13, జులై 2021, మంగళవారం

సమస్య - 3781

14-7-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తెలివి రవ్వంత లేని సుధీవరుండ”
(లేదా...)
“తెలివి రవంత లేకయె సుధీవరుఁడన్న ప్రశస్తి నందితిన్”

36 కామెంట్‌లు:


 1. విరించి.


  (తిమ్మరుసు కనులు పీకేయించిన పిదప కృష్ణరాయడు చింతించుట)

  ప్రతి విషయము విచారించి ప్రతిభ తోడ
  సూచన లనిచ్చెడప్పాజి సూక్ష్మదర్శి
  వలన కీర్తినందినవాడ వసుధ యందు
  తెలివి రవ్వంత లేని సుధీవరుండ.

  రిప్లయితొలగించండి
 2. ( నీతిగల రాజకీయ నాయకుని స్వగతం)

  మాయ మాటలు పలుకుచు మనము దోచి

  పట్టి జనుల ఓట్లను పట్టె పదవి వైరి

  దుష్ట యోచన తోడను దోచు కొనెడు

  తెలివి రవ్వంత లేని సుధీవరుండ”

  రాజకీయమేలయ నాకు రామచంద్ర

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 3. డిగ్రితోడనుమురియుచుడింభకుండు
  సిరికివల్లభుడగుచునుచిందులేసె
  వేదసారమునెఱిగినవిప్రుడనియె
  తెలివిరవ్వంతలేనిసుధీవరుండ

  రిప్లయితొలగించండి
 4. సమస్య :

  తెలివి రవంత లేకయె సు
  ధీవరుడన్న ప్రశస్తి నందితిన్

  ( తనకేమీ తెలియకపోయినా తనమాటలు కాకతాళీయంగా జరిగి జనాదరణపాత్రము
  లౌతున్నాయని భార్యతో అంటున్న మిడతంభొట్లు)

  కలువల కన్నులెత్తి నను
  గాంచవె కాంచనమాల ! నిండుగా
  వెలిగెడి నాదు కీర్తికిని
  వెన్నెలనవ్వులు చిందుచుండె నీ
  వలపుల ముద్దుమోవిపయి ;
  పల్కులరాణి దయామృతమ్ముచే
  తెలివి రవంత లేకయె సు
  ధీవరుడన్న ప్రశస్తి నందితిన్ .

  రిప్లయితొలగించండి
 5. సమ సమాజము కొఱకు నై శక్తి కొలది
  పరితపింతువు గాని యే పట్టు నైన
  పరుల దోఁచెడి గుణ మల వడ ని నట్టి
  తెలివి రవ్వంత లేని సు ధీ వరుండ !

  రిప్లయితొలగించండి
 6. కలిమిన బుట్టి పెర్గితిని కాలము జెప్పగ నెంచలేదొకో
  పలువురి బాధలన్ గనక బాధ్యత మర్చిన వర్తనమ్ములే
  ఎలమిన పల్కినట్టి పలు నింపగు భాషణ భూషణమ్ములే
  తెలివి రవంత లేకయె సుధీవరుఁడన్న ప్రశస్తి నందితిన్!!


  రిప్లయితొలగించండి


 7. విరించి.


  (తిమ్మరుసు కనులు పీకేయించిన పిదప కృష్ణరాయడు చింతించుట)

  పలు విషయమ్ములందు జనవంద్యుడు ప్రాజ్ఞుడమాత్య శేఖరుం
  డలఘుడు చెప్పినట్టి సలహాలను మీరని వాడ గావునన్
  పలువురు మెచ్చిరిప్పుడిట పాపిని సత్యమెఱుంగ నైతినే
  తెలివి రవంత లేకయె సుధీవరుఁ డన్న ప్రశస్తి నందితిన్.

  రిప్లయితొలగించండి
 8. రిప్లయిలు
  1. ఒక కవివర్యుని ఆవేదన....


   తేటగీతి
   పద్యపూరణంబులకై నుపక్రమించ
   దార ముందు, నోర్చునె పరధ్యానినైన?
   కాంతదౌ సహజత్వ మొకింత మార్చు
   తెలివి రవ్వంత లేని సుధీవరుండ!

   చంపకమాల
   కలమును బట్టి పూరణము కాంతకు ముందర వ్రాయనెంచ, నా
   దలపులు వీడగా తనను ధ్యాసమరల్చగ నోర్చునే? మదిన్
   జిలకఁగ మాన లేననఁగ,
   స్త్రీ సహజత్వము నేమఱించెడున్
   దెలివి రవంత లేకయె సుధీవరుఁడన్న ప్రశస్తి నందితిన్!

