30-1-2022 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“జమునకుఁ గ్రిందనె కలదఁట చల్లదనంబే”(లేదా...)“జమునకుఁ గ్రింది భాగమునఁ జల్లదనంబట చూచితే కవీ”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తిమిరారి కోపమొందగహిమవాయువు కోరబోదు నెపుడు మకరమేతిమిలోనుండెడు యంబగజమునకు గ్రిందనె గలదట చల్లదనంబేఅంబగజము = మొసలి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.వాట్సప్ సమూహంలో నా సూచనను గమనించండి.
కమలా భూదేవేరులుసుమతీ!నారాయణునకు సుందర పత్నుల్విమల సుతగంగ పాదాబ్జమునకుఁగ్రింద కలదఁట చల్లదనంబే.
చక్కని పూరణ. అభినందనలు.
కమలము జనించు జలమునకమలనయనముల్ స్ఫురించు కమనీయంబైగమనించినచో నంభోజమునకుఁ గ్రిందనె కలదఁట చల్లదనంబే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కందంప్రమద గణాధిపుని వెస విషమున్ గుడువఁ గోరె గౌరి సర్వులఁ గావన్సుమనస శివ, హృదయ సరోజమునకుఁ గ్రిందనె కలదఁట చల్లదనంబే!చంపకమాల"తమరికి నష్టమెంచి హరి దానము గోరెను వామనుండుగన్శమనము నందగన్ వలదు సాతి'' యటన్న బలీంద్రుఁడిట్లనెన్"రమహృదయాద్రి తాకిన కరమ్మది క్రిందన మాదు హత్సరోజమునకుఁ గ్రింది భాగమునఁ జల్లదనంబట చూచితే కవీ!"
చంపకమాలఅమరెను చెన్నకేశవుడు నాలయ మూలవిరాట్టుగాను సొంపమరెను మోహినీలలన నద్భుత మూర్తిగ వెన్కభాగమైకమలము శంఖచక్ర గద కానగ చేతుల గంగ పాద కంజమునకుఁ గ్రింది భాగమునఁ జల్లదనంబట చూచితే కవీ!
మీ మూడు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
అమరినసృష్టినిజూడగకమలముమనుగడకొఱకుగకర్తయబెట్టెన్సమతులశక్తినిగసరసిజమునకుగ్రిందనెకలదటచల్లదనంబే
కమలాప్తుని వేడి వలన సమ కూరియు మేఘ సృష్టి జలధుల వలనన్ క్రమ మగు వానలొ స గున్ భూ జమున కు గ్రింద నె కలదట చల్ల ద నంబే
మొదటి పాదం చివర వేడి తగుల అని సవరణ చేయడమైనది
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మూడవ పాదం చివర జగణం రాకూడదు. సవరించండి.
మూడవ పాదం లో వానలొస గ భూ అని సవరణ చేయడమైనది
జమునయ్యను గాంచగనే ప్రమదించి వికాసమందు వారిని యశ్రాంతము వాసముండెడి కంజమునకుఁ గ్రిందనె కలదట చల్లదనంబే. సుమమున ఘర్మదీధితిని జూచిన చాలును కాండపృష్టమం దు ముడుచుకొన్ననేమి యవి తోషము నందుచు విచ్చునే కదా కమలములెల్ల, భానుని సగంధులె యైనను గాంచినంత కంజమునకుఁ గ్రింది భాగమున చల్లదనంబట చూచితే కవీ.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
భ్రమగనిభానుతేజమునుభాసురశక్తినివిచ్చియాడునేసమధికతీక్ష్ణదృష్టిగనసాజపుసిగ్గునవాడిపోవునేఅమలినజీవశక్తిగననద్భుతమైభవమందుసారతేజమునకుగ్రిందిభాగమునచల్లదనంబటజూచితేకవీ
అమలిన”ర్యాలి”క్షేత్రమున నద్భుత మోహిని-కేశవాకృతుల్అమరును నొక్కచో, హరియె యౌను కనంగను ముందు ,వెన్కనౌప్రమదయె మోహినీ యనగ భాసిలు,గంగ కుమారియౌ పదాబ్జమునకుఁగ్రిందిభాగమున చల్లదనంబట చూచితే కవీ!
