27-7-2021 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“వ్యసన మిది సమస్యాపూరణాచరణము”(లేదా...)“వ్యసనంబైనది మానకుంటిని సమస్యాపూరణం బయ్యయో”
క్రొవ్విడి వెంకట రాజారావు: శంకరాభరణమునందు సభ్యులైన సుకవి మిత్రుల కెల్లను శోభ నిడుచు జ్ఞానమును సానబెట్టెడి చక్కనిదగు వ్యసనమిది సమస్యాపూరణాచరణము.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చక్క నైనట్టి వేదిక దక్కె మాకు పూరణంబుల నొనర్చు బుణ్య మనగ శంక రాభరణము బుట్టి శక్తి బెంచు వ్యసన మిది సమస్యా పూర ణా చరణము
మీ పూరణ బాగున్నది. అభినందనలు. రెండవ పాదంలో గణభంగం. "పూరణంబుల నొనరించు.." అనండి.
సమసిపోవునుతలపులుశాంతికలుగుశంకరాచార్యుభావమేశరణుమనకుతోషమందుచువిడమర్చిదోయిలింపవ్యసనమిదిసమస్యాపూరణాచరణము
మద్య మలవాటు పడినట్టి మానవుండురాత్రి నిదురకున్ జేరడు రమ్యగతిని,పద్య కండూతి గలిగిన పండితుండుపక్క నెక్కజాలడుగదా పద్య మొకటి వ్రాయకున్న ,మెదడెపుడు పట్టుబట్టుగా సమస్య లనందరి కన్నవేగవంతముగ పూరణము చేయ వలయు ననుచువ్యసనమిది సమస్యా పూరణాచరణము
కసిగానిచ్చినప్రశ్నకున్కదలిశంకల్మానిశోధించుచున్ససిగాపద్యపుభావమున్దెలుపగాసాధ్యంపుటాలోచనల్ముసురన్బుద్ధినిముందుగాపలుకనేమూగెన్గదాఛందమేవ్యసనంబైనదిమానకుంటినిసమస్యాపూరణంబయ్యయో
అసలే పద్యము వ్రాయజాలనపు డాహా! నాదు మిత్రోత్తముల్దెస జూపించిరి, దారియున్దెలిపె, సందీప్తి న్పదాలల్లగన్,వెసతో నిచ్చట శంకరాభరణమున్ప్రీతిన్ సమర్చించ సద్వ్యసనంబైనది మానకుంటిని సమస్యాపూరణం బయ్యయో!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
రాత్రి పగలన్న భేదము రగుల దింకఅన్న పానము లన్నియు నమరవింకపాడుజేసెను కవులను పనిగనిదియెవ్యసనమిది సమస్యా పూరణా చరణము++++++++++€++++++++++++రావెల పురుషోత్తమరావు
కసిగన్ వ్రాయగ సిధ్ధమైతి మరి సాకారమ్ము కాకున్నదేవ్యసనంబైనది మానకుంటిని సమస్యాపూరణం బయ్యయోదిశనుం చూపుచు నీదు బిడ్డకును సందేహమ్ము తీర్చంగదే శిశుకున్ ఛందము నేర్పవమ్మ పద రాశీభూత వీణాధరీ...భారతీనాథ్ చెన్నంశెట్టి...
విసుగే లేక నిరంతరాయముగ సద్విద్యా సమారాధనన్వెస సృష్టించుచు కైపదంబులనహా వేవేలుగా శంకరాదెస వీవౌచు సుపద్యవిద్యకిటు బంధింపంగ నా డెందమున్ వ్యసనంబైనది మానకుంటిని సమస్యాపూరణం బయ్యయో
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
పసయే గల్గు సమస్యలన్ తెలుపుచున్ ప్రజ్ఞానులన్ గోరుచున్అసమానమ్మగు కైతలన్ నిరతమాహ్వానంబునే జేయునౌవసినిన్ పొందిన శంకరాభరణమున్ పద్యమ్ములన్ జెప్పుటేవ్యసనంబైనది మానకుంటిని సమస్యాపూరణం బయ్యయో!
