9, జులై 2021, శుక్రవారం

సమస్య - 3777

10-7-2021 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మీకు మీకును మీకును మీకు మీకు"
(లేదా...)
"మీకును మీకు మీకు మఱి మీకును మీకును మీకు మీకునున్"

99 కామెంట్‌లు:

 1. ముప్పుతప్పదుచూడగమురిపెమునుగ
  రోగమన్నదిరక్కసిరోతఁబుట్టు
  శ్రద్ధలేకనుమసలినసద్దుఁజేయు
  మీకుమీకునుమీకునుమీకుమీకు

  రిప్లయితొలగించండి
 2. పాడు పుర్వులు వచ్చెను పరుగు పరుగు

  మూతి కవచమును తొడుగు ముఖ్యమదియె

  చేతులను కలపగ వద్దు, చెప్పుచుంటి

  మీకు మీకును మీకును మీకు మీకు"

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 3. క్రొవ్విడి వెంకట రాజారావు:

  పేదను నను చేరగదీసి పెద్ద మదిని
  విద్దె లన్నియు నేర్పించి దిద్ది నట్టి
  మీకు మీకును మీకును మీకు మీకు
  చేయు చుంటిని ప్రణతులు శ్రేష్ఠులార!

  రిప్లయితొలగించండి
 4. సమస్య :
  మీకును మీకు మీకు మరి
  మీకును మీకును మీకు మీకునున్

  ( హిమాలయం నుండి గిరికన్యక వచ్చి సప్తర్షుల సతీమణులను తనయింటికి పేరంటానికి రమ్మని ఆహ్వానిస్తున్నది . )

  చేకొని నాదు విన్నపము
  చేరగ రావలె బేరటాండ్రుగా ;
  రాకయె మంచుకొండ కొక
  రమ్యత గూర్చును సాధ్విరత్నముల్ !
  వాకొన భాగ్యశాలినిని ;
  వందన మందుడు ; సేయుచుంటి నే ;
  మీకును మీకు మీకు మరి
  మీకును మీకును మీకు మీకునున్ .

  రిప్లయితొలగించండి
 5. దేశ భక్తిని గల్గియు దీక్ష బూని
  ప్రగతి కొఱకును శ్రమియించు వారలైన
  మీకు మీకును మీకును మీకుమీకు
  భరత భాగ్య దాతల కిప్డు వంద నములు

  రిప్లయితొలగించండి
 6. పెళ్ళి విందుకు పరుగిడి వెళ్ళిరనిన
  వండి పెట్టినవన్నియు వహ్వ యనుచు
  ఆరగించిన యవియును యరగ కుండు
  మీకుమీకునుమీకునుమీకుమీకు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఆరగించిన నవియెల్ల నరగకుండు' అనండి.

   తొలగించండి
 7. రిప్లయిలు


  1. నాకిట నక్షరమ్ములను
   జ్ఞాన సుభిక్ష నొసంగి సంఘమున్
   వేకువ కాంతి పుంజముల
   విస్తృత భావ ప్రభావ హేలలన్
   మైకొన జేసినట్టి పలు
   మేలిమి యొజ్జలకున్ నమస్కృతుల్
   మీకును మీకు మీకు మఱి
   మీకును మీకును మీకు మీకునున్!

   తొలగించండి
 8. కోకిలవోలెచాటుగనుకోమ్మకుకోమ్మకుఁజేరికూసెనే
  కాకులగోలనాపెనుగఖాతరుఁజేయకజాడదెల్పియున్
  చేకోనియప్పరావుకవిఛేదనఁజేసెనుమూర్ఖతత్వమున్
  మీకునుమీకుమీకుమఱిమీకునుమీకునుమీకుమీకునున్

  రిప్లయితొలగించండి
 9. మాకును మాకు మాకు మరి మాకును మాకును మాకు మాకునున్

  లోకపు తీరు నేర్పిరి ప్రలోభము కాంచని పండితేశ్వరుల్

  నాకపు రాజు సాక్షిగను నాయెద సాక్షిగ మొక్కు చుంటి నే

  మీకును మీకు మీకు మఱి మీకును మీకును మీకు మీకునున్

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 10. సమస్య:
  *మీకును మీకు మీకు మఱి మీకును మీకును మీకు మీకునున్*

  ప్రయత్నం:

  లోకులు వెక్కిరించినను రూకలొకించుక రాక వోయినన్
  మీకవితానురక్తి యొక మేరను దగ్గక ముందుకేగుచున్
  మాకిటు నేర్ప, జేసెదను మాన్యుల కెల్లను వందనమ్ములన్
  మీకును మీకు మీకు మఱి మీకును మీకును మీకు మీకునున్.

