8, జులై 2021, గురువారం

సమస్య - 3776

9-7-2021 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పరధర్మమె మేలని హరి వలికెను గీతన్”
(లేదా...)
“పరధర్మంబిడు శ్రేయమంచు హరియే పల్కెన్ గదా గీతలో”

64 కామెంట్‌లు:

  1. నరులకు సురలకు వలదయ

    పరధర్మమె , మేలని హరి వలికెను గీతన్”

    కరుకు స్వధర్మాచరణన్

    మరణము ప్రత్యక్షమైన మంచియటంచున్

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  2. కందం
    వర గుణము లేని దైనను
    ధరణి స్వధర్మమనువనుచు, తగనిదని భయం
    కరమని తప్పక వీడఁగఁ
    బరధర్మమె, మేలని హరి వలికెను గీతన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మత్తేభవిక్రీడితము
      ధరణిన్ జక్కగ నాచరించినను తద్ధర్మమ్ము లన్యమ్మనన్
      సరిగాదంచును నిర్గుణంబయిన నీస్వాతంత్య్ర ధర్మమ్మె శ్రీ
      కరమౌ నందున నీకు చావయిన సౌకర్యమ్మఘోరమ్మనన్
      పరధర్మంబిడు, శ్రేయమంచు హరియే పల్కెన్ గదా గీతలో

      తొలగించండి
  3. తరగనిసాధనయందున
    అరిగానుండినమనసనుహయమునువీడన్
    పరమాత్మధ్యాసనునా
    పరధర్మమెమేలనిహరివలికెనుగీతన్

    రిప్లయితొలగించండి
  4. నరులును వీడగవలె పో
    పరధర్మమె; మేలని హరి వలికెను గీతన్
    నిరతము మనదౌ పని మరి
    నెరవేర్చిన చాలు నదియు నీచముయైనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నీచము+ఐనన్' అన్నపుడు యడాగమం రాదు. "నీచమ్మైనన్/నీచంబైనన్" అనండి.

      తొలగించండి
  5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పరికంప మొసగు చుండును
      పరధర్మమె; మేలని హరి పలికెను గీతన్
      పరువడి గలుగు స్వధర్మమె
      అరయును నిరతము మనుజుల నచ్చుగ ననుచున్.

      తొలగించండి
  6. సమస్య :

    పరధర్మంబిడు శ్రేయమంచు హరియే
    పల్కెన్ గదా గీతలో

    ( వివేకానందస్వామి భారతీయులకు స్వధర్మప్రాధాన్యాన్ని ఉగ్గడిస్తూ ...)

    మత్తేభవిక్రీడితము
    ------------------

    " నరుడా! యర్జున! యాలకింపు మదిలో
    నట్టిట్టు మోసాన దా
    పురమైనన్ బరధర్మపాలనముకై
    పోబోకుమా ! తప్పురా !
    యరయన్ జాతికి స్ఫూర్తియై సుఖదమౌ
    నామోదమౌ నీ పరం
    పరధర్మంబిడు శ్రేయ " మంచు హరియే
    పల్కెన్ గదా గీతలో .

    ( నీ పరంపరధర్మము - నీదైన దేశానుగతధర్మము )

    రిప్లయితొలగించండి
  7. కె.వి.యస్. లక్ష్మి:

    సరియగు దారిని జూపుచు
    పరులకు హితమును నొసగెడి వర్తన తోడన్
    తిరిగెడి తత్త్వమునే జూ
    పర! ధర్మమె మేలని హరి వలికెను గీతన్.

    రిప్లయితొలగించండి
  8. తఱితోశాత్రవుద్రుంపగన్కనగనాతాపంబుచల్లార్పగన్
    అరిభారంబునుదించువాఁడుహరినీయాయాసముల్వ్యర్ధమే
    శరవేగంబుననీదుసాధననుసుస్ధానంబునందుంచ, యా
    పరధర్మంబిడుశ్రేయమంచుహరియేపల్కెన్గదాగీతలో

    రిప్లయితొలగించండి

  9. పరధర్మమది భయావహ
    ముర నీధర్మమ్మె నీకు ముదమును గూర్చున్
    మరువక మహి దానిని నిలు
    పర, ధర్మమె మేలని హరిపలికెను గీతన్.



    పరధర్మంబు భయావహమ్మనుచు సంభావించుచున్ మానవా
    పరిరక్షింపుము నీదుధర్మము నదే పాలించు నిన్నెప్పుడున్
    ధరణిన్ ధర్మము నిల్పు దానిదగు ప్రాధాన్యమ్ము పాటించి చె
    ప్పర, ధర్మంబిడు శ్రేయమంచు హరియే పల్కెన్ గదా గీతలో.

