15, జులై 2021, గురువారం

సమస్య - 3783

16 -7-2021 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వనితా కవితలనుఁ బోల్చఁ బాడియె సుకవీ”
(లేదా...)
“వనితం బోల్చఁగనొప్పునా కవితతో వారింపనొప్పున్ గవీ”

61 కామెంట్‌లు:

 1. సమస్య :

  వనితాకవితలను బోల్చ బాడియె సుకవీ

  ( కాంతలో కవితలో ఒకే విధమైన లక్షణాలు కొన్ని
  ఉన్నాయి కనుక వారిని పోల్చటం ధర్మమే )

  కందం
  ..........
  కనగా ఘననవరసములు ,
  ధ్వనియు నలంకారములును , వక్రోక్తులు నిం
  డిన వారలు గద ! యుభయులు ;
  వనితాకవితలను బోల్చ బాడియె సుకవీ !!

  రిప్లయితొలగించండి
 2. వినిన కవిత పొంగును హృది
  కనిన మగువ మమత కవికి కవనము పొంగున్
  కనుకామే మూలము గద
  వనితా కవితలనుఁ బోల్చఁ బాడియె సుకవీ?

  రిప్లయితొలగించండి
 3. వినుమిది పరిపాటియె గద
  వనితా కవితలనుఁ బోల్చఁ; బాడియె సుకవీ
  వనితల బోల్చగరాదను
  సునిశితమగు వ్యాఖ్యలేల చోద్యము గాదే

  రిప్లయితొలగించండి
 4. సునయనసుదతియకాగా
  ఘనశక్తిగతెలియునన్నికవితలుతానున్
  వినయంబామెకునగయౌ
  వనితాకవితలనుబోల్పపడియెసుకవీ

  రిప్లయితొలగించండి
 5. చినుకున్జీరుచుభావసంపదలనాసీమంతినీలోకమున్
  ప్రణతుల్జేయగపూజ్యలాయిరిగతాప్రజ్ఞార్ధసంబద్ధలై
  వినతుల్జేసెదవీడుమానికనునీవేర్పాటుమాటల్వడిన్
  వనిన్బోల్పగనొప్పునాకవితతోవారింపనొప్పున్కవీ

  రిప్లయితొలగించండి
 6. కందం
  మననకుఁ బదలాలిత్యము
  మనసును దోచెడు నడకల మన్ననలందన్
  గననొప్పెడు శిల్పమ్మన
  వనితా కవితలనుఁ బోల్చఁ బాడియె సుకవీ!

  మత్తేభవిక్రీడితము
  వినినంతన్ గఱుకైన భాషణమునన్ విభ్రాంతిఁ గల్గించుచున్
  మనసున్ దోచెడు శిల్పమే మనక సంభావింప లేమన్నచోఁ
  గనగన్ ముగ్ధమనోహరంబునయి వాఙ్మాధుర్య మొప్పారెడున్
  వనితం బోల్చఁగనొప్పునా కవితతో? వారింపనొప్పున్ గవీ!

  రిప్లయితొలగించండి
 7. విరించి.

  కనకాంగియు సత్కవితలు
  నొనరికతో మనసు దోచు నుర్విని కాదే
  వినయమ్మందమ్మొప్పెడు
  వనితా కవితలనుఁ బోల్చఁ బాడియె సుకవీ.

  రిప్లయితొలగించండి 8. విరించి.

  తనువే కృంగును వార్థకమ్మునిక యందంబంత జేజారు యౌ
  వ్వనమే బుద్భుతమన్నమాట యిట సత్యంబేకదా గాంచగన్
  ఘనమై శాశ్వతమౌచు నిల్చుగద సత్కావ్యంబులే ధాత్రిలో
  వనితంబోల్చఁగ నొప్పునా కవితతో? వారింప నొప్పున్ గవీ.

  రిప్లయితొలగించండి
 9. 'వనిత' 'కవిత'అనే ఇద్దరు స్త్రీలు వీరి గురించి--

  'వనితా'రత్నము పట్టభద్రులు- జగత్ప్రావీణ్య సంపూజ్యులున్-
  'కవితా' భామయు కూలి నాలి కయి తా కాలంబు దొర్లిచెడిన్-
  గణుతిం బొందిన వారి పోల్చదగునా గడ్డు ప్రజన్ చూచియున్!
  వనితన్ బోల్చగ నొప్పునా కవితతో-వారింప నొప్పున్ గవీ!!

