2, జులై 2021, శుక్రవారం

సమస్య - 3770

3-7-2021 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దుడుకఁడు కాపురుషుఁ డులిపి ధూర్తుఁడు ఖలుఁడున్”
(లేదా...)
“దుడుకఁడు దుర్జనుం డులిపి ధూర్తుఁడు కాపురుషుండు నీచుఁడున్”

64 కామెంట్‌లు:

 1. బలిసిన కీచకుడయ్యెను

  పొల, సుఁడు , కాపురుషుఁ డులిపి పోకిరి ఖలుఁడున్

  కలిసెన్ మట్టిని ద్రౌపది

  వలపును కోరిన విరటుని బావ బలుండున్

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  ( పొల = మాంసపు ముద్ద.

  సుడు = చూడు)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ఇప్పుడు సవరించిన సమస్యను పూరించండి.

   తొలగించండి

 2. పడతీ! ధర్మము నిలుపగ
  పడవను సేయంగవలయు ప్రల్లవకాడా
  తడు, దనుజుండా నరకుడు
  దుడుకఁడు కాపురుషుఁడులిపి ధూర్తుడు ఖలుడున్.

  రిప్లయితొలగించండి
 3. సమస్య :

  పొలసుడు దుర్జనుం డులిపి
  పోకిరి కాపురుషుండు నీచుడున్

  ( ఆరుగురు మునీంద్రులు తమను అడ్డగించిన క్రూరుడైన బోయవానిని గురించి తమలో తాము )

  చంపకమాల
  -------------

  పొలసుడు ; దుర్జనుం ; డులిపి ;
  పోకిరి ; కాపురుషుండు ; నీచుడున్ ;
  తెలుగున సంస్కృతంబునను
  దిట్టగ శబ్దము లన్ని చాలవే !
  తెలివిగ సాధుసత్తముల
  తెంపరి బుద్ధిన నడ్డగించెనే !
  మెలకువ మానవోత్తముని
  మెల్లగ జేయుద మింక నేర్పునన్ .

  ( ఈ బోయవాడే అనంతరం వాల్మీకి మహర్షిగా
  మారి శ్రీమద్రామాయణం రచించాడు . )

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   ఇప్పుడు సవరించిన సమస్యను పూరించండి.

   తొలగించండి
 4. మెలకువ తెరువాటుల గొని
  నిలకడగా నిగ్గుదేల్చి నిలబెట్టు గదా!
  తెలివిగ న్యాయము; కాదే!
  పొలసుఁడు కాపురుషుఁ డులిపి పోకిరి ఖలుఁడున్

  రిప్లయితొలగించండి
 5. విడువగనీతినినీమము
  కడువడిగాగడపదాటికాంచకసతినే
  ఇడుములబెట్టుచునుండెడి
  దుడుకఁడుకాపురుషుడులిపిధూర్తుడుఖలుఁడున్

  రిప్లయితొలగించండి
 6. క్రొవ్విడి వెంకట రాజారావు:

  బెడగుగ జూడగ దోచును
  వడిగల కురువంశమందు వఱలిన నృపు డా
  మడియడు దుర్యోధనుడే
  దుడుకఁడుకాపురుషుడులిపిధూర్తుడుఖలుఁడున్

  రిప్లయితొలగించండి

 7. గడగడ లాడిరెల్ల యనుకంప్యులు ఖేచరు లందుకోసమై
  పడవను సేయగా వలయు భామ! వధింపక తప్పదింక నా
  తడు కడకార్యకారిగద దానవుడా నరకాసురుండెగా
  దుడకఁడు దుర్జనుండులిపి ధూర్తుఁడు కాపురుషుండు నీచుఁడున్.

  రిప్లయితొలగించండి
 8. దుడుకఁడు దుర్జనుం డులిపి ధూర్తుఁడు కాపురుషుండు నీచుఁడున్

  పుడమిని దోచు యోచనను పుట్టిన వాడును నీతి న్యాయముల్

  విడిచిన చీని వాడు బహు వేసరి పుర్వును తెచ్చి పెట్టెరా

  జడవక దాడి సేయరయ చాటిన నీమములాచరించుచున్

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 9. చెడుగుకు ప్రోత్సాహ మిడుచు
  వెడగుగ నేర ప్రవృత్తి ని పేర్మి గలిగియున్
  నడవడి యందున దా మం
  దుడు. కడు కాపురుషుడు లిపి ధూర్తుడు ఖలుడున్

