26, జనవరి 2022, బుధవారం

సమస్య - 3974

 27-1-2022 (గురువారం)
కవిమిత్రులారా,
(అవధాన ప్రక్రియను అందలమెక్కించి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న ధారణా బ్రహ్మరాక్షసుడు గరికిపాటి నరసింహరావు గారికి అభినందనలు)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గరిక పాటి సేయఁడు గదా గరికిపాటి”
(ఈ తేటగీతి సమస్య గతంలో శంకరాభరణంలో ఇచ్చిందే. 

సందర్భశుద్ధి ఉందని 'ఉత్సాహం'గా తిరిగి ఇస్తున్నాను)
(లేదా...)
“గరిక పాటి సేయునొక్కొ గరికిపాటి సూడఁగన్”

40 కామెంట్‌లు:

  1. మేరు నగధీరు డైనట్టి మేటి యగుచు
    ధార యందున దారణ న్ దక్షు డతడు
    గొప్ప యవధాని యై వెల్గె కోవిదుండు
    గరిక పాటి సేయడు గరిక పాటి

    రిప్లయితొలగించండి

  2. శుక్ల మెచ్చిన గారాల సుతుడతండు

    జాతి గర్వించదగినట్టి సర్వరసుడు

    గరికపాటి, సేయఁడు గదా గరికి పాటి

    తప్పిదనమునతం డవధానమందు.

    రిప్లయితొలగించండి
  3. విద్యనేర్పుచువినయంబు పేర్చుచుండు
    అన్నిపూరణలందునసున్నితముగ
    ధారపద్యసుగంధాలు తాపుచుండ
    గరికపాటి సేయడు గదా గరికి పాటి

    మీ దివాకర శాస్త్రి
    వికారాబాద్

    రిప్లయితొలగించండి

  4. సరసిజభవు రాణి మెచ్చు స్వజుడతండు మేటి స

    ర్వరసుడంచు తెలుగుజాతి ప్రస్తుతించు ఘనుడె యౌ

    గరికపాటి సేయు నొక్క గరికి పాటి సూడగన్

    నెరయు నంచు గాంచఁ , గనము నిక్కమిదియె నమ్ముమా

    రిప్లయితొలగించండి
  5. తేట తెలుగు పద్యాల పూఁదోట లోన
    తేనె లెల్లను గ్రోలంగఁదిరుగు తేటి
    “గరికపాటి”,సేయడుగదా!గరికి పాటి
    సాటి వచ్చునుగా పల్కు బోటి తోడ.

    రిప్లయితొలగించండి
  6. వేయిమందిగ గలబడు బృచ్ఛ కులను
    మార్కొ ని యొకండె కావించు మైకొనంగ ;
    నొంటరిగ వచ్చి యెదురించు యోధ ముందు
    గరిక పాటి సేయఁడు గదా గరికిపాటి

    రిప్లయితొలగించండి
  7. వరుసగ నవధానములు ,సెబాసనంగఁజేయరే!
    మరియు ప్రవచనాలుఁజేసి మన్ననలను గాంచరే!
    “గరికపాటి”,సేయునొక్క గరికి పాటి?సూడగన్
    సరస భాషణా చతురుఁడు సకల శాస్త్ర నిపుణుఁడున్.

    రిప్లయితొలగించండి
  8. అవధాన కళలోన నారితేరిన వాడు
    .........ధారణా బ్రహ్మయై తనరు వాడు
    పద్యాలు కావ్యాలు హృద్యమౌ విషయాలు
    .........పాఠక జనులకు పంచు వాడు
    తర్కము వేదము తనదైన శైలితో
    .........ప్రవచన కారుడై ప్రబలు వాడు
    నీతినే బోధించి ఖ్యాతి నొందినవాడు
    .........శ్రోతల హృదయాల చోరు డతడు

    తనను వలచి 'పద్మశ్రీ'యె తరలిరాగ
    కాంతి దీపించె గద పురస్కారమునకు
    కరి యుదర పోషణమ్ముకై కలయజూడ
    గరిక పాటి సేయఁడు గదా గరికిపాటి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "పోషణమునకై" అనండి.

      తొలగించండి
    2. సవరణతో...

      అవధాన కళలోన నారితేరిన వాడు
      .........ధారణా బ్రహ్మయై తనరు వాడు
      పద్యాలు కావ్యాలు హృద్యమౌ విషయాలు
      .........పాఠక జనులకు పంచు వాడు
      తర్కము వేదము తనదైన శైలితో
      .........ప్రవచన కారుడై ప్రబలు వాడు
      నీతినే బోధించి ఖ్యాతి నొందినవాడు
      .........శ్రోతల హృదయాల చోరు డతడు

      తనను వలచి 'పద్మశ్రీ'యె తరలిరాగ
      కాంతి దీపించె గద పురస్కారమునకు
      కరి యుదర పోషణమునకై కలయజూడ
      గరిక పాటి సేయఁడు గదా గరికిపాటి

      తొలగించండి
  9. ఉరక లేయు గంగ నదుమ నుగ్రుడొకడు కావలెన్
    ధరను తెలుగు గంగ విడువ ధారణాసురుండిలన్
    చరిత కెక్కు పూరణంబు చతురతన్ సమస్యయే
    గరిక పాటి సేయునొక్కొ గరికిపాటి సూడఁగన్

    రిప్లయితొలగించండి
  10. తేటగీతి
    భాష పరిఢవిల్ల వధాన ప్రస్తుతిఁ గొని
    జాతి మేల్కొల్ప సత్ప్రవచనుఁడగుచును
    బ్రభుత మెచ్చి పద్మశ్రీనలంకరింప
    గరిక పాటి సేయఁడు గదా గరికిపాటి! ?