  రిప్లయితొలగించండి
 10. సునిశిత పద లాలిత్యము
  కననగు మగువల సొగసుల కమనీయములన్
  వినిమయ మగు నందురు గద
  వనితా కవితలను బోల్చ బాడియె సుకవీ !

  రిప్లయితొలగించండి
 11. కనుగొన కవితా వనితా
  మనసును రంజిల్లజేసి మధురానందం
  బొనరించదగినవి గనుక
  వనితా కవితలను బోల్చ బాడియె సుకవీ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కవితా వనితలు' అనండి.

   తొలగించండి
  2. సూచించిన సవరణతో...


   కనుగొన కవితా వనితలు
   మనసును రంజిల్లజేసి మధురానందం
   బొనరించదగినవి గనుక
   వనితా కవితలనుఁ బోల్చఁ బాడియె సుకవీ

   తొలగించండి
 12. అనువౌ యాలంబనమున
  దినదిన మభివృద్దిజెందు దీవెలవోలెన్
  మనమున కాహ్లాదమిడెడు
  వనితా కవితలనుబోల్చ బాడియె సుకవీ!

  వనితల్ చెందుదు రొక్కనాథునికె యవ్యాజంపు ప్రేమమ్మునన్
  అనువౌ యొక్కని హస్తమందుకొని ప్రహ్లాదంబు నందించరే
  ఘనమౌ కావ్యము లాదరంబునను పెక్కౌహస్తముల్ మారగా
  వనితం బోల్చగ నొప్పునా కవితతో? వారింపనొప్పున్ గవీ!

  రిప్లయితొలగించండి
 13. వనితగ కవివరు డెంచుచు
  దనరగ నంకితమునిచ్చు తన కావ్యమ్మున్
  తనకావ్యమె తనకూతురు
  “వనితా కవితలనుఁ బోల్చఁ బాడియె సుకవీ”

  రిప్లయితొలగించండి
 14. మ:

  కనగన్ చంద్రుని వోలు యందమున సింగారింపఁ నేకమ్ముగా
  వనితా నీకును సాటియెవ్వరనుచున్ వాచించరే యెల్లరున్
  విన కైతల్ సుఖమంద శక్యమగునే వీక్షింప నజ్ఞానికిన్
  వనితం బోల్చగ నొప్పునా కవితతో, వారింప నొప్పున్ గవీ

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 15. కనగ గజగమనయును మా
  లిని వృత్త కవితయు నేక రీతి నడచుచున్
  మన మనసు నలర్చుగదా !
  వనితా కవితలనుఁ బోల్చఁ బాడియె సుకవీ

  రిప్లయితొలగించండి
 16. మనునా? కవితా లత మరి
  పెనుపొం దదులే! మగువను వివరించనిదే!
  జని పందిరి పో కవితకు
  వనితా కవితలనుఁ బోల్చఁ బాడియె; సుకవీ!

  రిప్లయితొలగించండి
 17. సునిశిత భావాంభోధులు
  అనితర సాధ్య రస పోష గావించు ఘనుల్
  వనిలో వీరిరువురెగా
  వనితా కవితలను బోల్చ బాడియె సుకవీ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి.

   తొలగించండి
 18. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 19. అనుమానాస్పదభావనావళియు, నత్యానేకదుర్వృత్తులున్,
  ఘనదుఃఖంబులు, నాధులున్, బహుళసత్కార్యోరు విఘ్నమ్ములై
  మనుజున్ గూల్చు గుణాళియున్, మనమునన్ మాంద్యప్రభావమ్ములున్
  వనితం బోల్చఁగనొప్పు నాకవితతో వారింపనొప్పున్ గవీ!

  రిప్లయితొలగించండి
 20. వనితారత్నము కోమలాంగి యగు,
  శబ్దాధిక్యభావాల్పమై
  విన కాఠన్యనిగూఢభావయుత దుర్వేద్యోక్తిభూయిష్ఠమై
  కనగా నట్టి కవిత్వమున్ తగు మహత్కార్యమ్ముగా నెవ్విధిన్
  వనితం బోల్చఁగనొప్పు? నా కవితతో వారింపనొప్పున్ గవీ!

  కంజర్ల రామాచార్యులు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వనితం బోల్చఁగనొప్పునా కవితతో వారింపనొప్పున్ గవీ
   యని నీవందువ! నిర్విచారమతివై? యజ్ఞానివై యక్కటా!
   మనసారం దముఁ దామె వల్చు నెడ తన్మాధుర్యమేపారగా
   ననువై యుండు, బలాత్కృతమ్మున గొనన్ స్వారస్యముల్ గల్గునా!!