  రిప్లయితొలగించండి

 11. పాండవులతోడ కయ్యమ్ము పనికిరాదు
  సమరమునువీడి పట్టినన్ శాంతి పథము
  క్షేమమదియె గూర్చు ననుచు చెప్పుచుంటి
  మీకు మీకును మీకును మీకు మీకు.


  దూకలి సైసిరంచు గద దుష్ట చతుష్టయు లైన మీరలే
  యేకులటంచు పాండవుల నెంచితిరే! సమ రాంగనమ్ములో
  భీకర రూపులై చెలగు వీరులు వారలటంచు చెప్పెదన్
  మీకును మీకు మీకు మఱి మీకును మీకును మీకు మీకునున్.


  రిప్లయితొలగించండి
 12. పూరణంబును త్వరితన పూర్తిజేసి
  పండితోత్తముల్ గబగబ పంపుచుండె
  మీకుమీకునుమీకునుమీకుమీకు
  వందలర్పించు చుంటిని వందనములు

  రిప్లయితొలగించండి
 13. తేటగీతి
  జీవి పుట్టుట గిట్టుటల్ దైవవశమ
  నంగఁ గోవిడు మృత్యువై క్రుంగఁ దీయ
  బాటఁ జూప మ్రొక్కమె దైవకోటిలోన
  మీకు మీకును మీకును మీకు మీకు

  ఉత్పలమాల
  రాకడ పోకడల్ గనిన ప్రాణము జీవుల చేతలేదనన్
  బ్రాకట సత్యమే తెలిసె రాక్షస కోవిడు వీరధాటికిన్
  శ్రీకరమొంద మ్రొక్కెదము సేమము గూర్చఁగ దైవకోటిలో
  మీకును మీకు మీకు మఱి మీకును మీకును మీకు మీకునున్  రిప్లయితొలగించండి
 14. నాకు నాకును నాకును నాకు నాకు
  మీకు మీకును మీకును మీకు మీకు
  నంచు వంచక నేతలు పంచుకొనగ
  దేశ సంపద సర్వము నాశమౌను

  రిప్లయితొలగించండి
 15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పైకము లేని హేతువున వాసిగ విద్యలు నేర్వలేని నన్
   చేకొని చక్కనైన విధి చేతన నందగ జేసినట్టియౌ
   మీకును మీకు మీకు మఱి మీకును మీకును మీకు మీకునున్
   వీకనుగూడు డెందమున పెచ్చుగ జేతుల నెత్తి మ్రొక్కెదన్.

   తొలగించండి
 16. మీకొక మంచి వార్త యిది మిక్కిలి
  మేలొనరించు మీకునున్
  చీకటి దొల్గిపోవు నతి శీఘ్రమె
  దక్కను మంత్రి హోదలున్
  మీకును మీకు మీకు మరి మీకు
  ను మీకును మీకు మీకునున్
  మీ కలలన్ని పండునిక మీదగు
  సంపద హెచ్చు మెండుగా.

  రిప్లయితొలగించండి
 17. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ ఇండ్లు కట్టి ఇస్తామని ఆశ జూపడంగా నా ప్రయత్నము. ఇది విమర్శ కాదు. లోకం పోకడ మాత్రమే నని గ్రహింప ప్రార్థన:

  ఉ:

  ఏకము జేసి నెల్లరకు నింటిని గూర్తు మటంచు దెల్పగన్
  లోకులు నాశగా నెగిరి లొట్టలు వేయుచు నేత చేరగా
  సాకులు జెప్ప సాగెనట సత్వరమై యొనగూర్చ పొందికన్
  మీకును మీకు మీకు మఱి మీకును మీకును మీకు మీకనన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 18. రిప్లయిలు
  1. గుంపులుగ తిరుగ కరోన కొంప ముంచు
   నీకు నాకును ప్రాకును నిక్క ముగను
   మాస్కు లేకుండ తిరిగిన మరలి వచ్చు
   మీకు మీకును మీకును మీకు మీకు

