11, జులై 2021, ఆదివారం

సమస్య - 3779

12-7-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మానిసి మానుషము వీడి మర్కటమయ్యెన్”
(లేదా...)
“మానిసి మానుషంబు విడి మర్కటమయ్యె నిదేమి చోద్యమో”

64 కామెంట్‌లు:

 1. మానినినల్లరి పెట్టుచు

  మానిసి మానుషము వీడి మర్కటమయ్యెన్

  జానకి జాడను కనియును

  వానరమయ్యెను మనుజుని పాలిట నేస్తం

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నేస్తం' అనడం వ్యావహారికం. "పాలిట హితుడున్" అందామా?

   తొలగించండి
 2. మానియు కారుణ్యార్ద్ర త
  దానవ గుణము లలవడ న ధర్మ పరుండై
  మాన్యత మరచిన వాడై
  మానిసి మానుషము వీడి మర్కట మయ్యెన్

  రిప్లయితొలగించండి

 3. మానాభిమానము విడి ప
  రానుకరణమె పెరుగగ ధరణియందున బో
  షాణములను నింపదలచి
  మానిసి మానుషము వీడి మర్కట మయ్యెన్.

  రిప్లయితొలగించండి
 4. కందం
  తేనియ తుట్టెల పండ్లనుఁ
  దానందుచుఁ ద్రాగి తినగఁ దరుశాఖలపై
  హీనుఁడధికారమందగ
  మానిసి మానుషము వీడి మర్కటమయ్యెన్

  ఉత్పలమాల
  తేనియ తుట్టెలున్ ఫలము దీరిన శాఖలపైకి దూకుచుం
  బానము జేయుచున్ దినుచు మానసమందున హాయిఁబొందెడున్
  వైనము నచ్చి మేలొనర పట్టగ వారధికారపక్షమున్
  మానిసి మానుషంబు విడి మర్కటమయ్యె నిదేమి చోద్యమో!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కందం
   హీనుడుగా తమ్ముని సతి
   బూనుచు నా వాలి కూలె, మూర్ఖతనైనన్
   మానక నన్యులఁ గోరుచు
   మానిసి మానుషము వీడి మర్కటమయ్యెన్

   ఉత్పలమాల
   తానొక రాజు వాలి తన తమ్ముని భార్యను బట్టి మోహియై
   హీనుడు గూలెనే రఘకులేంద్రుని బాణము మట్టుపెట్టఁగా
   నైనను నన్యకాంతలను నందఁగ జూచుచు వావిఁ జూడకే
   మానిసి మానుషంబు విడి మర్కటమయ్యె నిదేమి చోద్యమో!