   తొలగించండి
 9. తెలివిగ కట్టి వారధిని తెంపుగ లంకను చేరి వానరుల్

  కలిసిన సేన సాయమున కైకసి పుత్రుని ద్రుంచు మానవా

  పలుకులు నీవు చెప్పితివి పద్యము వ్రాసితి రామ భద్రుడా

  తెలివి రవంత లేకయె సుధీవరుఁడన్న ప్రశస్తి నందితిన్”

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 10. ఎరుక లేనప్డు తలచితి నెరిగినట్లు
  యెరుక కలుగఁగ తెలిసె నేమెరుగనట్లు
  తెలిసితెలియని తనమని తెలిసె నిపుడు
  తెలివి రవ్వంత లేని సుధీవరుండ

  రిప్లయితొలగించండి
 11. సలలితభావసంపదలసామముతోడనకాలధర్మునిన్
  సులభముగాగసత్యమునుసుందరికోరెనునాధుజీవికన్

  అలుగకనాతడిచ్చెవరమాయమకప్పుడుధర్మరాజనెన్
  తెలివియోకింతలేకయెసుధీవరుడన్నప్రశస్తినందితిన్

  రిప్లయితొలగించండి
 12. చం:

  కలిమి ఘటిల్ల పుష్కలము గాంచదె లోకము మెచ్చుకోలుగన్
  చెలమను తోడు చందమున జేబులు నిండగ జూచు వారలై
  పిలుపును విన్న తక్షణమె వెంబడి జేరుచు వంత పాడగన్
  తెలివి రవంత లేకయె సుధీ వరుడన్న ప్రసక్తి నొందితిన్

  చెలమ=వాగు లో నీళ్ల కొఱకు త్రవ్వెడు పల్లము

  తక్షణము=తత్ క్షణము = Instantly

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 14. కలిమి బలిమిలేని సగటు కవిని పవిని
  "తెలివి రవంతలేని సుధీవరుండ"
  మాస్కు ధరియించి కోవిదు మట్టుబెడితి
  శానిటైజుగ దూరంగ సాగిపోదు!

  రిప్లయితొలగించండి
 15. చెలిమి బలంబున న్దనరి
  జీవన యాన విచిత్ర వీధిలో
  నలరెడు నిత్య నూతన ప
  థానుగతి న్చరియించు వాడనై
  దలచెద నెంద రెందరినొ
  తాత్వికులన్ననునిత్యమున్ మరే
  తెలివి రవంత లేకయె సు
  ధీవరుఁడన్న ప్రశస్తి నందితిన్!


  నా రెండవ పూరణము:

  తెలియగ జాలనన్నిటిని,
  తీయని యూహల భావజాలముల్
  యలికిడిజేయు నామనము
  నందు సమస్తము స్వారి జేయుచున్
  తొలుకు ననంత మోదమట
  దోయిలి మ్రొక్కెద నూహలందునన్
  దెలివి రవంత లేకయె; సు
  ధీవరుఁడన్న ప్రశస్తి నందితిన్!

  రిప్లయితొలగించండి
 16. రాజకీయపుటెత్తుల మోజు లేదు
  పాదయాత్ర జేయకనోడిపోదుననెడి
  బెంగ యించుకైననులేదు దొంగ ఓట్ల
  తెలివి రవ్వంత లేని సుధీవరుండ

  రిప్లయితొలగించండి
 17. అబ్బెసము కూసు విద్దియ యనెడు రీతి
  వలను విసరుట నేర్వగ , బడి యొస గెడి
  దెలివి రవ్వంత లేని సుధీవరుండ
  ననుచు ప్రశస్తి నందితి నన్ని నోళ్ళ

  ధీవరుఁడు = జాలరి

  రిప్లయితొలగించండి
 18. తెలివిగ కట్టి వారధిని తెంపుగ లంకను చేరి, వానరుల్

  కలిసిన సేన సాయమున కైకసి పుత్రుని ద్రుంచు మానవా

  పలుకులు నీవు చెప్పితివి పద్యము వ్రాసితి యేను శ్రీ పతీ

  తెలివి రవంత లేకయె సుధీవరుఁడన్న ప్రశస్తి నందితిన్”

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 19. అలనొక సత్కవీశ్వరమహాశయు డిట్లనె సభ్యకోటికిన్
  బలుకులతల్లి నారసనపైన వసించి నిరంతరమ్ముగా
  నలఘుతరాచ్ఛభావముల నందగజేయుటచేత నీగతిన్
  దెలివి రవంత లేకయె సుధీవరుఁడన్న ప్రశస్తి నందితిన్.

  రిప్లయితొలగించండి
 20. చంపకమాల:
  చలిమిడి ముద్ద నేననుచు, శాఖలు లేని ద్రుమమ్మటంచు, కా
  వలి పనికైన కద్దనుచు వాకిటఁ గట్టిన గుమ్మడంచు నన్
  పలువురు బాల్యమందుఁ దలపన్; గురు మూర్తుల బోధనాప్రభన్
  “తెలివి రవంత లేకయె సుధీవరుఁడన్న ప్రశస్తి నందితిన్”
  --కటకం వేంకటరామశర్మ.

  రిప్లయితొలగించండి
 21. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 22. అలఘుమనీషు లున్నతులు నార్జితవాఙ్మయవైభవాగ్రణుల్
  లలితకవిత్వకల్పనవిలాసుల నీసభ సత్కరించుచున్
  వెలయ సుధీతనూజు నను బిల్చిరి మత్పిత స్వర్గ మేగగన్.
  తెలివి రవంత లేకయె సుధీవరుఁడన్న ప్రశస్తి నందితిన్.

