17, జులై 2021, శనివారం

సమస్య - 3785

18-7-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వనధికి సాగరమునకు లవణశరనిధికిన్”
(లేదా...)
“వనధికి సాగరమ్మునకు వార్ధికి నబ్ధికి నంబురాశికిన్”

63 కామెంట్‌లు:

  1. కనగనుపారంబేయది
    వినగనుఘోషలునలజడివిస్మయమందన్
    మనసనుమర్మపులోతుల
    వనధికిసాగరమునకులవణశరనిధికిన్

    రిప్లయితొలగించండి
  2. వనజాక్షికి ముద్దుల పిత

    వనధికి , సాగరమునకు , లవణశరనిధికిన్,

    వనమాలాధరు మామకు

    తనయకు పతిని కొలిచెద సదా దాసుడనై

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  3. జనమును నింపి యోడను సజావుగ పారగ జేయువేళలో
    తనువున కంపనంబులును తత్తర బుట్టెను చిన్న కన్నమున్
    గనుగొని, నావలో ప్రజలు కావగ మ్రొక్కిరి వేరు వేరు గా
    వనధికి సాగరమ్మునకు వార్ధికి నబ్ధికి నంబురాశికిన్

    రిప్లయితొలగించండి
  4. వినుతిని బొందిన నదులవి
    ఘనముగ ప్రవహించి కడకు కలియుచు నుండున్
    నినదించుచు చేరు నవియె
    వనధికి సాగరమునకు లవణ శర నిధి కిన్

    రిప్లయితొలగించండి
  5. అనయముదేహరూపమిదిహంగులుచాలగనుండునేగదా
    పనిగోనిపల్కరించిననుపంచునుకష్టసుఖంపుగాధలే
    మనసనుమాయగాలియిదిమమ్మునుమిమ్మునునీడ్చిముంచులే
    వనధికిసాగరమ్మునకువార్ధికినబ్ధికినంబురాశికిన్

    రిప్లయితొలగించండి
  6. కందం
    ఇనకుల తిలకుని మ్రొక్కుచు
    వినయమ్ముగ నుపశమింప వెలయించిరి వం
    తెన వానరులంకితమై
    వనధికి సాగరమునకు లవణశరనిధికిన్

    చంపకమాల
    ఇనకుల వంశజున్ వినయమేర్పడ మ్రొక్కి శమించి నంతటన్
    వనచర వీరులెల్లరును పావన రాముని నామకీర్తనన్
    ఘనతరమైన వారధిని గట్టిరి రావణు గూల్చనెంచుచున్
    వనధికి సాగరమ్మునకు వార్ధికి నబ్ధికి నంబురాశికిన్

    రిప్లయితొలగించండి

  7. విరించి.


    తనయుడు కోరగ చెప్పెను
    జనయిత తెలుగర్థములను జవ్వని యనగా
    వనితకు సతికిని, తిమి యన
    వనధికి సాగరమునకు లవణ శరనిధికిన్.


    విరించి.

    వనచరమంచు కోతికిని వాలడికిన్ కిగికిన్ గుథావుకున్
    జనయిత యన్నఁ జన్మదుడు శాస్తకు నబ్బకు, నంబుభృత్తనన్
    వనధికి సాగరమ్మునకు వార్ధికి నబ్ధికి నంబురాశికిన్
    తెనుగున యర్థముల్ గలవు ధీవర శ్రద్ధగ నాలకింపుమా!

    రిప్లయితొలగించండి
  8. ఘనముగ విష్ణుమూర్తి తన కాంతను లక్ష్మిని యిచ్చినట్టి,మా
    మను, మనసార దల్చుచు సమంత్రకపూర్వక వందనంబిడెన్
    వనధికి,సాగరమ్మునకు,వార్ధికి,నబ్ధికి,నంబు రాశికిన్
    వినుతి సురాధినాథుడును,వేల్పులు,నచ్చెర లాడి పాడగన్.