   తొలగించండి
 19. నాకమునందు నుండు సురనాథుల ,కాదరమొప్పగా నిలన్
  సాకెడు దల్లిదండ్రులకు, సన్మతి బుద్ధినొసంగు నొజ్జకున్
  మ్రాకుల, పంచభూతముల, ప్రాణమునిల్పెడు వైద్యకోటికై
  యేకరు వుంచగా భువిని నెందరొ మాన్యులు! ధన్యవాదముల్
  మీకును మీకు మీకు మరి మీకును మీకును మీకుమీకునన్

  రిప్లయితొలగించండి
 20. వాకిట నిల్చియున్న బుధ పంక్తిని, సప్తగిరీశులందఱిన్
  వీక దయాంబురాశి యయి వేల్పుగ దీవెన లిచ్చి సత్కృపన్
  మీకిదె మోక్షమిత్తునని మేలుగ పల్కెను వేంకటేశుడున్-
  మీకును మీకు మీకు మఱి మీకును మీకును మీకు మీకునున్.

  మీకు పదము 7 సార్లు వచ్చింది అందుకని సప్త గిరులు ఆ ఏడుగురు.

  రిప్లయితొలగించండి
 21. అమ్మ నాన్నకు గురువుకు నాప్తులకును
  మేలుచేసినవారికి మిత్రులకును
  ప్రణతులర్పింతు కేల్మోడ్చి భక్తి మీర
  మీకు మీకును మీకును మీకుమీకు

  రిప్లయితొలగించండి
 22. ఏకును మేకునై యెదిగి యెంతయొ సంపద దోచ నాయకుల్,
  మాకలలన్నియున్ సెదరె మాటలు దండిగ నమ్మబల్కుచున్
  జీకటి రాష్ట్రమై నిలువ, సేసిన యప్పుల పాపమెంచగా
  మీకును మీకు మీకు మరి మీకును మీకును మీకుమీకునున్.

  రిప్లయితొలగించండి
 23. నా రెండవ పూరణము:

  నా కనులన్వెలుంగు బహు
  నవ్యసుభూషల రేబవళ్ళలో
  లోకములన్సృజించి యిట
  రూఢిగ మానవ జన్మ తోడుతన్
  మాకులు జీవజాలములు
  మౌక్తిక వజ్ర విలాస సంపదల్
  చేకురజేసె నా విభుడు
  జీవజలమ్మిడు నిమ్నగాదులన్-
  మీకును మీకు మీకు మఱి
  మీకును మీకును మీకు మీకునున్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భావకవిత్వపు చాయలో మీ పూరణ మనోజ్ఞంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 24. ప్రజల గాపాడ కోవిడు బారినుండి
  ప్రాణములనైన నొడ్డిరే పణముగాను
  వందనంబిదె గొనుడయ్య వైద్యులార
  మీకు మీకును మీకును మీకు మీకు

  రిప్లయితొలగించండి
 25. ఈతడె జనులనుగలిసి యెనికలందు
  మీకు మీకును మీకును మీకు మీకు
  నుచితముగ కొంత పైకము నొసగెదనని
  మాటనిచ్చియు మరచిన మానవుండు

  రిప్లయితొలగించండి
 26. లోకమునందు పెక్కులుగ రోగము బారిన మగ్గుచుండగన్
  కాకుల వోలెనే జనులు కాలగ దారుణ కోవిడుంగనన్
  వేకువ తోడుతన్ సతము ప్రీతిగ సేవలనందజేయుచున్
  తేకువ మీర వైద్యమును దీటుగ జేయగ వందనమ్మిదే
  మీకును మీకు మీకు మఱి మీకును మీకును మీకు మీకునున్

  రిప్లయితొలగించండి
 27. శ్రీకర మొప్పగా నచట శ్రీశుభకార్యము జేయనెంచుచున్
  బ్రాకట సభ్యులం దరను పాటిగ బిల్చిరి దీక్షగైకొనన్
  గాకలుదీరుయోధులకుఁగార్యపుభారముఁ
  గట్టబెట్టుచున్
  మీకును మీకు మీకు మఱి మీకును మీకును మీకు మీకునున్

