20, జులై 2021, మంగళవారం

సమస్య - 3788

21-7-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భానుని భానుండు గాంచి వడవడ వడఁకెన్”
(లేదా...)
“భానునిఁ గాంచినంతటనె భానుఁడు బిట్టు వడంకె భీతుఁడై”

65 కామెంట్‌లు:


 1. ఆనికయే తరిగిన యా
  జీనుడగు రవిఁ దొలగించి జేకై తారా
  సేనల తో వచ్చిన సిత
  భానుని భానుండుగాంచి వడవడ వడకెన్.

  రిప్లయితొలగించండి
 2. బానిసతనమనుజీకటి
  పూనికతోడనుతరుమగపూషాగాంధీ
  కానగవచ్చెనుకాశ్యపి
  భానునిభానుండుగాంచివడవడవణకెన్

  రిప్లయితొలగించండి
 3. కానలసంచరించుతనకాంతినిరాముఁడురాజసంబునన్
  వేనకువేలురాక్షసులవెన్నుఁడుతానుగరూపుమాపుచున్
  పూనికవానరంబులనుపూతచరిత్రుఁజేసివెల్గునా
  భానునిగాంచినంతటనెభానుణడుబిట్టువడంకెభీతితోన్

  రిప్లయితొలగించండి
 4. రిప్లయిలు
  1. కానగ మత్స్వరూపగతకారణమీ తడటంచు దల్చుచున్
   మానక నెప్పుడెప్పుడల మానసమందొదవన్ దివాకరున్
   బూని క్రుధానలమ్మెగయ ముప్పున మ్రింగుట కుద్యమించు స్వ
   ర్భానునిఁ గాంచినంతటనె భానుఁడు బిట్టు వడంకె భీతుఁడై

   కంజర్ల రామాచార్య.

   తొలగించండి
  2. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి

 5. ఆనిక సన్నగిల్లెనిక యస్తమయమ్మును బొందగోరుచున్
  జీనుడు పశ్చిమంబుదెస జేరినవేళ యనంత తారలన్
  సేనగ దాల్చి చందురుడు చేరెనభమ్మున, ద్రుంచనెంచుచున్
  భానుని, గాంచినంతటనె భానుడు బిట్టు వడంకె భీతుడై.

  రిప్లయితొలగించండి
 6. వానలు మెండుగ గురియగ
  కోనలు కొండలను నీరు గొప్పగ నుండన్
  తానయ్యెడల ను ఛాయా
  భానుని భానుండు గాంచి వడ వడ వడకెన్

  రిప్లయితొలగించండి

 7. ప్రాణదుడైన శౌరి సుధ బంచగ వచ్చిన మోహనాంగికిన్
  దానవుడంచు రాహువును ధత్రుడు చూపగ గాంచి కోపమున్
  కేనమొనర్చె సూరుడని కిన్కను బూనుచు చంపవచ్చు స్వ
  ర్భానుని గాంచినంతటనె భానుడు బిట్టు వడంకె భీతుఁడై.

  రిప్లయితొలగించండి
 8. పూనిక తోడ భీష్ముడును బో
  రొన రించియు భీకరంబుగా
  తానడచెన్ననేక రిపు దండును
  భారత యుద్ధ మందునన్
  గానక మంచి చెడ్డలను కౌరవ
  పక్షము జేరి, శూరుడౌ
  భానుని గాంచినంతటనె భా
  నుడు బిట్టు వడంకె భీతుడై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'రిపు దండు' దుష్టసమాసం. సవరించండి.

   తొలగించండి
 9. కాంతి తరిగిన తన ప్రతిబింబాన్ని చూసి భానుడు భయపడ్డాడని భావన !

