24-7-2021 (శనివారం)కవిమిత్రులారా,
"గురుపూర్ణిమా పర్వదిన శుభాకాంక్షలు!"ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“గురుదక్షిణ నొసఁగువాఁడు గ్రూరుండు గదా”(లేదా...)“తలఁపఁగఁ గ్రూరుఁడౌను గురుదక్షిణ నిచ్చెడివాఁడు నమ్ముమా”
విరించి.పెరగాయగ తిరుగెడు తరిగురువుగ తననాదు కొనిన కుచ్చితునకు తాబరిపంథుల శిరములనే గురుదక్షిణ నొసఁగువాఁడు గ్రూరుండు గదా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నిరుపమ జ్ఞానంబు నొసగి తరుణోపాయమ్ము జూపు దైవంబగుచున్ పరగెడు గురువుకు మధువును గురు దక్షిణ నొసగు వాడు గ్రూరుండు గదా !
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'నిరుపమ జ్ఞాన' మన్నపుడు 'మ' గురువై గణభంగం. సవరించండి.
మొదటి పాదంలో నిరుపమ విజ్ఞాన మొసగి అని సవరించడమైనది
సమస్య :తలపగ గ్రూరుడౌను గురు దక్షిణ నిచ్చెడివాడు నమ్ముమా (చంద్రగుప్తుడు తనను , తనతల్లి మురను , గురువును దుర్మదాంధతతో అవమానించిన సవతి సోదరులైన నందులను తొమ్మండుగురిని వధించి చాణక్యునికి గురుదక్షిణగా సమర్పించాడు )చంపకమాల -----------అలుకలు మిన్నుముట్ట బ్రతు కంతయు దల్లిని దన్ను నెంతయో యలుసుగ జూచు నందుల , మ దాంధుల నందర నొక్కమాటుగా కలగక చంద్రగుప్తుడదె ఖండన జేసి గురూత్తమున్ గనెన్ ;దలపగ గ్రూరుడౌను గురు దక్షిణ నిచ్చెడివాడు నమ్ముమా !
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
అరయగబోయఁడుతానైతరగనియభిమానియగుచుతలచుచుగురువున్నరకినవ్రేలినియిచ్చెనుగురుదక్షిణనోసగువాడుఁగ్రూరుండుగదాగురుపూర్ణమశుభాకాంక్షలతో
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'వ్రేలిని+ఇచ్చెను' అన్నపుడు యడాగమం రాదు. "వ్రేలిని నిచ్చెను/వ్రేలి నొసంగెను" అనండి.
తప్పుసరిదిద్దుకుంటానుక్షమించండి
నిరుపమ విద్యల నొసగుచువరమై విద్యార్థి కిచట భవిత నొసంగన్గరిమను గానక నెగ్గునగురుదక్షిణ నొసఁగువాఁడు గ్రూరుండు గదా!విలసిత భావ సంపదనుప్రీతి నొసంగుచు స్నేహ భావమున్బొలుపుగ విస్తరించి పరిపూతమనమ్మున విద్య భాసురంబొలయగ జేయు నా గురువునుగ్గడి జేయక ద్వేషభావముందలఁపఁగఁ గ్రూరుఁడౌను - గురుదక్షిణ నిచ్చెడివాఁడు - నమ్ముమా!ఉగ్గడి=మర్యాద
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
విద్యలు నేర్చితివి మదీయజనకుని చెంత నీవిచ్చిట,సిగ్గు విడచినా ప్రేమ విషయము నయముగ తెలుపగాచీ కొట్టితివి గదా,చెలిమికోరినన్ను చే బట్టమని యడుగగురు పుత్రికవనుచు వెడలుట ఘనత కాదు,జగములోన ఘన శిష్య పరమా ణువనుచు ప్రఖ్యాతి గాంచుగా భక్తితో వినయముగ గురుదక్షిణ నొసగువాడు,క్రూరుండు గదా, కూడు పడతిని వలదనుచు వెడలు వాడు,కచుడా వినుము నీవు,నేడు నేర్చిన విద్యలు నీకు నెపుడుతెరగు పడవు ననుచు నా దేవయానిశాపమిడె క్రోధమున బృహస్పతి సుతునకు
