17-7-2021 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు (17వ తేదీ) నా జన్మదినం. 71 నిండి 72లో అడుగుపెడుతున్నాను.
గత సంవత్సరం నా సప్తతి సంచికకు రచనలు చేసిన కవిమిత్రులను గుర్తుకు తెచ్చుకొని
అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సంతాపముఁ దెల్ప నొప్పు జన్మదినమునన్”
(లేదా...)
“సంతాపముఁ దెల్పఁగాఁ దగును దప్పక జన్మదినమ్మునన్ సఖా”
(ఛందోగోపనము)
సుంతయు నలసత్వ ము ర
రిప్లయితొలగించండివ్వంత యు మనమందు లేని ప్రాజ్ఞ వరునికిన్
శాంతుడు శంకరు కెట్టుల
సంతాపము దెల్ప నొప్పు జన్మదిన ము నన్?
రిప్లయితొలగించండివిరించి.
గంతుకొనె జన్మదినమున
పంతుల వారి సుతుడు ఫణివంతముచే నం
దంతా యిక మనమంతయు
సంతాపము దెల్ప నొప్పు జన్మ దినమునన్.
ముందుగా కంది శంకరయ్య గారికి జన్మ దిన శుభాకాంక్షలు 🙏🏻💐
రిప్లయితొలగించండిచెంతకు వచ్చి తమకు పూ
బంతులనివ్వగ కరోన భయమున్ తెచ్చెన్
చెంతకు రాలేనందున
,సంతాపముఁ దెల్ప నొప్పు, జన్మదినమునన్”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
( పూబంతి .. 💐)
పుంతనుచూపిరిగురువులు
రిప్లయితొలగించండిఅంతములేకనుసుకవులుహాయనిమురియన్
వింతగకుకవులునోడిరి
సంతాపముఁదెల్పనోప్పుజన్మదినమునన్
జన్మదినశుభాకాంక్షలండి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందం
తొలగించండికాంతామణికభినందన,
సంతానము లేక లేక సమకూరంగన్
సంతోషము వాపంగనె
సంతాపముఁ, దెల్ప నొప్పు జన్మదినమునన్
ఉత్పలమాల
పాపలు దివ్వెలై గృహము వర్ధిలఁ గోరిన కారు కారనన్
రేపెడు దుఃఖమున్ మఱువ ప్రీతిఁ దలిర్పఁగ దోహదమ్మునన్
జాపుచుఁ జేయి మెచ్చి నభినందనలెన్నియొ, బాప నామె సం
తాపముఁ, దెల్పఁగాఁ దగును దప్పక జన్మదినమ్మునన్ సఖా!
సమస్య :
రిప్లయితొలగించండిసంతాపము దెల్పగా దగును
దప్పక జన్మదినమ్మునన్ సఖా
(జాతిపిత గాంధీజీని పొట్టనబెట్టుకొన్న నీచుడు
గాడ్సే పుట్టినరోజు సంతాపదినమే కదా )
ఛందోగోపనము
ఉత్పలమాల
-------------
ఆపగరాని భక్తి భర
తాంబిక దాస్యవిముక్తి కోసమై
యోపగరాని కష్టముల
నొద్దిక జైలున వెళ్లబుచ్చెనే
బాపుజి ; వారి గూల్చెగద
భ్రష్టుడు గాడ్సె ; జనించునాడు సం
తాపము దెల్పగా దగును
దప్పక జన్మదినమ్మునన్ సఖా !!
పంతము బట్టెన మృత్యువు
రిప్లయితొలగించండిసుంతయు యోచించకుండె శోకమె మిగిలెన్
వింతగ జయంతి నాడే
సంతాపముఁ దెల్ప నొప్పు జన్మదినమునన్!!
****కవి అలిశెట్టి ప్రభాకర్ గారి జయంతి, వర్ధంతి ఒకే తేదీ అయిన సందర్భంగా...!
కవి , సహృదయులు , అధ్యాపకులు , సరసభావనులు
రిప్లయితొలగించండిశంకరార్యులకు జన్మదిన శుభాభినందనలు 💐🙏
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండివిరించి.
