వాగ్వ్యాపారము లేనివాడె బుధుడై ప్రఖ్యాతి నందున్ గదా
( కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని ఢిల్లీ పాదుషా కపటోపాయంతో బంధించి తీసుకువెళ్లినప్పుడు ఆ సంగతి ప్రజలకు తెలియకుండా చక్రవర్తి పోలికల చాకలి పేరిగానిని సింహాసనంపైన జాగ్రత్తలతో కూర్చుండ బెడదామని మహామంత్రి యుగంధరుడు తన తమ్ముడు జనార్దనమంత్రితో పలుకుతున్నాడు .)
వేలం పాడినా, షేర్ మార్కెట్ వ్యాపారమైనా వాగ్వ్యాపారమనే భావనగా ప్రయత్నం చేశాను.
శా:
వాగ్వ్యాపారమె మూలమౌ ధరణిలో పాడంగ వేలమ్ము నే వాగ్వ్యాపారమె యుత్తమంపు కళయౌ వాటాల వాణిజ్యమై వాగ్వ్యాపారము నందు నష్టి తగదౌ, వాదించ నన్యంబు గా వాగ్వ్యాపారము లేని వాడె బుధుడై ప్రఖ్యాతి నందున్ గదా
డా. సీతా దేవి గారు శార్దూల మత్తేభములు పైకి గాంభీర్యములే కాని వ్రాయడము తేలిక. కాగ్వ్యాపారము: అసాధువు. కాకు + వ్యాపారము = కాకు వ్యాపారము సాధువగును. సంధి లే దిక్కడ. కు గురువు చేయుటకుఁ బనికి వచ్చును.
వాగ్వ్యాకరణములేదుగ
రిప్లయితొలగించండివాగ్వ్యాహర్తయజనులకువారసుడయ్యెన్
ద్రుగ్వ్యవహారమునందున
వాగ్వ్యాపారమ్ములేనివాడెబుధుండౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"దృగ్వ్యవహారము" టైపాటు.
వాగ్వ్యాపారము సుగుణము
రిప్లయితొలగించండివాగ్వ్యాపారత గలుగును వాగ్దేవికృపన్
వాగ్వ్యాపారుడ! యెవ్విధి
వాగ్వ్యాపారమ్ము లేనివాడె బుధుండౌ ?
👌
తొలగించండి🙏🙏🙏
తొలగించండివాగ్వ్యాపారములేనిపోతనయునాపారంబుఁజూడన్వెసన్
రిప్లయితొలగించండివాగ్వ్యాహర్తయగాగరామభజనన్వాదంబుదూరుండునై
వాగ్వ్యాప్తిన్గనిసాహితీవనమునన్భాసించెసూర్యుండునై
వాగ్వ్యాపారములేనివాడెబుధుఁడైప్రఖ్యాతినందునేగదా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలండిప్రణామములుగురువుగారు
తొలగించండివాగ్వ్యాసంగసుధీవిరాజితమహద్వాణీకృపాలబ్ధుడై
రిప్లయితొలగించండిదిగ్వ్యాప్తంబగు కీర్తి నొంది కవితాదీప్తిస్తుతిం గాంచి స
మ్యగ్వ్వాహారకవిత్వరమ్యరచనామాన్యండునై యొప్పి దు
ర్వాగ్వ్యాపారము లేనివాఁడె బుధుఁడై ప్రఖ్యాతినందున్ గదా.
వ్యాహారము = వాక్కు
కంజర్ల రామాచార్యులు.
👌
తొలగించండివాగ్వ్యాపారము వలయును
రిప్లయితొలగించండివాగ్వ్యాపారము నిలిచిన వసుధయె జడమౌ
వాగ్వ్యవ హర్త కాకయె
వాగ్వ్యాపారము లేని వాడె బుధుడౌ !?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవ పాదంలో గణభంగం. సవరించండి.
మూడవ పాదములో వాగ్వ్యవ హర్తగ అని సవరణ చేయడమైనది
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి👌
తొలగించండికందం
రిప్లయితొలగించండిదిగ్వ్యాప్తుఁడు హరిని మనో
దృగ్వ్యాపారమున గనచుఁ దీరుచు మునియై
దృగ్వ్యోమ గతి భ్రుకుటినిడి
వాగ్వ్యాపారమ్ము లేనివాఁడె బుధుండౌ!
