6, జులై 2021, మంగళవారం

సమస్య - 3774

7-7-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తేనీరే తీర్థమగును దేవుని గుడిలో”
(లేదా...)
“తేనీరే యిడనొప్పు దేవళములోఁ దీర్థంబుగా నెప్పుడున్”

71 కామెంట్‌లు:

  1. ఆనగప్రజలనుగావగ
    పూనికయోధులుకరోనభూరిగఁజంపన్
    జానుగపూజారిచ్చిన
    తేనీరేతీర్ధమగునుదేవునిగుడిలో

    రిప్లయితొలగించండి
  2. కందం
    శ్రీనాథుని సేవించుచు
    కానక టెంకాయఁ, బచ్చకర్పూరమ్మున్
    బూనుచు పాత్రనిడి కలిపి
    తే నీరే తీర్థమగును దేవుని గుడిలో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శార్దూలవిక్రీడితము
      నానాపుష్ప ఫలమ్ములన్ మివుల శ్రీనాథార్చితంబెంచుచున్
      గానాదుల్ శ్రుతిసూక్త మన్నటులనే గావించి టెంకాయ మీ
      కానాడున్ గనరాదొ పచ్చనిదినౌ కర్పూరమున్ గల్ప నై
      తే నీరే యిడనొప్పు దేవళములోఁ దీర్థంబుగా నెప్పుడున్

      తొలగించండి
    2. కొన్ని సవరణలతో.‌.

      కందం
      శ్రీనాథుని సేవించుచుఁ
      గానక టెంకాయఁ, బచ్చకర్పూరమ్మున్
      బానమున నొకింతఁ గలిపి
      తే నీరే తీర్థమగును దేవుని గుడిలో


      శార్దూలవిక్రీడితము
      నానాపుష్ప ఫలమ్ములన్ మివుల శ్రీనాథార్చనంబెంచుచున్
      గానాదుల్ శ్రుతిసూక్త మన్నటులనే గావించి టెంకాయ మీ
      కానాడున్ గనరాదొ పచ్చనిదినౌ కర్పూరమున్ గల్ప నై
      తే నీరే యిడనొప్పు దేవళములోఁ దీర్థంబుగా నెప్పుడున్

      తొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. మానిక గల గుడులన్నీ
    దీనుల కును విడు దు లవగ తీవ్రపు వానన్
    బానలకు కాచి పంపిన
    తేనీరే తీర్థమగును దేవుని గుడిలో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "గుడులన్నియు... విడుదులైన..." అనండి.

      తొలగించండి
  5. వేనోళ్ళను గీర్తించుచు
    గానము చేయుచును భక్తి గౌరవ మొప్పన్
    దానొసగిన తులసి కలిపి
    తే నీరు తీర్థ మగును దేవుని గుడిలో

    రిప్లయితొలగించండి
  6. మేనందాఁకినపుర్వునోడుదిశగామేలంచుభావించుచున్
    సానంబెట్టినశాస్త్రమందుగనెనేవిజ్ఞానియంపారగన్
    దానంజేసియువేడినీటగలుపన్దానిచ్చెతేయాకునే
    తేనీరేయిడనోప్పుదేవళములోఁదీర్ధంబుగానెప్పుడున్
    తేనీరేయిడనోప్పుదేవళములోఁదీర్ధంబుగానెప్పుడున్

    రిప్లయితొలగించండి

  7. నేనొక టెంకాయను గొని
    మానికొసంగ నది యేమి మర్మం బనగన్
    జ్ఞానియనుజుడు తెలిపె భ్రా
    తేనీరే తీర్థమగును దేవుని గుడిలో.

    (భ్రాతా+ఈ= భ్రాతే )

    రిప్లయితొలగించండి
  8. రానివ్వదు నిద్దురనా

    తేనీరే ; తీర్థమగును దేవుని గుడిలో

    ప్రాణమ్ములు కాచు జలము

    వాణీ పతి తండ్రి సాక్షి వలసిన వేళన్

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  9. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పూనిన భక్తిని గూడుచు
    శ్రీనాథునకు నభిషేక సేవన్ జేయన్
    బానల జలమును నింపుచు
    తే, నీరే తీర్థమగును దేవుని గుడిలో!