తేటగీతితొమ్మిదింటికి రాతిరి నమ్మకముగగూర్చి జంట సమస్యలన్ గురువు లొసఁగపూను కొందును నిష్టతో నేను, మంచివ్యసన మిది సమస్యాపూరణాచరణముమత్తేభవిక్రీడితముసిసలౌ పృచ్ఛక చక్రవర్తి యనగన్ జిందుంచుఁ దా జంటగాపసతో రాతిరి తొమ్మిదింట గురువుల్ పండన్ సమస్యల్ భళా!వెసఁ బూరింపఁగఁ బూనుకొందు సృజనన్ వీడన్ గదా! నేను సద్వ్యసనంబైనది మానకుంటిని సమస్యాపూరణం బయ్యయో!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
సమస్య :వ్యసనం బైనది మానకుంటిని సమ స్యాపూరణం బయ్యయో ( సమస్యాపూరణ రంధిలో పడి ఏమీ పట్టించుకోని భర్తను ప్రశ్నిస్తున్న భార్య - భర్త సమాధానం )మత్తేభవిక్రీడితము ----------------" విసువౌచున్నది నిన్ను గాంచిన నికన్ వీరంగ మెన్నాళ్లయా ?పసివాండ్రన్ నను నైన గాంచవు ; మహా పద్మాసనం బందునన్ గసితో గూర్చుని కాలమున్ గడుప నా కర్మంబ ! భాషింపుమా ! " " వ్యసనం బైనది ; మానకుంటిని ; సమ స్యాపూరణం బయ్యయో !! “
వెస సత్ప్రేరణ గల్గఁ జేయు, నిడు సంవిద్దీప్తరమ్యోక్తులన్,దొసగుల్ దూరని యట్లు వ్రాయు గరిమన్ దోరంపు భావమ్ములన్లసమానమ్ములఁ గూర్పుఁ గూర్చును, దగన్ లాలిత్యమేపార సువ్యసనంబైనది మానకుంటిని సమస్యాపూరణం బయ్యయోకంజర్ల రామాచార్య.
మ: నిశితంబై గణ భావదోషములు ప్రశ్నించంగ నిర్ద్వంద్వమైవిసుగే లేకను నేకధాటిగ వెసన్ వీక్షింపగా శంకరుల్దెస మారెంగద వ్రాయ పద్దెములు సందేహమ్ములన్ దీర్పగావ్యసనంబైనది మానకుంటిని సమస్యా పూరణం బయ్యయోవై. చంద్రశేఖర్
ధన్యవాదములు
కె.వి.యస్. లక్ష్మి: కవుల కలముల పదములు కదను ద్రొక్కి పరుగు లిడుచుండు పండిత ప్రాభవమ్ము సతము శంకరాభరణపు జగతి నందువ్యసన మిది సమస్యాపూరణాచరణము
విరించి.బంధువింటికి వచ్చినన్ బలకరింపడయ్యె పద్యాల రచనయె ధ్యాస నయ్యె ముద్ధు మురిపాల వీడిన మొగుడి కింకవ్యసనమది సమస్యా పూరణాచరణము.
విరించి.విసుగున్ జెందక వ్రాయుచున్న తరి నా బింబోష్ఠి యే పిల్వగావసిగా కీర్తిని బెంచునట్టి రచనా వ్యాసంగమున్ వీడకన్ మసలాడిన్ నిరసించితిన్ గదర యేమంచున్ వచింపన్ గనన్ వ్యసనంబైనది మానకుంటిని సమస్యాపూరణం బయ్యయో!
రసికులకు సమస్యాపూరణ సమయమిదిరాత్రి తొమ్మిదిగంటల కాత్ర పడుచుతెలుగువెలుగులతోడసంతృప్తినొందువ్యసనమిది సమస్యాపూరణాచరణము
శంకరార్యులు ఛాత్రుల శంకలెల్లదీర్చి ప్రోత్సాహమందించి దినదినమ్ముపద్య విద్యను గరపెడు భవ్యమైనవ్యసన మిది సమస్యాపూరణాచరణము
రాత్రిపూట దొమ్మిది గంటల సమయమునగబగబ గురుదేవులిడిన కైపదమునుగనిన గాని ముద్ద దిగదే ! కఠిన మైనవ్యసన మిది సమస్యాపూరణాచరణము
కసితో పద్యము లల్ల డెందమున నే గాంక్షించి నంతన్ సదా రసనన్ దాల్చుచు శంకరార్యు లిడగా రమ్యంపు ప్రశ్నల్, గొనం గ సమాధానము, మేటి పద్య ముల సంకల్పించుటే నాకు సద్వ్యసనంబైనది మానకుంటిని సమస్యాపూరణం బయ్యయో
గురువర్యులకు నమస్సులు, ధన్యవాదములు.