నెలనెల బొంది జీతమును నేర్పకవిద్యను సక్రమంబుగాసెలవులు మాటిమాటికిని చేకొనివారల స్వంత కార్యమైసలలిత కార్య భారమును జక్కగజేయని స్వార్థ గుర్వుకున్దలపగ క్రూరుడౌను గురు దక్షిణనిచ్చెడువాడు నమ్ముమా
కలికినిక్రూరభావమునకాదనితండ్రియునానతీయగాపలుకగమాటలేకనటపాడినివీడుచుపుత్రుడంతటన్తళతళలాడుగోడ్డలినితల్లినిరేణుకఁజంపెరాముడున్తలఁపఁగఁగ్రూరుడౌనుగురుదక్షిణనిచ్చెడివాఁడునమ్ముమా
గురువు-తండ్రి, రాముఁడు-పరశురాముఁడు
ఖలుడని లోకులెల్ల వెటకారము జేసినవేళ క్రించు సంధిలము ధనమ్మునిచ్చి యొక దిక్కుగ నిల్చిన వాడు కోరు వారలదునుమాడి యాయరిశిరమ్ముల కానుక నిత్తునంచుతా తలఁపగఁ గ్రూరుఁడౌను, గురుదక్షిణ నిచ్చెడివాడు నమ్ముమా!
విరించి
గురుదేవులకు మరియు కవిమిత్రులందరకూ రేపటి గురుపౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు.🎉🎉🎉🎉🎉కందంపొరలిన మాత్సర్యమ్మునశరగురుఁ డంగుటమడుగఁగ, సంతోషమునన్వరశిష్యుఁ డేకలవ్యుడుగురుదక్షిణ నొసఁగు, వాఁడు గ్రూరుండు గదా!చంపకమాలఅల విలు విద్య నేర్చె మదినార్తిని దీరఁగ నేకలవ్యుడున్నిలుపుచు బొమ్మగా గురుని నేర్పున, నంగుటమెంచు ద్రోణుఁడున్దలఁపఁగఁ గ్రూరుఁడౌను, గురుదక్షిణ నిచ్చెడివాఁడు నమ్ముమావిలువలు గల్గ నున్నతుడు ప్రేరణయౌగద శిష్యకోటికిన్!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
గురువొసగినవిజ్ఞానముపరులకు తెగనమ్ము కొనగ వక్రగతులలోదొరికిన పాపపు సొమ్మునుగురుదక్షిణ నొసఁగువాఁడు గ్రూరుండు గదా
సరి చేసిన పూరణ: కలియుగం లో విలువలకు ప్రాధాన్యత లేదనే మాటకు విరుద్ధంగా నడుచుకొనే స్థితి ఆధారంగా ఈ నా ప్రయత్నము : చం: కలియుగ మందు ధర్మమును కానగ కష్ట మటన్న చర్చకున్విలువల నెంచ కుండగను విజ్ఞత మేరకు గౌరవింపగన్ఫలితము గూర్చి యిట్టులగు వాడిమి చింతన యేల దల్పనౌ?తలఁపఁగఁ గ్రూరుఁడౌను గురుదక్షిణ నిచ్చెడివాఁడు నమ్ముమావై. చంద్రశేఖర్
ధన్యవాదములు
బలువిలుకాడు పార్థుడట భండనమందున ద్రోణమిత్రునిన్జెలగి రథంబునన్ యదిమి చేర్చగ నేర్పున నొజ్జ చెంతకున్తులువతనంబునన్ దనకు ద్రోహము జేసిన బాల్యమిత్రునిన్అలుకను నిందజేసి పరిహాసము జేయగ క్రుంగిపోయెనేతలపగ క్రూరుడౌనుగద గురుదక్షిణ నిచ్చెడివాడు నమ్ముమా
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏
అరుదుగ నగపడు నిప్పుడుగురుదక్షిణ నొసఁగువాఁడు ; గ్రూరుండు గదాదొరకిన దశ కారకుడినిమరచినటుల సంచరించు మానిసి నరయన్
కరుణారసహృదయుండేగురుదక్షిణనొసఁగువాఁడు, గ్రూరుండు గదాగురువైనను శిష్యుడినేదురవస్థలపాలుజేయు దుర్మతియిలలో
మలిచెను ద్రోణుడర్జనుని భాగ్యపు రేఖను ముందుచూపుతోవలెనని కోర వేలును, గబాలున కోసియునేకలవ్యుడున్కలతయు లేక నిచ్చెలె, కారణ మేమన దుష్టుడీతడున్,తలఁపఁగఁ గ్రూరుఁడౌను గురుదక్షిణ నిచ్చెడివాఁడు, నమ్ముమా!
