22-7-2021 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“ప్రాఙ్నగమున శంకరుఁడు సుభద్రనుఁ గూడెన్”(లేదా...)“ప్రాఙ్నగమందు శంభుఁడు సుభద్రనుఁ గూడఁగఁ బుట్టె వాలియే”
ఈ ఙ్న యనంగ నక్షరము నెట్టుల ప్రాసగ నిచ్చితీవు సమ్యఙ్నయదూర వర్తనుఁడవై కవిమిత్రులు దిట్ట భవ్య సద్వాఙ్నియమమ్ము లేక సుర పానముఁ జేసినవాఁడు పల్కెలే"ప్రాఙ్నగమందు శంభుఁడు సుభద్రనుఁ గూడఁగఁ బుట్టె వాలియే"
ఈఙ్నాప్రాసమ్మిచ్చుటధిఙ్నయదూరా! యుచితమె? ధీహీనుండైవాఙ్నియమ రహితుఁ డిట్లనెఁబ్రాఙ్నగమున శంకరుఁడు సుభద్రనుఁ గూడెన్
వాఙ్నిపుడవీవంచునుదృఙ్నాయకులెల్ల నమ్ము ధీరుడ వౌరా!నిఙ్నికముఁ బలికితి విటుల ప్రాఙ్నగమున శంకరుఁడు సుభద్రను గూడెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'నిఙ్నికము'?
మొదటి పాదంలో గణభంగం. "వాఙ్నిపుణుడ వీవంచును" అని ఉండాలనుకుంటాను.
కందంవాఙ్నియమము వీడకుమాదిఙ్నగములు వణకఁ బలికి! ధీమతి వైనన్వాఙ్నిపుణా! పూరింపుమప్రాఙ్నగమున శంకరుఁడు సుభద్రనుఁ గూడెన్ఉత్పలమాలవాఙ్నియమమ్ము లేక మన పాత్రలకీయక గౌరవమ్ములన్దిఙ్నగముల్ చలించు గతి ధీయుతునంచును బల్కనొప్పునే?వాఙ్నిపుణత్వమున్ దెలిపి ప్రాజ్ఞులు మెచ్చ పరిష్కరించుమా!"ప్రాఙ్నగమందు శంభుఁడు సుభద్రనుఁ గూడఁగఁ బుట్టె వాలియే"
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
గౌరితో కూడెగా ప్రాజ్నగమున శంకరుడు, సుభద్రను కూడె నర్జునుడు మౌనిరూపమును వీడి కృష్ణుడు , రుక్మిణి ,బలరాము లెల్లరు దీవించ రమ్య గతిని
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఈ ఙ్నను ప్రాసగా నొసగ నించుక జాలియు లేకపోయె నేదృఙ్నిగ మందు నిల్చెనట దేవశ్రుతుండని యడ్గుచుంటి, సమ్యఙ్నియమమ్ము వీడి ఖలు మద్యము గ్రోలి వచించి నావుగా ప్రాఙ్నగమందు శంభుఁడు సుభద్రనుఁ గూడఁగఁ బుట్టె వాలియే.
వాజ్నియమమునెఱిగినరవిప్రాజ్నీరసముద్భవనవపద్మకళనుతాప్రాజ్నియమముగలవాడుగప్రాజ్నగమందుశంకరుడుసుభద్రనుఁగూడెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శంకరుడు-లోకశుభంకరుడుసుభద్ర-పద్మము
విరించి.వాఙ్నిపుణుడవని గదరాదృఙ్నాయకులెల్ల నమ్ము ధీరుడవట సమ్యఙ్నియమము మరచితివా!ప్రాఙ్నగమున శంకరుఁడు సుభద్రను గూడెన్.?
విరించి.ఈ ఙ్నను ప్రాసగా నొసగ నించుక జాలియు లేకపోయె నేదృఙ్నిగ మందు నిల్చెనట దేవశ్రుతుండని యడ్గుచుంటి, సమ్యఙ్నియమమ్ము వీడి ఖలు మద్యము గ్రోలి వచించి నావుగా ప్రాఙ్నగమందు శంభుఁడు సుభద్రనుఁ గూడఁగఁ బుట్టె వాలియే.