రసమున్ జిందెడు పద్యవిద్యనిట ప్రారంభించు విద్యార్ధినైవిసువున్ జెందక శంకరార్యులిట వేవేగంబు సంధింపగానసమానంబగు ప్రజ్ఞతో బుధుల నాయాసంబు బూరింప సద్వ్యసనంబైనది మానకుంటిని సమస్యాపూరణం బయ్యయో
వ్యసనమది పూవులకు తావి వ్యాప్తిజేయవ్యసనమది తేటులకు దేనె నందుకొనగవ్యసనమది శంకరులకు ప్రశ్నజేయవ్యసనమిది సమస్యాపూర ణాచరణము
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. తేటగీతి మూడవ పాదంలో గణభంగం. "వ్యసన మదియె శంకరులకు..." అనండి
ధన్యాస్మి గురుదేవా! సవరించెదను!🙏🙏🙏
సవరణతోవ్యసనమది పూవులకు తావి వ్యాప్తిజేయవ్యసనమది తేటులకు దేనె నందుకొనగవ్యసనమదియె శంకరులకు ప్రశ్నజేయవ్యసనమిది సమస్యాపూర ణాచరణము
విసుగేబుట్టగనీదులే, మిగులుగావీక్షించసెల్ఫోనులోకసిరే భార్యకు కారణమ్మునది,యేకాలాన బాధించినన్ముసిరేయెండలు కానగానితడిటన్, మూర్ధన్యుడేతాననన్వ్యసనంబైనది మానకుంటిని,సమస్యాపూరణం బయ్యయో+++++++++++++++++++++రావెల పురుషోత్తమరావు
వ్యసనంబాయిది ?వ్యావృతా !! సకల మౌ వ్యాపారముల్ జాగవన్రసమున్ జిందగసాధ్యమేననుచు,తారంజింల్లులే భాషణల్మిసిమింజిందుచుమీసముల్,మెలుచులే మీతావులన్ గాంచుచోవ్యసనంబైనది మానకుంటిని,సమస్యాపూరణం బయ్యయో+++++++++++++++++++++రావెల పురుషోత్తమరావు
కసిగాపద్యములల్లుచున్ ప్రతిభతో కార్యాన లంఘించుచున్విసుగేలేనటువంటిదీ విషయమేనే విన్నాణమున్ గాంచినన్పసయేలేదనిజెప్పగాదగదు నేప్రావీణ్యమున్ జూచినన్వ్యసనంబైనది మానకుంటినిసమస్యాపూరణం బయ్యయో+++++++++++++++++++++రావెల పురుషోత్తమరావు
మీ పై మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు. నా వ్యాఖ్యలను వాట్సప్ సమూహంలో చూడండి.
విరించి.అసిధారా వ్రతమట్లు నెంచి రచనా వ్యాసంగమున్ మున్గగామసలాడిన్ నిరసించినాననుచు నామర్షమ్ముతో నామెయేరసహీనంబగు జీవితమ్మనుచు పోరాటమ్మె నిత్యమ్ముగావ్యసనంబైనది మానకుంటిని సమస్యాపూరణం బయ్యయో!
విరించి.ముద్దులాడగ రాడయ్యె మొగుడదేమొయర్థరాత్రులు దాటినన్ వ్యర్థముగనుకలము కాగితములతోడ గడుపుచుండెవ్యసనమది సమస్యా పూరణాచరణము.
