24, జులై 2021, శనివారం

సమస్య - 3792

25-7-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆణిముత్తెము ముక్కుపై నమరియుండె”
(లేదా...)
“ముద్దుగ నాణిముత్తెమది ముక్కునఁ జేరినఁ జూచి మెచ్చితిన్”

58 కామెంట్‌లు:

  1. రోగబాధనుమాపగరోగియిపుడు
    ముఖముకవచంబుగప్పగముప్పురాదు
    విలువయంతటిదమ్మరోవింతదెలియు
    ఆణిముత్యముముక్కుపైనమరియుండె

    రిప్లయితొలగించండి
  2. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సిరుల నిచ్చి భక్తులనెల్ల నరయు చుండు
    అజుని కిల్లాలు లక్ష్మికి నంద మిడుచు
    దివ్య కాంతుల ప్రసరించు భవ్యమైన
    ఆణి ముత్తెము ముక్కుపై నమరియుండె.

    రిప్లయితొలగించండి
  3. సమస్య :

    ముద్దుగ నాణిముత్తెమది
    ముక్కున జేరిన జూచి మెచ్చితిన్

    ( ఉదయాన యువకర్షకదంపతులు పొలం పనులు చేస్తున్న సమయంలో భర్తకు కనిపించిన దృశ్యం )

    ఒద్దిక మేము నిద్దరము
    నూహల పందిరి నూయలూగుచున్
    హద్దులు లేని ప్రేమ హృద
    యాంతరసీమల పొంగుచుండగా
    ప్రొద్దున చేనులో నిలవ
    పొల్తుక స్వేదపు బిందువొక్కటే
    ముద్దుగ నాణిముత్తెమది
    ముక్కున జేరిన జూచి మెచ్చితిన్ .

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు
    1. తేటగీతి
      భామఁ గౌగిట బంధింప వణకుఁ గంటి
      మరుని బాణతతిఁ దనువు మరిగి మరిగి
      గంధ పరిమళ స్వేదంపు బిందువయ్యె
      నాణిముత్తెము! ముక్కుపై నమరియుండె!

      ఉత్పలమాల
      హద్దులు లేని ప్రేమఁగని యంగనఁ గౌగిట బందిఁజేసి నే
      నద్దరి చెక్కిటన్ నధరమాన్చఁగ మోమది యెఱ్ఱతామరై
      ముద్దియ తొల్గుచున్ వణకె! మోమున స్వేదము జారి బిందువే
      ముద్దుగ నాణిముత్తెమది! ముక్కున జేరిన జూచి మెచ్చితిన్!!

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  5. విద్దెలుఁజెప్పనేర్చినదివింతగపిల్లలుమెచ్చురీతిలో
    హద్దులుదాటకేగ్రుహముహాయనిపించగసేవఁజేయగా
    ఓద్దికతోడనామెగనియోడెెనురోగముకాంతిహీనమై
    ముద్దుగనాణిముత్యమదిముక్కునఁజేరినజూచిమెచ్చితిన్
    ముక్కునముత్యము, ఇల్లాలిసౌభాగ్యము

    రిప్లయితొలగించండి
  6. ముద్దుల భామ నీ కొరకు ము
    క్కెర నొక్కటి ప్రేమ మీరగ
    న్నొద్దికతోడ దెచ్చితిని యోవన
    జాక్షి సుముత్య మందులో
    మద్దుగ గూర్చినారు గని ముచ్చ
    ట జెందితి ,నీవు తాల్చగా
    ముద్దుగ నాణి ముత్తెమది ము
    క్కున జేరిన జూచి మెచ్చితిన్

    రిప్లయితొలగించండి
  7. భక్త జనులను బ్రోచెడు భవ్య దుర్గ
    చక్క నైనట్టి రూపాన నిక్కు చుండి
    కనగ నయ్యెను వదనమ్ము కమ్ర మగుచు
    ఆణి ముత్తెము ముక్కుపై నమరి యుండె

    రిప్లయితొలగించండి
  8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పెద్దనార్యుని కృతి వెలసె వైఢూర్యమై
      పాపిట బిళ్లలో పరవశముగ