  మానిని సైపలేక తన మంటలవేడిని వీడిపోవగా
  తానొక సాధనమ్మునను తక్కువ జేయగ సూర్యతేజమున్
  బూనగ మామగారచట, బుణ్యజలంబున బింబరూపుడౌ
  భానుని గాంచినంతటనె భానుడు బిట్టువడంకె భీతుడై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కాననమందునన్ దనదు కాంతను గూడుచు నాడుచుండ నా
   భానుని తీవ్రతేజమున భామకు వేసట గల్గగా క్రుధన్
   గానగ రూక్షవీక్షణల గాలుని బోలుచు నత్రియన్ తపో
   భానుని గాంచినంతటనె భానుడు బిట్టువడంకె భీతుడై
   చానకు రక్షణంబుగను ఛత్రము పాదుకలిచ్చె భక్తిమై

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  3. ధన్యాస్మి గురువర్యా! నమోనమః!🙏🙏🙏

   తొలగించండి
 10. ఉ:

  పానము జేయ మిక్కిలిగ పండితపుత్రుడు బల్కెనివ్విధిన్
  మానము నెంచి యంశుపతి మారుచు నుండగ పశ్చిమంబుకై
  తానట గన్పడన్ ప్రతిగ దర్దురమందు ప్రఛండ తేజమున్
  భానుని గాంచి నంతటనె భానుడు బిట్టు వడంకె భీతుడై

  మానము=సౌరమానము
  అంశుపతి =సూర్యుడు
  దర్దురము=మేఘము


  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 11. ఉత్పలమాల:
  కానల రాజు రాశి కధికారిగ నున్న హిరణ్య గర్భుడే
  దానవ సింహికా సుతుని తామసు చేరి శశాంకు తోడుతన్
  వైనము మీరనొక్క దిశ పాటుగ చేర దురాత్ముడైన స్వ
  “ర్భానునిఁ గాంచినంతటనె భానుఁడు బిట్టు వడంకె భీతుఁడై”
  --కటకం వేంకటరామశర్మ.
  [ సింహరాశి కధిపతి- సూర్యుడు.
  సింహికా సుతుడు- రాహువు.
  సూర్య చంద్ర మేళనంలో అనగా అమావాస్య నాడు రాహువు కూడా కూడితే "సూర్య గ్రహణ మేర్పడుతుంది .]

  రిప్లయితొలగించండి
 12. దీనుడ నేను నీ మనికి
  దీప్తిని గానగ లేను భాస్కరా!
  కానగ నీదు రూప మిల
  కన్నుల నేరుగ జూడలేను నీ
  ధ్యాన సరిత్ప్రభన్ గనుల
  దక్కగ జేయు మటంచు కాంతిమ
  ద్భానునిఁ గాంచినంతటనె
  భానుఁడు బిట్టు వడంకె భీతుఁడై!

  రిప్లయితొలగించండి
 13. కానగ నెల్ల లోకులకు కాంతి నొసంగుచు నబ్ధి నీరమున్
  పానము జేయుచున్ నరుని పాలన సేయగ వర్షమిచ్చుచున్
  జేనుల బంట నింపు నొక 'చీకటి గూల్చెడి జ్యోతి' యేని స్వ
  ర్భానుని గాంచినంతటనె భానుఁడు బిట్టు వడంకె భీతుఁడై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. "పానము జేసి మానవుని పాలన సేయగ వర్షమిచ్చుచున్" అని రెండవ పాదాన్ని సవరించడమైనది నమస్సులు

   తొలగించండి
 14. ఆనాటి చలన చిత్రపు
  భానుమతి రచనలతోడ ప్రజల మనసులన్
  మేనిని నింపగ నపుడా
  భానుని భానుండు గాంచి వడవడ వడఁకెన్

  మేని = కాంతి
  భాను > ఈ సందర్భం లో భానుమతి

  రిప్లయితొలగించండి
 15. ఆనందముగ పవనసుతు
  తానుప్పొంగాశమునకు, దద్దరిలెనుగా
  ఆనింగి, యట్టి తేజో
  భానుని, భానుండు గాంచి వడవడ వడఁకెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "పవనజుడు" అనండి. 'తానుప్పొంగాశమునకు'?