ప్రాజ్నగమేలుభానుడునుప్రాంగణమందునకాలుమోపగాదిజ్నగమేఘమాలవియుతెల్లగమారెనువెల్గుచూపుచున్వాజ్నయబోధకుండునటవారిజరాణినిచెట్టబట్టగాప్రాజ్నగమందుశంభుడుసుభద్రనుగూడగపుట్టెవాలియే
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "మేఘమాల లవి తెల్లగ..." అనండి.
సరిగాగమనించలేకపోయాను
వాజ్ని యమము వీడి యొకడు దిజ్నగ ములు ప్రతి ఫలింప తేకువ తోడన్ వాజ్నిపు ణు డౌచు నిట్లనెప్రాజ్న్న గ మున శంకరుడు సుభద్రను గూడెన్
విఙ్నానము లేని వచనమఙ్నానులె యనవలె గద మంచిచెడులనేసుఙ్నానము వీడినపుడు,"ప్రాఙ్నగమున శంకరుఁడు సుభద్రనుఁ గూడెన్"
ప్రాస కొరకు 'విజ్ఞాన, అజ్ఞాన, సుజ్ఞాన' శబ్దాలను "విఙ్నాన, అఙ్నాన, సుఙ్నాన" ములుగా మార్చరాదు.
నరులను మేల్కొల్పగ రవిపరుగుల తోడనరుదెంచె ప్రాఙ్నగమున; శంకరుడు సు భద్రను గూడెన్ అరుదగు బుత్రుని బడయగ హర్షముతోడన్ ప్రాఙ్నగమన తూర్పుశిఖరిప్రాఙ్నగమున బుట్టు రవియు రాకాశశియున్వాఙ్నిపుణత్వమె పలుకగప్రాఙ్నగమున శంకరుడు సుభద్రను గూడెన్?
ధన్యాస్మి గురుదేవా!నమోనమః!🙏🙏🙏
పరమోన్నతశైలంబదిపరవశమిడు పరిసరాల ప్రాఙ్నగమున శంకరుఁడు సుభద్రనుఁ గూడెన్చెరకువిలుతునిశరములకు చిక్కినవాడై
చక్కని పూరణ. అభినందనలు.
🙏
ఉ: వాఙ్నిధి యంచు బిల్వబడు వానరుడొక్కడు గంతులే యగన్వాఙ్నిధి గాడు వట్టి నస వాగుడనంబడు రీతి నొప్పగావాఙ్నియమమ్ము వీడి పసి వాడిని బోలెడి బల్కులిట్లనన్ప్రాఙ్నగమందు శంభుఁడు సుభద్రనుఁ గూడఁగఁ బుట్టె వాలియేవై. చంద్రశేఖర్
ధన్యవాదములు
ఈ 'ఙ్నియను ప్రాస వాడుటవాఙ్నియమముగా రచింపు పద్యంబనినన్వాఙ్నిపుణుడిట్టులనియెనుప్రాఙ్నగమున శంకరుఁడు సుభద్రనుఁ గూడెన్
ఉత్పలమాల:ప్రాఙ్నగమందు శాంభవి ప్రభావతనొందె కుమారికన్యయై ప్రాఙ్నగమందు శంకరుడు రామునిచే సికతేశ్వరుండయెన్ ప్రాఙ్నగమందు కూడనివి భాసిలు నట్లు చరిత్ర వ్రాయుచో “ప్రాఙ్నగమందు శంభుఁడు సుభద్రనుఁ గూడఁగఁ బుట్టె వాలియే”--కటకం వేంకటరామశర్మ
గరళమును మ్రింగెనట (ప్రాజ్నగమున శంకరుడు, సుభద్రను కూడెన్) నరుడు కిరీటిగరళమును మ్రింగుట సులువౌ గాదిలి సతికోపమును మ్రింగ సులువౌన తపసికైన...భారతీనాథ్ చెన్నంశెట్టి...
