22, జనవరి 2022, శనివారం

సమస్య - 3970

23-1-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చెల్లినిఁ బెండ్లాడె మెచ్చఁ జేరిన బంధుల్”
(లేదా...)
“చెల్లినిఁ బెండ్లియాడెనఁట చేరిన బంధువులెల్ల మెచ్చఁగన్”

26 కామెంట్‌లు:

  1. తల్లినిముల్లోకాలకు
    అల్లినప్రనుశివుడునపర్ణనుగనియెన్
    చల్లనపీతాంబరధరు
    చెల్లినిబండ్లాడెమెచ్చజేరినబంధుల్

    రిప్లయితొలగించండి

  2. ఉల్లము గెల్చిన దెవరా
    పిల్లయనుచు నడిగి నంత పేరిమి తోడన్
    తల్లికి జూపుచు నా సఖుఁ
    జెల్లినిఁ బెండ్లాడె మెచ్చఁ జేరిన బంధుల్.

    రిప్లయితొలగించండి
  3. ఒల్లకయే కట్నంబులు
    పిల్లయె ముఖ్యంబటంచు ప్రేమించి సఖిన్
    సల్లలితాంగిని,మిత్రుని
    చెల్లిని పెండ్లాడె మెచ్చఁజేరిన బంధుల్.

    రిప్లయితొలగించండి
  4. కందం
    చెల్లదనిన బలరాముఁడు
    త్రుళ్లింతల మునిగ, శౌరి బ్రోత్సాహమిడన్
    వల్లెయని క్రీడి, కృష్ణుని
    చెల్లినిఁ బెండ్లాడె మెచ్చఁ జేరిన బంధుల్

    ఉత్పలమాల
    చెల్లదనిన శేషుడు విశేషమనంగను గ్రీడి మౌనిగన్
    తొల్లిగ నా సుభద్ర నిడ తోయజనాభుడు, సేవఁజేసి తా
    నుల్లము రంజిలన్ మెలఁగ నొప్పుచుఁ బ్రోది శౌరికిన్
    జెల్లినిఁ బెండ్లియాడెనఁట చేరిన బంధువులెల్ల మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  5. పిల్లనగ్రోవినాదములపెన్నిధిగోపికమానసాంబుధిన్
    అల్లననాటపాటలనుయాదవవీరుడుచిందులేయుచున్
    చల్లినప్రేమబీజములసన్నిధిజేరినరుక్మిణికానరుక్మికే
    చెల్లినిబెండ్లియాడెనటజేరినబంధువులెల్లమెచ్చగన్

    రిప్లయితొలగించండి
  6. ఉల్లము రంజిల్ల నొకడు
    మల్లిని మనసార వలచి మరులును దెలుపన్
    వల్లె యన తనదు మిత్రుని
    చెల్లిని బెండ్లాడె మెచ్చ చేరిన బంధుల్

    రిప్లయితొలగించండి

  7. పిల్లను జూపుమంచు కడు ప్రేమగ నడ్గగ కల్లలాడకన్

    దల్లికి జూపె పుత్రుడు సుధాంశుని మించిన యందగత్తె నే

    యుల్లము దోచెనంచు తనకూపిరి యామెయటంచు మిత్రునిన్

    జెల్లిని, బెండ్లియాడెనఁట చేరిన బంధువు లెల్ల మెచ్చఁగన్.

    రిప్లయితొలగించండి
  8. మెల్లగ ప్రేమ బెంచుకొని మిక్కిలి
    సుందరమౌ సుభద్రపై
    నుల్లమునందు నామెపయి నుప్పతి
    లన్నను రాగ కోరికల్
    యల్లన విన్నవించి తన యన్నకు
    పార్థుడు కృష్ణమూర్తయౌ
    చెల్లిని పెండ్లియాడెనట చేరిన బంధువు
    లెల్ల మెచ్చగన్

    రిప్లయితొలగించండి
  9. ఉత్పలమాల:
    ఉల్లమునందొకండుమధురోహలదేల్చి విహారమందగా
    తల్లికి చెప్పలేక మది తల్లడమంది వివాహ మాడ బై
    లెల్లిన పెండ్లికొడ్కు కును యింతి నమస్సు లొనర్చి చెప్పగా
    “చెల్లినిఁ బెండ్లియాడెనఁట చేరిన బంధువులెల్ల మెచ్చఁగన్”
    --కటకం వేంకటరామ శర్మ.

    రిప్లయితొలగించండి
  10. ఉల్లము వేరొకరిదనుచు
    మెల్లగ వధువే పలుకగ మిసమిసలాడే
    యల్లరిపిల్లయగు వధువు
    చెల్లినిఁ బెండ్లాడె మెచ్చఁ జేరిన బంధుల్

    రిప్లయితొలగించండి
  11. విల్లంబును వీడి యతిగ
    మల్లారి వసించు పురము మథురను జేరన్
    నల్లని వాడగు కృష్ణుని
    చెల్లినిఁ బెండ్లాడె మెచ్చఁ జేరిన బంధుల్