   తొలగించండి
  2. మీ పూరణలన్నీ ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 5. దానవు మైత్రి జేయుచును ధర్మ
  ము దప్పి చరించుచున్ సదా
  కాని కుకార్యముల్ సలిపి కష్ట
  ము పాలొనరించి యన్యులన్
  మానియు మానవత్వమును
  మంచిని సద్గుణ సత్ప్రవర్తనన్
  మానిసి మానసంబు విడి మర్క
  ట మయ్యె నిదేమి చిత్రమో.
  ~~~~~~~~~~~~~~~~

  రిప్లయితొలగించండి
 6. పూనిక నేర్చి వానరము పొందిక గెంతెను రెండు కాళ్ళనన్

  మానవులెల్లరున్గనిరి మల్లును వింతగ జంతు శాలనన్

  మానిని హంగు పొంగుగని మర్కట రీతుల గోల చేసెరా

  మానిసి మానుషంబు విడి మర్కటమయ్యె నిదేమి చోద్యమో”

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 7. కానగవచ్చెడిమందును
  పూనికతోడనుకనుగోనభూతలమందున్
  తానిటనటనేవెదకుచు
  మానిసిమానుషమువీడిమర్కటమయ్యెన్

  రిప్లయితొలగించండి

 8. కానరు తల్లిదండ్రులను గారవ మీయరు బంధుకోటికినో
  ప్రాణము లేని రూకలకు బానిసలౌచు నిరంతరంబు తా
  మానిధి వేటలాడుటకహర్నిశలున్ శ్రమియించుచున్ భువిన్
  మానిసి మానుషంబు విడి మర్కటమయ్యెనిదేమి చోద్యమో!

  రిప్లయితొలగించండి
 9. మానవత విస్మరించుచు
  మానిని మాన హరణమ్మె మగటిమియనుచున్
  మానసమందున తలచెడి
  మానిసి మానుషము వీడి మర్కటమయ్యెన్

  రిప్లయితొలగించండి
 10. తాను విశాల విశ్వ పథ
  తత్వ విచారణ జేయ గల్గియున్
  బూనిక నింప నేర్వడు వి
  ముక్తము నొందగ మార్గమంద డా
  మానిత శక్తియుక్తుల స
  మత్వ మహత్వము నంద జాల డీ
  మానిసి మానుషంబు విడి
  మర్కటమయ్యె నిదేమి చోద్యమో!

  రిప్లయితొలగించండి
 11. బానిసయై మద్యమునకు
  మేనుమరచి యసురవృత్తి మించిన కోర్కెన్
  చేనున భామనుగని రా
  మా! నిసి మానుషమువీడి మర్కటమయ్యెన్

  తానొక బ్రహ్మవంశజుడు ధర్మము దప్పనివానిగా బగల్
  మానితుడై జెలంగుచును మాటున పూటుగ ద్రాగిమత్తులో
  జాణల గూడుచున్ ఖలుల సంగతి నాడగ నేమనందు రా
  మా! నిసి మానుషంబువిడి మర్కటమయ్యె నిదేమి చోద్యమో?

  రిప్లయితొలగించండి
 12. వేనకువేలువేదనలువేగనుఁదీర్చగబాసఁజేసియున్
  కానగమంత్రిపీఠమునుఖాతరుఁజేయకమాటఁదప్పుచున్
  తానికనీతిమార్గమునుతాకటుపెట్టెనునేటినేతయే
  మానిసిమానుషంబువిడిమర్కటమయ్యెనిదేమిచోద్యమో

  రిప్లయితొలగించండి
 13. వానర జన్యువుమారుచు
  మానవ రూపును బడసెను మరవక దలపన్
  తానే తిరోగమనమున
  మానిసి మానుషము వీడి మర్కటమయ్యెన్

  రిప్లయితొలగించండి
 14. తానా రాముని గలిసెను
  మానవ రూపమున హనుమ మైత్రిని గోరెన్
  ఆనతినిడనచ్చెరువున
  మానిసి మానుషము వీడి మర్కటమయ్యెన్

  రిప్లయితొలగించండి
 15. ఉ:

  వానర రూపమే వరుస వంతగు మార్పిడి నొంద నెప్పుడో
  మానవు డుద్భవించె నను మాటను నమ్మిన లోకమిత్తరిన్
  మానము నెంచకుండిరట మాతృక నాకృతి రూపుదిద్దగా
  మానిసి మానుషంబు విడి మర్కట మయ్యె నిదేమి చోద్యమో

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 16. నేనాదినమున జూచితి
  కూనను హరి యొకటి తీసుకొని చనుచుండన్
  వానరుల నడుమ నెదుగగ
  మానిసి మానుషము వీడి మర్కటమయ్యెన్

  రిప్లయితొలగించండి
 17. ఉత్పలమాల:
  వానర లక్షణంబు లవి వాలుచు కొమ్మల నూయలూగుచున్
  తానుభుజించుకొన్ని పెడదారిన వైచు మరెన్ని పండ్లనో !
  మానసమెంతచంచలమొ? మాయప్రపంచమునందు వ్యర్ధుడై
  *మానిసి మానుషంబు విడి మర్కటమయ్యె నిదేమి చోద్యమో?*
  --కటకం వేంకటరామశర్మ.

  రిప్లయితొలగించండి
 18. కానగ మేధ హెచ్చగుచు గారవమున్ గొని చెంగలించగా
  జ్ఞానముతో జగమ్ము నొక గ్రామముగా బదిలింప జేసియున్
  మానిని మానమున్ జెఱచు మార్గమునన్ జరియింప నెంచుచున్
  మానిసి మానుషంబు విడి మర్కటమయ్యె నిదేమి చోద్యమో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రెండవ పాదంలో "జగమ్ము" ను "డ నుర్వి" గా సవరించుకొన ప్రార్థన.
   సవరించిన పద్యం:
   కానగ మేధ హెచ్చగుచు గారవమున్ గొని చెంగలించగా
   జ్ఞానముతోడ నుర్వి నొక గ్రామముగా బదిలింప జేసియున్