అసమర్ధుండగు నాకు సద్విపుల సౌహార్ద్రంపు వాత్సల్యమేప్రసరింపన్ గురుశంకరార్యులు దయార్ద్రంబైన చిత్తంబుతోనసిధారావ్రతమట్లు పూరణములన్ నందంబుగా నేర్పగన్వ్యసనంబైనది మానకుంటిని సమస్యాపూరణం బయ్యయో
అసిధారావ్రతదీక్షతోనిచటనాహారంబుదాహంబునైబసవన్దోడుతబంధుమిత్రులునుసద్భావంపుసస్యంబునైవసివాడంగనువ్యాపకంబులవినిస్వార్థంపుజీవంబునైవ్యసనంబైనది మానకుంటిని సమస్యాపూరణం బయ్యయోకొరుప్రోలు రాధాకృష్ణ రావు
కసితో దప్పక పూరణంబునుసదాగావించు నాకిప్పుడున్వ్యసనంబైనది మానకుంటిని సమస్యా పూరణంబయ్యయోదొసగుల్ జర్గుచునుండె నిప్పటికి నా దుర్లక్ష్య భావంబుచేదెస జూపించుము శంకరార్యనిడెదన్ ధీతేజ! కైమోడ్పులున్.
వ్యసనమిది సమస్యాపూరణా చరణముసత్య మయ్యది జూడగ శంకరార్య! లేని దినమది దుద్దిన మౌను మాకుకనుల విందౌను గనిపించ దినము దినము
విసుగుం జెందక ప్రత్యహంబునిట దేవేరిన్ మనంబందునన్ నసమానంబగు రీతినిన్ దలచి యాహాహా యనంగానికన్ బసయౌనట్లుగ వ్రాయబూనుదును నాపద్యంబు లన్నింటినిన్ వ్యసనంబైనది మానకుంటిని సమస్యాపూరణంబయ్యయో
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "మనంబందు తా నసమానంబగు" అనండి.
బాలునకు నిత్య మాడుట వ్యసన మౌను నాయకునకు వ్యసన ముపన్యాస మౌను దెనుఁగు కవికి దినదినమ్ము తీర నట్టి వ్యసన మిది సమస్యాపూరణాచరణము దిస లెల్లం గనఁ బెర్గె కయ్యము లహో తీవ్రమ్ముగా నిత్య మాకస మంటంగ మదీయ ఘోర రసనా కండూతి పెంపొందఁగానసమా నానుచిత ప్రగల్భ కువచో వ్యాసంగ సంయోగమే వ్యసనం బైనది మానకుంటిని సమస్యాపూరణం బయ్యయో [వ్యసనము = ఆపద; సమస్యా + ఆపూరణము = సమ స్యాపూరణము; సమస్యల నంతట నిండించుట]
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పసగా వ్రాయగ పద్యముల్ కవుల సంభావించుచున్, నర్మిలిన్దెస చూపించుచు నిత్యమున్ దొసగులన్ దిద్దింపగా నొజ్జ తాన్కసితో సేద్యము సల్పి పాదముల నాకాంక్షించి పూరింప సద్వ్యసనంబైనది మానకుంటిని సమస్యాపూరణం బయ్యయో
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "సంభావించి తా నర్మిలిన్" అనండి బాగుంటుంది.
పద్యకవులకిదియుగొప్పవరమునయ్యెవడిసమస్యలపూరించి పంపవలయుననెడి కౌతుకమది హెచ్చె నహరహమ్మువ్యసనమిది సమస్యా పూరణాచరణముమరొక పూరణనిదుర మత్తును వీడుచు నెమ్మి తోడ పూరణములను చేయంగ బుద్ధి పుట్టివ్రాసితీరవలయునను వాంఛ పెంచు వ్యసనమిది సమస్యా పూరణాచరణము
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిశంకరాభరణమునందు సభ్యులైన
సుకవి మిత్రుల కెల్లను శోభ నిడుచు
జ్ఞానమును సానబెట్టెడి చక్కనిదగు
వ్యసనమిది సమస్యాపూరణాచరణము.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచక్క నైనట్టి వేదిక దక్కె మాకు
రిప్లయితొలగించండిపూరణంబుల నొనర్చు బుణ్య మనగ
శంక రాభరణము బుట్టి శక్తి బెంచు
వ్యసన మిది సమస్యా పూర ణా చరణము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరెండవ పాదంలో గణభంగం. "పూరణంబుల నొనరించు.." అనండి.
