2, జనవరి 2022, ఆదివారం

సమస్య - 3950

3-1-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బారునుఁ గనినంత మనము పర్వులు వెట్టెన్”
(లేదా...)
“బారునుఁ జూడఁగానె మది పర్వులు వెట్టిన వింత యెట్లగున్”
(గంగాపురం యజ్ఞభగవాన్ గారికి ధన్యవాదాలతో...)

76 కామెంట్‌లు:

 1. కందం
  వారలు పుట్టినది మొదలు
  గూరిమి నిడ్డెములతోడ గుతుకమునఁ దినన్
  నేరిచిరన సుధవలె సాం
  బారునుఁ గనినంత మనము పర్వులు వెట్టెన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉత్పలమాల
   వారలు బాల్యమందు నలవాటుగ నేరిచి కౌతుకమ్మునన్
   మేరలు లేక యిడ్డెముల మ్రింగగ నొప్పఁగ నందునద్దియున్
   కూరిమి కందిపప్పునిడి కూరిచి చాలగ చింతపండు సాం
   బారునుఁ జూడఁగానె మది పర్వులు వెట్టిన వింత యెట్లగున్?

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 2. కోరుచు రుచి కరము సతము
  నోరూరు చు నుండ నొకడు నొప్పి యనక దా
  నూరు వదలి వెళ్లగ సాం
  బారును గనినంత మనము పర్వులు వెట్టెన్

  రిప్లయితొలగించండి
 3. పేరొందిన కవులందఱు
  వారలు రచియించినట్టి పద్యాలను నో
  రారగ పఠియించెడు,ద
  ర్బారును గనినంత మనము పర్వులు పెట్టెన్.

  రిప్లయితొలగించండి

 4. కోరితి ననుచును ప్రేమగ
  దారయె చేసెను మసాల తాళింపులతో
  నారాధనముల నట సాం
  బారును గనినంత మనము పర్వులు పెట్టెన్.

  రిప్లయితొలగించండి
 5. రిప్లయిలు
  1. పేరునపేరునతలచుచు
   వారింపగలేనివగనుపార్థుడుననిలో
   పేరిమిగురులనువీరుల
   బారునుగనినంతమనముపర్వులుపెట్టెన్

   తొలగించండి
 6. దారయె చేసె వంటలట దండిగ గోరితినేనటంచు తా
  పేరిమి తోడ పచ్చడులు వేపుడు కూరలు పిండివంటలున్
  భూరిగ నందుజూడ పలు ముక్కల గల్గిన బానసమ్ము సాం
  బారును జూడగానె మది పర్వులు పెట్టిన వింత యెట్లగున్.

  రిప్లయితొలగించండి
 7. చేరగచెన్నపట్టణముచెప్పగవచ్చునునిడ్లియందునసాం
  బారునుఁజూడగానెమదిపర్వులువెట్టినవింతయెట్లగున్.
  కారమునాంధ్రశాకమునుకానగగర్తపురీవనంబులో
  కోరుదురెల్లవారలునుకోబ్బరిబోండముకోనసీమలో

  రిప్లయితొలగించండి
 8. చారును, పప్పును, మరి సాం
  బారునుఁ గనినంత మనము పర్వులు వెట్టెన్
  నోరారా తిన నొక్కడు
  తారాడెను పెండ్లిబంతి స్థానము కొరకై.

  రిప్లయితొలగించండి
 9. శ్రీ రుచిరాంగులెల్లరును చేసెడు నృత్యము లొక్క వైపు,నౌ
  రౌర!స,రీ,గ,మా,ప,ద,ని,రాగము తీసెడు గాయకాళి,నో
  రార కవిత్వముంబలుకు నట్టి కవీశ్వరు లొప్పు రాజద
  ర్బారునుజూడగానె మది పర్వులు వెట్టిన వింత యెట్లగున్.

  రిప్లయితొలగించండి
 10. కందము:
  తీరుగ దారులు గని నా
  హారపు జాడపసిగట్టి యన్నిటి చెలిమిన్
  భారము లాగెడు చీమల
  “బారునుఁ గనినంత మనము పర్వులు వెట్టెన్”
  --కటకం వేంకటరామశర్మ.

  రిప్లయితొలగించండి
 11. కందం
  దూరముగా నున్న కళా
  కారుల బృందమును జూచి కరచాలన కై
  జేరగ ,నిల్చిన తారల
  బారుని గనినంత మనము పర్వులు వెట్టెన్

  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటర్.

