18, జులై 2021, ఆదివారం

సమస్య - 3786

19-7-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“త్రాగుఁబోతుల కదియె శ్రీరామరక్ష”
(లేదా...)
“త్రాగెడి వార లెల్లరకుఁ దా నగు నెప్పుడు రామరక్షయై”

63 కామెంట్‌లు:

  1. చిన్నిపురుగునుగెలువంగచింతఁజేసి
    సూదిమందునునీయంగఁజూచిరంత
    దానఁజేసియుత్రాగుటనాపవలయు
    త్రాగుఁబోతులకదియెశ్రీరామరక్ష

    రిప్లయితొలగించండి
  2. కాయ కష్టము చేయగ కాసు పొందు

    ఆలు బిడ్డల యాకలి గాలికొదలు

    వగలు కురిపించు సారయే భోగమగును

    త్రాగుఁబోతుల , కదియె శ్రీరామరక్ష

    ప్రభుకు, పన్నులొచ్చుకదర శుభము కదర

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వదలు, వచ్చు'... 'ఒదలు, ఒచ్చు' అనరాదు. "..యాకలి గానకుండ.. పన్నులు వచ్చును" అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములండీ
      మీ సవరణ పాటిస్తాను

      తొలగించండి
  3. ధర్మ కార్యాల తో బాటు దానములను
    నిరత మొనరించి సత్కార్య నిరతు డగుచు
    పతిత పావను గొల్చుచు భక్తి రసపు
    త్రాగు బోతుల కదియె శ్రీ రామ రక్ష !

    రిప్లయితొలగించండి
  4. వాగుచును, తిట్టచు, నిజము వదరును మరి
    తూగుచు బలుకు, నితరుల తూలనాడు
    జోగి యని వాని సైతురు, సూడుగొనరు
    త్రాగుఁబోతుల కదియె శ్రీరామరక్ష

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాగము తీయుచున్ మనసు రాముని పాటలు యందు లీనమై
      సాగగ జీవితం బుమరి చాలని పించును లేశమాత్రమౌ
      భోగము లన్ని, భక్తి యనుభూతిని తియ్యని పానకంబుగా
      త్రాగెడి వార లెల్లరకుఁ దా నగు నెప్పుడు రామరక్షయై

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "పాటలయందు" అనండి.

      తొలగించండి


  5. లోగొను మంటి, నీదకొమరుండు సముద్రము దాటి లంకలో
    బాగరి సీతగాంచెనను వార్తయె సంతస మంద జేయగన్
    భోగమునంది జేసె కపిమూకయె, మారుతి మాట యొక్కటే
    త్రాగెడు వారలెల్లరకుఁ దానగు నెప్పుడు రామరక్షయై.




    సీత నచట గాంచితినను వాతసుతుని
    పలుకులను విన్న వానరుల్ బాళినంది
    వనను చెరచిన నేమిరా హనుమ మాట
    త్రాగు బోతుల కదియె శ్రీరామ రక్ష.

    రిప్లయితొలగించండి
  6. జాగొనరించ బోకుమిక సత్య
    ము మానవ జీవితంబులో
    రాగముతో నయోద్య రఘురా
    ముని గొల్చుచు చిత్త శుద్ధితో
    సాగుము జానకీ వరుని సద్గుణ
    రాముని నామ పానమున్
    ద్రాగెడు వార లెల్లరకు దానవు
    నెప్పుడు రామరక్షయై