సమసిపోవునుతలపులుశాంతికలుగు
రిప్లయితొలగించండిశంకరాచార్యుభావమేశరణుమనకు
తోషమందుచువిడమర్చిదోయిలింప
వ్యసనమిదిసమస్యాపూరణాచరణము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమద్య మలవాటు పడినట్టి మానవుండు
రిప్లయితొలగించండిరాత్రి నిదురకున్ జేరడు రమ్యగతిని,
పద్య కండూతి గలిగిన పండితుండు
పక్క నెక్కజాలడుగదా పద్య మొకటి
వ్రాయకున్న ,మెదడెపుడు పట్టుబట్టు
గా సమస్య లనందరి కన్నవేగ
వంతముగ పూరణము చేయ వలయు ననుచు
వ్యసనమిది సమస్యా పూరణాచరణము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికసిగానిచ్చినప్రశ్నకున్కదలిశంకల్మానిశోధించుచున్
రిప్లయితొలగించండిససిగాపద్యపుభావమున్దెలుపగాసాధ్యంపుటాలోచనల్
ముసురన్బుద్ధినిముందుగాపలుకనేమూగెన్గదాఛందమే
వ్యసనంబైనదిమానకుంటినిసమస్యాపూరణంబయ్యయో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅసలే పద్యము వ్రాయజాలనపు డా
హా! నాదు మిత్రోత్తముల్
దెస జూపించిరి, దారియున్దెలిపె, సం
దీప్తి న్పదాలల్లగన్,
వెసతో నిచ్చట శంకరాభరణము
న్ప్రీతిన్ సమర్చించ స
ద్వ్యసనంబైనది మానకుంటిని సమ
స్యాపూరణం బయ్యయో!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిరాత్రి పగలన్న భేదము రగుల దింక
రిప్లయితొలగించండిఅన్న పానము లన్నియు నమరవింక
పాడుజేసెను కవులను పనిగనిదియె
వ్యసనమిది సమస్యా పూరణా చరణము
++++++++++€++++++++++++
రావెల పురుషోత్తమరావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికసిగన్ వ్రాయగ సిధ్ధమైతి మరి సాకారమ్ము కాకున్నదే
రిప్లయితొలగించండివ్యసనంబైనది మానకుంటిని సమస్యాపూరణం బయ్యయో
దిశనుం చూపుచు నీదు బిడ్డకును సందేహమ్ము తీర్చంగదే
శిశుకున్ ఛందము నేర్పవమ్మ పద రాశీభూత వీణాధరీ
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివిసుగే లేక నిరంతరాయముగ సద్విద్యా సమారాధనన్
రిప్లయితొలగించండివెస సృష్టించుచు కైపదంబులనహా వేవేలుగా శంకరా
దెస వీవౌచు సుపద్యవిద్యకిటు బంధింపంగ నా డెందమున్
వ్యసనంబైనది మానకుంటిని సమస్యాపూరణం బయ్యయో
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపసయే గల్గు సమస్యలన్ తెలుపుచున్ ప్రజ్ఞానులన్ గోరుచున్
తొలగించండిఅసమానమ్మగు కైతలన్ నిరతమాహ్వానంబునే జేయునౌ
వసినిన్ పొందిన శంకరాభరణమున్ పద్యమ్ములన్ జెప్పుటే
వ్యసనంబైనది మానకుంటిని సమస్యాపూరణం బయ్యయో!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండితొమ్మిదింటికి రాతిరి నమ్మకముగ
గూర్చి జంట సమస్యలన్ గురువు లొసఁగ
పూను కొందును నిష్టతో నేను, మంచి
వ్యసన మిది సమస్యాపూరణాచరణము
మత్తేభవిక్రీడితము
సిసలౌ పృచ్ఛక చక్రవర్తి యనగన్ జిందుంచుఁ దా జంటగా
పసతో రాతిరి తొమ్మిదింట గురువుల్ పండన్ సమస్యల్ భళా!