శార్దూలవిక్రీడితము
దిగ్వ్యాప్తుండని శ్రీహరిన్ గొలచి దేదీప్యంపు రూపున్ మనో
దృగ్వ్యాపారమునన్ గనన్ మునిగ సందేహాలు వీడంగనే
దృగ్వ్యోమంబున ధ్యానియై భ్రుకుటినందే సచ్చిదానందమై
వాగ్వ్యాపారము లేనివాఁడె బుధుఁడై ప్రఖ్యాతినందున్ గదా!
👌
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండివాగ్వ్యాపారము మంచిదేగద మనో వైక్లబ్యమున్ బాపగా
రిప్లయితొలగించండివాగ్వ్యాపారము బంధుమిత్ర తతిలో ప్రాధాన్యతన్ గూర్చుగా
వాగ్వ్యాపారము పండితాళి సభలోభాసించుగా దుష్టమౌ
వాగ్వ్యాపారము లేనివాడె బుధుడై ప్రఖ్యాతి నందున్ గదా!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండిదిగ్వ్యాప్తంబగునట్టి కీర్తిఁ గని సందీప్తాఖిలజ్ఞాన సం
రిప్లయితొలగించండియుగ్వ్యూఢప్రతిభాంచితోరుగుణుఁడై యుత్సాహియై నీతి స
మ్యగ్వ్యూహాత్త క్రియార్భటిం గలిగి తా మాన్యుండు గాఁడా యస
ద్వాగ్వ్యాపారము లేనివాఁడె బుధుఁడై ప్రఖ్యాతినందున్ గదా!
ఉదాత్తసమాసశోభితమైనమంచిపూరణనందించారుఅభినందనలండి
తొలగించండి
రిప్లయితొలగించండిదిగ్వ్యాప్తంబుగ కీర్తినె
వాగ్వ్యాపారమ్ముతోడ బడయు పఠి భువిన్
దృగ్వ్యాపారియగుచు దు
ర్వాగ్వ్యాపారమ్ము లేని వాడె బుధుండౌ.
వాగ్వ్యాపారమె సాధనమ్మిలను వ్యాపారస్థుకున్ గాంచగా
వాగ్వ్యాపారమె కీర్తిదెచ్చుకవికిన్ బ్రజ్ఞానికిన్ గాదుటే
దిగ్వ్యాప్తంబుగ, దుర్విదగ్ధుల విభేదింపగ తానెంచి దు
ర్వాగ్వ్యాపారము లేనివాఁడె బుధుఁడై ప్రఖ్యాతి నందున్ గదా!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి"సాధనమ్మగు నిలన్ వ్యాపారికిన్ గాంచగా..." అనండి.
సమస్య :
రిప్లయితొలగించండివాగ్వ్యాపారము లేనివాడె బుధుడై
ప్రఖ్యాతి నందున్ గదా
( కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని ఢిల్లీ పాదుషా కపటోపాయంతో బంధించి తీసుకువెళ్లినప్పుడు ఆ సంగతి ప్రజలకు తెలియకుండా చక్రవర్తి పోలికల చాకలి పేరిగానిని సింహాసనంపైన జాగ్రత్తలతో
కూర్చుండ బెడదామని మహామంత్రి యుగంధరుడు తన తమ్ముడు జనార్దనమంత్రితో పలుకుతున్నాడు .)
స్రుగ్వ్యాపారము దీసివేయవలెగా
జూడంగ నెంతేనియున్ ;
దృగ్వ్యాపారము జక్కదిద్దవలెగా
దృశ్యంబులన్ జూపుచున్ ;
ధిగ్వ్యాపారము బేరిగాని నికపై
దీవింప సమ్రాట్టుగా ;
వాగ్వ్యాపారము లేని - వాడె - బుధుడై
ప్రఖ్యాతి నందున్ గదా !