  రిప్లయితొలగించండి
 12. ఆరయ తీరుతీరుగల యద్భత
  శాకము లెన్నియుండినన్
  సారపు పెర్గు పచ్చడలు సన్మతి
  తోడను ముందు పెట్టినన్
  గోరుచునుండె నామనసు గుమ్మగ
  వాసన గల్గినట్టి సాం
  బారుని జూడగానె మది పర్వులు
  వెట్టును వింత యెట్లగున్

  రిప్లయితొలగించండి
 13. వారలపార కోవిదులు వారలె వారికి సాటి విద్యలన్
  వారియమేయ కావ్యములు వావిరియైదనరారు నింకన
  వ్వారల పొత్తముల్ చదువ పాఠకలోకము తీయ దీర్ఘమౌ
  బారునుఁ, జూడఁగానె మది పర్వులు వెట్టిన వింత యెట్లగున్

  రిప్లయితొలగించండి
 14. తీరుగ కావ్యము వ్రాయగ
  బారులు తీయరె కొనుటకు పాఠకలోకం
  బారయ కవివర్యునకా
  బారునుఁ గనినంత మనము పర్వులు వెట్టెన్

  రిప్లయితొలగించండి
 15. పౌరుల వాసము మధ్యన
  బారునుఁ గనినంత మనము పర్వులు వెట్టెన్ ,
  గోరిక దీర్చ తలచియు
  గౌరవమడగునని యెంచి కడపితి
  నిచ్ఛన్

  రిప్లయితొలగించండి
 16. ఉత్పలమాల:
  కేరళ యందమేమి?!పరికించగ పశ్చిమమందరేబియా
  తీరము, దాని యందిసుక తిన్నెలు, కొబ్బరి చెట్ల గుంపులున్ ,
  బారుగ పేర్చినట్లు గిరిపంక్తులు, తోటలు గల్గినట్టి మల్
  “బారును జూడఁగానె మది పర్వులు వెట్టిన వింత యెట్లగున్”
  --కటకం వేంకటరామశర్మ.

  రిప్లయితొలగించండి
 17. (పల్లెకు పోదాం... పారును చూద్దాం... చలో చలో..)
  మారదు నా మనమ్ము వినుమా నగరమ్మున నుండి వచ్చినన్,
  చేరెద నిప్డు పార్వతికిఁ జిన్నతనంపు సఖుండ, కోరికల్
  దీరగ మాటలాడ వలెఁ దృప్తిగ నంచను దేవదాసు తాఁ
  బారునుఁ జూడఁగానె మది పర్వులు వెట్టిన వింత యెట్లగున్?

  రిప్లయితొలగించండి
 18. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 19. దూరపుయాత్రాస్థలిలో
  కోరినభక్ష్యము దొరుకని కుపితాత్మునికిన్
  నోరూరగ నిడ్లీసాం
  బారునుఁ గనినంత మనము పర్వులు వెట్టెన్

  రిప్లయితొలగించండి

 20. గారెలు, బూరెలు, పోలెలు,
  నోరూరెడి రవ్వలడ్డు, నువ్వుల యుండల్,
  తీరుగ ఫేణీ లలమిన
  బారునుఁ గనినంత మనము పర్వులు వెట్టెన్!


  చేరితి నా వనాంతరము
  చిత్ర విచిత్ర లతా ప్రసూనముల్,
  తీరెను, కెంపు లీనుచును,
  తీవియ లంచుల పల్లవమ్ములున్,
  చేరుచు శాఖలం దుముకు
  చిల్కల రంగుల హంగు పొంగులో,
  బారునుఁ జూడఁగానె, మది
  పర్వులు వెట్టిన! వింత యెట్లగున్?!

  బారు=సముహము

  రిప్లయితొలగించండి
 21. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 22. క్షీరాబ్ధి మునిగి తేలి
  క్షీరము గ్రోలుచు నెగురుచు తీరమునందున్
  పారిన చక్కని హంసల
  బారునుఁ గనినంత మనము పర్వులు వెట్టెన్

  గొర్రె రాజేందర్
  సిద్దిపేట

  రిప్లయితొలగించండి
 23. మూరెడు వలువలు దాల్చిన

  నారీ రత్నముల నర్తనమ్ములు మదిలో

  కోరిక లిడు సురపతి ద

  ర్బారును గనినంత మనము పర్వులు వెట్టెన్

  రిప్లయితొలగించండి
 24. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

  తీరుగ సేద్యము జేసిన
  సైరికునికట పొలమున సముదీర్ణముగా
  కూరిన పంటగు నా యం
  బారుని గనినంత మనము పర్వులు వెట్టెన్.

  రిప్లయితొలగించండి
 25. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

  తీరగు పంటరీతులను తెన్నుగ నాచరణమ్ము జేయగా
  కూరెను సేద్యమందు కడు గొప్పగ ధాన్యపు సస్యమెంతయున్
  సైరికుడద్ది గుర్తెరిగి సంతసమొందుచు క్షేత్రమందు నం
  బారునుఁ జూడఁగానె మది పర్వులు వెట్టిన వింత యెట్లగున్?

