8-7-2021 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“చెడెనయ్యో కృష్ణుచేఁ గుచేలుని యాశల్”(లేదా...)“త్రుంచెను కృష్ణుఁ డాగ్రహముతోడఁ గుచేలుని యాశ లన్నిఁటిన్”
కృష్ణుడాగ్రహముతోడ
అడుగకనిచ్చెడిదేవుఁడుకడివెడుకన్నీళులకునుకరుగడుగదరావడిగానీయఁడుజీతముచెడెనయ్యోక్రుష్ణుచేకుచేలునియాశల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "అడుగక యిచ్చెడి... కృష్ణుచే..." అనండి.
సవరించుకుటానండి
మించెను నూరు తప్పులు సహించనుయన్చును ఛేది రాజునున్ త్రుంచెను కృష్ణుఁ డాగ్రహముతోడఁ ; గుచేలుని యాశ లన్నిఁటిన్”మంచిగ తీర్చె , మాధవుడు మారుని తండ్రి యశోద పుత్రుడున్సంచిత పాప పుణ్యములు చక్కగనెంచెడు దేవ దేవుడే...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "సహించ నటంచును చేది రాజునున్..." అనండి.
ధన్యవాదములండీసవరణకు 🙏🏻🙏🏻
సమస్య :చెడెనయ్యో కృష్ణుచే గుచేలుని యాశల్ ( అష్టభార్యలతో కలిసి మాధవుడు కావించిన సపర్యలకు మురిసిపోయిన కుచేలుడు ) బిడియము బడియె సఖుడు దన యెడ జూపు నపారమమత కెడదయె పొంగన్ ;అడుగుట మరచెను విప్రుడు ;చెడెనయ్యో ! కృష్ణుచే గుచేలుని యాశల్ .
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
జడుడైన రుక్మి యెదురై చెడె నయ్యో కృష్ణుచే :గుచేలుని యాశల్ వడి నెరవేరెను గృపతో పొడమిన నెయ్యమున దన్ను పొల్పుగ గనగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ముడివడిన పేదరికమదిచెడెనయ్యో , కృష్ణుచేఁ గుచేలుని యాశల్”వడి వడిగను తీరెను హరిబడి స్నేహము మరువక మురిపమ్మున బ్రోచెన్...భారతీనాథ్ చెన్నంశెట్టి...
ధన్యవాజములండీ
క్రొవ్విడి వెంకట రాజారావు: ముడుపును కోరగ వచ్చియు బిడియముతో మాటరాక వెన్నుని మమతన్ గుడుచుచు స్మృతి మరచిన వడి చెడెనయ్యో ! కృష్ణుచే గుచేలుని యాశల్
పెంచినజీతభత్యములుపేదకుగుండెకుమంటనార్పునాఎంచగజీవయాత్రకునునేవిధిచాలవుమండెనేధరల్మించెనుమాటలన్ప్రభువునెన్నికవేళనునేర్పుమీరగాత్రుంచెనుక్రుష్ణుడాగ్రహముతోడఁగుచేలునియాశలన్నిటన్
రెండింటిని ఒకే చోట..కందంవడి దారిద్ర్యమ్మంతయుచెడెనయ్యో కృష్ణుచేఁ, గుచేలుని యాశల్గడుమోదమ్మునఁ బండెనుబిడికెడు నటుకులఁ దిన హరి విడ్డూరముగన్ఉత్పలమాలమించిన నిందలన్ హరిని మెచ్చక మీరిన చేదిరాజునేత్రుంచెను కృష్ణుఁ డాగ్రహముతోడఁ, గుచేలుని యాశ లన్నిఁటిన్,బంచకు వచ్చె నేస్తమని పట్టుచు నార్ఘ్యము పాదసేవతోనంచితరీతిగానలర నాదరణంబును జూపి తీర్చెనే
👌
🙏ధన్యోస్మి గురుదేవా🙏
కడివెడు సంతానంబునముడివడి దారిద్ర్యదుఃఖ భూయిష్టమునౌసుడిగుండంబున మున్గకచెడెనయ్యో కృష్ణుచే కుచేలుని యాశల్మించిన మూర్ఖతన్ దనకు మేలును జేసిన బావగారినేవంచకుడంచు బ్రేలగ సభాంగణ మందున ఛేదిపాలుడేద్రుంచెను కృష్ణుడాగ్రహము తోడ; గుచేలుని యాశలన్నిటిన్నించుక గోరకుండగనె హెచ్చుగదీర్చెను శ్రీధరుండునై
🙏🙏🙏
వంచకుడైన క్రూర శిశు పాలునియందరు జూచు చుండగాద్రుంచెను కృష్ణు డాగ్రహముతోడ,కుచేలుని యాశలన్నిటిన్మించిన ప్రేమతోడ తన మిత్రునియట్కుల నారగించి తాబెంచియు మిత్రు సంపదలు పేర్మినిదీర్చెను సంతసించగాన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "శిశుపాలుని నందరు.." అనండి.