  రిప్లయితొలగించండి
 10. కందం
  పడయఁగ రారాజు కృపన్
  దుడుకఁడు కాపురుషుఁ డులిపి ధూర్తుఁడు ఖలుఁడున్
  బడి నుపపాండవుల దునిమె
  విడ నశ్వత్థామననుచు విజయుండనియెన్

  చంపకమాల
  పడయగ రాజరాజు కృప బాలల ద్రోణ సుతుండుఁ జంపఁగన్
  "దుడుకఁడు దుర్జనుం డులిపి ధూర్తుఁడు కాపురుషుండు నీచుఁడున్
  బడుగుల గూల్చె నిర్దయుఁడు పాపిని వీడన"టంచు క్రోధియై
  వడలిన ద్రౌపదీ వదన వారిజమున్ గని నర్జునుండనెన్

  రిప్లయితొలగించండి
 11. పాలివ్వ వచ్చిన పడతిని
  చనులను
  కొరికి ప్రాణములను పెరికి నాడు

  జలకము లాడెడి లలనల
  చీరలన్
  దాచి వారలకు వెతలనొ సంగి

  నాడు,క్రూరముగ తనదు మేన
  మామను
  శరణమున్ జూపక చంపి నాడు


  దుడుకడు,కాపురు షుడులిపి థూర్తుడు,
  ఖలుడు,న్నికృష్ట సకటడు ,దొంగ  గాదె యీ నల్ల పీనుగ,ఘనుడి
  తండు

  ననుచు,తొలుత పూజలను నొనర్చు చుంటి

  రిప్పుడీ కృష్ణునకు నిట,తప్పు గాదె

  యని పలికె శిశు పాలుడు కినుక తోడ

  రిప్లయితొలగించండి
 12. కె.వి.యస్. లక్ష్మి:

  ఇడుములు గూర్చుచు నెప్పుడు
  కడుమోసపు దారుల జనుల కలతబఱచుచున్
  గడిపెడు నాయకుడే మరి
  దుడుకఁడుకాపురుషుడులిపిధూర్తుడుఖలుఁడున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణభంగం. "కడు మోసపు పనుల/నడత జనుల..." అనండి.

   తొలగించండి
 13. కడు వినయంబుతోడ బర కాంత
  లతోడను దీయ తీయగా
  విడవక మాటలాడి తన వీడని
  మిక్కిలి కామవాంఛకై
  పడతులలొంగ దీసుకొను వాడు
  ను సత్యము నిద్ధరాస్థలిన్
  దుడుకడు దుర్జనుండులిపి ధూ
  ర్తుడు కాపురుషుండు నీచుడున్  రిప్లయితొలగించండి
 14. అడవిని నొంటరి స్త్రీ నా
  రడిబెట్టెడు కాముకుడగు రావణుడరయన్
  బెడిదపు వరగర్వితుడౌ
  దుడుకడు కాపురుషుడులిపి ధూర్తుడు ఖలుడున్

  శిశుపాలునిపై ఆగ్రహంతో భీముడు

  పుడమిని పూజ్యపాదుడగు పూర్ణుని కృష్ణు ననర్హుడంచు తా
  మిడిమిడి జ్ఞానమాత్రుడయి మీరుచుహద్దును ప్రేలుచుండెనే
  నడవడి లేనివాడుగద నాల్కకు వచ్చినయట్లు కూయు నీ
  దుడుకడు దుర్జనుండులిపి ధూర్తుడు కాపురుషుండు నీచుడున్

  రిప్లయితొలగించండి
 15. క్రొవ్విడి వెంకట రాజారావు:

  బెడగుగ జూడగన్ దెలియు పెద్దదియౌ కురువంశమందునన్
  అడరుచు వెల్గులీనిన మహామహులందు సుయోధనుండునౌ
  మడియడు తాను నాచరణమందు యశమ్మును పొందె నివ్విధిన్
  దుడకఁడు దుర్జనుండులిపి ధూర్తుఁడు కాపురుషుండు నీచుఁడున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బెడగుగ జూడగన్ దెలియు పెద్దదియౌ కురువంశమందు తా
   మడరుచు వెల్గులీనిన మహామహులందు సుయోధనుండునౌ
   మడియడు తాను నాచరణమందు యశమ్మును పొందె నివ్విధిన్
   దుడకఁడు దుర్జనుండులిపి ధూర్తుఁడు కాపురుషుండు నీచుఁడున్.