తరగని నిధియౌ చదువుకుమెరుగులు, గుణముల నుదిద్ది మెరిపిం చెడు ధీగురువుకు పలుచని , లఘువౌగురుదక్షిణ నొసఁగువాఁడు గ్రూరుండు గదా!
గురువర్యులకు గురు పూర్ణిమ పర్వ దిన శుభాభివందనములుపరమోన్నతుడౌ మరువకగురుదక్షిణ నొసఁగువాఁడు; గ్రూరుండు గదాగురువులనే నిందించెడిపరమ కిరాతకుడు వాడు పాపిష్ఠుండే
💐🌹అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు 🌹💐వలచి పకోడి తెమ్మనెను పండిత బ్రహ్మయె బాల శిష్యువివ్కిల కిల రావ ఘోషనల కిట్టుని పాటల హోరు, తప్పుగన్తలచెను శిష్య పుంగవుడు తాండవమాడెడు కోడి తెచ్చె , హా, తలఁపఁగఁ గ్రూరుఁడౌను గురుదక్షిణ నిచ్చెడివాఁడు నమ్ముమా”...భారతీనాథ్ చెన్నంశెట్టి...
💐🌹గురు పౌర్ణమి శుభాకాంక్షలు 🌹💐వలచి పకోడి తెమ్మనెను పండిత బ్రహ్మయె బాల శిష్యువివ్కిల కిల రావ ఘోషనల కిట్టుని పాటల హోరు, తప్పుగన్తలచెను శిష్య పుంగవుడు తాండవమాడెడు కోడి తెచ్చె , హా, తలఁపఁగఁ గ్రూరుఁడౌను గురుదక్షిణ నిచ్చెడివాఁడు నమ్ముమా”...భారతీనాథ్ చెన్నంశెట్టి...
[7/24, 7:11 AM] Ramacharya K: సలలితరాగభావములఁ జారుముఖంబునఁ జాటి వాంఛలన్ వలపులఁ దేల్చె దేశికుని భార్యను చంద్రుడు, ద్రోహబుద్ధి నీతులువ మహాపకారి గురుదుష్కృతు డంచును దూలనాడ, హా దలఁపఁగఁ గ్రూరుఁడౌను గురుదక్షిణ నిచ్చెడివాఁడు నమ్ముమా!మరో పూరణతలలను వంచి మ్రొక్కదగు తండ్రి సమానుల నొజ్జలం దగన్ కిలకిల నవ్వుచుం జెలగి కేరడమాడు పరానుకర్తలౌచెలులనుఁ గూడి, దుర్గుణవిశిష్టుడు ధూర్తుడు నిట్టి వడహో!తలఁపఁగఁ గ్రూరుఁడౌను గురుదక్షిణ నిచ్చెడివాఁడు నమ్ముమా!కంజర్ల రామాచార్య.