    ఉత్సాహము
    వరలి ధారణంపు బ్రహ్మ రాక్షసుఁడను పేరిటన్
    నిరత సత్ప్రవచన బోధ నిల్చు పండితుండనన్
    మెరయ, ప్రభుత నాదరించి మేటి పద్మమీయఁగన్
    గరిక పాటి సేయునొక్కొ? గరికిపాటి సూడఁగన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ఉత్సాహ మొదటి పాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములతో సవరించిన పూరణ:

      ఉత్సాహము
      వరలి ధారణమ్మునందు బ్రహ్మ రాక్షసుండనన్
      నిరత సత్ప్రవచన బోధ నిల్చు పండితుండనన్
      మెరయ, ప్రభుత నాదరించి మేటి పద్మమీయఁగన్
      గరిక పాటి సేయునొక్కొ? గరికిపాటి సూడఁగన్!

      తొలగించండి
  11. కరిముఖున కలంకరించు గరికపాటి లేదిలన్,
    దురితుని దశకంఠుఁ గాంచి దూరుచున్న వేళలో
    కరుణ నొప్పు సీత చేతి గరికపాటి లేదిలన్
    గరిక పాటి సేయునొక్కొ గరికిపాటి సూడఁగన్

    రిప్లయితొలగించండి
  12. చదువు సంధ్యలు లేకుండ చవకబారు
    మాటలు బలుకునెడ పదిమంది లోన
    గరికపాటి సేయడుగదా,గరికపాటి
    వారికిడుదును నతులను బ్రతిదినమ్ము

    రిప్లయితొలగించండి
  13. వరుస వరుస గనవ ధాన పటిమ గలుగు నతడునై
    ధరను దెలుగు భాష గరిమ దద్ద రిల్ల జేయగా
    గరిక పాటిసేయు నొక్క గరిక పాటి సూడగన్
    గరుణ లేక బలుక సబబె కవుల కిచట తెల్పుడీ

    రిప్లయితొలగించండి
  14. వర క వీభములకు నెంచ హరి యితండు
    కవన వనమందు విహరించు కరి యితండు
    కరి వర సదృశుం డగుఁ గాన గిర లివి సరి
    గఱిక పాటి సేయఁడు గదా గరికిపాటి


    తఱచు కవి వరుండు తనదు తర్క మింకఁ గవనమున్
    వెఱపు లేక చూపు చుండ విబుధ జనులు మెచ్చఁగా
    నఱిముఱి యెదఁ జెలఁగఁ గొంద ఱందు రిట్లు చలమునన్
    గఱిక పాటి సేయు నొక్కొ గరికిపాటి సూడఁగన్

    రిప్లయితొలగించండి
  15. గరిక పాటి సేయునొక్కొ గరికిపాటి సూడఁగన్
    పరమగర్వితుండటంచు వదరుటేల తప్పయో
    వర సరస్వతీ ప్రసాద వాగ్విభూషణుండహా
    వరలునమ్మహాకవీంద్రు పద్య ధార హృద్యమై
    సరస రస ఝరీ ప్రవాహ సామ్యమా ప్రసంగమే
    గరికిపాటి గారవించి ఘనత నొందె పద్మమే

    రిప్లయితొలగించండి
  16. కరము గొప్పగా వధాన కార్య సభలు
    సేయుచు
    న్నరుల నెల్ల దెల్లబోవ నతడు జేయు
    ప్రశ్నకున్
    సరసమైన యుత్తరమ్ము సక్రమముగ
    నిచ్చుచున్
    గరిక పాటి చేయు నొక్కొ గరికి పాటి
    సూడగన్

    రిప్లయితొలగించండి
  17. గిరివలె నిలబడి నిజము నెఱి వచించె
    పృచ్ఛకా మదగజములు మెచ్చ ప్రతిభ
    జాటె రక్తిని రగిలించె చారుశీలి
    గరికపాటి సేయడుగదా గరికపాటి

    రిప్లయితొలగించండి
  18. గతమవార్డులెన్నో హస్తగతముగాగ
    తృప్తిగానవ్వె, సాహితీ తీరు తెన్ను
    "గరక పాటి సేయడుకదా గరికి పాటి"
    పద్మ శ్రీయయ్యె ప్రస్తుతి పద్య కవిగ!

    రిప్లయితొలగించండి
  19. తే.గీ:
    భరతమాత కీర్తినిపెంచె భవ్యముగను
    పద్య పటిమను చూపుచు వాసిగాను
    వాణి మాతకు పుత్రుడై పరగుచున్న
    *గరికపాటిసేయడు గదాగరికిపాటి.*

    తే.గీ:
    అంతులేనట్టిపాండిత్యమతనియాస్తి
    యువతమెప్పును బడసిన యుక్తిపరుడు
    నితనిసరిసాటి యైనవారిలనులేరు
    *గరిక పాటిసేయడుగదా గరికిపాటి*

    ఉత్సాహము:
    నిరతము కొలిచిమది లోని నెమ్మి తోడ భారతిన్
    పరిపరివిధములుగ సలిపి ప్రార్థనమ్ము చేయగన్
    గరికపాటి సేయునొక్కొ గరికిపాటి సూడగన్
    మొరకుగ నన భావ్య మౌనె భూరి యశమును గనకన్

    రిప్లయితొలగించండి