    రిప్లయితొలగించండి
  9. జనకుని పుత్రి జానకిని జారుడు రావణ బ్రహ్మ కోరికన్

    వనమున సేయ బందియను వానిని ద్రుంచెడు కార్య సాధనన్

    ఇనకుల రాజు రాముడును మిత్రులు కూడిక కట్టె వారధిన్

    వనధికి సాగరమ్మునకు వార్ధికి నబ్ధికి నంబురాశికిన్

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  10. ఈ నాటి శంకరాభరణం వారి
    సమస్య

    వనధికి,సాగరమునకు,లవణశరనిధికిన్

    ఇచ్చిన పాదము కందము

    నా పూరణ సీసములో


    రఘుకుల వంశవా రసుడను,ఘనమైన
    యిక్ష్వాకు కులమందు
    నెలమి‌తోడ

    దశరధ నృపతి ప్రధమ‌ సుతుండుగ బుట్టి
    నట్టి వాడను నేను,‌ నాదు పితృ

    దేవుల శుభయానతిని స్వీక రించి వనమునకు నే వచ్చి,నాడ వనిత

    నపహరించెగ రావణా సురుండు ,నచట
    కేగ దలచి నిటకిపుడు‌ వచ్చి

    నాడ దారినొసంగ వేడుచు నుంటిని
    పంచభూతములార,వందనములు


    శంఖికిన్,వనధికి,సాగరమునకు ల
    వణశర నిధికి,నపారమునకు


    శిరము వంచి చేయుచు నుండె శీఘ్ర గతిని

    నే ననుచు ధనువును‌ వీడి‌ నేల పైన

    తలను వంచి శ్రీ రాముడు దారి నొసగ

    మనుచు వేడె సంద్రంబును మరల‌ మరల

    రిప్లయితొలగించండి
  11. ఘనముగ పూజజేసియునుగౌరి
    సుపుత్రు గణేశు కందరున్
    వినుతులుజేసి భక్తిమెయివేడ్కలు
    సేతురుభాద్రపదంబునందునన్
    మనమున సన్నుతించి నిమజ్జ
    నము న్నొనరింత్రు మ్రొక్కచున్
    వనధికి సాగరంబునకు వార్ధికి నబ్ధికి నంబురాశికిన్.

    రిప్లయితొలగించండి
  12. ఘనమగు రత్నౌషధులకు
    కనకాంగి కలిమిచెలిమికి కమలాక్షునికిన్
    అనువగు వాసమునకు నతి
    వనధికి సాగరమునకు లవణశరనిధికిన్

    కనుగొన రత్నరాశికిని కల్ములరాణికి వారిజాక్షుకున్
    ఘనమగు సర్పజాతికిని గ్రాహతిమింగిల మత్స్యరాశికిన్
    అనువగు వాసయోగ్యమయి హర్షముబంచగ కేలుమోడ్తు నా
    వనధికి సాగరమ్మునకు వార్ధికి నబ్ధికి నంబురాశికిన్

    రిప్లయితొలగించండి
  13. కనుగొంటి నిఘంటువులో
    వనధికి సాగరమునకు లవణశరనిధికిన్
    ననువగు నేకా ర్థమనుచు ,
    వెనువెంటనె పూరణ సలిపితి తోషముగన్

    రిప్లయితొలగించండి
  14. కనుగొని జానకి జాడను
    హనుమ తెలుప రామచంద్రుడతి రభసముగన్
    ఘనవారధి నిర్మించెను
    వనధికి సాగరమునకు లవణశరనిధికిన్

    రిప్లయితొలగించండి
  15. ఎనలేని జలచరంబుల
    కనుకూలంబగు యునికిని గల్పించుచు జీ
    వనమొసగు గనుక మొక్కెద
    వనధికి సాగరమునకు లవణశరనిధికిన్