      తిమ్మనార్యుని కృతి దివ్యమౌ
      గోమేధికముగ
      నొదిగెనుగా కమ్మలందు


      సూరనార్యుని కృతి శోభ‌నొప్పెడు పుష్య
      రాగమై కంఠహారమున‌జేరె

      మల్లనార్యుని కృతి మరకతమై గాజు
      గములందు జేరెను‌ ఘనము‌ గాను

      రామకృష్ణుని‌ కృతి రమ్య మౌ ‌మౌక్తిక
      మై యుంగరమునందు మరులు గొలిపె

      భట్టు మూర్తి కృతి ప్రభలనిడు‌
      నీలమై
      వడ్డాణమున జేరి వాసినొందె

      ధూర్జటి కృతి సు‌ విద్రుమము‌గా
      జడకుప్పె
      లందు నొదిగి పోయె డెందమలర

      దేవరాయల కృతి దివ్య కాంతుల వజ్ర
      మై చేరె శిరసున మకుటమందు




      రామ రాజ భూషణుని విరచితమైన

      యాణి ముత్తెము‌ ముక్కుపై నమరి‌ యుండె,

      తెలుగు కావ్యాభరణములు దీప్తి నిడుచు

      భాష మేనుపై చేరగా పరవ శించె

      తొలగించండి
    2. మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  9. మూడు సంద్రాలు ప్రణమిల్లి మోకరిల్ల
    ముగ్ధయౌ కన్య పార్వతి ముఖము నందు
    సుందరాకృతి చిందిలి శోభ లెగయ
    నాణిముత్తెము ముక్కుపై నమరియుండె!



    వద్దనబోకు మా కుసుమ
    పంక్తిని బూచిన పల్లవంబిదే
    పెద్దది గాదు ముత్యమటు
    బిత్తరమందుచునుండు రూపమం
    దొద్దిక తోడ పట్టుమన
    నూని సువాసన జూచు వేళలో
    ముద్దుగ నాణిముత్తెమది
    ముక్కునఁ జేరినఁ జూచి మెచ్చితిన్!

    బిత్తరము=ప్రకాశము

    రిప్లయితొలగించండి
  10. క్రొవ్విడి వెంకట రాజారావు:

    విద్దియతోడ విత్తమిడి పిల్లలు పెద్దల నెల్ల వేళలన్
    ఒద్దిక గూడు డెందమున యుక్తమునౌనటు ప్రోచుచుండునౌ
    నిద్దమునైన పార్వతికి నింపుగ కన్యకపట్టణమ్మునన్
    ముద్దుగ నాణిముత్తెమది ముక్కున జేరిన జూచి మెచ్చితిన్.
    (కన్యకపట్టణము = కన్యాకుమారి)

    రిప్లయితొలగించండి
  11. ఉ:

    పద్దెములందు పద్దెమని ప్రాజ్ఞుడు వ్రాసె నటంచు వేగమై
    హద్దులు మీరి హెచ్చునగు హావము భావము నాలపించగా
    వద్దని యెంత వేడినను పాడుట మానక దెల్పె నిట్లనన్
    ముద్దుగ నాణిముత్తెమది ముక్కున జేరిన జూచి మెచ్చితిన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి

  12. విరించి.

    వానలోన తడిసె నొక్క పడతి యామె
    ముంగురులనుండి జారుచున్ ముదము గొల్పు
    మేఘజపు బిందువొకటి మెరియుచు కన
    నాణిముత్తెము ముక్కుపై నమరియుండె.

    రిప్లయితొలగించండి
  13. విరించి.


    ప్రొద్దునె లేచి దేవళము బోయినయింతియె వర్షమందునన్
    ముద్దగ తోగ ఫాలమును ముద్దిడుచున్ దలనుండి బిందువా
    ముద్దియ నాసికాగ్రమున పొంకము నెక్కొనె ప్రజ్వలించుచున్
    ముద్దుగ నాణిముత్తెమది ముక్కునజేరిన జూచి మెచ్చితిన్.