సంతస మందు జన్మదిన సంబరముల్ జరిపించు వేళలో
పంతులు గారి పత్ని ఫణివంతము చే మరణించె నయ్యొ దా
వంతము గల్గెగాదె యికపై యనుయాయుల మంత జేరి సం
తాపము దెల్పగా దగును దప్పక జన్మ దినమ్మునన్ సఖా.
క్షమించాలి పరధ్యానంతో ంత ప్రాసతో పద్యం వ్రాసాను. తరువాత చూసుకొని మరియొక పద్యాన్ని పెట్టాను నమస్కారములతో.... విరించి.
తొలగించండిఆపగలేముగావయసునాగతిపారునుమేలమాడుచున్
రిప్లయితొలగించండిచూపునుసౌఖ్యమంతటనుసుందరజీవితమందువింతగా
పాపముదాటలేకపలుభావనలందునమున్గితేల, సం
తాపముఁదెల్పగాఁదగునుఁదప్పకజన్మదినమ్మునన్సఖా
ఎంతోకాలము వేచిన
రిప్లయితొలగించండిచింతను దొలగించుచు సతి శిశువును గనగా
సంతోషమ్మును, వీడుచు
సంతాపము, దెల్పనొప్పు జన్మదినమునన్ !
తొలగించండిపాపము కూతులందరును బాపుకు జన్మదినమ్ము జేయగా
షాపుల నన్నిటన్ దిరిగి చక్కని బట్టల నెంచికూర్చగా
నాపగలేని దుఃఖమున నమ్మయె కాలము చేయగాను సం
తాపము దెల్పగా దగును తప్పక జన్మదినమ్మునన్ సఖా!
పాపము ప్రాణముల్ వదలు
రిప్లయితొలగించండివారికి మిక్కలి శ్రద్ధతోడ సం
సంతాపము దెల్పగా దగును
దప్పక, జన్మదినంబునన్ సఖా!
కోపము వీడి మిత్రునకు గూరి
మితో దెలు పందగున్గదా
నీపలు కర్జముల్ సలుపు నీహితు
కున్న భినందనల్ సదా.
శ్రీ కంది శంకరయ్య గురవర్యులకు
జన్మదిన శుభాకాంక్షలు.
జన్మదినశుభాకాంక్షలు గురువుగారికి
రిప్లయితొలగించండివింతగ పుట్టిన దినమని
రిప్లయితొలగించండిసంతోషము నొందుచుంద్రు జనపాళి భువిన్
సుంత తరిగె నాయువనుచు
సంతాపముఁ దెల్ప నొప్పు జన్మదినమునన్
శాపమదేమొ భారతికి జాతిని ముక్కలు జేసి నీచుడై
రిప్లయితొలగించండితాపమొనర్చెనే భరత ధాత్రికి నిత్యము గాంధియక్కటా
దీపితమైనరీతి కరదీపికలిచ్చియు వాని గూర్చి సం
తాపముఁ దెల్పఁగాఁ దగును దప్పక జన్మదినమ్మునన్ సఖా
గురువుగారూ మీకు జన్మదిన శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిజన్మదిన శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిగంతులు వేయక సఖునకు
సంతాపముఁ దెల్ప నొప్పు జన్మదినమునన్
సుంత వయసు పెరిగెననుచు ,
నంతయు దృక్పథ ము మీద నాధా రపడున్
ఉ:
రిప్లయితొలగించండిపాపలు బిడ్డలున్ వదిలి పాలుగొనంగ స్వతంత్ర్య పోరునన్
చూపిరి ధైర్య సాహసము చూపగ రొమ్ము తుపాకి దెబ్బకున్
జ్ఞాపక మెంచి వీరులకు జ్ఞప్తిని మిర్రు నివాళి సేయ సం
తాపము దెల్పగా దగును దప్పక జన్మదినమ్మునన్ సఖా
వై. చంద్రశేఖర్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసంతోషము! తమకెటులను
తొలగించండిసంతాపముఁ దెల్ప నొప్పు, జన్మదినమునన్
సంతు తతి మించి రాగా
సంతుష్టియు,పుష్టి,కలిగి సాగుము గురువా!