వెసఁ బూరింపఁగఁ బూనుకొందు సృజనన్ వీడన్ గదా! నేను స
ద్వ్యసనంబైనది మానకుంటిని సమస్యాపూరణం బయ్యయో!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండివ్యసనం బైనది మానకుంటిని సమ
స్యాపూరణం బయ్యయో
( సమస్యాపూరణ రంధిలో పడి ఏమీ పట్టించుకోని భర్తను ప్రశ్నిస్తున్న భార్య - భర్త సమాధానం )
మత్తేభవిక్రీడితము
----------------
" విసువౌచున్నది నిన్ను గాంచిన నికన్
వీరంగ మెన్నాళ్లయా ?
పసివాండ్రన్ నను నైన గాంచవు ; మహా
పద్మాసనం బందునన్
గసితో గూర్చుని కాలమున్ గడుప నా
కర్మంబ ! భాషింపుమా ! "
" వ్యసనం బైనది ; మానకుంటిని ; సమ
స్యాపూరణం బయ్యయో !! “
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివెస సత్ప్రేరణ గల్గఁ జేయు, నిడు సంవిద్దీప్తరమ్యోక్తులన్,
రిప్లయితొలగించండిదొసగుల్ దూరని యట్లు వ్రాయు గరిమన్
దోరంపు భావమ్ములన్
లసమానమ్ములఁ గూర్పుఁ గూర్చును, దగన్ లాలిత్యమేపార సు
వ్యసనంబైనది మానకుంటిని సమస్యాపూరణం బయ్యయో
కంజర్ల రామాచార్య.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమ:
రిప్లయితొలగించండినిశితంబై గణ భావదోషములు ప్రశ్నించంగ నిర్ద్వంద్వమై
విసుగే లేకను నేకధాటిగ వెసన్ వీక్షింపగా శంకరుల్
దెస మారెంగద వ్రాయ పద్దెములు సందేహమ్ములన్ దీర్పగా
వ్యసనంబైనది మానకుంటిని సమస్యా పూరణం బయ్యయో
వై. చంద్రశేఖర్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండికె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించండికవుల కలముల పదములు కదను ద్రొక్కి
పరుగు లిడుచుండు పండిత ప్రాభవమ్ము
సతము శంకరాభరణపు జగతి నందు
వ్యసన మిది సమస్యాపూరణాచరణము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివిరించి.
రిప్లయితొలగించండిబంధువింటికి వచ్చినన్ బలకరింప
డయ్యె పద్యాల రచనయె ధ్యాస నయ్యె
ముద్ధు మురిపాల వీడిన మొగుడి కింక
వ్యసనమది సమస్యా పూరణాచరణము.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండివిరించి.
విసుగున్ జెందక వ్రాయుచున్న తరి నా బింబోష్ఠి యే పిల్వగా
వసిగా కీర్తిని బెంచునట్టి రచనా వ్యాసంగమున్ వీడకన్
మసలాడిన్ నిరసించితిన్ గదర యేమంచున్ వచింపన్ గనన్
వ్యసనంబైనది మానకుంటిని సమస్యాపూరణం బయ్యయో!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరసికులకు సమస్యాపూరణ సమయమిది
రిప్లయితొలగించండిరాత్రి తొమ్మిదిగంటల కాత్ర పడుచు
తెలుగువెలుగులతోడసంతృప్తినొందు
వ్యసనమిది సమస్యాపూరణాచరణము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశంకరార్యులు ఛాత్రుల శంకలెల్ల
రిప్లయితొలగించండిదీర్చి ప్రోత్సాహమందించి దినదినమ్ము
పద్య విద్యను గరపెడు భవ్యమైన
వ్యసన మిది సమస్యాపూరణాచరణము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరాత్రిపూట దొమ్మిది గంటల సమయమున
రిప్లయితొలగించండిగబగబ గురుదేవులిడిన కైపదమును
గనిన గాని ముద్ద దిగదే ! కఠిన మైన
వ్యసన మిది సమస్యాపూరణాచరణము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికసితో పద్యము లల్ల డెందమున నే గాంక్షించి నంతన్ సదా
రిప్లయితొలగించండిరసనన్ దాల్చుచు శంకరార్యు లిడగా రమ్యంపు ప్రశ్నల్, గొనం
గ సమాధానము, మేటి పద్య ముల సంకల్పించుటే నాకు స
ద్వ్యసనంబైనది మానకుంటిని సమస్యాపూరణం బయ్యయో
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిగురువర్యులకు నమస్సులు, ధన్యవాదములు.