  సుధీతనూజుడు = పండితపుత్రుడు( పరమశంఠః)

  కంజర్ల రామాచార్యులు.

  రిప్లయితొలగించండి
 23. విలువలు కల్గినట్టి కడు విజ్ఞుల సంగడి సంచరించితిన్
  కలుగగ వారి వాసనలు కైతలు వ్రాయుట సంభవించె నా
  పలుకుల తల్లి చేరమది పండితవర్యుల మెప్పునందుచున్
  తెలివి రవంత లేకయె సుధీవరుఁ డన్న ప్రశస్తి నందితిన్

  రిప్లయితొలగించండి
 24. మహాకవి కాళిదాసుగారి మనోభావముగా

  చెలియను మోసగించితిని శ్రేష్ఠుడ బ్రాజ్ఞుడటంచు గూళనై
  యలుకను బూనకే వనిత హాటకగర్భుని రాణి వేడగా
  చెలువముమీర పద్యతతి జేసితినంబకు నర్చనమ్ము నే
  దెలివి రవంత లేకయె సుధీవరుడన్న ప్రశస్తి నందితిన్

  పలువుర మోసగించుటయు ప్రల్లదమాడుట ద్వంద్వవృత్తితో
  కులముల జిచ్చుబెట్టుటయు కూళలజేరుచు త్రాగితూగుటల్
  బలిమి నహంకరించుచును పండితవర్గము నీసడించుటన్
  తెలివి రవంత లేకయె సుధీవరుడన్న ప్రశస్తి నందితిన్

  రిప్లయితొలగించండి
 25. బలముగలాడనంచు గరువంబును జూపి పరాజితుండయెన్
  తెలివి రవంత లేకయె; సుధీవరుఁడన్న ప్రశస్తి నందితిన్
  సులువునెరింగి వాదమున జూపితి పాటవమొప్పుగానటన్
  తెలివిగ ధర్మ సూక్ష్మముల దెల్పితినా ప్రతివాది లోఁబడన్

  రిప్లయితొలగించండి
 26. తెలివి రవ్వంత లేని సుధీవరుండ!
  తెలివి తేటల తోడను మెలగుమయ్య!
  సంతసింతురు బంధువుల్ సక్కగాను
  తెలివి హీనుని జూతురు చులకనగను

  రిప్లయితొలగించండి
 27. కాయ కాంతి కన్నను మనః కాంతి ఘనము
  గొప్ప వాడను నేను సద్గుణము లందుఁ
  దేహ మందు వీక్షింపఁగ నెఱుపు దెలుపు
  దెలివి రవ్వంత లేని సుధీవరుండ

  [తెలివి =కాంతి; సుధీవరుఁడు = మంచి బుద్ధిమంతుఁడు]


  అలరుచు నన్ను పిల్త్రు ప్రవరాఖ్యుఁడ నంచును మిత్రు లెల్లరుం
  బొలుపు సెలంగ నెట్టి దగు పుణ్యముఁ జేసితిఁ బూర్వ మెన్ని బా
  ములను మనోవికారములు మోహము లెన్నఁడు, పిల్వ నంద క
  త్తె, లివి రవంత లేకయె సుధీవరుఁడన్న ప్రశస్తి నందితిన్

  [అందకత్తెలు +ఇవి = అందకత్తె లివి]

  రిప్లయితొలగించండి
 28. విలువలు వీడి రేపవలు వేఱు జనమ్ములపై పితూరులన్
  బలికి పదోన్నతిన్ గొనగ పై యధికారుల మెప్పు కోసమై
  మలినము లోన దాచుకొని మంచిగ పైకి నటించ గల్గెడిన్
  తెలివి రవంత లేకయె సుధీవరు డన్న ప్రశస్తి నొందితిన్!

  రిప్లయితొలగించండి
 29. తెలివి రవంత లేకయె సుధీవరుడన్న ప్రశస్తి నందితిన్
  తెలివి యొకింత లేదనుచు ధీరతబల్కితివమ్మ! కానినా
  బలుకులు విశ్వసింపుచును భక్తిని శంకరు వేడుకున్నచో
  దెలివది వచ్చి శీఘ్రము,సుధీవరుడన్న ప్రశస్తి సత్యమౌ

  రిప్లయితొలగించండి
 30. పలువురి పండితోత్తముల
  పంచన జేరియు పద్య భాషనున్
  నిలుకడ తోడ నేర్చుకొని నిత్య
  ము వ్రాయుచు శ్రద్ధతోడ నే
  పలువిధ వృత్త పద్యములు వ్రా
  యుచునుంటిని ప్రస్తుతంబు నే
  తెలివి రంతలేకయె సుధీవరు
  డన్న ప్రశస్తి నందితిన్.

  రిప్లయితొలగించండి
 31. చదువు హెచ్చుగలేకున్న చక్కగా ను
  తాతతండ్రులుచేయసతతమది గని
  మెలకువలవెల్లనేర్చితి మేలు గాను
  *తెలివి రవ్వంత లేని సుధీవరుండ*.

  రిప్లయితొలగించండి