    రిప్లయితొలగించండి

  10. ఆనారాయణుడే నృసింహుడయి యయ్యాదాద్రిలో నిల్వగా
    నేనామూర్తిని గాంచనెంచి గదరా యేతెంచి టెంకాయతో
    మౌనంబందున మానికివ్వగనె యా మాన్యుండు తా పల్కె, మా
    తేనీరే యిడనొప్పు దేవళములోఁ దీర్థంబుగా నెప్పుడున్.

    (మాతా+ ఈ= మాతే).

    రిప్లయితొలగించండి
  11. దైనందినజీవితమున
    దీనులయాకలినిదీర్చు తెరువే కరువై
    తేనీరే దొరకక పో
    తే నీరే తీర్థమగును దేవుని గుడిలో

    రిప్లయితొలగించండి
  12. కానూరునకేరళనన్
    వానలు కురిసిన సమయము భక్తుల కొరకున్
    బానెడు వేడిగ కలిపిన
    తేనీరేతీర్ధమగునుదేవునిగుడిలో

    రిప్లయితొలగించండి
  13. ఏనాడైనను బందు సజ్జనులు నీ
    యింటన్ బదాబ్జంబులన్ మోపినన్
    నీ నోరాగ వచించి స్వాగతము
    సస్నేహార్ధ్ర భావంబుతో దప్పకన్
    తేనీరే యిడ యొప్పు, దేవళములో
    తీర్థ ప్రసాదంబుగా నెప్పుడున్
    దీనానాదులకివ్వగావలయు సందే
    హంబు లేకించు కన్ లడ్డులన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మ స జ స త త మ గ' గణాలతో ఇది ఏ ఛందం?

      తొలగించండి
    2. ఆకృతి ఛందమునకు చెందిన 1197913 వ వృత్తము
      గండూరి కల్పిత నూత్న వృత్తమండి.
      మ స జ స త త త గ, 13 యతి.
      గండూరి.
      ఏనాడైనను బందు సజ్జనులు నీయింటన్ బదాబ్జంబులన్ మోపినన్
      నీ నోరాగ వచించి స్వాగతముసస్నేహార్ధ్ర భావంబుతో దప్పకన్
      తేనీరే యిడ యొప్పు, దేవళములోతీర్థప్రసాదంబుగా నెప్పుడున్
      దీనానాదులకివ్వగావలయు సందేహంబు లేకించు కన్ లడ్డులన్

      తొలగించండి
  14. పూనిక తోడను బ్రీతిగ
    నేణాంకధరుని ప్రతిమకు నింపుగ తలపై
    స్నానము జేయించ గడగి
    తే నీరే తీర్ధమగును దేవుని గుడిలో

    కేదారనాథ్ వంటి దేవాలయాలలో చలికి తట్టుకోవడానికి తేనీరిస్తే బాగుంటుందని 🙂

    ఏణాంకున్ ధరియించి మంచుమలపై నీశుండు భక్తాళికిన్
    జ్ఞానానందము బంచుచున్ విమలుడై సాక్షాత్కరింపంగ నా
    కోనల్ దాటుచు నొచ్చుచున్ హిమగిరిన్ కొండాడుచున్ జేరగా
    తేనీరే యిడనొప్పు దేవళములో తీర్థంబుగా నెప్పుడున్

    రిప్లయితొలగించండి
  15. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఆనందంబుగ శూలపాణి కిపు డత్యంతంబునౌ భక్తినిన్
    నేనే చక్కని తీరుగూడిన విధిన్ నీమమ్ముతో సాగుచున్
    థ్యానంబెంచి జలాభిషేకమును చేయన్ గోరితిన్ సోదరా
    తే, నీరే యిడనొప్పు దేవళములో తీర్థంబుగా నెప్పుడున్.

    రిప్లయితొలగించండి
  16. కె.వి.యస్. లక్ష్మి:

    స్నానము పూజలు సేవలు
    శ్రీనాథున కనవరతము సేయుట కొరకున్
    థ్యానము జేయుచు జలమును
    తే, నీరే తీర్థమగును దేవుని గుడిలో.