    రిప్లయితొలగించండి
  7. అగ్రజా !సుర‌‌‌‌ సేవించ‌ నమ్మ నైన

    తూల నాడును‌ మనుజుడు, తోడ నుండు

    భార్య ను‌ సతము హింసిచు, భంగ పడును

    తాను ,సహజ మౌ నైజంబు‌ తరచి చూడ

    *త్రాగు బోతుల కదియె, శ్రీ రామ, రక్ష*

    నిడగ వలె ప్రజల కెపుడు నెమ్మి తోడ

    ననుచు నిండు‌ గర్భవతిని జనక సుతను

    కాననములకు‌ పంపుట. ఘనత కాదు,

    త్రాగు బోతుల పలుకులు తామరాకు

    పైన జలము‌, వీడ వలె నీ‌ పట్టు నగ్ర

    జా యనుచు లక్ష్మణుండనె జంకు లేక

    రిప్లయితొలగించండి
  8. ఆగకరామనామమనుయాగముఁజేయుచునాత్మయందునన్
    పోఁగనిభోగభాగ్యములుపోతనజీవనయాత్రసేయగా
    వీఁగనెనుబాహ్యబంధములువేగమెరామరసాయనంబుతో
    త్రాగెడివారలెల్లరకుతానగునెప్పుడురామరక్షకై

    రిప్లయితొలగించండి
  9. శ్రీ గణనాథ వప్రుడిల
    చింతల బాపుచు సౌఖ్యసంపదల్
    వేగ మొనర్చు రక్షణను
    భీతని ద్రుంచును భద్రమూర్తియై
    సాగగ జేయునే మనికి
    స్వామి సమర్చన జేసి తీర్థమున్
    ద్రాగెడి వార లెల్లరకుఁ
    దా నగు నెప్పుడు రామరక్షయై!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా రెండవ పూరణము:

      ౙాగును జేయబోకు మిల
      స్వల్పము జీవిత కాలమింక నే
      రోగమొ జాడ్యమో దొరయ
      రోచిని వీడగనోపు, నిప్పుడే
      సాగిలి దేవదేవుని ల
      సత్కమనీయ సుయోచనాసుధన్
      ద్రాగెడి వార లెల్లరకుఁ
      దా నగు నెప్పుడు రామరక్షయై!

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  10. ఉ:

    భాగము నయ్యె మానవుడి భావము తోడుత కార్జ మేర్పడన్
    వేగమె తోడుసూపునది విస్తృత రీతిని మేను గాచనై
    యోగము పానశౌరులకు యోగ్యత గూర్చగ సర్వకాలమున్
    త్రాగెడి వార లెల్లరకు దా నగు నెప్పుడు రామ రక్షయై

    భాగము =భాగ్యము; భావము=పుట్టుక ;
    కార్జము=కాలేయము:
    యోగము=అదృష్టము

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి

  11. రాగిణి! రావెపోవుదము రాముని మందిర ప్రాంగణమ్ములో
    త్యాగయ కీర్తనల్ వినగ ధన్య సురాంగన సుబ్బలక్ష్మిచే
    ఆగమ సారమైన పరమాద్భుత రాగసుధా రసమ్మునన్
    ద్రాగెడు వారలెల్లరకు దానగు నెప్పుడు రామరక్షయై

    రిప్లయితొలగించండి
  12. ఇల్లు,నిల్లాలి,పిల్లల నీసడించి
    బానిసలుగాగ నొత్తురు, వారు,కాని
    త్రాగు వారలు నిజమును దాచలేరు
    త్రాగుబోతుల కదియె శ్రీరామరక్ష.

    రిప్లయితొలగించండి
  13. దేశ మంత కరోనాల తిప్ప లాయె;
    క్రొత్త రాష్ట్రపు నిధులకే కొరత లాయె;
    తెరిచె ప్రభుతయే బార్లను తెలివి తోడ
    త్రాగుఁబోతుల కదియె శ్రీరామరక్ష.

    రిప్లయితొలగించండి
  14. సమస్య :
    త్రాగెడివార లెల్లరకు
    దా నగు నెప్పుడు రామరక్షయై

    ( మద్యపానమత్తులకు కాపురం కాపాడుకొనేందుకు ఓర్పుగా నేర్పుగా ఉండే కాంతయే నిరంతరరక్ష )

    వాగుచునుండు ; నిల్లు మది
    పట్టదు నెంతటి రాత్రి యైననున్ ;
    సాగుచు నుండు నాతనికి
    జక్కగ జీవితయానమంత ; ను
    ద్వేగము జెందనట్టి సతి
    తెల్విగ నేర్పుగ నాథు నోర్చెడిన్ ;
    ద్రాగెడివార లెల్లరకు
    దా నగు నెప్పుడు రామ ; రక్షయై .