దరిసెనమిడెనా దినమునవరముగ సురవరుని వోలె ప్రాఙ్నగమున శంకరుఁడు; సుభద్రనుఁ గూడెన్వర పాండవ మధ్యముండు వాసవు గృపతో
వాఙ్నిపుణత గన బఱచిరిదిఙ్నగములు బరిహసించ తిప్పయ సెట్టీ!దృఙ్నిపుణత లేదియ్యదిప్రాఙ్నగమున శంకరుడు సుభద్రను గూడెన్
ధిఙ్నాగ గమ నగక్ష్మాభుఙ్నందనను నలినాక్షిఁ బుణ్యాత్మ సుధారుఙ్నేత్ర పార్వతీ సతిఁ బ్రాఙ్నగమున శంకరుఁడు సుభద్రనుఁ గూడెన్ [సుభద్ర = మిక్కిలి శుభ మైనది]దిఙ్నుత కార్తికేయుఁడు సు ధీనిధి సన్నుత పన్నగేంద్ర సుత్వఙ్నగ భూషణుండు దయఁ దాల్పఁగ షణ్ముఖ నామ మంది స్వర్దృఙ్నయ వంచనమ్మునను దేవ చమూపతి తేజనమ్మునం,బ్రాఙ్నగమందు శంభుఁడు సుభద్రనుఁ గూడఁగఁ బుట్టె, వాలియే [స్వర్దృక్కు = అగ్ని; సుభద్ర= మిక్కిలి శుభ మైనది; తేజనము = ఱెల్లు గడ్డి; వాలి = దిగి]
1/9//2018, 17/4/2019 నాటి నా సదృశ సమస్యా పూరణములు: మగ్నుండై పని యందు నభగ్నపు రీతి నిరతమ్ముఁ బన్నుగఁ దా ప్రత్యఙ్నగము సేరి కదలుచుఁ బ్రాఙ్నగ శృంగమ్మున నదె భానుఁడు గ్రుంకెన్రుఙ్నయ నారవింద సఖ రోష విలుప్త ముఖుండు నా పయోముఙ్నిచయచ్యుతానన విముక్త నిదాఘ సువిగ్రహుండు ఋత్విఙ్నర నిత్యపూజితుఁడు వేగఁ జలించి రయోద్ధృతిన్ మహాప్రాఙ్నగ శృంగభాగమున భానుఁడు గ్రుంకె నదేమి చిత్రమోత్వఙ్నయ నోద్వేగమ్మును రుఙ్నిచ యోద్భాసితమ్ము రోగక్షయ మీదృఙ్నవ విధ ముదయించుచుఁ బ్రాఙ్నగమున నస్తమించె భాస్కరుఁ డంతన్ [నవము = స్తోత్రము]దృఙ్నిర తాద్భుతమ్ము నగు దివ్య విలాసము నా నభః పయోముఙ్నినదవ్ర జావృతము భూతలవాస మనోహరమ్ము నౌప్రాఙ్నగ సంభవుండు నయి ప్రస్ఫుట మౌయరుణాంశు సంయు తాప్రాఙ్నగమందుఁ జూడఁగ విభాకరుఁడౌ రవి యస్తమించెరా [సంయుత + అప్రాఙ్నగము; పశ్చిమాద్రి]
ప్రాఙ్నగమందు పుట్టిసతి పర్వతరాజు కుమార్తెగా భువిన్ దిఙ్నగరాధిపున్ శివుని ధీరతయొప్పగ సేవజేసియున్ వాఙ్నిపుణంబు నొప్పగను భర్తగ బొందగ బాడియే యిదిన్ ప్రాఙ్నగమందు శంభుడు సుభద్రను గూడగ బుట్టె వాలియే
ఈ ఙ్న యనంగ నక్షరము నెట్టుల ప్రాసగ నిచ్చితీవు స
రిప్లయితొలగించండిమ్యఙ్నయదూర వర్తనుఁడవై కవిమిత్రులు దిట్ట భవ్య స
ద్వాఙ్నియమమ్ము లేక సుర పానముఁ జేసినవాఁడు పల్కెలే
"ప్రాఙ్నగమందు శంభుఁడు సుభద్రనుఁ గూడఁగఁ బుట్టె వాలియే"
ఈఙ్నాప్రాసమ్మిచ్చుట
తొలగించండిధిఙ్నయదూరా! యుచితమె? ధీహీనుండై
వాఙ్నియమ రహితుఁ డిట్లనెఁ
బ్రాఙ్నగమున శంకరుఁడు సుభద్రనుఁ గూడెన్
రిప్లయితొలగించండివాఙ్నిపుడవీవంచును
దృఙ్నాయకులెల్ల నమ్ము ధీరుడ వౌరా!