   తొలగించండి
  2. ఆనందముగ పవనజుడు
   తానుప్పొంగాకశముకు, దద్దరిలెనుగా
   ఆనింగి, యట్టి తేజో
   భానుని, భానుండు గాంచి వడవడ వడఁకెన్ -- thanks Sankarayya gaaru

   తొలగించండి
 16. దానవు డొక్కరుడు నమృత
  పానపు మహిమన్ మృతినెడబాసినవాడై
  సూనుని వెంటదరుమ స్వ
  ర్భానుని భానుండు గాంచి వడవడ వడఁకెన్

  స్వర్భానువు = రాహువు
  సూనుఁడు = సూర్యుఁడు

  రిప్లయితొలగించండి
 17. దీనుల్వణికె గని దురుసు

  భానుని , భానుండు గాంచి వడవడ వడఁకెన్”

  మేనుయె లేని శిరముతో

  ప్రాణము తీయగను వచ్చు ప్రాణిన్ బామున్

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 18. రాణులు పేద వారులును రాజ్యమునేలెడు రాజ రాజులున్

  జైనులు , బౌద్ధ బిక్షువులు, జైత్రుడు,హిందువు మొక్కె భక్తినన్

  భానునిఁ గాంచినంతటనె ; భానుఁడు బిట్టు వడంకె భీతుఁడై”

  చీని కరోన మొక్కు పలు చేతులనుండెనొయన్చు శంకనన్

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 19. భానుండాతని నామము
  తానొక ఖర్వాటుడతనిదరిదాపులలో
  కానక వృక్షచ్ఛాయను
  భానుని భానుండు గాంచి వడవడ వడఁకెన్

  రిప్లయితొలగించండి
 20. కందం
  జ్ఞానప్రదీప్త శంకరు
  లానిక హిందూ మతమునకందించి నభో
  యానము సేపట్ట బృహ
  ద్భానుని భానుండు గాంచి వడవడ వడఁకెన్

  ఉత్పలమాల
  ఊనమునైన ధర్మమునకున్నతిఁ గూర్చెడు నాశయమ్మునన్
  జ్ఞానము తేజమై మెరయ జాతి హితాన పరిభ్రమించుచున్
  బూనిక దీర్చి వాఙ్మయము భూమిని వీడెడు శంకరున్ బృహ
  ద్భానునిఁ గాంచినంతటనె భానుడు బిట్టు వడంకె భీతుఁడై

  రిప్లయితొలగించండి
 21. ఆని జలమ్ములెన్నొ లవణాలయమందున నెండ కాలమున్
  మానుగ వర్షముల్ కురిసి మన్నన పొందుచు నుండు ధాత్రిపై
  మాని వెలుంగులీనుట నమాస దినమ్మున నెంచి చూడ స్వ
  ర్భానునిఁ గాంచినంతటనె భానుఁడు బిట్టు వడంకె భీతుఁడై

  రిప్లయితొలగించండి
 22. పూనిక తోడ భీష్ముడును బో
  రొన రించియు భీకరంబుగా
  తానడచెన్ననేక మరి దండును
  భారత యుద్ధ మందునన్
  గానక మంచి చెడ్డలను కౌరవ
  పక్షము జేరి, శూరుడౌ
  భానుని గాంచినంతటనె భా
  నుడు బిట్టు వడంకె భీతుడై

  ఆర్యా సవరించాను

  రిప్లయితొలగించండి
 23. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 24. Shri vinaayaka

  ఈ నాటి శంకరభరణము సమస్య

  భానుని భానుండు గాంచి వడవడవడకెన్

  ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో

  నందవంశపు భానుని విశ్వరూప దర్శనము చూసి భానుడు కలత చెందెను అను భావనతో  శివ,వినాయక నార సింహ,హయగ్రీవ ,హనుమ,భార్గవ,వరాహాది పలు వ