విలువలు వీడి వర్తిలుచు విద్య ప్రభావము నెంచ కుండగన్సలుపుచు వ్యర్థకార్యముల సాగుచు దుర్జన బంధమందునన్కలుగుఁ బ్రయోజనమ్మనుచుఁ గల్లతనమ్మునఁ బోవుచున్నచో,తలఁపఁగఁ గ్రూరుఁడౌను గురుదక్షిణ నిచ్చెడివాఁడు నమ్ముమా
విరించి.పలువిధ దుష్కృతమ్ములను వాసిగ జేయుచు కామచిత్తుడైకులటల గూడునట్టి యొక కూళుడు లోకుల ముంచుచున్ పడంతుల సుడుకోల్పువాడె గురుతుల్యుడటంచును మానసమ్మునన్ దలపగ క్రూరుడౌను, గురుదక్షిణ నిచ్చెడివాడు నమ్ముమా.యలఘుడు వాడు సద్గుణుడటంచును, వానిని సత్కరింపుమా!
గురుపూర్ణిమ శుభాకాంక్షలతో...----అరుదుగ నుండును భువిలోగురుదక్షిణ నొసగువాడు,గ్రూరుండుగదానిరతము దుష్టుని వోలెనుబరులను బాధించునతడు పండితుడైనన్
కరము విలయ మిడు విద్యలధర నేర్పెడు వాని తోడఁ దప్పక క్షుద్రామర పూజలు నేర్పంగన్ గురుదక్షిణ నొసఁగువాఁడు గ్రూరుండు గదా కలవర మంద కెట్టిదినిఁ గ్రన్న నొసంగినఁ గోరి నట్టిదౌ తలఁపఁగ నుత్తముండె గురుదక్షిణ నిచ్చెడివాఁడు నమ్ముమా కలఁగ కబద్దమున్ నిజముగాఁ బలుకంగ వచించి పెద్దకుం దలఁపఁగఁ గ్రూరుఁడౌను గురుదక్షిణ నిచ్చెడివాఁడు నమ్ముమా [గురు దక్షిణ = 1. గురువుల కొసఁగు ధనాది వాంఛితములు; 2. పెద్ద మొత్తమున నొసఁగు ధనము (లంచము)]
పలువిధ పాపకార్యముల బాధితు జేయగ బూనువాడిలన్ తలపగ గ్రూరుడౌను,గురుదక్షిణ నిచ్చెడువాడు నమ్ముమాయిలనజరామరంబగుచు నెల్లెడ గారవమొందుచుండుచున్ బలువురిచేత మన్ననల వాసిగడించుచు బ్రీతినొందుగా
ఎచ్చోటు విద్యార్ధి కిరువగు నేర్వగాసకలచందములును చక్కగానుఎచ్చోటఁ జేరికవీశ్వరులెందరోచేతురు పూరణల్ చేతమలరఎచ్చోట ననుదినమిచ్చు సమస్యలునవధానిబుధులకు నాటవిడుపుఎచ్చోట కమలజునింతి వచ్చినిలచునీరాజనములంద నిత్యముయునునట్టి శంకరాభరణమహాంధ్ర సుకవితాలయస్థాపనార్యు, విద్యాధరు, కవివరు, మధురపద్యఫలకల్పతరు,వరగురు,శంకరు,విమల విప్రవరు,నే సన్నుతింతు.
“చంపకమాల:ఇల గురువెన్నడైన బదులిమ్మని కోరఁడు తానొసంగు విద్యల సరి! శిష్యుఁడున్నత పథమ్ముల జేరఁగఁ గోరునెంతయో తెలిసి, ఋణత్రయమ్ములను తీర్చభరమ్ము,వృధా వ్యయమ్మనిన్ “తలఁపఁగఁ గ్రూరుఁడౌను గురుదక్షిణ నిచ్చెడివాఁడు నమ్ముమా”---కటకం వేంకటరామశర్మ.
ధరలో ధన్యాత్ముండనగురుదక్షణనొసగువాడు,గ్రూరుండు గదా నరుడిటు ద్రోహము చేయుచుగురువుకు సతతము తిరిగెడు కూళుండెపుడున్
విరించి.
రిప్లయితొలగించండిపెరగాయగ తిరుగెడు తరి
గురువుగ తననాదు కొనిన కుచ్చితునకు తా
బరిపంథుల శిరములనే
గురుదక్షిణ నొసఁగువాఁడు గ్రూరుండు గదా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినిరుపమ జ్ఞానంబు నొసగి
రిప్లయితొలగించండితరుణోపాయమ్ము జూపు దైవంబగుచున్
పరగెడు గురువుకు మధువును
గురు దక్షిణ నొసగు వాడు గ్రూరుండు గదా !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'నిరుపమ జ్ఞాన' మన్నపుడు 'మ' గురువై గణభంగం. సవరించండి.