నిఙ్నికముఁ బలికితి విటుల
ప్రాఙ్నగమున శంకరుఁడు సుభద్రను గూడెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'నిఙ్నికము'?
మొదటి పాదంలో గణభంగం. "వాఙ్నిపుణుడ వీవంచును" అని ఉండాలనుకుంటాను.
తొలగించండికందం
రిప్లయితొలగించండివాఙ్నియమము వీడకుమా
దిఙ్నగములు వణకఁ బలికి! ధీమతి వైనన్
వాఙ్నిపుణా! పూరింపుమ
ప్రాఙ్నగమున శంకరుఁడు సుభద్రనుఁ గూడెన్
ఉత్పలమాల
వాఙ్నియమమ్ము లేక మన పాత్రలకీయక గౌరవమ్ములన్
దిఙ్నగముల్ చలించు గతి ధీయుతునంచును బల్కనొప్పునే?
వాఙ్నిపుణత్వమున్ దెలిపి ప్రాజ్ఞులు మెచ్చ పరిష్కరించుమా!
"ప్రాఙ్నగమందు శంభుఁడు సుభద్రనుఁ గూడఁగఁ బుట్టె వాలియే"
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిగౌరితో కూడెగా ప్రాజ్నగమున శంక
రిప్లయితొలగించండిరుడు, సుభద్రను కూడె నర్జునుడు మౌని
రూపమును వీడి కృష్ణుడు , రుక్మిణి ,బల
రాము లెల్లరు దీవించ రమ్య గతిని
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఈ ఙ్నను ప్రాసగా నొసగ నించుక జాలియు లేకపోయె నే
దృఙ్నిగ మందు నిల్చెనట దేవశ్రుతుండని యడ్గుచుంటి, స
మ్యఙ్నియమమ్ము వీడి ఖలు మద్యము గ్రోలి వచించి నావుగా
ప్రాఙ్నగమందు శంభుఁడు సుభద్రనుఁ గూడఁగఁ బుట్టె వాలియే.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివాజ్నియమమునెఱిగినరవి
రిప్లయితొలగించండిప్రాజ్నీరసముద్భవనవపద్మకళనుతా
ప్రాజ్నియమముగలవాడుగ
ప్రాజ్నగమందుశంకరుడుసుభద్రనుఁగూడెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశంకరుడు-లోకశుభంకరుడు
రిప్లయితొలగించండిసుభద్ర-పద్మము
రిప్లయితొలగించండివిరించి.
వాఙ్నిపుణుడవని గదరా
దృఙ్నాయకులెల్ల నమ్ము ధీరుడవట స
మ్యఙ్నియమము మరచితివా!
ప్రాఙ్నగమున శంకరుఁడు సుభద్రను గూడెన్.?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివిరించి.
రిప్లయితొలగించండిఈ ఙ్నను ప్రాసగా నొసగ నించుక జాలియు లేకపోయె నే
దృఙ్నిగ మందు నిల్చెనట దేవశ్రుతుండని యడ్గుచుంటి, స
మ్యఙ్నియమమ్ము వీడి ఖలు మద్యము గ్రోలి వచించి నావుగా
ప్రాఙ్నగమందు శంభుఁడు సుభద్రనుఁ గూడఁగఁ బుట్టె వాలియే.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిప్రాజ్నగమేలుభానుడునుప్రాంగణమందునకాలుమోపగా
రిప్లయితొలగించండిదిజ్నగమేఘమాలవియుతెల్లగమారెనువెల్గుచూపుచున్
వాజ్నయబోధకుండునటవారిజరాణినిచెట్టబట్టగా
ప్రాజ్నగమందుశంభుడుసుభద్రనుగూడగపుట్టెవాలియే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"మేఘమాల లవి తెల్లగ..." అనండి.
