7, జనవరి 2022, శుక్రవారం

సమస్య - 3955

 8-1-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దైవదూషకుఁడె గుడికి ధర్మకర్త"
(లేదా...)
"కుమతియు దైవదూషకుఁడె కోవెలకుం దగు ధర్మకర్తగన్"

42 కామెంట్‌లు:


  1. పాపభీతియె లేనట్టి స్వార్థపరులు
    విరివిగ విరాళము బొందు వివిధమనుచు
    నాస్తికుడు గట్టె గోవెలన్ నగరమందు
    దైవదూషకుఁడె, గుడికీ ధర్మకర్త.

    రిప్లయితొలగించండి
  2. వైరితనదైనభావంబువంతఁదీర
    కోరెకమలాక్షుసేవనుగోప్యమందు
    జయుడువిజయుండురాక్షసజాతిబుట్టె
    దైవదూషకుడెగుడికిధర్మకర్త

    రిప్లయితొలగించండి
  3. తేటగీతి
    రాజకీయంపు లీలలు బూజు బూజు
    కోరి యన్యమతస్తుని కొలువుఁ దీర్ప
    దొంగవేషగాడన నంతరంగమందు
    దైవదూషకుఁడె గుడికి ధర్మకర్త!

    చంపకమాల
    ప్రముఖుడు హిందువై పిదప వాలిన నన్య మతంబునందునన్
    సమయము నచ్చివచ్చి తమ నాయకుడందుచు రాజ్యపీఠమే
    యమరచ రెండు వత్సరములకాశ్రితుఁడంచును పక్షపాతమై
    గుమతియు, దైవదూషకుడె! కోవెలకుం దగు ధర్మకర్తగన్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన చంపక

      చంపకమాల
      ప్రముఖుడు హిందువై పిదప వాలిన నన్య మతంబునందునన్
      సమయము నచ్చివచ్చి తమ నాయకుడందుచు రాజ్యపీఠమే
      యమరచ రెండు వత్సరములాశ్రితుఁడంచును పక్షపాతమై
      గుమతియు, దైవదూషకుడె! కోవెలకుం దగు ధర్మకర్తగన్?

      తొలగించండి
  4. ఆటవెలది

    దూరముండు//దైవ దూషకుఁడె గుడికి,
    ధర్మ కర్త//యగును దైవ భక్తి
    పాప భీతి కల్గి భగవంతు సన్నిధిన్
    ప్రార్ధ నంబు సేయు భక్త వరుడె.

    రిప్లయితొలగించండి
  5. తేటగీతి
    పాప కార్యము లెన్నియో వలతి గా స
    లుపుచు బాహ్యము నందున లోక మాత
    నే కొలిచెడి భక్త శిఖామణి నని జెప్పు
    దైవ దూషకుడె ,గుడికి ధర్మ కర్త.

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  6. ధన మ దాంధ ము తో మెల్గు దానవుండు
    దైవ దూషకుడె : గుడికి ధర్మ కర్త
    భక్త జనతతి సహకార పరత తోడ
    వృధ్ధి చేయగ శ్రమియించి ప్రీతి గూర్చు

    రిప్లయితొలగించండి
  7. భ్రమలను పెంచి లోకులకు భక్తియటంచు విరాళమంచు తా
    మమితముగా ధనమ్ము పరమాత్ముని పేరున పొందలేరిలన్
    సుమతులు, హెచ్చుగాను గుడి స్తోమము బెంచెడు జల్లికాడె యౌ
    కుమతియు దైవదూషకుఁడె కోవెలకుందగు ధర్మకర్తగన్.

    రిప్లయితొలగించండి
  8. జియ్య మూర్తిని నాశము జేయ దలచె
    దైవదూషకుఁడె ; గుడికి ధర్మకర్త
    యా జతన నెరిగి భటుల నామతించి
    యాప గలిగె విధ్వంసము నమర కుండ

    రిప్లయితొలగించండి
  9. అమరును బుద్ధిహీనులకు నల్పులకున్ ఘనమౌప్రవక్తగా
    శమదమ సత్క్రియల్ విడిచి శాంతిని కోరని ధర్మ హీనుడౌ
    //కుమతియు దైవదూషకుడె, కోవెలకుందగు ధర్మకర్తగన్//
    సుమతియు,దైవభక్తిగల శ్రోత్రియుడే పరికించి చూడగన్.

    రిప్లయితొలగించండి
  10. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    స్వామియన ధనమిత్తురు సమధికముగ
    ఆస్తికులని స్వార్ధమదిని నాస్తికు డట
    కోవెలను దీర్చ జనులనుకొను చుండె
    దైవదూషకుడె గుడికి ధర్మకర్త.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "జనులనుకొనుచునుండ్రి" అనండి.

      తొలగించండి

  11. తమకముడబ్బుకైపడడుతాత్వికచింతకుడున్ యతండిలన్
    సుమతియుదైవమార్గమునశోభిలుకోవెలధర్మకర్తయౌ
    అమలినమానసంబునరయార్తిగనాతడు, కాదగండుగా
    కుమతియు దైవదూషకుడె కోవెల కుం దగు ధర్మకర్త గన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చింతకుడున్+అతడు' అన్నపుడు యడాగమం రాదు. మూడవ పాదం అర్థం కాలేదు.

