్లయితొలగించండి
 35. హద్దుల నుమరచి రాకుము
  పెద్దలు జూసిన కలుగును భీతియు నాకున్
  సుద్దులు చాలిక యనుచును
  వద్దన్నను వచ్చు వాడె వంద్యుండుగదా


  అద్దమరేయిన వచ్చును
  సుద్దులు చెప్పుచునువిడకసుదతులకడకున్
  పద్ధతికాదిది వినుమా
  వద్దన్నను వచ్చు వాడు వంద్యుండు గదా.


  సద్దును చేయకుండగను చక్కగ గ్రోలుచు పాలువెన్నలన్
  ముద్దుగచెంతచేరుచునుమోవినివేణువునుంచుచెప్పుడున్
  సుద్దులు చెప్పుచున్ హరియు చోరుని యట్లుగ దోచెచిత్తమున్
  వద్దనియెంతవేడిననువచ్చెడి వాడెస్తుతింపనర్హుడౌ

  రిప్లయితొలగించండి