సరిగాగమనించలేకపోయాను
తొలగించండివాజ్ని యమము వీడి యొకడు
రిప్లయితొలగించండిదిజ్నగ ములు ప్రతి ఫలింప తేకువ తోడన్
వాజ్నిపు ణు డౌచు నిట్లనె
ప్రాజ్న్న గ మున శంకరుడు సుభద్రను గూడెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివిఙ్నానము లేని వచన
రిప్లయితొలగించండిమఙ్నానులె యనవలె గద మంచిచెడులనే
సుఙ్నానము వీడినపుడు,
"ప్రాఙ్నగమున శంకరుఁడు సుభద్రనుఁ గూడెన్"
ప్రాస కొరకు 'విజ్ఞాన, అజ్ఞాన, సుజ్ఞాన' శబ్దాలను "విఙ్నాన, అఙ్నాన, సుఙ్నాన" ములుగా మార్చరాదు.
తొలగించండినరులను మేల్కొల్పగ రవి
రిప్లయితొలగించండిపరుగుల తోడనరుదెంచె ప్రాఙ్నగమున; శం
కరుడు సు భద్రను గూడెన్
అరుదగు బుత్రుని బడయగ హర్షముతోడన్
ప్రాఙ్నగమన తూర్పుశిఖరి
ప్రాఙ్నగమున బుట్టు రవియు రాకాశశియున్
వాఙ్నిపుణత్వమె పలుకగ
ప్రాఙ్నగమున శంకరుడు సుభద్రను గూడెన్?
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యాస్మి గురుదేవా!నమోనమః!🙏🙏🙏
తొలగించండిపరమోన్నతశైలంబది
రిప్లయితొలగించండిపరవశమిడు పరిసరాల ప్రాఙ్నగమున శం
కరుఁడు సుభద్రనుఁ గూడెన్
చెరకువిలుతునిశరములకు చిక్కినవాడై
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిఉ:
రిప్లయితొలగించండివాఙ్నిధి యంచు బిల్వబడు వానరుడొక్కడు గంతులే యగన్
వాఙ్నిధి గాడు వట్టి నస వాగుడనంబడు రీతి నొప్పగా
వాఙ్నియమమ్ము వీడి పసి వాడిని బోలెడి బల్కులిట్లనన్
ప్రాఙ్నగమందు శంభుఁడు సుభద్రనుఁ గూడఁగఁ బుట్టె వాలియే
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండిఈ 'ఙ్నియను ప్రాస వాడుట
రిప్లయితొలగించండివాఙ్నియమముగా రచింపు పద్యంబనినన్
వాఙ్నిపుణుడిట్టులనియెను
ప్రాఙ్నగమున శంకరుఁడు సుభద్రనుఁ గూడెన్
ఉత్పలమాల:
రిప్లయితొలగించండిప్రాఙ్నగమందు శాంభవి ప్రభావతనొందె కుమారికన్యయై
ప్రాఙ్నగమందు శంకరుడు రామునిచే సికతేశ్వరుండయెన్
ప్రాఙ్నగమందు కూడనివి భాసిలు నట్లు చరిత్ర వ్రాయుచో
“ప్రాఙ్నగమందు శంభుఁడు సుభద్రనుఁ గూడఁగఁ బుట్టె వాలియే”
--కటకం వేంకటరామశర్మ
గరళమును మ్రింగెనట (ప్రాజ్నగమున శంక
రిప్లయితొలగించండిరుడు, సుభద్రను కూడెన్) నరుడు కిరీటి
గరళమును మ్రింగుట సులువౌ గాదిలి సతి
కోపమును మ్రింగ సులువౌన తపసికైన
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
దరిసెనమిడెనా దినమున
రిప్లయితొలగించండివరముగ సురవరుని వోలె ప్రాఙ్నగమున శం
కరుఁడు; సుభద్రనుఁ గూడెన్
వర పాండవ మధ్యముండు వాసవు గృపతో
వాఙ్నిపుణత గన బఱచిరి
రిప్లయితొలగించండిదిఙ్నగములు బరిహసించ తిప్పయ సెట్టీ!