      తొలగించండి
    2. తమకము డబ్బుకై పడడు తాత్విక చింతకుడున్ అతండిలన్
      సుమతియు దైవ మార్గమున శోభిలు కోవెల ధర్మకర్తయౌ
      అమలిన మానసంబుగల అర్చకుడాతడు, కాదగండుగా
      కుమతియు దైవదూషకుడె కోవెల కుం దగు ధర్మకర్త గన్

      correct chesaa nandi..ippudu ok?

      తొలగించండి
  12. తనమతమును మార్చుకొనిన ధన్యజీవి
    ముఖ్యనేతగ నెన్నికై మూర్ఖ విధిని
    ధర్మకర్తలమండలి తానుగూర్చ
    దైవదూషకుఁడె గుడికి ధర్మకర్త

    రిప్లయితొలగించండి
  13. కలుషమాయెను సకలము కాలమహిమ
    నిత్యపూజలయందున నియతిలేని
    భక్తి మార్గమునం దనురక్తి లేని
    దైవదూషకుఁడె గుడికి ధర్మకర్త

    రిప్లయితొలగించండి
  14. కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా:

    కాదు వింతేది జూడగ కలియుగాన
    మతము పేరున జనులను మాయజేసి
    కపట పూజలు జేయుచు ఘనత నొందు
    దైవదూషకుడె గుడికి ధర్మకర్త.

    చిత్త మంతయు నిరతము విత్తమందె
    కాంచ లేడేది ముక్తికి కారణమ్ము
    దుష్టబుద్ధిని భక్తుల దోచుకొనెడి
    దైవదూషకుడె గుడికి ధర్మకర్త.

    రిప్లయితొలగించండి
  15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  16. క్రమముగ నాక్రమించుకొని కాపురుషాదులు భారతమ్మునన్
    దమ మత మద్భుతంబను నుదారత నైహికవాద మేర్పడన్
    దమతమ జేబునింపుకొను ధర్మ విహీనుల రాజ్యమందునన్,
    గుమతియు దైవదూషకుఁడె కోవెలకుం దగు ధర్మకర్తగన్.

    రిప్లయితొలగించండి
  17. ఉత్తమ గుణుండు దనరంగఁ జిత్త మందు
    నిర్మలత మనో వాక్కాయ కర్మములను
    దైవమును విశ్వసించు నతండు క్షుద్ర
    దైవ దూషకుఁడె గుడికి ధర్మకర్త


    విమల మనస్కుఁ డుత్తముఁడు వేద విదుండు వివేక వంతఁడున్
    సముచిత భాషణుండు నుత సచ్చరితుండు దయామయుండు ని
    త్య మమర పూజలం దనియు ధార్మికుఁ డాతఁడు సత్యమెన్నఁ దాఁ
    గుమతియు దైవదూషకుఁడె కోవెలకుం దగు ధర్మకర్తగన్

    రిప్లయితొలగించండి
  18. పొందు బాపము దప్పక పుడమి యందు
    దైవదూషకుడె,గుడికి ధర్మకర్త
    స్వార్ధపరతను విడనాడు వాడె యగును
    దైవసంపద హరియింప ద్రాబుడగును

    రిప్లయితొలగించండి
  19. సమముగ బంచి యిచ్చుటకు సాటిగనుండెడు వారికచ్చటన్
    కుమతియు,దైవదూషకుడె కోవిలకుందగు ధర్మకర్తగన్
    ప్రముఖుడు ధర్మబద్ధతను బాలన జేయును గావునన్రమా!
    కుమతులు దైవదూషకుల గోరక యొప్పగు వారిజూడుమా

    రిప్లయితొలగించండి
  20. క్రమముగ మారె జీవనము కల్మషబుద్ధులు పెచ్చరిల్లి యా
    క్రమణముజేసి గద్దెలను రాజ్యమునేలుచునుండి రక్కటా!
    సుమతులయందు నిర్దయను చూపెడునీ కలికాల మందునన్
    కుమతియు దైవదూషకుఁడె కోవెలకుం దగు ధర్మకర్తగన్

    రిప్లయితొలగించండి
  21. ప్రమదము తోడ సొమ్ము సముపార్జన జేయుచు దొడ్డి దారిలో
    ప్రమదలతో చరించుచును వారుణిఁ గ్రోలు నబాసియున్ ప్రభు
    త్వము నధికర్మమున్ బడిచి తన్పుచు పై యధికారులన్ సదా
    కుమతియు దైవదూషకుఁడె కోవెలకుం దగు ధర్మకర్తగన్

    రిప్లయితొలగించండి
  22. భ్రమసి యశాశ్వతంబులగు లౌకిక వాంఛలనోలలాడుచున్
    సమయునధర్మమార్గమున సాగెడి నాస్తికుఁడల్పబుద్ధియౌ
    కుమతియు దైవదూషకుఁడె; కోవెలకుం దగు ధర్మకర్తగన్
    విమల మనస్కుఁడాస్తికుఁడభిజ్ఞుఁడునౌ సుగుణాత్ముఁడెన్నికన్

    రిప్లయితొలగించండి