ఉ: పంచన జేర వచ్చితిని బాల్యపు పోకడ, మానమేమియౌ ? కొంచెము చింత సేయకనె గొప్పగ దల్చితి యెట్టు లౌనటో ! యంచను నంత లోన, దన యందలి ప్రేమను నొక్కిచెప్పగా ద్రుంచెను కృష్ణు డాగ్రహము తోడ గుచేలుని యాశ లన్నిటిన్మానము =గౌరవము వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "...దల్చితి నెట్టులౌనొకో" అనండి.
ధన్యవాదములు
వంచకుడైన క్రూర శిశు పాలు శిరంబును జక్రధారచేద్రుంచెను కృష్ణు డాగ్రహముతోడ,కుచేలుని యాశలన్నిటిన్మించిన ప్రేమతోడ తన మిత్రునియట్కుల నారగించి తబెంచియు మిత్రు సంపదలు పేర్మనిదీర్చెను సంతసించగాన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "తా బెంచియు" టైపాటు.
అడిగెద సంపద ననిగదపిడికెడటుకుల గొనితెచ్చి బిడియము తోడన్ వెడలుట గనినే తలచితిచెడెనయ్యో కృష్ణుచే గుచేలుని యాశల్.ఇంచుక జాలిచూపక మహీసురు గాంచిన దండవాది నిష్కించునుడంచు నాలిగొను సేవిత వెంబర విత్తు గర్వమున్ ద్రుంచెను కృష్ణుడాగ్రహము తోడఁ గుచేలుని యాశలన్నిటిన్ గొంచెము నైన తగ్గకను గూర్చె సఖుండను గారవమ్ముతోన్.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
విడువకనా బాల్య సఖునిగడు ప్రేమగ నాదరించె గద కృష్ణుండేవిడుమా ప్రల్లదనంబెటుచెడెనయ్యో కృష్ణుచేఁ గుచేలుని యాశల్
వంచకుడైన చైద్యుడటు ప్రల్లదనంబును జూప నాతనిన్ద్రుంచెను కృష్ణుఁ డాగ్రహముతోడఁ; గుచేలుని యాశ లన్నిఁటిన్మించెను ప్రేమతోననుఁగు మిత్రునికిచ్చెను సర్వ సంపదల్;పంచెను దేవదేవుడిల వారల కర్మ ఫలంబులివ్విధిన్
ఉత్పలమాల:కాంచుటె భాగ్య మయ్యె చిరకాలపు మిత్రుని చక్రధారినిన్ సంచిత పాపబంధనపు చక్రము నందు భరించు బాధలన్ “త్రుంచెను కృష్ణుఁ డాగ్రహముతోడఁ,గుచేలుని యాశ లన్నిఁటిన్”గాంచెను మూటనున్న బహు కమ్మని స్నేహపు తాయిలమ్ము నన్ !--కటకం వేంకటరామశర్మ.
ధన్యుడనార్యా!