  కొరుప్రోలు రాధాకృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 28. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 29. లంచగొండు లైదుగురట లజ్జ విడచి
  పైకమడిగిరి తమ వంతు పనిని చేయ
  పంచి నాడట విధిలేక పౌరుడొకడు
  మీకు మీకునుమీకును మీకు మీకు

  ద్వారకానాథ్

  రిప్లయితొలగించండి
 30. యుద్ధంలో విజయం తర్వాత వానరులతో శ్రీరాముడు

  మ్రాకులపైన బ్రాకుచును మాగినబండ్ల భుజించువారలై
  ప్రాకటమైనరీతి ఘనవారధి గట్టిరి లంకజేరగా
  శ్రీకర సంప్రసిద్ధినిట జేకుర జేసిరి గొప్పవీరులై
  స్వీకరణమ్ము జేయుమిక స్వీయ శుభాంజలి ధన్యవాదముల్
  మీకును మీకు మీకు మరి మీకును మీకును మీకుమీకునన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తాకకు తాకబోకుమను తాతలకాలపు సంప్రదాయమే
   వాకిటి గుమ్మమున్ జరుపు పాదపు పాణుల క్షాళనమ్ములే
   ప్రాకటమైన రీతినిట పాడుకరోనను నిగ్రహించగా
   చేకురు లాభముల్నెరిగి జీవనమార్గము మార్చ ప్రార్ధనల్
   మీకును మీకు మీకు మరి మీకును మీకును మీకుమీకునన్

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  3. ధన్యాస్మి గురుదేవా! నమోనమః!🙏🙏🙏

   తొలగించండి
 31. తమ్ముని బిడ్డలన్ ధర్మము గానేలి
  నట్టి నృపతికి వినయపు వంద


  నములు, భీకర ప్రతినమునొన రించిన
  గాంగేయున కివియె ఘనత నొప్పు


  వెన్నెలకోలులు,విద్యలు నేర్పిన
  ద్రోణ కృపులకు మాదు నమసములు,


  పిన తండ్రి యౌ విదురునకు ప్రణామముల్,
  జననిగాంథారికిన్ చాగిలింత,

  కుంతి మాతకు చేమొ గుపు,సభ లోని పూ
  జ్య జనావళికి కడు సంతములని

  పాండవులు తెలిపెను గదా పరవశముగ

  మీకు, మీకును, మీకును, మీకు, మీకు,

  ననుచు రాయభారము కోరి నడుగు బెట్టి

  నట్టి కృష్ణుడు పలికె వి నయము తోడ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   వాట్సప్ సమూహంలో రెండు సవరణలు సూచించినాను.

   తొలగించండి
 32. చేకుర సంపదల్ ప్రజల చింతల గానని నేతలార! మా
  చాకిరికిన్ ఫలమ్మడుగ సాకులు చెప్పెడి యాజమాన్యమా
  మీకును జోత, బ్రోవ మము! మెండుగ సొమ్ముల దోచు వైద్యుడా
  మీకును మీకు మీకు మఱి మీకును మీకును మీకు మీకునున్

  రిప్లయితొలగించండి
 33. ముక్కు నోరును నిరతము మూయకుండ
  దేశ సంచారమయ్యది తీవ్రమైన
  ప్రాణ హానిని గలిగించు భవ్యులార!
  మీకుమీకును మీకును మీకుమీకు

  రిప్లయితొలగించండి
 34. సోకులు మానుచున్ యువత సౌఖ్యము తోడను నుండగోరుచో
  దేకువగల్గి వారలిక ధైర్యము తోడను మెల్గుచుండినన్
  శ్రీకర సంపదల్ దరికి జేరును శంకరు సత్కృపన్ సుమా
  మీకును మీకుమీకుమఱి మీకును మీకును మీకుమీకునున్

  రిప్లయితొలగించండి
 35. చేకురె నెమ్మి గ్రామమున చెన్నగు కన్నియతోడ, పెద్దలున్
  బ్రాకటమౌ ముహూర్తము వివాహము చేయ తలంచ ప్రీతితో
  నాకును నామెకున్, కొనుడు నాదు వివాహపు పెండ్లిపత్రికల్
  మీకును మీకు మీకు మఱి మీకును మీకును మీకు మీకునున్