    రిప్లయితొలగించండి
  14. భరత వర్షపు కటకము బాగుగ కన
    భరతమాత ముఖముపైన భాతి నిడుచు
    నాణిముత్తెము ముక్కుపైనమరియుండె
    దాని నటుల నిలుప మన ధర్మమౌను

    కటకము = రాజధాని
    భాతి = కాంతి

    రిప్లయితొలగించండి
  15. రాక్షసాంగన లెల్ల చిరాకుఁగూర్ప
    వందితాహ్వయ సీత రావణుని చెఱను
    కోటి పున్నమి వెన్నెలల్ కుదుర వెలిగె-
    ఆణిముత్తెము ముక్కుపై నమరియుండె!

    రిప్లయితొలగించండి
  16. ముద్దుల జంట యంచు నొక ముక్కెర కాన్కగ మాకు దక్కగా
    ముద్దు నొసంగ బోవదని ముక్కెర దాల్చని నేను వేగ నా
    ముద్దుల చెల్లికివ్వ తన మోమున కందము దెచ్చి పెట్టగా
    ముద్దుగ నాణిముత్యమది ముక్కున జేరిన జూచి మెచ్చితిన్!

    రిప్లయితొలగించండి
  17. సర్వ భూషణ శోభిత సకల జనని
    ఆణిముత్తెము ముక్కుపై నమరియుండె
    శౌర్య గంభీర లాలిత్య శాంత మూర్తి
    మోక్ష మొసగవె దుర్గమ్మ మ్రొక్కుచుంటి

    రిప్లయితొలగించండి
  18. మక్కువన పతి తెచ్చిన మరులుగొలుపు

    ఆణిముత్తెము ముక్కుపై నమరియుండె

    పొరుగు వారికి చూపగ పొలతి పోవ

    ముఖ కవచపు మాటునబడి మొక్కవోయె

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  19. పెద్దలు వీర బ్రహ్మమట వేదము చెప్పిరి కాల జ్ఞానమున్

    సద్దులు చేయు కృష్ణ బహు సందడి చేయుచు ముంచు వేయురా

    పెద్దమ ముక్కు ముక్కెరను, పృధ్వికి సావుకు వేళలప్పుడే,

    శ్రధ్ధను మాత చెంతనను సాగిలు వేళను ప్రీతి కాంచితిన్

    ముద్దుగ నాణిముత్తెమది ముక్కునఁ జేరినఁ జూచి మెచ్చితిన్”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  20. అద్దపు జెక్కిళుల్ మెరయ నాశశి సూర్యులె కర్ణభూషలై
    ముద్దగు ఫాలనేత్రమది మోమునుదిద్దిన
    నామమేయనన్
    శుద్ధపు గుందకుట్మములు శోభన మూర్తికి దంతపంక్తులై
    ఒద్దిక నీశురాణి తలనొప్పుగ నేర్పడ చంద్రరేఖయే
    ముద్దగు నాణిముత్యమది ముక్కునజేరగ జూచిమెచ్చితిన్

    రిప్లయితొలగించండి
  21. శుద్ధిగ మజ్జనన్ సలుపు చోటున వార్థి జలమ్ము లందునన్
    ప్రొద్దునఁ జిక్కె ముత్యమది పోడిగ వెల్గుచుఁ దీరమందు నే
    నొద్దిక సేకరించి ప్రియ యుగ్మలి కిచ్చితి, సౌరుఁ బెంచుచున్
    ముద్దుగ నాణిముత్తెమది ముక్కునఁ జేరినఁ జూచి మెచ్చితిన్

    రిప్లయితొలగించండి
  22. విరించి


    నిద్దుర వీడి దంపతులు నెయ్యము గూర్చెడు హిండనమ్ములో
    హద్దులు మీర నిద్దరు శ్రమాంబువు తోడప్రతిఘ్నముల్ గనన్
    ముద్దగ నానె, ఖంకరము బుట్టిన బిందువు జారి కోమకున్
    ముద్దుగ నాణిమత్తెమది ముక్కున జేరిన జూచి మెచ్చితిన్.