ముంచుకు వచ్చి గాలి వలె మోహన రూపుని బాలకృష్ణునిన్మించుతు నెత్త రక్కసుడు మీదికి; కంసుని బంటు వానినిన్త్రుంచెను కృష్ణుఁ డాగ్రహముతోడ;గుచేలుని యాశ లన్నిఁటిన్సంచిత కర్మతీర మరి శౌరియె తీర్చెను స్నేహమూర్తియై.కడకును దుష్టుడు కంసుడుచెడెనయ్యో కృష్ణుచే; గుచేలుని యాశల్కడువడి గతీర్చ బడె కృష్ణుడి దయతోడ, నటుకులను శుచిగా తినుచున్.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. "మించుచు నెత్త.." అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
అడుగకవచ్చిన సంపదచెడుపును తననని భయపడి చేదస్తుండైమిడుకుచు సుధాముడు తలచెచెడెనయ్యో కృష్ణుచేఁ గుచేలుని యాశల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'చేదస్తుండు' అన్న రూపం సాధువు కాదు.
సవరణతో....అడుగకవచ్చిన సంపదచెడుపును తననని భయమున జిక్కిన వాడైమిడుకుచు సుధాముడు తలచెచెడెనయ్యో కృష్ణుచేఁ గుచేలుని యాశల్
కడు యాశ తోడ నెయ్యునికెడకు వెడల నతడు బంపె కించిత్తయినన్విడిముడి నొసంగ కుండగ ,జెడెనయ్యో కృష్ణుచేఁ గుచేలుని యాశల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'కడు నాశ...' అనండి.
బిడెమున నేగగ నెనరునకడుమోదముతోడ విప్ర కామిత ఫలమైపొడమెను సిరి "దారిద్ర్యముచెడెనయ్యో" కృష్ణుచేఁ గుచేలుని యాశల్!ఎంచుక తా జనె న్దగ ననిష్టత తోడుత గృష్ణుచెంత కున్నెంచుచు స్నేహభావముననేర్పడ విప్రుని సేవజేసి ప్రేమాంచిత ధర్మమున్దలచియార్ద్రమనంబిక నూఱడిల్లగన్ద్రుంచెను కృష్ణుఁ డాగ్రహముతోడఁ గుచేలుని యాశ లన్నిఁటిన్!
పెడసరమున కంసుడు మునుచెడెనయ్యో కృష్ణుచేఁ, గుచేలుని యాశల్పిడికెడు యటుకులు దీర్చెనుకడుచిత్రము దైవలీల గమనింపంగన్
అడుగుచు నుంటిని జెప్పుమబడుగుంవలె మాటలాడ భావ్యమె జ్యోతీ!బిడియము లేదే యిటులనచెడెనయ్యో కృష్ణుచే గుచేలుని యాశల్
సంచితభుక్తిభావిగతసంభృతకర్మవిదూరకమ్ములైమించిన శ్రీయదుప్రవరు మేటి పదమ్ముల సేవఁ గోర,వారించుచు నీకు నున్నది యదేగద యంచును శ్రీ నొసంగి దాఁద్రుంచెను కృష్ణుఁ డాగ్రహముతోడఁ గుచేలుని యాశ లన్నిఁటిన్.'నీ పాదకమల సేవయు'భాగవతం లో కుచేలుని కోరిక.కంజర్ల రామాచార్య.