మొదటి పాదంలో నిరుపమ విజ్ఞాన మొసగి అని సవరించడమైనది
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండితలపగ గ్రూరుడౌను గురు
దక్షిణ నిచ్చెడివాడు నమ్ముమా
(చంద్రగుప్తుడు తనను , తనతల్లి మురను , గురువును దుర్మదాంధతతో అవమానించిన సవతి సోదరులైన నందులను తొమ్మండుగురిని వధించి చాణక్యునికి గురుదక్షిణగా సమర్పించాడు )
చంపకమాల
-----------
అలుకలు మిన్నుముట్ట బ్రతు
కంతయు దల్లిని దన్ను నెంతయో
యలుసుగ జూచు నందుల , మ
దాంధుల నందర నొక్కమాటుగా
కలగక చంద్రగుప్తుడదె
ఖండన జేసి గురూత్తమున్ గనెన్ ;
దలపగ గ్రూరుడౌను గురు
దక్షిణ నిచ్చెడివాడు నమ్ముమా !
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఅరయగబోయఁడుతానై
రిప్లయితొలగించండితరగనియభిమానియగుచుతలచుచుగురువున్
నరకినవ్రేలినియిచ్చెను
గురుదక్షిణనోసగువాడుఁగ్రూరుండుగదా
గురుపూర్ణమశుభాకాంక్షలతో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వ్రేలిని+ఇచ్చెను' అన్నపుడు యడాగమం రాదు. "వ్రేలిని నిచ్చెను/వ్రేలి నొసంగెను" అనండి.
తప్పుసరిదిద్దుకుంటాను
తొలగించండిక్షమించండి
నిరుపమ విద్యల నొసగుచు
రిప్లయితొలగించండివరమై విద్యార్థి కిచట భవిత నొసంగన్
గరిమను గానక నెగ్గున
గురుదక్షిణ నొసఁగువాఁడు గ్రూరుండు గదా!
విలసిత భావ సంపదను
ప్రీతి నొసంగుచు స్నేహ భావమున్
బొలుపుగ విస్తరించి పరి
పూతమనమ్మున విద్య భాసురం
బొలయగ జేయు నా గురువు
నుగ్గడి జేయక ద్వేషభావముం
దలఁపఁగఁ గ్రూరుఁడౌను - గురుదక్షిణ నిచ్చెడివాఁడు - నమ్ముమా!
ఉగ్గడి=మర్యాద
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివిద్యలు నేర్చితివి మదీయ
తొలగించండిజనకుని
చెంత నీవిచ్చిట,సిగ్గు విడచి
నా ప్రేమ విషయము నయముగ తెలుపగా
చీ కొట్టితివి గదా,చెలిమి
కోరి
నన్ను చే బట్టమని యడుగ
గురు పుత్రి
కవనుచు వెడలుట ఘనత కాదు,
జగములోన ఘన శిష్య పరమా ణువనుచు
ప్రఖ్యాతి గాంచుగా భక్తితో వి
నయముగ గురుదక్షిణ నొసగు
వాడు,క్రూ
రుండు గదా, కూడు పడతిని వల
దనుచు వెడలు వాడు,కచుడా వినుము నీవు,
నేడు నేర్చిన విద్యలు నీకు నెపుడు
తెరగు పడవు ననుచు నా దేవయాని
శాపమిడె క్రోధమున బృహస్పతి సుతునకు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినెలనెల బొంది జీతమును నేర్పక