    రిప్లయితొలగించండి
  16. తను వినె రేడియో న తన తాతయు తండ్రియు వేట కేగగా
    పెను విప రీత గాలులను వీచు తు ఫానును గూర్చి గుమ్మ;స
    ద్వినయము తోడ వేడె తమ పెద్దల ముంచకు మంచు, మ్రొక్కె తాన్
    వనధికి సాగరమ్మునకు వార్ధికి నబ్ధికి నంబురాశికిన్

    రిప్లయితొలగించండి
  17. హనుమ నమస్కరించె జనకాత్మజ జాడనెరుంగ బోవుచున్
    దనుజుని దుర్గమున్ గదియు దారిని గోరి నమించె రాముడున్
    వెనుకనె లక్ష్మణుండు కపివీరులు ఋక్షములంజలించిరా
    వనధికి సాగరమ్మునకు వార్ధికి నబ్ధికి నంబురాశికిన్

    రిప్లయితొలగించండి
  18. చం:

    కనబడె పట్న మెల్లెడల కష్టము లెన్నియొ వాన నీటితో
    వనధికి సాగరమ్మునకు వార్ధికి నబ్ధికి నంబు రాశికిన్
    ననుభవ మెంచురీతి నట నడ్ముల నంటెడు నీరునిల్వగా
    వినబడ కుండు నేలికకు వేదన తీర్చుమటన్న ప్రార్థనల్

    పట్నము=హైదరాబాద్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  19. మనసారగ మ్రొక్కవలయు
    ననంతజలధికి కడలికి నతులిత సంద్రం
    బనదగు నుదధికి విషధికి
    వనధికి సాగరమునకు లవణశరనిధికిన్

    రిప్లయితొలగించండి
  20. చంపకమాల:
    చినుకును మోయుమేఘ మటు చేకొని తెచ్చు జలమ్ము వానకై
    ఘనము విదిల్చనాజలము గట్టుల పారు నదీ నదమ్ములై,
    కనుగొని మ్రొక్కగావలయు కారణ మన్ని జలాల మూలమౌ
    “వనధికి సాగరమ్మునకు వార్ధికి నబ్ధికి నంబురాశికిన్"
    --కటకం వేంకటరామశర్మ

    రిప్లయితొలగించండి
  21. సమస్య :
    వనధికి సాగరమ్మునకు
    వార్ధికి నబ్ధికి నంబురాశికిన్

    ( హనుమంతుడు సీతాదేవితో )

    చంపకమాల
    -----------

    జనకజ ! యాలకింపగదె
    ఝల్లన రావణదైత్యుగుండెయే
    వనధికి సాగరమ్మునకు
    వార్ధికి నబ్ధికి నంబురాశికిన్
    ఘనమగు వారధిన్ నిలిపి
    ఖండన సేయును రాక్షసాళినే
    యినకులమౌళి ; నమ్ముమిక
    యిక్కటులెల్లను దీరిపోవులే !

    రిప్లయితొలగించండి
  22. వినుడిది సింధువున్, జలధి విజ్ఞశిఖామణులార! సంద్రమున్
    గనగ పయోధియున్, శరధి, కంధి,సరిత్పతి, వీచిమాలియున్
    ఘనతరనామధేయములుగా నిట నెంతురు పండితాళి యా
    వనధికి సాగరమ్మునకు వార్ధికి నబ్ధికి నంబురాశికిన్

    రిప్లయితొలగించండి
  23. తన పతిదేవు నౌదలను దైతకలాడెడు గంగఁ గాంచి నె
    మ్మనమున గౌరి కుందఁగఁ గుమారుఁడు బొమ్మని చెప్పినంత నే
    మనికిని నేగు దాన నన మానినికిన్ దగఁ జెప్పె నిట్టులన్
    "వనధికి సాగరమ్మునకు వార్ధికినబ్ధికి, నంబురాశికిన్"

    రిప్లయితొలగించండి
  24. తనువు పులకింత పెట్టెడి
    వనధికి సాగరమునకు లవణశరనిధికిన్
    వినుటకు మూడున్నను,యం
    దున నొకదానికిలవణము దూరుట తగునా