    రిప్లయితొలగించండి
  17. రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. కరోనా భయానికి వేడి నీళ్లు తాగాలనే భావన బాగా ప్రబలింది. అందుకు తీర్థమునకు బదులు తేనీళ్లు ఇవ్వాలనే యోచనగా ఈ ప్రయత్నము :

      శా:

      ఏనాడైనను తీర్థ మన్న గొననౌ యెంతేని విశ్వాసమే
      యీనాడో మరి భీతి నొంద ప్రజలె యేమేమొ యూహించుచున్
      కానీ యంచని ధర్మకర్త తలచన్ గండమ్ము దాటంగ నై
      తేనీరే యిడనొప్పు దేవళములో దీర్థంబుగా నెప్పుడున్

      వై. చంద్రశేఖర్

      తొలగించండి

  18. నానేస్తానికొసగినది
    తేనీరే, తీర్థమగును దేవునిగుడిలో
    ప్రాణనమె తులసి దళముల
    నానారములోనవేయ నందురు గాదే



    చైనా దేశము నుండి వచ్చెనిపుడే చాన్నాళ్ళకున్ బ్రేమతో
    నానేస్తంబతగాడు, గాంచగనె యానందంబుతో వానికిన్
    దేనీరే యిడనొప్పు, దేవళములోఁ దీర్థంబుగా నెప్పుడున్
    మానుల్ కొబ్బరి నీళ్ళనిచ్చుటదియే ధర్మంబుగా నెంతురే.

    రిప్లయితొలగించండి
  19. చైనాలో నొకరాజు కాకరలతో జాంగ్రీలు చేయించె నే
    పేనా తోడ సిరాను చల్లమనెపో పెళ్లిళ్లలో నన్ సదా
    తూనీగల్ ప్రజలంతపెంచమనెనే తుగ్లక్కు,శాసించెపో
    తేనీరే యిడనొప్పు దేవళములోఁ దీర్థంబుగా నెప్పుడున్

    రిప్లయితొలగించండి
  20. గురువర్యులకు నమస్సులు, నిన్నటి నా పురాణాను పరికించి ప్రార్థన. ధన్యవాదములు.
    తమకం బొప్పగ నేలికల్ జనులపై దౌష్ట్యమ్ము సారించుచున్
    మమకారమ్మును జూపనట్టి , ఖలులై మాఱొడ్డ దేశమ్మునన్
    శమమే వ్రాలగ పౌరులిట్లనిరి " భ్రష్టాచారులౌ వారిలన్
    దమకుం దాముగ గొయ్యి ద్రవ్వు కొనుటే తథ్యంబుగా మేలగున్!"

    రిప్లయితొలగించండి
  21. మానసమే పరమంబై
    మానవదేహమ్ముదివ్యమందిరమవగా
    మానవుడేమాధవుడై
    తేనీరే తీర్థమగును దేవుని గుడిలో

    రిప్లయితొలగించండి
  22. ఈనాడంకుని మూర్తికి
    తానము చేయించిన సుకృత జలము ముగియన్
    కానగ వేంచేసి కొసరి
    తే ; నీరే తీర్థమగును దేవుని గుడిలో

    రిప్లయితొలగించండి
  23. మానం బైనను ప్రాణమేనియును సేమమ్మై విరాజిల్లగా
    ధ్యానమ్మే తగు సాధనమ్మగును! దాదాత్మ్యమ్ముతో నెల్లరున్
    పానీయమ్మనగా గ్రహింప తులసీ పర్ణమ్ములన్ జేర్చ నై
    తే నీరే యిడ నొప్పు దేవళములో దీర్థమ్ముగా నెప్పుడున్!

    రిప్లయితొలగించండి
  24. వానకు గజగజ వణుకుచు
    కోనేరున స్నాన మాడ కోర్కెలు తీరన్
    దీనుల చలికాయ గలుగు
    తేనీరే తీర్థమగును దేవుని గుడిలో
    ........చిదిరాల సుధాకర్

    రిప్లయితొలగించండి
  25. తేనీరే పరమౌషధంబనుచు వాదింపంగ రాదిట్టులన్
    పోనీలే యని యూరకుండినను నీ మూర్ఖత్వమే హెచ్చెనే
    లేనే లేదిసుమంత సత్యమిటులోరీ బల్కనేరాదురా
    "తేనీరే యిడనొప్పు దేవళములోఁ దీర్థంబుగా నెప్పుడున్"

    రిప్లయితొలగించండి
  26. మానవ సేవయె నిజముగ
    మానితమగు సేవ దలప మాధవునకిలన్
    దీనులకాకలి దీర్చెడి
    తేనీరే తీర్థమగును దేవుని గుడిలో