  రిప్లయితొలగించండి
 36. సంతసమ్మునఁ గ్రమముగఁ జక్క నిత్తుఁ
  బరమ పంచ మిత్రులకుఁ బద్మరాగ
  వజ్ర మౌక్తిక నీల ప్రవాళము లివి
  మీకు మీకును మీకును మీకు మీకు


  సద్దు సేయకుండ వలయు మిద్దె లోన
  గుట్టు రట్టౌను లేకున్న నొట్టు తల్ల
  డిల్లి వచియించు చుంటి నే నెల్లరకును
  మీకు మీకును మీకును మీకు మీకు


  ప్రాకట దేశ సత్సమితి రాడ్వరుఁ డప్పుడు పల్కె నివ్విధిన్
  వీఁకఁ జెలంగ నేతలు సుభీకరు లేడ్వురుఁ బ్రీతి మీఱ నే
  కైకము సప్త సాగరము లిత్తును గొండు వివాద మే లొకో
  మీకును మీకు మీకు మఱి మీకును మీకును మీకు మీకునున్

  రిప్లయితొలగించండి
 37. ఓటు విలువైన ఆయుధం ఉత్తములకు
  వేసి గెలిపించి నపుడు మీ విలువ పెరుగు
  చెడుకు తావివ్వ వలదంటు చెప్పుతున్న
  మీకు మీకును మీకును మీకు మీకు
  ...........చిదిరాల సుధాకర్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   వాట్సప్ లో సవరణలు చూడండి.

   తొలగించండి
 38. పూరణ ః-- " మీకును మీకు మీకు , మరి మీకును మీకును , మీకు మీకునున్ !! "
  టోకున గొంటి సూపరుగ , డూపరుగా పసి జామకాయలన్;
  ఆకులతోడ లేతవివి ; యందరి కిచ్చెద రండి రండహో;
  చౌకగ నమ్మెదన్; రుచికి చక్కని కాయలు ; మంచి బేరమే,
  మీకును మీకు మీకు , మరి మీకును మీకును , మీకు మీకునున్ !!

  రిప్లయితొలగించండి
 39. ఉత్పలమాల:
  ఆకులు మేయుడంచు బలుసాకులు మాకుచితమ్మటంచు బల్
  సాకులుజెప్పి దేశమును చట్టపు దొంగల పాలు జేస్తిరే
  మేకులు దింపురోజొకటి మేల్కొన వచ్చు జనాళి, కాచుకో
  మీకును మీకు మీకు మఱి మీకును మీకును మీకు మీకునున్!
  -కటకం వేంకటరామశర్మ.

  రిప్లయితొలగించండి
 40. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 41. తేటగీతి:
  బాల మీ పాలబడ! తలపేలచెడుగ?
  చాకిరికిరికి కిరికిరి చీకు బతుకు !
  ముప్పు తప్పదుప్పునగప్పి పూడ్చు శిక్ష
  మీకు మీకును మీకును మీకు మీకు!!
  -కటకం వేంకటరామశర్మ

  రిప్లయితొలగించండి

 42. పాండవులతోడ కయ్యమ్ము పనికిరాదు
  సమరమునువీడి పట్టినన్ శాంతి పథము
  క్షేమమదియె గూర్చు ననుచు చెప్పుచుంటి
  మీకు మీకును మీకును మీకు మీకు.


  దూకలి సైసిరంచు గద దుష్ట చతుష్టయ మైన మీరలే
  యేకులటంచు పాండవుల నెంచితిరే! సమ రాంగణమ్ములో
  భీకర రూపులై చెలగు వీరులు వారలటంచు చెప్పెదన్
  మీకును మీకు మీకు మఱి మీకును మీకును మీకు మీకునున్.

  రిప్లయితొలగించండి
 43. కొత్త రోగమదికరోన కూర్మి వీడి
  ప్రాణములను తీయుచు నుండ వసుధయందు
  వందన శతము లిడుదును వైద్యు లార
  *మీకు మీకును మీకును మీకు మీకు*

  రిప్లయితొలగించండి