తొలగించండిరసమున్ జిందెడు పద్యవిద్యనిట ప్రారంభించు విద్యార్ధినై
రిప్లయితొలగించండివిసువున్ జెందక శంకరార్యులిట వేవేగంబు సంధింపగా
నసమానంబగు ప్రజ్ఞతో బుధుల నాయాసంబు బూరింప స
ద్వ్యసనంబైనది మానకుంటిని సమస్యాపూరణం బయ్యయో
వ్యసనమది పూవులకు తావి వ్యాప్తిజేయ
తొలగించండివ్యసనమది తేటులకు దేనె నందుకొనగ
వ్యసనమది శంకరులకు ప్రశ్నజేయ
వ్యసనమిది సమస్యాపూర ణాచరణము
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండితేటగీతి మూడవ పాదంలో గణభంగం. "వ్యసన మదియె శంకరులకు..." అనండి
ధన్యాస్మి గురుదేవా! సవరించెదను!🙏🙏🙏
తొలగించండిసవరణతో
తొలగించండివ్యసనమది పూవులకు తావి వ్యాప్తిజేయ
వ్యసనమది తేటులకు దేనె నందుకొనగ
వ్యసనమదియె శంకరులకు ప్రశ్నజేయ
వ్యసనమిది సమస్యాపూర ణాచరణము
విసుగేబుట్టగనీదులే, మిగులుగావీక్షించసెల్ఫోనులో
రిప్లయితొలగించండికసిరే భార్యకు కారణమ్మునది,యేకాలాన బాధించినన్
ముసిరేయెండలు కానగానితడిటన్, మూర్ధన్యుడేతాననన్
వ్యసనంబైనది మానకుంటిని,సమస్యాపూరణం బయ్యయో
+++++++++++++++++++++
రావెల పురుషోత్తమరావు
వ్యసనంబాయిది ?వ్యావృతా !! సకల మౌ వ్యాపారముల్ జాగవన్
రిప్లయితొలగించండిరసమున్ జిందగసాధ్యమేననుచు,తారంజింల్లులే భాషణల్
మిసిమింజిందుచుమీసముల్,మెలుచులే మీతావులన్ గాంచుచో
వ్యసనంబైనది మానకుంటిని,సమస్యాపూరణం బయ్యయో
+++++++++++++++++++++
రావెల పురుషోత్తమరావు
కసిగాపద్యములల్లుచున్ ప్రతిభతో కార్యాన లంఘించుచున్
రిప్లయితొలగించండివిసుగేలేనటువంటిదీ విషయమేనే విన్నాణమున్ గాంచినన్
పసయేలేదనిజెప్పగాదగదు నేప్రావీణ్యమున్ జూచినన్
వ్యసనంబైనది మానకుంటినిసమస్యాపూరణం బయ్యయో
+++++++++++++++++++++
రావెల పురుషోత్తమరావు
మీ పై మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండినా వ్యాఖ్యలను వాట్సప్ సమూహంలో చూడండి.
రిప్లయితొలగించండివిరించి.
అసిధారా వ్రతమట్లు నెంచి రచనా వ్యాసంగమున్ మున్గగా
మసలాడిన్ నిరసించినాననుచు నామర్షమ్ముతో నామెయే
రసహీనంబగు జీవితమ్మనుచు పోరాటమ్మె నిత్యమ్ముగా
వ్యసనంబైనది మానకుంటిని సమస్యాపూరణం బయ్యయో!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండివిరించి.