    రిప్లయితొలగించండి
  10. రిప్లయిలు

    1. పరధర్మంబు భయావహమ్ము మరణప్రాయమ్ము బేరొందియున్
      వరమౌ ధర్మము స్వీయమద్ది విగుణంబైయుండియున్ తద్విధిన్
      పరమోదారవిశాలచిత్తకృతనిర్వారోపకారార్థత
      త్పరధర్మంబిడు శ్రేయమంచు హరియే పల్కెన్ గదా గీతలో.

      కంజర్ల రామాచార్య.

      తొలగించండి
  11. నిరుపమ సేవా గుణమున
    కర మను రాగమును జూపి కాపాడుట యే
    మురిపం బగునన గ పరం
    పర ధర్మమె మేలని హరి పలికెను గీతన్

    రిప్లయితొలగించండి
  12. పరమును సాధించుటకై
    నిరతము సత్సంగమందు నియతిగ మదిలో
    పరమాత్మునిలిపి విడువగ
    పరధర్మమె మేలని హరి వలికెను గీతన్

    రిప్లయితొలగించండి
  13. ధరలో సజ్జనులందరున్ సతత

    ముందాతృత్వ భావంబుతో

    గరముంబేదల నాదరించెదరు

    కడున్ గారుణ్యముంజూపుచున్

    మరణానంతరమెట్టులైన ఘన

    సమ్మానంబు మోక్షంబు నీ

    పర ధర్మంబిడు , శ్రేయమంచు

    హరియే పల్కెంగదా గీతలో.

    రిప్లయితొలగించండి
  14. హరహర యమంగళము, శం
    కర! ప్రతిహతమగునుగాక కఠిన పదంబుల్,
    ధరలో నెపుడున్, స్వపరం
    పరధర్మమె మేలని హరి వలికెను గీతన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సరిగా బల్కితి రిట్టులన్ దమరు సంస్కారంబు పెంపారగన్
      పరదేశంబునకేగినన్ మరతుమే ప్రాణాధికంబౌ నదే,
      పరిపాటై తమ జీవనంబున సదా పాలించి నిల్వన్, పరం
      పరధర్మంబిడు శ్రేయమంచు హరియే పల్కెన్ గదా గీతలో.

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  15. స్థిరమగు బుద్ధిని నిరతము
    పరమాత్మధ్యానమందు వరలుచు కర్మా
    చరణము సల్పగ, విడుచుచు
    పరధర్మము, మేలనిహరి వలికెను గీతన్

    నరుడా,లెమ్ము! మనమ్మునన్ విడువు మన్యాలో చనల్, భద్రమౌ
    శరముల్ పెంపుగ దేరునన్ నిలుచుచున్ సంధించు చాపమ్మునన్
    దురమున్ బోరుటె క్షాత్రధర్మమగు వేదోక్తంబగున్,వీడగా
    పరధర్మం,బిడు శ్రేయమంచు హరియే పల్కెన్ గదాగీతలో

    రిప్లయితొలగించండి
  16. తరముల్ మారె విదేశ సంస్కృతి మహద్భాగ్యంబుగా నెంచుచున్
    వరమౌ భారత సాంప్రదాయములనే వర్జించు వారందురే
    పరధర్మంబిడు శ్రేయమంచు; హరియే పల్కెన్ గదా గీతలో
    పరధర్మంబు భయావహంబనుచు, భావ్యంబౌ స్వధర్మంబిలన్

    రిప్లయితొలగించండి
  17. నిరతంబాహరి పాదపద్మయుగళిన్ నిర్మోహ చిత్తంబుతో
    కరముల్మోడిచి వేడుకొంచు సలుపన్ కర్మంబులన్ శ్రద్ధగా
    పరమాత్ముండొసగున్ పరంబనుచు సంభావించుచున్ వీడగన్
    పరధర్మంబిడు శ్రేయమంచు హరియేపల్కెన్ గదా గీతలో

    రిప్లయితొలగించండి
  18. మ:

    పరధర్మంబును నాచరించుటనగా భంగించ నీధర్మమున్
    చిరు కామంబుల కాశ్రయించ తగదౌ చిత్తంబు నేమార్చగన్
    మరణంబైనను మేలటంచు నెఱుఁగన్ మాటాడ నిర్లిప్తతన్
    పర ధర్మంబిడు, శ్రేయ మంచు హరియే పల్కెన్ గదా గీతలో

    భంగించు=ఎదిరించు

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  19. 1.
    (చుట్టములతో సమరమా ! అనే పార్థుని సందేహం తో పుట్టింది గీత అనే భావంతో)