కమలాప్తుని కరముల సెగకమలమ్ముల క్రొమ్మెరుగులకళలనుపెంచెన్గమనించిచూడగ సరోజమునకుఁ గ్రిందనె కలదఁటచల్లదనంబే
సమశీతోష్ణపు తానముజమునకుఁ గ్రిందనె కలదఁట ; చల్లదనంబేతమ గుణమంచు నెలకొనెడిహిమపర్వత వరుసలుండు నెగువనకనగన్
కందంశ్రమదీరుటకై జనె, భూజమునకు క్రిందనె కలదట చల్లదనంబేసమమగు శీతల వాయువుఅమరుననుచు బాటసారి హాయిగ సాగెన్ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్.
ఖమణి వెలుంగులోన వడ గాలులు వీచుచు బాధపెట్టినన్శ్రమము శమించగాచనుచు చక్కగ భాగవతమ్ము బ్రీతితోకమతమునందు పోతనయు క్ష్మాజపు నండ లిఖించె సుమ్ము భూజమునకుఁ గ్రింది భాగమునఁ జల్లదనంబట చూచితే కవీ
సమముగనుండు శీతలము చండము భారతదేశమందు గల్గెనేజమునకుఁ గ్రింది భాగమునఁ ;జల్లదనంబట చూచితే కవీతమగుణమంచు నెక్కొనిన ధామమదే తెలియుంగదాయదేమనన్హిమ నగమంచు బిల్వబడు యెత్తయినట్టి ప్రదేశముండె మీదుగన్
కమలాప్తు వేడి సోకగకమలిన యా యుదధి మొయిలు గనగుచు గురువన్విమలా! తెలియునె మఱిభూజమునకు గ్రిందనె కలదట చల్లదనంబే
కమలపు మిత్రునుష్ణములె కాకిగ సంద్రములందు చేరగా కమలిన యాజలంబులును గాకకు మేఘములౌచు కుర్వభూ జమునకు గ్రిందిభాగమున జల్లదనంబట చూచితే కవీ! ప్రమదముతోడ వృక్షములు బారుగ బెర్గుచు నిచ్చు వర్షమున్
కమలాక రాంబువుల పైన మండు చున్నను భృశమ్ము నైజం బెంచం గమలాకరమున నంభోజమునకుఁ గ్రిందనె కలదఁట చల్లఁదనంబేక్రమముగ నాటఁ జెట్లను సుఖం బిడు మానవ జాతి కిద్ధరం గమలఁగ మేను లెల్లరకుఁ గందఁగ నెండయె మండు చుండఁగా సుమములు పత్ర శాఖ లటఁ జొప్పడఁ జుట్టును విస్తరింప క్ష్మా జమునకుఁ గ్రింది భాగమునఁ జల్లఁదనం బట చూచితే కవీ
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
నిమురుకొనంగ మేఘములు నింగి శరత్ప్రభ సంతరింపగా,కుముదహితుండు తారకల గూడి విహారము సేయు వేళలో,హిమగిరి సీమలందు, గమనింపగ కానన మధ్యమందు, క్ష్మాజమునకుఁ గ్రింది భాగమునఁ జల్లదనంబట చూచితే కవీ
మీ పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
🙏
మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.
కుములుచు నెండ వేడిమికి కుంబినిపైగలప్రాణ కోటియున్నమితపు శీత పేయములకై పరుగెత్తునుదీర్చ దాహమున్సమకొనుచుంద్రు యాత్రికులు సల్లనినీడ వసించ వేగ క్ష్మాజమునకు క్రింది భాగమున జల్లదనంబటచూచితే కవీ !
విమలసరోవరంబిచట విచ్చిన తామర తంపరల్ మనోజ్ఞములును నేత్రపర్వములు, చల్లని గాలుల వీవెనల్ హృదిన్ప్రమదముగూర్చు, నీవనము పచ్చదనం బతి సుందరంబు భూజమునకుఁ గ్రింది భాగమునఁ జల్లదనంబట చూచితే కవీ
కమలజకరములయందునకమలకసతతముసురుచిర కాంతులతోడన్మమతనుపంచెడునాకం*జమునకుఁ గ్రిందనె కలదఁట చల్లదనంబే*
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితిమిరారి కోపమొందగ
రిప్లయితొలగించండిహిమవాయువు కోరబోదు నెపుడు మకరమే
తిమిలోనుండెడు యంబగ
జమునకు గ్రిందనె గలదట చల్లదనంబే
అంబగజము = మొసలి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివాట్సప్ సమూహంలో నా సూచనను గమనించండి.