దృఙ్నిపుణత లేదియ్యది
ప్రాఙ్నగమున శంకరుడు సుభద్రను గూడెన్
ధిఙ్నాగ గమ నగక్ష్మా
రిప్లయితొలగించండిభుఙ్నందనను నలినాక్షిఁ బుణ్యాత్మ సుధా
రుఙ్నేత్ర పార్వతీ సతిఁ
బ్రాఙ్నగమున శంకరుఁడు సుభద్రనుఁ గూడెన్
[సుభద్ర = మిక్కిలి శుభ మైనది]
దిఙ్నుత కార్తికేయుఁడు సు ధీనిధి సన్నుత పన్నగేంద్ర సు
త్వఙ్నగ భూషణుండు దయఁ దాల్పఁగ షణ్ముఖ నామ మంది స్వ
ర్దృఙ్నయ వంచనమ్మునను దేవ చమూపతి తేజనమ్మునం,
బ్రాఙ్నగమందు శంభుఁడు సుభద్రనుఁ గూడఁగఁ బుట్టె, వాలియే
[స్వర్దృక్కు = అగ్ని; సుభద్ర= మిక్కిలి శుభ మైనది; తేజనము = ఱెల్లు గడ్డి; వాలి = దిగి]
1/9//2018, 17/4/2019 నాటి నా సదృశ సమస్యా పూరణములు:
తొలగించండిమగ్నుండై పని యందు న
భగ్నపు రీతి నిరతమ్ముఁ బన్నుగఁ దా ప్ర
త్యఙ్నగము సేరి కదలుచుఁ
బ్రాఙ్నగ శృంగమ్మున నదె భానుఁడు గ్రుంకెన్
రుఙ్నయ నారవింద సఖ రోష విలుప్త ముఖుండు నా పయో
ముఙ్నిచయచ్యుతానన విముక్త నిదాఘ సువిగ్రహుండు ఋ
త్విఙ్నర నిత్యపూజితుఁడు వేగఁ జలించి రయోద్ధృతిన్ మహా
ప్రాఙ్నగ శృంగభాగమున భానుఁడు గ్రుంకె నదేమి చిత్రమో
త్వఙ్నయ నోద్వేగమ్మును
రుఙ్నిచ యోద్భాసితమ్ము రోగక్షయ మీ
దృఙ్నవ విధ ముదయించుచుఁ
బ్రాఙ్నగమున నస్తమించె భాస్కరుఁ డంతన్
[నవము = స్తోత్రము]
దృఙ్నిర తాద్భుతమ్ము నగు దివ్య విలాసము నా నభః పయో
ముఙ్నినదవ్ర జావృతము భూతలవాస మనోహరమ్ము నౌ
ప్రాఙ్నగ సంభవుండు నయి ప్రస్ఫుట మౌయరుణాంశు సంయు తా
ప్రాఙ్నగమందుఁ జూడఁగ విభాకరుఁడౌ రవి యస్తమించెరా
[సంయుత + అప్రాఙ్నగము; పశ్చిమాద్రి]
ప్రాఙ్నగమందు పుట్టిసతి పర్వతరాజు కుమార్తెగా భువిన్
తొలగించండిదిఙ్నగరాధిపున్ శివుని ధీరతయొప్పగ సేవజేసియున్
వాఙ్నిపుణంబు నొప్పగను భర్తగ బొందగ బాడియే యిదిన్
ప్రాఙ్నగమందు శంభుడు సుభద్రను గూడగ బుట్టె వాలియే