  దనములు కలుగగ, ధరణీ నభమ్ము లుదరమందు దొరలగ, విరివిగ భుజ

  ములు, పొడవగు నఖములు,బహుళమగు నేత్రమ్ములు, విస్తృత దంతములును

  కూడగ ,నోళ్ళలో కోరలు పెరుగగ, నగ్నికీలలు తోడ నాననములు

  భీతిని గొల్పగ, జోతలు చేయుచు బ్రహ్మాది దేవతల్ పాండమందు

  సంచరించ,నదులు సంద్రముల్ కొండలు తరువులు,నడవులు పరుగులిడుచు

  పొట్టలో భ్రమరించ, ముద్గర,శూల,చక్ర,పరిఘ,గద,కుంత,,క్రకచ,శంఖ

  హల,భల్ల,భండమాలాది ఆయుధములు హస్తములన్ దాల్చి యంకమందు

  పార్ధునకు తన రూపమ్ము తేజమ్ముతో బెడిదపు కనుకలి నిడిన నంద

  వంశపు భానుని భానుండు గాంచి వడ వడవడకె నక్కడ గగనమున

  తన పధమునాపి కూలిన తామర చెలి

  వ్యధను గాంచిన వేల్పులు వారిధరపు

  సాయమడుగగ మెల్ల్గగ జరుగుచు తన

  కాల చత్రమున్ ఖమణిపై కప్పెనపుడు


  రిప్లయితొలగించండి
 25. శశిసూర్యాగ్ని లోచనుని కన్ను పెకలించ బూనిన భక్తుడౌ తిన్నని చూచి భానుడు వణికెనని భావన!

  కానగ తిన్నడచ్చటను కన్నుల నీరునుగారు శంకరున్
  మానని గాయమున్ గుమిలి మార్చగబూనుచు గన్నుగన్నుతో
  నూనగ చేతఖడ్గమును నూడ్చగ గన్నును భక్తివశ్యుడౌ
  భానుని గాంచినంతటనె భానుడు బిట్టువడంకె భీతుడై

  రిప్లయితొలగించండి
 26. ఆ నవ మోహినిన్ గని సురాసురులెల్లరు మాయ జిక్కినన్
  దానట జేరి రాహువు సుధన్ గొనెనంచు వెలార్చ గృద్ధుడై
  గానక ముందువెన్కలిక కాలుని బోలిక మ్రింగ జూచు స్వ
  ర్భానుని గాంచినంతటనె భానుఁడు బిట్టు వడంకె భీతుఁడై

  రిప్లయితొలగించండి
 27. మానవదేవకింపురుషమానితకిన్నెరభీకరుండు క్రో
  ధానలఘూర్ణితుండు దనుజాధిపు రావణుఁ దల్చి నంతనే
  మేనులు కంప మొందగ నమేయదృగగ్నిధగద్ధగోల్లస
  ద్భానునిఁ గాంచినంతటనె భానుఁడు బిట్టు వడంకె భీతుఁడై.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 28. కోనలు గొండలు దాటుచు
  పూనకమది వచ్చునట్టి పురుషుని వోలెన్
  వేనయగారములయలరు
  భానుని భానుండు గాంచి వడవడ వడకెన్

  రిప్లయితొలగించండి
 29. భానుమతీ భానుల యస
  మానపు దాంపత్య మందు మచ్చ యనంగం
  దా నొక తప్పొనరింపఁగ
  భానుని భానుండు గాంచి వడవడ వడఁకెన్


  దీన ముఖోత్పలమ్ము నిజ దీప్త లయమ్మున వీత తోయ త
  న్మీనము భంగిఁ దోఁపఁగను మించియుఁ గాంతుల యందు దేవతా
  మానవ సంచయమ్మును విమాన మొనర్పఁగ మింట నున్న స్వ
  ర్భానునిఁ గాంచి నంతటనె భానుఁడు బిట్టు వడంకె భీతుఁడై

  [సూర్యునిఁ జూచిన కలువ ముడుచుకొని యుండుట సహజ మట్టి కలువను బోలిన సూర్యుని ముఖము రాహువును గాంచఁ గాంతి హీనత రెట్టిం పయ్యె నని భావము]

  రిప్లయితొలగించండి
 30. ఆనన మందుగల్గెగడు హర్షముశంకర! యొక్కసారిగా
  భానునీ గాంచినంతటనె,భానుడు బిట్టు వడంకెభీతుడై
  కాననమందుగల్గు పులి గ్రామపు మధ్యన గానిపించగా
  మేనున జూడనయ్యెడను మీదికి రోమము లన్నియున్ నెగన్

  రిప్లయితొలగించండి
 31. మానుగ సంద్రము చిలుకగ
  కానగనెల్లరునుపుట్టె కమ్మనిసుధయున్
  మౌనముగాగ్రోలెడు స్వ
  ర్భా నుని భానుండుగాంచి వడవడవడకెన్

  రిప్లయితొలగించండి