కమలా భూదేవేరులు
రిప్లయితొలగించండిసుమతీ!నారాయణునకు సుందర పత్నుల్
విమల సుతగంగ పాదా
బ్జమునకుఁగ్రింద కలదఁట చల్లదనంబే.
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండికమలము జనించు జలమున
రిప్లయితొలగించండికమలనయనముల్ స్ఫురించు కమనీయంబై
గమనించినచో నంభో
జమునకుఁ గ్రిందనె కలదఁట చల్లదనంబే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిప్రమద గణాధిపుని వెస వి
షమున్ గుడువఁ గోరె గౌరి సర్వులఁ గావన్
సుమనస శివ, హృదయ సరో
జమునకుఁ గ్రిందనె కలదఁట చల్లదనంబే!
చంపకమాల
"తమరికి నష్టమెంచి హరి దానము గోరెను వామనుండుగన్
శమనము నందగన్ వలదు సాతి'' యటన్న బలీంద్రుఁడిట్లనెన్
"రమహృదయాద్రి తాకిన కరమ్మది క్రిందన మాదు హత్సరో
జమునకుఁ గ్రింది భాగమునఁ జల్లదనంబట చూచితే కవీ!"
చంపకమాల
తొలగించండిఅమరెను చెన్నకేశవుడు నాలయ మూలవిరాట్టుగాను సొం
పమరెను మోహినీలలన నద్భుత మూర్తిగ వెన్కభాగమై
కమలము శంఖచక్ర గద కానగ చేతుల గంగ పాద కం
జమునకుఁ గ్రింది భాగమునఁ జల్లదనంబట చూచితే కవీ!
మీ మూడు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిఅమరినసృష్టినిజూడగ
రిప్లయితొలగించండికమలముమనుగడకొఱకుగకర్తయబెట్టెన్
సమతులశక్తినిగసరసి
జమునకుగ్రిందనెకలదటచల్లదనంబే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికమలాప్తుని వేడి వలన
రిప్లయితొలగించండిసమ కూరియు మేఘ సృష్టి జలధుల వలనన్
క్రమ మగు వానలొ స గున్ భూ
జమున కు గ్రింద నె కలదట చల్ల ద నంబే
మొదటి పాదం చివర వేడి తగుల అని సవరణ చేయడమైనది
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవ పాదం చివర జగణం రాకూడదు. సవరించండి.
మూడవ పాదం లో వానలొస గ భూ అని సవరణ చేయడమైనది
తొలగించండి
రిప్లయితొలగించండిజమునయ్యను గాంచగనే
ప్రమదించి వికాసమందు వారిని యశ్రాం
తము వాసముండెడి కం
జమునకుఁ గ్రిందనె కలదట చల్లదనంబే.
సుమమున ఘర్మదీధితిని జూచిన చాలును కాండపృష్టమం
దు ముడుచుకొన్ననేమి యవి తోషము నందుచు విచ్చునే కదా
కమలములెల్ల, భానుని సగంధులె యైనను గాంచినంత కం
జమునకుఁ గ్రింది భాగమున చల్లదనంబట చూచితే కవీ.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిభ్రమగనిభానుతేజమునుభాసురశక్తినివిచ్చియాడునే
రిప్లయితొలగించండిసమధికతీక్ష్ణదృష్టిగనసాజపుసిగ్గునవాడిపోవునే
అమలినజీవశక్తిగననద్భుతమైభవమందుసారతే
జమునకుగ్రిందిభాగమునచల్లదనంబటజూచితేకవీ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅమలిన”ర్యాలి”క్షేత్రమున నద్భుత మోహిని-కేశవాకృతుల్
రిప్లయితొలగించండిఅమరును నొక్కచో, హరియె యౌను కనంగను ముందు ,వెన్కనౌ
ప్రమదయె మోహినీ యనగ భాసిలు,గంగ కుమారియౌ పదా
బ్జమునకుఁగ్రిందిభాగమున చల్లదనంబట చూచితే కవీ!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికమలాప్తుని కరముల సెగ
రిప్లయితొలగించండికమలమ్ముల క్రొమ్మెరుగులకళలనుపెంచెన్
గమనించిచూడగ సరో
జమునకుఁ గ్రిందనె కలదఁటచల్లదనంబే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమశీతోష్ణపు తానము
రిప్లయితొలగించండిజమునకుఁ గ్రిందనె కలదఁట ; చల్లదనంబే