    రిప్లయితొలగించండి
  12. అల్లునికిచ్చినన్సకలలాంచనముల్సరితూగలేదుగా
    కల్లలుబల్కినారనుచుకన్యనువీడిరిమండపమ్మునం
    దల్లరినాపగానచటధార్మికుడైతనెయిష్టుడౌసఖున్
    చెల్లినిఁ బెండ్లియాడెనఁట చేరిన బంధువులెల్ల మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  13. కందము:
    గల్లీ దోస్తులు వారలు
    ఎల్లిని లవ్వనె ప్రభాసు ఏడేళ్లపుడే
    బుల్లితెర నటుండై వ
    “చ్చెల్లినిఁ బెండ్లాడె మెచ్చఁ జేరిన బంధుల్”
    --కటకం వేంకటరామ శర్మ

    రిప్లయితొలగించండి
  14. తెల్లముగాక యుండఁదన తీరును సౌరును రూపురేఖలన్
    అల్లన ద్వారకాపురికి నర్జునుఁడేగి త్రిదండిగా బళీ!
    యెల్లరు మెచ్చికొల్వగ నవేందునిభాననుఁజక్రి నెయ్యపుం
    జెల్లినిపెండ్లి యాడెనట జేరిన బంధువులెల్ల మెచ్చగన్.

    రిప్లయితొలగించండి
  15. ఉల్లములో సుభద్ర చని యూయల లూపుచునుండ ప్రేమతో
    కల్లలెరుంగనట్టి తెలి కన్నియ సంగడి నెంచి ప్రీతితో
    నల్లనివాడు మిత్రుడగు నందకుమారుని యండ, వానిదౌ(తోడుతన్)
    చెల్లినిఁ బెండ్లియాడెనఁట చేరిన బంధువులెల్ల మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  16. చొల్లంగి పట్టణంబున
    పల్లాలన్బేర బరగు భావుకు డొకడున్
    మెల్లగ బ్రేమను దనసఖు
    జెల్లిని బెండ్లాడె మెచ్చ చేరిన బంధుల్

    రిప్లయితొలగించండి
  17. కల్లరి వరుఁడని దెలియగ
    నల్లరియై పెండ్లి యాగె నవమతి బాపన్
    చల్లని మది దన మిత్రుని
    చెల్లినిఁ బెండ్లాడె మెచ్చఁ జేరిన బంధుల్

    రిప్లయితొలగించండి
  18. పోతన గారి పూరణ :)
    నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు గృపారసంబు పైఁ
    జల్లెడువాఁడు మౌళిపరిసర్పితపింఛమువాఁడు నవ్వు రా
    జిల్లెడి మోమువాఁడతివ జేసిన విన్నపమెంచి రుక్మికిన్
    చెల్లినిఁ బెండ్లియాడెనఁట చేరిన బంధువులెల్ల మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  19. మెల్లగను బెండ్లి చూపులఁ
    బిల్లను గని సమ్మతింప వింత దనర నే
    నొల్ల ననఁగ నక్క తివిరి
    చెల్లినిఁ బెండ్లాడె మెచ్చఁ జేరిన బంధుల్


    ఉల్లము లందు నెల్లరకు నుబ్బఁగ మోదము మిక్కుటమ్ముగం
    గల్లల నాడ నే ననుచు గర్వ మెడందఁ జెలంగ బల్కుచుం
    దల్లడిలంగ నేల యిటఁ దా రని తా ధృతి నేడ కూడ దం
    చెల్లినిఁ బెండ్లియాడెనఁట చేరిన బంధువు లెల్ల మెచ్చఁగన్

    [కూడ దంచు+ ఎల్లిని= కూడ దం చెల్లిని; ఎల్లి = రేపు]

    రిప్లయితొలగించండి
  20. అల్లదె రామశాస్త్రియను నల్లవరమ్మున నుండు నాతడున్
    మెల్లగ బ్రేమనున్జొనిపి మిత్రుని సోదరి,యందగత్తెయౌ
    చెల్లిని బెండ్లియాడెనట చేరిన బంధువులెల్ల మెచ్చగన్
    నుల్లము సంతసించుటను నూహల సేతురు కాపురంబునున్

    రిప్లయితొలగించండి
  21. కందం
    మెల్లగ నేస్తము తో యనె
    ' వల్లి' ని తొలిచూపులోనె వలచితి ,నే నీ
    చెల్లిని వీడనని హితుని
    చెల్లిని బెండ్లాడె మెచ్చ జేరిన బంధుల్.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  22. పిల్లను గని చనిపోయెను
    తల్లి పురిటి యందు బిడ్డ తల్లడమొందెన్
    యెల్లరు కోరగ తన సతి
    చెల్లినిఁ బెండ్లాడె మెచ్చఁ జేరిన బంధుల్

    రిప్లయితొలగించండి
  23. ఉల్లమునందురుక్మిణియునొప్పుగనిల్పుచుకృష్ణురూపమున్
    తెల్లముచేయుచున్ మనము తీరుగ వ్రాసెను ప్రేమలేఖయున్
    వల్లెయటంచుతేరుపయివచ్చిముదంబున గాంచి రుక్మికిన్
    చెల్లినిబెండ్లియాడెనటచేరినబంధువులెల్లమెచ్చగన్

    రిప్లయితొలగించండి
  24. ఉల్లము నందలి ప్రేమను
    చల్లగతెలుపగ కిరీటిచయ్యను పారన్
    నల్లనివాడగు కృష్ణుని
    చెల్లిని బెండ్లాడె మెచ్చి చేరినబంధుల్.

    రిప్లయితొలగించండి