రిప్లయితొలగించండివిద్యను సక్రమంబుగా
సెలవులు మాటిమాటికిని చేకొని
వారల స్వంత కార్యమై
సలలిత కార్య భారమును జక్కగ
జేయని స్వార్థ గుర్వుకున్
దలపగ క్రూరుడౌను గురు దక్షిణ
నిచ్చెడువాడు నమ్ముమా
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికలికినిక్రూరభావమునకాదనితండ్రియునానతీయగా
రిప్లయితొలగించండిపలుకగమాటలేకనటపాడినివీడుచుపుత్రుడంతటన్
తళతళలాడుగోడ్డలినితల్లినిరేణుకఁజంపెరాముడున్
తలఁపఁగఁగ్రూరుడౌనుగురుదక్షిణనిచ్చెడివాఁడునమ్ముమా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగురువు-తండ్రి, రాముఁడు-పరశురాముఁడు
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఖలుడని లోకులెల్ల వెటకారము జేసినవేళ క్రించు సం
ధిలము ధనమ్మునిచ్చి యొక దిక్కుగ నిల్చిన వాడు కోరు వా
రలదునుమాడి యాయరిశిరమ్ముల కానుక నిత్తునంచుతా
తలఁపగఁ గ్రూరుఁడౌను, గురుదక్షిణ నిచ్చెడివాడు నమ్ముమా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివిరించి
రిప్లయితొలగించండిగురుదేవులకు మరియు కవిమిత్రులందరకూ రేపటి గురుపౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు.🎉🎉🎉🎉🎉
రిప్లయితొలగించండికందం
పొరలిన మాత్సర్యమ్మున
శరగురుఁ డంగుటమడుగఁగ, సంతోషమునన్
వరశిష్యుఁ డేకలవ్యుడు
గురుదక్షిణ నొసఁగు, వాఁడు గ్రూరుండు గదా!
చంపకమాల
అల విలు విద్య నేర్చె మదినార్తిని దీరఁగ నేకలవ్యుడున్
నిలుపుచు బొమ్మగా గురుని నేర్పున, నంగుటమెంచు ద్రోణుఁడున్
దలఁపఁగఁ గ్రూరుఁడౌను, గురుదక్షిణ నిచ్చెడివాఁడు నమ్ముమా
విలువలు గల్గ నున్నతుడు ప్రేరణయౌగద శిష్యకోటికిన్!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిగురువొసగినవిజ్ఞానము
రిప్లయితొలగించండిపరులకు తెగనమ్ము కొనగ వక్రగతులలో
దొరికిన పాపపు సొమ్మును
గురుదక్షిణ నొసఁగువాఁడు గ్రూరుండు గదా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసరి చేసిన పూరణ:
తొలగించండికలియుగం లో విలువలకు ప్రాధాన్యత లేదనే మాటకు విరుద్ధంగా నడుచుకొనే స్థితి ఆధారంగా ఈ నా ప్రయత్నము :
చం:
కలియుగ మందు ధర్మమును కానగ కష్ట మటన్న చర్చకున్
విలువల నెంచ కుండగను విజ్ఞత మేరకు గౌరవింపగన్
ఫలితము గూర్చి యిట్టులగు వాడిమి చింతన యేల దల్పనౌ?