   తొలగించండి
  2. గురువుగారికి నమస్కారములు.

   తొలగించండి
 16. నడవడియందున ప్రల్లదుఁ
  డడుగడుగునతా సుజనుల నారడి పెట్టున్
  చిడిముడి సుబ్బారాయుడు
  దుడుకఁడు కాపురుషుఁ డులిపి ధూర్తుఁడు ఖలుఁడున్

  రిప్లయితొలగించండి
 17. పడతుల కడతేర్చెడు గడు
  దుడుకఁడు కాపురుషుఁ డులిపి ధూర్తుఁడు ఖలుఁడున్
  మెడకురి బడ భయపడి గడ
  గడ, విడువుడని యడిగె, తడి, కన్నుల నిడుచున్.

  రిప్లయితొలగించండి
 18. గడుసరి తమ్ముని రీతిని
  దడబడక వచించుమని పితామహుడడుగన్
  బుడుతడు భాషించెనిటుల
  దుడుకఁడు కాపురుషుఁ డులిపి ధూర్తుఁడు ఖలుఁడున్

  రిప్లయితొలగించండి
 19. మంత్రి వద్ద పనిచేసే గుమస్తా నైజము గా ఈ ప్రయత్నము:

  చం:

  మడమను త్రిప్ప బోననుచు మాయగు మాటల నుచ్చరించుచున్
  కుడుచుచు వేన వేలుగను కోర్కె లమాత్యుడు దీర్చు నంచనన్
  పొడవడ డెన్ని నాళ్లకును పోకడ కాలము దాపురించె నా
  దుడుకడు దుర్జనుండులిపి ధూర్తుడు కాపురుషుండు నీచుడున్

  పొడవడుట=అగుపించుట

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 20. విడివిడి పక్షపు నేతలు
  కడకొక కూటమి నెఱపగ కార్యోన్ముఖులై
  నడువన్ గనపడిరందున
  దుడుకఁడు కాపురుషుఁ డులిపి ధూర్తుఁడు ఖలుఁడున్

  రిప్లయితొలగించండి
 21. దుడకడు దుర్జనుండు లిపి ధూర్తుడు కాపురుషుండు నీచుడున్
  గడు ఖలుడైన వాడిలను కర్కశ రీతిని రాజ్యమేలగా
  బడుగుల రోదనమ్ములును, స్వైర విహారుల దోపిడీలతో
  సడలిన సంపదల్ జనుల స్థై ర్యము కోల్పడ జేసె నంతటన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మొదటి పాదంలో దుడ కడు బదులుగా దుడుకడు అని సవరించుకొన ప్రార్థన 🙏🙏

   తొలగించండి
  2. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  3. గురువర్యులకు నమస్సులు, ధన్యవాదములు.

   తొలగించండి
 22. కడలిని పవ్వళించి మముఁ గాచెడి దేవర మిన్నకుంటివే
  ఎడపెడ వైరులార్వురిట నెత్తికుదేసిరి నేమిసేతురా?
  గడుసరి యుత్తరింపుమరి కద్వయ మత్రయ లా సమూహమున్
  దుడుకఁడు దుర్జనుండులిపి ధూర్తుడు కాపురుషుండు నీచుడున్.
  --కటకం వేంకటరామశర్మ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   "కుదేసిరి యేమి సేతురా" అనండి.

   తొలగించండి
  2. ధన్యవాదములయ్యా! సరిచేసియే FB లో ఉంచితిని.....ఇక్కడ సరిచేయని ప్రతి వచ్చినది . మన్నించండి

   తొలగించండి
 23. ఇడుములఁ బెట్టు వాడు కడు హింసలు
  బెక్కువ గూర్చు వాడు దుం
  దుడుకు గుణమ్ము వాడు పరదూషణగర్హితుడైన వాడు యె
  య్యెడ కలహస్వభావుడు సహించని వాడ టులన్ క్రమమ్ముగా
  దుడుకఁడు దుర్జనుం డులిపి ధూర్తుఁడు కాపురుషుండు నీచుఁడున్.

  కంజర్ల రామాచార్యులు.