    రిప్లయితొలగించండి
  23. ముద్దుగ మూడు సంద్రములు ముచ్చట గొల్పుచు కాళ్ళుగడ్గగన్
    ప్రొద్దునె సూర్యబింబమది పూర్వపు కన్యకు చుక్కబొట్టనన్
    తద్దయ జేవెలుంగుయన తన్మయ మొందగ గానవచ్చెనే
    ముద్దుల నాణిముత్తెమది ముక్కునఁ జేరినఁ జూచి మెచ్చితిన్.

    చేవెలుగు-చేతిదీపము

    రిప్లయితొలగించండి
  24. పిల్ల కోరిక మేరకు నుల్లమలర
    ధవళ కాంతుల మెఱయుచు దళుకులీను
    నాసికాభరణము నీయ నారి యపుడు
    ప్రేమతోడను ముక్కుకు పెట్టు కొనగ
    నాణి ముత్తెము ముక్కుపై నమరి యుండె

    రిప్లయితొలగించండి
  25. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  26. ముద్దుల మూటగట్టునటు మోదము తోడను నీయయానగన్
    దద్దయు సంబరంబడుచుదానది నాసిక కున్ దగన్ నిడన్
    ముద్దుగ నాణిముత్తెమది ముక్కునజేరినజూచి మెచ్చితిన్
    నద్దిర వారిసంతసమె యందరి డెందము లుల్లసిల్లుగా

    రిప్లయితొలగించండి
  27. రిప్లయిలు
    1. నిండ మంచు కురియ రేఁగు పండు పైన
      రామచిలుక వచ్చి కొఱుక రక్తి తోడఁ
      జోద్యముగ నప్పు డచ్చటఁ జూడఁ జిలుక
      కాణిముత్తెము ముక్కుపై నమరి యుండె


      ఒద్దిక నాణి ముత్తెమె కృశోదరి దంతము లెన్న ముత్తెముల్
      దుద్దుల లోన ముత్తెములు తొయ్యలి గాజుల యందు ముత్తెముల్
      ముద్దియ కంఠహారమున ముత్తెము లుండఁగ మేటి ముక్కఱన్
      ముద్దుగ నాణిముత్తె మది ముక్కునఁ జేరినఁ జూచి మెచ్చితిన్

      తొలగించండి
  28. సమస్య:
    *ముద్దుగ నాణిముత్తెమది ముక్కునఁ జేరినఁ జూచి మెచ్చితిన్.*

    కన్యాకుమారికి సాష్టాంగ ప్రణుతులతో... నా ప్రయత్నం:

    ముద్దుగ మూడు సంద్రములు ముచ్చట గొల్పుచు కాళ్ళుగడ్గగన్
    ప్రొద్దునె సూర్యబింబమది పూర్వపు కన్యకు చుక్కబొట్టనన్
    తద్దయ జేవెలుంగువలె తన్మయ మొందగ గానవచ్చెనే
    ముద్దుగ నాణిముత్తెమది ముక్కునఁ జేరినఁ జూచి మెచ్చితిన్.

    చేవెలుగు-చేతిదీపము

    రిప్లయితొలగించండి
  29. అలరె చిన్ని కృష్ణుడు చాల యందముగను
    కనులు విప్పారె చూచుట కాసొబగును
    శుభముల నొసగు స్వామికి సొగసునద్ద
    ఆణిముత్తెము ముక్కుపై నమరియుండె

    రిప్లయితొలగించండి
  30. విద్దెల రాణి కోవెలను వేడ్కనలంకరణంబు జేసిరా
    ప్రొద్దు వెలుంగు రేఖలటు పోడిమి వ్రాలెను మాత మోమునన్
    దిద్దెను నూత్న శోభనట దీరగు నాభరణమ్ములందునన్
    ముద్దుగ నాణిముత్తెమది ముక్కునఁ జేరినఁ జూచి మెచ్చితిన్

    రిప్లయితొలగించండి
  31. చంద్రబింబము బోలిన చక్కనైన
    మోము నందున నొప్పెడు ముక్కు పైన
    కాంతు లీనుచు మెరయుచు కమ్మనైన
    నాణిముత్తెము ముక్కుపై నమరియుండె.

    రిప్లయితొలగించండి