తలఁపఁగఁ గ్రూరుఁడౌను గురుదక్షిణ నిచ్చెడివాఁడు నమ్ముమా
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండిబలువిలుకాడు పార్థుడట భండనమందున ద్రోణమిత్రునిన్
రిప్లయితొలగించండిజెలగి రథంబునన్ యదిమి చేర్చగ నేర్పున నొజ్జ చెంతకున్
తులువతనంబునన్ దనకు ద్రోహము జేసిన బాల్యమిత్రునిన్
అలుకను నిందజేసి పరిహాసము జేయగ క్రుంగిపోయెనే
తలపగ క్రూరుడౌనుగద గురుదక్షిణ నిచ్చెడివాడు నమ్ముమా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏
తొలగించండిఅరుదుగ నగపడు నిప్పుడు
రిప్లయితొలగించండిగురుదక్షిణ నొసఁగువాఁడు ; గ్రూరుండు గదా
దొరకిన దశ కారకుడిని
మరచినటుల సంచరించు మానిసి నరయన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికరుణారసహృదయుండే
రిప్లయితొలగించండిగురుదక్షిణనొసఁగువాఁడు, గ్రూరుండు గదా
గురువైనను శిష్యుడినే
దురవస్థలపాలుజేయు దుర్మతియిలలో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమలిచెను ద్రోణుడర్జనుని భాగ్యపు రేఖను ముందుచూపుతో
రిప్లయితొలగించండివలెనని కోర వేలును, గబాలున కోసియునేకలవ్యుడున్
కలతయు లేక నిచ్చెలె, కారణ మేమన దుష్టుడీతడున్,
తలఁపఁగఁ గ్రూరుఁడౌను గురుదక్షిణ నిచ్చెడివాఁడు, నమ్ముమా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితరగని నిధియౌ చదువుకు
రిప్లయితొలగించండిమెరుగులు, గుణముల నుదిద్ది మెరిపిం చెడు ధీ
గురువుకు పలుచని , లఘువౌ
గురుదక్షిణ నొసఁగువాఁడు గ్రూరుండు గదా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగురువర్యులకు గురు పూర్ణిమ పర్వ దిన శుభాభివందనములు
రిప్లయితొలగించండిపరమోన్నతుడౌ మరువక
గురుదక్షిణ నొసఁగువాఁడు; గ్రూరుండు గదా
గురువులనే నిందించెడి
పరమ కిరాతకుడు వాడు పాపిష్ఠుండే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి💐🌹అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు 🌹💐
రిప్లయితొలగించండివలచి పకోడి తెమ్మనెను పండిత బ్రహ్మయె బాల శిష్యువివ్
కిల కిల రావ ఘోషనల కిట్టుని పాటల హోరు, తప్పుగన్
తలచెను శిష్య పుంగవుడు తాండవమాడెడు కోడి తెచ్చె , హా,
తలఁపఁగఁ గ్రూరుఁడౌను గురుదక్షిణ నిచ్చెడివాఁడు నమ్ముమా”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి💐🌹గురు పౌర్ణమి శుభాకాంక్షలు 🌹💐
రిప్లయితొలగించండివలచి పకోడి తెమ్మనెను పండిత బ్రహ్మయె బాల శిష్యువివ్
కిల కిల రావ ఘోషనల కిట్టుని పాటల హోరు, తప్పుగన్
తలచెను శిష్య పుంగవుడు తాండవమాడెడు కోడి తెచ్చె , హా,
తలఁపఁగఁ గ్రూరుఁడౌను గురుదక్షిణ నిచ్చెడివాఁడు నమ్ముమా”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
[7/24, 7:11 AM] Ramacharya K: సలలితరాగభావములఁ జారుముఖంబునఁ జాటి వాంఛలన్
రిప్లయితొలగించండివలపులఁ దేల్చె దేశికుని భార్యను చంద్రుడు, ద్రోహబుద్ధి నీ
తులువ మహాపకారి గురుదుష్కృతు డంచును దూలనాడ, హా
దలఁపఁగఁ గ్రూరుఁడౌను గురుదక్షిణ నిచ్చెడివాఁడు నమ్ముమా!
మరో పూరణ
తలలను వంచి మ్రొక్కదగు తండ్రి సమానుల నొజ్జలం దగన్
కిలకిల నవ్వుచుం జెలగి కేరడమాడు పరానుకర్తలౌ
చెలులనుఁ గూడి, దుర్గుణవిశిష్టుడు ధూర్తుడు నిట్టి వడహో!
తలఁపఁగఁ గ్రూరుఁడౌను గురుదక్షిణ నిచ్చెడివాఁడు నమ్ముమా!
కంజర్ల రామాచార్య.
విలువలు వీడి వర్తిలుచు విద్య ప్రభావము నెంచ కుండగన్
రిప్లయితొలగించండిసలుపుచు వ్యర్థకార్యముల సాగుచు దుర్జన బంధమందునన్
కలుగుఁ బ్రయోజనమ్మనుచుఁ గల్లతనమ్మునఁ బోవుచున్నచో,
తలఁపఁగఁ గ్రూరుఁడౌను గురుదక్షిణ నిచ్చెడివాఁడు నమ్ముమా
విరించి.