అడుగిడ భూషిత యౌ రతిపడతి తనసతిఁ గన నెఱిఁగె బాల్యసఖు దయన్ వడి ననుకొనెఁ దా నివ్విధిఁ జెడె నయ్యో కృష్ణుచేఁ గుచేలుని యాశల్ [రతిపడతి యాచ్ఛిక సమాసము; రత్నాలతూనిక వంటి పడతి]పంచఁగ వాయ కోత్తముఁడు బట్టలు మంచివి వాసుదేవ నామాంచిత యుగ్మ మం చెఱిఁగి యాతని మెచ్చి యొసంగె సంపదల్ వంచకు దుష్టు రా రజకు వస్త్రము లిమ్మనఁ దిట్ట దిట్టయై త్రుంచెను కృష్ణుఁ డాగ్రహముతోడఁ గుచేలుని యాశ లన్నిఁటిన్ [కుచేలుఁడు = చెడ్డ బట్టల నూనిన వాఁడు]
సంచితపాపకర్మమను సర్పము తానయి కంసు మామనున్త్రుంచెను కృష్ణుఁ డాగ్రహముతోడఁ, గుచేలుని యాశ లన్నిఁటిన్మంచిగదీర్చె స్నేహితుని మన్ననజేసి సమాదరించుచున్పంచును దైవమెల్లరకు బాయక కర్మఫలంబు లివ్విధిన్
ఎంచగ లెక్కకున్ శతము మీరిన ఛేదినృ పాలునిన్ త్రుంచెను కృష్ణుడాగ్రహముతోడ,కుచేలుని యాశలన్నిటిన్ మంచిగ గూర్చెనాజగము బాలన జేసెడు నందపుత్రుడేయంచిత భక్తినిన్ గొలువ యాయువు సంపద నిచ్చుదప్పకన్
కె.వి.యస్. లక్ష్మి:కడు పేదరికంబంతయు చేడెనయ్యో! కృష్ణుచే; కుచేలుని యాశల్ వడివడిగా దీరెను గద నడిమంత్రపు సిరులమరగ నగధరు వలనన్.
పంచక ప్రేమ నల్లునకు వంచన చేయగ మామ కంసునిన్త్రుంచెను కృష్ణుఁ డాగ్రహముతోడఁ, గుచేలుని యాశ లన్నిఁటిన్,సంచిని తెచ్చియుంచిన ప్రసాదము గైకొని, తీర్చనెంచుచున్,మంచిగ సత్కరించి మహిమన్ సమకూర్చె విభూతి ప్రీతితో
కృష్ణుడాగ్రహముతోడ
రిప్లయితొలగించండిఅడుగకనిచ్చెడిదేవుఁడు
రిప్లయితొలగించండికడివెడుకన్నీళులకునుకరుగడుగదరా
వడిగానీయఁడుజీతము
చెడెనయ్యోక్రుష్ణుచేకుచేలునియాశల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"అడుగక యిచ్చెడి... కృష్ణుచే..." అనండి.
సవరించుకుటానండి
తొలగించండిమించెను నూరు తప్పులు సహించనుయన్చును ఛేది రాజునున్
రిప్లయితొలగించండిత్రుంచెను కృష్ణుఁ డాగ్రహముతోడఁ ; గుచేలుని యాశ లన్నిఁటిన్”
మంచిగ తీర్చె , మాధవుడు మారుని తండ్రి యశోద పుత్రుడున్
సంచిత పాప పుణ్యములు చక్కగనెంచెడు దేవ దేవుడే
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"సహించ నటంచును చేది రాజునున్..." అనండి.
ధన్యవాదములండీ
తొలగించండిసవరణకు 🙏🏻🙏🏻
సమస్య :
రిప్లయితొలగించండిచెడెనయ్యో కృష్ణుచే గుచేలుని యాశల్
( అష్టభార్యలతో కలిసి మాధవుడు కావించిన సపర్యలకు మురిసిపోయిన కుచేలుడు )
బిడియము బడియె సఖుడు దన
యెడ జూపు నపారమమత కెడదయె పొంగన్ ;
అడుగుట మరచెను విప్రుడు ;
చెడెనయ్యో ! కృష్ణుచే గుచేలుని యాశల్ .
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిజడుడైన రుక్మి యెదురై
రిప్లయితొలగించండిచెడె నయ్యో కృష్ణుచే :గుచేలుని యాశల్
వడి నెరవేరెను గృపతో
పొడమిన నెయ్యమున దన్ను పొల్పుగ గనగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిముడివడిన పేదరికమది
రిప్లయితొలగించండిచెడెనయ్యో , కృష్ణుచేఁ గుచేలుని యాశల్”
వడి వడిగను తీరెను హరి
బడి స్నేహము మరువక మురిపమ్మున బ్రోచెన్
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాజములండీ
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిముడుపును కోరగ వచ్చియు
బిడియముతో మాటరాక వెన్నుని మమతన్
గుడుచుచు స్మృతి మరచిన వడి
చెడెనయ్యో ! కృష్ణుచే గుచేలుని యాశల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపెంచినజీతభత్యములుపేదకుగుండెకుమంటనార్పునా
రిప్లయితొలగించండిఎంచగజీవయాత్రకునునేవిధిచాలవుమండెనేధరల్
మించెనుమాటలన్ప్రభువునెన్నికవేళనునేర్పుమీరగా
త్రుంచెనుక్రుష్ణుడాగ్రహముతోడఁగుచేలునియాశలన్నిటన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరెండింటిని ఒకే చోట..