    నరుని యుగధర్మ మయినను
    దురమున సంబంధమనెడి దొగ దగదంచున్
    త్వరితముగ విడువ వలె ద్వా
    పరధర్మమె ; మేలని హరి వలికెను గీతన్

    తొగ = కష్టము
    ద్వాపర = సందేహము ( ఆం.భా )
    ధర్మము = స్వభావము

    2.
    (“ద్వాపర ధర్మము “ అంటే ద్వాపర యుగ ధర్మము అనే భావం వస్తుందా !
    ద్వాపర యుగ ధర్మము “చెడుని మంచి ఎదిరించడం” అనే భావంతో )

    సరులకు దగు యుగ ధర్మమె ,
    దురమున సంబంధమనెడి దొగ దగదంచున్
    నరునకు తెలుపుటకై ద్వా
    పరధర్మమె మేలని హరి వలికెను గీతన్

    తొగ = కష్టము

    రిప్లయితొలగించండి
  20. శరమును విడువక పట్టుము

    కరుణను వీడంగవలయు కదనము లోనన్

    పరిపాలకుల కిచట నం

    పర ధర్మము మేలని‌ హరి పలికెను గీతన్


    అంపర = శరములు

    రిప్లయితొలగించండి
  21. నరుడా యుధ్ధము సేయ క్షత్రియుకునౌ న్యాయమ్ము లోకంబునన్

    సరి కాదయ్య రణమ్ము సేయననుటన్ క్షాత్రవ్యమా కాంచగన్

    హరికై ప్రార్ధన సేయ మౌనులకునాహార్యమ్ము కౌంతేయుడా

    పరధర్మంబిడు శ్రేయమంచు హరియే పల్కెన్ గదా గీతలో

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  22. హరిపై మనసును నిలుపుట
    సరియగు దిక్కౌను నాత్మసాక్షాత్కారం
    బొరయగ మోక్షము నొందగ
    పరధర్మమె మేలని హరి పల్కెను గీతన్

    రిప్లయితొలగించండి
  23. శంకరాభరణము సమస్య: పూరణ.
    పరులని, వారిని జంపగ
    కరములు రావని, కిరీటి కరమలుగంగన్
    ‘పొరిపొరి బలికితి విక నా
    పర, ధర్మమె మేల’ ని హరి వలికెను గీతన్.
    కడయింటి కృష్ణమూర్తి.......8-7-21

    రిప్లయితొలగించండి
  24. నరలోకంబున ద్వాపరంబునను విన్నారా!మహత్వంబనన్
    పరధర్మంబదిమంచిదైననటునాపాదించరాదంచు,యా
    నరనారాయణులేకమైనపుడుభిన్నంబౌచుధర్మంబులున్
    పరధర్మంబిడు శ్రేయమంచు హరియే పల్కెన్ గదా గీతలో

    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  25. పరధర్మం బిడు భయమని
    హరియే చెప్పంగగీతయందున భామా!
    తిరకాసు మాటలీయవి
    పరధర్మమె మేలని హరివలికెను గీతన్

    రిప్లయితొలగించండి
  26. నర లోకము మారెను నేఁ
    డరయం దా నెంచిన పని యౌ కుల ధర్మం
    బడరుచు నిరంతరము నా
    పర ధర్మమె మేలని హరి వలికెను గీతన్

    [న+అపర = నాపర; అపరము కానిది, స్వీయము]


    నర లోకంబున స్వీయ ధర్మములు సన్న్యస్తంబులై భాసిలెన్
    దురి తామ్నాయ వినాశ హేతువులు చాతుర్వర్ణ్య సంభావ్యముల్
    నిరపేక్షం దన దైన ధర్మ మిలలో, నిత్యమ్ము త్యక్తంబుగాఁ
    బరధర్మం, బిడు శ్రేయ మంచు హరియే పల్కెం గదా గీతలో

    రిప్లయితొలగించండి
  27. పరధర్మంబిడు భీతినంచుహరిదా పల్కెన్ గదాగీతనన్
    మరియీ మాటలు బల్కగా దగునె భామా!నీకు నేమాయెనే
    పరధర్మంబిడు శ్రేయమంచు హరియే పల్కెన్ గదా గీతలో
    యిరవు బొందనీ మాటలాడగను నేదేనింగలంగంటివా?

    రిప్లయితొలగించండి
  28. సరిగాదు గొనుట జనులకు
    *పరధర్మము,మేలనిహరిపలికెన్ గీతన్*
    స్థిరమగు మతితో సతతము
    పరమాత్ముని కొలువ వలయు వాసిగ మదిలో.

    రిప్లయితొలగించండి