    రిప్లయితొలగించండి
  25. అనయము పుట్టి పర్వతము లందున నేఱులు పాఱి క్రిందికిన్
    మనుజుల కిచ్చి తీర్థముల మధ్య గొనన్ వ్యవసాయమందునన్
    తనువుల నియ్య నెంచుచు ముదమ్మున చేరు ననుంగు భార్యలై
    వనధికి, సాగరమ్మునకు, వార్ధికి, నబ్ధికి, నంబురాశికిన్

    రిప్లయితొలగించండి
  26. వనమున నున్నదౌ దమను వారధి గట్టగ సాయమంద తా
    కనుగొని జీవరాశియును గార్యము జేయగ గోరినంతనే
    యినకుల రామచంద్రునకు నిచ్ఛను దీర్చగ వందనంబులే
    వనధికి సాగరమ్మునకు వార్ధికి నబ్ధికి నంబురాశికిన్

    రిప్లయితొలగించండి
  27. మననము జేయుచు రాముని
    వినయముతో కోతిమూక విసరగ రాళ్ళన్
    ననువగు వంతెన యాయెను
    వనధికి సాగరమునకు లవణశరనిధికిన్

    రిప్లయితొలగించండి
  28. వినయము ధర్మపాలనము, విప్రుల గో, శరణార్థు లందరన్
    మనమున దల్చినంత దనుమన్నన జూపి యనుగ్రహించడే,
    ఘనమగు రామ చంద్రుకు, సుఖంబిడ మొక్కుచు వేడెదన్ దయా
    వనధికి సాగరమ్మునకు వార్ధికి నబ్ధికి నంబురాశికిన్.

    రిప్లయితొలగించండి
  29. వినయముతోడ మర్కటము వేనకువేలుగ సంతసంబునన్
    మననము జేయుచున్ మదిని మైధిలి భర్తను ,రాళ్ళువేయగా
    ననువగు వారధిన్వలెను నడ్డుగ నేర్పడెగాదె చూడగన్
    వనధికి సాగరమ్మునకువార్ధికి నబ్ధికి నంబురాశికిన్

    రిప్లయితొలగించండి
  30. ముని వరు లవని తలమ్మున
    మునుఁగఁ బ్రభాత సమయములఁ బుణ్య జలములం
    జనుదు రెలమి వేర్వేఱుగ
    వనధికి సాగరమునకు లవణశరనిధికిన్


    వన మన నీర మప్పనిన వారియు నంబువు లన్న నంతియే
    ఘనులగు సాగరుల్ పుడమి గర్వ మెలర్పఁగఁ ద్రవ్వ సాగరం
    బనియును నీటి కుప్ప లని వచ్చెను బేరులు తత్ప్రకారమే
    వనధికి సాగరమ్మునకు వార్ధికి నబ్ధికి నంబురాశికిన్

    రిప్లయితొలగించండి
  31. ఇనకులతిలకుండంపగ
    వనచరములవెల్లెచేరి వడిగా నచ్చో
    వినయముతోమ్రొక్కిరియా
    వనధికి,సాగరమునకు, ,లవణశరనిధికిన్

    రిప్లయితొలగించండి
  32. తేటగీతి
    రామ నామామృతముఁ గ్రోలు రామదాసు
    ప్రభుత చెరనుంచి బాధించ పైకమెంచి
    రామలక్ష్మణులొసఁగఁగ, నామ సుధను
    త్రాగుఁబోతుల కదియె శ్రీరామరక్ష

    సాగదటంచు గోపన ప్రజాధనమ్మునఁ గట్టఁ గోవెలన్
    వేగమె పాదుషా చెరను వేయఁగ, గాచిరి రామలక్ష్మణుల్
    రాగము మీర పైకమిడి, రాముని నామ సుధామృతాంబువుల్
    ద్రాగెడి వార లెల్లరకుఁ దా నగు నెప్పుడు రామరక్షయై

    రిప్లయితొలగించండి