రిప్లయితొలగించండికందం
వడి దారిద్ర్యమ్మంతయు
చెడెనయ్యో కృష్ణుచేఁ, గుచేలుని యాశల్
గడుమోదమ్మునఁ బండెను
బిడికెడు నటుకులఁ దిన హరి విడ్డూరముగన్
ఉత్పలమాల
మించిన నిందలన్ హరిని మెచ్చక మీరిన చేదిరాజునే
త్రుంచెను కృష్ణుఁ డాగ్రహముతోడఁ, గుచేలుని యాశ లన్నిఁటిన్,
బంచకు వచ్చె నేస్తమని పట్టుచు నార్ఘ్యము పాదసేవతో
నంచితరీతిగానలర నాదరణంబును జూపి తీర్చెనే
👌
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండికడివెడు సంతానంబున
రిప్లయితొలగించండిముడివడి దారిద్ర్యదుఃఖ భూయిష్టమునౌ
సుడిగుండంబున మున్గక
చెడెనయ్యో కృష్ణుచే కుచేలుని యాశల్
మించిన మూర్ఖతన్ దనకు మేలును జేసిన బావగారినే
వంచకుడంచు బ్రేలగ సభాంగణ మందున ఛేదిపాలుడే
ద్రుంచెను కృష్ణుడాగ్రహము తోడ; గుచేలుని యాశలన్నిటి
న్నించుక గోరకుండగనె హెచ్చుగదీర్చెను శ్రీధరుండునై
👌
తొలగించండి🙏🙏🙏
తొలగించండివంచకుడైన క్రూర శిశు పాలుని
రిప్లయితొలగించండియందరు జూచు చుండగా
ద్రుంచెను కృష్ణు డాగ్రహముతోడ,
కుచేలుని యాశలన్నిటిన్
మించిన ప్రేమతోడ తన మిత్రుని
యట్కుల నారగించి తా
బెంచియు మిత్రు సంపదలు పేర్మిని
దీర్చెను సంతసించగాన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"శిశుపాలుని నందరు.." అనండి.
ఉ:
రిప్లయితొలగించండిపంచన జేర వచ్చితిని బాల్యపు పోకడ, మానమేమియౌ ?
కొంచెము చింత సేయకనె గొప్పగ దల్చితి యెట్టు లౌనటో !
యంచను నంత లోన, దన యందలి ప్రేమను నొక్కిచెప్పగా
ద్రుంచెను కృష్ణు డాగ్రహము తోడ గుచేలుని యాశ లన్నిటిన్
మానము =గౌరవము
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"...దల్చితి నెట్టులౌనొకో" అనండి.
ధన్యవాదములు
తొలగించండివంచకుడైన క్రూర శిశు పాలు
రిప్లయితొలగించండిశిరంబును జక్రధారచే
ద్రుంచెను కృష్ణు డాగ్రహముతోడ,
కుచేలుని యాశలన్నిటిన్
మించిన ప్రేమతోడ తన మిత్రుని
యట్కుల నారగించి త
బెంచియు మిత్రు సంపదలు
పేర్మనిదీర్చెను సంతసించగాన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"తా బెంచియు" టైపాటు.
రిప్లయితొలగించండిఅడిగెద సంపద ననిగద
పిడికెడటుకుల గొనితెచ్చి బిడియము తోడన్
వెడలుట గనినే తలచితి
చెడెనయ్యో కృష్ణుచే గుచేలుని యాశల్.