( స్రుగ్వ్యాపారము - భయస్వభావము ; దృగ్వ్యాపారము - తిలకించు తీరు ; ధిగ్వ్యాపారము - రాజదర్ప లక్షణము ; వాగ్వ్యాపారము లేనివాడు - మాట్లాడక
మౌనముగా నుండువాడు )
( వేదం వేంకటరాయశాస్త్రి గారి " ప్రతాపరుద్రీయ " నాటకం ఆధారంగా )
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండివేలం పాడినా, షేర్ మార్కెట్ వ్యాపారమైనా వాగ్వ్యాపారమనే భావనగా ప్రయత్నం చేశాను.
శా:
వాగ్వ్యాపారమె మూలమౌ ధరణిలో పాడంగ వేలమ్ము నే
వాగ్వ్యాపారమె యుత్తమంపు కళయౌ వాటాల వాణిజ్యమై
వాగ్వ్యాపారము నందు నష్టి తగదౌ, వాదించ నన్యంబు గా
వాగ్వ్యాపారము లేని వాడె బుధుడై ప్రఖ్యాతి నందున్ గదా
వై. చంద్రశేఖర్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండివాగ్వ్యాపారము లేక వ్రాసె
రిప్లయితొలగించండిహితమౌ పద్యాలు గోపన్న ,యే
వాగ్వ్యాపారము జేసి కవన
ముల్ వాక్రుచ్చె పోతన్న? యే
వాగ్వ్యాపారము జేసి యన్న
మయ తా వ్రాసెన్ సుసంకీర్తనల్
వాగ్వ్యాపారము లేనివాడె
బుధుడై ప్రఖ్యాతి నందున్గదా
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిరెండవ పాదంలో గణభంగం. "...జేసి తా కవనముల్.." అంటే సరి!
వాగ్వ్యంగ్యము సలు పు నెపుడు
రిప్లయితొలగించండివాగ్వ్యాపారమ్ము లేనివాఁడె ; బుధుండౌ
వాగ్వ్యాపన జరుపుటకై
వాగ్వ్యాపారమ్ము జేయు వాడె జగమునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిప్రాగ్వ్యాపారంబైనను
రిప్లయితొలగించండిధృగ్వ్యాపారంబయినను దిశతప్పిన ని
ర్భాగ్వ్యాపారయిన దురిత
వాగ్వ్యాపారమ్ము లేనివాఁడె బుధుండౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'నిర్భాగ్వ్యాపారము'?
త్వగ్వ్యాపారము చేతవారణము బంధమ్మందు జిక్కున్గదా
రిప్లయితొలగించండిదృగ్వ్యాపారము చేతచిత్రమృగ ముద్వేగమ్ము నొందుంగదా
కాగ్వ్యాపారము చేతమీనములవే గాలమ్మునన్ జిక్కు
దు
ర్వాగ్వ్యాపారము లేనివాడె బుధుడై ప్రఖ్యాతినందుం గదా
కాకువు = జిహ్వ
డా. సీతా దేవి గారు శార్దూల మత్తేభములు పైకి గాంభీర్యములే కాని వ్రాయడము తేలిక.
తొలగించండికాగ్వ్యాపారము: అసాధువు.
కాకు + వ్యాపారము = కాకు వ్యాపారము సాధువగును. సంధి లే దిక్కడ. కు గురువు చేయుటకుఁ బనికి వచ్చును.
క కారాంత పదము నెన్నుకొని వ్యా గుణింత పదముతో సమసించిన సరిపోవును.
క కారాంత పదములు
భిషక్, సువాక్, భుక్, ఋత్విక్, త్వక్, రుక్, ఈదృక్, మాదృక్, త్వాదృక్, అస్మాదృక్. యుష్మాదృక్, భవాదృక్, కీదృక్, ప్రత్యక్, ప్రాక్, తిర్యక్, దృక్, ధిక్, ధుక్, ఉదక్, అన్వక్, అసృక్ ఇత్యాదులు.
ఇంక వ్య పదములు:
వ్యోమము, వ్యామోహము, వ్యూఢము, వ్యూహము, వ్యసనము, వ్యాపారము, వ్యయము, వ్యాళము, వ్యాఘ్రము, వ్యాడము, వ్యత్యాసము, వ్యావృతము – ఇత్యాదులు.