  రిప్లయితొలగించండి
 26. రిప్లయిలు
  1. నీరము లద్రులన్ వదలి నేలకు దూకు విలాసశోభలన్
   దూరగ వీలుగాని ద్రుమతోరణబంధురకాననమ్ములన్
   సారతరాంబుపూరములు శాద్వలసీమచరద్బకాళిదౌ
   బారునుఁ జూడఁగానె మది పర్వులు వెట్టిన వింత యెట్లగున్

   కంజర్ల రామాచార్య.

   తొలగించండి
  2. వారక మాధురీగుణసువాగ్విలసద్భవభూతిభాణ శృం
   గారకవీంద్రచంద్రులు ప్రకాశయశోవరకాళిదాసు చె
   ల్వారగ నొప్పు కావ్యరసలాలససత్కవిభోజరాజద
   ర్బారునుఁ జూడఁగానె మది పర్వులు వెట్టిన వింత యెట్లగున్

   కంజర్ల రామాచార్య

   తొలగించండి
  3. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 27. కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా:

  తీరుగ సాయిని మదిలో
  సౌరగు భక్తిని కొలుచుచు చప్పున శిరిడిన్
  చేరియు బాబా ఘన ద
  ర్బారును గనినంత మనము పర్వులు వెట్టెన్.

  రిప్లయితొలగించండి
 28. చేరి పొలమ్మునన్ బ్రకృతి సేద్యము చేయగ నిచ్చతోడ భూ
  సారము హెచ్చి కల్గె వ్యవసాయము నందునఁ బంట దండిగా
  నూరుచ కళ్ళమందున ననూన ఫలమ్ము ఘటిల్లె, కార్షు డం
  బారునుఁ జూడఁగానె మది పర్వులు వెట్టిన వింత యెట్లగున్

  రిప్లయితొలగించండి
 29. ఉ:బారుగ నున్న పక్షులను బాలుడు చూచుట వింత యెట్లగున్?
  బారును జూడ లాయరుకు పర్వులు వచ్చిన వింత యెట్లగున్?
  బారుకు త్రాగుబోతు పడి వచ్చుట వింతయె కాదు నేను సాం
  బారును జూడగానె మది పర్వులు వెట్టిన వింత యే మగున్?

  రిప్లయితొలగించండి
 30. కం:క్రూరతయు,నీసు,దురహం
  కారము గల మనుజ తతుల గాంచిన కనులన్
  తీరుగ సాగెడు పక్షుల
  బారును గనినంత మనము పర్వులు వెట్టెన్

  రిప్లయితొలగించండి
 31. ఏరును దాటెడు శర్మకు
  బారును గనినంత మనము పర్వులు వెట్టెన్
  మీరుచు హద్దులు,ద్రాగిన
  దూరముగానుండ్రు జనులు దోషిగ గనుచున్

  రిప్లయితొలగించండి
 32. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 33. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 34. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 35. వారక వహింప నిత్య మ
  పారమ్ముగ శ్రద్ధ పంట పండిన యంతం
  దోరముగా రైతున కం
  బారునుఁ గని నంత మనము పర్వులు వెట్టెన్

  [అంబారు = ధాన్య రాశి]


  భారము కాదె యేరికిని భార్యయె దూరము నందు నుండినన్
  మూరిన వేళఁ బ్రేమ కడు ముద్దుగఁ బిల్చును భర్త యింపుగాఁ
  బా రని భార్య పార్వతిని వచ్చినఁ దాఁ జని పుట్టి నింటికిం
  బారునుఁ జూడఁగానె మది పర్వులు వెట్టిన వింత యెట్లగున్

  రిప్లయితొలగించండి
 36. బారులుజూడగా మనముపర్వులు వెట్టుట సాజమేగదా
  వారును వీరుగాక బ్రతి వారును బారును దేవళంబుగా
  నారసి పోవుచుండుచును హర్షము నొందుచు నుండు గావుతన్
  బారును జూడగానెమది పర్వులు వెట్టిన వింత యెట్లగున్

  రిప్లయితొలగించండి
 37. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  'నగర దారులు' దుష్టసమాసం.

  రిప్లయితొలగించండి
 38. యూరపు యాత్రనంగ మనసువ్విళులూరె రయంబునేగితిన్
  కారము లేని పాకముల కక్కక మింగక మెక్కి వచ్చితిన్
  కూరలు పప్పు పచ్చడులు గుమ్మడి ముక్కల ధప్పళంబు సాం
  బారునుఁ జూడఁగానె మది పర్వులు వెట్టిన వింత యెట్లగున్

  రిప్లయితొలగించండి