    ( రామ - కాంత )

    రిప్లయితొలగించండి
  15. ఉత్పలమాల:
    త్రాగె సదాశివుండు మును రామ రసమ్మను పానకమ్ము నే
    త్రాగెను రామభద్ర పద దాసుడు గోపన కమ్మకమ్మగా !
    త్రాగగ రామనామము సదా భవతారకమౌ నిధానమౌ!
    “త్రాగెడి వార లెల్లరకుఁ దా నగు నెప్పుడు రామరక్షయై”
    --కటకం వేంకటరామశర్మ.

    రిప్లయితొలగించండి
  16. మదిని నొచ్చు బాధ మరువ , మదిర దొరక
    త్రాగుఁబోతుల కదియె శ్రీరామరక్ష ,
    మద్య పానము వద్దన మనుట యెటుల
    ననెడి శంక కలుగు చుండు ననవరతము

    రిప్లయితొలగించండి
  17. పాన శౌరులనేరీతి ప్రభుత మరచు
    ఉచిత మద్యవు పథకము నుగ్గడించి
    త్రాగుబోతుల వ్యయమును తాభరింప
    త్రాగుఁబోతుల కదియె శ్రీరామరక్ష

    రిప్లయితొలగించండి
  18. యోగులు భక్త పుంగవులు యోధులు విష్ణుని నామ కీర్తనన్

    త్యాగయ రామ దాసుడును ధ్యానము గానము చేసి పాడగన్

    రాగము దిక్కు పిక్కటిల రాముని కీర్తుల మాధురీ సుధన్

    త్రాగెడి వార లెల్లరకుఁ దా నగు నెప్పుడు రామరక్షయై

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  19. తేటగీతి
    రామ నామామృతముఁ గ్రోలు రామదాసు
    ప్రభుత చెరనుంచి బాధించ పైకమెంచి
    రామలక్ష్మణులొసఁగఁగ, నామ సుధను
    త్రాగుఁబోతుల కదియె శ్రీరామరక్ష

    సాగదటంచు గోపన ప్రజాధనమ్మునఁ గట్టఁ గోవెలన్
    వేగమె పాదుషా చెరను వేయఁగ, గాచిరి రామలక్ష్మణుల్
    రాగము మీర పైకమిడి, రాముని నామ సుధామృతాంబువుల్
    ద్రాగెడి వార లెల్లరకుఁ దా నగు నెప్పుడు రామరక్షయై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. 🙏ధన్యోస్మి గురుదేవా!🙏 సవరించిన వృత్తపూరణ:

      ఉత్పలమాల
      సాగదటంచు గోపన ప్రజాధనమున్ గొని కట్టఁ గోవెలన్
      వేగమె పాదుషా చెరను వేయఁగ, గాచిరి రామలక్ష్మణుల్
      రాగము మీర పైకమిడి, రాముని నామ సుధామృతాంబువుల్
      ద్రాగెడి వార లెల్లరకుఁ దా నగు నెప్పుడు రామరక్షయై

      తొలగించండి
  20. జాగిక సేయనేల మన జన్మము ధన్యత నెంచగోరుచున్
    రోగములెల్ల జేరి తను రోచులు దప్పగ రోతబుట్టదే
    యోగము, భక్తిభావన పయోనిధి మున్గుచు పుష్పసారమున్
    త్రాగెడి వార లెల్లరకుఁ దా నగు నెప్పుడు రామరక్షయై.