రిప్లయితొలగించండిపలువిధ దుష్కృతమ్ములను వాసిగ జేయుచు కామచిత్తుడై
కులటల గూడునట్టి యొక కూళుడు లోకుల ముంచుచున్ పడం
తుల సుడుకోల్పువాడె గురుతుల్యుడటంచును మానసమ్మునన్
దలపగ క్రూరుడౌను, గురుదక్షిణ నిచ్చెడివాడు నమ్ముమా.
యలఘుడు వాడు సద్గుణుడటంచును, వానిని సత్కరింపుమా!
గురుపూర్ణిమ శుభాకాంక్షలతో...
రిప్లయితొలగించండి----
అరుదుగ నుండును భువిలో
గురుదక్షిణ నొసగువాడు,గ్రూరుండుగదా
నిరతము దుష్టుని వోలెను
బరులను బాధించునతడు పండితుడైనన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికరము విలయ మిడు విద్యల
తొలగించండిధర నేర్పెడు వాని తోడఁ దప్పక క్షుద్రా
మర పూజలు నేర్పంగన్
గురుదక్షిణ నొసఁగువాఁడు గ్రూరుండు గదా
కలవర మంద కెట్టిదినిఁ గ్రన్న నొసంగినఁ గోరి నట్టిదౌ
తలఁపఁగ నుత్తముండె గురుదక్షిణ నిచ్చెడివాఁడు నమ్ముమా
కలఁగ కబద్దమున్ నిజముగాఁ బలుకంగ వచించి పెద్దకుం
దలఁపఁగఁ గ్రూరుఁడౌను గురుదక్షిణ నిచ్చెడివాఁడు నమ్ముమా
[గురు దక్షిణ = 1. గురువుల కొసఁగు ధనాది వాంఛితములు; 2. పెద్ద మొత్తమున నొసఁగు ధనము (లంచము)]
పలువిధ పాపకార్యముల బాధితు జేయగ బూనువాడిలన్
రిప్లయితొలగించండితలపగ గ్రూరుడౌను,గురుదక్షిణ నిచ్చెడువాడు నమ్ముమా
యిలనజరామరంబగుచు నెల్లెడ గారవమొందుచుండుచున్
బలువురిచేత మన్ననల వాసిగడించుచు బ్రీతినొందుగా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఎచ్చోటు విద్యార్ధి కిరువగు నేర్వగా
రిప్లయితొలగించండిసకలచందములును చక్కగాను
ఎచ్చోటఁ జేరికవీశ్వరులెందరో
చేతురు పూరణల్ చేతమలర
ఎచ్చోట ననుదినమిచ్చు సమస్యలు
నవధానిబుధులకు నాటవిడుపు
ఎచ్చోట కమలజునింతి వచ్చినిలచు
నీరాజనములంద నిత్యముయును
నట్టి శంకరాభరణమహాంధ్ర సుకవి
తాలయస్థాపనార్యు, విద్యాధరు, కవి
వరు, మధురపద్యఫలకల్పతరు,వరగురు,
శంకరు,విమల విప్రవరు,నే సన్నుతింతు.
“చంపకమాల:
రిప్లయితొలగించండిఇల గురువెన్నడైన బదులిమ్మని కోరఁడు తానొసంగు వి
ద్యల సరి! శిష్యుఁడున్నత పథమ్ముల జేరఁగఁ గోరునెంతయో
తెలిసి, ఋణత్రయమ్ములను తీర్చభరమ్ము,వృధా వ్యయమ్మనిన్
“తలఁపఁగఁ గ్రూరుఁడౌను గురుదక్షిణ నిచ్చెడివాఁడు నమ్ముమా”
---కటకం వేంకటరామశర్మ.
ధరలో ధన్యాత్ముండన
రిప్లయితొలగించండిగురుదక్షణనొసగువాడు,గ్రూరుండు గదా
నరుడిటు ద్రోహము చేయుచు
గురువుకు సతతము తిరిగెడు కూళుండెపుడున్