తమ గుణమంచు నెలకొనెడి
హిమపర్వత వరుసలుండు నెగువన
కనగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిశ్రమదీరుటకై జనె, భూ
జమునకు క్రిందనె కలదట చల్లదనంబే
సమమగు శీతల వాయువు
అమరుననుచు బాటసారి హాయిగ సాగెన్
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఖమణి వెలుంగులోన వడ గాలులు వీచుచు బాధపెట్టినన్
రిప్లయితొలగించండిశ్రమము శమించగాచనుచు చక్కగ భాగవతమ్ము బ్రీతితో
కమతమునందు పోతనయు క్ష్మాజపు నండ లిఖించె సుమ్ము భూ
జమునకుఁ గ్రింది భాగమునఁ జల్లదనంబట చూచితే కవీ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమముగనుండు శీతలము
రిప్లయితొలగించండిచండము భారతదేశమందు గల్గెనే
జమునకుఁ గ్రింది భాగమునఁ ;
జల్లదనంబట చూచితే కవీ
తమగుణమంచు నెక్కొనిన ధామమదే తెలియుంగదా
యదేమనన్
హిమ నగమంచు బిల్వబడు యెత్త
యినట్టి ప్రదేశముండె మీదుగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికమలాప్తు వేడి సోకగ
రిప్లయితొలగించండికమలిన యా యుదధి మొయిలు గనగుచు గురువన్
విమలా! తెలియునె మఱిభూ
జమునకు గ్రిందనె కలదట చల్లదనంబే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికమలపు మిత్రునుష్ణములె కాకిగ సంద్రములందు చేరగా
రిప్లయితొలగించండికమలిన యాజలంబులును గాకకు మేఘములౌచు కుర్వభూ
జమునకు గ్రిందిభాగమున జల్లదనంబట చూచితే కవీ!
ప్రమదముతోడ వృక్షములు బారుగ బెర్గుచు నిచ్చు వర్షమున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికమలాక రాంబువుల పై
రిప్లయితొలగించండిన మండు చున్నను భృశమ్ము నైజం బెంచం
గమలాకరమున నంభో
జమునకుఁ గ్రిందనె కలదఁట చల్లఁదనంబే
క్రమముగ నాటఁ జెట్లను సుఖం బిడు మానవ జాతి కిద్ధరం
గమలఁగ మేను లెల్లరకుఁ గందఁగ నెండయె మండు చుండఁగా
సుమములు పత్ర శాఖ లటఁ జొప్పడఁ జుట్టును విస్తరింప క్ష్మా
జమునకుఁ గ్రింది భాగమునఁ జల్లఁదనం బట చూచితే కవీ
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండినిమురుకొనంగ మేఘములు నింగి శరత్ప్రభ సంతరింపగా,
రిప్లయితొలగించండికుముదహితుండు తారకల గూడి విహారము సేయు వేళలో,
హిమగిరి సీమలందు, గమనింపగ కానన మధ్యమందు, క్ష్మా
జమునకుఁ గ్రింది భాగమునఁ జల్లదనంబట చూచితే కవీ
మీ పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిమీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.
రిప్లయితొలగించండికుములుచు నెండ వేడిమికి కుంబినిపైగల
రిప్లయితొలగించండిప్రాణ కోటియు
న్నమితపు శీత పేయములకై పరుగెత్తును
దీర్చ దాహమున్
సమకొనుచుంద్రు యాత్రికులు సల్లని
నీడ వసించ వేగ క్ష్మా
జమునకు క్రింది భాగమున జల్లదనంబట
చూచితే కవీ !
విమలసరోవరంబిచట విచ్చిన తామర తంపరల్ మనో
రిప్లయితొలగించండిజ్ఞములును నేత్రపర్వములు, చల్లని గాలుల వీవెనల్ హృదిన్
ప్రమదముగూర్చు, నీవనము పచ్చదనం బతి సుందరంబు భూ
జమునకుఁ గ్రింది భాగమునఁ జల్లదనంబట చూచితే కవీ
కమలజకరములయందున
రిప్లయితొలగించండికమలకసతతముసురుచిర కాంతులతోడన్
మమతనుపంచెడునాకం
*జమునకుఁ గ్రిందనె కలదఁట చల్లదనంబే*