ధన్యవాదములండీ! సవరించాను.🙏🙏🙏
తొలగించండిసవరణతో
తొలగించండిత్వగ్వ్యాపారము చేతవారణము బంధమ్మందు జిక్కున్గదా
దృగ్వ్యాపారము చేతచిత్రమృగ ముద్వేగమ్ము నొందుంగదా
భుగ్వ్యాజమ్మున మీనసంఘము కడున్ బోరామినిం జిక్కు దు
ర్వాగ్వ్యాపారము లేనివాడె బుధుడై ప్రఖ్యాతినందుం గదా
ఈ నాటి శంకరా భరణము వారి సమస్య
రిప్లయితొలగించండివాగ్య్వాపారమ్ములేని వాడె బుధుండౌ
ఇచ్చిన పాదము కందము
నా పూరణము మహాక్కరలో
వీనులకు నింపు నిడని సాహిత్యము వెతలను సతతము కలిగించగ
పూని ఘనతను పొందగ జాలడు పొందికైన మథుర వాగ్య్వాపారమ్ము
లేని వాడె , బుధుండౌనుగ నెపుడు లేఖన మెప్పడు మధురమౌ సు
గానమై జన సందోహముల నోట కరిగి పోవుచు నుండ భువనమున
గురువు గారు నమస్కారం ముందు వ్రాసినది రద్దు చేశాను గణములు తేడా వచ్చాయి
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివాగ్వ్యాపారముదాత్తమౌ జగతి సంభావింపగా సత్కవీ
రిప్లయితొలగించండివాగ్వ్యాపారము దోడనే జనుల విద్వద్దీప్తి శోభిల్లు స
ద్వాగ్వ్యాపారము వల్లనే వెలయుగా ధర్మంబు లక్షింప దు
ర్వాగ్వ్యాపారము లేనివాఁడె బుధుఁడై ప్రఖ్యాతినందున్ గదా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిధిగ్వ్యసనమ్ములు వీడు మ
రిప్లయితొలగించండిసృగ్వ్యామోహమ్ము వలదు శ్రేయము లిడు స
మ్యగ్వ్యాపారియు దుర్జన
వాగ్వ్యాపారమ్ము లేనివాఁడె బుధుండౌ
ప్రాగ్వ్యాపార నిమిత్త పశ్చిమ ధరా వాసాన్య దేశస్థులే
దిగ్వ్యాపార సు మత్త దిగ్గజములై దేశవ్రజం బేలఁ ద్వా
దృగ్వ్యూహమ్ము లొసంగు నష్టములు సందేహంబు శూన్యంబ దు
ర్వాగ్వ్యాపారము లేనివాఁడె బుధుఁడై ప్రఖ్యాతి నందున్ గదా
దృగ్వ్యాపారముకాదుగ
రిప్లయితొలగించండివాగ్వ్యాపారమ్ము, లేనివాడె బుధుండౌ
వాగ్వ్యాపారంబుల జల
వాగ్వ్యాపారంబు వలదు భరణిని వినుడీ
దృగ్వ్యాపారమె యంచు దానెఱిగి సంతృప్తిన్సిన్సు వర్జించు నా
రిప్లయితొలగించండివాగ్వ్యాపారము లేనివాడె బుధుడై ప్రఖ్యాతినందున్ గద
వాగ్వ్యాపారము జెల్లదెచ్చటను నోభామా దగన్ నేర్వుమా
వాగ్వ్యాపారము మాని చేరుమ యికన్ వారాణసీ యంగడిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిదృగ్వ్యామోహము సేవపై మనసులోతీవ్రమ్ముగా గల్గ ప్ర
రిప్లయితొలగించండిద్రుగ్వ్యాసంగములేని యాతడు సదుద్యోగమ్ముతో నెప్పుడున్
దిగ్వ్యాప్తుండగు శౌరినిన్ కొలుచుచున్ దీనాళి పోషించు దు
ర్వాగ్వ్యాపారము లేనివాఁడె బుధుఁడై ప్రఖ్యాతినందున్ గదా