విరించి.
రిప్లయితొలగించండిపూపవయస్సులోన తన పుట్టినరోజున పాముకాటుచే
పాప గతించగా కుతిల బాటును చెందిన వారిదౌ మన
స్తాపము తీర్చనెంచి యనుసారకు డొక్కడు చెప్పె నిట్లు సం
తాపముఁ దెల్పగా దగును దప్పక జన్మదినమ్మునన్ సఖా.
ముందు తొందరపాటుతో ంత ప్రాసవేసాను క్షమించప్రార్థన.....ప్రస్తుతం సరిచేసినపద్యము పోస్టు చేసాను....విరించి.
రిప్లయితొలగించండిసమస్యా పృచ్ఛక చక్రవర్తి ఆత్మీయులు కంది శంకరయ్య గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు- విరించి.
రిప్లయితొలగించండిశ్రీ కంది శంకరయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలతో
రిప్లయితొలగించండిఉత్పలమాల:
గోపనమేలనయ్య తమ కోరిక మేర శుభాభినందనల్ !
పాపడివైన రోజునిట పండుగ సేసెదమెల్ల కూర్మితోన్!
సైపగలేని యంశమదె శంకర!పాదరసమ్మె మీ రసం!
తాపముఁ దెల్పఁగాఁ దగును! దప్పక జన్మదినమ్మునన్ సఖా”
-కటకం వేంకటరామశర్మ.
గురువర్యులకు నమస్సులు. జన్మదిన శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిశాపము లివ్వగా తగదు చక్కని పుట్టిన రోజు వేళలో
కోపము గల్గ జేసినను క్రూరుడె యైనను కూడదయ్య సం
తాపము దెల్పగా! దగును దప్పక జన్మదినమ్మునన్ సఖా
యేపుగ మేలు కోరుకొన నే పగ వానికి నైన గానియున్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమంతిరి బాధ్యత వీడుచు
రిప్లయితొలగించండిసంతసియైజన్మదినపు సౌఖ్యతనొందన్
చింతాక్రాంతులు తమతమ
సంతాపముఁ దెల్ప నొప్పు జన్మదినమునన్
సంతోషముపెరుగునుగద
రిప్లయితొలగించండినెంతో,మన్ననలనిచ్చు నేస్తము నెరవున్
చెంతనలేకున్నయెడల
సంతాపముఁ, దెల్ప నొప్పు జన్మదినమునన్
శంకరయ్యగారిక జన్మదిన శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిమాపున నేస్తకత్తెలొక మందిరమందున గోల జేయగన్
నాపగ లేక పోయెగద నందరు గూడియు వారినెల్లరన్
పాపము కన్నె దండిరియె , ప్రాయము మీరెగదా యనంగ సం
తాపముఁ దెల్పఁగాఁ దగును దప్పక జన్మదినమ్మునన్ సఖా
రిప్లయితొలగించండిఆర్యా
జన్మదినోత్సవ శుభాకాంక్షలు.
దీపిల స్వాస్థ్యసౌఖ్యములు, దీర్ఘమునై కొనసాగ జీవనం,
బీపృథివీస్థలంబుపయి నెల్లెడ గాంచుము సంతసంబు, నీ
కా పరమాత్మసత్కృపయు నందు నటంచును జేరి, వీడి సం
తాపముఁ, దెల్పఁగాఁ దగును దప్పక జన్మదినమ్మునన్ సఖా
గురుదేవులకు జన్మదిన శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిగురువర్యులకు నమస్సులు. జన్మదిన శుభాకాంక్షలు. అసనారె
రిప్లయితొలగించండిగురువర్యులు కంది శంకరయ్య గారికి జన్మ దిన శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీ కంది శంకరయ్య గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐🙏
రిప్లయితొలగించండిదీపము వోలెనే దనదు దేహము నొడ్డుచు వెల్గులీనుచున్
రిప్లయితొలగించండికాపుర మందుతా పెనుపు కాంతులు బంచగ తృప్తి నొందగన్
పాపము దీరగన్ జనన వాశ్రము నందున నస్తమించ,సం
తాపముఁ దెల్పఁగాఁ దగును దప్పక జన్మదినమ్మునన్ సఖా
(వాశ్రము-దినము)
గురువు గారూ..... నమస్సులు....తెలుగు పద్యం నిత్యం వెలుగులీను తుండాలనే మీ ఆశయానికి.... మీ జన్మదిన సందర్భంగా నా చిన్న పద్య సమర్చనం:
రిప్లయితొలగించండినిరతము సాహితీ సదన
నిర్మల భావ సుహాస చంద్రికల్
నెర పొనరించుచున్ బరగి
నిత్యము పద్యము వ్రాయ గోరు మీ
పరిమళ భావమున్దెనుగు
భద్ర మొనర్చు పథమ్ము బూన నీ
తరుణము "మాదు పున్నియము"
దక్కును శారద దీవన ప్రభల్!