   మానిని మానమున్ జెఱచు మార్గమునన్ జరియింప నెంచుచున్
   మానిసి మానుషంబు విడి మర్కటమయ్యె నిదేమి చోద్యమో

   తొలగించండి
 19. సమస్య :

  మానిసి మానుషంబు విడి
  మర్కటమయ్యె నిదేమి చోద్యమో

  (శ్రీనాథమహాకవి శివరాత్రిమాహాత్మ్యంలో
  శిష్టపథాన్ని వీడిన మంత్రిపుత్రుడు సుకుమారుడు )

  ఉత్పలమాల
  -------------
  కానడు తల్లిదండ్రులను ;
  గణ్యత బాసెను సంఘమందునన్ ;
  వీనుల బెట్ట డింతయును
  విజ్ఞుల మాటల నెన్నిజెప్పినన్ ;
  మానడు దౌష్ట్యమిట్లు సుకు
  మారుడు ; మంత్రిసుతుండు ; హా విధీ !
  మానిసి మానుషంబు విడి
  మర్కటమయ్యె నిదేమి చోద్యమో !!

  రిప్లయితొలగించండి
 20. తానిట స్వస్థతన్ గొనుచు దార్ఢ్యత నందగ కారణంబునై
  మానక సద్ధితం బెపుడు మైమరపించుచు జేయు వృక్షసం
  తానము గూల్చుచుండె సుఖదం బిది కాదను మాటెరింగియున్
  మానిసి, మానుషంబు విడి మర్కటమయ్యె నిదేమి చోద్యమో.

  రిప్లయితొలగించండి
 21. పానము చేయుచున్ మదిర పండితవర్యుల త్రోసివేయుచున్
  జ్ఞానవిహీనుడై పలుసుఖమ్ముల తేలుచు స్వార్థబుద్ధితో
  దానవుడై చెలంగుచును దారుణ కృత్యములందు మున్గి యీ
  మానిసి, మానుషంబు విడి మర్కటమయ్యె నిదేమి చోద్యమో?

  రిప్లయితొలగించండి
 22. మానవజన్మ నెత్తి యసమానదశేంద్రియసైంధవమ్ములన్
  మానసకంఠపాశమును మానితధీరథచోదకత్వసం
  ధానితశక్తిఁ గల్గియు నధర్మపథాంఘ్రిపలంఘనమ్ములన్
  మానిసి మానుషంబు విడి మర్కటమయ్యె నిదేమి చోద్యమో!

  కంజర్ల రామాచార్యులు.

  రిప్లయితొలగించండి
 23. తానొక దివ్యతేజమను ధ్యాస యొకింతయులేక మాయతో
  మేనును నామమున్ గొనుచు మేదినియందున బుట్టిచచ్చుచు
  న్నానుచు నారుశత్రువుల హద్దులుమీరెడి వర్తనమ్మునన్ (చంచలత్వమున్)
  మానిసి మానుషంబువిడి మర్కటమయ్యె నిదేమి చోద్యమో?

  రిప్లయితొలగించండి
 24. ఆనలఁ జేసి గెల్చి,తమ కందిన మేరకు నొక్కివేయగన్
  గానల, నూళ్ళనెల్ల కటఖాదకమై తెగ నాక్రమించగన్
  మానిని గారవింపని యమాత్యుల పోకడ రోఁత బుట్టదే?
  మానిసి మానుషంబు విడి మర్కటమయ్యెనిదేమి చోద్యమో!

  రిప్లయితొలగించండి
 25. కానగ దెలిసెను రమ్యా!
  మానిసి మానుషము వీడి మర్కట మయ్యెన్
  నౌనని,జెప్పక తప్పదు
  మానిసి మానిసి గనుండ మగటిమ యగునున్

  రిప్లయితొలగించండి
 26. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 27. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 28. మానక దుష్ట కార్యములు మాన్యత లేకను బిల్లపాపలన్
  గానగ దోషమేమియును గానకపోయిన సంహరించుటన్
  మానిసి మానుషంబు విడి మర్కటమయ్యె నిదేమి చిత్రమో
  మేనున బుట్టుగావణకు మైకము గల్గుచు జూచినంతనే

  రిప్లయితొలగించండి
 29. కాననమున సుగ్రీవుని
  యానతి రాఘవులఁ గాంచి యయ్యనిలునకున్
  సూనుండు బూటకపు టా
  మానిసి మానుషము వీడి మర్కటమయ్యెన్


  మానవుఁ డుద్భవించె మును మర్కట సంతతి నుండి యెన్నఁగాఁ
  గానఁగ వచ్చు శాస్త్ర చయ గర్భము లందు ధరాతలమ్మునం
  గాన విచిత్ర మెద్దియును గానము సుంతయు స్వార్థ బుద్ధినిన్
  మానిసి మానుషంబు విడి మర్కటమయ్యె నిదేమి చోద్యమో

  రిప్లయితొలగించండి
 30. మానడు స్వార్థ చింతనము, మానడయో పరపీడనంబునే,
  మానడు నీచకృత్యములు, మంచితనంబును విస్మరించెనే,
  మానడు రాజకీయమను మారణహోమము, భోగ లాలసన్
  మానిసి మానుషంబు విడి మర్కటమయ్యె నిదేమి చోద్యమో

  రిప్లయితొలగించండి
 31. మానవ జన్మ సార్ధకత మైమరచెన్ మనుజుండు , చాపల-
  త్వాన ఋణానుబంధముల తా పరగెన్ , భవసంపదంతయున్
  తానొకడే భుజించినను దాహము దీరదిదేమి చిత్రమో !
  మానిసి మానుషంబు విడి -మర్కటమయ్యె నిదేమి చోద్యమో!!.

  రిప్లయితొలగించండి
 32. మానిని శిరీష రోదసి
  యానము తెలుగు ప్రజల మరియాదన్ పెంచెన్
  పూనిక తెచ్చెను తోషము
  మానిసి మానుషము వీడి మర్కటమయ్యెన్

  రిప్లయితొలగించండి
 33. కానక మంచిచెడులు నిల
  కాననములనుచెడగొట్టి కట్టుచు మేడల్
  హీనులవలె వర్తించుచు
  *మానిసి మానుషమువీడి మర్కటమయ్యెన్*

  రిప్లయితొలగించండి