  రిప్లయితొలగించండి
 24. విడువక నిత్యకర్మముగ విస్తృతరీతి నఘంబు చేయుచున్
  తడబడకుండ యోగ్యులయి ధర్మమునందు జరించు వారినిన్
  వడిగొని కోరి చేరి బహుబాధల ముంచుచు నుండు వాడెపో
  దుడుకఁడు దుర్జనుం డులిపి ధూర్తుఁడు కాపురుషుండు నీచుఁడున్

  రిప్లయితొలగించండి
 25. చెడు నడవడి విడవడెపుడు
  పడతిని వెడఁగుననిడుముల పడదోయునయో
  పడు రౌరవమున వాడా
  దుడుకఁడు కాపురుషుఁ డులిపి ధూర్తుఁడు ఖలుఁడున్

  రిప్లయితొలగించండి
 26. కడుకఠి నమనస్కుడగుచును
  విడువక బంధు గణములను వేధించంగన్
  బడతులు కితాబు నిచ్చిరి
  దుడుకడు కాపురుషుడులిపి ధూర్తుడు ఖలుడున్

  రిప్లయితొలగించండి
 27. విడువక యెల్లవారలను వేదనకున్ గురిజేయ యాతనిన్
  దుడుకడు దుర్జనుండులిపి ధూర్తుడు కాపురుషుండు నీచుడున్
  గడుకఠినుండునా యనుచు గాంతలు చెప్పులు వేసి వానిపై
  విడువుము గ్రామమంచు నికవేగమె పొమ్మనిరందఱున్ సుమా

  రిప్లయితొలగించండి
 28. ముడుపులు గట్ట యమ్మ కడు మూర్ఖత తోడుత దొంగిలించితిన్
  చెడుగులు పెక్కు చేసితిని చెన్నగు యౌవ్వన కాలమందు నా
  గడముల కారణమ్ముగను కాంచితి పుత్రుని, వాడి నెంచగా
  దుడుకఁడు దుర్జనుం డులిపి ధూర్తుఁడు కాపురుషుండు నీచుఁడున్

  రిప్లయితొలగించండి
 29. నడుమఁ గలుగు దుర్గుణములు
  వడయ నరుడు దుఃఖరాశి బ్రతుకుట కొఱకై
  పుడమినిఁ బడు నప్పు డగునె
  దుడుకఁడు కాపురుషుఁ డులిపి ధూర్తుఁడు ఖలుఁడున్?


  తడయక కాంచి నంతటనె తప్పక యందురు చూపు వానినిన్
  దుడుకుఁదనమ్ముఁ, జెడ్డ నరుఁ, దుంటరి, జూదరిఁ, గుచ్చితుం, గడిం
  దెడనెడ రోఁత కల్గు పను లెల్లను జేసెడు వాని నివ్విధిన్
  దుడుకఁడు దుర్జనుం డులిపి ధూర్తుఁడు కాపురుషుండు నీచుఁడున్

  రిప్లయితొలగించండి
 30. విడచియువ్రుత్తిధర్మమునువేనకువేలుగనల్లడబ్బుతో
  కడివెడుకళ్లనీళులకుకారకుడయ్యెనునేటిమంత్రియున్
  ఓడయఁడుపేదకష్టములనోర్వకఁజూడడుభూజనంబులన్
  దుడుకఁడుదుర్జనుండులిపిపోకిరికాపురుషుండునీచుఁడున్

  రిప్లయితొలగించండి
 31. పడతినిగాంచుచు నొంటిగ
  తడయకచెరపట్టవచ్చెదశకంఠుండున్
  వడివడి నాసతి చెంతన్
  దుడుకడుకాపురుషుడులిపి ధూర్తుడుఖలుడున్

  రిప్లయితొలగించండి
 32. పుడమి బడల్చె దైత్యుడల పూజితులన్ మణగించెనన్నయున్
  పడతి హరించె రావణుఁడు వానికి దోడయె కుంభకర్ణుడున్
  పెడసరమాడె చైద్యుడవివేకమునన్ జనె దంతవక్త్రుడున్
  దుడుకఁడు దుర్జనుం డులిపి ధూర్తుఁడు కాపురుషుండు నీచుఁడున్
  బడసిరి శాపమోచనము పంకజనాభుని జేతనంతమై

  రిప్లయితొలగించండి