    రిప్లయితొలగించండి
  27. స్నానమ్మున్ పొనరించి వెళ్ళి నరవిందాక్షున్ దృతిన్ కొల్వగా
    నా నేత్రమ్ముల సంతసమ్మడరె నానామా మృతమ్మున్ వినన్
    ఆ నారాయణు మజ్జనంపు జలమే యత్యంత పూతమ్మునై
    తే, నీరే యిడనొప్పు దేవళములోఁ దీర్థంబుగా నెప్పుడున్

    రిప్లయితొలగించండి
  28. ప్రాణంబు నేటి యువతకు
    తేనీరే,తీర్ధమగును దేవునిగుడిలో
    పానకము,తులసిజలములు
    శ్రీనాధుని కిష్టమైన చెఱకు రసమ్ముల్

    రిప్లయితొలగించండి
  29. శార్దూలవిక్రీడితము:
    దీనావస్థ తొలంగజేసి గరిమన్ దీర్ఘాయువున్ని చ్చుచున్
    పోనేపోవని దీర్ఘ రోగచయమున్ పోకార్చు దివ్యౌషధీ
    కానీకానక చేయు పాప మణచున్
    కృష్ణయ్య పాదాంబుజాం
    *తే నీరే యిడనొప్పు దేవళములోఁ దీర్థమ్ముగా నెప్పుడున్*
    (అకాల మృత్యు హరణం
    సర్వ వ్యాధి నివారణం
    సమస్త పాప క్షయకరం
    శ్రీవిష్ణు పాదోదకం పావనం శుభం {పిబ}) ఆధారంగా చేసిన యత్నం.

    రిప్లయితొలగించండి
  30. రిప్లయిలు
    1. రామ ఉవాచ

      స్నానము సేసి పవిత్రము
      గా నామమును బఠియించి గంగాం బువుల
      న్నానభవు స్నపనమున సీ
      తే! నీరే తీర్ధమగును దేవుని గుడిలో !

      తొలగించండి
  31. నానీ! కంటివె,యిత్తురెప్పుడు మఱిన్ నారంబుగానచ్చటన్
    తేనీరే,యిడనొప్పుదేవళములో దీర్ధంబుగా నెప్పుడున్
    మాన్యంబౌ తులసీ రసంబును నికన్ మందుంగ జీరంబునున్
    బానీయంబుగ నీయ పొందురుగదా భక్తాళి కైవల్యమున్

    రిప్లయితొలగించండి
  32. ఆనీతాంబువు నర్ఘ్యపాద్యకలితాఖ్యాతోక్తి సంస్కృత్యమై
    పానీయాచమనీయసుస్నపనసంభాజ్యమ్మునై పూజ్యమై
    శ్రీనాథాంబుజపావనాంఘ్రిగళితశ్రేయస్కరమ్మైన నం
    తే, నీరే యిడనొప్పు దేవళములోఁ దీర్థంబుగా నెప్పుడున.

    కంజర్ల రామాచార్యులు.

    రిప్లయితొలగించండి
  33. పానీయ మగును నిత్యం
    బే నరపుంగవున కైన నిల శంఖములో
    దా నుంచిన యెడల నెఱిఁగి
    తే నీరే తీర్థమగును దేవుని గుడిలో


    కానిమ్మింక నయజ్ఞు లెవ్వ రిచటం గానంగ రారేమి పో
    యీ నీరంబు నొసంగ కూడ దనిరే యెవ్వారు నిప్పట్టులో
    నీ నీరాకర బద్ధ భూవలయ మిట్లేపార వీక్షింప బ్రాఁ
    తే నీరే యిడనొప్పు దేవళములోఁ దీర్థంబుగా నెప్పుడున్

    [బ్రాఁతి = దుర్లభము]

    రిప్లయితొలగించండి
  34. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    'మ స జ స త త మ గ' గణాలతో ఇది ఏ ఛందం?

    గురువుగారు నమస్కారములు
    మీరిచ్చిన సమస్య
    శార్దూల ఛందమే గదా ఆ ఛందస్సులోనే పూరించాను/\

    రిప్లయితొలగించండి
  35. తానొక దేవుడ ననుకొనె
    మానవుడగునొకడు బుధ్ధి మాంద్యము తోడన్
    వానికి కలదట హోటలు
    తేనీరే తీర్థమగును దేవుని గుడిలో

    ద్వారకానాథ్

    రిప్లయితొలగించండి