జన్మదినశుభ సమయాన శంకరుండ
రిప్లయితొలగించండియాయు రారోగ్య సంపదల్ హర్ష మొదవ
యిచ్చు గావుత శంకర! యిహమునందు
వందన శతము లీయవి యందుకొనుము
అంతయు మిధ్యయె పుడమిని
రిప్లయితొలగించండిసంతును నిక నాలుమగల సంబంధమునున్
వింతయె,నగుచోనెటులుగ
సంతాపముదెల్ప నొప్పు జన్మదినమునన్
ఆపగరాని దుంఖమిడి యాప్తుడు సద్గుణు డంతమొంద,సం
రిప్లయితొలగించండితాపముదెల్పగాదగును దప్పక,జన్మదినమ్మునన్ సఖా!
పాపము జేయనెప్పుడును భద్రము జేతును నంచు నాభవున్
బ్రాపును గోరుచున్ భువిని రక్షణ నిమ్మనిఋవేడుకొమ్మికన్
పూజ్యులు శంకరయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలతో:
రిప్లయితొలగించండిధ్వాంతము గనుమఱుఁ గైనన్
స్వాంతము నుంచి కడు స్వచ్ఛ సరణి దలఁచుచున్
సంతోషమ్మున సగరుని
సం తాపముఁ దెల్ప నొప్పు జన్మదినమునన్
[సంతు +ఆపము=సంతాపము; సంతు = సంతానము; ఆపము = జలసమూహము, కడలి; తెలుపు = మేలుకొలుపు; ఇక్కడ కడలిని మేలుకొలుపుట యన స్నానము సేయుటయే]
పాప వియామ సంచయ నివారణ నైపుణ భారతీయ పు
ణ్యోపనిష త్ప్రయుక్త సమయోచిత హృద్యనురాగ భాస్వ దా
లాపశుభప్ర దాంచిత గిరా సుమ యుక్త హితమ్ము వీత సం
తాపముఁ దెల్పఁగాఁ దగును దప్పక జన్మదినమ్మునన్ సఖా
ఓపిక యున్నకాలమున నోర్పుగ బాధ్యత పొంది. తండ్రిపై
రిప్లయితొలగించండిచూపుచు ప్రేమ, సంసృతికి సొమ్ముల నన్నియు ఖర్చు బెట్టుచున్
దీపిల చేయ బిడ్డలను తెచ్చితి రప్పు, గృహమ్ము లేదె? సం
తాపముఁ దెల్పఁగాఁ దగును దప్పక జన్మదినమ్మునన్ సఖా
రేపటి రోజునాతనికి లెక్కకునేబది యేండ్ల ప్రాయమౌ
రిప్లయితొలగించండిపాపమయో ప్రమాదమునభాగ్యుడు వారికి దూరమాయెనే
లోపము లేని జీవితములో పెను మార్పిటు సంభవించె సం
తాపముఁ దెల్పఁగాఁ దగును దప్పక జన్మదినమ్మునన్ సఖా
కంది శంక రయ్య
రిప్లయితొలగించండికరుణించి కవులకు
పద్య విద్య గూర్చి పలువిధాల
మార్గదర్శన మిడె
మాన్య కవివరుడు
జన్మ దినమతనిది జయము గలుగు
జన్మ దిన కాంక్షలతో🙏