ఇంచుక జాలిచూపక మహీసురు గాంచిన దండవాది ని
ష్కించునుడంచు నాలిగొను సేవిత వెంబర విత్తు గర్వమున్
ద్రుంచెను కృష్ణుడాగ్రహము తోడఁ గుచేలుని యాశలన్నిటిన్
గొంచెము నైన తగ్గకను గూర్చె సఖుండను గారవమ్ముతోన్.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండివిడువకనా బాల్య సఖుని
రిప్లయితొలగించండిగడు ప్రేమగ నాదరించె గద కృష్ణుండే
విడుమా ప్రల్లదనంబెటు
చెడెనయ్యో కృష్ణుచేఁ గుచేలుని యాశల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివంచకుడైన చైద్యుడటు ప్రల్లదనంబును జూప నాతనిన్
రిప్లయితొలగించండిద్రుంచెను కృష్ణుఁ డాగ్రహముతోడఁ; గుచేలుని యాశ లన్నిఁటిన్
మించెను ప్రేమతోననుఁగు మిత్రునికిచ్చెను సర్వ సంపదల్;
పంచెను దేవదేవుడిల వారల కర్మ ఫలంబులివ్విధిన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఉత్పలమాల:
రిప్లయితొలగించండికాంచుటె భాగ్య మయ్యె చిరకాలపు మిత్రుని చక్రధారినిన్
సంచిత పాపబంధనపు చక్రము నందు భరించు బాధలన్
“త్రుంచెను కృష్ణుఁ డాగ్రహముతోడఁ,గుచేలుని యాశ లన్నిఁటిన్”
గాంచెను మూటనున్న బహు కమ్మని స్నేహపు తాయిలమ్ము నన్ !
--కటకం వేంకటరామశర్మ.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యుడనార్యా!
తొలగించండిముంచుకు వచ్చి గాలి వలె మోహన రూపుని బాలకృష్ణునిన్
రిప్లయితొలగించండిమించుతు నెత్త రక్కసుడు మీదికి; కంసుని బంటు వానినిన్
త్రుంచెను కృష్ణుఁ డాగ్రహముతోడ;గుచేలుని యాశ లన్నిఁటిన్
సంచిత కర్మతీర మరి శౌరియె తీర్చెను స్నేహమూర్తియై.
కడకును దుష్టుడు కంసుడు
చెడెనయ్యో కృష్ణుచే; గుచేలుని యాశల్
కడువడి గతీర్చ బడె కృ
ష్ణుడి దయతోడ, నటుకులను శుచిగా తినుచున్.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి"మించుచు నెత్త.." అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅడుగకవచ్చిన సంపద
తొలగించండిచెడుపును తననని భయపడి చేదస్తుండై
మిడుకుచు సుధాముడు తలచె
చెడెనయ్యో కృష్ణుచేఁ గుచేలుని యాశల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'చేదస్తుండు' అన్న రూపం సాధువు కాదు.
సవరణతో....
తొలగించండిఅడుగకవచ్చిన సంపద
చెడుపును తననని భయమున జిక్కిన వాడై
మిడుకుచు సుధాముడు తలచె
చెడెనయ్యో కృష్ణుచేఁ గుచేలుని యాశల్
కడు యాశ తోడ నెయ్యుని
రిప్లయితొలగించండికెడకు వెడల నతడు బంపె కించిత్తయినన్
విడిముడి నొసంగ కుండగ ,
జెడెనయ్యో కృష్ణుచేఁ గుచేలుని యాశల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కడు నాశ...' అనండి.
బిడెమున నేగగ నెనరున
రిప్లయితొలగించండికడుమోదముతోడ విప్ర కామిత ఫలమై
పొడమెను సిరి "దారిద్ర్యము
చెడెనయ్యో" కృష్ణుచేఁ గుచేలుని యాశల్!
ఎంచుక తా జనె న్దగ న
నిష్టత తోడుత గృష్ణుచెంత కు
న్నెంచుచు స్నేహభావమున
నేర్పడ విప్రుని సేవజేసి ప్రే
మాంచిత ధర్మమున్దలచి
యార్ద్రమనంబిక నూఱడిల్లగన్
ద్రుంచెను కృష్ణుఁ డాగ్రహము
తోడఁ గుచేలుని యాశ లన్నిఁటిన్!