    రిప్లయితొలగించండి
  21. త్యాగము చేయుచున్ బ్రతుకు ధార్మిక కార్యము నందు నిచ్ఛతో
    బాగవతోత్తముం డగుచు ప్రార్థన చేయుచు నిష్ఠతో సదా
    సాగుచు నున్న, నా యనిల జాతుడె, రాముని నామ కంజమున్
    ద్రాగెడి వార లెల్లరకుఁ దా నగు నెప్పుడు రామరక్షయై

    రిప్లయితొలగించండి
  22. భోగవిరక్తులై పరమపూజ్యుని నిల్పుచు మానసంబునం
    దా గుణ కీర్తనంబె పరమావధిగా తలదాల్చి నిత్యమున్
    సాగుచు ధర్మ మార్గమున సద్విధిగా గొని భక్తి మాధ్వినిన్
    త్రాగెడి వార లెల్లరకుఁ దా నగు నెప్పుడు రామరక్షయై

    రిప్లయితొలగించండి
  23. పీక నిండిన సారాయి పెదవిజేరి
    యెంత తిట్టిన గొట్టిన నెంత వాగ
    వారి జోలికి వెళ్ళరు బంధు గణము
    త్రాగుబోతుల కదియె శ్రీరామ రక్ష

    రిప్లయితొలగించండి
  24. భాగవతోత్తమప్రముఖభక్తలు మెచ్చగ , నిల్పి దివ్యస
    ర్వాగమశీర్షదీప్తయదువంశ్యు నెడందను, గ్రోలి తత్కథా
    భోగరసమ్ము, పేయపరిపూర్ణమహోన్నతకీర్తనాసుధన్
    ద్రాగెడి వార లెల్లరకుఁ దా నగు నెప్పుడు రామరక్షయై.

    కంజర్ల రామాచార్యులు.

    రిప్లయితొలగించండి
  25. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  26. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  27. రాగముగల్గియున్ శివునిరంజిలజేసెడుభక్తిధారనున్
    ద్రాగెడు వారలెల్లరకుదానగు నెప్పుడు రామరక్షయై
    భోగము లన్నియున్ వదలి పూర్ణమనంబున నెల్లవేళలన్
    ద్యాగయ,రామదాసులిల ధార్మిక వృత్తిని రాముగొల్చిరే

    రిప్లయితొలగించండి
  28. వాఁగ వాఁగ జనుల కెల్లఁ దూఁగు రక్ష
    పాప లానఁగఁ బాలను ద్రేఁపు రక్ష
    త్రాగి త్రాగి పిదప సుంత త్రాగఁ జల్ల
    త్రాగుఁబోతుల కదియె శ్రీరామరక్ష


    శ్రీగళ భక్త సత్తముఁడు సీతకు భర్త దయాంబురాశియే
    రాగము మీఱ రాఘవుఁడు త్రాతగ, దుస్సహ తాప వహ్నినిం
    గాఁగఁగ రామ నామ జప కార్య సమంచిత చింతనా సుధం
    ద్రాగెడి వార లెల్లరకుఁ దా నగు నెప్పుడు రామరక్షయై

    [పద విభజనము: ...రాఘవుఁడు తా నగు త్రాతగ నెప్పుడు రామరక్షయై]

    రిప్లయితొలగించండి
  29. అన్ని కోర్కెలు విడనాడి యార్తితోడ
    దేవదేవునిపూజింప దీక్షబూని
    ముక్తిచేకూరుతథ్యము భక్తి సుధను
    త్రాగుఁబోతుల కదియె శ్రీరామరక్ష

    రిప్లయితొలగించండి
  30. ఆగక ముందె గుండె సడి, యన్య విచారములన్ ద్యజించుచున్
    వేగమె భక్తి మార్గమును బ్రేమను బెంచగ జీవనమ్మునన్
    బాగుగ రేపు మాపులను భాగవ తమ్మమృతమ్మె యన్నటుల్
    త్రాగెడి వార లెల్లరకుఁ దా నగు నెప్పుడు రామరక్షయై

    రిప్లయితొలగించండి
  31. రామ శ్రీరామ యనుచును రహినిబూని
    పగలు రేయి యంచెం చక భక్తి తోడ
    నామ కీర్తనలను పాడ నామరసపు
    త్రాగు బోతులకదియె శ్రీరామరక్ష

    రిప్లయితొలగించండి