ముద్దులాడగ రాడయ్యె మొగుడదేమొ
యర్థరాత్రులు దాటినన్ వ్యర్థముగను
కలము కాగితములతోడ గడుపుచుండె
వ్యసనమది సమస్యా పూరణాచరణము.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅసమర్ధుండగు నాకు సద్విపుల సౌహార్ద్రంపు వాత్సల్యమే
రిప్లయితొలగించండిప్రసరింపన్ గురుశంకరార్యులు దయార్ద్రంబైన చిత్తంబుతో
నసిధారావ్రతమట్లు పూరణములన్ నందంబుగా నేర్పగన్
వ్యసనంబైనది మానకుంటిని సమస్యాపూరణం బయ్యయో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅసిధారావ్రతదీక్షతోనిచటనాహారంబుదాహంబునై
రిప్లయితొలగించండిబసవన్దోడుతబంధుమిత్రులునుసద్భావంపుసస్యంబునై
వసివాడంగనువ్యాపకంబులవినిస్వార్థంపుజీవంబునై
వ్యసనంబైనది మానకుంటిని సమస్యాపూరణం బయ్యయో
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికసితో దప్పక పూరణంబును
రిప్లయితొలగించండిసదాగావించు నాకిప్పుడున్
వ్యసనంబైనది మానకుంటిని స
మస్యా పూరణంబయ్యయో
దొసగుల్ జర్గుచునుండె నిప్పటి
కి నా దుర్లక్ష్య భావంబుచే
దెస జూపించుము శంకరార్య
నిడెదన్ ధీతేజ! కైమోడ్పులున్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివ్యసనమిది సమస్యాపూరణా చరణము
రిప్లయితొలగించండిసత్య మయ్యది జూడగ శంకరార్య!
లేని దినమది దుద్దిన మౌను మాకు
కనుల విందౌను గనిపించ దినము దినము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివిసుగుం జెందక ప్రత్యహంబునిట దేవేరిన్ మనంబందునన్
రిప్లయితొలగించండినసమానంబగు రీతినిన్ దలచి యాహాహా యనంగానికన్
బసయౌనట్లుగ వ్రాయబూనుదును నాపద్యంబు లన్నింటినిన్
వ్యసనంబైనది మానకుంటిని సమస్యాపూరణంబయ్యయో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"మనంబందు తా నసమానంబగు" అనండి.
బాలునకు నిత్య మాడుట వ్యసన మౌను
రిప్లయితొలగించండినాయకునకు వ్యసన ముపన్యాస మౌను
దెనుఁగు కవికి దినదినమ్ము తీర నట్టి
వ్యసన మిది సమస్యాపూరణాచరణము
దిస లెల్లం గనఁ బెర్గె కయ్యము లహో తీవ్రమ్ముగా నిత్య మా
కస మంటంగ మదీయ ఘోర రసనా కండూతి పెంపొందఁగా
నసమా నానుచిత ప్రగల్భ కువచో వ్యాసంగ సంయోగమే
వ్యసనం బైనది మానకుంటిని సమస్యాపూరణం బయ్యయో
[వ్యసనము = ఆపద; సమస్యా + ఆపూరణము = సమ స్యాపూరణము; సమస్యల నంతట నిండించుట]
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపసగా వ్రాయగ పద్యముల్ కవుల సంభావించుచున్, నర్మిలిన్
రిప్లయితొలగించండిదెస చూపించుచు నిత్యమున్ దొసగులన్ దిద్దింపగా నొజ్జ తాన్
కసితో సేద్యము సల్పి పాదముల నాకాంక్షించి పూరింప స
ద్వ్యసనంబైనది మానకుంటిని సమస్యాపూరణం బయ్యయో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"సంభావించి తా నర్మిలిన్" అనండి బాగుంటుంది.
పద్యకవులకిదియుగొప్పవరమునయ్యె
రిప్లయితొలగించండివడిసమస్యలపూరించి పంపవలయు
ననెడి కౌతుకమది హెచ్చె నహరహమ్ము
వ్యసనమిది సమస్యా పూరణాచరణము
మరొక పూరణ
నిదుర మత్తును వీడుచు నెమ్మి తోడ
పూరణములను చేయంగ బుద్ధి పుట్టి
వ్రాసితీరవలయునను వాంఛ పెంచు
వ్యసనమిది సమస్యా పూరణాచరణము