   కంజర్ల రామాచార్యులు.

   తొలగించండి
 21. కనగా నడకల హొయలును
  వినగా శ్రావ్యంపులీల వీనుల విందై,
  చెణుకుల తళకుల బెళకుల
  వనితా కవితలనుఁ బోల్చఁ బాడియె సుకవీ

  కొరుప్రోలు రాధాకృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 22. విను నూత్నంబని వెర్రి పోకడల నీవీ రీతిగా కుబ్జయౌ
  వనితం బోల్చఁగనొప్పునా కవితతో వారింపనొప్పున్ గవీ
  గనుమా శారద నీరదేందు సిత నీకాశాస్ఫురద్రూపియై
  ఘనభూషాన్వితయౌ సరస్వతియె సాకారంబగున్ కైతలన్

  రిప్లయితొలగించండి
 23. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 24. వనితం బోల్చగ నొప్పునాకవితతో వారింపనొప్పున్ గవీ!
  వనితం బోల్చగ న్యాయమే కవితతో వారింప వీలయ్యెనే?
  వనితల్ సూడగ సౌకుమార్యమును భావావేశ చిత్తంబుతో
  ననయంబబ్బుర మైన యాకవితలభ్యాసంబు గావించుటన్

  రిప్లయితొలగించండి
 25. వినుమీ విషయము శారద!
  వనితయు మఱి కవితయనగ బహు కోమలముల్
  కనుకను బాడియె యీయది
  వనితా కవితలను బోల్చ బాడియె సుకవీ!

  రిప్లయితొలగించండి
 26. ఘన మృదు పద సద్భాసిత
  ఘన గంభీ రార్థ గర్భ కాలానుగ తై
  క నయ వచ నోల్లసిత త
  ద్వనితా కవితలనుఁ బోల్చఁ బాడియె సుకవీ

  [పాడియె = భావ్యమే, నిశ్చయముగ భావ్య మని]


  విన నుప్పొంగు మనమ్ము కావ్య గత వాగ్వృష్ట్యంగనా వాక్యముల్
  వని తాస్యాబ్జము కావ్య భావ ముఖ మాపాదించు నానందముం
  గన నీ రెండు పరస్పరమ్ము సమముల్, కాదన్నచో నెల్లరన్,
  వనితం బోల్చఁగనొప్పు నా కవితతో, వారింప నొప్పుం గవీ

  రిప్లయితొలగించండి
 27. మత్తేభము:
  వనమందున్ వికసించు పూవుఁ గనగా వయ్యారి భామందురే
  తన సౌందర్యమె భూషణమ్ము తనదౌ దాల్చంగ లేవే నగల్
  కనగా కైత వసించదే
  పద యలంకారమ్ములున్ లేకనే
  “వనితం బోల్చఁగనొప్పునా కవితతో వారింపనొప్పున్ గవీ”
  --కటకం వేంకటరామశర్మ.

  రిప్లయితొలగించండి
 28. పనిలో దాసిగ సేవలన్ సలుపి సంభావించుచున్ నాథునిన్
  ఘనమౌ జీవిత మియ్య పిల్లలకు నాకాంక్షించుచున్ నిష్ఠతో
  తన జీవమ్మును కాపురమ్మునకునై త్యాగమ్ము గావించు నా
  వనితం బోల్చఁగ నొప్పునా కవితతో? వారింపనొప్పున్ గవీ

  రిప్లయితొలగించండి
 29. అనయం బందరి తోడ గ్రోధము
  న మాటాడున్ గదా 'మీన'యున్
  వినయంబింతయు లేనికోమలిని
  యే విజ్ఞాన మేలేని యీ
  వనితన్ బోల్చగ వచ్చునా 'కవి
  త' తో వారింప నొప్పున్ గవీ!
  ఘననీయంబగు తెల్వితేటలు
  గడుం గల్గీ సులోలాక్షితో.

  రిప్లయితొలగించండి
 30. వనితయు కవితయు నొకటే
  వనితా కవితలనుఁ బోల్చఁ బాడియె సుకవీ”*
  యనుటయు సరియే మీకును
  వినుమవి హాయినిల గూర్చు వేడుక తోడన్

  రిప్లయితొలగించండి