పెడసరమున కంసుడు మును
రిప్లయితొలగించండిచెడెనయ్యో కృష్ణుచేఁ, గుచేలుని యాశల్
పిడికెడు యటుకులు దీర్చెను
కడుచిత్రము దైవలీల గమనింపంగన్
అడుగుచు నుంటిని జెప్పుమ
రిప్లయితొలగించండిబడుగుంవలె మాటలాడ భావ్యమె జ్యోతీ!
బిడియము లేదే యిటులన
చెడెనయ్యో కృష్ణుచే గుచేలుని యాశల్
సంచితభుక్తిభావిగతసంభృతకర్మవిదూరకమ్ములై
రిప్లయితొలగించండిమించిన శ్రీయదుప్రవరు మేటి పదమ్ముల సేవఁ గోర,వా
రించుచు నీకు నున్నది యదేగద యంచును శ్రీ నొసంగి దాఁ
ద్రుంచెను కృష్ణుఁ డాగ్రహముతోడఁ గుచేలుని యాశ లన్నిఁటిన్.
'నీ పాదకమల సేవయు'
భాగవతం లో కుచేలుని కోరిక.
కంజర్ల రామాచార్య.
అడుగిడ భూషిత యౌ రతి
రిప్లయితొలగించండిపడతి తనసతిఁ గన నెఱిఁగె బాల్యసఖు దయన్
వడి ననుకొనెఁ దా నివ్విధిఁ
జెడె నయ్యో కృష్ణుచేఁ గుచేలుని యాశల్
[రతిపడతి యాచ్ఛిక సమాసము; రత్నాలతూనిక వంటి పడతి]
పంచఁగ వాయ కోత్తముఁడు బట్టలు మంచివి వాసుదేవ నా
మాంచిత యుగ్మ మం చెఱిఁగి యాతని మెచ్చి యొసంగె సంపదల్
వంచకు దుష్టు రా రజకు వస్త్రము లిమ్మనఁ దిట్ట దిట్టయై
త్రుంచెను కృష్ణుఁ డాగ్రహముతోడఁ గుచేలుని యాశ లన్నిఁటిన్
[కుచేలుఁడు = చెడ్డ బట్టల నూనిన వాఁడు]
సంచితపాపకర్మమను సర్పము తానయి కంసు మామనున్
రిప్లయితొలగించండిత్రుంచెను కృష్ణుఁ డాగ్రహముతోడఁ, గుచేలుని యాశ లన్నిఁటిన్
మంచిగదీర్చె స్నేహితుని మన్ననజేసి సమాదరించుచున్
పంచును దైవమెల్లరకు బాయక కర్మఫలంబు లివ్విధిన్
ఎంచగ లెక్కకున్ శతము మీరిన ఛేదినృ పాలునిన్
రిప్లయితొలగించండిత్రుంచెను కృష్ణుడాగ్రహముతోడ,కుచేలుని యాశలన్నిటిన్
మంచిగ గూర్చెనాజగము బాలన జేసెడు నందపుత్రుడే
యంచిత భక్తినిన్ గొలువ యాయువు సంపద నిచ్చుదప్పకన్
కె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించండికడు పేదరికంబంతయు
చేడెనయ్యో! కృష్ణుచే; కుచేలుని యాశల్
వడివడిగా దీరెను గద
నడిమంత్రపు సిరులమరగ నగధరు వలనన్.
పంచక ప్రేమ నల్లునకు వంచన చేయగ మామ కంసునిన్
రిప్లయితొలగించండిత్రుంచెను కృష్ణుఁ డాగ్రహముతోడఁ, గుచేలుని యాశ లన్నిఁటిన్,
సంచిని తెచ్చియుంచిన ప్రసాదము గైకొని, తీర్చనెంచుచున్,
మంచిగ సత్కరించి మహిమన్ సమకూర్చె విభూతి ప్రీతితో